Search This Blog

156-159.Niraga...Madanashini

156-157. Niraga ragamadhani:
'Raga' means affinity. 'Dwesha' is the opposite. From these come the 'Arishadvarga'. They are:
1) Kama - Feeling when you desire for a thing.
2) Krodha - Feeling when you can't possess it.
3) Lobha - Feeling that only you should possess all of it.
4) Moha - feeling that only you should benefit from it.
5) Mada - Feeling that only you can possess it.
6) Matsara - Feeling that others are ineligible for it.

Neeraga means not having either Raga or Dwesha. This is the greatest quality a human being can possess. By praying divine mother, we can overcome Raaga dwesha and thereby 'Arishadvarga'

158-159. Nirmada Madanashini:
We learnt about 'Mada' in 156th name. This 'Mada' enters into our mind through 5 channels. They are:
1) Through excessive physical strength
2) Through excess money
3) Through excess authority
4) Through excess knowledge
5) Through luck

But Divine mother is 'Nirmada'. She does not have any of these vices. Because she does not have 'Mada', she will remove it from our mind as well.

156-157.నీరాగా రాగమదనీ:
రాగము అంటే ఇచ్ఛ. ద్వేషము దీనికి విరుద్ధము. ఈ రాగ ద్వేషాల వలన అరిషడ్వార్గాలు పుట్టుకొస్తాయి. అవి:
1) కామము - ఒక వస్తువు కావలి అనుకోవడం.
2) క్రోధము - కోరిన వస్తువు దక్కనపుడు కలిగేది.
3) లోభము - ఆ వస్తువు ఇతరులకు చెందకూడదు అనే భావన.
4) మోహము - ఆ వస్తువు మనకు మాత్రమే ఉపయోగపడాలి అనే భావన. స్వార్ధ చింతన.
5) మదము - ఆ వస్తువు నా దగ్గర మాత్రమే ఉన్నది అనే భావన.
6) మత్సరము - ఆ వస్తువును ఇతరులు కూడా కోరుతున్నట్లైతే వారిని సాధింపనెంచుట.
అసలు రాగ ద్వేషాలు లేకుండుట నీరాగ. అదే గొప్ప గుణం. దానివల్లనే మనుషులు గొప్పవాళ్లవుతారు. 
అమ్మను మస్ఫూర్తిగా ప్రార్దించిన వారు రాగ ద్వేషాలను జయించగలుగుతారు.

158-159.నిర్మదా మదనాశినీ:
మదము గురించి మనం 156వ నామంలో తెలుసుకున్నాం. 5 కారణాల వలన ఇది మనలోకి ప్రవేశిస్తుంది. అవి:
1) అధిక బలం (శారీరికమైనది)
2) అధిక దనం
3) అవసరానికి మించిన అధికారం
4) అవసరానికి మించిన చదువు
5) అవసరానికి మించిన అదృష్టం
వీటన్నింటికి దూరంగా అమ్మ నిర్మద అయి ఉంటుంది. 
మదం లేనిది కాబట్టి మనలో మదాన్ని కూడా తీసివేయగలదు. 

152-155.Nishkarana...Nirishvara

152.Nishkarana - Kaarana means cause. Divine mother is the cause for the whole creation. But there is no cause for her existence. So, she is called Nishkarana.

153.Nishkalanka - 'kalankam' means sin. When you do actions to satisfy a desire, it becomes karma. When those actions are against vedic principles, they accrue sin. Divine mother does not do anything for herself. So, she doesn't perform any karma. Then how can sin ever be attributed to her? It is not possible.

