Search This Blog

765. Swargaapavargadaa

 


యన్న దు:ఖేన సంఛన్నం న చ గ్రస్త మనంతరం
అభిలాషోపనీతం యత్తత్సుఖం స్వజ పదాస్పదమ్


ఏదైతే దుఃఖముచేత ఇప్పుడుగాని తరువాతగాని చెడదో, అభిలాషచే ఏది పొందదగినదో అది 'స్వః' అనే పదంతో చెప్పబడుతోంది అంటోంది వేదం. స్వః అంటే స్వర్గము అని ఒక అర్ధం. స్వః ఆత్మ (సత్చిదానందం) అని కూడా అర్ధం వస్తుంది.

స్వర్గము - నిత్యసుఖము అపవర్గము - మోక్షము. ఈ రెండు సుఖాలను ఇచ్చేది.

ఐహికసుఖాలు కావాలంటే మోక్షం వదలుకోవాలి. అలాగే మోక్షం కావాలంటే ఐహికవాంఛలు కూడదు. కాని అమ్మను ఆరాధించిన వారికి ఇహపరాలు రెండూ ఒనగూడుతాయి. దేవతలు భోగభాగ్యాలు, సిరిసంపదలు ఇవ్వగలరు. అంతేగాని మోక్షాన్ని మాత్రం ఇవ్వలేరు. అది వారి పరిధికి మించినది. అనేకమంది రాక్షసులు బ్రహ్మను గురించి తపస్సు చేసి చావులేకుండా వరం కావాలి అన్నారు కాదన్నాడు బ్రహ్మ, ఎందుకని ? ఇక్కడ తపస్సు చేసింది బ్రహ్మను గురించి అతని ఆయువు బ్రహ్మకల్పం. కల్పాంతంకాగానే అతను పరబ్రహ్మలో లీనమవుతాడు. అతనికి శాశ్వతత్వం లేదు. అలాంటప్పుడు అతను తనకులేని శాశ్వతత్త్వాన్ని మనకు ఎలా ప్రసాదించగలుగుతాడు? అలాగే మిగిలిన దేవతలు కూడా. మోక్షమివ్వగలిగిన శక్తి ఆ పరమేశ్వరికి ఒకరైకే ఉన్నది. కర్మలు చేస్తే పుణ్యం వస్తుంది. సంకల్పం నెరవేరుతుంది. కాని మోక్షం మాత్రంరాదు. మోక్షం కలగాలంటే నిష్కామ్యకర్మ చేయాలి. అంటే ఫలితాన్ని ఆశించకుండా కర్మ చేయాలి.

అందుకనే సనాతనధర్మంలో ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా దానం చేయమంటారు. కష్టపడి సంపాదించినదానితో కొంత నీ అవసరం తీర్చుకుని మిగిలినది లేని వారికి దానం ఇయ్యాలి. అప్పుడు ఇహము పరము రెండూ లభిస్తాయి.

Yanna dhuhkhena sanchannam n cha grastha manantaram
abhilaashoopaneetam yattatsukham svaja padaaspadam

As per vedas, 'That which cannot be effected by any sort of sorrows now or in future, that which can be attained is called 'swah'. 'Swah' has two meanings. 1. Heaven. 2. Atma (everlasting happiness).

Swarga - Heavan, Apavarga - Immortality(Moksha). Divine mother gives us both.

Generally, it is said that if you indulge in material pleasures, you wont attain moksha. If you seek moksha, you have to shun material pleasures. But those who worship divine mother gets the best of both of them. Devatas can give material comforts through boons. But they cannot give Moksha. In Hindu mythology, many Rakshasas meditated upon Lord Brahma and sought immortality. But Brahma never gave immortality(Moksha) as a boon to anyone. Because it is beyond his capacity. Brahma's life is one kalpa. After that he dissolves into Para brahma. That explains that, the power of devatas is only limited. Immortality can be given only by Divine Mother. By doing Karma, you can satisfy your wants. But that wont lead to moksha (immortality). To attain moksha, you have to learn the art of shunning the fruits of your karma. 
That is why in Sanaatana dharma, it is prescribed to give donations without expecting anything in return. Whatever you earn through hard work, spend some part of it to fulfill your needs and donate the rest to poor and needy. Then you get both Swarga and Apavarga.

764. Trigunaatmikaa

 



త్రిగుణ స్వరూపం కలది. సత్వరజస్తమోగుణాలను త్రిగుణాలు అంటారు. సత్వరజస్తమోగుణాల సామరస్యం గలది.
గుణములు జీవితం లోని ప్రతీ విషయంలోనూ ముఖ్య భూమిక వహిస్తాయి. సత్త్వ గుణం మానసిక సంతులతను పెంపొందిస్తుంది. దాని వలన సృజనాత్మకత, ధర్మాధర్మ విచక్షణ మొదలగునవి కలుగుతాయి. రజో గుణం రాగ ద్వేషాలను పెంపొందిస్తుంది. ఆశ అభిమానం మొదలగునవి దీని వలన కలుగుతాయి. తమో గుణం వైరాగ్యాన్ని పెంపొందిస్తుంది. దీని వలన నిద్ర, బద్ధకం మొదలగునవి కలుగుతాయి.

Gunas play a role in every aspect of our life. They are Sattva, Rajas and Tamo. Sattva guna promotes mental balance. Innovation, creativity, power of discretion etc are faculties of Sattva guna. Rajo guna promotes passion. Greed, attachment, affection etc are faculties of Rajo guna. Tamo guna promotes indifference/apathy. Detachment, laziness etc are faculties of Tamo guna. Divine mother is the balanced mixture of the three gunas. Hence she is called Trigunaatmika.

763. Thryambakaa

 

మూడునేత్రములు గలది.
దేవీ పురాణంలో
సోమసూర్యానలా స్త్రీణి యన్నేత్రాణ్యంబకాని
సా తేన దేవీ త్ర్యంబకేతి మునిభిః పరికీర్తితా ||

సూర్యచంద్రాగ్నులు ముగ్గురు ఆమెకు కనులు కాబట్టి ఆమెను త్ర్యంబక అంటారు. ఆమె మృత్యుంజయస్వరూపిణి. త్రిమూర్తులకు జనని. త్రిలోకాలకు జనని, త్రిశక్తులకు జనని. ఈ విధంగా త్రిపుటికంతటికీ ఆమె తల్లి.

