Search This Blog

858.Kalpana Rahitha

కల్పనా శక్తి మనస్సు వలన లభిస్తుంది. ఆత్మానందాన్ని గ్రోలుతున్న యోగిది  ఉన్మన స్థితి. పంచేద్రియాలనుంచి శక్తిని వెనక్కు లాగి మనస్సులో పెట్టి. మనస్సునుంచి వెనక్కు లాగి బుద్ధిలో పెట్టి, అహంకారపు పొరలను ఛేదించి, మూల ప్రాణంలో లయం చేసేస్తారు. అప్పుడు ఇంక ఆలోచనలు ఉండవు. ఊహలు, కల్పనలు ఇవేమీ ఉండవు. శుద్ధ జ్ఞాన స్వరూపమది. 

జాగృదావస్థలో ఇంద్రియాలు పనిచేస్తాయి. కానీ నిద్రావస్థలో అవి పనిచేయవు. స్వప్నాలు వస్తే మనస్సులో కల్పన జరిగినట్లు. లేదంటే మనస్సు కూడా పనిచేయట్లేదు అని అర్ధం. మేల్కొని ఉండగా ధ్యానంలో అటువంటి స్థితిని చేరుకుంటారు యోగులు. అది తురీయ స్థితి.  వారు అత్యంత గొప్పదైన ఆనందాన్ని పొందుతారు. దాని ముందు ప్రాపంచిక సుఖాలు నిలవవు. 

Mind is the organ that helps use generate thoughts. It helps us imagine things. But the consciousness of a yogi who is enjoying the bliss of Atma is above mind. They draw back energy from all the senses and put it in the mind. Then they dissolve mind and intellect in the moola praana. The sheath of ego (ignorance) is shattered. That is pure consciousness.

Senses work when we are awake. But they lie inactive when we are sleeping. If there are dreams, then the mind is active. But if no dreams, then even the mind is inactive. Yogis attain this state through meditation. It is called the state of 'thureeya '. They experience the highest rank of pleasure. It is superior to any other type of worldly pleasures.

No comments:

Post a Comment

Popular