154.Nirupadhih - 'Upadhi' means something that is given to you for following dharma. For a human soul, its body is its upadhi. And its Dharma is humanity. There are crores of living beings (jeevas) in this world. All of them will have a body so that they can follow Dharma. That is why Dharma is described as 

Dhriyateva janayaditi iti dharmah
If there is something that you must know and must follow, that is Dharma

The Dharma to be followed by a jeeva depends on its past karma. At the time of rebirth, the net effect of all the past actions is assessed in order to decide the dharma of a Jeeva.  It will be assigned a body based on this. That is why the body is called 'upadhi'. A jeeva with human body possess a great power called 'chaitanya'. By virtue of chaitanya, they are able to attain Moksha - A state where there is no need to accept another body. Nirupadhi means being in a state where no more re-births are required and hence no need of any 'upadhi'. That is why divine mother is called 'Nirupadhih'.

155.Nirishvara - Divine mother is the controller of the whole universe. There is no one above her to assign this responsibility. Nirishvara means she who does not have anyone controlling her.

152.నిష్కారణా - సృష్టి మొత్తానికి ఆవిడే కారణం. ఆవిడ వల్ల సృష్టి వచ్చింది. మరి ఇక ఆవిడ రావడానికి ఇంకో కారణం లేదు. అందుకే నిష్కారణ.

153నిష్కలంకా - కళంకం అంటే పాపం. వేదవిరుద్ధమైన కర్మల వలన పాపం కలుగుతుంది. అమ్మ కర్మలు చేయదు. ఎందుకంటే ఆవిడ ఏపని చేసినా అది లోక కళ్యాణం కోసమే. మనసులో కోరిక ఉంటేనే కర్మలు చేస్తాం. చేసిన కర్మ వేదం విరుద్ధమైనపుడు పాపం మూటగట్టుకుంటాం.

154.నిరుపాధిహ్ - ఉపాధి అంటే తన సమీపమునకు ధర్మాన్ని తీసుకువచ్చేది అని అర్ధం. ఈ విశ్వంలో కోటానుకోట్ల జీవములున్నవి. కానీ ఒక్కొక్క జీవికి తన పూర్వ జన్మ కర్మలవలన ఒక్కొక్క ధర్మం ఉంటుంది. ఆ  ధర్మాన్ని బట్టి దానికి ఓక శరీరం ఇవ్వబడుతుంది. అందుకే శరీరం జీవుడికి దేవుడిచ్చిన ఉపాధి.

ధ్రియతేవా జనయదితి ఇతి ధర్మః 
నీవు తప్పక తెలుసుకొనవలసినది, తెలుసుకుని ఆచరించవలసినది ఏదో అదే ధర్మం 

అయితే మానవ శరీరం కలిగిన జీవులకు చైతన్యం అనే ఓకే గొప్ప శక్తి ఉంటుంది. ఆ శక్తితో వారు ఇక మళ్ళీ శరీరం పొందవలసిన అవసరం లేకుండా ఉండే మోక్ష ధామాన్ని చేరుకుంటారు. నిరుపాధి అంటే ఉపాధి అవసరంలేని స్థితిలో ఉండడం. అందుకే అమ్మను నిరుపాధి అన్నారు. 

155.నిరీశ్వరా - అమ్మే అన్నింటికీ ఈశ్వరి(ప్రభువు). ఆమె కన్నా పైన ఎవరు లేరు. అందుకే నిరీశ్వర.

148-151.nithyashuddha..Nirantara

148.Nithyashudda - 'Shuddha' means pure. The soul is always pure.

149.Nithyabuddha - 'Buddha means wisdom. The quality of having experience, knowledge, and good judgement. One who has it will resolve to self-realization. As the wisdom grows, a person will move away from worldly matters and towards inner peace. Nithya buddha represents a state of mind in which wisdom is ripened and hence focuses only on inner peace. There won't be any proclivity for worldly affairs.

150.Niravadhya - 'Avadhya' means flaw. Flaws appear due to ignorance. Niravadya means flawless.

151.Niranthara - 'Anthara' means limit or boundary. Divine mother is without any limits. Paramatma is boundless.

148.నిత్యశుద్ధా - శుద్ధము అంటే మాలిన్యములేనిది. ఆత్మ నిత్యశుద్ధము.

