Search This Blog

678. Balipriya

పూజాకాలంలో నివేదన చేసే పదార్ధాన్ని బలి అని అంటారు. అటువంటి నివేదనలందు ప్రీతి గలది అమ్మ. అరిషడ్వర్గాలను వదలివేయటమే బలి యొక్క ముఖ్యమైన ఉద్దేశ్యము.పూజలోను, హోమం దగ్గర, ఊరేగింపు సమయంలోనూ, పూజాంతమునందు దేవతలకు బలి సమర్పణ చేస్తారు.

బలి అంటే - అజ్ఞానాన్ని విడిచి, అరిషడ్వర్గాలను జయించినవారు. అట్టివారి యందు ప్రీతి గలది. అరిషడ్వర్గాలను జయించిన వారు అంటే జితేంద్రియలు.

ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు. అతని కుమారుడు బలి. వేదవేదాంగవిదుడు. జితేంద్రియుడు. ధర్మపరుడు. బలి చక్రవర్తిగా గొప్ప కీర్తి గడించాడు. అయినప్పటికీ కర్త్రుత్వ భావన ఇంకా పోలేదు. నేను నాది అన్న అహంకార భావనను ఇంకా వదలలేదు. అందువల్ల మోక్షానికి అర్హత సంపాదించలేక పోయాడు.

అతనిని ఉద్ధరించడానికి విష్ణుమూర్తి వామనావతారమెత్తి వచ్చాడు. బలి ఆయనను చూసి ఈ భూమండలము అంతా నాదే. నీకేం కావాలో అడుగు ఇచ్చేస్తా అన్నాడు. ఇదే కర్తృత్వ భావన అంటే. ఈ సమస్త బ్రహ్మాన్దాలలోను ఆ పరమాత్మయే నిండి ఉన్నాడు. నేను ఆయన అంశ అయిన జీవాత్మను అన్న స్మ్రుతి లేక పోవడం వల్లనే నేను, నాది అనే కర్త్రుత్వ భావన కలుగుతుంది. జితేంద్రియుడు అయినంత మాత్రాన కర్త్రుత్వ భావన పోదు. అది కూడా పోవాలి అంటే ఇంకా జ్ఞానం కలగాలి. ఆ జ్ఞానం బలి చక్రవర్తికి ఇచ్చి అతనికి మోక్షమివ్వడానికే వామనుడు వచ్చాడు. క్షణంలో సమస్త భువన భాన్దాలకూ విస్తరించి చూపించాడు. అప్పడు బలి తానెవరో (జీవాత్మ) ఎదురుగా ఉన్నదెవరో (పరమాత్మ) గ్రహించాడు. నేను నాది అనే అహంకారాన్ని వదిలేసి మోక్షం పొందాడు. అదే వామనుడు బలిని పాతాళానికి పంపడం అంటే.

While performing pooja, we offer favorite things to Gods and demi gods. This is called Bali. The real purpose of Bali is to overcome the craving for these carnal pleasures. Bali is given in a Pooja, Homa, Procession etc.

Bali means shunning the darkness of ignorance and rising to the light of knowledge. To win over the Arishadvarga. Such people are called 'Jitendriya'. Divine mother likes such people. Hence she is called Bali priya.

Virochana is Prahlaada's son. Bali is son of Virochana. Bali studied vedas. He follows dharma. He is very famous as the Emperor Bali. He is a Jitendriya. But he is still bound by karma because he did not overcome his ego. The feeling of I and Mine is the root cause for this. Hence he is still not eligible for moksha.

Lord Vishnu came in the avatar of Vamana to help Bali overcome his ego. Seeing him Bali said, "This entire land is mine. I am the emperor. Ask me what you want and I will give it to you". Not having the awareness of the omnipresent, omnipotence and eternal qualities of paramatma and not knowing that one is jeevatma, a part/aspect of paramatma is the root cause of the feeling of I and Mine. This is what we call as ego and is what Bali is suffering from at that moment. Being Jitendriya doesn't guarantee that one can overcome the ego. It requires more practice. So Lord Vamana spread his body across the whole universe in a split second and showed what/who he is. Then Bali realized his true identity and shunned his ego. Then he attained Moksha. Lord Vamana crushing Bali into earth represents this phenomenon.

