Search This Blog

858.Kalpana Rahitha

కల్పనా శక్తి మనస్సు వలన లభిస్తుంది. ఆత్మానందాన్ని గ్రోలుతున్న యోగిది  ఉన్మన స్థితి. పంచేద్రియాలనుంచి శక్తిని వెనక్కు లాగి మనస్సులో పెట్టి. మనస్సునుంచి వెనక్కు లాగి బుద్ధిలో పెట్టి, అహంకారపు పొరలను ఛేదించి, మూల ప్రాణంలో లయం చేసేస్తారు. అప్పుడు ఇంక ఆలోచనలు ఉండవు. ఊహలు, కల్పనలు ఇవేమీ ఉండవు. శుద్ధ జ్ఞాన స్వరూపమది. 

జాగృదావస్థలో ఇంద్రియాలు పనిచేస్తాయి. కానీ నిద్రావస్థలో అవి పనిచేయవు. స్వప్నాలు వస్తే మనస్సులో కల్పన జరిగినట్లు. లేదంటే మనస్సు కూడా పనిచేయట్లేదు అని అర్ధం. మేల్కొని ఉండగా ధ్యానంలో అటువంటి స్థితిని చేరుకుంటారు యోగులు. అది తురీయ స్థితి.  వారు అత్యంత గొప్పదైన ఆనందాన్ని పొందుతారు. దాని ముందు ప్రాపంచిక సుఖాలు నిలవవు. 

Mind is the organ that helps use generate thoughts. It helps us imagine things. But the consciousness of a yogi who is enjoying the bliss of Atma is above mind. They draw back energy from all the senses and put it in the mind. Then they dissolve mind and intellect in the moola praana. The sheath of ego (ignorance) is shattered. That is pure consciousness.

Senses work when we are awake. But they lie inactive when we are sleeping. If there are dreams, then the mind is active. But if no dreams, then even the mind is inactive. Yogis attain this state through meditation. It is called the state of 'thureeya '. They experience the highest rank of pleasure. It is superior to any other type of worldly pleasures.

853. Shantyateetha Kalaatmika

 


Liberation is of two types: 

1.Jeevan mukthi - Liberation while still alive. 
2.Videha mukthi - Liberation after death. 

Both these can be attained by the knowledge described in the previous names. One who attained Jeevan mukthi may still possess subtle hidden seeds of past actions. They will still go through the pleasures and hardships due this past karma. But they neither feel happy nor sad as they already transcended duality. They rather indulge in the bliss of Atma. Transcending the Jeevan mukthi stage is called Shantyateetha kala. That is a form of Divine mother.
Click here to refer the previous name - Janma mrityu jaraa thaptha jana vishraanthi daayini

ముక్తి రెండు రకాలు:
1. జీవన్ముక్తి  - శశీరంగా ఆత్మ దర్శనం చేయడం. 
2. విదేహ ముక్తి - శశీరం విడిచాక ఆత్మ దర్శనం చేయడం. 

ఈ రెండూ ముందు చెప్పిన నామాలలోని జ్ఞానం వలనే కలుగుతాయి. జీవన్ముక్తి పొందిన వారికి స్వల్పమైన సంచిత కర్మ ఇంకా మిగిలి ఉంటుంది (ఇంకా శరీరం పడిపోలేదు కాబట్టి). ఆ కర్మ వలన వారు కొన్ని ఒడిదుడుకులకు(సుఖదుఃఖాలు) లోనవుతారు. కానీ వారు దానికి చాలించరు. ఎందుకంటే వారు అప్పటికే ద్వైత భావనను ఛేదించి ఉంటారు. వారు ఆత్మానందాన్ని గ్రోలుతూ ఉంటారు. జీవన్ముక్తి స్థాయిని ఛేదించడం శాంత్యాతీత కల. అది అమ్మవారి రూపం. ముందు చెప్పిన నామాన్ని చదువుటకు ఈ లింక్ క్లిక్ చేయండి - జన్మమృత్యుజరాతప్తజనవిశ్రాంతిదాయినీ

852. sarvopanisha dudghushta

  


All upanishads talk about Divine mother. Vedas are divided into 3 parts. 1.Karma kaanda, 2.Upaasana kaanda, 3.Gnaana kaanda. Upaasana and Gnaana kaandas in these are called upanishads.

Upa means proximity
Ni means a step below
Shad means to sit

Upanishad means to sit close to and a step below to your guru and learn about paramaatma. You should never think that your are better than your guru. Irrespective of his status. You should learn from your guru with total focus and concentration of mind body and soul.

Upanishads are conversations between a guru and his disciples. A disciple who is in quest of truth approaches a guru who has known the paramaatma and serve him with strict discipline and devotion. When the guru is pleased, he will teach him the knowledge of Paramaatma. The disciple asks his doubts and guru answers all of them.

In total there are 1180 upanishads. Of these, 108 are most important. Of these, Eesha, Kena, Katha, Prashna, Mundaka, Maandukya, Thithirih, Aitareyam cha Chandogyam Bruhadaaranyakam dasah

1. Eeshavaasya, 2.Kena, 3.Katha, 4.Prashna, 5.Mundaka, 6.Maandukya, 7.Thithirih, 8.Aitareya, 9.Chandogya and 10.Bruhadaaranyaka upanishads are prominent as per Sri Shankara Bhagavathpaadaacharya.

Upanishads are the essence of vedas. They lay more emphasis on describing the various forms of paramaatma.

Brahmasatyam jaganmidhya
Paramaatma is the only truth. Rest all is an illusion

Satyam Gnaanam anantam brahma
Paramaatma is the purest form of truth and consciousness. It is imnipresent

Brahmavid brahmaiva bhavathi
One who learns about Paramaatma become Paramaatma.