149.నిత్యబుద్ధా - బుద్ధ అంటే జ్ఞానం. జ్ఞానం పండిన వారు సంసార సుఖాలు క్షణికాలు అని తెలుసుకుని ఆత్మ సాక్షాత్కారానికై మొగ్గు చూపుతారు. వారు కర్మలు చేయరు. నిత్యం పరమాత్మను ధ్యానం చేస్తూ ఉంటారు. ఆ స్థితిని నిత్య బుద్ధ అంటారు.

150.నిరవద్యా - అవద్య అంటే దోషము. ఇది అవిద్య లేదా అజ్ఞానము వలన కలుగుతుంది. నిరవద్య అంటే ఎటువంటి దోషము లేనిది.

151.నిరంతరా - 'అంతరం' అంటే హద్దు, అవధి. పరమాత్మ సర్వాంతర్యామి. అందుకే నిరంతర. ఈ విషయం భాగవతం - ప్రహ్లాదోపాఖ్యానంలో శ్రీ బమ్మెర పోతనగారు చక్కగా వివరించారు. విష్ణువెక్కడని హిరణ్యకశిపుడు అడిగినపుడు ప్రహ్లాదుడు "ఇందుగలడు అందులేడని సందేహము వలదు. చక్రి సర్వోపగతుండు. ఎందెందు వెతికిన అందందే గలడు దానవగ్రజ" అంటాడు. 

144-147. Nityamuktha...Nirashraya

144.Nithyamuktha - 'Muktha' means liberated. Free! She who is forever free of various bonds of the world. How do you get bound if you are free?

When your actions are initiated by an underlying desire, it is called 'karma'. When the actions follow the principles of dharma, it results in 'Punya'. Otherwise it results in 'papa'(sin). As long as you perform karma, you either accrue 'punya' or 'paapa'. These are the bonds. In order to be liberated, you should neither have 'Punya' nor 'Paapa'. You should be in absolute state of neutrality. Divine mother does not have any underlying desire behind her actions. Hence, she does not have any bounds of 'Papa' or 'Punya'.

One should not think that he/she will be liberated by accruing 'Punya'. It will only lead to a better life in the next birth.

145.Nirvikara - Our body undergoes several changes. It has birth, death, growth, maturity etc. But soul never changes. It is like the electric bulb on a drama stage. It acts as a witness to the whole drama but never gets effected by the drama.

In vedic lingo, this body is called 'annavikaaram'. 'Akaaram' means shape. 'Vikaaram' is transformed shape. 'Annam' means food. What is left after food got transformed due various chemical processes is this body. So technically, it is 'annavikaaram'

146.Nishprapancha - The creation started with 'OM'. From 'OM' came karma. Then the three gunas (sattva, rajas, tamo). Then 5 tanmatras. These tanmatras gave rise to 10 subtle forms. They are the 5 elements and 5 senses. That is why you can see that each pair of element + senses is bound by a tanmatra. For eg: There is a tanmatra linking sky with sense of hearing, Fire with sense of sight, etc. After that more physical forms emerged. The word prapancha represents all of this. Divine mother existed even beyond 'OM'. So, she is 'Nishprapancha'.

147.Nirashraya - Divine mother (Shakti) is the base for the whole creation. So she neither have nor need a base. 

144.నిత్యముక్తా - ముక్తా అంటే విడుదలచేయబడిన అని అర్ధం. అమ్మ ఎల్లప్పుడూ స్వతంత్రురాలు. కోరికతో ఏదైనా పని చేస్తే అది కర్మ అవుతుంది. చేసిన కర్మ ధార్మికమైతే అది పుణ్యాన్నిస్తుంది. లేదంటే పాపం అంటుకుంటుంది. ఈ పాపపుణ్యాలే మన దాస్య శృంఖలాలు. అమ్మ ఏ కర్మలు చేయదు. ఆవిడ చేసే పనులు కేవలం లోకకల్యాణం కొరకే తప్ప వేరే ఏ స్వార్థ ప్రయోజనం కోసం కాదు. అందుకే నిత్యముక్త అన్నారు.
పుణ్యం ఆర్జిస్తే మోక్షం లభించదు. ఆ పుణ్యబలం వల్ల ఇంతకన్నా మంచి జన్మ లభిస్తుంది తప్ప జన్మరాహిత్యం కలుగదు. 

