Search This Blog

దేవతలు అంటే ఎవరు ?

కేనోపనిషత్తులో “ఒకసారి దేవదానవులకు భీకరయుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దేవతలు విజయం సాధించారు. ఆ తరువాత వారందరూ ఒకచోట చేరి యుద్ధం ఏ రకంగా జరిగింది. తాము ఏ విధంగా విజయం సాధించాము అనే విషయాలను గాధలుగా చెబుతున్నారు. ఆ విజయానికి కారణం నేనే అని ప్రతివారూ చెబుతున్నారు.

అగ్నిదేవుడు అంటున్నాడు. “ఆ యుద్ధంలో నేను నిప్పులు కురిపిస్తుంటే రాక్షసులంతా మాడిమసి అయిపోయారు"

వాయుదేవుడు అంటున్నాడు " ఆయుద్ధంలో నేను చండప్రచండగా గాలులు వీస్తుంటే రాక్షసులు ఆ గాలులకు కొట్టుకుపోయారు"

పరబ్రహ్మతత్త్వం ఈ మాటలు విన్నది. దేవతలంతా గర్వించి ఉన్నారు. వారికి జ్ఞానోదయం చెయ్యాలి అనుకున్నది. అనుకున్నదే తడవుగా వారి ఎదుట పెద్ద భూతాకారంగా ప్రత్యక్షమైంది. దాన్ని చూసి భయపడ్డారు దేవతలు. ఆ భూతం ఏమిటో వారికి అర్ధం కాలేదు. అప్పుడు వారు అగ్నిదేవుని దగ్గరకు వచ్చి, “ఓ దేవా ! నీ పరాక్రమం
వల్లనే రాక్షసులను జయించగలిగాము. ఇప్పుడు ఆ భూతం ఏమిటో కనుక్కోవలసినది అన్నారు. సరేనన్నాడు అగ్నిదేవుడు. ఆ భూతాన్ని సమీపించాడు. అప్పుడు ఆ భూతం
అగ్నిని చూసి ఎవరు నువ్వు ? అన్నది.

అగ్ని: నేను అగ్నిదేవుడను. జాతవేదుడు అంటారు నన్ను.
భూతం : నీ శక్తి ఏమిటి ?
అగ్ని: ఎటువంటి వస్తువునైనా క్షణాల్లో దహించివేస్తాను.
భూతం : అలా అయితే ఈ గడ్డిపరకను దహించు. అంటూ ఒక గడ్డిపరకను చూపించింది. అగ్నిదేవుడు శతవిధాల ప్రయత్నించాడు. గడ్డిపరక కసికందలేదు. అవమానంతో వెళ్ళిపోయాడు అగ్నిదేవుడు. ఆ తత్త్వం ఏమిటో తెలుసుకోవటం తనవల్ల కాలేదన్నాడు. దేవతలంతా ఈ సారి వాయువును ప్రార్ధించారు. ఆ తత్త్వం ఏమిటో తెలుసుకోమని అర్ధించారు. సరేనన్నాడు వాయువు. ఆ తత్త్వం దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు
ఆ భూతం వాయువుతో అన్నది.

భూతం : ఎవరు నువ్వు ?
వాయువు : నేను వాయుదేవుడను. ఆకాశంలో చరిస్తుంటాను. అందుచేత నన్ను మాతరిశ్వుడంటారు.
భూతం : నీ గొప్పతనం ఏమిటి ?
వాయువు : ఏ వస్తువునైనా క్షణాల్లో ఎగరగొట్టగలను.
భూతం : అలా అయితే ఈ గడ్డిపరకను ఎగరగొట్టు.
వాయుదేవుడు తన శక్తి అంతా కూడదీసుకుని గాలులు వీచాడు. గడ్డిపరక కదలను కూడా లేదు. అవమానంతో వెళ్ళిపోయాడు వాయువు, దేవతల దగ్గరకు వెళ్ళి ఆ తత్త్వం ఏమిటో తనకు తెలియలేదు అన్నాడు. ఈ సారి దేవతలు ఇంద్రుణ్ణి వెళ్ళమన్నారు.ఇంద్రుడు బయలుదేరి ఆ తత్త్వాన్ని సమీపించాడు.