మాండూక్యోపనిషత్తు
భూతం భవద్భవిష్యతి సర్వమోంకార ఏవ
భూతభవిష్యద్వర్తమాన కాలాలు మూడూ పరమేశ్వర స్వరూపమైన ఓంకారమే.

ఈ రకంగా ఆమె త్రిపుటి కాబట్టి త్ర్యంబకా.

The one with three eyes

Devi Purana
somasooryaanalaa streeni yannetraanyambakaani
saa tena devi thryambaketi munnabhi parikeerthithaa
Sun, moon and Fire are like three eyes to her. She is immortal. Mother of Thrimurthys. Mother of all three worlds. Mother of all those that has 3 classfications (Like past, present and future for time)

Mandukopanishath
Bhootam bhavadbhavishyathi sarvamonkaara eva
Past, present and future all came from 'AUM'. That is Parabrahma.

Like this, she is the mother of all those that has 3 classifications. Hence she is called Thryambakaa.

762. Subhaga


ఐదుసంవత్సరాల కన్య సుభగ.

ప్రపంచంలోని సువాసినులందరి సౌభాగ్యము స్వరూపముగా గలది.

పూజ్యతే యా సురైః సర్వైయతః స్తాం చైవ భజతే |
సేవాయాం భజతేర్జాతో గ్భగవత్యేన సా స్మృతా "

దేవతలచే భజింపబడునది. తనను భజించే వారిని అనుగ్రహించేది కాబట్టి సుభగా

విశ్వకోశాన్ననుసరించి భగ అంటే - ఐశ్వర్యము, మాహాత్మ్యము, జ్ఞానము, వైరాగ్యము, యోని, కీర్తి, వీర్యము, ప్రయత్నము, ఇచ్ఛా, శ్రీ, ధర్మ, రవి, ముక్తి అని అర్ధం చెప్పబడింది. ఇవన్నీ కలిగి ఉన్నది దేవి. తన భక్తులకు వీటన్నింటినీ ప్రసాదించునది.

విష్ణుపురాణంలో
శోభాయమానమైన రవిని గలిగినది. విష్ణువు యొక్క సర్వశక్తులు ఋగ్ యజుస్సాములని పేర్లు గలవి. మూడురకాలైన శక్తులు జగత్తును నాశనం చేస్తాయి. ప్రతినెలలోనూ సూర్యుడు ఎక్కడ ఉంటాడో అక్కడ త్రివేదముల స్వరూపం గల విష్ణుశక్తి ఉంటుంది. ఉదయం పూట - ఋగ్వేదము, మధ్యాహ్నం - యజుర్వేదము, సాయంసమయాన - సామవేదము ప్రకాశిస్తుంటాయి. ఈ రకంగా విష్ణువు వేదాల రూపంలో ఎప్పుడు సూర్యునితోనే ఉంటాడు. ఈ మూడు శక్తులూ త్రిమూర్తులే. ఈ రకంగా శక్తి రూపం దాల్చిన రవికి ఉదయాస్తమయాలు లేవు. ఇక్కడ ఉండే విష్ణువు సప్తమయుడు. సప్తమయుడు అంటే 1. దేవతలు, 2. ఋషులు, 3. గంధర్వులు, 4. అప్సరసలు, 5. యక్షులు, 6. సర్పాలు, 7. రాక్షసులు మొదలైన ఏడుగణాలతో కూడినవాడు. ఈ రకంగా రవిశోభాయమానుడవుతున్నాడు.

పద్మపురాణంలో
త్రిలోక సౌభాగ్యమయీం భుక్తిముక్తి ప్రదా ముమాం
ఆరాధ్య సుభగాం భక్త్యా నారీ వా కిం న విందతి

దేవతలకు శుభములు చేకూర్చేది. భుక్తి ముక్తి ప్రసాదించేది అయిన పరమేశ్వరిని (ఉమను) భక్తితో ఆరాధించటం శుభప్రదము

వరాహపురాణంలో
ఇక్షవ స్తరురాజ శ్చ నిష్పావా జీవరధాన్యకే
వికారవ చ్చ గోక్షీరం కుసుంభం కుంకుమం తథా

లవణం చేతి సౌభాగ్యాష్టకం స్థావరముచ్యతే ||

1. చెరకు 2. పారిజాతము 3. జీలకర్ర 4. ధాన్యము 5. గోక్షీరము 6. కుంకుమపువ్వు 7. పూలు 8. ఉప్పు ఇవి సౌభాగ్యాష్టకాలు. పరమేశ్వరి వీటి స్వరూపమైనది కాబట్టి సుభగా అనబడుతోంది.

A 5 year old girl.

Divine mother protects the lives of husbands of all women.

Poojyate yaa suraih srvaiyatah sthaam chaiva bhajate|
sevaayaam bhajaterdhaatoo gbhagavatyena saa smrutaa||
She is worshipped by all devataas. She bequeaths all the pleasures to those who worship her

As per Vishwakosha, Bhaga means - Joy, Greatness, Knowledge, asceticism, vagina, popularity, courage, endeavor, passion, wealth, righteousness, life force. Divine mother is the giver of all these.

As per Vishnupurana, subhaga means the one who has a bright and shining Sun. All the shaktis of Lord Vishnu are named as Rig, Yajas and Saama vedas. This Vishnu shakti is present in Sun and moves around the earth. Rig veda shines in the morning. Yajurveda shines in the afternoon and Saama veda shines in the evening. With help of these Shaktis, the sun shines round the clock. Vishnu in this form is called sapthmaya. Sapthamaya means to have 1. Devata, 2. Rishi, 3. Gandharva, 4.Apsarasa 5. Yaksha, 6.Sarpa, 7. Rakshasa ganas. Like this the Sun is shining brilliantly.

