శరీరంలో ఇడ పింగళ నాడులున్నాయి. అవి ఉచ్ఛ్వాస, నిశ్వాసలను చేస్తుంటాయి. ఈ శ్వాసక్రియనే హంస అంటారు. 'హం' అంటే ఉచ్ఛ్వాస, 'స' అంటే నిశ్వాస. సమాధికోరే సాధకుడు ఈ శ్వాసను బంధిస్తాడు. అప్పుడు ఆ శ్వాసగమనం ఆగిపోతుంది. ఇలా ఎంత సేపు శ్వాసను దిగ్భందం చెయ్యకలడనేది అతని సాధనమీద అది ఆధారపడి ఉంటుంది. శ్వాసను బంధించి, శ్వాసమీద ఆధిపత్యం సంపాదించి దానిని పూర్తిగా బంధించగలవారు పరమహంస ఆనబడతాడరు. శంకర భగవత్పాదులవారు, శ్రీ రామకృష్ణ పరమహంస మొదలైన వారు.
లలితా త్రిశతిలో 211వ నామము హ్రీంకార దీర్ఘకాహంసీ అని చెప్పబడింది. ధ్యానంలో మునులు శ్వాసను బలహీనపరుస్తారు. మెల్లగా ఊపిరి తీసి వదులుతూ ఉంటారు. శ్వాస కదలికల వలెనే మనస్సు యొక్క సంకల్ప వికల్పాలు జరుగుతూ ఉంటాయి. శ్వాస మందగమనమైతే మనస్సులో కదలికలు తగ్గిపోతాయి. దీర్ఘహంసీ అంటే శ్వాసను మందగమనము చేయటమే. అలా సాధన చేస్తే సాధకుడికి శ్వాస ప్రక్రియ మీద పట్టు వచ్చేస్తుంది. వారు కావాలనుకుంటే ఊపిరి తీస్తారు. అవసరం లేడకుంటే ఆపేస్తారు. అటువంటి వారు పరమహంస అనబడతారు.
అలా ధ్యానం చేసే మునుల మనస్సులో అమ్మ ఉంటుంది.
There are two naadis in our body. They are called 'Ida' and 'Pingala'. They control our breathe cycles. The word Hamsa represents the breath cycle of our body. 'Ham' represents inhalation. 'Sa' represents exhalation. Those who reach the ultimate state of trans pause these breathe cycles. Paramahamsa is the one who triumphed upon breath cycles. Sage Sri Shankaracharya, Sri Ramakrishna are called paramahamsa.
211th name in Lalitha Trishathi is Hreemkaara Deerghahansee. Disturbances in mind are directly related to speed and intensity of breath cycles. When sages sit for meditation, they slow the speed and reduce the intensity of their breathe. So, their mind becomes still. Deerghahamsee means to increase the length of breath cycles. With continuous practice, one acquires total control on breath. They can pause their breathe at their will for whatever period they want to. Such people are called Paramahamsa.
No comments:
Post a Comment