Search This Blog

19-20. Navachampaka...nasabharana bhaasura

 


నవచంపకం అంటే అప్పుడే వికసించడం మొదలైన చంపక పుష్పం. ఇంకా పూర్తిగా వికసించలేదు. అటువంటి చంపకానికి ఉండే రేకు ఏ ఆకారంలో ఉంటుందో అలా ఉందిట అమ్మవారి ముక్కు. అందుకే నవచంపక పుష్పాభా నాసా దండ విరాజితా అన్నారు. ఇక అమ్మవారి నాసాభరణం తారల కాంతిసైతం చిన్నబుచ్చుకునేలా మెరిసిపోతోందిట. అందుకే తారాకాంతి తిరస్కార నాసాభరణ భాసురా అని అన్నారు. 

ఇక్కడ ఒక అద్భుతమైన రహస్యం ఒకటి చెప్పుకోవాలి. ఇది ఎంతో ఆశ్చర్యకరమైన విషయం. రహస్యాలలోకెల్లా అతి గొప్ప రహస్యం. మనమందరం సాధారణంగా శ్వాస తీసుకుంటున్నపుడు గాలిని కుడి రంధ్రం నుండి లోపలికి తీసుకుని, ఎడమ రంధ్రం నుండి బయటకు వదులుతాము. కానీ లోతుగా ధ్యానం చేసుకుంటున్నపుడు మాత్రం శ్వాస ఎడమ ముక్కు రంధ్రం ద్వారా లోపలికి వెళ్లి కుడి ముక్కు రంధ్రం ద్వారా బయటకు వస్తుంది. ఈ శ్వాస ప్రక్రియ ఎలా మారిందో ఎప్పుడు మారిందో ధ్యానం చేస్తున్నప్పుడు తెలియదు. ఎందుకంటే అపుడు దృష్టి అంతర్ముఖమైపోయి ఉంటుంది. ధ్యానం ముగించి తెలివిలోకి వచ్చాక తెలుసుకునే అవకాశమే లేదు. ఎందుకంటే అప్పటికి శ్వాస మళ్లి మామూలుగా మారిపోతుంది. ఈ శ్వాస గమనంలోని మార్పే కుండలిని యోగానికి మూలం. 

Navachampakam means Champaka flower which is just beginning to bloom. It has not yet fully bloomed. The shape of the foil of such a champaka resembles Divine Mother's nose. That is why it is described as Navachampaka Pushpabha Nasaa Danda Virajita. The mother's nose ring is shining brighter than the brightest of the stars. That is why it is called Tarakanti Tiraskaara Nasabharana Bhasura.

We should discuss an amazing thing here. It is a wonderful fact. The greatest of all the secrets. When we all breathe normally we take in air from the right nostril and exhale it out of the left nostril. But when meditating deeply the breath goes in through the left nostril and comes out through the right nostril. One will not realize how or when this breathing process changed while meditating . Because the focus is diverted to inner consciousness. There is no chance of knowing it after the meditation is over and you come back to outer consciousness. Because by then the breathing will be back to normal. This reversal of the breathe cycle is the corner stone of kundalini yoga.

18. vaktralakshmi parivaha chalanminabha lochana

Amazon Molly

అమ్మవారి కన్నుల గురించి ఎంత చెప్పినా సరిపోదు. అందుకనే వ్యాసుల వారు ఒక గొప్ప ఉపమానం ఇచ్చి మేనల్నే ఊహించుకోమన్నారు.  చేపల లో కొన్ని జాతులు ఎటువంటి సంపర్కం లేకుండానే పిల్లలకు జన్మ నిస్తాయి. అవి కేవలం వాటికంటి చూపులతోనే తమ పిల్లల తాపాలను తీరుస్తాయి. అలాగే అమ్మ కనులు మనందరి తాపాన్ని తీర్చే చేపల వలే ఉన్నాయి. అమ్మ ముఖం ఈ చేపలు ఉండే మంచి నీటి సరస్సు వలే ఉంది.  అందుకే అమ్మకు మీనాక్షీ అని పేరు వచ్చింది. అంటే కేవలం ఆమె చూపు సోకినంత మాత్రం చేత మన కోరికలు తాపములు అన్ని శమించిపోతాయి. ఇది కేవలం కట్టుకథ కాదు అటువంటి చేపలు నిజంగానే ఉన్నాయి. అమెజాన్ మొల్లి అనే చేప ఎటువంటి సంపర్కం లేకుండానే పిల్లలను పుట్టిస్తుంది. మెక్సికో మరియు టెక్సాస్ మధ్యనున్న మంచి నీటి సరస్సులలో/ నదులలో ఇది నివసిస్తుంది.  భగవత్ సృష్టిలో ఒక చిన్న ప్రాణి అయిన చేపకే ఇది సాధ్యం అయినప్పుడు జగన్మాత అయిన మన అమ్మకు ఇది ఎంత పని? భక్తితో ఆమెను ప్రార్ధించండి  చాలు. ఆవిడ మీ కోరికలన్నీ తీరుస్తుంది. ఆవిడ తలచుకుంటే ఏదైనా చేయగలదు.

There are no words that can explain Divine Mother's eyes completely. Hence sage vedavyasa gave a great parable and left it to our imagination. Some species of fish give birth to offspring without any contact. They satisfy all the needs of their children with their mere looks. Mother's eyes are like that fish. Mother's face is like the fresh water lake where these fish live. That is why she got the name Meenakshi. That means, all our desires and cravings are quenched by the mere sight of her. It's not a myth. Such fish really exist. Amazon Molly, that lives freshwater lakes and rivers between Mexico and Texas gives birth to babies without any contact. It just looks at her children when they come to her. That's all the feeding it gives to those babies. If a small fish can do this, can't the omni present all powerful Divine mother do it? You just have to pray her with devotion. That will fulfill all your desires.

15-16. Ashtami chandra...mriganabhi visheshaka

 

చంద్రునికి సహజంగా ఎటువంటి వెలుగు ఉండదు. సూర్యుని కాంతి వలన దానికి వెలుగు వస్తుంది. దానినే మనం వెన్నెల అని అంటాము. లలితమ్మ మహిమ వలన అది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చంద్రుడు భూమి చుట్టూ భ్రమిస్తూ ఉంటాడు. దీని వలన దానిపై సూర్యకాంతి పడే కోణం మారుతూ ఉంటుంది. అందుకే చంద్రుడు ఒక్కో రోజు ఒక్కొక్కలా కనిపిస్తాడు. ఒక రోజు పూర్తిగా గుండ్రంగా ఉంటాడు. ఆ రోజును పూర్ణిమ అంటాము. ఒక రోజు అసలు కనిపించడు. ఆ రోజును అమావాస్య అంటాము. అంతే కాదు. చంద్రునికి వృద్ధి క్షయాలు కూడా ఉంటాయి. అమావాస్య నుండి పూర్ణిమ వరకు (15 రోజులు) వృద్ధి చెందుతూ ఉంటాడు. దీనిని శుక్ల పక్షం అంటాము. పూర్ణిమ నుండి అమావాస్య వరకు (మరో 15 రోజులు) క్షయం చెందుతూ ఉంటాడు. దీనిని కృష్ణ పక్షం అంటాము. ఈ శుక్ల కృష్ణ పక్షాలలో సరిగ్గా మధ్యన ఉండేది అష్టమి అనే తిథి (రోజు). ఆ రోజు చంద్రుడు అర్ధ వృత్తాకారంలో ఉంటాడు. అమ్మ నుదురు అలా ఉందిట. అందుకే అష్టమి చంద్ర విభ్రాజ దలిక స్థల శోభిత అని అన్నారు. 

మనస్సుపై చంద్రుని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అందులోని మన మచ్చవలె మనస్సుకు కూడా కళంకం అంటి ఉంటుంది. దానిని శుభ్రం చేయడానికే మతం వచ్చింది. అందుకే 'మతిని శుభ్రం చేసేదే మతము' అన్నారు శ్రీ విద్యా ప్రకాశనంద గిరి గారు. అష్టమి చంద్రునిలా విరాజిల్లుతున్న అమ్మ నొసటన బొట్టు చంద్రుని పై మృగ నాభిని తలపించే బొట్టులా ఉందిట. అందుకే ముఖ చంద్ర కళంకాభా మృగ నాభి విశేషక అన్నారు. 

The moon does not have any glow on its own. It glows due to the reflection of sunlight from its surface. It looks pleasant due to Divine mother's glory. The moon rotates around the earth. Due to this, the angle at which we view the moon changes. This is why moon is seen in various shapes. On a particular day, it looks like a full circle. This is called full moon day. On a particular day it goes completely invisible. This is called new moon day. The moon also waxes and wanes due to its rotation. It waxes from new moon day to full moon day. This is called waxing phase. It is for 15 days. It wanes between full moon day to new moon day. This is called waning phase. It is for another 15 days. The eighth day in these waxing and waning phases is called ashtami. It is the middle point in each phase. On this day, the moon looks like a semi circle. It seems Divine mother's forehead head is glowing like this semi circle moon. Hence she is called ashtami chandra vibhraaja dalika sthala shobhita.

Moon has a very strong influence on our mind. The moon looks tainted. So is the mind. We need a religion to clean the mind of these taints. That is why Sri Vidhya Prakaasaananda Giri said, "One that rids the mind of all its taints is called religion". That is the real purpose of a religion. The bindi on Divine mother's forehead that is glowing like a moon on ashtami looks like a taint that resembles navel. Hence she is called mukha chandra kalankabha mruga naabhi visheshaka. 