As per Padma purana,
Triloka soubhaagyamayeem bhukthimukthi pradaa mumaam
aaraadhya subhagaam bhaktyaa naaree vaa kim na vindathi
She is the one auspicious to Devatas. It is always good to worship Uma who fulfills all worldly pleasures and Moksha

As per Varaaha puraana
Ikshava stharuraajascha nishpaavaa jeevaradhaanyake
vikaarava chcha goksheeram kusumbham kumkumam tadha
lavanam chethi soubhaagyaashtakam sthaavaramuchyate
1. Sugar cane, 2. Parijaata flower, 3.Cummin seeds, 4.Paddy 5. Cow milk, 6. Saffron, 7.flowers and 8. Salt. These are called Soubhaagyaashtakas. Meaning the eight essentials to live auspiciouly.

761. Trivarga Dhaatree

 


త్రివర్గములు అంటే ధర్మార్థకామాలు. వీటిని ఇచ్చేది.
సత్వరజస్తమోగుణాలు. వీటిని కల్పిస్తుంది. కాబట్టి త్రివర్గధాత్రీ అనబడుతుంది.
ఉపాసకులకు వారివారి యోగ్యతలను బట్టి త్రివర్గాలను ప్రసాదిస్తుంది. మంగళచండీ విద్యకు ఈ నామమే ఫలశ్రుతి.

Trivarga means Dharma, Artha and Kaama. She is the giver of all these. That means she will give you the means of satisfying all your wants in the right way.
The three gunas - Sattva, Rajas and Tamo. She is the administrator of these gunas.
This nama is explains the benefit of practicing Mangala chandi vidya.

760. Vishwadhaarinee

 



విశ్వం ధారయతీతి తథా

విశ్వమును ధరించునది. అమ్మ. సకల జగత్తులకు కారణభూతురాలు. వాటికి ఆధారమైనది. వాటిని ధరించేది. కాబట్టి విశ్వధారిణీ అనబడుతోంది. మహాప్రళయం సంభవించినప్పుడు ఈ విశ్వాలన్నింటినీ తన గర్భంలో ధరిస్తుంది.
కాబట్టి విశ్వధారిణీ అనబడుతుంది.

Vishwam dhaarayatheethi tadhaa

Divine mother encapsulates the entire universe inside her. She is the base and reason for all this creation. Hence she is called Vishwadhaarinee. Vishwa means universe, the whole creation. Dhaarini means the one who wears it or one who carries it.

759. Sarvalokeshi

 

సర్వేషాం లోకానాం ఈశీ ఈశ్వరీ

సమస్తలోకాలకు ఈశ్వరి. జగత్తులో 14 లోకాలున్నాయి. 7 ఊర్ధ్వలోకాలు. 7 అధోలోకాలు.
ఊర్ధ్వలోకాలు:
1. భూలోక, 2. భువర్లోక, 3. సువర్లోక, 4. మహాలోక, 5. జనోలోక, 6. తపోలోక, 7. సత్యలోకాలు

అథోలోకాలు:
1. అతల, 2. వితల, 3. సుతల, 4. తలాతల, 5. రసాతల, 6. మహాతల, 7. పాతాళాలు

ఈ లోకాలన్నింటికీ ప్రభ్వి, శ్రీచక్రంలోని మన్వస్రం 14 కోణాలు గల చక్రం ఈ లోకాలకు ప్రతీక.

Divine Mother is the Lord of all the worlds. There are 14 worlds in this creation. 7 outside and 7 inside
Outside worlds:
1. Bhulok, 2. Bhuvarlok, 3.Suvarlok, 4.Maharlok, 5.Janalok, 6.Tapolok, 7.Satyalok
Inside worlds:
1. Atala, 2. Vitala, 3.Sutala, 4. Talaatala, 5. Rasaatala, 6.Mahaatala, 7.Pataalaa

Mantvastram in Sri chakra has 14 corners. They represent these 14 worlds.

758. ksharaksharaatmikaa



మొట్టమొదట శుద్ధ బ్రహ్మం ఒకటే ఉంది. అది తప్ప ఇంకేదీ లేదు. ఆ బ్రహ్మం ప్రకటితమవుదామని సంకల్పించింది. అప్పుడు అందులోంచి మాయ అనే శక్తి వచ్చింది. ఆ మాయలోనుంచి ప్రకృతి వచ్చింది. సకలజీవాలు వచ్చాయి. ఆ శక్తి నుండే కాలం కూడా వచ్చింది. ఇవి (ప్రకృతి, కాలం) శాశ్వతం కాదు. కొంత కాలం తరువాత మళ్ళీ బ్రహ్మంలో కలిసిపోతాయి. అప్పుడు మళ్ళీ ప్రకృతి, కాలము ఉండవు. కేవలం శుద్ధ బ్రహ్మమే ఉంటుంది. తరువాత మళ్ళీ పరబ్రహ్మ నుండి శక్తి పుడుతుంది. మళ్ళీ సృష్టి జారుతుంది. ఇది ఇలా కొనసాగుతూ ఉంటుంది.

ప్రకృతి, కాలం, సకల జీవాలు ఇవన్నీ వచ్చి పోతూ ఉంటాయి. శాశ్వతం కావు. అందుకే వీటిని క్షరములు అంటారు. వీటికి ఒక మొదటిరోజు ఒక చివరి రోజు ఉంటాయి. కానీ బ్రహ్మం అక్షరము. దానికి మొదటిరోజు ఒక చివరి రోజు ఉండవు. అది ఎప్పుడు ఉంటుంది. అందుకని అది అక్షరం అన్నమాట.

క్షరము అక్షరము అంతా ఆ బ్రహ్మమునుండి వచ్చినవే కనుక క్షరాక్షరాత్మికా అనబడుతుంది.

భగవద్గీత శ్లోకం -
ద్వావిమో పురుషో లోకే క్షరశ్చక్షశ్చ ఏవచ
క్షరః సర్వానిభూతాని కూతస్థేశ్చ అక్షరః ఉచ్యతే

విజ్ఞులు ఏమన్నారంటే - ఈ లోకంలో రెండు పురుషాలు ఉన్నాయి. 1. క్షరము 2. అక్షరము. సర్వభూతములు క్షరములు. బ్రహ్మము ఒక్కటే అక్షరము.