145.నిర్వికారా - మన శరీరానికి ఆరు రకముల మార్పులు ఉంటాయి. అవి 1. జన్మ. 2. స్థితి 3. వృద్ధి 4. విపరిణామము 5. క్షయము 6. నాశనము. కానీ ఆత్మకు ఈ మార్పులు ఏవి ఉండవు. నాటక రంగంలో వెలుగుతున్న విద్యుత్ దీపం వలె ఈ కదలికలకి సాక్షిగా  ఆత్మ మన శరీరంలోనే ఉంటుంది. కానీ ఎటువంటి వికారం చెందదు.
వేదిక పరిభాషలో ఈ శరీరాన్ని అన్నవికారం అంటారు. ఆకారం మార్పు చెందాక మిగిలి ఉన్నది వికారం. శరీరం అన్నం కొన్ని రసాయన చర్యలవల్ల మార్పు చెందాక వచ్చింది కనుక అన్నవికారం. 

146.నిష్ప్రపంచా - ఈ సృష్టికి 'ఓం' ప్రధమం. అందులోంచి కర్మ పుట్టింది. కర్మ నుండి మూడు గుణాలు వచ్చాయి. తరువాత 5 తన్మాత్రలు వచ్చాయి. వాటినుండి పంచభూతాలు, పంచేంద్రియాలు వచ్చాయి. తరువాత మరింత స్థూల రూపాలు వచ్చాయి. ప్రపంచం అంటే ఓం నుండి ఇప్పటివరకు చెప్పినదంతా. కానీ 'ఓం' వచ్చిందే అమ్మనుండి కదా. అందుకే ఆవిడ నిష్ప్రపంచ - వీటన్నింటికీ అతీతం.

147.నిరాశ్రయా - సమస్త జగత్తు అమ్మని ఆధారంగా చేసుకుని ఉన్నది. అలాంటప్పుడు ఆవిడకి వేరే ఆధారం ఏముంటుంది. ఆమె అన్నింటికీ ఆశ్రయం. ఆవిడ నిరాశ్రయ. 

134-137. Nirlepa Nirmala Nithya Nirakara

134.Nirlepa - Divine Mother is beyond illusion. She helps us in overcoming the illusion. 'Bhaga' means part. 'Bhagavan' means one that is present in all parts. So if One is present in all parts, then there is no room for a second thing. That means 'Bhagavan' is the only One present. He is present everywhere and in everything. Being aware of this is 'Gnyana'. Not being aware of this is illusion.

135.Nirmala - 'Mala' means impurity. The soul is always pure and no impurity can ever touch it. So it is called Nirmala.

136.Nithya - 'Jayate gacchate iti jagat'. The one which comes and goes is 'Jagat'. Jagat is the sanskrit word that represents this world. Everything in this jagat has a birthdate and a death date. But our mother is beyond this. She is eternal.

137.Nirakara - 'namarupatmaka mayam idam jagat'. Everything in this world has a form/shape and a name. But divine mother is beyond 'jagat'. So she is form less. Another interpretation of this is that every form in this jagat is her's. So it is not possible to assign a specific and particular form to her.

134.నిర్లేపా - మాయకు ఆమె అతీతురాలు. ఆమెను ఆశ్రయించినవారిని మాయనుండి కాపాడుతుంది. భగవంతుడు అంటే ప్రతీ భాగంలోనూ ఉండేవాడు అని అర్ధం. భగవంతుడే అన్ని, అంతటా ఉన్నది పరమాత్మే, ఉన్నది అది ఒక్కటే, రెండవది లేదు అని ఎరుకలో ఉండడమే జ్ఞానము. లేనిచో అజ్ఞాము/మాయ. 