ఓ చిట్టి గుండెకాయ్

సందర్భం - ప్రాణాంతకమైన హృద్రోగముతో బాధ పడుతున్న తన కూతురికి ఓపెన్ హార్ట్ సర్జెరీ  చేయించాడు. ఆపరేషన్ చేసిన డాక్టర్ "ప్రాణాలు కాపాడటానికి సాయ శక్తులా ప్రయత్నించాము. పాపకి ఏడాది వయసు ఉండడం వలన గుండె చాలా చిన్నది. ఆడుతూ ఆయాస పడుతూ తన అవుకైనా గుండెని మరింత ఘాయ పరిచేసింది. మేము చేయగలిగినది మేము చేసాము. ఇకపై దేవుని దయ. 72 గంటలు దాటితే కానీ మేము ఎం చెప్పలేము", అని చెప్పారు. పాప icu లో హాయిగా నిద్రిస్తోంది. తనకు వచ్చిన ప్రమాదం ఏమిటో ఎటువంటిదో కూడా ఆమెకు తెలియదు. ఆమెను కాపాడటానికి నలుగురు డాక్టర్లు అహర్నిశలు పోరాడుతున్నారు. హాస్పిటల్ బయట బెంచిపై కూర్చుని ఆ తండ్రి తన పాప గుండెను తలుచుకుంటూ ఉన్నాడు. ఎప్పుడు ఎవరు పిలుస్తారో ఎం కబురు చెప్తారో అని ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు. రాత్రి అయ్యింది. అలా కూర్చుని ఉండగా తెలియకుండా కునుకు పడింది. కలలోకి కృష్ణుడు కనిపించాడు. అభమిచ్చాడు. మరుసటి రోజు పొద్దున్నే పాపా చాల బాగా కోలుకుంది. 

సాగిపో సాగిపోవోయ్  
ఓ చిట్టి గుండెకాయ్
నవ్వుతూ దాటేసేయ్
నూరేళ్ళ మైలురాయి

ఎక్కడో కోటలోపల హాయిగా నిదురిస్తున్న
నీ శబ్దం వినలేక ప్రాకారపు బయటనున్న
గోడపై చేతులదిమి మాలోకపు వెర్రి నాన్న 
నీ జాడను వెతుకుతాడు ఇదేం విడ్డూరమన్న 

శ్రీకృషుడు వచ్చాడు
నీ నుదుటిని నిమిరాడు
నవ్వుతూ చూసాడు
అభయమిదే నన్నాడు 

లక్ష్మివై వచ్చావు
నను ధన్యుని చేసావు
మనసంతా నిండావు
మరో అమ్మవైయ్యావు

నీ లయకు అండగా
ఆంజనేయుడున్నాడు
అనునిత్యం కాపుగా
సత్యదేవుడున్నాడు

నీ నాన్న ఆశీస్సులు
ఉంటాయి నిండుగా
శివ శక్తుల దీవెనలతో
బ్రతుకంతా పండగా

లబ్ డబ్ లబ్ డబ్ అని 
ఓ చిట్టి గుండెకాయ్ 
నవ్వుతూ దాటేసేయ్ 
నూరేళ్ళ మైలురాయి 

08-09. Ragasvarupa pashadya krodhakarankushojvala


The six Arishadvargas are wants, frustration, greed, laxity, condescension and lowliness. These are the reasons why the mind at times becomes irrational. Passion and hatred are the seed for these Arishadvargas. Hatred is where passion is. They are two sides of the same coin. These are obstacles to our progress. Success is our right when we put righteous efforts. But Arishadvargas cause moral distortions and create obstacles in our path to success. They deprive us from the wealth, fame and fortune we deserve. Mother Lalitha carries a noose in her hand. It liberates us from the shackles of passion and hatred. That is why she is called Ragaswaroopa Pashadya. That means, she purifies the mind and gives stability. A stable mind can easily focus on God while meditating. Then we will experience the ultimate bliss.

A fulfilled want is lust. If not, it is frustration. If a thing can be easily achieved, it is greed. If not laxity. If the other person is smaller, it is condescension, if not it is lowliness. Thus, the Arishdvargas keep the mind distracted and unstable. They are like wild elephants. Very difficult to control. But the Divine mother has a powerful restraint for these wild elephants. So, she's called krodhakarankushojvala.

The mind is very powerful. It is sensitive and sharp. It dictates what the sense organs, and limbs should do and how they should work. It stores the knowledge that is acquired through various means and generates ideas to overcome challenges. So, we should be checking our mind periodically. We should continuously evaluate its thoughts and decisions.

The mind can produce great results through proper training and practice. For example, waking up early is a little difficult and embarrassing for many people. But if one is determined to wake up early and reminds his/her mind about it multiples times, it will ensure he/she would wake up early. Reminding the mind before going to sleep that "I should wake up at five o’clock tomorrow morning" will really wake you up at five o’clock the next morning. If you get up and do some exercise or do some meditation/penance or do your studies, then the mind will slowly get into the groove of waking up early. After doing this for a couple of days the mind makes it a routine. After that you will not be able to sleep after 5 o clock in the morning. This the beauty of the mind. Nothing is impossible for it. But first it has to be put inside the groove. It needs to be sharpened and trained.

Let me share one of my experiences on this topic. I once met a great person. He told me that he had quit smoking. He had had been smoking for about 30 years. Then I said, " I heard that it a very difficult task. How was this possible for you? Also, how can you resist the temptation when the thought of smoking appears again". He replied, "I asked my mind to resist the temptation of smoking the moment I decided to quit. I felt strongly that I have to quit smoking and planted it deeply in my mind. At first it seemed a little difficult. But every time I felt tempted, I reminded my goal to myself. I was not born smoking. I got into it during adolescence. I was quite happy before I got into it. Now after quitting I will be just as happy again." After a couple of weeks, the habit is gone. He saved all the money he used to spend on smoking and bought nice jewelry for his wife. This is an example of great mental strength. You just tell your mind what you want. Remind it multiple times in multiple ways. And you get that.

08-09. రాగస్వరూప పాశాఢ్యా క్రోధాకారాంకుశోజ్వల


అరిషడ్వర్గాలు ఆరు అవి కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యము. మనసు ధర్మ విరుద్ధమైన ఆలోచనలు చేయడానికి ఇవే కారణం. వీటికి రాగద్వేషాలు బీజము. రాగము ద్వేషము వేరుకాదు. ఇవి నాణానికి రెండు వైపులు. రాగం ఉన్నచోట ద్వేషమూ ఉంటుంది. ఇవి మన అభ్యున్నతికి అవరోధాలు.  మనం చేసే కర్మ ధర్మబద్ధమైనపుడు మనం తప్పక విజయం సాధిస్తాం.  కానీ ఇవి మన ప్రయత్నాలలో ధర్మ వైక్లబ్యాలను కల్పించి మనకు దక్కవలసిన విజయము విత్తము  భాగ్యము మనకు రాకుండా చేస్తాయి. లలితమ్మ చేతిలో పాశం ఉంటుంది.  ఆవిడని ప్రార్థించిన వారికి ఆ పాశము ద్వారా రాగద్వేషాల నుండి విముక్తిని ప్రసాదిస్తుంది. అందుకే ఆవిడ రాగస్వరూప పాశాఢ్యా అని పిలవబడుతుంది. అంటే మనసును నిర్మలం చేసి నిలకడ ప్రసాదిస్తుంది. నిలకడ గల మనసు ధ్యానం చేసేటప్పుడు దృష్టిని భగవంతునిపై కేంద్రీకరించ గలదు. అప్పుడు మనము అత్యుత్తమమైన సచ్చిదానందమును అనుభవించగలము. 

కోరిక తీరితే కామము లేకుంటే క్రోధము. ఆశ తీరేది అయితే లోభము లేకుంటే మోహము. మన కన్నా చిన్నవాడు కనిపిస్తే మదము లేకుంటే మాత్సర్యము. ఇలాగా అరిషడ్వర్గాలు మనసుని నిర్లిప్తంగా ఉండకుండా చేస్తాయి. వీటిని అదుపు చేయడం చాలా కష్టం. కానీ అమ్మవారి దగ్గర ఇంతటి  భయంకరమైన మదపుటేనుగును కూడా నిర్వహించగల అంకుశం ఉంది. అందుకే ఆవిడ క్రోధాకారాంకుశోజ్వల. మనసు చాలా ముఖ్యమైనది బలమైనది పదునైనది కూడా.  జ్ఞానేంద్రియాలు , కర్మేంద్రియాలు, శరీరంలోని ఇతర అవయవాలు ఏం పని చేయాలి ఎలా పని చేయాలి ఇదే నిర్దేశిస్తుంది. మనిషి నేర్చుకునే విజ్ఞానాన్ని తనలో దాచుకుని ఆ విద్యతో ఎన్నో ఉపాయాలు అందించి సమస్యలు గట్టెక్కిస్తుంది. ఇంత గొప్ప మనసుని మన జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. చేసే ఆలోచనలు సరి అయినవా కాదా అని లెక్కలు వేసుకుంటూ ఉండాలి. 

మనసుకి ఒక గొప్ప లక్షణం ఉంది. అదే సాధన. దీని ద్వారానే అది ఎన్నో గొప్ప గొప్ప విజయాలు సాధించి పెడుతుంది. ఉదాహరణకి పొద్దున్నే లేవడం చాలామందికి కొంచెం కష్టతరంగానూ ఇబ్బందికరంగానూ ఉండే విషయం. కానీ ఎవరైనా నేను పొద్దున్నే లేవాలి అని దృఢంగా సంకల్పించుకుని రోజంతా  అదే విషయాన్ని తన మనసుకి గుర్తు చేస్తే అది పొద్దున్నే లేవడం జరిగేలా చూస్తుంది. రాత్రి పడుకునే ముందు ఉదయం ఐదు గంటలకు లేవాలి అని పలుమార్లు మనసుకు గుర్తు చేస్తే అది నిజంగానే మరునాడు ఉదయం ఐదు గంటలకు వారిని నిద్ర లేపుతుంది.  వారు లేచి ఏదైనా వ్యాయామో, పూజో లేదా విద్యాభ్యాసము చేశారు అనుకోండి అది చాలా బలంగా నిద్రలేవడం అనే విషయాన్ని తనలో పొందుపరుచుకుంటుంది. ఆ మరుసటి రోజు ఎవరూ గుర్తు చేయకుండానే ఉదయాన్నే లేపుతుంది. అలా రెండు మూడు రోజులు చేశాక దానిని తన అలవాటుగా మార్చేస్తుంది. ఆ తరువాత ఉదయం 5 తర్వాత వారికి ఇక  నిద్ర పట్టదు.  ఇది మనసుకు ఉన్న బలం. అది చేయలేనిది అంటూ ఏదీ ఉండదు. అయితే ముందు దాన్ని సాధనామార్గంలో పెట్టాలి. దానికి పదును పెట్టాలి. అప్పుడది ఏదైనా సాధించిపెడుతుంది.