852. సర్వోపనిష దుద్ఘుష్టా

అమ్మ అన్ని ఉపనిషత్తులలోనూ ప్రతిపాదించబడిన పరబ్రహ్మ స్వరూపిణి. వేదాలు మొత్తం మూడు కాండలుగా ఉన్నాయి. అవి 1. కర్మ 2. ఉపాసన 3.జ్ఞానకాండలు. వీటిలో ఉపాసన, జ్ఞానకాండలను ఉపనిషత్తులు అంటారు. ఉప అంటే సమీపము నందు ని అనగా దిగువ స్థానంలో షద్ అంటే కూర్చునుట
ఉపనిషద్ అంటే గురువుగారి దగ్గర ఆయన కన్న దిగువస్థానంలో కూర్చుని, వారు చెప్పే బ్రహ్మోపదేశాన్ని శ్రద్ధగా వినటం. మనోవాక్కాయ కర్మలలో ఎక్కడా కూడా గురువు తనకన్న తక్కువ వాడు అనే భావన రాకూడదు. గురువు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, అతను తనకన్న గొప్పవాడే అని మరిచిపోకూడదు. ఉపనిషత్తులన్నీ గురుశిష్య సంవాదంగానే ఉంటాయి. బ్రహ్మశోధకుడైన శిష్యుడు, బ్రహ్మజ్ఞాని అయిన గురువును సమీపించి, ఆయన దగ్గర నియమనిష్ఠలతో కొంతకాలం గడిపి, గురువుగారి అనుగ్రహం పొంది ఆయన దగ్గర బ్రహ్మోపదేశం పొందుతాడు. ఆ సమయంలో శిష్యుడు తన అనుమానాలను అడుగుతుంటాడు. గురువుగారు వాటినితీరుస్తుంటారు. వేదాలన్నింటికీ కలిపి 1180 ఉపనిషత్తులు ఉన్నాయి. వాటిలో 108 ముఖ్యమైనవి. అందులోనూ ఈశ కేన కఠ ప్రశ్న ముండక మాండూక్య తిత్తిరి: ఐతరేయం చ ఛాందోగ్యం బృహదారణ్యకం దశః 1. ఈశావాశ్యోపనిషత్తు, 2. మాండూక్యోపనిషత్తు, 3. కేనోపనిషత్తు, 4. తైత్తిరీయోపనిషత్తు, 5. కఠోపనిషత్తు, 6. ఐతరేయోపనిషత్తు, 7. ప్రశ్నోపనిషత్తు, 8. ఛాందోగ్యోపనిషత్తు, 9. ముండకోపనిషత్తు, 10. బృహదారణ్యకోపనిషత్తు ఇవి ముఖ్యమైనవి అన్నారు శంకరభగవత్పాదులవారు
వేదాల యొక్క సారాంశమే ఉపనిషత్తులు. వీటిలో పరమాత్మ స్వరూపాన్ని వివరించటానికి ఎక్కువ ప్రయత్నం చేశారు.
బ్రహ్మసత్యం జగన్మిథ్య
పరబ్రహ్మ ఒక్కటే సత్యము, నిత్యము అయినది.శాశ్వతమైనది. ఈ జగత్తు అశాశ్వతమైనది.
సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ
సత్యమైనది. జ్ఞానమయమైనది. అనంతమైనది ఆ పరబ్రహ్మ. బ్రహ్మవిద్ బ్రహ్మైవభవతి
బ్రహ్మమును తెలుసుకున్న వారు బ్రహ్మమే అవుతారు

851. Janma mrityu jaraa thaptha jana vishraanthi daayini

If it is true that a human being is an embodiment of everlasting joy, then why do they suffer at all? Let us discuss the answer for this in this name.


As shown in the figure above, karma repeats. What you go through is the result of your past karma. If it is good karma, then you will go through pleasurable moments. If it is bad karma, then you go through sorrowful moments. The pleasure or pain of past karma is actually an attribute of the human body. It is the body that goes through them. Due to ignorance, humans attach themselves to their bodies and this attachment makes them think that they are going through the pain. Learned scholars realize that it is the body that is going through the pleasure or pain and hence don't feel joyful or sorrowful due to that. They will receive both of them with balanced and conscious mind. With such steadfast mind they enjoy the bliss of Atma. This consciousness is the form of Divine mother.

Birth, ageing, death are common changes that everybody goes through. These transformations are painful. Divine mother removes the sorrow caused by these painful transformations by raising your consciousness levels. People are born due to karma of their past births. Then they do karma to live. And they die at the end. Death is inevitable. They take birth again. They go through lot of hardships during these cycles of birth and death. The suffering is twofold:

1. The difficulties or hardships one has to go through due to past karma
2. The unhappiness that they had to go through lot of hardships

The consequences of our past actions are like arrows shot from a bow. We cannot evade them. It is also unrealistic to expect that we will always be happy by doing only good deeds. Humans unintentionally kill millions of microorganisms with every breath. These organisms enter the body through the air we inhale, get trapped in the windpipe and perish. This causes negative karma, but it is inevitable. We can try to avoid doing harm deliberately, but not what happens unconsciously. The issue here is the unhappiness we experience when we face the difficulties of bad karma. Mother Lalitha alleviates this unhappiness. She does not remove the hardships, but she elevates our awareness to a level where we perceive them as qualities of the body and not of ourselves. Then, the cause of our sorrow or unhappiness disappears. That is why she is called janma mrityu jaraa thaptha jana vishraanthi daayini.

851. జన్మమృత్యుజరాతప్తజనవిశ్రాంతిదాయినీ

ఆనందమే మనిషి యొక్క నిజ స్వరూపమైతే అసలు ఇన్ని రకాల బాధలు ఎందుకు పడుతుంటారు? ఈ నామంలో దీని రహస్యం తెలుసుకుందాం.  


పైన బొమ్మలో చూపినట్లే మన కర్మ మనమే అనుభవిస్తాము. అది సత్కర్మ అయితే సుఖం లభిస్తుంది. చెడ్డకర్మ అయితే కష్టం కలుగుతుంది. ఈ కష్టం సుఖం శరీరానికి కలుగుతాయి. జీవుడు మాయ వలన తన నిజస్వరూపం ఆత్మ అని మరచిపోయి ఈ శరీరమే తాను అనే భ్రమలో ఉన్నాడు. అందుకే శరీరానికి కష్టం వస్తే బాధ సుఖం వస్తే సంతోషంగా భావిస్తున్నాడు. శాస్త్రాధ్యయనం చేసిన విజ్ఞులు ఈ కష్ట సుఖాలను తాము పూర్వము చేసిన కర్మల ఫలితముగా ఎరిగి వాటి వలన చలించిపోకుండా ఉంటారు. ఈ శాస్త్రాలు అన్నీ అమ్మ స్వరూపాలే. 

