Search This Blog

788. Tripureshee

ఏతాస్తు గుప్త యోగిన్యః త్రిపురేశీ పదాంతికే

శ్రీచక్రంలోని రెండవ ఆవరణ షోడశదళము చంద్రకళా స్వరూపము.
ఈ ఆవరణకు అధిదేవత త్రిపురేశీ. ఇక్కడ ఉండే యోగిని పేరు గుప్తయోగిని.

స్థూల సూక్ష్మ కారణ దేహాలకు ప్రభ్వి. ముఖ్య ప్రాణరూపిణి. త్రిపురములకు ఈశ్వరి.

బ్రహ్మ విష్ణు రుద్రులకు దేవశిల్పి మయుడు పురములను నిర్మించాడు. ఆపురములకు ఈశ్వరి త్రిపురేశి.

త్రిపురాసుర సంహారంలో వెండి, బంగారం, ఇనుము తో చేయబడిన పురములు సత్వరజస్తమో గుణాలకి ప్రతీక. ఆ గుణాలకి అతీతమైన నిర్గుణ పరబ్రహ్మ స్వరూపమే త్రిపురేశీ.

శిరోభాగము - బ్రహ్మ, మధ్యభాగము - విష్ణువు. అధోభాగము - రుద్రుడు. ఈ మొత్తానికి అధిపతి పరమేశ్వరి. కాబట్టి త్రిపురేశి అనబడింది.

Aetasthu guptha yoginyah tripureshee pataanthike

The second stage in Sri Chakra is a 16 petalled lotus. Tripureshee is the lord of this stage. The yogini in this stage is called Guptha yogini.

Divine mother is the lord of physical, meta-physical and etheral bodies. The vital life force.

Mayu is the sculpture of the devatas. He built three villages one-each for Brahma, Vishnu and Shiva. Divine mother is the lord of these three villages.

In the war with Tripurasuras, the villages built with Gold, Silver and Iron represent Satwa, Rajas and Tamo gunas. Divine mother is the ultimate nirguna(without any guna) para brahma.

The head is Brahma, torso is Vishnu and waist till feet is Rudra. Divine mother is the master of these three. Hence she is called Tripureshee.

No comments:

Post a Comment

Popular