ఆ తత్త్వం మాయమైపోయింది. ఆ స్థానంలో ఉమాదేవి ఉన్నది. అప్పుడు ఇంద్రుడు ఆమెతో అమ్మా ! ఇప్పటి దాకా ఇక్కడ ఉన్న తత్త్వం ఏమిటి ? అన్నాడు అందుకు ఉమాదేవి.

దేవేంద్రా ! అదే పరబ్రహ్మతత్త్వము. దాన్ని మీరు గుర్తించలేకపోయారు. ఆ తత్వానికి నాకూ తేడా లేదు. మేమిద్దరమూ ఒకటే అని చెబుతుంది. ఈ రకంగా పరబ్రహ్మను
ముందుగా దర్శించినవాడు కాబట్టే ఇంద్రుడు దేవతలకు రాజయినాడు. అగ్ని వాయువులు దిక్పాలకులయినారు అని చెప్పబడింది.

634: Uma

'Uu' means Shiva. "Ma' means Parvati. Uma means Shiva and Shakti. 

When devatas pray Divine Mother to kill Tarakasura, She says, "A son will be born to the daughter of the Mountain king 'Himavant' and Lord Shiva. He will kill Tarakasura. After sometime, Menaka, wife of Himavant gives birth to a girl child. She grows up thinking about Shiva always. As she reaches adulthood, she determines to marry Lord Shiva. Shiva is in deep meditation at that time. So to reach Shiva, she also decides to goto forest and do tapasya. But her mother Menaka becomes worried about her daughter. She says, 'Uu - My daughter'. 'Ma - Don't go'

Uma means - The one who is great and noble. It is said like this in Sutha Samhita, "I salute to Uma! The one that can help experience the bliss of Atma. The one that can destroy the sins. The one that has a glow greater than Sada Shiva. The one who is great and glorious in many ways.

Pranava has three syllables. 'Aa' represents Vishnu. 'Uu' represents Shiva and 'Mm' represents Brahma. Uma is the pranava of Divine Mother that represents the gods of creation, sustenance and destruction.

In Linga purana, Shiva said this to mother, 'My pranava has syllables 'Aa', 'Uu' and 'Mm'. Your's has 'Uu', 'Mm and 'Aa'.

In Maha Vashishtyam, it is said that Divine mother is called 'Uma' because it represents the essence of 'Aum' or 'Om'

Uma means the radiance of moon that inspires the hearts of everyone.

In Shiva Sutras, Uma is explained is the power of determination.

Uma means glow - 'Ya devi sarvabhooteshu kanthi roopena samsthita'


634. ఉమా

ఉకారము శివుడు. మా అంటే పార్వతి. ఉమ అంటే శివశక్తులు అని అర్ధం.

తారకాసుర సంహారం కోసం దేవతలు పరమేశ్వరిని ప్రార్ధించారు. అప్పుడు ఆమె వారికి ప్రత్యక్షమై నా అంశతో హిమవంతునికి ఒక కుమార్తె పుడుతుంది. ఆమెను శివునకిచ్చి వివాహం చెయ్యండి. వారిద్దరికీ పుట్టిన కుమారుడు తారకుని సంహరిస్తాడు అని చెబుతుంది. కొంతకాలానికి హిమవంతుని భార్య మేనక గర్భవతి అయి ఆడపిల్లను ప్రసవించింది. ఆ బాలిక దినదిన ప్రవర్ధమానమైంది. సర్వకాల సర్వావస్థలయందు శివనామాన్నే జపిస్తుండేది. రానురాను తాను శివుణ్ణి తప్ప వేరెవరినీ వివాహమాడను అని తేల్చి చెప్పింది. ఆ సమయంలో శివుడు విరాగియై తపోదీక్షలో ఉన్నాడు. అతణ్ణి భర్తగా పొందాలంటే తపస్సు ఒక్కటే మార్గం. అందుకని తపస్సు చెయ్యటానికి ఇంటి నుంచి బయలుదేరింది. అప్పుడు తల్లి అయిన మేనక కుమార్తెను వారిస్తూ ఉ - ఓయమ్మా, మా - వద్దు అన్నది. అప్పటి నుండీ ఆమెకు 'ఉమా' అనే పేరు సార్ధకమై పోయింది.