పుట్టటము, పెరగటము, ముసలితనం, మరణం ఈ రకమైన శారీరక మార్పులవల్ల ప్రతి జీవి అవస్థ పడుతూనే ఉంటుంది. అటువంటి అవస్థలను జనులకు లేకుండాచేసేది అమ్మ లలితమ్మ. ఈ సంసార సాగరంలో పూర్వజన్మ కర్మఫలితం వలన జన్మించటం జరుగుతుంది. పుట్టిన ప్రతిజీవికి శారీరకావస్ధలు తప్పవు. మరణం తధ్యం. ఈ ప్రక్రియలో అనేకమైన కష్టాలను జీవి అనుభవిస్తాడు. ఈ కష్టాలు రెండు రకాలుగా ఉంటాయి. 

1. కర్మఫలం వల్ల వచ్చే కష్టాలు. ఇవి అనుభవించక తప్పదు.
2. మానసికమైన బాధలు. కష్టాలు అనుభవించవలసి వచ్చిందే అని జీవి బాధపడుతుంటాడు. 

కర్మఫలంవల్ల వచ్చే కష్టాలు ఎక్కుపెట్టి వదిలిన బాణం లాంటివి. వాటిని అనుభవించక తప్పదు. కేవలం సత్కర్మలే చేసి సుఖములు మాత్రమే పొందాలి అనే కాంక్ష హేతుబద్ధమైనది కాదు. తెలిసి తెలిసి తప్పులు చేయక పోయినా తెలియకుండా అనేకమైన తప్పులు జరుగుతుంటాయి. మనిషి ఊపిరి పీల్చితే కొన్ని లక్షల సూక్ష్మ జీవులు స్వాశకోశంలో చిక్కుకుని మరణిస్తాయి. దాని వలన చెడ్డ కర్మ అనుభవించవలసి వస్తుంది. దానిని ఆప గలమా? అవి అనుభవించాల్సి వచ్చింది అని మనం పడే బాధ అసలు కష్టం కన్న ఎక్కువైనది. ఈ రకమైన బాధలను ముందుగా రూపుమాపుతుంది లలితమ్మ . తన పిల్లలకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించటంద్వారా శాశ్వతమైన ఆనందాన్ని పొందే అవకాశం కల్పిస్తుంది. భౌతికమైన కష్ట సుఖాలు ఈ శరీరానికి తప్ప ఆత్మ స్వరూపమైన నాకు కాదు అనే స్థాయిని కలుగజేస్తుంది కాబట్టి జన్మమృత్యుజరాతప్తజనవిశ్రాంతిదాయినీ అనబడుతుంది

850. Varnarupini

 


Divine mother is the form of all the Varnas. As per Vedas, there are four Varnas.

It is said like this in Purusha Sooktha
Braahmanasya mukhamaaseeth baahu raajanyah kruthah
Urootadasya yadvysyah padhbyaagm shoodro ajaayate

Brahmanas came from the face of Paramatma. Kshatriyas came from his arms. Vysya came from his thighs and Shudras came from his feet.

The one who teaches about Brahman (Paramatma) is Brahmana. He mainly uses the faculties of intellect and speech to spread the knowledge about Paramatma. He teaches dharma (as set of rules to obey in order to prosper). He has Sattva Guna for most of the time. He exhibits intellectual tendencies. The one who establishes dharma preached by Brahmins is kshatriya. He uses the power of his strong arms to ward off anti-social elements and acts as the protector/savior of the Kshetra (kingdom). He is always ready to sacrifice his life, if need be, to protect dharma. These are the warrior class. They have a mix of Satva and Rajo Guna. He exhibits intellectual and social tendencies. The one who learns the business secrets of various trades and brings prosperity to the society created by a kshatriya is called vysya. like thighs in the body, there is an element of secrecy is his demeanor. He protects these trade secrets and passes on to the next generations. They have a mix of Satva, Rajas and Tamo Guna. He exhibits social and physical (related to physical body) tendencies. A prosperous society has to be well fed and served. It requires laborer, farmers etc. who use their strength and stamina to serve the society. They are shudras. They are always inclined towards carnal pleasures. They have Tamo Guna for most of the time. They exhibit physical tendencies (related to physical body).

All of us are shudras by birth. It is because children lack the discretion of good and bad, right and wrong. After taking school and college studies, few children transform into a Brahmana, kshatriya or a shudra based on their karma and guna. These are called Dwija. They wear the sacred thread on their torso.

It is said like this Bhagavadgita
Chaaturvarnam mayaashrushtam guna karma vibhaagashah
I created the four varnas. Beings are classified into one of these based on their guna and karma.

It is said like this in Brihadaaranyakopanishath
In the beginning of the creation, there is only Paramatma. That is the dazzling light spread everywhere. That is Brahmana. Kshatriya or others are not yet created by then. Then Brahma thought, the brahmanas I created need protection. Then he created kshatriyas. Devatas like Indra, Soma, Varuna, Megha, Rudra and Yama are Kshatriyas. He assigned the duty of protecting Brahmanas to Kshatriyas. Even after that Brahma thought there is something lacking. He thought Brahmanas are learning about me, Kshatriyas are protecting them, but these people need prosperity to sustain. Then he created Vysyas. Their duty is to bring prosperity to the society. Then he created 8 Vasuvus, 11 Rudras, 12 Adityas, 13 Vishwedevatas, 49 Maruth Ganas and 93 Deva vysyas. Even after that Brahma thought there is something lacking. Then he created Shudras to feed and serve people of all these three varnas. Pooshudu is a Shudra. The earth is Poosha. She is feeding everyone.

Explanation
1. The one with Brahma Tejas is a Brahmana. He is in quest of truth. He is always yearning to know the Brahman (Paramatma). His face has the flow of Brahman.
2. The one who came to protect Brahmans is called Kshatriya. He duty is to protect. Hence, he has strong arms. So, he is born from the arms of Brahma.
3. The one who brings prosperity to the society is Vysya. Thighs are a secret place in the body. Not shown to others. Similarly, Vysya protects the wealth secrets and passes them on to next generations. So, he is born from thighs of Paramatma.
4. The one who feeds and serves all the above three varnas is a shoodra. He uses his strength and stamina to cultivate land, build houses etc. So, he came from Paramatma's feet.

