Search This Blog

219-222.Mahabhoga...Mahabala

219.Mahabhoga
'Bhoga' means a great pleasure. The bliss of self realization is the greatest of all pleasures. Hence is it called 'Maha bhoga'. A yogi who has tasted this ultimate happiness will stop yearning for material/carnal pleasures.

220.Mahaishwarya
Aishwayra means having wealth and Gods grace. Divine mother gives us both. Having servants, children, friends, relatives, vehicles, money and food are various forms of aishwarya. This is material in nature. Having devotion, respect to elders, inclination towards dharma and focus on moksha are called aamushmikamu. These lead to Moksha. That is Maha aishwarya.

221.Mahaveerya
To overcome maya (ego) means to overcome oneself. It requires great valor to overcome oneself.  We create an opinion on ourselves. Like I'm a human. A man or a woman with a particular name and status. My social reflection is like this and I have these friends and these enemies. We assign a character to ourselves and feel that it is our identify. To experience the bliss of atman, one has to raise above this. One has to shun this identity, character and ego to reach the super conscious state of Brahman. The ego has to be destroyed completely and that requires great valor, i,e MahaVeerya.

222.Mahabala
She who is very strong. She is invincible.

219.మహాభోగా
భోగము అంటే గొప్పదైన సుఖము  అర్ధం. ఆత్మానందం చాల గొప్పది. అన్ని సుఖాలకన్నా శ్రేష్టమైనది. అందుకే మహాభోగా అన్నారు. అంతగొప్ప సుఖాన్ని రుచిచూసిన యోగి ఇక ఐహికమైన సుఖాలకోసం వెంపర్లాడటం మానేస్తాడు. 
220.మహైశ్వర్యా
ఐశ్వర్యము అంటే ఈశ్వతము, సంపద. అమ్మ రెండింటిని ఇస్తుంది. అష్ట ఐశ్వర్యములతో తూగడము అంటే దాసీజనులు, సేవకులు, పుత్రులు,  మిత్రులు, బంధువులు,  వాహనములు, ధనము, ధాన్యము కలిగి ఉండుట. ఇది ఐహికాము. భగవంతునిపై  భక్తి కలిగి ఉండుట, పెద్దలపై గౌరవము కలిగి ఉండుట, ధర్మము పట్ల ఆసక్తి కలిగి ఉండుట, మోక్షముపై దృష్టి కలిగి ఉండుట ఆముష్మికము. ఇది మోక్ష సిద్ధిని కలుగజేస్తుంది. అదే మహైశ్వర్యము. 
221.మహావీర్యా
తనను తాను అధికమించాలి అంటే వీరత్వం ఉండాలి. మాయను ఛేదించడం అంటే తనను తాను అధికమించడమే. నేను ఒక మనిషిని, స్త్రీ లేక పురుషుడిని. నాకు ఫలానా పేరు, ఊరు, కులం, గోత్రం ఉన్నాయి. సంఘంలో నాకు ఒకవిధమైన గుర్తింపు ఉంది. ఫలానా వారు నావారు. ఫలానా వారు నా ప్రత్యర్దులు. ఇలా మనగురించి మనం ఒక అభిప్రాయము, అవగాహన ఏర్పరుచుకుంటాం. ఇదే మాయ, అహంకారం. దీనిని దాటి అంతాటా భగవంతుడే ఉన్నాడు. బ్రహ్మ సత్యం జగన్మిధ్య అనే స్థాయికి వెళ్ళాలి అంటే గొప్ప వీరత్వం ఉండాలి. తన అహంకారం పూర్తిగా నశించి పోయిన తరువాతే ఆత్మ దర్శనం అవుతుంది. అందుకు మనకు దోహద పడుతుంది కాబట్టి మహా వీర్య అన్నారు. 
222.మహాబలా
ఏంతో గొప్ప బలము కలిగి ఉన్నది.

No comments:

Post a Comment

Popular