Search This Blog

706. Shastramayi

సరస్వతీదేవియే శాస్త్రము. ఆ దేవిని గురించి తెలుసుకోవాలి అంటే శాస్త్రాలే మనకు ఆధారము. గ్రంథకర్తను గురించి తెలుసుకోవాలంటే గ్రంథాలు ఆధారం. అలాగే సరస్వతిని గురించి తెలుసుకోవాలంటే శాస్త్రాలు ఆధారం. శ్రుతులు, స్మృతులు, శాస్త్రాలు అన్నీ వర్ణమయాలు. పరమేశ్వరి మాతృకావర్ణరూపిణి. కాబట్టి చతుర్వేదాలు.

1. శిక్ష, 2. వ్యాకరణము, 3. ఛందస్సు, 4. నిరుక్తము, 5. జ్యోతిషము, 6. కల్పము, 7. మీమాంస, 8. న్యాయము, 9. పురాణము
10. ధర్మశాస్త్రము

ఇవన్నీ సరస్వతీ స్వరూపమే. అన్ని శాస్త్రాలలోనూ పరబ్రహ్మతత్త్వాన్ని వివరించటం జరుగుతుంది. కాబట్టి సరస్వతీదేవి శాస్త్రమయి అనబడుతోంది.

ఏదైనా ఒక విషయం నిర్ధారణ చెయ్యాలంటే అది శాస్త్రాల ఆధారంగానే జరుగుతుంది.

బ్రహ్మపురాణంలో పరమేశ్వరి శరీరఅవయవాలే శాస్త్రాలు. ఆమె ఉచ్ఛ్వాస నిఃశ్వాసలే వేదాలు. పరమేశ్వరి యొక్క అభిమానంతో - మహామంత్రాలు, మధురాలాపనతో - కావ్యాలు, నాటకాలు, అలంకారాలు, జిహ్వ నుంచి - సరస్వతి, చుబుకమునుంచి - వేదాంగాలు, కంఠం ఊర్ధ్వరేఖ నుంచి - మీమాంస, న్యాయశాస్త్రము, కంఠం మధ్యరేఖ నుంచి - ఆయుర్వేదము, కంఠం చివరి రేఖ నుంచి - చతుషష్టి తంత్రాలు, బాహువుల నుంచి - కామశాస్త్రము. ఈ రకంగా అన్ని శాస్త్రాలు పరమేశ్వరి నుంచే ఆవిర్భవించాయి. కాబట్టి ఆమె శాస్త్రమయీ అనబడుతోంది.

All shastras (applied sciences) are forms of goddess Saraswathi. To know her, one has to learn the shastras. Shrutis, Smurtis and Shastras are made of Varnas. Divine mother is known as matrukavarna roopini. Hence all the four vedas

1.Shiksha, 2.Vyaakarana, 3.Chandassu, 4.Niruktamu, 5.Jyotishamu, 6.Kalpamu, 7.Meemamsa, 8.Nyaayamu, 9.Puraanamu, 10.Dharma shaastramu

All these are forms of Goddess saraswathi. All shastras try to describe parabrahma. So Goddess Saraswathi is called Shastramayi

Shastras are the base to validate/authenticate anything.

It is said like this in Brahma purana - All shastras are Divine mother's body parts. Her breathe is Vedas. Maha mantras came from her pride. Poems, Dramas etc came from her sweet songs. Saraswathi came from her tongue and vedangas came from her chin. There are 3 folds on her neck. Nyaya shastra(Law) and Meemamsa(logic) came from the upper fold. Ayurveda came from the middle fold. All the 64 mantras came from the bottom fold. Kamashastra(Science of love) came from her arms. Like this all the sciences came from Divine mother. Hence she is called Shastramayi.

705. Saraswathi

Saraswathi is the goddess of gnana (knowledge and wisdom). She holds gnana mudra. This nama describes the goddess that gives gnana. She removes the masks of ignorance formed due to dwaita and teaches adwaita. This leads to moksha (liberation).

It is said like this in Matsya purana. Brahma did tapasya with an intention to begin the creation. Then 10 male children and 10 female children emerged from his body. The last one of them is Shata roopa. She is also called Saraswathi.

It is said like this in Brahma Vaivartha purana. Saraswathi came from the tongue of divine mother Radha. 

It is said like this in Rigveda. There was a great war between Indra and Shambarasura. Indra prays Saraswathi to reveal the secrets of Shambarasura's fort. while finding them, Saraswathi gets entrapped in the fort and loses some of her original glory. That is why pure Sanskrit has become Prakritic.

'Ime' (pronounced like 'ime' in chime) is vagbeeja. Those who meditate upon this will acquire knowledge of all sciences.

A story from Devi Bhagavatam - Once upon a time, there used to be a brahmin called Devadatta. He had no children. With an intention to have children, he started putrakameshti yaga on the banks of river Tamasa. suhrota of that yaga is Brahma. Yagnyavalka is adhvarya. Bruhaspathi is hotha and Gobila is udghatha. As the yaga started, Gobila started chanting Sama veda. While chanting, Gobila took an abrupt pause due to breathlessness. That resulted is improper Swara(pitch). Devadatta chided Gobila for that mistake. Gobila could not bear the insult. He said, "chanting vedas at high pitch is not a child's play. It requires lot of effort and concentration. Due to old age, I was unable to hold breath long enough. You shouldn't have spoken to me that way. You disregarded all my good efforts. I am hurt. I am cursing you that you will surely beget a son due to this yaga, but he will be a fool". After sometime, devadatta's wife gave birth to a male child. His name is Utadya. He grew up. But could not learn anything. He failed in all shastras and became unfit for a brahmin. Other brahmins in the society made a mockery of him. Unable to bear it, Utadya ran to the forest and started meditation. One day in the forest, a hunter was chasing a wild boar. It ran away from the hunter and came towards Utadyas ashram. Seeing it Utadya said 'Ime' to shoo it away. Intuitively he started meditation upon 'Ime' from then onwards and became a scholar in many sciences.

It is said like this in Sharada tilakam - You can offer oblations to goddess Saraswathi with the following flowers. Jaji, Malli, Pogada, Tamara, Mandara, Mogali, black Lotus etc. You can use flowers  that blossom as per season. However, you should not use flowers that are worn, stolen, broken, lying with hair/dirt and bitten by insects. You should not pluck flowers after noon.

You will become a genius if you perform havan with red Lotus, Palasha, Bilwa pushpa mixed with honey. 

She is goddess of knowledge. All those sacred books that describe Brahma also talk about her. Rig veda has saraswathi suktam. It also has 10 shloka maha mantras of Saraswathi.

Veenaadhaare! Vipula managala daana sheele!
Bhakaartinaashini virinchi hareesha vandhye!
Keerthi pradem khila manorathe! Mahaare!
Vidyaapradaayini! Saraswathi! Noumi Nityam ||

705. సరస్వతి

సరస్వతి జ్ఞానాధిష్ఠానదేవి. జ్ఞానముద్రాస్వరూపిణి. ఇక్కడ జ్ఞానాన్ని ఇచ్చే సరస్వతి గురించి చెబుతున్నారు. ఈమె విద్యాదేవత. జ్ఞానస్వరూపురాలు ద్వైతభావన నశింపచేసి బ్రహ్మజ్ఞానాన్ని కలిగిస్తుంది. జ్ఞానమనేది అజ్ఞానంతో ఆవరించబడి ఉంటుంది. దీనితో జీవులన్నీ భ్రమిస్తాయి ఆ అజ్ఞానం ఛేదించబడితే జ్ఞానసముపార్జన కలుగుతుంది. అదే ముక్తి.

మత్స్యపురాణంలో సృష్టి చెయ్యాలని బ్రహ్మ తపస్సు చేసినప్పుడు అతని శరీరం నుంచి 10 మంది కుమారులు, 10 మంది కుమార్తెలు ఉద్భవించారు. వారిలో ఆఖరుది శతరూప. ఆమె సరస్వతి అని చెప్పబడింది.

బ్రహ్మవైవర్త పురాణంలో సృష్టి కోసం రాధ తన నాలిక నుండి ఒక కన్యను ప్రసవించింది. ఆమె సరస్వతి అని చెప్పబడింది.

ఋగ్వేదంలో ఇంద్రునికి, శంబరాసురునికి యుద్ధం జరుగుతుంది. ఇంద్రుడు కోటలోని రహస్యాలను చెప్పమని సరస్వతిని ప్రార్ధిస్తాడు. అప్పుడు సరస్వతి శంబరుని కోటలో చిక్కుకుంటుంది. అందుచేత ఆమె తన పూర్వపు ఔన్నత్యం కోల్పోయింది. కారణంగానే శుద్ధవైదికమైన సంస్కృతం ప్రాకృతంగా మారిపోయింది అని చెప్పబడింది.

