Search This Blog

786. మార్తాండభైరవారాధ్యా

 

ఆదిత్య మండలాంతర్వర్తి మార్తాండుడు అనబడతాడు. ఆయనే సూర్యుడు. అష్టభైరవులలో మార్తాండభైరవుడు ఒకడు. అతనిచే ఆరాధించబడిన దేవి.

మణిద్వీపంలో ఇరవై రెండవ ప్రాకారంలో ఉన్నవాడు మార్తాండభైరవుడు. చక్షుష్మతీ, ఛాయాదేవి ఇతని భార్యలు. ఇతనిచేత ఆరాధించబడునది.

మణిమల్లుడు అనే రాక్షసుణ్ణి సంహరించటానికి శివుడు భూలోకానికి వచ్చాడు. అతడే మార్తాండ భైరవుడు. అతనిచే అర్చించబడినది. కాబట్టి మార్తాండభైరవారాధ్యా అనబడుతున్నది.
భీరువులు - భయము గల స్త్రీలు. వారిచే ఆరాధించబడుదేవత.

మార్తాండ అనే నామంలో ఖగోళ శాస్త్రానికి సంబంధించిన ఒక గొప్ప సాంకేతిక రహస్యం దాగి ఉంది. మర్తు + అండ = మార్తాండ. అంటే తన అండములను తనే సంహరించేవాడు అని అర్ధం వస్తుంది. మనం సూర్యుడిని మార్తాండ అని పిలుస్తాం. ఈ నామం ఆదిత్య హృదయంలో కూడా వస్తుంది. అసలు సూర్య భగవానుడికి, అండములను సంహరించడానికి సంబంధం ఏమిటి? అసలు సూర్యుడికి ఈ నామం ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం.

ఈ బ్రహ్మాండం అండాకారంలో ఉంది అని మనం 'నిజారునప్రభాపూర మజ్జత్బ్రహ్మాన్దమండల' అనే నామంలో తెలుసుకున్నాం. సూర్యునిలో గొప్ప శౌర శక్తి ఉంటుంది. ఆ శక్తి కొన్ని కోట్ల కోట్ల యోజనాల దూరం వరకూ వేడిని ప్రసరిస్తుంది. ఆ వేడి వలెనే మనం చలికి గడ్డ కట్టిపోకుండా ఉంటున్నాం. ఈ అపారమైన శౌర శక్తి వలన సూర్యునిలో నిరంతరం అణు బాంబులకు సమతుల్యమైన విస్ఫోటనలు జరుగుతుంటాయి. ఆకారంలో కూడా సూర్యుడు సోలార్ సిస్టమ్ లోని అన్ని గ్రహాల కంటే ఎంతో పెద్ద వాడు. సూర్యుని వ్యాసం భూమి కంటే 100 రెట్లు పెద్దది. సోలార్ సిస్టం లోని గ్రహాలన్నింటి బరువు కలిపితే 0.2 అయితే ఒక్క సూర్యుని బరువు 99.8 ఉంటుంది. మరి అంత పెద్ద గ్రాహం నిరంతరం అంతటి భీకరమైన అను బాంబుల విస్ఫోటనానికి గురవుతుంటే ఎంజారుతుంది? సోలార్ సిస్టం వంటి ఎన్నో గ్రహ సమూహాలు ఉవ్వెత్తున సూర్యుడి ఊపరితలంలోకి ఎగసి పడుతుంటాయి. ఈ గ్రహ సమూహాలు అండాకారంలో ఉంటాయి. వాటిని అరికట్టకపోతే అవి కొన్ని లక్షల మైళ్ళ వేగంతో వచ్చి భూగ్రహాన్ని ఢీకొంటాయి. అప్పుడు భూమి మిగలదు. కానీ అలా జరగదు. ఎందుకంటే సూర్యునిలో జరిగే విస్ఫోటనం వల్ల ఎగసిపడిన గ్రహ సమూహాలను సూర్యుని యొక్క గురుత్వాకర్షణ శక్తి మళ్ళీ అతనిలోకి లాగేసుకుంటుంది. మనం వెలిగించిన తారాజువ్వ పైకి ఎగిరి మళ్ళీ భూమి మీద పడినట్లు అన్న మాట. ఆలా ఎగసిపడే అండాకారంలోని గ్రహ సమూహాలను మళ్ళీ తనలోనే కలిపేసుకుంటాడు కనుక సూర్యునికి మార్తాండ అని పేరు వచ్చింది.

మండే వేసవిలో సూర్యుని ప్రతాపాన్ని మనం 'మాధ్యందిన మార్తాన్డును' అంటాం. అంటే భరించలేనంత వేడి అని అన్న మాట.

భైరవ - భీకరమైన రవం (అరుపు, శబ్దం) చేయువాడు.

No comments:

Post a Comment

Popular