ఉత్తమమైన చిత్తవృత్తి గలది. సూతసంహితలో పరానుభూతియు, సంసార పాపములను నశింపచేయునదియు, సదాశివుని కన్న మించిన శోభనసంపద గల ఉమ అను పేరు గల అనేక విధాలయిన వైభవముగల ఉత్తమ చిత్తవృత్తికి మ్రొక్కెదను అని చెప్పబడింది.

విష్ణు శివ బ్రహ్మ వాచకములైన అకార ఉకార మకారములతో కూడిన త్రిమూర్త్యాత్మకమైన ప్రణవస్వరూపిణి. అందుచేతనే ఉమా అంటే - దేవీ ప్రణవము అని చెప్పబడినది.

లింగపురాణంలో శివుడు దేవితో “అకార ఉకార మకారములు నా ప్రణవము. ఉకార మకార అకారములు నీ ప్రణవమందు గలవు' అంటాడు.

మహావాసిష్టంలో “ఓంకార సారశక్తి గలదగుటచే ఉమ అని కీర్తించబడింది" అని చెప్పబడింది.

ఉమ అంటే చంద్రకళ. ఇది ముల్లోకాలలోను నిద్రించువారి మేల్కొనువారి హృదయాలను ప్రేరేపిస్తుంది.

శివసూత్రాలలో ఇచ్ఛాశక్తి ఉమాకుమారి అని చెప్పబడింది. యోగుల యొక్క ఇచ్ఛకు ఉమ అని పేరు, సింధువనమున ఉండే దేవత.

ఉమా అంటే - కాంతి అని అర్ధం.
యా దేవీ సర్వభూతేషు కాంతిరూపేణ సంస్థితా
అన్ని జీవులయందు కాంతిరూపంలో ఉంటుంది.

ఆరు సంవత్సరాల బాలికను కూడా ఉమ అంటారు.

630: Tridaseswari

దేవతలకు ఈశ్వరి. మూడు అవస్థలకు ఈశ్వరి. పదముగ్గురువిశ్వేదేవతలకు ఈశ్వరి. ముఫ్ఫైమూడుగణాలకు ఈశ్వరి.

త్రిదశలు - బాల్య కౌమార యవ్వన వార్ధక్యములనబడు దశలలో ఎల్లప్పుడూ మూడవదశయందే ఉండేవారు - దేవతలు.
ధర్ముడు అనేవాడు ఒక మనువు. అతడికి పదిమంది భార్యలు. అందులో విశ్వ అను భార్యకు పుట్టినవారు విశ్వేదేవతలు.
దేవతలకు, విశ్వేదేవతలకు కూడా ఈశ్వరి.

33 మంది దేవతలకు ఈశ్వరి. వీరు

ఏకాదశరుద్రులు - 11
ద్వాదశాదిత్యులు - 12
అష్టవసువులు -8
ఇంద్రుడు, ప్రజాపతి - 2
మొత్తం - 33 మంది

వీరిలో ఒక్కొక్కరికీ కోటి మంది పరిచారికలు ఉంటారు. మొత్తం 33 కోట్లు. 

యజ్ఞాలలో హవిర్భాగం తీసుకునేది వీరే.

జాగ్రస్వప్నసుషుప్తులందు మార్పులేని శరీరాభిమాని అయిన దేవత.