850. వర్ణరూపిణీ


వర్ణముల యొక్క రూపమైనది. వేదంలో నాలుగు వర్ణాలున్నాయని చెప్పబడింది.

పురుష సూక్తంలో బ్రాహ్మణాస్య ముఖమాసీత్ బాహూ రాజన్యః కృతః ఊరూతదస్య యద్వైశ్యః పద్బ్యాగ్ం శూద్రో అజాయత పరమేశ్వరుని ముఖం నుంచి బ్రాహ్మణుడు, బాహువుల నుంచి - క్షత్రియుడు, ఊరువుల నుంచి - వైశ్యుడు, పాదాల నుంచి - శూద్రుడు జన్మించారు.

తన బుద్ధి బలము మరియు వాక్పటిమచే ఈశ్వర విభూతి అందరికీ తెలిసేలా చెప్పేవాడు బ్రాహ్మణుడు. అతడు ధర్మ బోధ చేస్తాడు. ఇతడు ప్రధానంగా సత్వ గుణంలో ఉంటాడు. ఇతడు ప్రధమంగా జ్ఞాన వాసన కలిగి ఉంటాడు. తన భుజ పరాక్రమముతో ధర్మ సంస్థాపన చేసే వాడు క్షత్రియుడు. ఇతను ధర్మ స్థాపన కోసం తన ప్రాణాలు కూడా అర్పిస్తాడు. అధర్మానికి సహించలేడు. ఇతడు ప్రధానంగా సత్త్వరజో గుణములతో ఉంటాడు. ఇతడు కొంత జ్ఞాన వాసన కొంత లౌక్య వాసన కలిగి ఉంటాడు. శరీరంలో తొడలు రహస్యంగా ఉంటాయి. అలాగే వైశ్యుడు లోకంలో ఉన్న వ్యాపార రహస్యాలను తెలుసుకుని తద్వారా వర్తక వాణిజ్యం నడుపుతాడు. తన వ్యాపార రహస్యాలను జాగ్రత్తగా కాపాడి తన భావి తరాలకు అందిస్తాడు. ఇతనివల్ల సమాజంలో ధన ధాన్య సమృద్ధి, భోగములు కలుగుతాయి. ఇతడు సత్త్వరజస్తమో గుణములతో ఉంటాడు. ఇతడు కొంత దేహ వాసన కొంత లౌక్య వాసన కలిగి ఉంటాడు. భోగములు అనుభవించుటయే జీవిత లక్ష్యంగా కాలం గడుపుతాడు శూద్రుడు. ఇతను భృత్యుడై ఇతరుల సేవ చేస్తూ ఉంటాడు. ఇతని కాయ కష్టం వలెనే మిగిలిన మూడు వర్ణాల వారు బ్రతుకుతారు. ప్రధానంగా తమో గుణములో ఉంటాడు. ఇతడు ప్రధమంగా దేహ వాసన కలిగి ఉంటాడు.

జన్మచే అందరూ శూద్రులే. ఎందుకంటే బాలురకు ధర్మ విచక్షణ ఉండదు. ఎప్పుడూ ఆట పాటలతో సరదాగా కాలం గడుపుదామని చూస్తుంటారు. విద్యాభ్యాసమొనర్చి గురువుల వద్ద శిక్షణ పొందిన తరువాత వారివారి గుణ కర్మలను బట్టి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులుగా మారుతారు. అలా మారిన వారిని ద్విజులు అని అంటారు. వీరు ఛాతీపై జంధ్యం ధరిస్తారు.

భగవద్గీతలో
చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః గుణాల, కర్మల విభాగంచేత నాలుగు వర్ణాలను నేను సృష్టించాను అంటున్నాడు భగవానుడు.

బృహదారణ్యకోపనిషత్తు
బృహదారణ్యకోపనిషత్తులో “నామరూపాత్మకమైన సృష్టికి ఆరంభంలో పరబ్రహ్మ స్వరూపం మాత్రమే ఉన్నది. అంటే విరాట్స్వరూపంలో ఉన్న అగ్ని. అదే బ్రాహ్మణరూపం. అంతవరకు క్షత్రియాది ఇతర వర్ణాలు లేవు. క్షత్రియులు లేకపోవటంవల్ల పాలనా వ్యవహారాలు కష్టమైనాయి. అప్పుడు బ్రహ్మ నేను బ్రాహ్మణుడను ఇవి నా విధులు” అని తలచి క్షత్రియుల్ని సృష్టించాడు. దేవతలలో ఇంద్రుడు, సోముడు, వరుణుడు,రుద్రుడు, మేఘుడు, యముడు మొదలైన వారంతా క్షత్రియులే ఇక్కడ ప్రజాపతి క్షత్రియుల్ని ప్రత్యేక ప్రయోజనం కోసం సృష్టించాడు. వారు బ్రాహ్మణులకు రక్షకులు. క్షత్రియుల్ని సృష్టించిన తరువాత కూడా బ్రహ్మ తన పనిలో కృతకృత్యుడు కాలేకపోయాడు. ధనాన్ని కూడబెట్టేవారు లేకపోవటంవల్ల తన పనిలో సమర్ధుడు కాలేకపోయాడు. అందుకని బ్రహ్మ వైశ్య జాతిని సృష్టించాడు. వసువులు, రుద్రులు, ఆదిత్యులు, విశ్వే దేవతలు, మరుత్తులు మొదలైన దేవతలను గణాలుగా సృష్టించాడు. వైశ్యులంతా గణాలుగా, సమూహాలుగా సృష్టించబడ్డారు. వసువులు 8, రుద్రులు 11, ఆదిత్యులు 12, విశ్వేదేవతలు 13, మరుద్గణాలు 49, దేవ వైశ్యులు 93 మంది. సేవకులు లేకపోవటంవల్ల బ్రహ్మ తన పనిలో సమర్ధుడు కాలేకపోయాడు. అందుచేత శూద్రులను సృష్టించాడు. పూషుడు శూద్రుడు. భూమియే పూష, పూషా దేవతయే అందర్నీ పోషిస్తున్నది అని చెప్పబడింది. వివరణ 1. బ్రహ్మ తేజస్సుతో ఉన్నవాడు బ్రాహ్మణుడు. సత్యాన్వేషి. బ్రహ్మదర్శనం కోసం పరితపించేవాడు. అతని ముఖం అగ్ని తేజస్సుతో ప్రకాశిస్తుంటుంది. 2. బ్రాహ్మణులను రక్షించటానికి వచ్చినవాడు క్షత్రియుడు. రక్షణ అతని విధి. కాబట్టి పరాక్రమ సంపన్నుడు. బాహు బలం కలవాడు. బ్రహ్మ యొక్క బాహువులే ఇతని జన్మస్థానం. 3. ధనం సంపాదించటానికి, రహస్యంగా ఉంచటానికి ఆవిర్భవించినవాడు వైశ్యుడు. గుహ్యమైన స్థానం ఊరువులు. అందుచేతనే వైశ్యుడు బ్రహ్మ ఊరువుల నుంచి ఉద్భవించాడని చెప్పబడింది. 4. వీరందరినీ పోషించాలి కాబట్టి శూద్రుడు జన్మించాడు. ఇతడి కర్తవ్యం మిగిలినవారి పోషణ. అందుచేతనే ఇతను పాదాలనుంచి పుట్టాడు. ఈ రకంగా అన్ని వర్ణాలవారు పరమేశ్వరినుంచే ఉద్భవించారు. కాబట్టి ఆమె వర్ణరూపిణీ అనబడింది.

