Search This Blog

822-823. Brahma Jananee



శివశక్తులకు అభేదం కాబట్టి, ఆవిడే ఆయన, ఆయనే ఆవిడ. పరమాత్మ ప్రకటీకృతం అవదలచితే ప్రకృతి వచ్చింది. పరమాత్మ సత్యరూపుడై సర్వాంతర్యామి అయి ఈ ప్రకృతి అంతా నిండి నిబిడీకృతమై ఉన్నాడు. ఆత్మ వేరు శరీరము వేరు కాదు. ఆత్మ ప్రకాశంశ శరీరము విమర్శంశ. రెండూ పరమాత్మ యొక్క అంశలే. అంటే ఉన్నది ఒక్కటే. రెండు వేరైన పదార్ధములు కాదు. అజ్ఞానం వలన రెండూ వేరనే భ్రమ కలుగుతుంది తప్ప నిజానికి రెండు కావు. ద్వైత అంటే రెండు 'అ' అంటే 'కాదు'. అద్వైత అంటే రెండు కాదు. 

ఈ అద్వైత స్ఫూర్తియే బ్రహ్మ జ్ఞానం. అటువంటి జ్ఞానాన్ని మనలో పుట్టిస్తుంది కనుక బ్రహ్మ జననీ అన్నారు. 

You cannot think of Shiva and Shakti as two separate entities. Shiva is Shakti and Shakti is Shiva. When paramaatma wants to express himself it is Prakriti(Nature). Paramatma is present inside every part of prakrithi. So, the body and the soul are not two different entities. Body is Vimarshamsha and soul is Prakaashamsha. They both are part of Paramaatma. That means in reality, there are no two things. It feels like two because of ignorance. Dwaita means 'Being two'. 'A' means 'Not'. Adwaita means 'Not two'.

Realization of  Adwaita is knowledge of Brahma. Because she leads to such knowledge, she is called Brahma jananee (mother of Brhama).

No comments:

Post a Comment

Popular