Search This Blog

128-131. Sadhvi ...Shanthimathi

128.సాధ్వి - మహాకామేశ్వరుని(పరమాత్మ) కోరిక వలన అమ్మ సృష్టి చేసింది. అందులో 84 లక్షల జీవరాశులను పుట్టించింది. అంతే కాదు, ఆయన ఇఛ్చానుసారం సృష్టిని నడిపిస్తుంది కూడా. అందుకే సాధ్వి అనే పేరు ఇచ్చారు. ఎల్ల వేళలా భర్త అభీష్టాన్ని కోరడమే సాధ్వి లక్షణం. 

129.శరతూచంద్రనిభాననా - శరత్కాలంలో చంద్రుడు ఏంతో ప్రసన్నంగా, ఆహ్లాదంగా ఉంటాడు. అమ్మ ముఖం శరత్కాలంలో ఉందయించే చంద్రబింబంలా ఉంటుందిట. ముఖమే హృదయానికి దర్పణం అంటారు. ఆవిడ ముఖం అంత ప్రసన్నంగా ఉండాలి అంటే ఆవిడ హృదయం కూడా అంతే నిర్మలంగా ఉండాలి. అప్పుడే అది సాధ్యమవుతుంది. అమ్మ సాధ్వి కనుక ఆవిడ హృదయమే పరమాత్మ హృదయం కూడా. వాటిలో భేదం ఉండదు. పరమాత్మ హృదయమే వేదం. ఆద్యంతం పరమాత్మ గుణములనే కీర్తిస్తుంది వేదం. 84 లక్షల జీవరాసులు సంతోషంగా వర్ధిల్లడానికి చేయవలసిన కర్మ కాండలు వేదంలో చెప్పబడ్డాయి. అవి లోకోభ్యున్నతికై వచ్చినవి అనటానికి రుజువే శరత్కాలంలో చంద్రునివలె ఉన్న అమ్మ ముఖం. 

130.శాతోదరీ - శాతము అంటే కృశించినది అని అర్ధం. ఒక తల్లి తన బిడ్డలను సాకుతూ ఎంత శ్రమిస్తోందో తెలియజెప్పేది ఆమె ఉదరము. చిన్నపిల్లలతో సతమవుతున్న తల్లుల నడుము పొట్ట కృశించిపోయి ఉంటాయి. మరి మన అమ్మ ఆబ్రహ్మకీటజనని. 84 లక్షల జీవరాశులను సాకలి. ఇక ఆమెకు విశ్రాంతి ఎక్కడ? అందుకే ఆమె ఉదరము సన్నగా కృశించిపోయి ఉంటుంది. 

131.శాంతిమతి - శాంతిమతి అంటే ఉపశమించిన మానసము కలది. శాంతి పొందాలంటే ఇంద్రియముల అలజడి సద్దుమణగాలి. అప్పుడు మనస్సు, బయట విషయాలను కోరక, ఆత్మ జ్ఞానం వైపు దృష్టి సారిస్తుంది. సాధనలో జాగృతి, స్వప్న, సుషుప్తులను దాటి తురీయావస్థను చేరుకుంటుంది. అక్కడ మనోవృత్తులన్నీ మూలప్రాణంలో లయమయిపోతాయి. బుద్ధి మాత్రమే జాగరూకమయి ఉంటుంది. ఆ స్థితిలో శాంతి కలుగుతుంది. అదే మన అమ్మ నిజమైన స్వరూపం. శ్రీచక్రంలోని 9వ ఆవరణలో ఉన్నది శాంతి రసము.

128.Sadhvi - Mother created the Universe as per the desire of Mahakameshwar (Paramatma). She gave birth to 84 lakh species. Not only that, but she also administers this universe as per Kameshwara's wish. Hence the name Sadhvi. A sadhvi is a woman who always aligns all her actions to her husband's intentions. 

129.Sharatchandranibhanana - The moon is very pleasant in autumn. Mother's face is like the autumn Moon. It is said that the face is the index of Mind. So if Her face should be so pleasant then her mind should also be just as pure. Since Mother is a sadhvi, her mind is always aligned to Lord Kameshwara. There is no scope of difference between them. Vedas are textual explanations of Paramatma's intentions. The Vedas glorify the divine qualities throughout. The vedas state the rituals that should be followed so that all 84 lakh species thrive and prosper. Mother's face is the proof that vedic rituals are meant for larger good. Her face is pleasant like Autumn moon. That means her mind is very pure. Her mind is always aligned to Paramtma's will. Vedas explain Paramatma. So Vedas are for larger good of all living beings.

130.Shaatodari - 'Shaatha' means contracted. 'Udara' means belly. Size of a mother's belly indicates how busy & occupied she is with her kids. Our mother has to take care of 84 lakhs species. She has no time for rest. She is always engaged. Hence her belly is contracted and very thin.

131.Shantimati - She is peace personified. For peace to prevail, one has to first calm down the senses. Then the mind detaches with the external world and starts journey towards inner peace. With constant practice, it reaches the 'turiya' state where all the mental faculties get dissolved. Peace is experienced in this state. That is mother's true form. The 9th stage of SriChakra symbolizes this inner peace.

No comments:

Post a Comment

Popular