670. Annadha

Annam janebhyo dadaati.

She is the one who gives food to all living creatures. Anna means food. As per vedas, earth is the last one to be created among the five elements. Then Divine Mother added fertility to it. Then plants grew from it. This way all the beings got their food. Hence she is called 'Annadha'. 

While performing a yagna, 'Aahutis' are offered to sun god. These Aahutis promote cloud formation and cause rain. This gives enough water for cultivation. That gives food to all of us. This power of sun god is called 'Savitri'. She is a form of Divine Mother

We get eligibility to eat a type of food based on our past karma. We eat only those foods that we are eligible of. 

We discussed previously that there are many species of living creatures. Three qualities are common to all of them. They are: 1. Eating, 2. Sleeping, 3. Reproduction. Humans have an additional quality. That is the power of discretion. Other creatures don't have it. This paves the way for the ability of humans to attain moksha. Hence it is said that a human life is the most precious of all others. Of those humans, being born as a Brahmin is even more precious. Brahmins are those who learn, think and meditate over para-brahma. Their children naturally acquire some part of their knowledge. Hence they possess greater knowledge about para-brahma than others. Such life is useful to all other creatures. Hence it is said that being born as a brahmin is a lucky chance.

Humans are those creatures who have the below characteristics:

7 elements
10 senses
5 Pranas
11 Mental faculties
Total 33

Other creatures don't posses some of these characteristics. As per vedas there are 84 lakhs species. They are classified as below:

Immovable - 20 lakhs
Land animals - 30 lakhs
insects - 11 lakhs
Birds - 10 lakhs
Aquatic animals - 9 lakhs
Maanavulu - 4 lakhs
Total 84 lakhs 

In the natural food chain, creatures with more characteristics eat those with lesser characteristics. 

Vegetarian food is most suitable for humans. These vegetarian foods are subdivided into 'Sattvic', 'Rajasic' and 'Tamasic'. The food we take influences our mind and behavior. Hence one should always eat clean and fresh food only.

Foods that are 'Rajasic' in nature will cause disturbance in mind
Foods that are 'Tamasic' in nature will cause sleep and inactivity
Foods that are 'Sattvic' are best of all of those

The first shloka of 'Esavaasya upanishath' says:

Esavasyamidam sarvam yatkincha jagatyam jagath
Tenatyaktena bhumjeedhah maagridhah kasyaswidh dhanam

Paramatma is everywhere and in everything. This wealth is not everlasting. Stop running after these momentary pleasures. Shun carnal pleasures. Stop thinking about other's money. Earn whatever you want with your own effort. Ensure the effort you put is dharmic. That gives you the required results. Food earned that way is good for you.

Food has 3 types of impurities:
  1. Jaati dosham - Impurity by nature. Like onion, garlic etc. They are tamasic
  2. Aasraya dosham - Impurity cause due to improper storage. Eg: Milk is sattvic, but when stored in a copper container is becomes tamasic
  3. Nimitta dosham - Impurity that comes from the surroundings. Eg: Food cultivated near a gutter or a graveyard etc.

