బుధులచేత అర్చించబడునది. బుధులు అంటే పండితులు జ్ఞానులు అని అర్ధం.
List of all thousand names of Sri Lalitha Devi, a brief description of each name and a detailed description of selected names
నామరూపాత్మకమైన జగత్తును సృష్టిస్తున్నది. అంతటా తానే ఉన్నది. అన్ని జీవులయందు తానే ఉన్నది. ఈ రకంగా అన్ని రూపాలలోనూ ఉన్నది కాబట్టి అమ్మ బహురూపా అనబడుతుంది.
ఈ అద్వైత స్ఫూర్తియే బ్రహ్మ జ్ఞానం. అటువంటి జ్ఞానాన్ని మనలో పుట్టిస్తుంది కనుక బ్రహ్మ జననీ అన్నారు.
You cannot think of Shiva and Shakti as two separate entities. Shiva is Shakti and Shakti is Shiva. When paramaatma wants to express himself it is Prakriti(Nature). Paramatma is present inside every part of prakrithi. So, the body and the soul are not two different entities. Body is Vimarshamsha and soul is Prakaashamsha. They both are part of Paramaatma. That means in reality, there are no two things. It feels like two because of ignorance. Dwaita means 'Being two'. 'A' means 'Not'. Adwaita means 'Not two'.
Realization of Adwaita is knowledge of Brahma. Because she leads to such knowledge, she is called Brahma jananee (mother of Brhama).
సమస్తమైన అంతఃకరణలను నియమించునది. పరమేశ్వరి సర్వజీవుల యొక్క హృదయాకాశములయందు జీవరూపంలో ఉంటుంది. జీవులను సృష్టించి, తాను ఆ జీపులందు ప్రవేశిస్తుంది.
ఐతరేయోపనిషత్తులో “ఈ రకంగా పరబ్రహ్మ జీవకోటిని సృష్టించి, తాను ఆ జీవరాసిలో ప్రవేశించాలి అనుకుంది. అందుకు రెండే మార్గాలు ఉన్నాయి. 1. పై నుంచి 2. క్రింద నుంచి క్రిందనుంచి ప్రవేశించటమనేది సేవకుల లక్షణం కాబట్టి పైనుంచి అంటే బ్రహ్మరంధ్రం ద్వారా శరీరాలలో ప్రవేశించింది" అని చెప్పబడింది. హకార సంజ్ఞగల పరమేశ్వరుడు, సకారసంజ్ఞ గల ప్రకృతితో కలిసి శబళ బ్రహ్మమై, తొమ్మిది ద్వారాలు గల మానవ శరీరము అనే పట్టణంలో ప్రవేశించి, ఇంద్రియాలు, ప్రాణాలు, మనస్సుతో కూడినవాడై, పంజరంలో బంధించబడిన పక్షిలాగా, బయటకు వచ్చే ఉపాయం తెలియక, ప్రాపంచిక బంధనాలలోపడి కొట్టుమిట్టాడుతున్నాడు. అంటువంటి హంస అనబడే జీవుడికి అగ్ని, చంద్రమండలాలు - రెక్కలు ఓంకారము - శిరస్సు జ్ఞాననేత్రము - ముఖము హకార సకారాలు - పాదాలు ఈ రకంగా ఉన్న హంస అనే జీవుడు పాలలో ఇమిడి ఉన్న నెయ్యిలాగా సమస్త ప్రాణికోటిని ఆవరించి ఉన్నాడు. అందుచేతనే అమ్మ సర్వాంతర్యామిణీ అనబడుతోంది.
She is the Lord of all faculties of intuition (The mind, the intellect, Chit and Ego). She is present in the Hridayaakaasha (back of forehead) as soul (jeevatma). She creates beings, enters into them and stay with them till they die.
817. Satyavratha - Paramaatma is the truth. Satya Vratha means to have Paramaatma as the only motive/purpose. To keep steadfast focus on Paramaatma all the time is Satya Vratha.
Story of Satya Vratha from Devi Bhagavatam
Once upon a time, there used to be a scholar named Devadatta in the kingdom of Koshala. He did not have children. So, he decided to perform a yagna on the banks of river Tamasaa. He called Brahma as suhrota of that yagna, Yagnavalka as Aadhvarya, Brihaspathi as Hotha, Gobila as Udgaata and other learned scholars as Rithviks.