నాకు సుపరిచితులైన ఒక గొప్ప వ్యక్తి గురించి చెబుతాను వినండి. ఆయనకి ధూమపానం అలవాటు ఉండేది. సుమారు 30 ఏళ్లుగా ఆయన ఆ విలాసాన్ని అనుభవించారు. ఒకరోజు ఆయన నేను ధూమపానం మానేశాను అని నాతో చెప్పారు. అప్పుడు నేను ఇది చాలా కష్టతరమైన పని అని విన్నాను. ఇది మీకు ఎలా సాధ్యమయింది? ఇప్పుడు మానేశాను అంటున్నారు సరే ఉత్తరోత్తరా మళ్లీ అటువంటి ఊహ మదిలో మెదిలితే చలించకుండా ఎలా ఉండగలరు? అని అడిగాను . దానికి ఆయన ఇకనుండి ధూమపానం గుర్తుకొచ్చినప్పుడు నా మనసు చలించ కూడదు. నేను ఆ వ్యాసనం నుండి బయట పడదలచుకున్నాను అని గట్టిగా నా మనసులో అనుకున్నాను. మొదట్లో కొన్నాళ్ళు ఇబ్బంది అనిపించింది. కానీ నా లక్ష్యాన్ని పదే పదే గుర్తుతెచ్చుకున్నాను. ధూమపానం మధ్యలో వచ్చింది. అంతకుముందు కూడా నేను ఎంతో సంతోషంగా ఉండేవాడిని. ఇప్పుడు  మానేశాక కూడా అంతే సంతోషంగా ఉంటాను అని నాకు నేనే ధైర్యం చెప్పుకునే వాడిని. కొంతకాలానికి ఆ అలవాటు పోయింది అని జవాబిచ్చారు. అంతే కాదు ధూమపానం మానేసి తద్వారా దాచిన డబ్బులతో ఆయన భార్యకి నగలు కూడా కొనిచ్చారు. ఇదే మనో బలం అంటే. మనసును మెల్ల మెల్లగా సాధనామార్గంలో పెడితే అది మనల్ని ఎంత కష్టమైనదైన సాధించగలిగేలా చేస్తుంది. 

03. Srimath simhasaneshwari


ఈ సృష్టి అంతా భగవంతుడి అపురూపమైన నిర్మాణ మని మనము రెండవ నామములో తెలుసుకున్నాము. అయితే ఈ సృష్టి అంతటి లోకి అత్యద్భుతమైన అంశం ఒకటి ఉంది. అదే స్వేచ్ఛ. ఈ స్వేచ్ఛ యే కనుక లేకుంటే ప్రకృతి లోని సౌందర్యం మనకు కనబడదు. శబ్దం లోని సంగీతము మనకు వినబడదు. పండ్లలో మాధుర్యము మనకు తెలియదు. అసలు స్వేచ్ఛ లేని చోట  మనిషి జీవితంలో జీవమే ఉండదు. ఇంత ముఖ్యమైన ఈ స్వేచ్ఛన కాపాడడానికి పరిపాలన అవసరం. సరైన పరిపాలన లేకుంటే స్వేచ్ఛ వినాశనానికి దారితీయొచ్చు. అందుకే మానవ వ్యవస్థలో అనాదిగా అనేక రూపాలలో పరిపాలన కొనసాగుతూ ఉంది. పరిపాలనా వ్యవస్థ క్రింది స్థాయి నాయకుల తోనూ వారిపైన మంత్రులతోనూ వారిపైన ముఖ్యమంత్రులతో వారిపైన రాజుల తోనూ వారిపైన రారాజుల తోనూ అనేక స్థాయిలలో ఉంటుంది. ఒక్కొక్క స్థాయిలోని వారికి ఒక్కొక్క నిర్దిష్టమైన ధర్మమ్ ఉంటుంది. వారు దానిని కాపాడుతూ ఉండాలి. ఈరా రాజులందరికీ రాణి మన అమ్మ. ఆవిడ శ్రీమత్ సింహాసనం ఎక్కి అందరినీ పరిపాలిస్తూ ఉంటుంది. బ్రహ్మ విష్ణువు రుద్రుడూ మహేశ్వరుడు ఆమె సింహాసనానికి నాలుగు కోళ్ళు. సదాశివుడు దాని పై కప్పే దుప్పటి. అటువంటి సింహాసనం ఎక్కి జగన్మాత మనందరినీ పరిపాలిస్తుంది.

పరిపాలనా యంత్రాంగంలో ఉన్నవారు ఒక విషయం తప్పక గుర్తు పెట్టుకోవాలి. స్వేచ్ఛను కాపాడుట కొరకు దుష్టశిక్షణ శిష్ట రక్షణ చేయడం మంచి పరిపాలన అవుతుంది. కానీ ఆ స్వేచ్ఛనే హరించేటటువంటి కాఠిన్యము నిరంకుశత్వం అవుతుంది. అది భగవత్సంకల్పం కాదు. కనుక ఎక్కువ కాలం నిలబడదు. 

We learnt in the second name that this whole universe is a wonderful creation of God. The most important element of it is freedom. Without this freedom we would not see the beauty of nature. We cannot hear the music in the sound. We would not enjoy the taste of fruits. With out freedom there is no liveliness in human life. To protect and preserve this freedom, we need governance. Without proper governance freedom can lead to destruction. That is why humans always followed various governance systems through out the history. The governance is established at various levels with lower level leaders, ministers above them, chief ministers above them, kings above them and emperors above them. Those at each level have their own specific dharma. They have to protect it. Divine mother is the queen of all the kings. She ascends the throne called Srimathsimhasana and rule over everyone. Brahma, Vishnu, Rudra, Maheshwara had four pillars on her throne. Sadasiva is the blanket that covers it. Ascending such a throne Divine Mother governs all of us.

Those in the administrative machinery must always remember one thing. The requirement of a governance arises because we want to preserve freedom. That good governance is about punishing the bad and protecting the good. Imposing too many rules and very strict discipline that drains out freedom becomes tyranny. That is not God's will. So it will not last long.

02. Sri Maharajni


Once upon a time there was a well-known scientist. No one could beat him in physics. He conducted many great researches and gained good respect in the society. He was an atheist. He argued that there is no God. The state of creation, nature, the infinite universe, all this is made up of atoms. This is science. He believed that the whole life and creation is just a coincidence and that God has no role in this. He believed that piety is just a superstition. His wife is an ardent devotee. She has good painting skills. She was unhappy with her husband's attitude towards God and devotion. One day she drew a beautiful scenery of nature and showed to it to her husband. Husband said, "Awesome! This looks really beautiful. Your painting skill is really commendable". Then she said, "I played no role in this painting. It's just a coincidence. Some of the atoms randomly joined into some colors and became this painting. This is science. That is it." The scientist was stunned by his wife's reply. He realized that his argument about God was wrong.

See the world around you from where you stand. The floor under your feet. House where the floor is. Street where the house is. The city where the street is. Country where the city is located. The continent where the country is located. The ocean where the continent is. The globe with oceans. The 9 planets of solar system. The sun. Milky Way. The sky that contains all of these. The clouds in that sky. Rain coming from the clouds. The trees that come from it. Fruits coming from them. Organisms caused by them. The Earth's horizon being at an angle of 17 degrees to the Sun. Seasons coming due to this. Farming flourished due to these seasons. Dairy and crops came from it. So many businesses flourishing due to it. All of this is a gigantic dynamic equilibrium. There should not be too much rain nor should it be too little. There should not be high temperatures nor should it be too low. Its a huge earthquake if the earth moves a mere foot. Survival of life is hanging on this delicate balance of nature. Who is maintaining this balance? Waste of animals is food for plants. Fruits from plants are food for animals. Who created this coordination among them? How is man able to learn by himself? Divine mother is the reason behind all of this. She is the queen of all the creation. She created everything, established balance and coordination. Made rules on how to conduct all of this. And gave us freedom. Isn't it great!. That is why she is called Sri Maharajni said.

02. శ్రీ మహారాజ్ఞి


ఒక నగరంలో బాగా పేరు మోసిన వైజ్ఞానికుడు ఉన్నాడు. ఫిజిక్స్లో అతనిని ఢీ కొట్టేవాడే లేడు. ఎన్నో గొప్ప సాంకేతిక పరిశోధనలు చేశాడు. సంఘంలో మంచి గౌరవం సంపాదించుకున్నాడు. అతను నాస్తికుడు. అందరి ముందు నిర్భయంగా దేవుడు లేడు అని వాదిస్తుంటాడు.  జరిగే సృష్టి స్థితి లయ ప్రకృతి అనంత విశ్వం బ్రహ్మాండం ఇదంతా అణువు లతో తయారయింది. ఇది సైన్సు. ఇది ఇలాగే ఎందుకు ఉంది అంటే దానికి సమాధానం ఇది కేవలం యాదృచ్ఛికం అనే చెప్పాలి. అంతేగానీ ఇందులో దేవుడి పాత్ర ఏమీ లేదు. దైవభక్తి కేవలం ఒక మూఢ నమ్మకం అని వాదించేవాడు. అతని భార్యకి గొప్ప దైవ భక్తి. ఆవిడ మంచి చిత్రకళా నైపుణ్యం కలది. దైవభక్తి విషయంలో భర్త ప్రవర్తనకు నొచ్చుకునేది. ఒకరోజు ఆమె  ప్రకృతి సౌందర్యానికి అద్దంపట్టేటటువంటి చిత్రపటం ఒకటి గీసింది.  భర్తకు చూపించింది. అది చూసి భర్త భేష్! చాలా బాగా గీశావు.  నీ చిత్ర కళా నైపుణ్యం శ్లాఘనీయం  అన్నాడు. అప్పుడు ఆవిడ ఆబ్బె! ఇందులో నా పాత్ర ఏమీ లేదండి. ఇది కేవలం యాదృచ్ఛికం. కొన్ని అణువులు రంగులు వాటంతటవే చిత్రపటంలో అమరిపోయాయి. ఇది సైన్సు. అన్నది.  భార్య మాటలకు ఖంగుతిన్న సైంటిస్ట్ తన వాదనలో తప్పు తెలుసుకున్నాడు. 