670. అన్నదా

అన్నం జనేభ్యో దదాతి

జనులకు అన్నము ఇచ్చేది. అన్నము అంటే బియ్యంతో వండిన పదార్ధమే కాదు. జీవి బ్రతకటం కోసం తీసుకునే ఆహారం ఏదైనా అన్నమే. వేదంలో చెప్పినట్లుగా పంచభూతాలలో అఖరుగా భూమి ఉద్భవించింది. భూమి నుంచి ఓషధులు పుట్టినాయి. ఆ ఓషధుల నుంచే అన్నము వచ్చింది. ఈ రకంగా లోకంలోని జీవరాశులన్నింటికీ అన్నము నిస్తుంది. కాబట్టి ఆ దేవి అన్నదా అనబడుతోంది. యజ్ఞలు చేసేటప్పుడు అగ్నిలో ఆదిత్యుడికి ఆహుతులు అర్పించటం జరుగుతుంది. ఆ ఆహుతుల వలన సూర్యుడికి ప్రకాశం పెరుగుతుంది. దాంతో నదులు, సముద్రంలోని నీరు ఆవిరి అయిపోయి మేఘాలుగా మారుతుంది. మళ్ళీ వర్షరుతువు రాగానే ఆ మేఘాలు వర్షిస్తాయి. ఈ వర్షాలవల్ల వాగులు, వంకలు, యేరులుగా నీరు ప్రవహించి, నదులుగా మారి సముద్రంలో కలుస్తుంది. ఈ వర్షపునీటితోను, ప్రవహించే నీటితోను సాగుబడి జరిగి వంటలు పండుతాయి. ఆ పంటలవల్లనే జీవులకు ఆహారం లభ్యమవుతుంది. ఇక్కడ ఆదిత్యుని శక్తికి సావిత్రి అని పేరు. ఆమె పరమేశ్వరి స్వరూపము.  

పూర్వజన్మలలో చేసిన కర్మఫలంవల్ల ఎవరికి ఏ రకమైన ఆహారం ప్రాప్తమో అది అన్నంగా లభిస్తుంది. జీవులలో క్రిమికీటకాల మొదలు మానవులదాకా అనేకరకాలున్నాయి అని గతంలో వివరించాం. వీటికి అన్నింటికీ కూడా సమానమైన లక్షణాలు కొన్ని ఉన్నాయి. అవే ఆహారనిద్రా మైధునాలు. వీటన్నింటికన్న మానవుడికి ప్రత్యేకంగా ఉన్నది మనస్సు. ఆలోచనాశక్తి. ధర్మాధర్మ యుక్తాయుక్త విచక్షణ. మిగిలిన జీవులకు వేటికీ ఈ లక్షణం లేదు. అందుచేత మిగిలిన జన్మలన్నింటిలోకీ మానవజన్మ దుర్లభమైనది అని చెప్పబడింది. అందులోనూ బ్రాహ్మణ జన్మ మరీ దుర్లభము. ఎందుచేతనంటే, లోకంలో అనాదిగా కొంతమంది ఆధ్యాత్మిక చింతన, సత్యాన్వేషణలో కాలం గడుపుతున్నారు. వారే బ్రాహ్మణులు. అయితే వారి సంతతి సత్యాన్వేషణ చెయ్యకపోయినప్పటికీ, వారికి ఆ లక్షణాలు కొన్ని వంశానుగతంగా లభ్యమవుతాయి. అందుచేత మిగిలినవారి కన్న బ్రహ్మను గురించిన పరిజ్ఞానము వారికి ఎక్కువ ఉంటుంది. అందుచేత యుక్తాయుక్త విచక్షణ కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టే బ్రాహ్మణజన్మ మరీ దుర్లభమని చెప్పబడింది.

జీవులకుండే లక్షణాలు కొన్ని ఉన్నాయి. అందులో మానవుడికి ఉండేవి 33. అవి

సప్తధాతువులు 7 
ఇంద్రియాలు 10 
ప్రాణాలు 5 
మానసిక ప్రవృత్తులు 11 
వెరసి 33

ఈ 33 లక్షణాలు గలవాడే మానవుడు. మిగిలిన జీవులకు ఈ లక్షణాలు ఒకటొకటి తగ్గుతూ ఉంటాయి. ఈ లక్షణాలను బట్టే ఇది మృగమని, పశువని, పక్షిఅని, క్రిమిఅని, కీటకము అని నిర్ణయించటం జరుగుతుంది. స్థావర జంగమాత్మకమైన జగత్తులో మొత్తం 84 లక్షల జీవరాసులున్నాయి. వాటిలో

