కాళిదాసు తన లఘుస్తవంలో
List of all thousand names of Sri Lalitha Devi, a brief description of each name and a detailed description of selected names
Search This Blog
794.Kapardhini
793. Saamarasyaparaayanaa
శివశక్తుల ఏకీభావమే సామరస్యము. అటువంటి సామరస్యమే పరస్థానముగా గలది. ఎక్కువ తక్కువలు లేని సామరస్యమే అధికముగా గలది. పరస్పర తపస్సంపత్ ఫలాయిత పరస్పరౌ | ప్రపంచమాతాపితరౌ ప్రాంచౌ జాయాపతీ స్తుమః || ఒండొరుల తపస్సు ఫలితంగా వారు ప్రపంచానికి తల్లితండ్రుల్లో ప్రాచీన దంపతులవుతున్నారు. ఇది శివశక్తుల సమరసభావన. పరమేశ్వరికి శివునకు భేదం ఏమాత్రమూ లేదు. సత్యజ్ఞానానందముల సామరస్యము గలది మన అమ్మ. అందుకే సామరస్య పరాయణా అనబడుతోంది.
792. Satyagnanaanandaopa
792. సత్యజ్ఞానానందరూపా
791. Paraaparaa
791. పరాపరా
పరా, అపరా స్వరూపము గలది.
దీన్ని గురించి ముండకోపనిషత్తులో చెప్పబడింది: శుసకుని కుమారుడు శౌనకుడు. కఠోరనియమాలతో బ్రహ్మచర్యం పాటించి విద్యాభ్యాసం పూర్తిచేశాడు. మంచి మేధావి. విద్యార్థిగా గురుకులంలో మంచి పేరు సంపాదించాడు. విద్యాభ్యాసం పూర్తయింది. ఇక గృహాస్థాశ్రమం స్వీకరించాలి. ఆ దశలో ఒకనాడు గురువుగారైన అంగిరసుణ్ణి ఈ విధంగా అడిగాడు.
“గురుదేవా ! దేన్ని గురించి తెలుసుకుంటే సర్వమూ తెలుస్తాయో దాన్ని దయచేసి నాకు వివరించండి" దానికి అంగిరసుడు - "లోకంలో తెలుసుకోదగిన విద్యలు రెండు ఉన్నాయి. 1. పరావిద్య. 2. అపరావిద్య, నిర్గుణ పరబ్రహ్మ స్వరూపాన్ని తెలిపేది పరావిద్య. వివిధ రకముల ధర్మములు, కర్మలు, వాటి సాధన ప్రక్రియలు మొదలైన విషయాలను తెలిపేది అపరావిద్య. చతుర్వేదాలు, శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, జ్యోతిషము, నిరుక్తము ఇవన్నీ అపరావిద్య. ఇది లౌకికప్రయోజనాలకు ఉపయోగిస్తుంది. వేదాలలో యజ్ఞాదికర్మలు చెప్పబడ్డాయి. ఆ కర్మలను ఆచరిస్తే ఫలితం వస్తుంది. సంసారసుఖాలను అనుభవించటానికి కావలసిన ధనము, పలుకుబడి లభిస్తాయి. ఈ విద్య ఐహికంగా ఉన్నత స్థితులకు తీసుకుపోతుంది. ఇది ధర్మాధర్మాలు, పుణ్యపాపాలు, ప్రసంగాలతో మిళితమై ఉంటుంది. వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు అన్నీ అందులోని భాగాలే. ఈ చదువువల్ల జరామృత్యు భయంపోదు. ఇది కేవలం ఐహికసమున్నతికి ఒక సాధనము మాత్రమే. ప్రపంచంలో చాలామంది ధనము, కీర్తి, పదవి కావాలని కోరుకుంటారు. స్వర్గసుఖాలు కావాలి అని యజ్ఞయాగాలు చేస్తారు. ఇవి శాశ్వత సుఖాలు కావు. వీటివల్ల ఐహిక సుఖములు లభిస్తాయి తప్ప మోక్షంరాదు. ఈ సుఖాల వలన వారు విషయలంపటంలో ఇరుక్కుంటారు.789. Jayatsenaa
788. Tripureshee
ఏతాస్తు గుప్త యోగిన్యః త్రిపురేశీ పదాంతికే
శ్రీచక్రంలోని రెండవ ఆవరణ షోడశదళము చంద్రకళా స్వరూపము. ఈ ఆవరణకు అధిదేవత త్రిపురేశీ. ఇక్కడ ఉండే యోగిని పేరు గుప్తయోగిని.787. Mantrinyastharaajyadhooh
అమ్మ యొక్క మంత్రిణి శ్యామల. రాజ్యభారమంతా శ్యామలాదేవి భుజస్కంధాలపైనే ఉంటుంది. అమ్మవారి మంత్రిగణం గురించి 'గేయచక్ర రథారూఢా' అనే నామంలో తెలుసుకున్నాం. అటువంటి శ్యామలచే ఆరాధించబడునది.