శ్రీమద్భాగవతంలో -
విష్ణోస్తు త్రీణి రూపాణి పురుషాఖ్యాని యే విదుః
ప్రథమం మహత సృష్టా ద్వితీయం త్వంద సంస్థితా
తృతీయం సర్వభూతస్థం తాని జ్ఞాత్వా విముచ్యతే


పరబ్రహ్మకు మూడురూపాలు.
1. మహత్తుకు కారణరూపం. మహత్తును సృష్టించింది.
2. బ్రహ్మాండగోళము నందలిది. అండములోది
3. సర్వ భూతాంతరాత్మ. భూమి మీద ఉండేది. వీటిని తెలుసుకున్నవాడు ముక్తి పొందుతాడు.

There is only one thing in the beginning. It is para brahma. There is nothing else. This Para Brahma thought of expressing itself. Then Shakti emerged from it. That is Maya. From Maya came Time, Outer space and Nature. So nature is a mere expression of Para brahma. After some time, it again dissolves into Para Brahma. Then again Para Brahma will be the only one that exists. Then the evolution repeats.

Nature, time, outer space etc are not eternal. They have a first day and a last day. Only Para Brahma is eternal. It neither has a first day nor a last day.

Akshara means the one that is eternal. Para Brahma. Kshara means the one that is not eternal. All perceivable bodies.

Divine mother is both Kshara and Akshara. Hence she is called Ksharaksharaatmikaa

A shloka from Bhagavadgita -
Dwaavimo purusho loke ksharaschakshascha eva cha
ksharah sarvaani bhootaani koothasthyeschaksharah uchyate

You can describe everything as two types. 1.Eternal 2.Not eternal. Only Para brahma is eternal. Rest all are not eternal.

Srimad Bhagavatha -
Vishnostu treeni roopaani purushaakhyaani ye viduh
pradhamam mahata srushtaa dwiteeyam twanda samsthitaa
truteeyam sarvabootashtam taani gnaatwaavimuchyate

Para brahma has three forms
1. The one that created Mahat
2. The one that is in the outer space
3. The one that is present in all beings
Those who know this will attain mukthi.

757. Chandamundaasuranishoodhinee




చండముండాది రాక్షసులను సంహరించింది. కాబట్టి చండముండాసురనిషూదినీ అనబడుతోంది. అందుకే ఆమె చాముండా అనబడుతోంది. సప్తశతిలో

యస్మా చ్ఛందం చ ముండం చ గృహీత్వా తా వుపాగతా
చాముండేతి తతో లోకే ఖ్యాతా

నువ్వు చండముండులను ఇద్దరినీ చంపి నా దగ్గరకు తెచ్చావు. కాబట్టి ఇక లోకంలో చాముండ అనే పేరుతో ప్రసిద్ధిచెందుతావు.
వరాహపురాణంలో దేవి రురుడు అనే రాక్షసునితో యుద్ధం చేసి అతని శిరస్సు ఖండించింది. ఆ తరువాత అతని శిరస్సును మొండాన్ని శూలానికి గ్రుచ్చి తీసుకుపోయింది కాబట్టి చాముండా అనబడింది.

యా దేవీ మధుకైటభ ప్రశమనీ యా మాహిషో న్మూలినీ
యా ధూమ్రక్షణచండముండదమనీ యారక్తబీజాశనీ |
యా శుంభాదిని శుంభదైత్యదమనీ యా సిద్ధలక్ష్మీ పరా
సా చండీ నవకోటి శక్తిసహితా మాం పాతు విశ్వేశ్వరీ ||

మాత ర్మే మధుకైటభఘ్ని మహిషప్రాణాపహారోద్యమే
హేలా నిర్మిత ధూమ్రలోచనవధే హేచండముండానీ |
నిశ్శేషీకృతరక్తబీజదనుజే నిత్యే నిశుంభాపహే
శుంభధ్వంసిని సంహరాశు దురితం దుర్లే నమస్తేంబికే ||

చండ ముండాసురులను, మహిషి, మధుకైటభులను, శుమ్భ నిశుమ్భ లను, ధూమ్రాక్షుడు మొదలగు రాక్షసులను వారి వంశాలను సర్వనాశనం చేసి శత్రుశేషం ఋణ శేషం లేకుండా చేసింది.

ఆధ్యాత్మికంగా చూస్తే ఈ రాక్షసులు ఎక్కడో ఉండరు. మనలోనే ఉంటారు. మన తపస్సు పాడుచేస్తారు. ధ్యానంలో ఏకాగ్రత కుదరనివ్వరు. అపర్ణాలా తపస్సు చేసుకుందామనుకునే సాధకులను పాడుచేస్తారు. అప్పుడు అమ్మ అతని/ఆమె శరీరంలో దుర్గ అనే శక్తి లా వచ్చి ఆ అవరోధాలన్నీ అధిగమించేలా చేస్తుంది.

She killed Demons like Chanda and Munda. Hence she is called Chandamundaasuranishoodhinee.

It is said like this in Saptasathee
Yasmaachchandam cha mundam cha gruheetwaata vupaagataa
Chaamundeethi loke khyaathaa

You killed the demons Chanda and Munda and brought them to me. So you will become popular as Chamundaa

Yaa devee madhukaitabha prashamanee yaa maahishonmoolinee
Yaa Dhoomrakshana chandmunda damanee yaa raktha beejaashanee|
Yaa shumbhaadhini shumbhadaityadamanee yaa siddhalakshmee paraa
Saa chandee navakoti shaktisahitaa maam paathu vishweshwaree||

Maata rme madhukaitabhaghnee mahishapraanaapahaarodyame
Hela nirmitha dhoomralochanavadhe hechandmundaanee|
nisshesheekrutarakthabeejadanuje nethye nishumbhaapahe
Shumbhdhwamsini samhaaraashu dhurigam durle namastambike||

She killed demons like chanda, munda, mahishee, madhu, kaitabha, dhoomraaksha, shumbha, nishumbha etc. she did not stop there. She completely wiped out all their dynasties as well.

If you look at it from a spiritual angle, these demons live inside us. They cause distractions when we try to meditate. They cause various hurdles in our path to liberation. They won't let us pursue mukthi like Aparna. Then Divine mother emerges as Durga inside us remove all these hurdles.