స్థావరములు 20 లక్షలు 
మృగాలు 30 లక్షలు 
క్రిములు 11 లక్షలు 
పక్షులు 10 లక్షలు 
జలచరాలు 9 లక్షలు 
మానవులు 4 లక్షలు 
వెరసి 84 లక్షలు
జీవులు అన్నింటికీ ఒకటే ఆహారంకాదు. ఎక్కువ లక్షణాలు గల జీవులు, తక్కువ లక్షణాలు గల వాటిని ఆహారంగా తీసుకుంటాయి. ఇది ప్రకృతి సహజము కాని మానవుడు జగత్తులోని అన్ని పదార్దాలను ఆహారంగా తీసుకుంటాడు.

విజ్ఞుడైనవాడు కేవలము శాఖాహారం మాత్రమే ఆహారంగా తీసుకుంటాడు. అయితే శాఖాహారంలో కూడా సత్వరజస్తమోగుణాలు గల పదార్ధాలున్నాయి. ఆహారంలోని సూక్ష్మాంశ భోక్త యొక్క మనస్సుగా మారుతుంది. అందుకని తీసుకునే ఆహారాన్ని బట్టి మనస్సు యొక్క ప్రభావము, ప్రవృత్తి ఉంటాయి. అందుకే పవిత్రమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. వీటిలో

రాజసాహారంవల్ల - మనోచాంచల్యం కలుగుతుంది. 
తామసాహారం వల్ల - నిద్ర ఎక్కువ అవుతుంది 
కాబట్టి సాత్వికాహారమే శ్రేష్ఠము.
అయితే మనం తీసుకునే ఆహారం ఏవిధంగా వచ్చింది అనే దానిమీద కూడా ఉపాసకుడికి ఫలితము వస్తుంది. ఎవరైనా దానం చేసిన పదార్థాలు తింటే, మన ఉపాసన ఫలం కొంతవారికి చెందుతుంది. అన్యాయార్జితమైన ఆహారం తింటే, దాని ఫలితం కూడా అనుభవించాలి. అందుచేత కష్టపడి సంపాదించిన ఆహారం మాత్రమే తీసుకోవాలి.

ఈశావాశ్యోపనిషత్తులోని మొదటి మంత్రంలో

ఈశావాస్య మిందగ్ం సర్వం యత్కించ జగత్యాం జగత్
తేన త్యక్తేన భుంజీథాః మా గృఢః కస్యస్విద్ ధనమ్
అనిత్యమైన ఈ ప్రపంచంలో పరివర్తనాశీలమైనది ఏదైతే ఉన్నదో అదంతా పరమేశ్వరుడిచే ఆవరించబడి ఉన్నది. ఈ ఐశ్వర్యము నిత్యముకాదు. అశాశ్వతమైన వాటి మీద కోరికలు వదలిపెట్టు. ప్రాపంచిక సుఖాలను పరిత్యజించు. ఇతరుల ధనాన్ని ఆశించకు. ఇతరులమీద ఆధారపడకు అని చెప్పబడింది. అంటే నీకు కావలసిన ధనం నువ్వే సంపాదించుకో అంతేకాని ఎవరినీ యాచించవద్దు అంటోంది. ఈ రకంగా కష్టపడి సంపాదించిన ధనంతోనే ఫలితం ఎక్కువ వస్తుంది. అది కూడా మంచి పనిచేసి ధనార్జన చెయ్యాలి. అలా సంపాదించే ఆహారం కూడా దోషరహితంగా ఉండాలి.

దోషాలు మూడురకాలు.