సృష్టిస్థితిలయాలనబడే మూడుదశలకు ఈశ్వరి.

She is Īśvarī to all gods and goddesses.  She is the Īśvarī of tri-daśa-s.  In human, there are four stages – child, youth, middle age and old age.  However, gods have only one stage of eternal youthfulness. Hence gods and goddesses are known as tri-daśa.  She is the chief of all tri-daśa-s (gods and goddesses). 

Tri means three and daśa means ten.  3 x 10 gives numeric 30. Another three is to be added to this making it as 33.  Twelve Āditya-s, eight Vasu-s, eleven Rudra-s, and two Aśvin-s, thus making thirty three.  She is the chief of all these thirty three gods.  Each of these thirty three gods has 10,000,000 (ten million or one crore) assistants and they can be explained as demigods and demigoddesses.  This explains 33 crore gods (330 million).

She is also the Īśvarī for three stages of human consciousness – sleep, dream and deep sleep stages. 

She is also Īśvarī for creation, sustenance and destruction.

629: Trimurtih

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురూ ఒకటై పరస్పరం చూసుకున్నారు. ఆ దృష్టి నుండి దివ్యరూపమైన కన్యకామణి పుట్టింది. ఆమె నలుపు, తెలుపు పీతవర్ణాలు కలిగి ఉన్నది. ఆ బాలిక వారితో "నేను భగవదృష్టితో పుట్టాను నేను సర్వశక్తి సమన్వితమైన పరమేశ్వరిని” అని చెప్పింది.

కాబట్టి పరమేశ్వరి త్రివర్ణములు కలిగి ఉన్నది. ఆమె త్రిమూర్తి. ఆమె శ్వేతవర్ణం గలిగి సత్వగుణంతో బ్రహ్మనిష్ఠురాలుగా, రక్తవర్ణం గలిగి రజోగుణంతో వైష్ణవిగా, పసుపువర్ణం గలిగి తమోగుణంతో రౌద్రిగా పిలువబడుతుంది. పరమాత్మ ఒక్కడే అయినప్పటికీ మూడురకాలుగా త్రిమూర్తులుగా ఉన్నట్లుగానే, దేవి ఒక్కతే అయినప్పటికీ ప్రయోజనం కోసం మూడు విధాలపుతున్నది. ఆవిడే మన అమ్మ.

Once BrahmaViṣṇu and Śiva looked at each other. A young girl appeared from their looks. Then the Lords asked the girl, "Who are you?".  She replied, "I am the Śaktī, the combined form of all the three of you.  I am made of three colours, white, greenish black and red.  White colour represents her sattvic nature. Red colour represents the Vaishnavi shakti. The third colour is yellow, representing Roudri and  tamo guṇa."  

It is said that the Para Brahma has divided into three, BrahmaViṣṇu and Rudra.  The same three combined to form Śaktī. She is One into many and many into One.  That one is the Para Brahma.  Para Brahma is the cause and Śaktī is the effect.  

627: Tripura

Brahma, Vishu and Maheswara - Trimurthys. Aahavaneeya, Gaarhapatya and Dakshina agnis. Ichcha Gnana and Kriya shaktis. Vaama, Jyeshta and Rudra. Bhu Bhuvar and Suva lokas. Swarga, Martya and Pataala lokas. Ganga, Yamuna and Saraswathi rivers. 3 Brahmas. 3 varnas. 'Aa', 'Uu' and 'Mm' syllables. Everything that is explained as 3 aspects is called Triputi. Because Divine Mother is the personification of all these, she is called Tripura.