ఐం అనేది వాగ్బీజము. దీనిని జపించినవారు సర్వశాస్త్ర పండితులౌతారు.

దేవీ భాగవతంలో ఒక కధ - పూర్వకాలంలో కోసలదేశంలో దేవదత్తుడనే బ్రాహ్మణుడుండేవాడు. అతడికి సంతానం లేదు. అందుచేత పుత్రకామేష్ఠి చెయ్యాలనుకుని తమసానదీ తీరాన యాగం ఆరంభించాడు. ఆ యాగానికి వేదవేదాంగవిదుడైన సుహోత్రుడు - బ్రహ్మ యాజ్ఞవల్క్యుడు - ఆధ్వర్యుడు, బృహస్పతి - హోత, గోబిలుడు - ఉద్గాత. యాగం ఆరంభమైంది. గోబిలుడు సామవేదాన్ని గానం చేస్తున్నాడు. దేవతలు కూడా ఆ గానానికి ముగ్ధులవుతున్నారు. కాని మధ్యలో చిన్న పొరపాటు జరిగింది. ఊపిరి పట్టటంవల్ల గోబిలుడికి స్వరం తప్పింది దాంతో కోపించిన దేవదత్తుడు గోబిలుని మూర్ఖుడా ! అని సంబోధించాడు. దానికి కోపించి గోబిలుడు “నీకు మూర్ఖుడైన కుమారుడే కలుగుతాడు" అని చెప్పి వెళ్ళిపోయినాడు. యజ్ఞం పూర్తయింది. దేవదత్తుని భార్య గర్భవతి అయింది. పండంటి మగబిడ్డను ప్రసవించింది. ఏళ్ళు గడిచినాయి. బాలుడికి విద్యరాలేదు. పిల్లలు అందరూ ఎగతాళి చేస్తున్నారు. అది భరించలేక అడవికి వెళ్ళిపోయాయి. అక్కడ తపస్సు చెయ్యటం ప్రారంభించాడు బాలుడు. అడవిలో ఒక వేటగాడు పందిని కొట్టి దాని వెంట పరుగెడుతున్నాడు. అది అరుస్తూపోయి ఈ బాలుడి (ఉతద్యుని) ఆశ్రమం ప్రక్క నుంచి పారిపోయింది. పంది అరిచిన అరుపు ఐం వాగ్బీజంగా వినిపించింది బాలుడికి. దాంతో అతడు 'ఐం' బీజోపాసన మొదలు పెట్టాడు. పార్వతీ పరమేశ్వరులు అతడి దీక్షకు మెచ్చి అతణ్ణి సర్వశాస్త్ర పండితునిగా అనుగ్రహించారు. కాబట్టి ఆ దేవిని అర్చిస్తే పాండిత్యం అబ్బుతుంది. వేదవేదాంగాలు ఉపనిషత్తులు సర్వశాస్త్రాలు, సంగీతము, సాహిత్యము అబ్బుతాయి.

ఈ దేవిని అర్చించటానికి జాజులు, మల్లెలు, మొల్లలు, పొగడలు, తామర, మందార, మొగలి, నల్లకలువపూలను, ఆ ఋతువులలో పూచే పూలను మాత్రమే వాడాలి. అని శారదా తిలకం చెబుతోంది. ఎర్రకలువలు, పలాశ, బిల్వపుష్పాలను తేనెతో కలిపి హవనం చేస్తే మహామేధావి అవుతాడు. బృహస్పతితో సమానమైన వాడవుతాడు. అని తంత్ర గ్రంథాలలో చెప్పబడింది. అయితే మలినమైనవి, వాడిపోయినవి, నేలమీదపడినవి, సగము విరిగినవి, పురుగులున్నవి, ఎలుకలు కొరికినవి, వెంట్రుకలతో కలసినవి, దొంగిలించిన పుష్పాలు పూజకు వాడరాదు. మధ్యాహ్నం తరువాత పూలను కోయరాదు. అని శారదాతిలకంలో చెప్పబడింది.

ఈమె చదువులతల్లి, ఈ దేవత బ్రహ్మస్వరూపిణి. బ్రహ్మను గురించి చెప్పే గ్రంథాలన్నీ కూడా సరస్వతీ రూపంలోనే పూజింపబడతాయి. ఋగ్వేదంలో సరస్వతీ సూక్తము ఉన్నది. అలాగే సరస్వతీ దేవి దశశ్లోక మహామంత్రాలున్నాయి. ఇవన్నీ ఋగ్వేదంలో ఉన్నాయి.

వీణాధరే ! విపులమంగళదానశీలే !
భకార్తినాశినివిరించి హరీశవంద్యే !
కీర్తిప్రదేం ఖిల మనోరథదే ! మహారే !
విద్యాప్రదాయిని ! సరస్వతి ! నౌమి నిత్యమ్ ||

704. sarvamohini

సర్వులను మోహింపచేయునది. ద్వైతబుద్ధి కలవారిని మోహింపచేస్తుంది. అద్వైతులు జ్ఞానులు. జీవాత్మ, పరమాత్మ రెండూ ఒకటే అని నమ్మేవారు. ద్వైతులు జీవుడు వేరు, దేవుడు వేరు అని నమ్మేవారు. ఈ ద్వైతులను మోహింపచేస్తుంది.

కూర్మపురాణంలో ఈ పరాశక్తి నా రూపము గలది. బ్రహ్మరూపిణి. ఆమె మాయ. ఈ జగమంతా ఆమెచే మోహితమవుతున్నది అని చెప్పబడింది.

64 తంత్రాల ద్వారా లోకంలో ఐహికవాదులనందరనీ మోహింపచేస్తున్నది శుద్ధ బ్రహ్మను ఆవరించి ఉన్న మాయయే నిజమని నమ్మేవారిని మోహింపచేస్తుంది. జగత్తంతా మాయామయమని తెలిసినవారు జ్ఞానులు. వారికి సాయుజ్యం లభిస్తుంది.

దేవతలు, రాక్షసులు క్షీరసాగరమధనం చేసినప్పుడు అమృతం పుట్టింది. ఆ అమృతం కోసం దేవతలు రాక్షసులు తగవులాడుకుంటుండగా మోహిని వచ్చి రాక్షసులనందరినీ సమ్మోహనంచేసి అమృతాన్ని దేవతలకు పంచింది. ఈ రకంగా అజ్ఞానులను, ఆత్మజ్ఞానం లేనివారిని సర్వులను మోహింపచేస్తుంది. కాబట్టి సర్వమోహినీ అని చెప్పబడింది.

Mohamu means delusion. A state of mind in which one loses the ability to find out the reality. Those who believe in dwaita philosophy are subject to delusion. They think there are two different classes. God and living beings. This is ignorance.

It is said like this in kurma purana - The entire world is subject to delusion caused by Divine mother. It is called Maya.

Those who dont believe in the spirit and always think about material pleasures are subjected to delusion. There are 64 tantras that cause this delusion. Those who realize this maya go beyond it and attain moksha.

Divine mother cleverly delusioned rakshasas while distributing amruta when she came in mohini avatara. Rakshasas were attracted to her beauty and lost awareness of amruta being distributed to devatas.

703. Sarvaga

Divine mother is not confined to  a period or place. So she is called sarvantaryaami. Devi Gita also has a similar meaning. 

Sarvam drushyam mama sthaanam sarve kaalaa prataatmakah |
Utsava sarva kaaleshu yatoham sarva roopinee ||

I am the head of everything. I am space and time. I am all the kaalas. Everything is filled with me. Senses get their power from me. 

It is said like this in devi puranam. Vedas, Yagnas, Heaven, Earth and the whole universe are filled with parabrahma. All liquids are filled with it. All animals are filled with it. All birds, insects, plants, mountains everything is filled with para brahma. 

Upanishaths also tell the same. It is said like this in Chandogya upanishath: All the four directions in this universe are the 1st part of para brahma. Land, sky, oceans, mountains, rivers are its 2nd part. Fire, sun, moon, Lightening in the sky etc are 3rd part of parabrahma. Life, senses, mind etc are its 4th part.

Agnis explained attributes of parabrahma to Upakoshala like this. Sun, moon, sky, earth etc are deformations of parabrahma. The element of parabrahma present in sun and the one in me are same. All the directions, stars, the five elements and myself share the same elements of parabrahma. The lightening in the sky and myself share the same element of parabrahma. 