847. Thalodari

 

తలము అంటే లోకము అని అర్ధం. లోకాలను ఉదరముగా గలది.విరాడ్రూపిణి.

దేవియొక్క పాదాది శిరః పర్యంతము చతుర్దశ లోకాలు అని భావిస్తే తలము అనే లోకము ఉదరము అవుతుంది. అందుచేత తలోదరి అనబడుతుంది. సర్వానికి కారణస్థానమైనది.

కృశించిన ఉదరము గలది.

Tala means surface, nature, world. Udara means stomach, Womb. Talodari means she who has all the lokas in her womb.

If you map all the14 lokas on Divine Mother from head to heels, Thala loka comes near her waist.

She who has a very thin womb.

846. Mantrasara

దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనం తు దైవతమ్

చరాచర జగత్తు అంతా కూడా దైవము యొక్క అధీనంలో ఉంటుంది. దైవం మంత్రానికి అధీనం అయి ఉంటుంది. కాబట్టి మంత్రానికి ప్రాముఖ్యత ఉన్నది. మననాత్ త్రాయత ఇతి మంత్రః మననము చేయుటవలన మననము చేయువానిని రక్షించునది మంత్రము. దేవతల దయకు పాత్రులు కావాలంటే మంత్ర జపం చెయ్యాలి. దీన్నే ఉపాసన అంటారు. అరణి మధిస్తే అగ్ని ఎలా పుడుతుందో అలాగే మంత్రాన్ని జపించినట్లైతే శక్తి పుడుతుంది. ఆ శక్తి సాధకుడికి సర్వార్ధాలూ చేకూరుస్తుంది. బీజాక్షరాలచే సంపుటం చేయబడిన మంత్రజపంవల్ల దేవతానుగ్రహం త్వరగా కలుగుతుంది. ఆయా దేవతల యొక్క తత్త్వాలకు అనుగుణమైన బీజాక్షరాలు ఋషులచేత సంపుటీకరణం చేయబడ్డాయి. పరమేశ్వరుని బీజం ఓంకారము.

మంత్రాలు మూడు రకాలు అవి
1. వైదికములు - వేదాలలో చెప్పబడిన మంత్రాలను వైదికమంత్రాలు అంటారు అవి జ్ఞానప్రదాలు.
2. తాంత్రికములు - కామ్యప్రదమైనవి తాంత్రికాలు.
3. అపభ్రంశములు - సంస్కృతంలో కాక ఇతర భాషలలో ఉన్న మంత్రాలను అపభ్రంశాలు అంటారు.

ఈ మంత్రాల సారాంశమంతా లలితమ్మే కాబట్టి ఆమె మంత్రసారా అనబడుతుంది.

Daivadheenam jagatsarvam mantraatheenam tu daivatam

The whole creation is in control of Devatas. These Devatas can be controlled by Mantras. Hence Mantras are quite significant.

Mananaath Traayate iti mantrah

Manthra came from the word Manana. Manana means to repeat inside the mind. That which will protect you by doing manana is called Manthra. A mantra is presided by a Devata. By chanting the mantra inside your mind and focusing on the presiding Devatha, you can please the Devatha. This is called upaasana. Hindu saints have embedded beejaaksharas in the mantras. The sound vibration of a mantra emits shakti that pleases it's devata. 'Om' is the beejakshara of Paramaatma.

Manthras are of three types:
1. Vaidikas - Those that are spelled out in Vedas.
2. Thaanthrikas - Those that fulfill desires.
3. Apabhramshas - Mantras of other languages (other than Sanskrit)

Divine mother is the essence of all these mantras. Hence, she is called Mantrasara.

845. Shastrasara

 


శాశించేది శాస్త్రము. ఈ రకంగా చెయ్యాలి. ఈ రకంగా చెయ్యకూడదు అని నిర్దేశించేదే శాస్త్రము. శాస్త్రాలు రెండు రకాలు. 1. పౌరుషేయాలు : ఇవి పురుషుడివల్ల చెప్పబడ్డాయి ఇవి మొత్తం పది. 1. పురాణాలు, 2. న్యాయశాస్త్రము, 3. మీమాంశ, 4. ధర్మశాస్త్రము, 5. శిక్ష, 6. కల్పము, 7. వ్యాకరణము, 8. నిరుక్తము, 9. ఛందస్సు, 10. జ్యోతిష్యము 2. అపౌరుషేయాలు : ఇవి సాక్షాత్తూ బ్రహ్మముఖం నుండి వచ్చినాయి. ఇవే చతుర్వేదాలు. ఈ రకంగా మొత్తం శాస్త్రాలు 10+4=14. వీటన్నింటి సారము లలితమ్మే. అందుచేతనే శాస్త్రసారా అనబడుతోంది.