135.నిర్మల - మలము అంటే కల్మషము, అశుద్ధము, ముఱికి మొదలగునవి. ఇవేవి ఆత్మను తాకలేవు. ఆత్మ నిర్మలము. 

136.నిత్య - జాయతే గచ్ఛతే ఇతి జగత్. ఈ జగత్తులోని ప్రతి ప్రాణికి, ప్రతి వస్తువుకి పుట్టినరోజు గిట్టినరోజు అని రెండు తప్పనిసరిగా ఉంటాయి. కానీ మన అమ్మ దీనికి అతీతమైనది. 

137. నిరాకార - 'నామరూపాత్మక మయం ఇదం జగత్'. అనగా ఈ జగత్తులో ఉన్న వాటన్నింటికి నామం రూపం ఉంటుంది. కానీ అమ్మ జగత్తునకు అతీతమైంది. కనుక ఆమెకు ఆకారం రూపం ఉండవు. ఇంకో విధంగా కూడా చెప్పవచ్చు. ఈ జగత్తులోని రూపాలన్నీ అమ్మవే. ఒక ప్రత్యేకమైన ఆకారం ఉందని చెప్పలేము కనుక నిరాకార. 

128-131. Sadhvi ...Shanthimathi

128.సాధ్వి - మహాకామేశ్వరుని(పరమాత్మ) కోరిక వలన అమ్మ సృష్టి చేసింది. అందులో 84 లక్షల జీవరాశులను పుట్టించింది. అంతే కాదు, ఆయన ఇఛ్చానుసారం సృష్టిని నడిపిస్తుంది కూడా. అందుకే సాధ్వి అనే పేరు ఇచ్చారు. ఎల్ల వేళలా భర్త అభీష్టాన్ని కోరడమే సాధ్వి లక్షణం. 

129.శరతూచంద్రనిభాననా - శరత్కాలంలో చంద్రుడు ఏంతో ప్రసన్నంగా, ఆహ్లాదంగా ఉంటాడు. అమ్మ ముఖం శరత్కాలంలో ఉందయించే చంద్రబింబంలా ఉంటుందిట. ముఖమే హృదయానికి దర్పణం అంటారు. ఆవిడ ముఖం అంత ప్రసన్నంగా ఉండాలి అంటే ఆవిడ హృదయం కూడా అంతే నిర్మలంగా ఉండాలి. అప్పుడే అది సాధ్యమవుతుంది. అమ్మ సాధ్వి కనుక ఆవిడ హృదయమే పరమాత్మ హృదయం కూడా. వాటిలో భేదం ఉండదు. పరమాత్మ హృదయమే వేదం. ఆద్యంతం పరమాత్మ గుణములనే కీర్తిస్తుంది వేదం. 84 లక్షల జీవరాసులు సంతోషంగా వర్ధిల్లడానికి చేయవలసిన కర్మ కాండలు వేదంలో చెప్పబడ్డాయి. అవి లోకోభ్యున్నతికై వచ్చినవి అనటానికి రుజువే శరత్కాలంలో చంద్రునివలె ఉన్న అమ్మ ముఖం. 

130.శాతోదరీ - శాతము అంటే కృశించినది అని అర్ధం. ఒక తల్లి తన బిడ్డలను సాకుతూ ఎంత శ్రమిస్తోందో తెలియజెప్పేది ఆమె ఉదరము. చిన్నపిల్లలతో సతమవుతున్న తల్లుల నడుము పొట్ట కృశించిపోయి ఉంటాయి. మరి మన అమ్మ ఆబ్రహ్మకీటజనని. 84 లక్షల జీవరాశులను సాకలి. ఇక ఆమెకు విశ్రాంతి ఎక్కడ? అందుకే ఆమె ఉదరము సన్నగా కృశించిపోయి ఉంటుంది. 

