148.Nithyashudda - 'Shuddha' means pure. The soul is always pure.
149.Nithyabuddha - 'Buddha means wisdom. The quality of having experience, knowledge, and good judgement. One who has it will resolve to self-realization. As the wisdom grows, a person will move away from worldly matters and towards inner peace. Nithya buddha represents a state of mind in which wisdom is ripened and hence focuses only on inner peace. There won't be any proclivity for worldly affairs.
150.Niravadhya - 'Avadhya' means flaw. Flaws appear due to ignorance. Niravadya means flawless.
151.Niranthara - 'Anthara' means limit or boundary. Divine mother is without any limits. Paramatma is boundless.
148.నిత్యశుద్ధా - శుద్ధము అంటే మాలిన్యములేనిది. ఆత్మ నిత్యశుద్ధము.
149.నిత్యబుద్ధా - బుద్ధ అంటే జ్ఞానం. జ్ఞానం పండిన వారు సంసార సుఖాలు క్షణికాలు అని తెలుసుకుని ఆత్మ సాక్షాత్కారానికై మొగ్గు చూపుతారు. వారు కర్మలు చేయరు. నిత్యం పరమాత్మను ధ్యానం చేస్తూ ఉంటారు. ఆ స్థితిని నిత్య బుద్ధ అంటారు.
150.నిరవద్యా - అవద్య అంటే దోషము. ఇది అవిద్య లేదా అజ్ఞానము వలన కలుగుతుంది. నిరవద్య అంటే ఎటువంటి దోషము లేనిది.
151.నిరంతరా - 'అంతరం' అంటే హద్దు, అవధి. పరమాత్మ సర్వాంతర్యామి. అందుకే నిరంతర. ఈ విషయం భాగవతం - ప్రహ్లాదోపాఖ్యానంలో శ్రీ బమ్మెర పోతనగారు చక్కగా వివరించారు. విష్ణువెక్కడని హిరణ్యకశిపుడు అడిగినపుడు ప్రహ్లాదుడు "ఇందుగలడు అందులేడని సందేహము వలదు. చక్రి సర్వోపగతుండు. ఎందెందు వెతికిన అందందే గలడు దానవగ్రజ" అంటాడు.
No comments:
Post a Comment