756. Chandikaa


చండి - కోపము గలిగినది. భగవద్భక్తులు కాని వారియందు కోపముగా నుండునది. దుర్గాదేవియే చండిక, ప్రచండమైన పరాక్రమము గలది. తీక్షణమైన శాసనములు గలది. శత్రువుల హృదయాలలో భయాన్ని కలుగచేసేది.
తతో దేవీ శరీరా త్తు వినిప్రాంతాని తిభీషణా చండికా శక్తి రత్యుగ్రా శివాశతనినాదినీ

పరమేశ్వరి శరీరమునుండి అతిభయంకరమైన, అత్యుగ్రమైన స్వరూపం ఒకటి బయటకు వచ్చింది. ఆమె ఆజ్ఞలకు భయపడే గాలి సవ్యంగా వీస్తున్నది. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. చంద్రుడు చల్లదనాన్నిస్తున్నాడు. చండముండాది రాక్షససంహారం చెయ్యటానికే చండిక ఆవిర్భవించింది.



Chandi - One who is angry. Mother is angry upon those who are not abiding by the divine laws, those who cause difficulties to her devotees (those in path of Mukthi (Liberation)). Her demeanor is intense. No enemy (Demons) can fight and defeat her. She is Durga

Tato devee shareeraa ttu vinipraantaani tibheeshanaa
chandikaa shakthi ratyugraa shivaashathaninaadinee

An avatar came from Divine mother. It is very frightening and very intense. The wind is blowing out of fear. Sun and Moon are shining out of fear. Every one is frightened after seeing her. She came to kill all the demons. She is Chandika. She is Durga.


755. Aparna


పోయిన ఋణము గలది. ఋణ శేషము లేనిది.

తారకాసుర సంహారం కోసం మేనకా హిమవంతులకు పరమేశ్వరి అంశతో కుమార్తె జన్మించింది. ఆమె పర్వతరాజు కుమార్తె కాబట్టి - పార్వతి.హిమవంతుని కుమార్తె కాబట్టి - హైమవతి. ఈ బాలిక యుక్తవయసురాగానే పరమశివుణ్ణి తప్ప వేరెవరినీ వివాహం చేసుకోను అని తపస్సు చెయ్యటానికి అడవులకు వెళ్ళిపోయింది. అక్కడ రకరకాల పద్ధతులలో, కఠోరనియమనిష్ఠలతో తపస్సు సాగించింది. ఎండాకాలంలో చుట్టూ మండే కట్టెలు ఉంచుకుని. శీతాకాలంలో మెడలోతున ఉన్న చల్లటి నీటిలో మునిగి తపస్సు చేసింది.కొంతకాలం ఒంటిపూట భోజనం, కొంతకాలం భూశయనము, కొంతకాలం ఆహారాన్ని వదిలి, కేవలము ఆకులు అలములు తిని తపస్సు చేసింది. ఆ తరువాత ఆకులు కూడా వదిలేసింది. ఈ రకంగా ఆకులు కూడా తినటం మానివేసింది. కాబట్టి అపర్ణా అని పిలువబడింది.

751వ నామంలో మనం శివుడు ఎలా తారకాసురునిపై యుద్ధానికి బయలుదేరాడో తెలుసుకున్నాం. ఈ నామం దాని యొక్క ఆధ్యాత్మిక వర్ణన.
భూమి - రథముగా, రవి, చంద్రులు - చక్రాలుగా, నాలుగు వేదాలు - గుర్రాలు, బ్రహ్మ - సారథి, మేరువు - విల్లు, శ్రీహరి - అస్త్రం గా చేసుకుని త్రిపురాసుర సంహారానికి బయలుదేరాడు.

భూమి రధం - అంటే నేలపై కూర్చుని తపస్సు చేయటం. భూశయనం చేయటం
సూర్య చంద్రులు చక్రాలు - కాలగమనం సూర్య చంద్రుల కదలికతో తెలుపుతున్నారు
నాలుగు వేదాలు - గుర్రాలు - పార్వతీ దేవి వేదాలలో చెప్పబడినట్లు తపస్సు చేసింది.
బ్రహ్మ - సారథి - ఆవిడ సంకల్పించింది. వేదానికి కట్టుబడింది. కాబట్టి ఆ ప్రయత్నం సక్రమంగా జరిగేలా చూడడం బ్రహ్మ బాధ్యత. అందుకే ఆ రధాన్ని నడిపేవాడు బ్రహ్మ.
మేరువు - విల్లు - మెరువంటే షట్చక్రాలతో ఉన్న శ్రీచక్రం. తపస్సు చేసే వారికి ఇదే ధనుస్సు.
శ్రీహరి - అస్త్రం - ముక్తి కలగాలంటే సకల బంధాలు తెగిపోవాలి. అన్నీ వదిలేసి అడవికి వచ్చేసినా పూర్వ కర్మ వదలదు. అది పోవాలంటే హరి నామ స్మరణ చేయాలి. అప్పుడు పాపమంతా పోతుంది. అందుకని శ్రీహరి అస్త్రం.
త్రిపురాసుర సంహారం లక్ష్యం - అంటే సత్త్వరజస్తమో గుణాలను దాటి నిర్గుణ పరబ్రహ్మాన్ని తెలుసుకోవడం.

She who is not indebted to anyone. Absolutely free

Divine mother took birth as daughter of Menaka and Himavantha to kill Tarakaasura. She is called Parvathi because her father is known as Parvatha raja(king of mountains). She is also called Hymavathi because her father is known as Himavantha(mountains covered with snow). After reaching adolescence, she decided to marry Lord Shiva. With a strong determination, she went to forest and started meditating upon Him. There she went through severe hardships while following various practices of tapasya. She meditated at the center of a circle surrounded with burning logs in peak summer. In peak winter, she meditated in neck deep water. She ate only once a day for few days. She slept on floor. Few days she ate only leaves. Later she stopped eating completely. Aparna means not eating even leaves. That is why Divine mother is called Aparna.

In 751st name, the war between Shiva and Tripurasura is described like this.
"Shiva made earth as chariot, Sun and Moon as wheels, Brahma as rider, 4 vedas as horses, Meru as bow and Sri Hari as arrow and started war against Tripurasuras. 