Udgaata means the one who chants Vedas. As the yagna was progressing, Gobila was chanting Saama veda at high pitch. At the time when everyone was enjoying the process and the vedic chanting, Gobila's breath stuck for a moment, and he uttered wrong swara.. Devadatta got angry and said, "you fool! I am doing this yagna for a bright and talented son. You made a mistake in vedic chanting out of carelessness. Who is responsible if I get bad results after this Yagna". Gobila said, "Chanting vedas at such high pitch continuously is very difficult. You also know it. I inadvertently mis-spelled a swara. You became so angry for that and called me fool in front of everyone. I am insulted here. So, I am cursing you. You will have a son very soon. But he will be a fool. Even after trying many ways of teaching, he will not learn anything!" Devadatta's dream shattered after hearing the curse. He thought," it is better to not have children than to have my one and only son be such an ignorant fool. What would become of a brahmin who can't learn anything?" He pleaded Gobila to save him and his dynasty. Then Gobila said, "I can't reverse a curse. So, your son will be a born ignorant. But after some time, by Divine Mother's grace, he will become a scholar".
After some time, Devadatta's wife gave birth to a male child. As expected, he was very dull and inactive in studies. He couldn't learn even basics. Other students in the class made a mockery of his intelligence. Unable to sustain those insults, Devadatta's son went to forest and started living in exile. He built a small hut for himself and used sit in Padma asana all day. When hungry, he used to eat whatever, fruits he could get in the forest. He did not talk to anyone. Travelers passing by the hut thought he is doing Satya Vratha and started calling him Satya Vrath.
One day, a hunter came towards Satya Vrath's hut while chasing a wild boar. The boar came running towards him. Looking at it Satya Vrath uttered 'Iem' loudly in a bid to shoo it away. With that the boar went away. The sound of 'Iem' is vakbeeja. Right at that moment, Lord Parameshwara and Mother Parvathi were going that way in the sky. They saw Satya Vrath chanting 'Iem' and blessed him with utmost knowledge and intelligence. Within seconds, Satya vrath became a scholar. Meanwhile, the hunter came to Satya Vrath and enquired about the boar. He had a sense of urgency in his demeanor as he is still chasing the beast. To that Satya Vrath said
817.సత్యవ్రత - సత్యము అంటే - బ్రహ్మ. సత్యమే వ్రతముగా గలది. బ్రహ్మవ్రతమే ప్రియముగా గలది. పరబ్రహ్మసు సేవించే వ్రతాలలో యజ్ఞము శ్రేష్ఠమైనది. యజ్ఞమే విష్ణుస్వరూపమని గతంలో వివరించాం. ఆ విష్ణువు పరమేశ్వరి అంశ సంభూతుడు. యజ్ఞము పరమేశ్వరి స్వరూపము. అందుచేత పరమేశ్వరి సత్యవ్రతా అనబడుతోంది.