131.శాంతిమతి - శాంతిమతి అంటే ఉపశమించిన మానసము కలది. శాంతి పొందాలంటే ఇంద్రియముల అలజడి సద్దుమణగాలి. అప్పుడు మనస్సు, బయట విషయాలను కోరక, ఆత్మ జ్ఞానం వైపు దృష్టి సారిస్తుంది. సాధనలో జాగృతి, స్వప్న, సుషుప్తులను దాటి తురీయావస్థను చేరుకుంటుంది. అక్కడ మనోవృత్తులన్నీ మూలప్రాణంలో లయమయిపోతాయి. బుద్ధి మాత్రమే జాగరూకమయి ఉంటుంది. ఆ స్థితిలో శాంతి కలుగుతుంది. అదే మన అమ్మ నిజమైన స్వరూపం. శ్రీచక్రంలోని 9వ ఆవరణలో ఉన్నది శాంతి రసము.

128.Sadhvi - Mother created the Universe as per the desire of Mahakameshwar (Paramatma). She gave birth to 84 lakh species. Not only that, but she also administers this universe as per Kameshwara's wish. Hence the name Sadhvi. A sadhvi is a woman who always aligns all her actions to her husband's intentions. 

129.Sharatchandranibhanana - The moon is very pleasant in autumn. Mother's face is like the autumn Moon. It is said that the face is the index of Mind. So if Her face should be so pleasant then her mind should also be just as pure. Since Mother is a sadhvi, her mind is always aligned to Lord Kameshwara. There is no scope of difference between them. Vedas are textual explanations of Paramatma's intentions. The Vedas glorify the divine qualities throughout. The vedas state the rituals that should be followed so that all 84 lakh species thrive and prosper. Mother's face is the proof that vedic rituals are meant for larger good. Her face is pleasant like Autumn moon. That means her mind is very pure. Her mind is always aligned to Paramtma's will. Vedas explain Paramatma. So Vedas are for larger good of all living beings.

130.Shaatodari - 'Shaatha' means contracted. 'Udara' means belly. Size of a mother's belly indicates how busy & occupied she is with her kids. Our mother has to take care of 84 lakhs species. She has no time for rest. She is always engaged. Hence her belly is contracted and very thin.

131.Shantimati - She is peace personified. For peace to prevail, one has to first calm down the senses. Then the mind detaches with the external world and starts journey towards inner peace. With constant practice, it reaches the 'turiya' state where all the mental faculties get dissolved. Peace is experienced in this state. That is mother's true form. The 9th stage of SriChakra symbolizes this inner peace.

122-123. Shambhavi Sharadaradhya

'Sham' represents boundless joy. It is experienced by scholars after attaining vairagya. 'Shambhavi' means one who shows the way to 'Sam'. When we yearn for our mother with devotion, she cuddles us with love and leads us to the ultimate state of 'self realization'

Sarada represents wisdom. 'Saradulu' represents those people whose wisdom is complete, whose intellect is flawless. With the power of their intellect they find out that self realization is the ultimate happiness and rest all is illusion. They seek mother Lalitha's abode.

Sharadaradhya also means she who is to be worshipped during Navarathri celebrated during autumn (The period of sharannavaratri)

'శం' అంటే అంతులేని అవధులులేని ఆనందము. ఆత్మ సాక్షాత్కారము పొందిన యోగులు 'శం' యొక్క అనుభూతిని పొందుతారు. 'శం' కు దారిచూపునది శాంభవి. భక్తితో అమ్మను అర్థిస్తే ఆమె ప్రేమతో మనలను చేరదీసి 'శం' కు దారి చూపుతుంది.

శారద అంటే జ్ఞానం. జ్ఞానంగలవారు, పండితులు, కవులు మొదలగువారిని శారదులు అంటారు. అంటే జ్ఞానం పండినవారు అన్నమాట. అటువంటివారు ఆత్మానందమే నిజమైన సుఖమని, తక్కినవన్నీ మాయ అని తెలుసుకుని లలిత అమ్మను ప్రార్ధిస్తారు.