బ్రహ్మ విష్ణు రుద్రులు. ఆహవనీయ, గార్హపత్య, దక్షిణాగ్నులు. ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తులు. వామజ్యేష్ఠరౌద్రులు.  భూలోకభువర్లోక సువర్లోకాలు. స్వర్గమర్త్యపాతాళాలు. గంగాయమున సరస్వతులు. త్రి బ్రహ్మాలు, త్రివర్ణములు, అకారఉకారమకారాలు. ఈ రకంగా మూడుగా ఉన్నవన్నీ త్రిపుటి. అదే త్రిపుర. వాటి స్వరూపమే కాబట్టి ఆమె త్రిపురా అనబడుతుంది.

621. Anekakotibrahmandajanani

అనంతమైన - లెక్కించటానికి సాధ్యం కానటువంటి బ్రహ్మాండాలను సృష్టించినది. ఆ బ్రహ్మాండాలకు తల్లి. బ్రహ్మాండానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో మజ్జత్ బ్రహ్మాండ మండల అనే నామంలో వివరించాము.

స్థూలమైన పంచభూతాల చేరికయే బ్రహ్మాండము. ఆ బ్రహ్మాండాభిమాని విరాడ్రూపుడు. ఆ విరాడ్రూపుని సృష్టించినది, అతనికి తల్లి. వేదంలో విరాట్పురుషుడు బ్రహ్మాండానికి ఆత్మ, స్వరాట్ స్వరూపము అని చెప్పబడింది. అంటే బ్రహ్మాండానికి ఆత్మ, శరీరము అయిన విరాట్, స్వరాట్లను దేవతలకు తల్లి.

మనం నివసించే ఈ జగత్తు దిక్పాలకులతో, సూర్య చంద్రాది గ్రహాలతో, త్రిమూర్తులు, త్రిశక్తులు మొదలైన వారితో నిండి ఉన్నది. ఈ రకంగా ఉన్న స్థావరజంగమాత్మకమైన జగత్తే ఒక బ్రహ్మాండము. ఇటువంటివి అనేక కోటి బ్రహ్మాండాలను సృష్టించింది లలితమ్మ.

మహాసంకల్పంలో ఇలా వర్ణిస్తారు

మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమమాణానాం
అనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే

మహా జలరాశి నడుమ పరిభ్రమిస్తున్నటువంటి అనేక కోట్ల బ్రహ్మాండాలయందు ఒకదానిలో మనము ఉన్నాము. మనమున్నది భూలోకం. దీని క్రింద ఏడు లోకాలున్నాయి. అలాగే పైన ఆరులోకాలున్నాయి.

అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ సప్తలోకానాం ఉపరితలే.......

భూ, ర్భువ, స్సువ, ర్మహ, ర్జన, తప, సత్య మితి సప్తలోకానాం అథోభాగే.......

There are infinite brahmandas in this universe. Divine mother is the mother of all the brahmandas. We have given the scientific explanation of why a Brahmanda is called like that in the nama 'Majjath brahmanda mandala'

Brahmanda is the culmination of all the five elements. Virat purusha is the Atma of the Brahmanda and Swaraat is its form and shape. Divine mother is the mother of the Viraat and Swaraat devatas.

The world we live in has Dikpalakas, planets and stars, Trimurthys, Trishaktis etc. Brahmanda is the subtle and combined form of all these stationary and moving things.

In Maha Sankalpa, it is described like this

Mahajaloughasya madhye paribhramamaanaanaam
Anekakoti brahmandanam ekatame

We are living on the earth that is continuously rotating along with infinite brahmandas in the great cosmic ocean. This have 7 lokas outside and 7 lokas inside. They are:

Atala, vitala, sutala, talatala, rasatala, mahatala, patala - Lokas that are outside
Bhuh, Bhuvah, Suvah, mahah, janah, tapah, satya - Lokas that are inside

618: Aatma

ఆత్మ అంటే - జీవుడు. అగ్నిలో నిప్పురవ్వలు ఏరకంగా ఉంటాయో, అలాగే పరమేశ్వరునిలో ఈ జీవులందరూ ఉంటారు.

