Search This Blog

842. Bhavarogaghni


ఇక్కడ రోగము అంటే శాంతిని పాడుచేసేది అని అర్ధం. భవము అంటే సంసారము. నేను నాది అనే అహంకార మమకారాలు. మొదట్లో అవి తీపిగా అనిపిస్తాయి. అందుకనే మనుషులు వాటిలో చిక్కుకు పోతారు. కానీ అవి మనిషి శాంతిని పాడు చేస్తాయి. భవరోగము అంటే ఈ సంసారమనే రోగము. ఇది ఆత్మ సాక్షాత్కారానికి అవరోధంగా మారి శాంతిని పాడుచేస్తుంది. దాన్ని నాశనం చేసి భవబంధాలను తెంచివేసి తద్వారా జ్ఞానాన్ని కలిగిస్తుంది అమ్మ. సంసారబంధనాలు అనే సంకెళ్లను తెంచి వెయ్యాలంటే అమ్మ ధ్యానమే శరణము. దానివల్లనే అజ్ఞానం పటాపంచలవుతుంది. మాయ తొలగుతుంది. భవబంధాలనుండి విముక్తి కలుగుతుంది. అందుచేతనే భవరోగఘ్ని అనబడుతుంది.

Here the word 'Roga' represents lack of mental peace. 'Bhava' represents attachment to physical world. It represents the feeling of 'I' and 'Mine'. Initially, these feelings appear sweet and pleasant. So, humans take too much of them. But in reality, they are bonds that curtail freedom. They create obstacles in path to liberation and ruin mental peace. This is Bhavaroga. Divine mother destroys this Bhavaroga and frees you from all the bonds by raising your consciousness to the highest level. To those who want to overcome the shackles of Bhavaroga, Divine mother is the ultimate resort. She blows away the darkness of ignorance with her dazzling light of consciousness. She frees you. So, she is called Bhavarogaghni.

No comments:

Post a Comment

Popular