శరన్నవరాత్రులలో పూజింపబడుతుంది కనుక శారద అని కూడా లౌకికంగా చెప్పబడుతోంది.

118-121. Bhaktipriya...Bhayapaha

తన బిడ్డలలో ఉన్న భక్తి భావన అంటే అమ్మకు చాలా ఇష్టం. భక్తి సాధనలో మనకు సహాయపడటానికి ఆమె ఎప్పుడు ఎదురుచూస్తుంటుంది. భక్తి ద్వారా మనం అమ్మను సునాయాసంగా చేరుకోగలము. నిష్కామకర్మ వలన భక్తి కలుగుతుంది. భక్తి వలన జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం వలన వైరాగ్యం కలుగుతుంది. మన అమ్మ జగజ్జనని. సృష్టి, స్థితి, లయ కారిణి. ఆమె ప్రతాపం, తెలివితేటలు గురుంచి మనం ఎంత చెప్పగలం. ఆమె గొప్పతనం వర్ణనాతీతం. భండునితో యుధ్ధం జరిగినపుడు మనం ఆవిడ ప్రతాపం, బలం, బలగం ప్రత్యక్షంగా చూసాము. అటువంటి అమ్మ, ఒక చిన్న అతిసాధారణమైన బిడ్డ ఆర్తితో, భక్తితో అమ్మా అని తలచుకోగానే ఇహం పరం మరచిపోయి బిడ్డా బిడ్డా అనుకుంటూ మన దగ్గరకు వచ్చేస్తుంది. మన కష్టాలని బాధలని తొలగించి పరమానందం కలుగజేస్తుంది. ఆవిడ అమ్మతనం మన భక్తి వలన ప్రకటితమవుతుంది. ఆ భక్తికి ఆమె వశమవుతుంది. అటువంటి అమ్మ మనవద్ద ఉంటె ఇక భయానికి చోటెక్కడుంది?

Divine mother is eager to help us. She wants to reach to us. The easiest path to reach Mother is devotion. Actions without selfish motives lead to devotion. Worship with devotion leads to awareness of truth and illusion. When you do introspection with this awareness it leads to vairagya (self-realization). Mother is all powerful. She is mighty and magnanimous. We saw her capabilities in war with Bhandasura in previous names. She has the whole universe to rule and administer. But when a child yearns for her with devotion, she will forget all her virtues. Helping that child will become her first and topmost priority. She will not care for anything else. That is motherhood. There are numerous stories in puranas that describe such incidents. If such mother is with us, there is no room for fear!

112-114. Bhavani bhavanagamya bhavaranyakutharika

భవము అంటే ఉన్నది అని అర్థం. భగవంతుడు ఒక్కడే ఉన్నది. రెండవది ఏది లేదు అని ఎరుకలో ఉండడమే జ్ఞానం. లేనిచో అజ్ఞానం. అజ్ఞానాం వలన ఈ సంసారం ఓకనాడు ప్రీతికరంగాను మరునాడు అప్రీతికరం గాను గోచరిస్తుంది. అదే భవారణ్యం. రాగద్వేషాలు అనే పాశములు మనలను దీనిలోనే భ్రమింపజేస్తుంటాయి. భావుని పత్ని భవాని. ఈ సమస్త స్థావరజంగమ స్వరూపమే భావుడు. అతనిలో చలనం/ చైతన్యం  కలిగించేది భవాని. ఆర్తితో అమ్మను ఉపాసన చేస్తే ఆవిడ తన గొడ్డలితో మన రాగద్వేషాలను నరికివేస్తుంది.

సనాతన ధర్మంలో 5 రకాల ఉపాసనలు ఉన్నాయి. 1) న్యాసము, 2)జపము, 3)హోమము, 4)అర్చన 5)అభిషేకము. ఈ ఉపాసనలలో కలిగే అనుభూతులను స్మృతిపథంలో ఉంచుకుని మరల మరల తలచుకోవడమే భావన. భావనాగమ్యా అంటే భావనచే పొందదగిన అమ్మ అని అర్ధం.

