Search This Blog

161: Nirahankara

Ego is formed out of the three gunas. All living beings have 3 bodies. They are: 1) Kaarana body 2) Sookshma body 3) Physical body.
1) If one feels that ones identity is the physical body. Then that ego is of Tamasic nature
2) If one feels that ones identity is the Sooksma body, Then that ego is Rajasic in nature
3) If one feels that ones identity is the kaarana body, then that ego is of Saatvic nature
A saatvic ego is the closest to God. Rajasic ego makes you run after worldly pleasures. Tamasic ego is the most dangerous. It makes one lazy and incompetent. Divine mother is beyond ego. That is called Shuddha sattva. 

A small story to help you understand the true nature of the ego.

A traveler is travelling through a dense forest. He has to cross the forest to reach his village that is on the other side. The forest is quite dark and is not easy to navigate through. Finding path to his village is not easy. He is struggling. Suddenly, three thieves attacked him from the darkness. They tied him to a tree and took away all his possessions. After robbing him completely, one of the thieves said, "Let's kill this guy right here. We anyway robbed all of him". Another thief said, "Let's leave him as is. He will eventually die in this forest. What harm can he do to us in this state". The last thief silently whispered into the traveler's ears, "I can't take you to your village, but I can take you close to the other end of the forest and from there you will be able to find way to your village". The traveler nodded his head silently to show his consent. After a bit of discussion, they all agreed to leave the thief alive and tied to the tree. All the thieves parted from there in their own ways. After sometime, the third one of the thieves, who whispered into the traveler's ears returned. He untied the traveler and lead him to the outskirts of the forest. There he said, "I am a thief. I cannot come with you beyond this point. You should find your own way from there". Then the traveler left the thief and went out searching his village. The thief went back into the forest and disappeared.

The thief who helped the traveler is Saatvic ahankar.
The thief who advised to tie and leave is Rajasic ahankar.
The thief who advised to kill is Tamasic ahankar.

The traveler in this story represent your pursuit to liberation. Village is Moksha and forest is the sansaar or the world of illusions.

అహంకారం త్రిగుణాత్మకమైనది. జీవులన్నింటికీ మూడు దేహములున్నవి. అవి: 1) కారణ శరీరం 2) సూక్ష్మ శరీరం 3) భౌతిక శరీరం.
1) భౌతిక శరీరమే నేను. అది నాది అన్న భావన తామసిక అహంకారం.
2) సూక్ష్మ శరీరం నేను. ఇదే న స్వభావం అన్న భావన రాజసిక అహంకారం.
3) కారణ శరీరంమే నేను. ఇదే నా గుణం అనే భావన సాత్విక అహంకారం.
ఈ అహంకారములేవి లేక పోవడమే నిరహంకారం. అది శుద్ధ సత్వం. అదే మన అమ్మ. 

ఒక చిన్న కధ

ఒక వర్తకుడు ఒక దట్టమైన అరణ్యమార్గమున తన స్వదేశానికి పయనించుచున్నాడు. చుట్టూ వేళ్లూనుకుని ఉన్న మహా వృక్షాలు తమ కొమ్మలతో ఆకాశాన్ని పూర్తిగా కమ్మేశాయి. ఆ కీకారణ్యంలో దారి తెలుసుకుని ముందుకు సాగాలి అంటే ఆ ప్రాంతాన్ని బాగా ఎరిగిన నేర్పరుల సహాయం అవసరం. కానీ దురదృష్ట వశాత్తు ఆ సమయంలో ఆ బాటసారికి ఎటువంటి సహాయం లేదు. తొట్రుపడుతూ కష్టపడుతూ ఎలాగైనా తన ఊరు చేరుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఇంతలో అక్కడికి ప్రాణాంతకులైన, అతి భయంకరులైన ముగ్గురు దొంగలు వచ్చారు. ఆ వర్తకుని సొమ్మంతా దోచుకున్నారు. అంతటితో వదలక అతడిని కదలలేకుండా ఒక చెట్టుకి కట్టివేశారు. ఆ ముగ్గురి దొంగలలో ఒకడు, "వీడిని చెట్టుకు కట్టేసినా ప్రాణాలతో వదిలితే మనకు ఏ నాటికైనా ముప్పు తీసుకు రావచ్చు. కనుక వీడిని ఇప్పుడే ఇక్కడే చంపేద్దాం" అన్నాడు. వారిలో ఇంకొకడు, "మనం వీడిని చాలా బలమైన తాళ్లతో కట్టేశాము. వీడు ఇక్కడినుంచి తప్పించుకోవడము దాదాపు అసాధ్యం. ఒక వేళ తప్పించుకున్నా ఈ కీకారణ్యంలో దారి తెలుసుకుని బయటపడేలోపు ఎదో ఒక క్రూర మృగానికి ఆహారమైపోవడం ఖాయం. కనుక మనం వీడికి భయపడవలసిన అవసరము లేదు", అన్నాడు. ఇక ఆ మూడవ వాడు ఆ వర్తకుని చెవులో చాటుగా ఇలా అన్నాడు, "చూడు! నేను నీకు సహాయం చేయగలను. నీకు దారి చూప గలను. కానీ కొంత వరకే. పూర్తిగా నీ ఊరు వరకు మాత్రం కాదు". వర్తకుడు సరే అన్నట్లుగా సైగ చేస్తూ తల ఊపాడు. ఇలా వారు ముగ్గురు కాసేపు చర్చించుకుని అతడిని ఆ చెట్టుకి కట్టేసి వదిలి వెళ్లిపోయారు. కాసేపటికి ఆ మూడవ దొంగ తిరిగి వచ్చి, వర్తకుని కట్లు విప్పేసి, ఆ కీకారణ్యం పొలిమేర వరకూ తీసుకు వెళ్లి "నేను దొంగని. నాకు అరణ్యమే రక్షణ కవచం. అది దాటి నేను రాలేను" అని చెప్పి అక్కడ వేదిలేశాడు. ఇక అక్కడినుండి ఆ వర్తకుడు తన ఊరికి దారి తనంతట తానే తెలుసుకుని వేళ్ళ సాగాడు.

వర్తకునికి సహాయం చేసిన దొంగ సాత్విక అహంకారం.
వర్తకుడిని చెట్టుకు కట్టి వదిలేద్దాం అన్నవాడు రాజసిక అహంకారం.
వర్తకుడిని చంపేద్దాం అన్న దొంగ తామసిక అహంకారం.

ఆ ఊరే మోక్షదామం, ఆ అరణ్యమే సంసారం. మోక్షదామము చేరుకోవాలంటే త్రిగుణాత్మకమైన అహంకారాన్ని వదిలిపెట్టి శుద్ధసత్త్వ స్థాయికి చేరుకోవాలి.

1 comment:

Popular