శ్రీకృష్ణ శ్యామలా దైవ
శ్రీకృష్ణ పరమాత్ముడే శ్యామలారూపి. సకల లోక స్థితి కారకుడు. అటువంటి శ్యామలచేత ఆరాధించబడునది.
Divine mother's minister is Shyamala. She shoulders the responsibility of all administrative activities. We had learnt about mother's cabinet in the name 'Geyachakra Rathaaroodhaa'. Mother Shyamala worships Divine mother.
Srikrishna shyamalaa deiva
Lord Sri Krishna is Shyamala. Administrator of all the worlds.
786. Maarthaandabhairavaaraadhya
786. మార్తాండభైరవారాధ్యా
ఆదిత్య మండలాంతర్వర్తి మార్తాండుడు అనబడతాడు. ఆయనే సూర్యుడు. అష్టభైరవులలో మార్తాండభైరవుడు ఒకడు. అతనిచే ఆరాధించబడిన దేవి.
785. Praanaroopini
Praana is Parabrahma. It is said like this in Brihadaaranyaka upanishath
Both Devatas and Rakshasas are born to Prajapathi. Rakshasas outnumber Devatas. These two represent Dharma and Adharma. Justice and injustice. Truth and Ignorance. Hence those having qualities like goodness, compassion, righteousness became Devatas. Those who lack these qualities became Rakshasas. They fight with each other always. Once Devatas devised a strategy to triumph over Rakshasas. They determined to practice 'Om'. They thought this will give them enough strength to win over Rakshasas.
Devatas approached faculty of speech to help in practicing 'Om'. It agreed. It split the results of this into two parts. It kept the part that gives flawless pronunciation to itself and gave the rest to Devatas. Rakshasas feared that Devatas would triumph with this power. So they maligned speech with impurity of sin. Due this speech lost its purity. It started pronouncing incorrectly. It started uttering bad words. As a result, the power it used to give to Devatas weakened.
Then Devatas approached faculty of sight. It agreed. It also split the results into two parts. It kept the power of vision to itself and gave the remaining to Devatas. Again, Rakshasa feared of this. So, they maligned sight with impurity of sin. Then eyes started seeing bad things. It lost its purity. Then the power it used to give to Devatas weakened. This repeated with all senses and mind.
Then Devatas approached Praana. It agreed. Praana gave all the results to Devatas. It did not keep a part for itself. Those Rakshasas who tried to malign Praana with sin failed and died miserably. Then Devatas triumphed over Rakshasas
This Praana is the force(rasa) behind all organs. That organ (anga) which does not have Prana in it does not function. Hence Praana is called Angirasa. Praana is Brahmnaspathi. Because Praana is the Lord of Yajas. Prana is Saama. Like this, Praana is para brahma. Hence Divine mother is called Praana roopini.
There are two types of vayus in the body:
1. Pradhaana Vayu. These are five types: 1. Praana, 2. Apaana, 3. Vyana, 4. Udaana 5. Samaana
2. Upa vaayu. These are five types: 1. Naaga, 2. Koorma, 3. Krukara, 4. Dhananjaya, 5. Devadatta.
The body functions because of these Vayus. All these are forms of Praana.