This name describes this on spiritual plane.
Earth as chariot - Sit on floor(earth)
Sun and Moon as wheels - Passage of time is indicated as sun and moon rotating around earth
Horses are 4 vedas - Meditation is progresses as per vedic prescriptions. Mother Parvathi followed those methods
Brahma is the rider - Parvathi took the decision to meditate (determination). Because she is following Vedic prescriptions, the onus of making her succeed is on Brahma. So he is the rider of Shiva's chariot
Meru is the bow - Meru represents the chakras of the body through which kundalini rises up. This is the tool to aim the arrow.
Sri Hari is the arrow - The goal is to become free of any kind of indebtedness. Become free of all bonds. Hari means the one who removes guilt, sin and sorrows. So Sri Hari is the arrow.
Goal is to kill Tripurasuras - To reach a state beyond the three gunas (sattva, rajas and tamo) and know the Para brahma (without any guna) 

753. Mahagraasa


మహాగ్రాసా అంటే అపరిమితమైన ఆహారం తీసుకునేది.

లౌకిక పరముగా చూస్తే త్రిపురాసుర సంహారంలో రాక్షసులను క్రింద పడకుండా తన నాలుకతో జుర్రుకుని దిగమింగేసింది అమ్మ. ఎందుకంటే వారు క్రింద పడి చస్తే ఆ శవంలోంచి ఇంకో 100 మంది రాక్షసులు పుట్టుకొచ్చే ప్రమాదం ఉంది. అలా ఆ యుద్ధంలో కొన్ని కోట్ల కోట్ల మంది రాక్షసులను నేలమీద పడకుండా మ్రింగేసింది కనుక మహాగ్రాసా అని పిలవబడుతోంది.

సాంకేతిక పరంగా చూస్తే సృష్టి అంతంలో పంచభూతాలన్నీ కాలంలో కలిసిపోతాయి. ఆ కాలం అమ్మలో కలిసిపోతుంది. (కాలహంత్రీ అనే నామంలో మనం ఇది చదువు కున్నాం). ఇలా సర్వం ఆమెలో కలిసిపోతుంది కనుక మహాగ్రాసా అని పిలవబడుతోంది.

ఆధ్యాత్మిక పరంగా చూస్తే సత్వరజస్తమో గుణాలను దాటిన యోగికి నిర్గుణ పరబ్రహ్మ గోచరం అవుతుంది. అదే ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. జీవాత్మ పరమాత్మలో కలిసిపోతుంది. అప్పుడు యోగి పరమానందాన్ని పొందుతాడు. జీవాత్మ తన సర్వస్వం(ఉనికిని కూడా) కోల్పోయే స్థితి అది. అంతా పరమాత్మలో లయం అవుతుంది. అందుకే మహాగ్రాసా.

Maha graasaa means one who devours unlimited food. During the war with Tripuraasura, Divine mother swallowed dead bodies of Rakshasas such in order to prevent expansion of their army. This is because of the boon Tarakaaksha got from Brahma. As per the boon, if they drop the dead body of a Rakshasa in water, the dead body becomes alive again and multiplies by 100.

Scientifically, Maha graasa represents a specific phase at the end of the creation. All the five elements in the universe dissolve into spacetime. This spacetime gets dissolved into Divine mother. We learnt about this in the name Kaalahanthri

Spiritually, it represents the state of a yogi at the time of self-realization. It is a state where he/she travelled beyond the three gunas 1.Sattva 2.Rajas 3.Tamo. At this point he/she sees the nirguna para brahma. Jeevatma merges into Paramaatma.


752. Maha Kaali

 


Kaaloohi jagat bhakshakah - Everything in this universe dissolves into spacetime ultimately. Spacetime swallows everthing

Maha Kaali means infinite spacetime. It is not divided by years or Eons, galaxies etc
It has neither beginning nor the end
It cannot be classified as past, present or future
It cannot be divided into day/night, months, fortnights, years etc.
It is undivided, unending and all pervading spacetime
The supreme power that swallows the spacetime at the final The End. She came in the avatar of goddess Kali to kill demons

Om! Khadgam chakra gadeshu chaapa parighaan shoolam
Bhushundeem shirah
shankham sandadhateem karaisthi nayanaam
sarvaanga bhushaavrutaam
neelaashmdyuthimaanasya paadadashakaam seve mahaakaalikaam

Maha Kaali carries 1. Sword 2.Toothed wheel 3.Bludgeon, 4.Bow, 5.Arrows 6. Barb wire made of iron 7.Spear 8.Bhushundi, 9.Head 10. A conch in her 10 hands. She has 3 eyes and is adorned with all types of ornaments. When Vishnu is in yoga nidra(trance), Brahma prayed her to kill demons Madhu and Kaitabha. Her body glows like Blue shappire. She has 10 faces and 10 legs.

752. మహాకాళీ

 


కాలాహి జగతిభక్షకః - ఈ జగత్తులోని ప్రతీ వస్తువు కాలములో కలిసిపోవలసినదే. కాలము అన్నింటినీ మింగేస్తుంది.

మహాకాళి అంటే - అనంతమైన కాలస్వరూపం. యుగాలు, మన్వంతరాలు, కల్పాలు అనే విభాగాలేవీ ఉండవు. ఆద్యంతములు లేనంటువంటిది ఈ కాలస్వరూపం.
భూతభవిష్యద్వర్తమాన భేదాలు లేనటువంటిది.
పగలు, రాత్రి, తిథులు, పక్షాలు మాసాలు సంవత్సరాలు లేనిది. అన్నీ కలిసి ఉన్న అఖండమైన కాలస్వరూపం.
ఈ కాలచక్రాన్ని నియమానుసారం పరిభ్రమింపచేసే మహేశ్వరశక్తి, మృత్యువుకు మృత్యువు. రాక్షససంహారం కోసం పరమేశ్వరి అంశగా జన్మించినది.