ఎల్లవేళల యందు పరమేశ్వరి ధ్యానము, ఉపాసన మొదలైన వాటియందు మనసును లగ్నం చెయ్యటమే బ్రహ్మోపాసన. అదే సత్యవ్రతము. దేవీ భాగవతంలో సత్యవ్రతుని కధ ఒకటుంది. పూర్వకాలంలో కోసలదేశంలో దేవదత్తుడు అనే పండితుడు ఉండేవాడు. అతనికి చాలాకాలం సంతానం లేదు. మిగిలిన పండితులతో ఆలోచించి పుత్రసంతానం కోసం తమసానదీ తీరాన యజ్ఞం చెయ్యటం ప్రారంభించాడు ఆ యజ్ఞానికి. సహోత్రుడు - బ్రహ్మ అధ్వర్యుడు - యాజ్ఞవల్క్యుడు బృహస్పతి - హోత గోబిలుడు - ఉద్గాత సమర్థులైన పండితులు - ఋత్విక్కులు ఉద్గాత అంటే యజ్ఞ సమయంలో సామవేదాన్ని పారాయణ చేసేవాడు. గోబిలుడు వేదాన్ని చక్కగా పారాయణ చేస్తున్నాడు. దేవతలు కూడా దీనికి బాగా సంతోషించారు. కాని ఒక రోజు వేదపారాయణ చేస్తుండగా ఊపిరి పట్టి స్వరం తప్పు వచ్చింది. దానికి దేవదత్తుడు కోపించి “ఓరి మూర్ఖుడా! పుత్రులకోసం నేను యజ్ఞం చేస్తుంటే నువ్వు వేదాం తప్పు చదువుతావా? దానివల్ల నాకు చెడుఫలితం రాదా?" అన్నాడు. ఆ మాటలకు కోపించిన గోబిలుడు "నాకు ఊపిరి పట్టటం వలన స్వరం తప్పు వచ్చింది. అంతేకాని నేను కావాలని తప్పు చదవలేదు. అయినప్పటికీ నన్ను 'మూర్ఖుడు' అన్నావు కాబట్టి నీకు మూర్ఖుడైన కుమారుడే పుడతాడు" అన్నాడు. ఆ మాటలు విన్న దేవదత్తుడు చాలా విచారించి పుత్రులు లేకపోయినా పరవాలేదు. అంతేకాని మూర్ఖుడైనవాడు, విద్యావిహీనుడు అయిన కుమారుడు ఉండి ప్రయోజనం ఏముంటుంది. అంటూ దుఃఖించాడు. ఆ రకంగా శపించినందుకు గోబిలుడు కూడ చాలా చింతించి 'నేను తొందరపడకుండా ఉంటే బాగుండేది. సరే. ముందుగా నీకు మూర్ఖుడు పుట్టినా, పరమేశ్వరి అనుగ్రహంపల్ల తరువాత వాడు గొప్పపండితుడౌతాడు అన్నాడు. దేవదత్తుని భార్య గర్భవతి అయి మగశిశువును ప్రసవించింది. బాలుడికి ఏడు సంవత్సరాలు వయసురాగానే, ఉపనయనం చేసి, వేదం చెప్పటం మొదలు పెట్టాడు. ఎంతకాలమైనప్పటికీ బాలుడికి వేదం రాలేదుసరికదా పలకటానికి నోరు కూడా తిరగలేదు. దాంతో తోటి పిల్లలు ఎగతాళి చెయ్యటం మొదలు పెట్టారు. అది భరించలేని బాలుడు ఇంట్లోనించి వెళ్ళిపోయి గంగానదీ తీరం చేరాడు. అక్కడ తపస్సు చేద్దాము అని అతడి సంకల్పం. కాని ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో తెలియదు. చిన్న పర్ణశాల నిర్మించుకుని ప్రతిరోజూ మధ్యాహ్నందాకా అందులో కదలకుండా కళ్ళుమూసుకుని కూర్చునేవాడు. అపరాహ్ణం వేళ అడవిలోకి పోయి, దొరికిన కాయో పండో తిని మళ్ళీ పర్ణశాలలో అదే స్థితిలో కూర్చునేవాడు. ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. అయితే ఎల్లవేళలా సత్యమే చెప్పేవాడు. అందుచేత అతణ్ణి అందరూ సత్యవ్రతుడు అనేవారు. అలా చాలా రోజులు గడిచినాయి. ఒక రోజు అడవిలో వేటగాడు ఒక పందిని తరుముతూ వస్తున్నాడు. అది అరుచుకుంటూ సత్యవ్రతుడి ఆశ్రమం ప్రక్కనుంచిపోయింది. ఆ పంది చేసిన శబ్దం 'ఐం'కారంలా వినిపించింది సత్యవ్రతుడికి. దాంతో వాగ్బీజమైన ఐంకారాన్ని జపించటం మొదలుపెట్టాడు. సత్యవ్రతుడు. ఆకాశంలో అదే సమయంలో పార్వతీ పరమేశ్వరులు వెడుతున్నారు. సత్యవ్రతుడి దీక్షకు మెచ్చి పాండిత్యాన్ని అనుగ్రహించింది పరమేశ్వరి. వేటగాడు పందిని తరుముకుంటూ వచ్చి సత్యవ్రతుణ్ణి చూసి పంది ఎటుపోయింది అని అడిగాడు దానికి సత్యవ్రతుడు. యా పశ్యతి న సా బ్రూతే యా బ్రూతే సా న పశ్యతి అహో | వ్యాధ | స్వకార్యార్ధిన్ ! కింపృచ్ఛపి పునఃపునః ఓ కిరాతకుడా ! నీ పని కావాలనే కోరికతో నన్ను మాటిమాటికీ అడుగుతున్నావు. చూసే కనులు మాట్లాడలేదు. మాట్లాడే నోరు చూడలేదు. కాబట్టి నేను ఏం చెప్పగలను. ఈ మాటలకు అందరూ ఆశ్చర్యపోయారు. సత్యవ్రతుడు తరువాత కాలంలో పెద్దపండితుడుగా ప్రసిద్ధి చెందారు.శరీరంలో ఇడ పింగళ నాడులున్నాయి. అవి ఉచ్ఛ్వాస, నిశ్వాసలను చేస్తుంటాయి. ఈ శ్వాసక్రియనే హంస అంటారు. 'హం' అంటే ఉచ్ఛ్వాస, 'స' అంటే నిశ్వాస. సమాధికోరే సాధకుడు ఈ శ్వాసను బంధిస్తాడు. అప్పుడు ఆ శ్వాసగమనం ఆగిపోతుంది. ఇలా ఎంత సేపు శ్వాసను దిగ్భందం చెయ్యకలడనేది అతని సాధనమీద అది ఆధారపడి ఉంటుంది. శ్వాసను బంధించి, శ్వాసమీద ఆధిపత్యం సంపాదించి దానిని పూర్తిగా బంధించగలవారు పరమహంస ఆనబడతాడరు. శంకర భగవత్పాదులవారు, శ్రీ రామకృష్ణ పరమహంస మొదలైన వారు.
