Search This Blog

752. మహాకాళీ

 


కాలాహి జగతిభక్షకః - ఈ జగత్తులోని ప్రతీ వస్తువు కాలములో కలిసిపోవలసినదే. కాలము అన్నింటినీ మింగేస్తుంది.

మహాకాళి అంటే - అనంతమైన కాలస్వరూపం. యుగాలు, మన్వంతరాలు, కల్పాలు అనే విభాగాలేవీ ఉండవు. ఆద్యంతములు లేనంటువంటిది ఈ కాలస్వరూపం.
భూతభవిష్యద్వర్తమాన భేదాలు లేనటువంటిది.
పగలు, రాత్రి, తిథులు, పక్షాలు మాసాలు సంవత్సరాలు లేనిది. అన్నీ కలిసి ఉన్న అఖండమైన కాలస్వరూపం.
ఈ కాలచక్రాన్ని నియమానుసారం పరిభ్రమింపచేసే మహేశ్వరశక్తి, మృత్యువుకు మృత్యువు. రాక్షససంహారం కోసం పరమేశ్వరి అంశగా జన్మించినది.

ఓం ఖడ్గం చక్ర గదేషుచాపపరిఘాన్ శూలం
భుశుండీం శిరః
శంఖం సందధతీం కరైస్తి నయనాం
సర్వాంగ భూషావృతామ్ |
నీలాశ్మద్యుతిమాస్య పాదదశకాం సేవే మహాకాళికాం ౹౹

1. ఖడ్గము 2 చక్రము 3. గద 4. ధనుస్సు 5. బాణాలు 6. ఇనుపకట్ల గుదియ 7. శూలము 8. భుశుండి 9. శిరస్సు 10. శంఖము
తన పదిచేతులయందు ధరించి, మూడుకనులు గలిగి సర్వాభరణాలంకృతమై, విష్ణువు యోగనిద్రలో ఉన్నప్పుడు మధు కైటభ సంహారం కోసం బ్రహ్మతో స్తుతించబడిన దేవి. ఇంద్రనీలాల వంటి శరీరకాంతి గలది. పది ముఖాలు, పదిపాదాలు గలది అయిన మహాకాళికను సేవించుచున్నాను.

మహాకాళ క్షేత్రంలో ఉండే మహాకాళేశ్వరుని పత్ని. కలకత్తాలో దక్షిణేశ్వరం ఆలయంలో వెలసిన దేవత దక్షిణ కాళి.

No comments:

Post a Comment

Popular