మీరు నిలుచున్న చోటు నుండి మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడండి. మీ కాళ్ళ కింద ఉన్న నేల. నేల ఉన్న ఇల్లు. ఇల్లు ఉన్న వీధి. వీధి ఉన్ననగరం. నగరం ఉన్న దేశం. దేశం ఉన్న ఖండం. ఖండం ఉన్న మహా సముద్రం. మహాసముద్రాలు ఉన్న భూగోళం. నవగ్రహాలు. సూర్యుడు. పాలపుంత. ఇవన్నీ ఉన్న ఆకాశం. ఆ ఆకాశంలోని మేఘాలు. మేఘాల నుండి వచ్చే వర్షం. దాని నుండి వచ్చే వృక్షములు. వాటినుండి వచ్చే ఫలములు. వాటి వలన వచ్చే జీవములు. భూమి క్షితిజం సూర్యునికి 17 డిగ్రీల కోణంలో ఉండటం. దానివలన వస్తున్న ఋతువులు.  ఆ ఋతువుల వలన సాగే వ్యవసాయం. దాని ద్వారా వచ్చే పాడి పంట . తద్వారా  జరిగే అనేక  వ్యాపారములు. ఇవన్నీ ఒక చరాచర సమతుల్యత.  వర్షం ఎక్కువ అవ్వకూడదు తక్కువ కాకూడదు. ఉష్ణోగ్రత ఎక్కువ అవ్వకూడదు తక్కువ కాకూడదు. భూమి ఒక్క అడుగు కదిలితే పెద్ద భూకంపం. ప్రకృతిలోని సమతుల్యత కొంచెం తప్పినా జీవములకు మనుగడ కష్టమే. మరి ఇంతటి సమతుల్యతను కాపాడుతున్నది ఎవరు? బ్రహ్మాండం విసర్జించేది పిండాండం తీసుకుంటుంది. పిండాండం విసర్జించేది బ్రహ్మాండం తీసుకుంటుంది. వీటికి ఈ సమన్వయం ఎలా వచ్చింది? ఎవరూ నేర్పక పోయినా తనంతట తానే నేర్చుకో గలిగె చైతన్యం మనిషికి ఎలా వచ్చింది? ఇదంతా అమ్మ వల్లే. ఆవిడ యావత్ సృష్టికి రాజ్ఞి. అంతా సృష్టించి, సమతుల్యత, సమన్వయము ఏర్పరిచి, తన శాశనాలతో ఏది ఎలా జరగాలో నిర్దేశించింది. మనకు మాత్రం స్వేచ్ఛనిచ్చింది. అదే ఆవిడ గొప్పతనం. అందుకే శ్రీ మహారాజ్ఞి అన్నారు. 

01. Sri Mata

 


Mother!

Sri  Bammera Potana said like this in Bhagavatam

ammaluganna yamma mugurammala moolaputamma chaala be
ddamma suraarulamma kadupaaradivucchinayamma taanu lo
nammina velputammala manammula nundedi yamma, durga, ma
yamma krupaabdi yicchutha mahatva kavitva patutva sampadal

Every being has a mother. That mother has a mother. That grand mother has a mother. That great grand mother has a mother. Like this, there are so many mothers. Divine mother the spirit of motherhood inside all these mothers. She is the mother of Saraswati, Lakshmi and Parvathi. She is the mother of devatas and Rakshasas. She is the reason for consciousness. She is in the heart and mind of all the local goddesses. I seek her blessings to give me the greatness, poetry and determination required to write this Bhagavatam in Telugu

I also pray the Divine mother to bless me with the talent, energy, devotion and all other required things to write the explanation of these Lalitha sahasranamas. After all her blessings are all we would need to read or write about Her.

Divine mother resolves the trinity of sorrows of her children. Sorrows are of three types. They are:

1. Aadhi bhoutikamu: Sorrows caused due to suffering of ones family or closed ones. Like diseases, snake bites etc
2. Aadhi daivikamu: Sorrows caused by nature. Like fire accidents, earth quakes, floods etc
3. Aadhyaatmikamu: Sorrows caused by diseases and negative feelings inside one's body. 

Divine mother resolves all these. She gives utmost happiness to her children. Hence, she is called Sri mata.

01. శ్రీ మాతా

అమ్మ! 

పోతన గారి భాగవతంలో ఇలా చెప్పారు:

అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ, చాలఁ బె
ద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి వుచ్చిన యమ్మ, తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా
యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వకవిత్వ పటుత్వ సంపదల్

సృష్టి అంతటికీ అమ్మ. పుట్టిన ప్రతీ జీవికి అమ్మ ఉంటుంది. ఆ అమ్మకూ అమ్మ ఉంటుంది. ఆ అమ్మమ్మకూ అమ్మ ఉంటుంది. ఆ ముత్తమ్మకూ అమ్మ ఉంటుంది. ఇలా ఎందరో అమ్మలు. ఈ అమ్మలందరిలోనూ ఉండే మాతృమూర్తే లలితమ్మ. సరస్వతి, లక్ష్మి, పార్వతిలకు కూడా ఆవిడే అమ్మ. దేవతలందరికీ అమ్మ. రాక్షసులందరికీ అమ్మ. జీవములన్నింటిలోను చైతన్యము కలిగించే అమ్మ. గ్రామ దేవతలందరికీ మనస్సులలో ఉండే అమ్మ. అటువంటి అమ్మను ఈ భాగవతం ఆంధ్రీకరించడానికి కావలసిన మహత్వము, కవిత్వము, పటుత్వము కృప చేయమని వేడుకుంటున్నాను. 

నేనుకూడా ఆ అమ్మనే ఈ లలితా సహస్రనామ రహస్యాలకు వివరణ రాయడానికి కావలిసిన, శక్తి, భక్తి, యుక్తి కృప చేయమని వేడుకుంటున్నాను. ఆవిడ గురించి రాయాలన్నా చదవాలన్నా ఆవిడ కృపయే కదా కావలసినది! 

ఎందుకంటే ఈ అమ్మ తన పిల్లల తాపత్రయాలు అన్నీ తీర్చగలదు. తాపత్రయాలు మూడు రకాలు:

1. ఆధి భౌతికము: తమ కుటుంభ సభ్యులకు సంభవించే వ్యాధుల వలన, సర్పవృశ్చికాది బాధల వలన పరితపించుట. 
2. ఆధి దైవికము: ప్రకృతి సిద్ధమైన వాటి వలన కలుగుబాధలు. అగ్ని ప్రమాదం, భూకంపము, వరదలు మొదలైన వాటివల్ల కలుగునవి. 
3. ఆధ్యాత్మికము: తన శరీరంలో పుట్టే రోగములు, అలసత్వము, కపటము, అవిశ్వాసము మొదలైన వాటి వలన కలిగే బాధలు. 

వీటన్నింటినీ శమింపచేసే అమ్మ. తన పిల్లలకు అత్యంత ఆనందాన్ని ఇచ్చే అమ్మ. అందుకే శ్రీ మాతా!

ధ్యాన శ్లోకములు

స్తోత్రం చదివేటప్పుడు మన మనస్సు లగ్నము చేయవలసిన మూర్తిని ధ్యాన శ్లోకంలో వర్ణిస్తారు. 

సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్య మౌళిస్ఫుర 
త్తారానాయక శేఖరాం స్మితముఖీ మాపీనా వక్షోరుహాం 
పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్పలం బిభ్రతీమ్ 
సౌమ్యాం రత్న ఘటస్థరక్తచరణాం ధ్యాయేత్పరామంబికామ్ 

భావం:
ఎటువంటి అమ్మను ధ్యానిస్తున్నానంటే
ఆవిడ వర్చస్సు కాషాయం రంగులో మెరిసిపోతోంది 
కరుణ కురిపించే మూడు కన్నులు ఉన్నాయి 
రత్నఖచితమైన కిరీటం 
దానిపై చంద్రుడు 
ముగ్దులను చేసే చిరునవ్వు 
ఎత్తైన వక్షోజములు 
చేతిలో రత్నములు పొదగబడిన అమృతపు గిన్నె 
ఎఱ్ఱని తామర పూవులు 
శాంతి స్వరూపం 
రత్నములతో అలంకరించిన సింహాసనం 

అరుణాం కరుణాతరంగితాక్ష్మీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపామ్ 
అణిమాదిభి రావృతామ్ మాయూఖై రహ మిత్యేవ విభావయేభవానీమ్ 

భావం:
ఆ దేవి పేరు భవాని
ఆమె వర్చస్సు ఉదయించే సూర్యునివలె ఉంటుంది 
కన్నులు కరుణా తరంగాలు 
చెరుకు విల్లు
పుష్పములతో చేసిన బాణములు 
పాశము, అంకుశము ఉన్నాయి 
గొప్ప అతిరధమహారథులు అందరు ఆవిడ చుట్టూ ఉండి ప్రార్థిస్తున్నారు 

ధ్యాయే త్పద్మాసనస్థామ్ వికసిత వదనాం పద్మపత్రాయతాక్షీమ్ 
హేమాభామ్ పీతవస్త్రామ్ కరకలిత లస ద్ధేమపద్మామ్ వరాంగీమ్ 
సర్వాలంకారయుక్తామ్ సకాలమభయదాం భక్త నమ్రాం భవానీం 
శ్రీ విద్యామ్ శాంతమూర్తిం సకల సురనుతాం సర్వసంపత్ప్రదాత్రీమ్ 