Bhava means 'to exist'. God is the only one that truly exist. Rest all is illusion. Being aware that God is the only one that exist is Gnana(consciousness). Not being aware of this is agnana (ignorance). Out of this ignorance, the world looks like a bunch of pleasant and unpleasant things. That is 'bhavaranya'. In this we feel happy and sorrow due to our attraction to pleasant things and repulsion to unpleasant things. When you yearn for divine mother's love, she will first cut this attraction and repulsion with her axe.

'Bhava' represents the whole creation. 'Bhavani' is wife of 'Bhava'. She is cause of stimulus. She fills inspiration in the routine life of human beings.

Bhavana means feeling. Recollecting the feeling one experiences while performing several forms of worship is Bhavana. Sanatana dharma prescribed 5 forms of worship. 1)Nyasa, 2)Japa, 3)Homa 4)Archana 5)Abhisheka. Bhavana gamya means we can reach our mother by 1) worship 2) recollecting the experiences or feelings during worship

109 - 111. Mahaasaktih ....taneeyasi

కుండలినీ తామరతూడులోని దారం లాగ సన్నగా ఉంటుంది. అది ఆధారచక్రంలో, నోటితో తోకను పట్టుకున్న సర్పములాగా నిద్రిస్తూ ఉంటుంది.  చంద్ర కిరణాల వల్ల స్రవించే అమృత ధారలే దానికి ఆహారం (ఇడా నాడి చంద్ర నాడి. అందులో వాయువు తిరిగినప్పుడు కుండలినికి కావలసిన అమృత బిందువులు స్రవిస్తాయి). సాధకులు  ప్రాణాయామం ద్వారా వాయువును కుంభించినప్పుడు వాయు గమనం ఆగిపోతుంది. అమృత బిందువులు స్రవించవు. అప్పుడు నిరాహార అయిన కుండలిని మేల్కొని శుషుమ్నా నాడి ద్వారా పైకి ఎగబాకి షట్చక్రాలను దాటి, బ్రహ్మ, విష్ణు, రుద్ర గ్రంథులను భేదించి సహస్రారంలో ఉన్న సహస్రదళపద్మమును చేరుకుంటుంది. అక్కడ ఆ పద్మము యొక్క కర్ణికను కరిచి పట్టుకుంటుంది. అప్పుడు అందులోంచి అమృత దారాలు సాధకుని శరీరములోని 72000 నాడి మండలాలను తడుపుతుంది. అప్పుడు పరమాత్మ దర్శనం అవుతుంది. 

కుండలినికి పరమాత్మతో యోగమంటే ఆసక్తి. ఇది అన్నిటికన్నా గొప్ప ఆసక్తి. మిగతా కోరికలు ఎన్ని తీరిన ఈ ఆసక్తి మాత్రం పోదు. కానీ ఈ కోరిక తీరినవారికి ఇంక వేరే ఏ ఆసక్తి  ఉండదు.

The Kundalini (Divine Serpent Power) is like a thread in a lotus stem. It sleeps on the Moolaadhaara chakra, like a snake holding its tail with its mouth. It feeds on the nectar streams secreted by the lunar rays (Ida is the lunar naadi). The air flow through the ida naadi stops when the practitioner does kumbhakam in the pranayama. Then the secretion of Amrita nectar also stop. Then the fasting Kundalini awakens and ascends through the Sushumna nerve, crosses the six chakras, penetrates the Brahma, Vishnu and Rudra glands, and reaches the Sahasradala Padma(1000 petalled lotus) in the Sahasrara. There it bites and holds the atrium of the flower. The nectar from the flower drips down and washes all the 72000 nerve centers (naadis) in the practitioner's body. Then he/she experiences the divine bliss. This is union with Paramatma.

Union(Yoga) with Paramatman is of utmost interest to the Kundalini. This is the greatest interest of all. This interest will not go away until the union actually happens. Those who have fulfilled this desire will have no other desires left.

Popular