Uddalaka's son swethakethu finished his graduation and asked his father to teach him about parabrahma. Uddalaka asked him to fetch a fruit of the banyan tree. He did it. Uddalaka asked him to break it. He did it. Uddalaka asked, "Whats inside"?. He said,"seeds". Uddalaka said,"Break the seed and tell me what's inside". Swethakethu said "nothing". Uddalaka said, "So is this huge banyan tree coming out of nothing? No. There should be something in this small seed that is able to create this huge banyan tree. That is parabrahma. You can't see it with eyes. You have to experience it". Uddalaka further asked Swathakethu to get some salt and two glasses of water. Swethakethu did it. He mixed salt in one glass and asked Swethakethu to keep them aside. Next morning, Uddalaka asked Swethakethu to find out which glass has salt. He could tell it by mere visual inspection because salt is dissolved in the water. So he tasted the water to find out. Then Uddalaka said, "Just like this salt, parabrahma is dissolved in this whole universe. It is dissolved inside you. To find it out you should meditate and experience it. It is not visible to your eyes"

703. సర్వగా

పరమేశ్వరికి దేశము, కాలము వంటి హద్దులులేవు. కాబట్టి ఆమె సర్వాంతర్యామి. అదే విషయాన్ని ఇక్కడ సర్వగా అని చెప్పారు. దేవీగీతలో

సర్వం దృశ్యం మమ స్థానం సర్వే కాలా ప్రతాత్మకాః |
ఉత్సవా సర్వకాలేషు యతో2 హం సర్వరూపిణీ ||


అన్నింటికీ అధిష్టానము నేనే. దేశకాల వస్తువులన్నీ నేనే. కాలములన్నింటి యందు నేనే ఉన్నాను. దేశములన్నింటి యందు నేనే ఉన్నాను. ఇంద్రియాలకు అనుభవము నా వల్లనే వస్తున్నది అని చెప్పబడింది.

దేవీ పురాణంలో దేవియే వేదము, దేవియే యజ్ఞము, దేవియే స్వర్గము, చరాచర జగత్తంతా ఆమె చేతనే వ్యాపించబడిఉన్నది. లోకంలో అన్నపానీయాలు ఆమె స్వరూపమే పశువులు, పక్షులు, చెట్లు, చేమలు, కొండలు, బండలు అన్నీ ఆమె స్వరూపమే కాబట్టి ఆమె సర్వాంతర్యామి సర్వగా అనబడుతోంది.

ఉపనిషత్తులు కూడా ఈ విషయాన్నే ప్రతిపాదిస్తున్నాయి. ఛాందోగ్యోపనిషత్తులో సత్యకామ జాబాలికి పరబ్రహ్మస్వరూపాన్ని గురించి వివరించి చెప్పటం జరిగింది. ఈ విశాలమైన ప్రపంచంలో నాలుగుదిక్కులూ బ్రహ్మతత్త్వంలో ఒక భాగం. భూమి, ఆకాశం, సముద్రాలు, పర్వతాలు, నదులు అన్నీ రెండవభాగం అగ్ని, సూర్యుడు, చంద్రుడు, విద్యుల్లతలు అన్నీ పరబ్రహ్మలో మూడవభాగం. ప్రాణం బ్రహ్మ, దృష్టి బ్రహ్మ, శ్రవణం బ్రహ్మ, మనస్సు బ్రహ్మ ఇది నాల్గవభాగం.

ఉపకోశలుడికి అగ్నులు బ్రహ్మతత్త్వాన్ని వివరిస్తాయి. భూమి, సూర్యుడు, చంద్రుడు, ఆకాశం అన్నీ పరబ్రహ్మ యొక్క రూపాంతరాలే. సూర్యునిలో ఉన్న బ్రహ్మతత్త్వం, నాలో ఉన్న బ్రహ్మతత్త్వం ఒకటే. నాలుగు దిక్కులు, నక్షత్రాలు, నేల, నీరు, నింగి వీటిలో ఉన్న బ్రహ్మతత్త్వము, నాలో ఉన్న బ్రహ్మతత్త్వము ఒకటే. ఆకాశంలోని మెరుపులో ఏ తత్త్వమైతే ఉన్నదో, అదే నాలోనూ ఉన్నది. అదే చరాచరజగత్తంతా వ్యాపించి ఉన్నది. అదే బ్రహ్మతత్త్వము.

ఉద్దాలకుని కుమారుడు శ్వేతకేతువు. విద్యాభ్యాసం పూర్తిచేసి బ్రహ్మవిద్యను ఉపదేశం చెయ్యమని తండ్రిని అడిగాడు. తండ్రి అయిన ఉద్దాలకుడు చెబుతున్నాడు నాయనా శ్వేతకేతూ ! ఒక మర్రిపండును తీసుకునిరా అన్నాడు ఉద్దాలకుడు. మర్రిపండు తెచ్చాడు శ్వేతకేతు 'దాన్ని పగులగొట్టు' అన్నాడు తండ్రి. పగులకొట్టాడు కుమారుడు 'అక్కడ ఏం కనిపిస్తోంది ?' అడిగాడు తండ్రి. 'చిన్నచిన్న గింజలు కనిపిస్తున్నాయి' అన్నాడు శ్వేతకేతు 'ఒక గింజను తీసి పగులకొట్టు' గింజలు పగులకొట్టాడు శ్వేతకేతు. ఏముందక్కడ ?' ప్రశ్నించాడు ఉద్దాలకుడు. 'ఏమీ కనిపించటం లేదు' అన్నాడు కుమారుడు. ఇంత పెద్ద మర్రిచెట్టు శూన్యంలో నుంచి రాదుకదా ? ఆ గింజలో ఏమీలేదని చెప్పావు. కాని అందులో ఇంత పెద్దమ్రాను, కొమ్మలు, రెమ్మలతో ఉన్న ఈ చెట్టుకు కారణమై, నీకు కనిపించని జీవపదార్ధమున్నది. అదేవిధంగా, బయటకు కనిపించకుండా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్న ఆత్మ సర్వత్రా వ్యాపించి ఉన్నది. అన్నింటికీ ఆధారమైనది, ఉండి కూడా మనకు కనిపించదు. నీకు ఒక్క విషయం చెబుతాను విను. కాస్త ఉప్పు తీసుకుని ఒక గ్లాసు నీటిలో కలుపు. రేపు ఉదయం రా' అన్నాడు ఉద్దాలకుడు. తండ్రి చెప్పిన ప్రకారం నీళ్ళలో ఉప్పుకలిపి మర్నాడు వచ్చాడు శ్వేతకేతు. అప్పుడు ఉద్దాలకుడు. “శ్వేతకేతూ ! నిన్న నీళ్ళలో కలిపిన ఉప్పును తీసుకుని రా! " అన్నాడు. ఆ ఉప్పునీటిలో బాగా కలిసిపోయింది. దాన్ని విడదీయటం సాధ్యంకాదు. ఆ మాటే చెప్పాడు శ్వేతకేతు. “అయితే సరే ! ఆ నీళ్ళు ఒకసారి రుచిచూడు' అన్నాడు తండ్రి. 'నీళ్ళు చాలా ఉప్పుగా ఉన్నాయి' అన్నాడు కుమారుడు. 'కుమారా ! నీళ్ళలో ఉప్పు కలిసిపోయినట్లే ఆత్మ అన్ని వస్తువులలోనూ కలిసిపోయి ఉంటుంది. అది సర్వాంతర్యామి' అన్నాడు ఉద్దాలకుడు. ఈ రకంగా పరమేశ్వరుడు సర్వవ్యాపి. చరాచరజగత్తంతా ఆవరించి ఉన్నాడు. పరమేశ్వరుడు, పరమేశ్వరి ఇద్దరూ ఒకటే. కాబట్టే ఆమె సర్వగా అని చెప్పబడుతోంది.

702. Desakaalaparischinna

దేశముచేతగాని, కాలముచేతగాని కొలవబడినదికాదు. హద్దులు లేనిది. ఎల్లలులేనిది. కాలము లేనిది. అంటే ఇంతకాలము ఉంటుంది అని కొలతలేనిది. లోకంలో ప్రతివారికీ ఆయు:ప్రమాణమున్నది. మానవుడి ఆయువు వందసంవత్సరాలు. బ్రహ్మ ఆయువు ఒక కల్పం. అయితే పరబ్రహ్మకు మాత్రం ఆయువులేదు. త్రిమూర్తులను కూడా నియమించింది ఆమెయే. సృష్టికి ప్రారంభమందున్నది ఆమె. మహాప్రళయం తరువాత ఉన్నది కూడా ఆమె. కాబట్టి పరబ్రహ్మ నిత్యము సత్యము అయినది. శాశ్వతమైనది. చావుపుట్టుకలు లేనటువంటిది. యుగాలు మారినా, జగాలు మారినా, కల్పాలుమారినా ఆ పరబ్రహ్మ మాత్రం అలానే ఉంటుంది. కాబట్టి కాల అపరిచ్ఛేదం లేదు.