భావం:
ఎవరిని ధ్యానిస్తున్నానంటే
తామరపువ్వు మీద కూర్చుని
ముఖముపైఁ చిరునవ్వుతో
విశాలమైన కన్నులు కల
సువర్ణ మేని గల
ఎఱ్ఱని వస్త్రములు ధరించిన 
చేతిలో బంగారు కాలువ ఉన్న 
సకల కోరికలు తీర్చగల 
చక్కటి వస్త్రాలంకారంతో ఉన్న 
రక్షణనిచ్చే మృదుస్వభావముగల శ్రీవిద్యను
ఆమె అత్యంత శాంతమూర్తి 
దేవదేవులచే కొనియాడబడేది 
ధనధాన్య సమృద్ధినిచ్చేది

సకుంకుమ విలేపనా మలికచుంబి కస్తూరికాం 
సమన్దహసితేక్షణాం సశరచాప పాశాంకుశాం 
అశేషజన మోహినీ మరుణమాల్య  భూషోజ్జ్వలాం 
జపాకుసుమభాసురాంజపవిధౌ స్మరామ్యంబికామ్ 

భావం:
ఎవరిని ధ్యానిస్తున్నానంటే
ఒంటిమీద కాషాయం ఉండి
కస్తూరి పూత గల
చిరునవ్వుగల
ధనుస్సు బాణము పాశము అంకుశము గల
అందరినీ ఆకర్షించగల
ఎఱ్ఱని పువ్వుల దండగల
మంచి అలంకరణగల
ఎఱ్ఱని మందారపువ్వులుగల అమ్మను

మూలకథ

పరమ శివుడు త్రిమూర్తులలో ఒకరు. ఆయన లయకారుడు. ఆయన దక్షుని కుమార్తె సతిని వివాహం చేసుకున్నాడు. దక్షుడు అజ్ఞానం వల్ల శివుని యొక్క భగవత్తత్వాన్ని గ్రహించలేకపోయాడు. అతను శివుడిని కేవలం అల్లుడుగానే చూశాడు. అందుకని నిరంతరం ధ్యానమగ్నుడై ఉండే శివుడిని ఆయన అభినందించలేకపోయాడు. శివుడు సమర్థుడు కాదని భావించి, అతను నిర్వహించే ఒక గొప్ప యాగానికి దక్షుడు శివుడిని ఆహ్వానించలేదు. ఆ నోటా ఈ నోటా దక్షయజ్ఞం గురించి తెలుకున్న సతీదేవి ఆ క్రతువు చూడటానికి వెళతానని శివుడిని అభ్యర్ధించింది. పిలవని పేరంటానికి వెళ్ళుట తగదు అని శివుడు సలహా ఇచ్చాడు. అయితే శివుని  సలహాకు విరుద్ధంగా సతి ఆ యాగానికి హాజరయ్యేందుకు వెళ్లింది. ఆ యాగ సమయంలో దక్ష ప్రజాపతి శివుడిని అవమానించాడు. సతి తట్టుకోలేకపోయింది. యోగాగ్నిలో దూకి తన జీవితాన్ని ముగించుకుంది. ఈ సంఘటన శివుడిని కదలించివేసింది. వీరభద్రుని ద్వారా దక్ష యజ్ఞ వినాశనం చేసి అతను సుదీర్ఘ ధ్యానంలోకి వెళ్లిపోయాడు. సతీ పర్వత (పార్వతి) రాజు కుమార్తెగా మళ్లీ జన్మించింది. యుక్తవయస్సు వచ్చిన తరువాత, ఆమె శివుడిని వివాహం చేసుకోవాలని కోరుకుంటుంది. దాని కొరకై తపస్సు ప్రారంభిస్తుంది. శివపార్వతులిద్దరూ ఒకరికొరకు ఒకరు తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఇంతలో ఇతర దేవతలు సుర పద్మ అనే చాలా గొప్ప శత్రువును ఎదుర్కోవలసి వస్తుంది. ఆ సురాపద్ముడు కేవలం శివపార్వతులకు జన్మించిన  పుత్రుడి చేతిలోనే మరణించగలడనే వరం పొందాడు. అందువలన ఇతర దేవతలు ఎంత ప్రయత్నించినా అతనిని ఓడించలేకపోతారు. శివపార్వతులు  చేస్తున్న అంతులేని తపస్సుకు దేవతలు ఆందోళన చెందుతారు. శివునికి ధ్యానభగ్నం చేసి పార్వతిని పెండ్లాడెలా చేయాలని కామదేవుడిని నియమిస్తారు. మన్మథుడు తన పుష్పబాణాలను శివునిపై ప్రయోగిస్తాడు. దానితో శివునికి ధ్యానభంగం కలుగుతుంది. ఆయన కోపంతో లేచి, మూడవ కన్ను తెరిచి, మన్మథుని బూడిద చేస్తాడు. దేవతలు మరియు మన్మథుని భార్య రతీ దేవి మన్మథుడికి తిరిగి జీవితాన్ని ఇవ్వమని శివుడిని అభ్యర్థిస్తారు. శివపార్వతుల మధ్య ప్రేమ పుట్టించి తద్వారా పుత్ర సంతానం కలిగితే అతని సహాయంతో సుర పద్ముడిని నిర్జించాలనేదే వారి సంకల్పం. కానీ అది ఇలా వికటిస్తుంది. అప్పుడు శివడు ఆ మన్మథ భస్మాన్ని తీక్షణంగా చూస్తాడు. అప్పుడు ఆ బూడిదలోంచి భండాసురుడు బయటపడ్డాడు. అతను మొత్తం ప్రపంచాన్ని నపుంసకుడిగా చేసి, శోణిత పురము అనే నగరం నుండి పరిపాలించాడు. ఈ బ్రహ్మాడం మొత్తంలో ఎవరైనా సరే పోరాటంలో భండాసురుని సవాలు చేస్తే అతను తన ప్రత్యర్థి బలంలో సగభాగం గ్రహించగలడు. అంత భయంకరమైన రాక్షసుడు వాడు. అజేయుడు. దేవతలను ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు. అప్పుడు దేవతలు నారద మహర్షిని కోరగా, మన బ్రహ్మాండము (చిదగ్ని) వెలుపల ఉన్న అగ్నితో యజ్ఞం నిర్వహించమని సలహా ఇచ్చారు. ఆ అగ్నిలోంచి శ్రీ లలితా త్రిపుర సుందరి ఉద్భవించింది.

భండాసురుడిని చంపమని దేవతలు ఆమెను ప్రార్థించారు. ఆమె శక్తి అనంతమైనది కాబట్టి, ఆమె భండాసురుని వరం వలన ప్రభావితం కాదు. ఆమెతో పాటు అనిమ, మహిమ మొదలైన శక్తులు, బ్రహ్మి, కౌమారి, వైష్ణవి, వారాహి, మహేంద్రి, చాముండి, మహా లక్ష్మి, నిత్య దేవతలు మరియు శ్రీ చక్రం లోని అవరణ దేవతలు ఉన్నారు. ఏనుగుల దళానికి సంపత్కారీ దేవి నాయికగా ఉండగా, అశ్వరూడా దేవి అశ్విక దళానికి నాయికగా ఉన్నారు. గిరి చక్ర అనే రథంపై దండిని దండయాత్రను నడిపింది. ఆమె సైన్యాధ్యక్షురాలు. గేయ చక్ర అనే రథంపై మంత్రిని ఆమెకు సహాయపడింది. జ్వాలా మాలిని సైన్యం చుట్టూ అగ్ని వలయాన్ని సృష్టించి రక్షించింది. పరాశక్తి శ్రీచక్ర రథంపై మధ్యలో విహరించింది. నిత్యా దేవి బండాసురుని సైన్యంలోని పెద్ద భాగాన్ని నాశనం చేసింది. బాలా దేవి బండాసురుని కుమారుడిని చంపింది. మంత్రిని మరియు దండిని అతని సోదరులైన విషంగ, విశుక్రులను సంహరించారు. అసురులు ముందుకు దూసుకెళ్తున్న  సైన్యానికి దిగ్బంధనం (జయ విఘ్న యంత్రం) సృష్టించినప్పుడు, శ్రీ లలితా త్రిపుర సుందరి ఆ దిగ్బంధనాన్ని తొలగించడానికి కామేశ్వరుని సహాయంతో గణేశుడిని సృష్టించింది. అప్పుడు బండాసురుడు హిరణ్యాక్షుడు, హిరణ్య కశిపుడు, రావణుడు అనే అసురులను సృష్టించాడు. లలితా దేవి విష్ణువు యొక్క పది అవతారాలను సృష్టించి వారిని నాశనం చేసింది. ఆమె పాశుపతాస్త్రం ఉపయోగించి అతని సైన్యం మొత్తాన్ని చంపింది. కామేశ్వరాస్త్రంతో భండాసురుడిని చంపింది. అప్పుడు దేవతలు లలితా త్రిపురసుందరిని  స్తుతించారు. ఆ తర్వాత ఆమె లోకహితం కోసం మన్మథున్ని పునర్జీవితం చేసింది. లలితా సహస్ర నామంలోని మొదటి 34 శ్లోకాలలో మొదటి 84 పేర్లలో ఈ కథ వివరించబడింది. 

Vyaasa hrudayam

Brahmanda purana mentions many sublime and deep concepts. Lalita Sahasranama is one of them. These names came from the conversation with Hayagriva and Agastya. The subtle intention behind these deep concepts is even more deep. Let us try to understand it with a short story.

Once upon a time, there is a mountain. It is gifted with numerous mines and treasures. It has magnificent natural beauty with many lush fruit bearing trees. Life there is delightful. Many species live there. People living there have abundant grains and other food items. They are blessed with everything except one. Due to the mountainous terrain, they are no freshwater resources. They drink honey, cider, etc. for drinks. Thirst is a disease that is common to all living things on that mountain. 