శివుని యొక్క ఎనిమిదవ మూర్తి ఆత్మ. ఇది మిగిలిన ఏడు మూర్తులను వ్యాపించి ఉన్నది కాబట్టి విశ్వమంతా వ్యాపించి ఉన్నది అని అర్ధం.

ఆత్మ అంటే - పరబ్రహ్మమే. ఆ పరబ్రహ్మయే జీవులన్నింటి యందు బ్రహ్మరంధ్రం గుండా ప్రవేశించాడు అని చెప్పటం జరిగింది.

ఆత్మ అనేది అధోరణీయాం మహతో మహీయాం అణువుకన్న చిన్నదైనది. మహత్తు కన్న పెద్దదైనది. ఆది మధ్యాంతములు లేనిది. సృష్టి స్థితిలయాలకు కారణభూతమైనది, నిరాకారమైనది, నిర్గుణమైనది, అన్నింటికీ సాక్షీభూతమైనది, జీవులు చేసిన కర్మలకు తగిన ఫలితాన్ని ఇచ్చేది, సత్యము, నిత్యము అయినది, జ్ఞానమయమైనది, అనంతమైనది, అపరిచ్ఛిన్నమైనది, ఆనందమయమైనది, స్వతంత్రము, స్వతఃసిద్ధము, స్వతః ప్రమాణము గలది, నిర్మలము, నిశ్చయము, శుద్ధము, అనంతము అయినది. ఇదే ఆత్మ.

ఆత్మ అంటే - పరబ్రహ్మమే. ఆత్మ అమేయము. ఇది సర్వవ్యాప్తి. ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నది కాబట్టి దీన్ని కొలవటానికి వీలులేదు. ఆత్మను తెలుసుకోవటం కష్టము. ఇంద్రియాలచేత ఇది తెలుసుకోబడదు. ఆత్మ ఉండే చోటికి కనులుగాని, చెవులుగాని మనస్సుగాని పోలేవు. ఇంద్రియాలకు అతీతమైనది. ఇంద్రియాలకు ఆ శక్తినిచ్చేదే ఆత్మ. కళ్ళకు చూసే శక్తిని ఇచ్చేది ఆత్మ. చెవులకు వినికిడి శక్తిని ఇచ్చేది ఆత్మ. మనసుకు ఆలోచించే శక్తిని ఇచ్చేది ఆత్మ. ఈ రకంగా ఇంద్రియాలకు వాటి శక్తినిచ్చేదే ఆత్మ. కాబట్టి ఆత్మను ఇంద్రియాల ద్వారా తెలుసుకోలేము. అందుకే అది ఆమేయాత్మా అనబడుతున్నది. 

ఆత్మ వేదికపైన ఉన్న దీపం వంటిది. దీపం ఉన్నంత వరకే నాటకం జరుగుతుంది. అది ఆరిపోతే నాటకం ఆగిపోతుంది. కానీ నాటకంలో జరిగే ఏ విషయం దీపాన్ని ప్రభావితం చేయలేదు. వేదిక మన శరీరం. జీవితం నాటకం. ఆత్మయే  దీపం. 

Atma means Jeeva. Just like how sparks live in fire, all jeevas are live of Paramatma

Atma is the 8th form of Shiva. It is spread across the remaining seven forms. Hence it is spread across the whole universe

It is described in previous names that the Paramatma enters the body through brahma randhra. That is called Jeeva/Atma.

Atma is stateless. It is larger than the largest. Smaller than the smallest. It neither has a beginning nor an end. It is the reason for the Creation, Sustenance and Destruction. It is shapeless, it has no attributes. It witnesses everything. It gives the results based on your karma. It is the truth. It is everlasting. It is the embodiment of knowledge. It cannot be torn or destroyed. It is the ultimate happiness. It is free. It is pure. It is Atma.

Atma means parabrahma. It is boundless. Spread everywhere. Not perceivable by senses. Eyes cannot see it. Ears cannot hear it. Mind cannot think of it. It is the one from which the senses draw their energy. It gives the power of vision to eyes. The power hearing to ears. The power of thinking to Mind. Hence it cannot be reached by senses. Hence it cannot be measured.

