Search This Blog

ఓ చిట్టి గుండెకాయ్

సందర్భం - ప్రాణాంతకమైన హృద్రోగముతో బాధ పడుతున్న తన కూతురికి ఓపెన్ హార్ట్ సర్జెరీ  చేయించాడు. ఆపరేషన్ చేసిన డాక్టర్ "ప్రాణాలు కాపాడటానికి సాయ శక్తులా ప్రయత్నించాము. పాపకి ఏడాది వయసు ఉండడం వలన గుండె చాలా చిన్నది. ఆడుతూ ఆయాస పడుతూ తన అవుకైనా గుండెని మరింత ఘాయ పరిచేసింది. మేము చేయగలిగినది మేము చేసాము. ఇకపై దేవుని దయ. 72 గంటలు దాటితే కానీ మేము ఎం చెప్పలేము", అని చెప్పారు. పాప icu లో హాయిగా నిద్రిస్తోంది. తనకు వచ్చిన ప్రమాదం ఏమిటో ఎటువంటిదో కూడా ఆమెకు తెలియదు. ఆమెను కాపాడటానికి నలుగురు డాక్టర్లు అహర్నిశలు పోరాడుతున్నారు. హాస్పిటల్ బయట బెంచిపై కూర్చుని ఆ తండ్రి తన పాప గుండెను తలుచుకుంటూ ఉన్నాడు. ఎప్పుడు ఎవరు పిలుస్తారో ఎం కబురు చెప్తారో అని ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు. రాత్రి అయ్యింది. అలా కూర్చుని ఉండగా తెలియకుండా కునుకు పడింది. కలలోకి కృష్ణుడు కనిపించాడు. అభమిచ్చాడు. మరుసటి రోజు పొద్దున్నే పాపా చాల బాగా కోలుకుంది. 

సాగిపో సాగిపోవోయ్  
ఓ చిట్టి గుండెకాయ్
నవ్వుతూ దాటేసేయ్
నూరేళ్ళ మైలురాయి

ఎక్కడో కోటలోపల హాయిగా నిదురిస్తున్న
నీ శబ్దం వినలేక ప్రాకారపు బయటనున్న
గోడపై చేతులదిమి మాలోకపు వెర్రి నాన్న 
నీ జాడను వెతుకుతాడు ఇదేం విడ్డూరమన్న 

శ్రీకృషుడు వచ్చాడు
నీ నుదుటిని నిమిరాడు
నవ్వుతూ చూసాడు
అభయమిదే నన్నాడు 

లక్ష్మివై వచ్చావు
నను ధన్యుని చేసావు
మనసంతా నిండావు
మరో అమ్మవైయ్యావు

నీ లయకు అండగా
ఆంజనేయుడున్నాడు
అనునిత్యం కాపుగా
సత్యదేవుడున్నాడు

నీ నాన్న ఆశీస్సులు
ఉంటాయి నిండుగా
శివ శక్తుల దీవెనలతో
బ్రతుకంతా పండగా

లబ్ డబ్ లబ్ డబ్ అని 
ఓ చిట్టి గుండెకాయ్ 
నవ్వుతూ దాటేసేయ్ 
నూరేళ్ళ మైలురాయి 

No comments:

Post a Comment

Popular