జాతిదోషము - ఉల్లి, వెల్లుల్లి, ముల్లంగి పంటలు ఈ రకమైనవి
అశ్రయదోషము - పాలు సాత్వికమైన ఆహారము. కాని రాగి గిన్నెలో పోస్తే దోషము. 
నిమిత్త దోషము - స్మశానంలో పండించినవి, మలమూత్రాదులతో కలిసిన మురుగు నీటితో పండించిన పంటలు.

668. Nirdwaita

నిర్ద్వైతా. రెండు కానిది. భగవంతుడు వేరు భక్తుడు వేరు అనేది ద్వైతభావన. ఇటువంటి భావన తప్పు అని చెబుతోంది సనాతన ధర్మం. సనాతన ధర్మం అద్వైతభావనను ప్రతిపాదిస్తుంది. అంటే భక్తుడు భగవంతుడు ఇద్దరూ ఒకటే. జగత్తంతా పరబ్రహ్మ స్వరూపమె. అంతకుమించినది ఏదీలేదు.

బ్రహ్మవిద్ బ్రహ్మ ఎవ భవతి

సాధకుడు తాను వేరు భగవంతుడు వేరు అని భ్రమలో ఉంటాడు. కానీ సాధన చేసి బ్రహ్మ జ్ఞానం సముపార్జించిన తరువాత తానూ, బ్రహ్మము ఒకటే అని తెలుసుకుంటాడు.

అసతోమా సత్గమయ!
తమసోమా జ్యోతిర్గమయా!
మృత్యోర్మా అమృతంగమయ!

ఓం శాంతిః శాంతిః శాంతిః !!!

తానూ వేరు బ్రహ్మము వేరు అనే అసత్యము నుండి అంతా బ్రహ్మమే అని తెలుసుకునే వరకు సాగే ప్రయాణం. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని అజ్ఞానాంధకారం నుండి అంతా స్పష్టంగా జ్యోతకం అయ్యే వరకు సాగే ప్రయాణం. చావు పుట్టుక అనే కష్టాల నుండి అసలు చావే లేనటివంటి స్థాయికి చేరుకునే ప్రయాణం - ధర్మ బద్ధంగా సాగే జీవితం. 

ఛాందోగ్యోపనిషత్తులో ఉద్దాలకుడు తన కుమారుడైన శ్వేతకేతువుతో “మానవుడు నిద్రించేటప్పుడు ఆత్మలో తాత్కాలికంగా లీనమవుతాడు. మరణకాలంలో వాక్కు మనసులో లీనమవుతుంది. మనసు ప్రాణంలో లీనమవుతుంది. ప్రాణం తేజస్సులో లీనమవుతుంది. చివరకు అది పరమశక్తితో కలిసిపోతుంది. ఆ శక్తి అతి సూక్ష్మమైనది. కాని విశ్వమంతా వ్యాపించి ఉన్నది. అదే సత్యము. అదే నిత్యము. అదే ఆత్మ. అదే నీవు శ్వేతకేతూ అదేనీవు. జీవించినంత కాలము పులి, సింహము, క్రిమి కీటకము ఇత్యాది పేర్లుంటాయి. మరణించిన తరువాత ఆ పేర్లన్నీ పోతాయి. జీవికి గుర్తింపు ఉండదు. ఆ జీవి పరమాత్మలో చేరిపోతుంది. అదే నీవు. శ్వేతకేతూ ఆ పరమాత్మే నీవు" అని చెబుతాడు. ఇది అద్వైత సిద్ధాంతం.

Nirdwaita means one that cannot be divided. The belief that God and his creation are separate is called Dwaita. Sanathana dharma does not accept it. It says there are no two things. Everything is para-brahma. We perceive them as different because of our ignorance.

Brahma vid brahma eva bhavati

A practitioner initially thinks there are two separate things. Then he practices yoga and meditation and become aware that there indeed is only one thing.

Asatoma satgamaya!
Tamasomaa jyotirgamaya!
Mrityorma amritangamaya!