పంచభూతాలలో భూమిలో ఉన్నది. లేదా వాయువులోనే ఉన్నది. ఆకాశంలో మాత్రమే ఉన్నది అని చెప్పటానికి వీలులేదు. ఆత్మ సర్వత్రా వ్యాపించి ఉన్నది. అందుచేత దేశాపరిచ్ఛిన్నములేదు.

అందుచేతనే దేశకాలములచే దానికి అపరిచ్ఛేదములేదు. అసలు వీటన్నింటికీ కారణమైనది ఆత్మే అదే అమ్మ. పరబ్రహ్మ స్వరూపము. తాను తప్ప మిగిలినదంతా మాయ.

కఠోపనిషత్తులో చెప్పినట్లుగా "అనిత్యమైన శరీరాల మధ్యన శరీరంలేనిదిగా, అశాశ్వతమైన వాటి మధ్య శాశ్వతమైనదిగా ఉంటుంది. ఆత్మ నిత్యము, సత్యము, సర్వవ్యాపకమైనది".

Parabrahma is not constricted to a particular period or place. It is everlasting. Boundless. Everything in this creation has an expiry date. A human's life span is 100 years. Brahma's life span is 1 kalpa. However, we cannot assign such life span to parabrahma. It is there before the creation ever begun. It is there after the apocalypse. Hence it is the everlasting truth. It neither has a birth date nor a death date. No matter how far you travel in time. To the past or to the future. Parabrahma is always there. So it is not constricted by time.

Parabrahma is in earth. It is in sky. In air and Fire. It is in water. It is present in all the five elements. It is everywhere. It is not constricted in space.

So it is described as not constricted by time or space. Actually, all these five elements, subtle thanmatras, time etc are born from parabrahma. It is the reason why these exist. That is Divine Mother. That is Parabrahma. That is truth. Rest all is illusion.

Kathopanishath - It is present as an imperishable among the perishables. (Atma inside our body).

701. Satchidanandaroopini

సత్ చిత్ ఆనందరూపము గలది. పరబ్రహ్మ స్వరూపిణి.

కాలబాధ్యమైనది కాబట్టి - సత్
జ్ఞానస్వరూపమైనది కాబట్టి - చిత్
నిరతిశయ ఆనందస్వరూపం కాబట్టి - ఆనందము.
ఈ మూడు పరబ్రహ్మ లక్షణాలు. సావిత్రి అనే ఈ దేవత పరబ్రహ్మ స్వరూపిణి అని చెబుతున్నారు. ఆమెను అర్చించిన వారికి పరమసుఖాన్నిస్తుంది అంటూ సావిత్రీవిద్యను వివరించారు. 670 నుండి 700 వరకు ఉన్న నామాలు సావిత్రీ విద్య.

Sat, Chit and Ananda are the true forms of Savitri. She is para-brahman

Sat - One that is present always
Chit - The real form of Gnana or consciousness
Ananda - Pleasure, Joy, Happiness

These three are the attributes of para-brahman. Those who worship Savitri attain the supreme happiness and moksha. The names 670 - 701 explain Savitri Vidya

700. Savitri

సవితా సర్వభూతానాం సర్వభావాన్ ప్రసూయతే
సవనా త్పావనా చ్చైవ సవితా తేన చోచ్యతే
సవిత అంటే జగత్తులను సృష్టించేవాడు. జీవకోటికి సర్వభావాలు కలిగించేవాడవటంచేత సవిత అనబడతాడు. అతని శక్తి సావిత్రి.
Sarvabhootaanam, sarva bhaavaan prasooyate
savana tpavana chaiva savita tena chochyate
Savita means the one who creates. He gives the stimulus to all beings. Savitri is his shakti

బుద్ధిః కర్మాణి వా2 స్మాకం యః ప్రేరయతి తస్య తు దేవస్య సవితుః ఖ్యాతమ్
జీవుల యొక్క బుద్ధిని, కర్మను ప్రేరేపించువాడు సవిత అనబడతాడు.
Buddhih karmaani vaasmakam yah prerayati tasya tu devasya savituhkhyatam
Savita is the one who is motivates buddhi and karma

త్రిదశై రర్చితా దేవీ వేదయోగేషు పూజితా
భావశుద్ధిస్వరూపా చ సావిత్రీ తేన సా స్మృతా ||
దేవతలచేత పూజింపబడేది. యోగమార్గంలో ఆరాధించబడేది. స్మృతులచే కొనియాడబడేది శుద్ధమైనది సావిత్రి అనబడుతుంది.
Tridashairarchitaa devi vedayogeshu poojita
bhaavashuddiswaroopaa cha saavitri tena sa smruta
The who is worshipped by all devatas. The one worshipped by yogi's and yati's. The one described by smritis. Is Savitri. She is pure.

సావిత్రీపుష్కరేనామ్నా తీర్ధానాం ప్రవరే శుభా
పుష్కర తీర్ధంలోని దేవతసావిత్రి
Savitri pushkarenamna teerdhaanam pravare shubha
The devata on the banks of a Pushkara is called Savitri

699. Sarvaarthadhaatri

సకల పురుషార్థాలను ఇచ్చేది. ధర్మార్థ కామమోక్షాలనే చతుర్విధ పురుషార్థాలను అనుగ్రహించేది. దేవీ పురాణంలో

ధర్మాదీన్ చింతితా నర్థాన్ సర్వలోకేషు యచ్ఛతి
అతో దేవీ సమాఖ్యాతా సర్వైః సర్వార్థసాధినీ ||

ధర్మాది చింతితార్ధములను అన్ని లోకాలకు ఇస్తుంది. కాబట్టి సర్వార్థధాత్రీ అనబడుతుంది అని చెప్పబడింది. సమస్త వాంఛితములు ఈడేర్చునది. వాంఛితార్ధ ప్రదాయినీ.

ఒక చిన్న ఉపమానంతో మనం పురుషార్థాల గురించి తెలుసుకుందాం. ఒక బండికి రెండు చక్రాలున్నాయి. ఈ రెండు చక్రాలు అర్థము, కామము అనుకుందాం. కామము అంటే కోరికలు. అర్థము అంటే అవి తీర్చుకోవడానికి కావలిసినవి. డబ్బు, బలం, పలుకుబడి వంటివి. ఈ రెండు చక్రాల బండిని లాగడానికి ధర్మం అనే గుఱ్ఱాన్ని అమర్చాలి. అంటే సంపాదించే డబ్బు, పలుకుబడి ధర్మబద్ధమయి ఉండాలి. తద్వారా తీర్చుకునే కోరికలు ధర్మ బద్ధమయి ఉండాలి. అంతేకాని ఆ డబ్బుతో మళ్ళీ పాప కర్మలు చేయకూడదు. ఈ విధంగా సాగే జీవన ప్రయాణం చివరకు చివరకు మోక్షం అనే గమ్యాన్ని చేరుకుంటుంది.

There are 4 purusharthas. They are 1) Dharma, 2)Artha, 3)Kama and 4)Moksha. Divine mother is the giver of all the purusharthas. It is said like this in Devi purana

Dharmaadeen chintita narthaan sarvalokeshu yachchati
atho devi samaakhyaataa sarvaih saraarthasaadhini

She gives purusharthas like Dharma, Artha etc to all beings. So she is called Sarvaartha dhaatri.

Purusharthaas can be understood clearly by this analogy. Imagine there is a cart with two wheels. It's wheels represent kama and Artha. Kama is your wants and desires. Artha is the means you have to fulfill your kama. Now tie a horse called Dharma to this cart. That means, you should not only earn money by following dharma, but also follow dharma while spending it. You should not indulge in sin just because it is your money. A journey of life on such cart leads to moksha (liberation).

698. Sarvaloka vasamkari

సమస్త లోకాలనూ వశం చేసుకునేది. చతుర్దశభువనాలలోనూ ఉన్న జీవుల్ని తన ఉపాసకులకు వశం చేస్తుంది. పరమేశ్వరి అనుష్ఠానం చేసిన వారికి సర్వలోకాలు వశమవుతాయి. ఈ విషయం చెబుతూ దుర్వాసుడు శ్రీదేవీ మహిమ్నః స్తుతిలోని 40వ

శ్లోకంలో

ఏవం యః స్మరతి ప్రబుద్ధసుమతిః శ్రీమత్స్వరూపం పరం
వృ ప్యాశు యువా భవ త్యనుపమః స్త్రీణా మనంగాయతే
సో ష్టైశ్వర్య తిరస్కృతాఖిలసురః శ్రీజృంభితాత్మాలయః
పృథ్వీపాలకిరీటకోటి వలఖీ పుష్పార్చితాంఘి ర్భవేత్ ||

ఆ పరమేశ్వరిని ఆరాధించేవాడు ముల్లోకాలను సమ్మోహనం చెయ్యగలుగుతాడు. అష్టైశ్వర్యాలు పొందుతాడు. లోకంలోని పాలకులు, రాజులు, అధికారులు అందరూ కూడా అతని పాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తారు.