There is a belief among the people on that mountain that if you climb to the top, you will find something awesome. That it will quench all their thirst. No one knows if this is true or an illusion. It is impossible to reach the pinnacle. That is why no one ever reached there. Yet they continue to put efforts on it. For many generations they have been trying to achieve it with no luck. 

One day a saint started his journey down the mountain instead. There he found a delta area with red soil. A little further on he saw a flowing river. He immediately felt like drinking that water. He drank. Then the thirst that plagued him throughout the life is quenched in a moment. He felt peaceful. That was really awesome. He wanted to know more about it. He worked hard and understood the principles of water. He went up the mountain to share this miracle with his people.

Friends, I found a solution to this thirst that has plagued us all for so many years. He said, "if you come with me, I will show the path to you as well". Is it! How! Asked everyone. "Instead of going up you should travel down. There you will find rivers flowing with pure water." He said, "That water would quench the thirst if you drink it." "River flowing with pure water", what is it? No one has ever seen it! Going down the mountain? No one has ever done anything like this. Our ancestors were always going up the hill. That is what we are following. Going down the hill is unprecedented and unheard. How can we believe you", people said. Few people said, we would like to try it, but not possible right now because of various other obligations. Only a couple of them said we are ready to come with you. Show us the path.

Then the saint carved a sculpture out of stone. It is a beautiful idol of a goddess that has ice cubes from throat to stomach. She is trance with half open eyes and is pleasant. Pot in one hand. And Varada mudra in the other hand. The pedestal of the goddess is made of copper sulphate and the canopy is made of zinc. He named the idol Sajala Devi. He gave her eight other names and called is Ashtottaram. The names are Tapashamani, Nirmala, Malinyaharini, Vidyutprakashini, Agnija, H2O, Aruparoopi, Sheetala. He prescribed them to worship this goddess with these names and left the place with his followers. 

That thirst is our ignorance. Our craze of material possessions is that journey up the hill. That journey down the hill is spirituality. That water is the Atma. That saint is Sage Vyasa. 'Taapshamani' because water removes heat. 'Nirmala' because there are no impurities in water. 'Maalinyaharini' because it washes away the dirt. 'Vidyutprakaashini' because we can generate electricity from it. Agnija because water came after fire at the beginning of creation. H2O because 2 hydrogens combine with 1 oxygen to form water. 'Arooparoopi' because there is no shape but can still be seen. 'Sheetala' because it cools. These are the explanations for the ashtottaram given by that saint. Hydrolysis is carried out with copper sulphate and zinc amalgam. Copper sulphate in the bottom of the pot and zinc amalgam in the top act as the anode cathode. That causes Hydrolysis. That is why the statue is designed like that. The ice cubes indicate that one who drinks water feels cold down the esophagus. The intention of the saint is that one day, these people will find pure water by thinking on these names given to the goddess. The intention of sage Vyasa is that one day we all will be liberated by learning the secrets of the thousand names of goddess Lalitha. So it is prescribed to chant Lalitha Sahasranama and worship the idols described in Dhyana Shlokas. Sage vyasa is equal to God. He embedded beejaksharas in the names of Lalitha devi. He also bequeathed us a bounty of benefits through Lalitha Sahasramnama. 

వ్యాస హృదయం

బ్రహ్మాండపురాణంలో అనేక గంభీరమైన విషయాలను ప్రస్తావించారు. లలితా సహస్రనామం అందులో ఒకటి. ఈ నామాలు హయగ్రీవుడు అగస్త్యముని వారి సంభాషణ నుంచి వచ్చింది. ఇటువంటి గంభీరమైన విషయాలను ప్రస్తావించే కర్త హృదయం మరింత గంభీరంగా ఉంటుంది. ఒక చిన్న కథతో మనం దానిని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం.

అది ఒక ఎత్తైన పర్వతం. అనేకానేక నిధులతో, ఘనులతో, సిరి సంపదలతో ఆ ప్రాంతం విరాజిల్లుతూ ఉంటుంది. ఎన్నో మధురమైన ఫల వృక్షముల తోనూ అద్భుతమైన ప్రకృతి సౌందర్యం ఆహ్లాదభరితంగా ఉంటుంది. ఎన్నో జీవరాసులు అక్కడ నివసిస్తూ ఉంటాయి. అక్కడ నివసించే మనుషులు ధనధాన్య సమృద్ధి తో జీవనం గడుపుతూ ఉంటారు. కానీ వారికి ఏదో తెలియని లోటు. కొండ పైప్రాంతం అవ్వడం వలన అక్కడ శుద్ధ జలం దొరకదు. పానీయంబులు కొరకై అక్కడివారు తేనె, పళ్లరసం మొదలైనవి తాగుతూ ఉంటారు. దాహం అక్కడ నివసించే జీవాలు  అన్నింటిలోనూ సాధారణంగా ఉండే బాధ. దీనికి కారణం శుద్ధమైన జలం దొరకక పోవడమే. 

ఆ కొండ పైకి ఎక్కితే అక్కడ ఏదో అద్భుతం ఉందని. దానిని కైవసం చేసుకుంటే తమ దాహార్తి తీరుతుందని అక్కడ మనుషులకు ఒక నమ్మకం. ఇది నిజమో భ్రమో ఎవరికీ తెలీదు. అనేక జన్మ జన్మలుగా అక్కడివారు ఈ ప్రయత్నం చేస్తూనే పుడుతూ చస్తూ కాలం గడిపేస్తున్నారు. ఆ కొండపై చివరికి ఎక్కడం అసాధ్యం. అందుకే దానిని సాధించి తిరిగి వచ్చిన వారు ఎవరు లేరు. అయినా అక్కడి ప్రజలు ఆ ప్రయత్నం చేస్తూనే ఉంటారు.

ఒకనాడు ఒక సాధువు కొండపైకి కాకుండా కొండ కిందకి వెళ్ళి చూద్దామని ప్రయాణం మొదలుపెట్టాడు. అక్కడ అతనికి ఎర్రమట్టితో ఉన్న డెల్టా ప్రాంతం కనబడింది. ఇంకా కొంచెం ముందుకు వెడితే అక్కడ ఒక నది పారుతూ కనబడింది. ఆ నీటిని చూడగానే అతనికి తాగాలి అనిపించింది.  తాగాడు. అప్పుడు జన్మ జన్మల నుంచి అతనిని బాధిస్తున్న దాహం ఒక్క క్షణం లో తీరి పోయింది. ఎంతో శాంతిని పొందాడు. ఇది నిజంగా అద్భుతం. దీని గురించి ఇంకా తెలుసుకుందాం అనుకున్నాడు. ఎంతో పరిశ్రమించి నీటి తత్వాలు అర్థం చేసుకోన్నాడు. కొండ పైకి వెళ్లి తన వారితో ఈ అద్భుతం గురించి వివరించాలి అనుకున్నాడు. 

 మిత్రులారా మనందరినీ ఎన్నాళ్లగానో బాధిస్తున్న ఈ దాహానికి నేను పరిష్కారం కనుగొన్నాను. నాతో వస్తే మీకు కూడా ఈ దాహం నుంచి ఉపశమనం కలిగించగలను అన్నాడు. అందరూ ఆత్రంగా అవునా! ఎలాగా! అని ప్రశ్నించారు. అప్పుడతను కొండపైకి వెళ్లడం కాదు.  కొండ కిందకి ప్రయాణం చేయాలి. అప్పుడు అక్కడ శుద్ధమైన జలములతో పారుతున్న నదులు కనిపిస్తాయి.  ఆ నదిలో మనందరి దాహం తీర్చే అంత నీరు ఉంది. అవి తాగితే దాహం తీరుతుంది అని చెప్పాడు. అప్పుడు ఆ కొండపైన ప్రజలు శుద్ధమైన జలమా! అది ఉండే నదియా? అదెలా ఉంటుంది?మనం ఎప్పుడూ చూడలేదే! పైగా కొండ కిందకి వెళ్లాలా? ఇలా ఎవరూ ఎప్పుడూ చేయలేదు. మా పూర్వీకులు ఎవరు ఈ మార్గం మాకు సూచించలేదు మీరు ఏదో కొత్త పద్ధతి చెబుతున్నారు. పైగా మేము ఎప్పుడూ ఎక్కడా కనీవినీ ఎరుగని విషయం చెబుతున్నారు.  నదులు అంటున్నారు.  మిమ్మల్ని ఎలా నమ్మాలి అని అడిగారు  కొందరు. మరికొందరు మీరు చెబితే నమ్మాలని ఉంది గాని మేము సంసారంలో ఉన్నాము. ఇప్పుడు అన్నిటినీ వదిలి కొండ కిందకి ప్రయాణం అంటే కుదరదు కదా అన్నరు. చాలా తక్కువ మంది మేము నీతో వస్తాము పదండి అని అన్నారు. 

అప్పుడు అతను రాతితో ఒక శిల్పం చెక్కాడు. అది అందమైన ఒక దేవి విగ్రహం ఆ విగ్రహానికి గొంతులో నుంచి కడుపు వరకు మంచు గడ్డలు ఉన్నాయి.  ఆ దేవి నిమీళిత కళ్ళతో తాప శమనం   పొంది ఆహ్లాదభరితంగా ఉంటుంది. ఒక చేతిలో కుండ. మరొక చేతిలో వరద ముద్ర పట్టి ఉంటుంది. ఆ దేవి పాద పీఠము కాపర్ సల్ఫేటుతోనూ, చ్ఛత్రం జింక్ తోనూ చేసాడు. ఆ విగ్రహానికి సజల దేవి అని పేరు పెట్టాడు. తాపశమని, నిర్మల, మాలిన్యహరిణి, విద్యుత్ప్రకాశిని, అగ్నిజ, హెచ్టుఓ, అరూపారూపి, శీతల అనే అష్టోత్తరం ఇచ్చి అక్కడ మిగిలిన వారితో ఈ దేవిని ఈ అష్టోత్తరంతో నిత్యం పూజించండి. మీకు శుభం కలుగుతుంది అని చెప్పి వెళ్లి పోయాడు. 