Shashanamu means to command. Shastra means one that commands. Here 'command' means to tell what happens and what does not happen with certainty. Only science can do that. Shastra means applied science. There are two types of Shastras. They are:

1. Pourusheyas - These are taught by humans. There are 10 pourusheya shaastras. They are:
Puraanas, Nyaaya Shastra, Meemamsha, Dharma Shastra, Shiksha, Kalpa, Vyaakarana, Nirukta, Chandassu, Jyotisha.

2. Apourusheyas - These came directly from God. All the four vedas are Apourusheyas.

This way, there are 14 Shastras in total. Divine mother is the essence of all these shastras. Hence she is called Shastrasaara.

844. Chandah Saara

Chandas means meter. It is poetic meter used in versification of knowledge. Sacred scripts of Hindu mythology are written in the form of verses (shlokas). These verses are written abiding to the rules of Chandas. There are many types of Chandas like Trishtup, Anushtup, Gayatri etc. Gayatri Chandas is considered to be the most prominent of all of them. 

Learning stuff in the form of verses helps students to form patterns in their mind. Also, Hindu saints embedded beeja aksharas (letters impregnated with specific sound energy) in some of the verses. When these letters are spelled out while reciting the verse, the sound vibrations emitted will have positive effects on the student's mind.

Saara means essence. Divine mother is the essence of all these Chandas. Hence, she is called Chandas Saara.

పద్య రచనలో ఉండే నియమాలను ఛందస్సు అంటారు. సనాతన ధర్మంలో వాంగ్మయం అంతా ఛందోబద్దంగా ఉంటుంది. ఆలా రచించబడిన శ్లోకాలు చదివితే పిల్లల మెదడులో జ్ఞాన రంధ్రాలు ఏర్పడతాయి. వారు వాటిని ఎన్నటికీ మరిచిపోరు. అంతే కాక మన ఋషులు ఈ పద్యాలలో బీజాక్షరాలను అమర్చారు. వాటిని పలికినప్పుడు వచ్చే ధ్వని తరంగాలు మెదడుపై చాలా మంచి ప్రభావాన్ని చూపుతాయి. 

త్రిష్టుప్, అనుష్టుప్, గాయత్రి మొదలుగా అనేక రకాల ఛందస్సులు ఉన్నాయి. వీటన్నింటిలోనూ గాయత్రి అత్యుత్తమమైనది. 

ఈ సమస్త ఛందస్సుల సారం మన అమ్మ లలితమ్మే. అందుకే ఛందస్సారా అని పిలవబడుతోంది. 

843. Bhavachakra pravarthini


భవచక్రము అంటే సంసార చక్రం. అమ్మ ఈ సంసార చక్రాన్నిప్రవర్తింపచేస్తుంది కాబట్టి భవచక్ర ప్రవర్తినీ అనబడుతుంది.

మనుస్మృతి:
పరమేశ్వరుడు సమస్త భూతాలయందు వ్యాపించి సృష్టి స్థితి లయాలను ఎల్లప్పుడూ నడిపిస్తున్నాడు.

జన్మించిన తరువాత జీవి కర్మను చేస్తూనే ఉంటుంది. చేసే ప్రతీ కర్మకీ ఫలితం ఉంటుంది. ఆ కర్మఫలితాన్ని అనుభవించాలనే కోరిక ఉంటే, మళ్ళీ కర్మ చేస్తుంది. ఈ రకంగా సంసారమనే బండి చక్రంలో పడి గిరగిరా తిరుగుతూ ఉంటుంది. ఈ కర్మ చక్రం నుండి బయట పడాలంటే చేసిన కర్మ యొక్క ఫలితం పైన ఆశను త్యజించాలి. దానికి అమ్మను ఆశ్రయించాలి. ఆవిడ తన జ్ఞానమనే ఖడ్గంతో జీవుల కర్మ పాశాలను త్రెంచివేస్తుంది. అందుచేతనే ఆమె భవ చక్రప్రవర్తినీ అనబడుతుంది.

భవచక్రము అంటే - అనాహతము. అనాహతంలో ఉండేది, దహరాకాశరూపిణి. మన అమ్మ.

శ్రీచక్రంలోని శివచక్రాలు, భవచక్రాలనబడతాయి. వీటిని ప్రవర్తింపచేసేది కాబట్టి భవచక్ర ప్రవర్తినీ అనబడుతోంది.


Bhava chakra means the cycle of birth and death. Divine mother conducts and administers this. Hence, she is called Bhavachakra pravarthini

It is said like this in Manusmrithi:
Parameshwara is inside all beings and is administering the activities of creation, sustenance and destruction.

A being does karma always. When beings perform karma, it yields a result. If it enjoys the result, then it does karma again. That will yield another result. Then the being will do karma again to enjoy that result. Like this it gets entrapped in the karmic cycle. A being can escape the cycle of karma only when it sacrifices the result of karma. For that it has to take seek Divine Mother. She will axe its karmic bonds with her sword of consciousness.

Bhavachakra also means Anaahata chakra. Divine mother stays there as Daharaakaasha roopini.

All Shiva chakras in srichakra are called Bhava chakras. Divine mother is the administrator of all of them.



842. Bhavarogaghni


ఇక్కడ రోగము అంటే శాంతిని పాడుచేసేది అని అర్ధం. భవము అంటే సంసారము. నేను నాది అనే అహంకార మమకారాలు. మొదట్లో అవి తీపిగా అనిపిస్తాయి. అందుకనే మనుషులు వాటిలో చిక్కుకు పోతారు. కానీ అవి మనిషి శాంతిని పాడు చేస్తాయి. భవరోగము అంటే ఈ సంసారమనే రోగము. ఇది ఆత్మ సాక్షాత్కారానికి అవరోధంగా మారి శాంతిని పాడుచేస్తుంది. దాన్ని నాశనం చేసి భవబంధాలను తెంచివేసి తద్వారా జ్ఞానాన్ని కలిగిస్తుంది అమ్మ. సంసారబంధనాలు అనే సంకెళ్లను తెంచి వెయ్యాలంటే అమ్మ ధ్యానమే శరణము. దానివల్లనే అజ్ఞానం పటాపంచలవుతుంది. మాయ తొలగుతుంది. భవబంధాలనుండి విముక్తి కలుగుతుంది. అందుచేతనే భవరోగఘ్ని అనబడుతుంది.