Divine Mother can possess and control everything. She gives everything to her devotees. Those who practice Sri Vidhya and succeed will possess and can control everything. Sage Durvaasa explained this in the 40th poem of Sri Devi Mahimnah Stutih

Evam yah smarathi prabuddhasumatih srimatswaroopam param
Vrupyaashu yuvaa bhavatyanupamah streena managaayate
So shtaiswarya tiraskrutaakhilasurah srijrumbhitaatmaalayah
Prithveepaalakireetakoti valakhi pushpaarchitaanghi rbhaveth

Those who worship Divine mother can mesmerize everyone in this world. They possess all kind of worldly pleasures. All the kings, rulers, ministers bow in front of them.

697. Daityashamani

దైత్యులను నాశనము చేసేది. అధర్మపరులే దైత్యులు. వీరు ఎక్కడో లేరు మనలోనే ఉన్నారు. దేవదానవులిద్దరూ ఒక తండ్రి సంతానమే అనే మాట మనం మరిచిపోకూడదు.

కశ్యపునికి దితియందు కలిగినవారు దైత్యులు. అదితియందు గలిగినవారు దేవతలు. దనువు నందు గలిగినవారు దానవులు. వీరందరూ శక్తి, యుక్తి, శౌర్యపరాక్రమాలలో సమానమైనవారు. నిష్టాగరిష్టులు. అయితే దేవతలు ధర్మస్వరూపులు. మిగిలినవారు అధర్ములు. అవైదికులు, అజ్ఞానులు, దేహమే ఆత్మ అని నమ్మేవారు.

పూర్వకాలంలో బ్రహ్మదేవుని దగ్గర పరబ్రహ్మతత్త్వాన్ని తెలుసుకోవటానికి వెళ్ళారు దేవరాజైన ఇంద్రుడు, రాక్షసరాజు విరోచనుడు. కంటిపాపలో కనిపించేదే ఆత్మ. అని చెప్పాడు బ్రహ్మ. కనుపాపలో కనుపించేది ఈ శరీరమే. కాబట్టి ఈ శరీరమే ఆత్మ అని నమ్మి తన రాజ్యానికి తిరిగి వచ్చేశాడు విరోచనుడు. అదే విషయాన్ని ప్రచారం చేశాడు. ఇంద్రుడు మరింత లోతుగా అలోచించి బ్రహ్మ దగ్గర దీక్ష తీసుకుని పరబ్రహ్మతత్త్వాన్ని తెలుసుకున్నాడు. తన రాజ్యానికి తిరిగి వచ్చి, "ఈ శరీరం ఉన్నది అంటే అది ఆత్మ వల్లే. ఆత్మను గురించి తెలుసుకోవడానికి దేవుడు మనకిచ్చిన పరికరం ఈ శరీరం. కాబట్టి అందరూ ధర్మాన్ని పాటించండి. ఆత్మ జ్ఞానం సంపాదించండి" అని చెప్పాడు. (ఆత్మ జ్ఞానానికై ఈ శరీరాన్ని ఎలా వాడుకోవాలో తెలిపేదే సనాతన ధర్మం.)

అందుకే దేవతలకు దైత్యాలకు చుక్కెదురు. వీరిరువురి మధ్య కలహాలను మనం దేవ కార్య సముద్యుత అనే నామంలో చదువుకున్నాం.దైత్యులు ఆత్మ విద్యలో ఆటంకాలు కలిగిస్తారు కనుక అమ్మ వారిని నాశనం చేస్తుంది.

Daitya Shamani means one who destroys Daityas. Daityas don't follow Dharma. Devatas on the contrary follow and promote Dharma.

Devatas and Daityas reside in our body. Not somewhere out in heaven or hell. As per the puranas, Prajapathi Kashyap has three wifes. 1.Diti, 2.Aditi, 3.Dhanuvu. Daityas are sons of Diti. Devatas are sons of Aditi and Danavas are sons of Dhanuvu. They all are highly and equally capable. 

Once upon a time, the king of Devatas Indra and the king of Daityas Virochana went to Lord Brahma to learn about Atma. Brahma said, 'what you see inside your eyes is Atma'. Virochana interpreted it like this. "We see our own body in the eyeball (in front of a mirror). So this body is Atma". Indra did further research and went forward to learn Atma vidya. He found the real Atma - the soul. Virochana returned to his kingdom and told everyone that the body is Atma. So pursue it. Whereas Indra returned to his kingdom and preached that Atma is the reason why this body exist. God gave this body as a tool to pursue Atma (Dharma is nothing but a set of guidelines explaining how to use this body in pursuit of Atma).

Due to this, Daityas and Devatas always have a clash. We learnt this in the nama Deva karya samudyuta. Because Daityas obstruct the pursuit to Atma, Divine mother destroys them.

696. Deekshita

దీక్ష తీసుకున్నటువంటివాడు దీక్షితుడు. గురువురూపంలో శిష్యుడికి మంత్రదీక్షనిచ్చి అతడి పాపాలను పోగొడుతుంది కాబట్టి దీక్షితా అనబడింది. గురువు శిష్యునకు మంత్రోపదేశం చేస్తాడు. దీనినే మంత్రదీక్ష ఇవ్వటం అంటారు.

ఈ దీక్ష నాలుగురకాలు.

1. స్పర్శదీక్ష : గురువు శిష్యుని తాకినంత మాత్రంచేతనే అతడికి శక్తి వస్తుంది.

2 ధ్యానదీక్ష : గురువు దూరంగా ఉన్నప్పటికీ శిష్యుని శ్రేయస్సును కోరి ధ్యానం చేస్తుంటాడు. దానివల్ల శిష్యునికి శక్తి వస్తుంది.

3. దృడ్డీక్ష : ఇది కంటి చూపుతోనే ఇచ్చే దీక్ష. దీనిలో శిష్యుడు పవిత్రుడు కావాలనే తలంపుతో గురువు తన దృష్టిని సారిస్తాడు.

4. మంత్రదీక్ష : గురువు శిష్యునకు ధర్మసూత్రాలు చెప్పి మంత్రదీక్ష ఇచ్చి అతనికి తరుణోపాయం చూపుతాడు.

అమ్మ కరుణాంతరంగ. గురువురూపంలో శిష్యుడికి అనేకానేక విజ్ఞానదాయక విషయాలు చెప్పి అతడికి దీక్ష ఇచ్చి అతని పాపాన్ని క్షయం చేస్తుంది. శ్రీవిద్యలో అఖరుది పూర్ణదీక్ష. పూర్ణదీక్షపరులకు, అమ్మకు భేదంలేదు. పూర్ణదీక్షాపరుడు అన్ని మంత్రాలమీద అధికారం కలిగి ఉంటాడు. సద్గురువు దగ్గర ఉపదేశం తీసుకుంటే మంత్రం త్వరగా సిద్ధిస్తుంది. అందుకని ముందుగా మంచి గురువును ఎన్నుకుని, అతడిని అన్నివిధాల పరిక్షించి అప్పుడు మాత్రమే అతని దగ్గర తీసుకోవాలి. లెక్క చెప్పేవాడికి ఆ లెక్కమీద పూర్తి పట్టు ఉంటే, అతను చెప్పిన లెక్క విద్యార్ధికి తేలికగా అర్ధం అవుతుంది. అలాగే మంత్రోపదేశం చేసేవాడికి మంత్రం మీద పట్టు ఉండాలి. అంటే అతడికి మంత్రం సిద్ధించి ఉండాలి. మంత్రార్ధం పూర్తిగా తెలిసి ఉండాలి. అనుష్టానక్రమం తెలిసి ఉండాలి. అంతేకాని ధనానికో, మరింకెందుకో ఆశపడి మంత్రానిచ్చే వారి దగ్గరమంత్రోపదేశం పొందితే, గురువుకు కావలసినది లభిస్తుంది. అంతేకాని శిష్యుడికి మాత్రం ఏమీరాదు.