Om Shantih Shantih Shantih !!

Life is a journey from falsehood to truth. From darkness to light. From mortality to immortality when you follow dharma.

In Chandogya upanishath, Uddalaka says this to his son Shwetakethu, "When a man is in deep sleep, he is temporarily submerged into soul. During death, speech dissolves into Mind. Mind goes into Prana(life force). Prana goes into soul. Finally everything goes into Paramatma. This Paramatma cannot be perceived. But is present everywhere. That is truth. That is permanent. That is you. O! Swataketha! That is you! Out of illusion we perceive things as a man, a tiger, a bird, an insect etc. But just think, what happens when they are all gone? They all go into the same paramaatma. That is you!" 

This is Adwaita

665. Lokayatra Vidhaayani

పధ్నాలుగు లోకాల యొక్క సృష్టిస్థితిలయాలనబడే యాత్రను చేసే స్వభావం గలది. ఈ లోకాలలో జన్మించే ప్రతిజీవికీ వారు చేయవలసిన పనులు అన్నీ ముందుగానే నిర్ణయిస్తుంది. కాబట్టి లోకయాత్రా విధాయినీ అనబడుతోంది.

లోకంలోని మానవాళికి వర్ణాశ్రమధర్మాలను విధించినది. గత జన్మలో చేసిన కర్మల ఫలితాలను అంటే సంచితకర్మను వారు తరువాత జన్మలలో జాగ్రత్తగా అనుభవించేటట్లు ఏర్పాటు చేసేది. ఆ కర్మ ఫలితము అనుభవించటానికి అనుగుణంగా శరీరాన్ని ఏర్పాటుచేసేది.

జీవులు తాము చేసిన కర్మలననుసరించి వారికి మానవులు, పశువులు, పక్షులు, గంధర్వులు, యక్షులు. ఇలా వారికి జీవనవిధానం ఏర్పరుస్తుంది. వారందరూ ఆ విధంగా కర్మఫలం అనుభవించేటట్లు చూస్తుంది. కాబట్టి ఆవిడ లోకయాత్రా విధాయినీ అనబడుతుంది.

Yatra means journey. It is the journey of creation, sustenance and destruction of all the 14 lokas. She decides the destiny of all those living in these 14 lokas. 

She decides our next birth based on our past karma. She assigns the body that is suitable to enjoy the fruits of all our past karma.

She prescribed the Varna-Ashrama dharmas for betterment of all those who got human body. Each human will exhibit certain tendencies based on his/her past karma. One should choose the correct dharma based on his/her tendencies and lead a dharmic life. That is the path to liberation.

Because she conducts the journey to liberation of all the beings across several births. She is called Lokayatra Vidhaayani.

664. Ajajaitri

అజా: పుట్టుకయే లేనిది. అష్టమూర్తుల రూపం ధరించి ఉన్నప్పటికీ, జీవులకు ఉండేటటువంటి షడ్భావవికారాలు లేనిది. షడ్భావవికారాలు అంటే :

  1. పుట్టటము
  2. మరణించటము
  3. పెరగటము
  4. ఉండటము
  5. పరిణామం చెందటము
  6. క్షయం కావటము

ఇవి ఏవీ కూడా లేనటువంటిది. భావవికారాలు లేనటువంటిది. నిత్యము సత్యము అయిన పరబ్రహ్మస్వరూపము.

జైత్రీ:

అజ్ఞానము వలన ఈ శరీరమే మనం అని భావిస్తుంటాము. జనన మరణాలు మనకి సంబందించినవి అని భ్రమలో బ్రతుకుతుంటాము. స్వస్వరూప జ్ఞానం కలిగిన జ్ఞాని ఈ శరీరం తుచ్ఛమని, తన నిజ స్వరూపం ఆత్మయని తెలుసుకుంటాడు. అప్పుడు ఈ జనన మరణాలను జయిస్తాడు.