నిత్యము తృప్తి చెందేది. కేవలం భక్తి మాత్రంచేతనే ప్రీతి చెందేది. తృప్తి అనేది ఆనందం యొక్క లక్షణం. అమ్మ ఆనందమే స్వరూపముగా గలది. కాబట్టి నిత్యతృప్తా అనబడుతోంది. పరమేశ్వరిని అర్చించటానికి అనేక పూజా విధానాలున్నాయి. చతుషష్ట్యుపచారాలు, షోడశోపచారాలు ఈ రకంగా అనేకమున్నాయి. కాని
ఇక్కడ 'పర' అంటే తనను ఆరాధించే వారికి విరుద్ధముగా ప్రవర్తించే వారు లేదా వారికి హాని కలిగించే వారు అని అర్ధం. అంటే మన శత్రువులు ఆవిడకీ శత్రువులే అవుతారన్నమాట. మరి అమ్మ కాపీర్ణం అదే కదా. ఎవరైనా తన పిల్లలకు హాని తలపెడతారని తెలిస్తే ఊరుకుంటుందా? వారి దగ్గరకు వెళ్లి బ్రతిమాలుతుంది, బుజ్జగిస్తుంది, శాశిస్తుంది, ఎదిరిస్తుంది చివరకు తప్పకపోతే సంహరిస్తుంది. కానీ పిల్లవాడి అదృష్టం ఎలా ఉంటే ఆలా జరుగుతుందిలే అని ఊరుకుని మాత్రం ఉండలేదు. ఉండదు. అదే అమ్మ హృదయం.
భండాసురుడు వేసిన జయవిఘ్న యంత్రాన్ని మహాగణపతితో నాశనం చేయించింది. అసురులు వేసిన రాక్షసాస్త్రాలను నాశనం చేసింది.
రోజూ అమ్మ నామం జపించే వారికి ఎటువంటి భయం కలుగకుండా వారిని అహర్నిశలూ కాపాడుతుంది.
అమ్మ ఎడమచేతిలో పాశము అనే ఆయుధమున్నది. అది రాగస్వరూపమైనది. దీనితోనే మానవుడు కట్టివేయబడుతున్నాడు. అనేకానేక కష్టాలు పడుతున్నాడు.
వామకేశ్వరతంత్రంలో ఇలా చెప్పారు మనలో ఉన్న రాగము అనే అనురాగాన్ని అమ్మకు సమర్పించి ఆమెను అర్చించాలి. అప్పుడే శివ సాయుజ్యం సిద్ధిస్తుంది.
అమ్మ ఈ పాశమనే ఆయుధంతో భక్తుల పాశములను తొలగింస్తుంది.
కాళికాపురాణంలో చెప్పినట్లుగా బ్రహ్మ యొక్క రాత్రింపగళ్ళు పర అనబడతాయి. పరబ్రహ్మకు దివారాత్రములులేవు.
వేదంలో చెప్పినట్లుగా
ఇంద్రియాలకన్న మనస్సు శ్రేష్ఠమైనది. మనస్సు కన్న బుద్ధి శ్రేష్టమైనది బుద్ధి కన్న మహత్తు శ్రేష్ఠమైనది. మహత్తు కన్న అవ్యక్తము శ్రేష్ఠమైనది. ఆవ్యక్తము కన్న పరబ్రహ్మము శ్రేష్ఠమైనది. పరబ్రహ్మ కన్న శ్రేష్ఠమైనది ఏదీలేదు. అందుకే ఆమె పరాత్పరా అనబడుతోంది.