Here the word 'Roga' represents lack of mental peace. 'Bhava' represents attachment to physical world. It represents the feeling of 'I' and 'Mine'. Initially, these feelings appear sweet and pleasant. So, humans take too much of them. But in reality, they are bonds that curtail freedom. They create obstacles in path to liberation and ruin mental peace. This is Bhavaroga. Divine mother destroys this Bhavaroga and frees you from all the bonds by raising your consciousness to the highest level. To those who want to overcome the shackles of Bhavaroga, Divine mother is the ultimate resort. She blows away the darkness of ignorance with her dazzling light of consciousness. She frees you. So, she is called Bhavarogaghni.

841.Bhavagyna

 


భావములను ఎరుంగునది. భావనమాత్రము చేతనే తెలియబడునది. పరమాత్మ ఇంద్రియాలవల్ల తెలియబడదు. ఉపనిషత్తులలో ఆత్మను కంటితో చూడలేము, చెవులతో వినలేము, చర్మముతో ఆత్మ ఉనికిని తెలుసుకోలేము అని చెప్పబడింది. ఆత్మను జ్ఞానంతో మాత్రమే తెలుసుకోగలము. ధ్యానం చేసేటప్పుడు ఆత్మ ఉన్నది అని భావన చేయాలి. ఆలా చెయ్యటంద్వారా యోగులు ఆత్మను తెలుసుకోగలరు. అందుచేతనే అమ్మ భావజ్ఞా అనబడుతుంది.

Bhavagyna means to be aware of all the feelings. Mother know all feelings. Feelings take us close to her. Upanishaths explained that Paramaatma cannot be known through senses. To know it, we have to raise our consciousness. While meditating, Yogi has to feel that Atma is inside the body. This feeling will take him/her close to Mother. That is why she is called Bhavagyna.

840. Mulavigraha Rupini

 


మూల అంటే కారణం. ఈ సృష్టి అంతటికీ పరమాత్మే కారణం. అటువంటి పరమాత్మ యొక్క స్వరూపం కాబట్టి మూల విగ్రహ రూపిణి అని అన్నారు. బీజ రూపంలో ఉన్న పరమాత్మ సృష్టి చేయాలి అని అనుకున్నాడు. అప్పుడు అందులోంచి ఒక శక్తి వచ్చింది. ఈ సృష్టిని సృష్టించింది. ఆ శక్తే మన లలితమ్మ. 

Here Mola means reason. Paramaatma is the reason for the whole creation. Divine mother Lalitha is its perceivable form. Initially, only Paramaatma existed. It thought of creation. Then Shakti came out of it. That Shakti created everything. That Shakti is Divine Mother Lalitha.

839. Mukthi Nilaya


పంచవిధముక్తులకు స్థానమైనది. పరమేశ్వరిని అర్చించేవారికి ఐదురకాల ముక్తులు వారి వారి అర్హతలను బట్టి లభిస్తాయి.

1. సార్షిరూపముక్తి - మణిపూరంలో పరమేశ్వరిని ఆరాధించేవారు దేవిపురానికి దగ్గరగా ఇంకొకపురము నిర్మించుకుని ఉంటారు. దీన్ని 'సార్షిరూపముక్తి' అంటారు. 2. సాలోక్యముక్తి - అనాహతంలో పరమేశ్వరిని అర్చించే వారు దేవి పట్టణంలోనే నివశించగలుగుతారు. దీన్ని 'సాలోక్యముక్తి' అంటారు. 3. సామీప్యముక్తి - విశుద్ధి చక్రంలో పరమేశ్వరిని ఆరాధించేవారు దేవికి అతి దగ్గరగా సేవకులుగా ఉంటారు. దీన్ని 'సామీప్యముక్తి' అంటారు. 4. సారూప్యముక్తి - ఆజ్ఞాచక్రంలో పరమేశ్వరిని పూజించేవారు వేరే దేహం ధరించి, దేవితో సమానమైన రూపంలో ఉంటారు. దీన్ని 'సారూప్యముక్తి' అంటారు. 5. సాయుజ్యముక్తి - సహస్రారంలో దేవిని అర్చించేవారు జన్మరాహిత్యం పొందుతారు. ఇది “సాయుజ్యము'.

Mukthi or liberation is of five types. Mother gives Mukthi as per the eligibility of those who seek her.

1. Saarshiroopamukthi - Those who pray Divine Mother at Manipura chakra get to stay close to Mother's abode. That is Saarshiroopamukthi.
2. Saalokyamukthi - Those who pray Divine Mother at Anaahata chakra get to stay in mother's abode. That is Saalokyamukthi.
3. Saameepyamukthi - Those who pray Divine Mother at Vishuddhi chakra get to serve mother with their own hands. That is Saameepyamukthi.
4. Saaroopyamukthi - Those who pray Divine Mother at Agnya chakra get a chance to take Mother's form and stay with her. That is Saaroopyamukthi.
5. Saayujyamukthi - Those who pray Divine Mother in Sahasraara chakra get the chance to stay with Mother forever. They don't have a rebirth. That is Saayujyamukthi.

838. Mukunda


ముక్తినిచ్చేది కాబట్టి ముకుందా అనబడుతోంది. పరమేశ్వరి తనను నమ్మినవారికి, జ్ఞానులకు వారి అర్హతలను బట్టి ముక్తినిస్తుంది.

కదాచి దాద్యా లలితా పుంరూపా కృష్ణవిగ్రహా
పరమేశ్వరి అయిన లలితాంబికయే. ముకుందుడు అనగా కృష్ణుని అవతారం ఎత్తింది.

సప్తశతి ద్వాదశోధ్యాయంలో వైవస్వతేం తరే ప్రాప్తే అష్టావింశతిత మే యుగే | శుంభ నిశుంభశ్ఛెవాన్ ఉత్పత్యేతా మహాసురౌ || నందగోపగృహే జాతా యశోదాగర్భసంభవా | తతస్తాన్నాశయిష్యామి వింధ్యాచలనివాసినీ || వైవస్వత మన్వంతరంలోని 28వ మహాయుగంలో శుంభ నిశుంభులని ఇద్దరు రాక్షసులు పుడతారు. అప్పుడు నేను నందగోపుని ఇంట యశోదా గర్భాన పుట్టి, వారిని సంహరించి, వింధ్యాచలం మీద ఉంటాను. అని చెప్పబడింది. అందుచేత లలితాంబికయే శ్రీకృష్ణుడు.