ఆ దాహమే మన అజ్ఞానం. కొండ పైకి ఎక్కడమే మన ధనకనకవస్తు వ్యామోహం. కొండ క్రిందకు ప్రయాణమే ఆధ్యాత్మిక దృష్టి. ఆ జలమే ఆత్మ. ఆ సాధువే వ్యాసుడు. తాపాన్ని తీరుస్తుంది కనుక తాపశమని. ఎటువంటి దోషములు ఉండవు కనుక నిర్మల. మట్టిని మాలిన్యాన్ని కడిగేస్తుంది కనుక మాలిన్యహరిణి, జలమునుండి విద్యుత్తు పుడుతుంది కనుక విద్యుత్ప్రకాశిని.  సృష్టి ఆరంభంలో అగ్ని తరువాత నీరు వచ్చింది కనుక అగ్నిజ.  2 హైడ్రోజెన్లు 1 ఆక్సీజను కలిస్తే వస్తుంది కనుక హెచ్టుఓ. రూపం ఉందని లేదని ఏది చెప్పలేము కనుక అరూపరూపి. చల్లగా ఉంటుంది కనుక శీతల. ఇవి ఆ సాధువు ఇచ్చిన అష్టోత్తరముకు వివరణ. కాపర్ సల్ఫేట్ మరియు జింక్ అమాల్గమ్ తో హైడ్రోలిసిస్ జరుగుతుంది. కుండలో క్రింద కాపర్ సల్ఫేట్, పైన జింక్ అమాల్గమ్ పెడితే అవి యానోడ్ క్యాథోడ్ గా వ్యవహరిస్తాయి. హైడ్రొలోసిస్ జరుగుతుంది. అందుకే విగ్రహం అలా రూపుదిద్దారు. తాగగానే గొంతు నుంచి కడుపుదాకా చల్లగా అనిపిస్తుంది కనుక మంచు గడ్డలు పెట్టారు. ఏనాటికైనా ఈ అష్టోత్తరం చదువుతూ ఆ విగ్రహాన్ని పూజిస్తే తన తోటివారితో కూడా చైతన్యం కలిగి దాహం తీర్చుకోవడానికి కొండ క్రిందకు పయనిస్తారనేది ఆ సాధువు హృదయం. ఏనాటికైనా లలితా సహస్రనామాలను చదువుతూ అందులోని రహస్యాలను తెలుసుకుంటూ ధ్యాన శ్లోకంలో ఉన్న మూర్తిని పూజిస్తే మనం ముక్తి పొందుతామనేది వ్యాస హృదయం. వ్యాసులవారు భగవత్సమానులు. లలితా సహస్రనామాలలో బీజాక్షరాలను నిక్షేపించారు. ఇంకా ఎన్నో ప్రయోజనాలను వాటి ద్వారా మనకు అందించాలనేది వారి సంకల్పం. 

లలితా సహస్రనామ పారాయణ ఫలితము

లలితాసహస్రం కామితార్థ ప్రదాయిని. ఎటువంటి కొరికైన సరె, ఎటువంటి సందెహమైనా సరె, ఎటువంటి సమస్యైనా సరె, ఈ స్తొత్ర పరాయనతొ తీరిపొతుంది. అంతటి గొప్ప మహిమ కలది ఈ స్తొత్రం. 

యత్రాపి భోగో న చ తత్ర మోక్షహ్ యత్రాపి మోక్షో న చ తత్ర భోగహ్ |
శ్రీ సుందరీ సేవన తత్పరాణాం భోగ శ్చ మోక్షశ్చ కరస్థ ఎవ ||

సాధారణంగా భోగభాగ్యాలు అనుభవించే వారికి మోక్షము లభించదు. మోక్ష కాముకులకు సిరిసంపదలు ఉండవు. కాని లలితాసహస్రం పారాయన చెయువారికి ఇహము, పరము రెండు సిద్ధిస్తాయి.

సౌందర్య లహరి మొదటి శ్లోకంలో శంకర భగవతపాదులు ఇలా అన్నారు 

ప్రణన్తుమ్ స్తోతుంవా కథమకృత పుణ్యహ్ ప్రభవతి

ఎదో ఒక గొప్ప పుణ్య కర్మ (పూర్వ జన్మలలోనైనా సరె) చేయకుంటే అమ్మా! నిన్ను ఆరాదించాలనే బుద్ధి, నీ గురించి తెలుసుకునే భాగ్యం కలుగుతుందా!అంత గొప్పది ఈ స్తోత్రం. 

ఏవో ఒక 1000 సంస్కృత నామాలు చదివితే అన్ని సమస్యలు ఎలా తీరిపోతాయి? నాకు ఫిజిక్స్ లో కైనెమాటిక్స్ లెక్కలు సరిగా అర్థమవ్వలేదు. లలితా సహస్రం చదివితే అది బోధపడుతుందా? మా ఆఫీసులో మా బాస్ నా మాట పట్టించుకోవట్లేదు. నేను లలితా సహస్రం చదివితే వాడు నా మాట వింటాడా? నేను సుఖంగా బ్రతకాలంటే నాకు ఇంకొన్ని డబ్బులు కావాలి. వస్తాయా? 

వీటికి సమాధానం 'అవును' అనే చెప్పాలి. ఇక్కడ ఒక రహస్యం దాగి ఉంది. అసలు ఒక సమస్య ఎలా ఉంటుందో పరిశీలిద్దాం 

ఉపాయం: ఏ పరిష్కారానికైనా బీజ రూపంలో ఉంటుంది ఉపాయం. ఉపాయం తెలిసిపోతే మనం చకచకా పరిష్కారం ఆల్లేసి సమస్య దాటేయగలము. ఏ సందర్భంలోనైనా పరిష్కారం అంతు చెక్కట్లేదంటే దాని కారణం ఉపాయం తెలియట్లేదు అని అర్థం. 

పధ్ధతి: ఒక్కొక్కసారి పరిష్కారం తెలిసినా దానిని ఎలా అనుసరించాలో తెలియదు. అటువంటి సమయంలో మనకు అనుభవజ్ఞుల సలహాలు అవసరమవుతాయి. 

స్థైర్యం: పరిష్కారం పధ్ధతి తెలిసినా ఒక్కోసారి బలం లేక ధైరం సరిపోదు. 

అదృష్టం: అన్నీ ఉన్నా అదృష్టం లేక పోతే ప్రయత్నం ఫలించదు. 

ఇప్పుడు లలితా సహస్రనామం తో వీటిని ఎలా సాధించగలమో చూద్దాము. 

మనుషులు తమ విజ్ఞానాన్ని తమ మేధస్సులో ఒక గ్రాఫ్ మాదిరిగా దాచుకుంటారు. ఈ గ్రాఫ్ లో విషయాలను నోడ్స్ గానూ వాటి మధ్య సంబంధాలను ఎడ్జెస్ గానూ ఏర్పరచుకుంటారు. ఈ క్రింది బొమ్మ చూస్తే మీకు ఈ గ్రాఫ్ పైన సరైన అవగాహన కలుగుతుంది. 


ఇలా దాచుకున్న తరువాత మనిషి బుద్ధి రంధ్రాన్వేషణ చేస్తుంది. ఈ రంధ్రం ఏర్పడే ప్రక్రియ గ్రాఫ్ లో విషయాల అమరికను మీద ఆధారపడుతుంది. గ్రాఫ్ అమరిక నేర్చుకునే విషయంపై ఆధార పడుతుంది. 

సింహావలోకనం: మనం నేర్చుకునే విషయాన్ని బట్టి మేధస్సులోని గ్రాఫ్ యొక్క అమరిక నిర్ధారణ అవుతుంది. బుద్ధిలోని రంధ్రం ఏ మాదిరిగా ఉంటుందో ఈ గ్రాఫ్ యొక్క అమరిక నిర్దేశిస్తుంది. 

మీ బుద్ధిలో ఎటువంటి సమస్యకైనా ఉపాయం చెప్పగలిగే విధంగా రంధ్రాలు ఏర్పడిపోయాయి అనుకోండి (తెనాలి రామలింగడు లాగ). అప్పడు మీరు ఏ సమస్యకైనా చిటికెలో పరిష్కారం కనుగొన గలరు. లలితా సహస్రంలోని నామాలు ఎలా ఉంటాయంటే, వాటిని శ్రద్ధతో చదివితే, ఆ నామాల యొక్క వివరాలు మన బుద్ధిలో అద్భుతమైన రంధ్రాలు ఏర్పరుస్తాయి. ఉదాహరణకి వ్యోమకేశీ నామం తీసుకోండి. వ్యోమకేశుని అవతారం గురించి సరిగ్గా తెలుసుకుంటే కీనేమాటిక్స్ బోధపడవలిసిందే. మహాలావణ్య శేవధి నామంలోని అమ్మవారి నడక ఊహకందితే బ్రహ్మాండంలో ఎంట్రోపీ తెలిసిపోయినట్లే. అద్భుతం కదా. మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో మీకు తెలియదు. ఎప్పుడు ఎటువంటి సమస్యలు ఎదురుకోవలసి వస్తుందో తెలియదు. అయినా మరేం ఫరవాలేదు. కేవలం లలితా సహస్రనామం చదివితే చాలు. ఏ సమస్యకైనా పరిష్కారం ఇట్టే పసికట్టగలిగే సామర్ధ్యం సంపాదించుకుంటారు. మీరు విజయులవుతారు. 

లలితా సహస్రనామంలో అనేక కధలు ఉంటాయి. ఈ కధల ద్వారా ఎవరెవరు ఏ ఏ పరిస్థితులలో ఏ పద్ధతులు పాటించారో మీకు తెలుస్తుంది. ఈ విషయాలు పెద్దలతో చర్చిస్తే వారి జీవితానుభవంతో మీకు మరింత చక్కటి సలహాలు దొరుకుతాయి. 