Its like a lamp on the stage. The drama continues as long as the lamp is on. If the lamp is off, the drama stops. But the lamp is never influenced by anything that's happening on the stage. Body is the stage and life is the drama. Atma is the lamp.

616. Aadhi Shaktih

సమస్త జగత్తులనూ సృష్టించేది కాబట్టి ఆదిశక్తి. ఇచ్ఛాశక్తి స్వరూపురాలు. జగత్సృష్టికి కారణమైనది. సకలసృష్టికీ కారణమైన మొదటి శక్తి, మాయాశబలితరూపము. ఈ జగత్తును సృష్టించాలి అనుకుని పరమేశ్వరుడు తనను తాను రెండుగా విభజించుకున్నాడు. ఆ సమయంలో పరబ్రహ్మ నుంచి బయటకు వచ్చినదే శక్తి. అదే మాయాస్వరూపము. నామరూపాత్మకమైన జగత్తు అంతా ఆ శక్తినుంచే ఆవిర్భవించింది. అన్ని శక్తులు దానిలోనే ఉన్నాయి. కాబట్టి అది మూలశక్తి. అన్నింటికీ చైతన్యరూపమైన ముఖ్యప్రాణశక్తి, ఐశ్వర్యప్రదాయిని అయిన లక్ష్మికి, విజ్ఞాన ప్రదాయిని అయిన సరస్వతికి కూడా మూలశక్తి అదే ఆదిశక్తి.

Divine mother is the reason for this entire creation. She is the small lamp of light that glows in this dark aura of ignorance. The original source of light that shatters the darkness of ignorance when one practices yoga. Paramatma thought of creation and divided himself into Shiva and Shakti. That Shakti is the first energy in this creation. All other energies came from it. The vital life force behind everything. She is the force behind goddess Lakshmi who gives wealth and goddess Saraswathi who gives knowledge.

612. Kalaatmika

కళలు మొత్తం 16. అవి

  1. జాగ్రదవస్థలో నాలుగు. అవి - 1. ఉత్పత్తి 2. జాగ్రత్త 3. బోధ 4. మనోవ్యాపారము.
  2. స్వప్నావస్థలో నాలుగు. అవి - 1. అభిలాష 2. భ్రమ 3. చింత 4. విషయవాంఛ
  3. సుషుప్తిలో నాలుగు. అవి - 1. మరణము 2. పరాకు 3. మూర్ఛ 4. నిద్ర
  4. తురీయావస్థ నాలుగు అవి.1. వైరాగ్యము 2. మోక్షేచ్ఛ 3. మనశ్శుద్ధి 4. సద్వస్తు విచక్షణ.
ఈ పదహారుకళలూ అమ్మ స్వరూపాలే. అందుచేత కలాత్మికా అనబడుతుంది.

There are 16 kalas(arts) in total. They are
  1. 4 in the Jagrut(awake) state - 1.Production, 2.Caution, 3. Learn, 4. Mental activities
  2. 4 in Swapna(dream) state - 1.Wish, 2. Illusion, 3. Though, 4. Desire
  3. 4 in Sushupti(deep sleep) state - 1. Death, 2. Unaware, 3. Unconsciousness, 4. Sleep
  4. 4 in Tureeya(Trance) state - 1. Freedom, 2. Eye on Moksha, 3. Pure mind, 4. Discretion of good and bad.
All the 16 kalas are forms of Divine mother. Hence she is called kalatmika

