Search This Blog

226-229.Mahamantra...Mahasana

226.Mahatantra
The procedure we follow from the beginning till the end of a sacred karma(puja or yagnya) is called 'Tantra'. This Tantra shastra is written by sage Aapastambha and others. Divine mother is the main deity of all these tantras. Hence she is called mahatantra

227.Mahamantra
From Divine mother came 'OM'. from 'OM' came the 50 alphabets of Sanskrit language. These are called 'beejaksharas'. Each beejakshara has a unique power in it. When these beejaksharas are arranged sequentially according to their effect, it is called 'Mantra'. Gurus teach a suitable mantra based on the need of the person practicing it. Because all the mantras came from Divine mother, she is called Mahamantra.

228.Mahayantra
Yantras are of 3 types. 1) Bhuprastaramu, 2) Meruprastaramu, 3) Kailasa prastaramu. Of all yantras, 1)Sri Chakra, 2) Rudra yantra, 3)Vana durga yantra are believed to be the greatest. Yantras are forms given to mantras. If Divine mother is the origin of all mantras, then she is the origin for all the yantras and tantras as well.

229.Mahasana
'Mahasana' means one that has very great throne. The great Srichakra is Divine mother's throne. Hence she is called 'mahasana'

226.మహాతంత్రా
ఏదైనా ఒక క్రతువు (పూజ, వ్రతం, యజ్ఞము మొ..) చేయడానికి ప్రారంభించినప్పుడు సంకల్పం నుంచి సమాప్తి వరకు జరిగే క్రియాకలాపమంతా తంత్రమే. వేదాలలో చెప్పబడిన యజ్ఞయాగాదుల నిర్వహణ కూడా తంత్రమే. ఈ శాస్త్రాన్ని ఆపస్తంభుడు మొదలైన వారు వ్రాశారు. ఈ రకంగా ఉన్న అనేకమైన తంత్రాలకు అధిష్టాత్రి మన అమ్మ. అందుకే ఆమెను మహాతంత్ర అని అన్నారు. 

227.మహామంత్రా
అమ్మ నుండే ఓంకారము వచ్చింది. దానినుండి సంస్కృత భాషలోని 50 అక్షరాలు వచ్చాయి. ఇవే బీజాక్షరాలు. ఒక్కొక్క బీజాక్షరానికి ఒక్కో రకమైన శక్తి ఉంటుంది. ఆ శక్తి ఆధారంగా బీజాక్షరాలను సంపుటీకరణ చేస్తే అవి మంత్రాలు అవుతాయి. సాధకుని అవసరాన్ని బట్టి మంత్రోపదేశం చేస్తారు గురువులు. అన్ని మంత్రాలూ ఆమెనుండే వచ్చాయి కనుక అమ్మను మహామంత్ర అన్నారు.

228.మహాయంత్రా
యంత్రాలు మూడు రకాలు. 1) భూప్రసారము, 2) మేరుప్రస్తారము, 3) కైలాస ప్రస్తారము. అయితే యంత్రాలలో శ్రీచక్రము, రుద్రయంత్రము, వనదుర్గాయంత్రము మహాయంత్రాలనబడతాయి. యంత్రాలు మంత్రాల యొక్క రూపాలు. హేతుబద్ధంగా ఆలోచిస్తే సర్వమంత్రరూపిణి అయిన అమ్మ సర్వయంత్రరూపిణి, సర్వతంత్రరూపిణి కూడా అవుతుంది.

229.మహాసనా
శ్రీచక్రాన్ని ఆశ్రయించి ఉన్నది కాబట్టి మహాసనా అని అన్నారు. అంటే ఏంతో గొప్పదైన ఆసనం కలది అని అర్ధం.

No comments:

Post a Comment

Popular