Mukunda means the one who gives 'Mukthi' (Liberation). Divine mother liberates those who seeks her.
Kadaachi daadyaa lalithaa pumroopaa krishnavigrahaa
Divine Mother Lalitha came in the avatar of Sri Krishna. Mukunda is one of the names of Lord Krishna

It is said like this in the 12 chapter of Sapta Sathi
Vaivaswatem tare praapte ashtavinmshathita me yuge |
Shumbha nishumbhaschaivaan utpthyethaa mahaasurou ||
Nandagopagruhe jaathaa yashodagarbhsambhavaa |
tatasthaannaashayishyaami vindhyaachalanivaasinee ||

I will take birth as son of Nanda gopal and Yashoda in the 28th maha yuga of Vaivashwatha manvantara and kill the demons Shumbha and Nishumbha. After that I will stay in the Vindhya mountains.

837. Viyatprasuh

 


వియత్ అంటే ఆకాశం. సృష్టి ఆవిర్భావ సమయంలో మొట్టమొదట ఆకాశం వచ్చింది. దానినుంచి వాయువు, దానినుంచి అగ్ని, దానినుంచి నీరు, దానినుంచి పృధివి, దానినుంచి చెట్లు, వాటినుంచి ఆహారం, దానినుంచి జంతువులు వచ్చాయి. ఆ ఆకాశం కన్నా ముందు ఉంది అమ్మ. ఆవిడనుంచే ఆకాశం వచ్చింది. అందుకే వియత్ప్రసూః అని అన్నారు. 

Viyat means sky or space. In the order of creation, sky came first. From it came air. from air came fire. From fire came water. From water cam earth. From earth came plants. Plants gave food. From food came all other animals. Divine mother is the only one that existed even before the sky or space. It came from Her. Hence she is called Viyatprasuh.

836. Veeramaatha


యుద్ధంలో వెన్ను చూపనివారు వీరులు. అటువంటి వారు లక్ష్యం కోసం ప్రాణాలను కూడా త్యాగం చేయగలరు. జ్ఞానవిద్యలో 'నేను' అనే అహంకారాన్ని పూర్తిగా వదిలి పెట్టడం కూడా అటువంటిదే. యోగి తన శరీరాన్ని అంతః కారణాలను పూర్తిగా త్యజించాలి. అలా అహంకారాన్ని అధికమిస్తేనే ముక్తి లభిస్తుంది. అందుకే ఆత్మ సాక్షాత్కారమే లక్ష్యంగా గల యోగులను వీరులు అంటారు. అటువంటి వీరులను అమ్మ ఎల్లపుడూ కాపాడుతుంది.

ఉత్సాహం సాహసం ధైర్యం బుద్ధిఃశక్తిః పరాక్రమః
షడైతే యత్ర తిష్టంతి తత్ర దేవో2పి తిష్టతి ఉత్సాహము, సాహసము, ధైర్యము, బుద్ధి, శక్తి, పరాక్రమము, ఇవి ఎక్కడుంటాయో దేవతలు కూడా అక్కడే ఉంటారు. ఇవన్నీ వీరుల లక్షణాలు.
మహావీరులైన త్రిమూర్తులు, ఇంద్రుడు, దిక్పాలకులు, కుమారస్వామి, గణపతిలకు తల్లి.

Veera means warriors. They don't fear of death. They fight for their goal till the end. In 'Gnana vidhya', overcoming 'I' is also similar. A Yogi has to shun his body and all the Antah karanas. He/She has to overcome the 'Ego'. Only then he/she will be liberated. That is why such yogis are called warriors. Divine mother is protecting such various always.

Utsaaham Saahasam Dhairyam buddhihShaktih paraakramah
Shadaite yatra thishtanthi tathra devopi thishtathi

Devatas enhance enthusiasm, spirit of Adventure, courage, wisdom, power and valor. These are marks of warriors.

She is mother of great warriors like Trimurthis, Indra, Dikpaalakas, Kumara swami and Ganapathi.

835. Vivikthastha

 


వివిక్తము అంటే లోకానికి దూరంగా అని అర్ధం. ధ్యానం చేసుకునే వారు భౌతికంగానూ మానసికంగానూ కూడా లోకానికి దూరంగా ఉండాలి. జనసంచారం లేని పవిత్రమైన ఏకాంత ప్రదేశం వెతుక్కుని అక్కడ ధ్యానం చేయడం ద్వారా భౌతిక దూరం పాటించవచ్చు. 

మానసిక దూరం పాటించాలంటే లోకైక విషయాలపై రాగ ద్వేషాలను వదిలెయ్యాలి. అప్పుడే మనస్సు పూర్తిగా పరమాత్మ వైపు తిరుగుతుంది. అటువంటి మనస్సులో అమ్మ స్థిరంగా నెలకొని ఉంటుంది. 

Viviktha means Solitude. One who wishes to meditate upon paramaatma should seek solitude both physically and mentally. They should find a place that is calm and out of reach to common public. The place should be auspicious. Then they get solitude physically.

They should shun any kind of attachment to worldly things. Only then the mind will be able to concentrate on Paramaatma. Such minds become abode for Divine Mother.

833. Panchashatpitharupini


There are 50 alphabets in Sanskrit language. This name signifies that Divine mother in these alphabets in the form of Shabda Brahma.

సంస్కృత భాషలో 50 అక్షరాలు ఉన్నాయి. ఈ 50 అక్షరాలలోనూ అమ్మ శబ్ద బ్రహ్మ రూపంలో ఉంటుంది. 

విశుద్ది చక్రం - Throat chakra


అనాహత చక్రం - Anaahata chakra


మణిపూర చక్రం - Manipura chakra


స్వాధిష్టాన చక్రం - Swaadishtaana chakra


మూలాధార చక్రం - Moolaadhaara Chakra


ఆజ్ఞా చక్రం - Agna chakra


Source of the images - https://www.karineisen.com/blog/chanting-the-sanskrit-alphabet

Popular