611. Prathipanmukhyaraakaanthathithimandalapoojitha

తిథులు నిత్యాస్వరూపాలు. అర్చనా విధానంలో ఆ రోజు ఉన్న తిథి ఆధారంగా, ఆ రోజున ఉండే నిత్యాదేవతను అర్చించాలి. పాడ్యమినాటి నిత్యాదేవత కామేశ్వరి. విదియనాడు భగమాలిని. ఈ రకంగా రోజూ తిథుల మాదిరిగానే నిత్యాదేవతలు కూడా మారుతుంటారు. ఇలాగే ప్రతిరోజూ ఒక్కొక్క నిత్యను పదిహేను తిథులయందు అర్చిస్తూ, పదహారవ నిత్య అయిన మహాత్రిపురసుందరిని ప్రతిరోజూ అర్చించాలి. ఇది తిథిమండల పూజ. నిత్యాదేవతలు అమ్మ స్వరూపాలే. అందుచేతనే నిత్యాదేవతల స్థితిని బట్టి అర్చించబడుతుంది.

In sanaatana dharma, days are counted as Thithis. A month has two halfs(paksha). Each half has 15 thithis. The thithi at a particular time is defined by the status of the moon.

In the process of thithi mandala pooja, each thithi is assigned to a Nitya. So we have 15 Nityas. Like the Nithya of Padyami(1st thithi) is Kameswari. Nitya of Vidiya(2nd thithi) is Bhagamaalini etc. The lustre of each Nitya is same as that of moon on that particular thithi. The 16th Nitya is our Divine mother. Her luster is Nithyakala. She is the culmination of all the 15 Nityas. So in thithi mandala pooja, one has to worship the Nitya of the thithi at that time and Divine mother. Each Nitya will be worshipped once and Divine mother will be worshipped on all the 15 days of a paksha.

608. Deveshi

దేవానాం బ్రహ్మవిష్ణ్వా దీనాం ఈశీ ఈశ్వరీ

బ్రహ్మ, విష్ణువు మొదలైన దేవతలకు ఈశ్వరి, పంచదశీ మహామంత్రాన్ని జపించి తరించిన వారిలో విష్ణువు, శివుడు, ఇంద్రుడు, అగ్ని, సూర్యుడు ఇత్యాది దేవతలు ప్రముఖులు. కాబట్టి అటువంటి దేవతలకు కూడా ఈశ్వరి.

దేవీ భాగవతంలో మధుకైటభ సంహారం చేసిన తరువాత దివ్యమైన విమానంలో త్రిమూర్తులు మణిద్వీపం చేరి, అక్కడ పరమేశ్వరిని దర్శించి, ఆమెను పరిపరివిధాల కీర్తిస్తారు.
(మధుకైటభ సంహారం అంటే అరిషడ్వర్గాలను తెగ నరికి అహంకారంపై విజయం సాధించటమే)

వృత్రాసురుని బాధలు పడలేక స్థితికారకుడైన విష్ణుమూర్తితో కలిసి దేవతలంతాహిమాలయాలకు వెళ్ళి ఆ పరమేశ్వరిని నియమనిష్ఠలతో పరిపరివిధాల ప్రార్ధిస్తారు.

శుంభనిశుంభులు దేవతలను నానాబాధలు పెడుతుంటే సహించలేక చివరకు
హిమాలయ ప్రాంతాలకు వెళ్ళి

నమోదేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః
నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మృతాః ||

అంటూ పరిపరివిధాల ప్రార్ధించారు. ఈ రకంగా దేవతలందరిచేత పూజించబడిన దేవత. దేవతలకు ఈశ్వరి. కాబట్టి దేవేశి.

Vishnu, Shiva, Indra, Agni, Surya are the devatas who worshipped Divine mother with Panchadashi mantra. Eswari means the protector and leader. Because devatas seek Divine mother's protection and leadership, she is called Deveshi.

After triumph over demons Madhu and Kaitabha, Trimurthy's go to manidweepa to visit Divine mother and pray her with gratitude.

(Madhu means 'I' and Kaitabha means 'Mine'. Victory over them means victory over the ego and thereby victory over the 'Arishadvarga')

Devatas sought help from Divine mother to overcome the difficulties caused by Vrutrasura and Shumbha-Nishumbha.


Popular