శ్రీవిద్యోపాసన చెయ్యాలి అంటే దీక్ష ఎంతో అవరసం. దీక్ష తీసుకోవటంవల్ల అతడి శక్తి పెరుగుతుంది. ఎప్పుడైతే గురువు తన చేతిని శిష్యుడితలపై ఉంచి దీక్షనిచ్చాడో, అప్పుడు గురువులో ఉన్న శక్తి కొంత మేర శిష్యుడిలో ప్రవేశిస్తుంది.
ఈ రకంగా దీక్షనిచ్చి శిష్యుని కృతార్థునిగ చేసేది.

Deeksha means a vow. One who takes a deeksha is called Deekshit. A disciple requests a Guru to teach mantra. Then the Guru teaches the mantra and the prescribed methods to chant it. Then the disciple takes the mantra deeksha and practices meditation.

Deeksha is of four types:

1. Sparsa deeksha - When the Guru touches the disciple gently, he transfers some of his divine powers to the disciple. Sparsa means touch. This is called Sparsa deeksha

2. Dhyana deeksha - Even though the Guru and his disciple are in different locations physically, guru meditates for his disciples wellbeing and prosperity. This is called Dhyana deeksha. Dhyana means meditation.

3. Dhruda deeksha - This deeksha is given through looks. Guru looks at the disciple with an intention to purify his sins.

4. Mantra deeksha - Guru treaches mantra to the disciple and explains him the methods of practice for meditation.

A guru who is giving Deeksha is a form of Divine mother. It is mark of her compassion. A real guru does not think about what the disciple can pay him in return. He gives deeksha selflessly. If a disciple takes mantra deeksha from an able guru, he reaches his goals without having to through lot of difficulties. So you have to enquire, research and double check before fixing your guru. The guru giving the mantra deeksha should have practiced the mantra by himself. He should know the nitty gritties of the process of meditation. On top it, he should have a heart to do selfless service. You should choose such gurus.

One has to take up deeksha to practice Sri Vidya. It will improve his focus and energy. He will get help from Gurus directly and indirectly. The last step in Sri Vidya is purna deeksha. There is no difference between Divine Mother and one in purna deeksha. One who is in purna deeksha will have knowledge and experience of all the mantras.

693. Samrajyadaayani

రాజసూయము చేసినవాడు, మహామండలేశ్వరుడు, రాజాధిరాజు. వీరిని సామ్రాట్టులు అంటారు. వారు పాలించేది సామ్రాజ్యము. అటువంటి సామ్రాజ్యాన్ని ఇచ్చేది అమ్మ.

రాజులు పాలించేవి రాజ్యాలు. అటువంటి కొన్ని రాజ్యాలు కలిస్తే సామ్రాజ్యము. పూర్వకాలంలో భారత దేశం కూడా అఖండభారతంగా ఉండేది. పాకిస్తాన్, బర్మా, బంగ్లాదేష్, శ్రీలంక ఇవన్నీ భారత దేశం లోని ప్రాంతాలే. ఈ అఖండవైదిక సామ్రాజ్యాన్ని ఎందరో గొప్ప సామ్రాట్టులు పాలించి ఇక్కడ సనాతన ధర్మాన్ని స్థాపించారు. సనాతన ధర్మం అంటే అనాదిగా వస్తున్న ఆచారం. మనుషులు ఆచరించ వలసిన సూత్రాలు. కొంత కాలం తరువాత పర్షియా నుంచి సింధు నది దాటి వచ్చిన వారు ఈ అఖండ సామ్రాజ్యాన్ని హిందూస్తాన్ అని పిలిచారు. ఇక్కడి వారిని హిందువులు అని అన్నారు.

రాజసూయము అనేది - ఒక యాగము ఇది రాజులు తమ పరాక్రమాన్ని నిరూపించుకోవటానికి మాత్రమే చేస్తారు. యాగం చేసేవారు తమ ఆధిపత్యాన్ని అంగీకరించవలసినదిగా ఇతర రాజులకు వర్తమానం పంపుతారు. దానిని అంగీకరించని వారితో యుద్ధం చేసి గెలుస్తారు. ఈ విధంగా రాజులందరినీ గెలిచి, యాగపరిసమాప్తిగా పూర్ణాహుతి చేసి అవబృధస్నానం చేస్తారు. ఈ రకంగా చేసినవారు ఉత్తమోత్తములు. వారి జన్మలు పరమపావనము. అటువంటి ఆఖండ సామ్రాజ్యాన్ని ప్రసాదించేది, అమ్మ లలితమ్మ.

బ్రహ్మ విద్యయే ఆత్మవిద్య. ఆత్మవిద్యనుపాసించినవారు ఆత్మసామ్రాజ్యానికి అధిపతులు. అటువంటి ఆత్మసామ్రాజ్యాన్ని ప్రసాదించేది అమ్మే.

An emperor is the one who rules multiple kingdoms. They are called Samrat. The region they rule is called Samrajyam. Divine mother gives such Samrajyams to those who worship her.

A few centuries ago, there used to be a big region called Bharata khanda. It is union of countries like India, Pakistan, Bangladesh, Sri Lanka, Burma etc. It is famously called akhanda Bharat (undivided Bharat). Many emperors ruled akhanda Bharat and established vedic religion. It used to be called as Sanatana Dharma. Sanata Dharma means a set of guidelines that are prescribed and followed for a very long time. Some time later people from Persia crossed river Sindhu and learnt about this great region and culture. They called it Hindustan and Hinduism.

Rajasuya is a yaga. It is performed by kings to spread their kingdom. A king who performs Rajasuya should send a message to all other kings to accept his superiority and command. He has to defeat those who oppose his command. After winning over all others, the king who is performing the yaga should do avabrudha snana (Sacred bath). Then the yaga is complete. He becomes a Samrat or an emperor. Kings who complete Rajasuya would attain Moksha. Divine mother is the giver of such Samrajya

Brahma vidya or Atma vidya is the knowledge of Brahman. One who practices it becomes emperors of the Atma Samrajya. Divine mother is the giver of such Atma Samrajya.

692. Chaturangabaleswari

చతురంగబలాలు అంటే - నాలుగు విధాలయిన సైన్యము. అవి 1. రధ, 2. గజ 3. తురగ 4. పదాతిదళాలు. అవి ఆనాటి కాలంలో, మరి ఈనాడు త్రివిధ సేసలు అంటే - వాయుసేన, నౌకా సేన, పదాతిసేన. వీటన్నింటికీ అమ్మే సర్వసేనాని. ఈ సేన అంతా ఆమెకనుసన్నలలో మెలుగుతుంటుంది.

అంతఃకరణములు నాలుగూ ఆమె ఆధీనంలో ఉంటాయి. అంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. వీటిని అమ్మకు అర్పిస్తే ఆవిడ మోక్షం ఇస్తుంది.

Divine mother is the commander of the four forces like, cavalry, elephants, chariots and infantry. In today's world we can say, Army, Navy and Air force. All these forces are governed by her.

Antahkarana means tools inside our body. They are mind, intellect, conscience and ego. One has to offer these to Divine mother. Then she gives moksha.

691. Koshanatha

కోశము - వర, ధనాగారము. లోకంలోని ధనాగారం మొత్తానికి అధిపతి. అమ్మ ఉండేది మణిద్వీపంలో, చింతామణి గృహంలో చింతామణులు - చింతలను తీర్చేమణులు ఉన్నాయి. చితి - మృతదేహాన్ని దహిస్తే, చింత బ్రతికి ఉన్న దేహాన్ని దహించివేస్తుంది. అందుకే అటువంటి చింతలను తీర్చే మణులు ఎంతో అమూల్యమైనవి.

లెక్కలేనన్ని ధనరాశులను ఒక్కక్షణంలో ఇవ్వగలదు. దేవీ భాగవతంలో
యస్యా స్తు పార్శ్వభాగేతు నిధీశౌ శంఖపద్మకౌ |
నవరత్నమహానద్య సదావై కాంచనస్రవా ||

అమ్మకి రెండువైపులా శంఖపద్మనిధులున్నాయి. నవరత్నాలు, బంగారము కలిసిన నదులు ప్రవహిస్తున్నాయి. అంటే పరమేశ్వరి వద్ద లెక్కలేనంత సంపద ఉన్నది. దాన్ని లోకంలోని తన భక్తుల కోరికలు తీర్చటానికి ఉపయోగిస్తుంది. అందరూ ఆమె భక్తులే. అన్నీ ఆమె రూపాలే. కృష్ణుడు, శివుడు, విష్ణువు. అంతేకాదు జినుడు, బుద్ధుడు, క్రీస్తు, అల్లా అన్నీ ఆమె రూపాలే. జనులందరూ ఆమె భక్తులే. ఈ రకంగా భక్తకోటికి ఇవ్వటానికి ఆమె వద్ద సంపద ఉన్నది. ఆ సంపదకంతటికీ ఆమె అధికారిణి.