ఓం ఖడ్గం చక్ర గదేషుచాపపరిఘాన్ శూలం
భుశుండీం శిరః
శంఖం సందధతీం కరైస్తి నయనాం
సర్వాంగ భూషావృతామ్ |
నీలాశ్మద్యుతిమాస్య పాదదశకాం సేవే మహాకాళికాం ౹౹

1. ఖడ్గము 2 చక్రము 3. గద 4. ధనుస్సు 5. బాణాలు 6. ఇనుపకట్ల గుదియ 7. శూలము 8. భుశుండి 9. శిరస్సు 10. శంఖము
తన పదిచేతులయందు ధరించి, మూడుకనులు గలిగి సర్వాభరణాలంకృతమై, విష్ణువు యోగనిద్రలో ఉన్నప్పుడు మధు కైటభ సంహారం కోసం బ్రహ్మతో స్తుతించబడిన దేవి. ఇంద్రనీలాల వంటి శరీరకాంతి గలది. పది ముఖాలు, పదిపాదాలు గలది అయిన మహాకాళికను సేవించుచున్నాను.

మహాకాళ క్షేత్రంలో ఉండే మహాకాళేశ్వరుని పత్ని. కలకత్తాలో దక్షిణేశ్వరం ఆలయంలో వెలసిన దేవత దక్షిణ కాళి.

751. Maheshwari

                                         

Maha means great. Eshwari means Lord. Maheshwari means she is the greatest of all the Lords. Mangala chandi vidhya starts from here.

Background - Vajranga is the son of Kashyapa and Dithi. Varaangi is his wife. She used to fight make devatas life miserable as much as possible. Tarakaasura, son of Vajranga meditated upon Brahma and got a boon such that there is none/nothing in this whole creation that is equal/greater than him. Then he waged war on Devatas. In the end he died in the hands of Lord kumaraswami.

Tarakaasura had 3 sons. They are 1.Vidhyunmaali, 2.Taarakaakshudu, 3.Kamalaakshudu. These three meditated upon Lord Brahma again and got 3 boons. Brahma gave them 3 cities that can travel faster than light. He also said that you three will be victorious as long as these three cities doesn't come in line to each other

Vidhyunmaali, Taarakaaksha and Kamalaaksha (Tripurasuras) called Mayudu and asked them to build empires with Gold, Silver and Iron in each of these three cities. Pura means a city. Tri-pura means three cities. These are the 3 cities Tripura represents.

Hari is son of Taarakaaksha. He meditated upon Lord Vishnu and got a boon such that if anyone from the army of these three asuras die, a 100 more will immediately emerge when the dead body is drowned in water. Then he built numerous wells in these three cities to facilitate that. 

Now these asuras became invincible. With ability to travel faster than light, they used to move and land wherever they wish. They used to cause immense destruction to the abodes of devatas, Rishis and Saadhus just by landing their cities. Nobody is powerful enough to defeat/kill them. Hence Devatas reached Lord Shiva for help.

Shiva made earth as chariot, Sun and Moon as wheels, Brahma as rider, 4 vedas as horses, Meru as bow and Sri Hari as arrow and started war against Tripurasuras. In the war, Asuras destroyed Lord Shiva's chariot wheels. Then with advice from Lord Vishnu, Shiva sought help from goddess Chandi. With her help, Shiva killed Tripurasuras. 

Because Lord Shiva became victorious with her help she is called Managa chandi. Teenage girls worship her on Tuesdays. Mangala, a descendant of Manu dynasty worshipped her and got mukthi.

751. మహేశ్వరీ


మహా అంటే - చాలా గొప్పదైన ఈశ్వరి. మహా అంటే బ్రహ్మ. ఈ జగత్తును సృష్టించటానికి, వాటి స్థితికి, లయకు కూడా కారకురాలు. ఆమెయే ప్రభవి. మహేశ్వరుని శక్తి మహేశ్వరి. ఈమెయే మంగళచండి అనబడుతోంది.

మంగళ చండీ విద్య కధ - కశ్యపుడికి దితియందు జన్మించినవాడు వజ్రాంగుడు. ఇతడి భార్య వరాంగి. ఇతడు వీలైనంతవరకు దేవతలను బాధించేవాడు. వీరి కుమారుడు తారకాసురుడు. బ్రహ్మను గూర్చి తపస్సుచేసి తనతో సమానమైన వారు ప్రస్తుత సృష్టిలో లేకుండా వరం పొందాడు. వరబలంతో దేవతలను నానా హింసలపాలుచేశాడు. చివరకు కుమారస్వామి చేతిలో మరణించాడు.

తారకాసురుడికి ముగ్గురు కుమారులున్నారు. 1. విద్యున్మాలి, 2. తారకాక్షుడు, 3.కమలాక్షుడు.

వీరు బ్రహ్మను గురించి తపస్సుచేసి సకలసౌఖ్యాలు కామగమనము గల మూడు పట్టణాలు కావాలి అన్నారు. వారడిగినట్లే మూడు పట్టణాలు ఇస్తూ బ్రహ్మదేవుడు
ఆ పట్టణాలు ఒకదానితో ఒకటి కలియకుండా ఉన్నంతవరకూ మిమ్ములను ఎవరూ ఓడించలేరు అవి కలిశాయంటే మీరు బలహీనులౌతారు అన్నాడు. అంతట వాళ్ళు మయుణ్ణి పిలిచి వెండి, బంగారము, ఇనుములతో ఆ పట్టణాలను తయారుచేయించారు. తారకాక్షుని కుమారుడు హరి. అతడు విష్ణువును గూర్చి తపస్సుచేసి తమ వారిలో ఎవరు చచ్చిపోయినా సరే, వాళ్ళని నీళ్ళలో పడెయ్యగానే వారు బ్రతికి, వారితో పాటు సమానమైన బలం గల వాళ్ళు ఇంకా పదిమంది పుట్టేటట్లు వరం సంపాదించి, అలా చెయ్యగల బావులను తమ పట్టణాలలో నిర్మింపచేశాడు. ఇప్పుడు వారు అజేయులు, వారికి మరణం సంభవించటం కూడా చాలా కష్టం. ఈరకంగా అభేద్యమైన త్రిపురాలను కలిగి ఉన్నారు కాబట్టి వారిని త్రిపురాసురులు అన్నారు. త్రిపురాసురులు తమ పట్టణాలలోనే ఉంటూ కామగమనంతో కావలసిన చోటికిపోతూ, ఎక్కడబడితే అక్కడ ఆ పురాలతోసహా దిగేవారు. ఆ ధాటికి అక్కడ పట్టణాలు, కట్టడాలు నాశనమైపోయేవి. ఈ రకంగా భూలోకం, దేవలోకం నాశనమవుతున్నాయి. వాళ్ళని చంపటానికి దేవతల శక్తి చాలటం లేదు. దేవతలంతా శివుణ్ణి ఆశ్రయించి, త్రిపురాసురసంహారం చెయ్యటానికి తమ శక్తులన్నీ అతడికిచ్చారు. అప్పుడు శివుడు.

