Search This Blog

ధ్యాన శ్లోకములు

స్తోత్రం చదివేటప్పుడు మన మనస్సు లగ్నము చేయవలసిన మూర్తిని ధ్యాన శ్లోకంలో వర్ణిస్తారు. 

సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్య మౌళిస్ఫుర 
త్తారానాయక శేఖరాం స్మితముఖీ మాపీనా వక్షోరుహాం 
పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్పలం బిభ్రతీమ్ 
సౌమ్యాం రత్న ఘటస్థరక్తచరణాం ధ్యాయేత్పరామంబికామ్ 

భావం:
ఎటువంటి అమ్మను ధ్యానిస్తున్నానంటే
ఆవిడ వర్చస్సు కాషాయం రంగులో మెరిసిపోతోంది 
కరుణ కురిపించే మూడు కన్నులు ఉన్నాయి 
రత్నఖచితమైన కిరీటం 
దానిపై చంద్రుడు 
ముగ్దులను చేసే చిరునవ్వు 
ఎత్తైన వక్షోజములు 
చేతిలో రత్నములు పొదగబడిన అమృతపు గిన్నె 
ఎఱ్ఱని తామర పూవులు 
శాంతి స్వరూపం 
రత్నములతో అలంకరించిన సింహాసనం 

అరుణాం కరుణాతరంగితాక్ష్మీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపామ్ 
అణిమాదిభి రావృతామ్ మాయూఖై రహ మిత్యేవ విభావయేభవానీమ్ 

భావం:
ఆ దేవి పేరు భవాని
ఆమె వర్చస్సు ఉదయించే సూర్యునివలె ఉంటుంది 
కన్నులు కరుణా తరంగాలు 
చెరుకు విల్లు
పుష్పములతో చేసిన బాణములు 
పాశము, అంకుశము ఉన్నాయి 
గొప్ప అతిరధమహారథులు అందరు ఆవిడ చుట్టూ ఉండి ప్రార్థిస్తున్నారు 

ధ్యాయే త్పద్మాసనస్థామ్ వికసిత వదనాం పద్మపత్రాయతాక్షీమ్ 
హేమాభామ్ పీతవస్త్రామ్ కరకలిత లస ద్ధేమపద్మామ్ వరాంగీమ్ 
సర్వాలంకారయుక్తామ్ సకాలమభయదాం భక్త నమ్రాం భవానీం 
శ్రీ విద్యామ్ శాంతమూర్తిం సకల సురనుతాం సర్వసంపత్ప్రదాత్రీమ్ 

భావం:
ఎవరిని ధ్యానిస్తున్నానంటే
తామరపువ్వు మీద కూర్చుని
ముఖముపైఁ చిరునవ్వుతో
విశాలమైన కన్నులు కల
సువర్ణ మేని గల
ఎఱ్ఱని వస్త్రములు ధరించిన 
చేతిలో బంగారు కాలువ ఉన్న 
సకల కోరికలు తీర్చగల 
చక్కటి వస్త్రాలంకారంతో ఉన్న 
రక్షణనిచ్చే మృదుస్వభావముగల శ్రీవిద్యను
ఆమె అత్యంత శాంతమూర్తి 
దేవదేవులచే కొనియాడబడేది 
ధనధాన్య సమృద్ధినిచ్చేది

సకుంకుమ విలేపనా మలికచుంబి కస్తూరికాం 
సమన్దహసితేక్షణాం సశరచాప పాశాంకుశాం 
అశేషజన మోహినీ మరుణమాల్య  భూషోజ్జ్వలాం 
జపాకుసుమభాసురాంజపవిధౌ స్మరామ్యంబికామ్ 

భావం:
ఎవరిని ధ్యానిస్తున్నానంటే
ఒంటిమీద కాషాయం ఉండి
కస్తూరి పూత గల
చిరునవ్వుగల
ధనుస్సు బాణము పాశము అంకుశము గల
అందరినీ ఆకర్షించగల
ఎఱ్ఱని పువ్వుల దండగల
మంచి అలంకరణగల
ఎఱ్ఱని మందారపువ్వులుగల అమ్మను

No comments:

Post a Comment

Popular