కోశనాథా - కోశములకు అధిపతి. పంచకోశాంతరస్థితా అనే నామంలో మనం అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయకోశాలు గురించి తెలుసుకున్నాం. వీటన్నింటికీ ఆధిపత్యం ఆమెదే. ఈ రకంగా ఆమెకోశనాథా అనబడుతుంది.

Kosha - Cell, Treasury.

Divine mother is the owner of all the Treasuries that exist in this universe. She lives in Manidweepa. Name of her house is Chintamani. Chinta means concern. There are numerous precious stones and gems in Chintamani to address all our concerns. Chiti is the fire that burns a dead body. Chinta is the fire that burns you alive. Divine mother is the owner of all the treasures in Chintamani that can address all our Chintas and solve our miseries.

She can give abundant wealth in a split second. It is said like this in Devi Bhagavatha:
Yasyaasthu paarshwabhaagethu nedheeshou shankhapadmakou
Navaratnamahaanadhya sadaavai kaanchanasravaa

Shankha nidhi and Padma nidhi are the two treasures that are kept on both sides of Divine Mother. These have rivers of all the nine precious gems and gold. That means Divine Mother has infinite wealth. She uses it to address our concerns. Here 'our' represents everyone. Vishnu, Shiva, Krishna, Jina, Buddha, Christ, Allah etc are all Her forms. As she is the owner of the infinite wealth in all the Koshas(Treasuries), she is called Koshanatha.

We discussed in the name panchakoshandharasthitha that our body is divided into 5 koshas. They are Annamaya, Pranamaya, Manomaya, Vignanamaya, Anandamaya. Divine mother is the head of all these Koshas. Hence she is called Koshanadha

689. Rajapeethaniveshitanijaashrita

రాజులు కూర్చునే సింహాసనములయందు తనను ఆశ్రయించిన వారిని ఉంచునది. అమ్మ ఎవరినైతే అనుగ్రహిస్తుందో, వారిని బహువిధప్రజ్ఞాశాలిగ చేస్తుంది. సర్వాధికుడుగా చేస్తుంది.

చదువురానివాడు, అక్షరజ్ఞానహీనుడు, అడవిలో గొర్రెలు కాచుకునే కాళిదాసును మహాకవిగా అనుగ్రహించింది. అలాగే సింహాసనాలమీద తన యందు అచంచలమైన భక్తి విశ్వాసాలు గలవారిని అధిష్టింపచేస్తుంది. దేవేంద్రుడు తారకాసురుడు, మహిషాసురుడు, మొదలైన రాక్షసులచేత పదవీచ్యుతుడై, ఆమెను ప్రార్ధించినప్పుడు, అతని మొర ఆలకించి మళ్ళీ ఇంద్రుణ్ణి స్వర్గాధిపతిగా నియమించింది.

దేవీ భాగవతంలో రాజ్యం నుంచి గెంటివేయబడిన సుదర్శనుణ్ణి మళ్ళీ రాజును చేసింది. అయోధ్యానగారానికి రాజు సూర్యవంశస్థుడైన ధృవసంధి. అతని పెద్దభార్య కుమారుడు సుదర్శనుడు. రాజు ఒకరోజు వేటకు వెళ్ళి సింహం చేతిలో హతమవుతాడు. ధృవసంధి రెండవ భార్య తండ్రి అయిన యూధాజిత్తు సుదర్శనుణ్ణి రాజ్యం నుంచి గెంటివేసి, తన మనుమడైన శత్రుజిత్తుకు పట్టాభిషేకం చేస్తాడు. సుదర్శనుడు తల్లితో సహా భరద్వాజుని ఆశ్రమం చేరి అక్కడ క్లీం బీజాన్ని జపించి తరించాడు. అప్పుడు అమ్మ కరుణ వల్ల అతడు కాశీరాజు కుమార్తె శశికళను వివాహమాడి యూధాజిత్తును ఓడించి తన రాజ్యాన్ని దక్కించుకుంటాడు. ఇదంతా పరమేశ్వరి కృపవల్లనే జరిగింది. ఈ రకంగా అనేకచోట్ల అనేకమంది భక్తులను రాజులుగా నియమించింది.

Those who pray Divine Mother get the throne of the kingdom. If Divine mother blesses someone, he/she would become multi-talented.

One can become a scholar without any form of education by her blessings. The great poet Kali dasa is the an example for this. She gives power to rule to those who have full faith in her. Devendra, who is the king of the heaven lost is power in fights with Tarakasura, Mahishasura etc. But she always helped him get back to his throne. The reason is, Devendra worships Divine Mother.

Another story in Devi Bhagavatam also explains the same aspect. There used to be a king called Dhruva sandhi in the dynasty of Suryavamsha. He is the king of Ayodhya. He has two wives. Sudarshana is the son of his elder wife. Yudhajit is the son of his younger wife. After the king's demise, Yudhajit forces Sudarshana to leave the kingdom and assigns throne to his grandson Shatrujit. Sudharsha leaves Ayodhya along with his mother and reaches the ashram of saint Bharadwaja. There he worships Divine Mother with the beeja 'kleem'. With Mother's blessings he marries the princess of Kashi and defeats Yudhajit in a war. Then he conquers Ayodhya.

Like this, Divine Mother helped her devotees conquer the power to rule in many occasions.




687. Rajya Vallabha

పైన చెప్పిన రాజ్యములు ప్రియముగా గలది. రాజ్యములకు వల్లభా. అంటే ప్రభవి, రాజు, పరమేశ్వరి చిన్నచిన్న రాజ్యాలకు కాదు. లోకాలకు ప్రభ్వి. అఖిలాండకోటి బ్రహ్మాండాలకు నాయకురాలు. జగత్తంతా ఆమె అధీనంలోనే ఉంటుంది. కాబట్టి, వివిధ శాఖలు చూడటానికి వివిధ వ్యక్తులను నియమించింది. వారే త్రిమూర్తులు దిక్పాలకులు మొదలైనవారు. వీరెవరూ స్వతంత్రులు కారు. వీరంతా పరమేశ్వరి ఆజ్ఞకు బద్ధులు. ఆమె అధికారానికిలోబడి పనిచేసేవారు. పరమేశ్వరి శ్రీచక్రనాయిక. అంటే శ్రీచక్రానికి రాజరాజు. చక్రవర్తి. సామ్రాజ్జి. శ్రీచక్రంలో ఉండే వివిధ ఆవరణలలో ఉండే దేవతలు ఈమెకు లోబడి ఉండే వారే. అందుచేతనే ఈమె రాజ్యవల్లభా అని పిలువబడుతోంది.

All the kingdoms discussed in the above name are in her control. She loves them. She is the ultimate ruler of those kingdoms. She appointed trimurthys, dikpalakas etc to carry her order. They all pay their obeisance to Divine Mother. Only Divine Mother has absolute freedom. Rest all are bound by her order. She is the empress. Ruler of Srichakra. All the yoginis in Srichakra also serve her. Hence she is called Rajya Vallabha.

686. Rajyadaayani

రాజ్యమును ప్రసాదించునది. స్వర్గాధిపత్యము నిచ్చునది.

సృష్టి ఆరంభంలో త్రిమూర్తులను ఆవిర్భవింపచేసి వారికి సృష్టిస్థితిలయాలను అప్పగించింది.