మనిషని తన అహమే కుదించేస్తుంది. ఓటమిని అవమానకరంగా భావించేలా చేస్తుంది. ప్రయత్నము, ఓటమి ఎదుగుదలకు మెట్లు అనే భావన కలగనివ్వదు. శ్రీచక్రం, సృష్టి క్రమం, యోగిని దేవతలు మొదలైన విషయాలు తెలుసుకుంటే అహం అణుగుతుంది. సాధారణంగా మనుషులను తమ అహం శాశిస్తుంది. కానీ తన అహాన్ని సైతం శాశించగలిగిన వారే పురుషోత్తములు అవుతారు. విధి లోకం వారి గుప్పెట్లో ఉంటుంది. అదే మీరవుతారు. ఇది తప్పక జరుగుతుంది లలితా సహస్రంతో. 

పుణ్యం వలన అదృష్టం కలుగుతుంది. లలితా సహస్రనామ పారాయణ ఎంతో గొప్ప పుణ్యాన్ని ఇస్తుంది. ఆ విషయాలు పలువురితో చర్చిస్తే వెలకట్టలేనంత పుణ్యం వస్తుంది. పైగా మీరు సమస్త బ్రహ్మాన్దాలకు నాయిక అయిన అమ్మకు చేరువవుతారు. ఆవిడ కరుణా కటాక్ష వీక్షణాల వల్ల మీ జన్మ మంగళ ప్రదంగా మారుతుంది. 

విజయం సాధించడం ఎలా - ఈ పోస్ట్ కూడా చదవ గలరు 

Benefits of Lalitha sahasranama

Reading Lalithaa sahasranama will fulfill all the wishes. No matter how difficult it is, how complex the problem is, how deep a doubt is, Lalitha sahasranama will have an answer to it. Such is the greatness of this stotra

Yatraapi bhogo na cha tatra mokshah yatraapi moksho na cha tatra bhogah |
Sri sundaree sevana tatparaanaam bhogascha mokshascha karastha eva ||

Generally those who are in the path of liberation cannot enjoy material comforts. Those who enjoy material comforts cannot progress in the path of liberation. But those who worship mother Lalitha get the best of both the worlds.

Sage Shankara said like this in the 1st shloka of Soundarya Lahari

Pranantum Stotumva kathamakruta punyah prabhavati

Unless one has a great heap of virtues accrued from all the past births, one would not even get eligibility to learn and worship you O Mother!

You may wonder how can a stotra of 1000 sanskrit names answer questions of about anything on this earth? Like can it answer the problems of kinematics or nuclear physics? If I am struggling to convince my superiors at work, can it help? Or I just want more money to live happily. Can it give? 

The answer is 'Yes'. It can answer all these questions. There is a secret behind this. Let us first understand what all would it take to overcome a typical problem.

Idea: An idea is a key to any solution. Once you get the idea, you can easily frame the solution that can address the problem at hand. When we are struggling to find a solution, it is because we lack the right ideas. This the core of the struggle behind solving problems.

Approach: Sometimes you have the idea and know the solution but have no clue of how to implement it. In those circumstances, you need guidance from friends or elders who had already been through it and can give you tips or share some tricks.

Strength: Sometimes having an idea or knowing the approach is just not sufficient to face a challenge. It might require lot of courage, strength and a steadfast mind. 

Luck: Sometimes even having all the above is not sufficient. You need some luck in order to succeed. 

Let's now see how Lalitha sahasranama can help in these aspects.

Humans store knowledge in the form of a graph. These graphs contain nodes and edges that connect these nodes. The nodes represent various entities and the edges capture the relation between the nodes. Below is figure an example of a knowledge graph. After storing the information in this kind of a graph, the buddhi(intellect) in the brain folds each graph into a logical pattern and stores it for future use. The logical pattern thus formed by a folding operation is the seed for future ideas. The kind of pattern formed is dependent on the structure of the knowledge graph. 

Let us recap - The information you receive now is stored as graph with a specific structure. This graph is folded into a logical pattern. This pattern is used for generating ideas in future. 



So that means, if you now learn about things that lead to formation of useful logical patterns in buddhi, then you are assured to get correct ideas while solving problems in future. Viola! that is the secret. Each name in Lalitha Sahasranama is carefully placed in such a way that if you learn it thoroughly, you will form logical patterns that will generate required ideas that help in solving problems in future. For eg: read the nama Vyomakeshi. You will understand how learning about Lord Vyomakesha will lead to easily solving problems in Kinematics. Read the nama Maha lavanya shevadhi. You will appreciate how learning about Mother's gracious gait leads to explanation of entropy. Isn't this wonderful! You don't know anything about the challenges you are going to face in future. But that need not stop you from preparing for them. By learning Lalitha Sahasranama, you will plant seeds in your brain(logical patterns in the intellect) that will give you the right ideas when you face the challenge. You will equip yourself with a bounty of logical patterns that will help you solving problems in any aspect of life.

You will learn about various stories while reading and discussing Lalitha Sahasranama with others, these stories give clues about various approaches practiced by other in various occasions. Moreover, if you are discussing about Lalitha Sahasranama with someone quite elder to you, you will benefit from all their wisdom and emotional quotient.

Ego is not good for progress. It causes fear of failure. It also pushes you away from taking calculated risks. Under it's influence, you will find it hard to accept that try and fail is a natural way of learning things. By learning about Divine Mother, the sri chakra, the creation etc, you will tame your ego. Make a note that generally people are controlled by their ego. But those who can control their ego take destiny in their hands. That's what you become by learning Lalitha sahasranama.

Virtue leads to luck. You accrue a lot of virtue by learning and discussing Lalitha sahasranama. So you naturally overcome mis-fortune. Moreover, you become close to the omni-potent Divine mother and will enjoy her grace showering on you. So your life will be filled with all and only auspicious things.
Recommended reading - Secret to success

1000. Lalithambika

 


లలిత అనే పదానికి ఈ విధమైన అర్ధాలు చెప్తారు. 1.శోభ, 2.విలాసము, 3.గాంభీర్యము, 4.మాధుర్యము, 5.స్థైర్యము, 6.తేజస్సు, 7.లాలిత్యము, 8.ఔదార్యము 

లలితాంబికా అంటే లలితమైన అమ్మ 

The word Lalitha is generally explained with the following meanings. 1.Shobha = glory, grace, 2.Vilaasamu = pastime, play, merriness, 3. Gaambheeryamu = depth, profundity, magnificence, grandeursublimity, 4.Maadhuryamu = sweetness, pleasantness, 5.Sthairyamu = steadiness, 6.Tejassu = brilliance, luster, splendor, 7.Loveliness, charm, 8.Oudaaryamu = generosity, lierality.

Lalithaambika means mother who has all the attributes of the word Lalitha.

998-999. Shri shiva shivashaktyaikya rupini

 


శివము వేరు శక్తి వేరు కానే కాదు. వారిద్దరు ఒక్కటే. శక్తికీ శక్తి గలవానికి భేదం ఉండదు. పదమునకు దాని భావమునకు భేదం  లేదు. సౌందర్యలహరి మొదటి శ్లోకంలో శంకరాభగవతపాదులు ఇలా అన్నారు

శివశ్శక్త్యాయుక్తో యది భవతి శాక్తః ప్రభవితుమ్ 
నచే దేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి 
అతస్త్వామ్ ఆరాధ్యామ్ హరి హర విరించాదిభిరపి 
ప్రాణన్తుమ్ స్తోతుంవా కథమకృత పుణ్యహ్  ప్రభవతి 

శక్తి లేకుంటే శివం తన స్పందన కోల్పోతుంది. అప్పుడు దాని గురించి మనం ఏమి తెలుసుకోలేము. శివం లేకుంటే శక్తికి ఏ ఆధారం ఉండదు. శివశక్తుల సామరస్యమే ఈ సృష్టి. ఇదంతా వారి తాండవకేళి 

భైరవ యమ్మాళమ్ లో ఇలా చెప్పారు 

చతుర్భి శ్శివచక్రైశ్చ శక్తిచక్రైశ్చ పంచభిః 
శివశక్త్యాత్మకం జ్ఞేయం శ్రీచక్రం శివయో ర్వపుహ్ 

త్రికోణము, అష్టకోణము, దశారద్వయము, చతుర్దశారము. ఈ 5 శక్తి చక్రాలు. బిందువు, అష్టదళము, షోడశ దళము, భూపురము ఈ 4 శివ చక్రాలు. 

త్రికోణంలో బిందువున్నది. అష్టకోణంలో అష్టదళపద్మఉన్నది. దశారయుగ్మములో షోడశదళమున్నది. చతుర్దశారంలో భొపురమున్నది. ఈ రకంగా శివ శక్తుల అవినాభావ సంబంధము నెరిగినవాడే చక్రవిదుడు. అతడే చక్రసంకేతము నెరిగినవాడు. ఈ విషయం తెలుసుకోకుండా ఎన్ని సంవత్యరాలు తపస్సు చేసినా మంత్రం సిద్దించదు.  

The notion of Shiva and Shakti as independent entities is completely wrong. They are one and the same. There is no difference between me and my energy. There is no division between a word and its meaning. Sri Shankara bhagavatpaadaacharya said like this in the 1st shloka of Soundarya Lahari

Shivasshktyaayukto yadi bhavati shaktah prabhavitum
nache devam devo na khalu kushalah spanditumapi
atastvaam aaraadyhaam hari hara virinchaadibhirapi
pranantum stotumvaa kathamakrita punyah prabhavati

With out Shakti, Shivam loses its stimulus. We can never know about Shivam without it. Without Shivam, Shakti loses its basis. The whole creation is their united spirit. It is their partner dance

It is said like this in Bhairava yamaalam

Chaturbhi sshivachakraihscha shaktichakraischa panchabhih
shivashaktyaatmakam gneyam srichakram shivayorvapuh

Trikona, Ashtakona, 2 dashaaras and chaturdashaara are Shakti chakras. Bindu, Ashtadala, shodashadala and bhoopura are Shiva chakraas

Bindu lies in Trikona. Ashtadalapadma lies in Ashtakona. Shodashadala padma lies in the two dashaaras, Bhoopura is in chaturdashaara. This means Shiva and Shakti are always united. One who knows this is knows the essence of SriChakra. Doing penance without knowing this will not be fruitful.

Popular