785. ప్రాణరూపిణీ
784. Praanadaa
The one who gives Praanaa(life).
We learnt in the name Panchakoshandharasthita about pranamaya kosha and its importance in life. Divine mother is the giver of that Praanaa.
A story from Chandogya upanishath:
Once upon a time, all the senses, mind, prana gathered in a place to discuss and conclude who is the greatest of all of them. They could not conclude even after prolonged debates. They approached prajapathi Brahma (who created all of them) for advise. Brahma said, "There is an idea. Each of you leave the body in turns and observe who the body performs without you". That which effects the body most is the greatest of all of you". They all went back and started implementing that idea.
First, faculty of speech left the body. It said, "I will return after 1 year. Tell me how the body fares without me." After it returned, everyone said, there is some discomfort because there is no speech. But rest all of us were able to do our duties happily. The body is absolutely fine without you. Faculty of speech came back into the body after listening this.
Similarly for faculties of sight, smell, listening etc. After that, the mind left the body and returned after one year. Still the body did not collapse. Finally, prana started leaving the body. Then others also felt as if their energy is being snatched away. They felt as if they are going to become inactive even though they are inside the body. They all understood that prana is the force behind all of them. Without it, nothing can perform their function. Then they all unanimously agreed that prana is the greatest faculty amongst them.
784. ప్రాణదా
ప్రాణములను ఇచ్చేది. ప్రాణమే బ్రహ్మ. తైత్తిరీయోపనిషత్తులోని భృగువల్లిలో “వరుణమహర్షి కుమారుడు భృగుమహర్షి. విద్యాభ్యాసం పూర్తిచేసి బ్రహ్మోపదేశం చెయ్యమని తండ్రిని కోరాడు. తండ్రి ఆదేశం మేరకు తపస్సుచేసి ప్రాణం బ్రహ్మ అని తెలుసుకున్నాడు అని చెప్పబడింది. ఈ విషయాన్ని 'పంచకోశాంతరస్థితా' అనే నామంలో వివరించటం జరిగింది. లోకంలోని సమస్త జీవరాశులు ప్రాణంవల్లనే జీవిస్తున్నాయి. ప్రాణంవల్లనే రక్షించబడుతున్నాయి. ప్రాణం పోయినప్పుడు మృత్యువులో లీనమైపోతున్నాయి. అందుచేత ప్రాణమే సర్వసృష్టికీ మూలాధారం.
ఛాందోగ్యోపనిషత్తులో ఒక కథ ఉన్నది.
పూర్వకాలంలో ఒకసారి ఇంద్రియాలన్నీ తమలో తాము పోట్లాడుకోవటం మొదలు పెట్టాయి. దీనికి కారణం ఎవరు గొప్ప అనే విషయం తేలకపోవటమే. ఆ వాదన ఎంతకీ తెగలేదు. చివరకు అన్నీ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి తమకు జన్మనిచ్చిన ప్రజాపతి దగ్గరకు పోయి 'మాలో ఎవరు గొప్పవారో తేల్చి చెప్పండి' అన్నాయి. ప్రజాపతి ఒక్కక్షణం ఆలోచించి “మీలో ఎవరు గొప్పో తేల్చుకునే ఉపాయం ఒకటి ఉన్నది చెబుతాను వినండి. మీలో ఏదిలేకపోతే ఈ శరీరం పనికిరాకుండా పోతుందో, పనిచెయ్యకుండా పోతుందో అది అన్నిటికన్నా శ్రేష్టమైనది. మీరందరూ విడివిడిగా ఒక సంపత్సరంపాటు ఈ శరీరాన్ని విడిచి పెట్టి వెళ్ళండి