బ్రహ్మకు - సత్యలోకాధిపత్యము
విష్ణువుకు - వైకుంఠాధిపత్యము
రుద్రునకు - కైలాసాధిపత్యము

ఇంద్రునకు - స్వర్గాధిపత్యము
కుబేరునకు - ధనాధిపత్యము, అలకాపురి నగరాన్ని
అగ్నికి - తేజోవతి నగరాన్ని
యముడికి- - సంయమని నగరాన్ని
నైరుతికి - కృష్ణాంగన నగరాన్ని
వరుణుడికి - శ్రద్ధావతి నగరాన్ని
వాయువుకు - గంధవతి నగరాన్ని
ఈశానుడికి - యశోవతి నగరాన్ని

సప్తశతిలో సురధుడు అనే రాజు శత్రువులవల్ల సర్వస్వాన్నీ పొగొట్టుకున్నాడు. అలాగే సమాధి అనే వైశ్యుడు భార్యాపుత్రల స్వార్ధం వల్ల సంపద అంతా పోగొట్టుకుని అరణ్యాలపాలయ్యాడు. అక్కడ వారికి సుమేధుడు అనే మహర్షి దేవీ మాహాత్మ్యాన్ని పూర్తిగా వివరించాడు. దేవీ మాహాత్మ్యము ఆసాంతం విన్న వారు కూడా ఋషి సలహామీద కొంతకాలం పరమేశ్వరిని అర్చించారు. అంతట ఆ దేవి ప్రత్యక్షమై 'మీకు ఏంకావాలో కోరుకోండి' అంటుంది. సురధుడు తన రాజ్యం తనకు కావాలి అంటాడు. పరమేశ్వరి అనుగ్రహించింది. సురధుడు మళ్ళీ రాజైనాడు. ఈ రకంగా పరమేశ్వరి తన భక్తులకు వారి అర్హతలను బట్టి రాజ్యాన్ని ప్రసాదిస్తుంది. అంతేకాదు దేవీ భాగవతంలో ఒక చిన్నకధ ఉన్నది. పూర్వకాలంలో హిమాలయ ప్రాంతంలో చక్రవాకపు పక్షి ఒకటి ఉండేది. అది దేశాల వెంబడి తిరుగుతూ, ఒకనాడు కాశీపట్టణానికి వచ్చింది. ఆ రోజు దానికి ఆహారం దొరకలేదు. ఆహారం కోసం కాశీనగరమంతా తిరిగింది. ఉపయోగంలేదు. చివరకు అన్నపూర్ణాదేవి ఆలయంలో ఏమైనా ఆహారం దొరుకుతుందేమోనని అక్కడికి వెళ్ళింది. ఆలయమంతా మూడుసార్లు కలయదిరిగింది. తనకు తెలియకుండానే మూడు ప్రదక్షిణాలు చేసింది. అపరాహ్నమైనప్పటికీ ఆహారం దొరకక, వెతుకుతూ తనకు తెలియకుండానే పరమేశ్వరికి ప్రదక్షిణాలు చేసింది. అనాలోచితంగా ఉపవాసం కూడా ఉన్నది. కాబట్టి ఆ ఫలం దానికి దక్కింది. తరువాత కొంతకాలానికి అది చచ్చి స్వర్గానికి వెళ్ళి అక్కడ సుఖాలనుభవించి కర్మశేషం అనుభవించటానికి కాశీ నగరానికి రాజుగా పుట్టింది. ఈ రకంగా చేసే కర్మ, అర్చన తక్కువైనా దానికి ఫలితం ఎక్కువగా ఇచ్చేది. రాజ్యాలను ఇచ్చేది ఆ పరమేశ్వరి. అందుకే ఆమె రాజ్యదాయినీ అనబడుతోంది.

She gives kingdoms like Vaikuntha, Kailasa, Swarga(Heaven) etc

At the beginning of creation, she gave Sathya loka to Brahma, Vaikuntha to Vishnu and Kailasa to Rudra.

Indra got swarga (Heaven)
Kubera got the town of Alakapuri and mastery of wealth
Agni(Fire god) got the town Tejovathi
Yama got the town Samyamani
Nairuthi got town of Krishnangana
Varuna got town of Shraddhavathi
Vayu got town of Gandhavathi
Eshana got town of Yashovathi

Below is a story from Sapthasathi:
King Suradha lost his kingdom and possessions due to enemies. A businessman Samaadhi lost all his wealth due to betrayal by his kith and kin. They both went to forest and met saint Sumedha. They learnt the greatness of Divine Mother from Sumedha and worshipped her for sometime. Then Divine Mother asked Suradha, "what do you want". He said, "I want my kingdom back". Then she gave his kingdom back.

There used to be a bird (chakravaka) in himalayas. It was wandering in the sky for food and reached the town of Kashi. There it searched for food everywhere. It circled around temple thrice with empty stomach(fasting). Looking at the plight of the bird, Divine Mother gave it the virtue of fasting and pradakshina. That helped the bird to reach heaven after death. After enjoying the pleasure of Heaven for some time, it took brith as the king of Kashi.

Like this, the result of worshipping Divine Mother will be far more than the effort put for worshipping.

685. Rajarajeswari

రాజులు, మహారాజులు, చక్రవర్తులు, యక్షగరుడకిన్నెర కింపురుషులకు దేవతలకు కూడా ఈమె ఈశ్వరి.

మనలను పాలించే వారు - రాజులు
రాజులను శాసించేవారు - రారాజులు చక్రవర్తులు
చక్రవర్తులను పాలించేవారు శాసించేవారు - దేవతలు
అటువంటి దేవతలతో కూడా అర్చించబడేది. వారికి కూడా ఈశ్వరి.

మంత్రాలలో రాజు వంటిది షోడశాక్షరి. అందుకే మహాషోడశిని మంత్రరాజము అన్నారు. అటువంటి మంత్రరాజముచే అర్చించబడునది.

రాజులు - యక్షులు. యక్షులకు రాజు కుబేరుడు. అటువంటి కుబేరునిచేత అర్చించబడునది. పంచదశి మహామంత్రాన్ని జపించి తరించినవారిలో కుబేరుడు ఒకడు. ఈయన ఉపాసించినది కామరాజమంత్రం.

She is worshipped by kings, emperors, yakshas, garuda, kinneras and kimpurushas.

Kings rule us.
Emperors command those kings
Devatas/Angels command those Emperors.

Divine Mother is worshipped by those devatas.

Shodashakshari mantra is called the king of all mantras. It is used to worhsip Divine Mother.

Kings are yakshas. Kurbera is the king of yakshas. Kurbera worshipped Divine Mother with pancha dashi maha mantra. The mantra he used for this worship is called kamaraja mantra.

682. Sukhaaradhya

ఏ రకమైన నిష్ఠలు, నియమాలు లేక ఆరాధింపదగినది. పరమేశ్వరిని చాలా సులభరీతిలో ఉపాసించవచ్చు అని కూర్మపురాణం చెబుతోంది. అంటే ఉపవాసాలు మొదలైన వాటి ద్వారా శరీరాన్ని కష్టపెట్టనవసరం లేదు. మడి ఆచారాలు ఏవీలేవు. ఈ రకంగా సుఖంగా సేవించబడేది. మామూలుగా పూజా విధానంలో వాడే పత్రము, పుష్పము, ఫలము, తోయము మొదలైనవన్నీ భావనా మాత్రంచేతనే సమర్పించవచ్చును. వివిధరకాలయిన సంబారాలు అవసరంలేదు. అందుచేత పరమేశ్వరి సుఖారాధ్యా అనబడుతోంది.

One need not put lot of effort, spend lot of time and money to pray and please Divine Mother. Just ask her whole-heartedly. Think about her and have faith on her. That is enough. Hence she is called sukhaardhya.

681. Bhavaabhavavivarjita

భావ అంటే ఉండటం. అభావ అంటే లేకపోవడం. అమ్మ ఈ రెండింటికీ అతీతమైనది.

భావములు 5 రకములు - ద్రవ్య, గుణ, కర్మ, సామాన్య, విశేష, సమవాయువులు.

అభావములు 4 రకములు - ప్రాగాభావ, ప్రధ్వంశాభావ, అంత్యతాభావ, అన్యోన్యాభావ

ప్రాగాభావ - ఏదైనా ఉద్భవించకముందు అది ఉండదు. అంటే దారం నుండి బట్ట నేస్తం. అంటే దారం ఉన్నపుడు బట్ట ఉండదు.

ప్రధ్వంశాభావ - బట్ట తయారుచేసిన తరువాత దారం ఉండదు.

అంత్యతాభావ - పరబ్రహ్మము ఒక్కటే ఉన్నది

అన్యోన్యాభావ - ఇది కాదు అనే తర్కం. బ్రహ్మమును ఇది కాదు అని ప్రతీ వస్తువుని చూపించి చెప్తాము.

She is free from existence as well as non-existence. Bhāva and abhāva are the terms of Vedanta. Bhāva means existence and abhāva means non-existence. Experimentation and observation, rather than theory of existence is bhāva. Māyā or illusion is the material cause for abhāva or non-existence. Abhāva is of four types. 1. Prāgabhāva: Non-existence of a thing prior to its production. Cloth is made out of yarn. When yarn existed, cloth did not exist. Yarn was transformed into cloth. 2. Dhvaṁsābhāva: Non-existence after destruction. Yarn in its original form did not exist after cloth was produced. 3. Atyantābhāva: Absolute non-existence. According to advaita philosophy, only the Brahman is the absolute non-existence. 4. Anyonyābhāva: Mutual non-existence. For example a pot is not cloth, nor is a piece of cloth a pot. This is known as ‘this is not that’. Upaniṣad-s elucidate Brahman by saying ‘not this, not this’ (neti, neti). An ignorant man considers soul as different from the Brahman. But according to advaita, soul and the Brahman are the same. They are considered as different because of ignorance or avidyā.

Popular