భూమి - రథముగా, రవి, చంద్రులు - చక్రాలుగా, నాలుగు వేదాలు - గుర్రాలు, బ్రహ్మ - సారథి, మేరువు - విల్లు, శ్రీహరి - అస్త్రం గా చేసుకుని త్రిపురాసుర సంహారానికి బయలుదేరాడు. ఆ యుద్ధంలో శివుని రథచక్రం త్రిపురాసురులు ఆయుధాలవల్ల దెబ్బతిన్నది. అప్పుడు శివుడు విష్ణుమూర్తి సలహామేరకు పరమేశ్వరిని ప్రార్ధించగా చండరూపంలో ఉన్న దుర్గ ప్రత్యక్షమై అతడికి సాయం చేసింది. పాసుపతాస్త్రంతో త్రిపురాసుర సంహారం చేశాడు శివుడు. చండిక అనే ఈ దేవత దుర్గకు ఇంకొకరూపం. మూలప్రకృతి. స్త్రీలకు ప్రత్యక్ష దైవం, కరుణామయి.

ఈ రకంగా శివునిచే పూజింపబడి ఆయనకు మంగళం చేకూర్చింది కాబట్టి ఆమె మంగళచండి అయింది. ఆ తరువాత మనువంశంలో పుట్టిన మంగళుడనేవాడు ఈ దేవిని ఆరాధించాడు. కన్యలు మంగళవారాలలో ఈ దేవిని ఆరాధిస్తారు. కాబట్టి ఈమె మంగళచండి. ఈ దేవత అభీష్టఫలదాయిని.

749. Rogaparvatadambholih

 


రోగములు అనే పర్వతాలకు వజ్రాయుధము వంటిది. రోగాలు రెండురకాలు.

1. శారీరకాలు - ఇవి బాక్టీరియా, వైరస్ వంటి సూక్ష్మ జీవుల వలనో లేదా ఏదైనా ఘాయం వలనో వచ్చేవి.
2. మానసికాలు - మనకు ఏదైనా రాలేదనో, ఉన్నది పోయిందనో బాధించేవి మానసికాలు.

వీటిలో శరీరకాల కన్న మానసికాలు మరీ బాధిస్తాయి. వీటినే చింత అంటారు. చితి చచ్చిపోయిన శరీరాన్ని దహించి వేస్తే, చింత బ్రతికి ఉన్న శరీరాన్ని దహించివేస్తుంది.
పూర్వ కాలంలో పర్వతాలకు రెక్కలు ఉండేవి. అవి ఎగిరి ప్రాణులమీద పడుతున్నాయని ఇంద్రుడు వాటి రెక్కలు కత్తరించేసాడు. అలాగే అమ్మ తన జ్ఞానఖడ్గంతో మన రోగాలన్నింటినీ నాశనం చేస్తుంది.

Diseases are of two types:

1. Physiological - These come due to bacteria, virus or any accident
2. Mental - These are psychological.

Metal diseases cause more discomfort than physiological ones. Pyre burns a dead body, but mental diseases burn one alive.
Once upon a time, mountains used to have wings. They used to fly and kill living beings while landing. Then Indra cut their wings. Similarly, Divine mother cuts all our diseases with her gnana khadga (sword of consciousness).

750. Mrityudaarukuthaarikaa

 



మృత్యువు అనే కట్టెకు గొడ్డలి పెట్టువంటిది పరమేశ్వరి. సాధకులు అమ్మనుని ఉపాసించి జ్ఞానాన్ని పొందుతారు. ఈ జ్ఞానులు సాధన చేసి సాయుజ్యం పొందుతారు. అంటే వీరికి పునర్జన్మ ఉండదు. జన్మలేని వారికి మరణముండదు కదా ? అందుచేత వీరు మృత్యుంజయులు. కాబట్టే ఆవిడ మృత్యుదారుకుఠారికా అనబడుతుంది.
ఈ రకంగా నందివిద్య 22 నామాలలో వివరించబడింది.

For branch called death, Divine mother is like the Axe. Those who worship Divine mother get Gnana (consciousness). These gnanis attain yoga. Those who attain yoga does not take birth again. Because they don't take birth again, they don't have death. That means they conquered death.
Nandi Vidya is complete with this.

745. Dourbhaagya toolavaatoolaa

దౌర్భాగ్యాలు ఎనిమిది. అవి

1. ఋణము
2. యాచన
3. ముసలితనములో ఆసరా లేకపోవుట
4. జారత్వము
5. చోరత్వము
6. దరిద్రము
7. అనారోగ్యము
8. భుక్తశేష భోజనము.

అమ్మ ప్రేమ దౌర్భాగ్యము అనే గడ్డిని దూరంగా విసిరి పారేసే గాలి వంటిది. దౌర్భాగ్యాలు అనే దూదిపింజలరాశికి ఆమె ప్రేమ ప్రచండమారుతం వంటిది. వాతూలుడు వాయుదేవుడు. ఇతడే మాతరిశ్వుడు అంటారు. మహాశక్తిశాలి. పెనుగాలులు సృష్టించి పర్వతాలను కూడా ఎగరగొట్టగల సమర్ధుడు. అటువంటి వాయుదేవుడికి దూదిపింజలు ఒక్క లెక్కకాదు. అమ్మ కంటి చూపు సోకినా చాలు పైన చెప్పిన దౌర్భాగ్యాలన్నీ తొలగిపోతాయి.

Puranas described eight types of sorrows/miseries. They are:

1. Being indebted
2. Begging
3. Helplessness in oldage
4. Adultery
5. Theft
6. Poverty
7. Lack of sound health
8. Eating rejectamenta

To those who worship Divine mother, these miseries are like dried stalk. Her love is the strong wind that will blow away all these miseries.

Popular