అప్పుడు తెలుస్తుంది” అన్నాడు ప్రజాపతి. ముందుగా వాక్కు శరీరంనుంచి నిష్క్రమించింది. ఒక సంవత్సరంపాటు శరీరానికి దూరంగా ఉండి తరువాత వచ్చి మిగిలిన ఇంద్రియాలను అడిగింది. నేను లేనప్పుడు మీరు ఎలా జీవించి ఉండగలిగారు ? నువ్వు వెళ్ళిపోవటంవల్ల శరీరానికి పెద్దనష్టం ఏమీ జరగలేదు. కేవలం మాటరాలేదు. అంతేకాని మిగిలిన శరీరం యథాతథంగా పనిచేసింది. కళ్ళు చూస్తూనే ఉన్నాయి. చెవులు వింటూనే ఉన్నాయి. మనసు ఆలోచిస్తూనే ఉన్నది. ఈ రకంగా మిగిలిన పనులన్నీ సాగాయి. పసిపిల్లవాడికి మాటలు రావు. అతడు బ్రతకటంలేదా ? మూగవాడు జీవించటంలేదా ? అలాగే శరీరం జీవించే ఉన్నది” అన్నాయి. ఆ మాటలు విన్న వాక్కు మారు మాట్లాడకుండా శరీరంలో ప్రవేశించింది.783. Paraakaasha
ఉత్కృష్టమైన ఆకాశమే పరాకాశము. అదే పరబ్రహ్మ. ఆకాశమే పరబ్రహ్మ. ఇక్కడ ఆకాశము అంటే పంచభూతాలలోని ఆకాశం కాదు. అన్నిటా వ్యాపించి ఉండేది అని అర్థం. సర్వవ్యాపి.
782. Pratyagroopa
781. Vishwatomukhee
అన్నివైపులకు ముఖము గలది. అన్ని దిక్కులకు ముఖము గలది. 'ఆ పరమేశ్వరుడికి అన్నివైపులా కళ్ళు ముఖాలు ఉన్నాయి' అని వేదం చెబుతోంది. ఎక్కడైతే అమ్మని ధ్యానించాలని అనుకుంటారో అక్కడ ఆమె ప్రతిష్టింపబడుతుంది. అక్కడ ఆవిర్భవిస్తుంది. కాబట్టి ఆమె అన్ని ప్రదేశాలలోనూ ఉన్నది. విశ్వతోముఖీ అనబడుతున్నది.
వేదంలో
సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష స్సహస్రపాత్ పరమేశ్వరుడికి అనేకవేల శిరస్సులు, కనులు, ముఖాలు, చేతులు ఉన్నాయి. అంటే సృష్టిలోని జీవరాశి అంతా పరమేశ్వర స్వరూపమే. జగత్తంతా పరమేశ్వరమయమే. అతడు అంతటా వ్యాపించి ఉన్నాడు. సర్వాంతర్యామి అని వేదం చెబుతోంది. కాబట్టి పరమేశ్వర స్వరూపమైన ఆ అమ్మ విశ్వతోముఖీ అనబడుతున్నది.780. Virajaa
779. Viraadroopaa
Popular
-
Dhyana means meditation. A Dhyana sloka explains the form on which one has to fix his/her mind during dhyanam(meditation) Shloka1 Sindh...
-
Chit is a part of our brain that seeks pleasure . It causes chaitanya. It is self-motivated and always at work. First it records our experie...
-
Karma is the conjunction of desire and effort. If there is no desire but only effort then it is not karma. It will be selfless service. When...
-
Mano Rupekshu Kodanda is 10th name of the 1000 names of Lalitha Devi. When read along with the 11th name pancha thanmathra sayaka , this na...
-
దాడిమీ వృక్షము - అంటే దానిమ్మ చెట్టు. ఈ చెట్టు రెండు రకాలుగా ఉంటుంది. పండు దానిమ్మ పువ్వు దానిమ్మ పండు దానిమ్మనే కాయ దానిమ్మ అనికూడా అంటారు....
-
Matruka means letters from 'Aa' to 'Ksha'. 'Kshara' means perishable. 'Akshara' means imperishable. In India...
-
Vyoma means sky, ether, atmosphere, air, wind etc. Kesha means hair. Vyomakesha is the name of the avatar of Lord Shiva who played a key ...
-
Pancha thanmathra sayaka is 11th name of the 1000 names of Lalitha Devi. This explains a very important concept behind self-improvement. ...
-
Vishukra is born from Bhandasura's right shoulder. He is equally clever as shukracharya (guru of all rakshasas). 'Shukra' donot...