Due to ignorance, we think we are being born, grown and dead. Atma is neither born nor dead. We think like that because we associate ourselves with the body and not the Atma. Human body undergoes the below transformations:
  1. Born
  2. Dead
  3. Grow
  4. Exist
  5. Transform
  6. Contract
The real knowledge helps us to change this association. A Gynani (knowledgeable man) triumphs over this ignorance. He would associate himself with the Atma. With that he would overcome the shackles of birth and death.

Ajajaithree - Means the one who does not have any need to be born. One who has triumphed over birth and death.

663: Ashtamurthih

 Divine mother is seen as a group of eight in many ways

1. Panchabhootaani chandrarka vaatmeeti munipungava
    Murthi rashta shiva syahur devadevasya dheematah
    Aatmaa tasyaam shamee murthy ryajamaanahvayaa paraa
    
    The five elements, Sun, Moon and a somayaji performing Yagna are Ashtamurthis

2. Bhava, Sharwva, Eshaana, Pashupathi, Rudra, Ugra, Bheema, Mahadeva

3. Bhagavadgeeta:
    Bhoomiraapo nalo vaayuh Kham mano buddhi revacha
    Ahankaara iteeyam me bhinna prakruti rashtagaa
    
    The five elements, the mind, the intellect and the ego

4. Shakti rahasyam:
    Lakshmirmedha dhara pushti gouri tushti prahba dhruti 
    Etabhih paahi tanu rashtaabhi rmam saraswati

    Lakshmi, Medha, Dhara, Pushti, Gouri, Tushti, Prabha, Dhruti

5. Yoga Shastram:
    Guna bhedaatma murthih: Ashtadha parikeertitah
        Jeevatma chantaraatma cha paramaatma cha nirmalah
        Shuddhaatma Gnaana roopaatma mahatma saptmasmrutah
        Ashtama steshu Bhootaatme Twastatmaanah prakeetitah

    Jeevatma, Antaratma, Paramatma, Nirmalatma, Shuddhatma, Gnaanaroopaatma, Mahatma,                    Bhootatma

6. Vishnu puranam:

    Suryudu, Jalamu, Prithivi, Agni, Vayu, Akaasha, A Brahmin performing a sacred ritual, Moon
    Their better halves in the same order
    Suvarchala, Soma, Sukeshi, Swaha, Parashiva, Diti, Deeksha, Rohini
    Their sons in the same order
    Shani, Shukra, Lohitanga, Jeeva, Skanda, Swarga, Santana, Budha

7. Anangakusuma, Anangamekhala, Anangamadhana, Anangamadanaatura, Anangarekha,                           Anangavegini, Anangankusha, Ananga maalini

8. Brahmi, Mahsewari, Koumaari, Vaishnawi, Varaahi, Maahendri, Chamunda, Mahalakshmi

9. Gnanendriyaalu, Karmendriyaalu, Ahankaara chatushtayam, Prana panchakam, Bhoota panchakam,        kaamamu, karma, avidya

Like this there are many octets that are seen as forms of Divine Mother

10 Kaadividya, Haadividya, Sankhyavidya, Bhoomavidya. When considered along with their                     better halves become eight.

663. అష్టమూర్తి:

ఎనిమిది స్వరూపాలుగా ఉన్నది. అనేక మూర్తి సముదాయాలు ఈ రకంగా ఉన్నాయి.

1. పంచభూతాని చంద్రార్కా వాత్మేతి మునిపుంగవ !
    మూర్తి రష్టా శివ స్యాహు ర్దేవదేవస్య ధీమతః
    ఆత్మా తస్యాం షమీ మూర్తి ర్యజమానాహ్వయా పరా ||
    పంచభూతాలు, చంద్రుడు, సూర్యుడు, యజ్ఞదీక్ష గల సోమయాజి. వీరు అష్టమూర్తులు.

2. భవుడు, శర్వుడు, ఈశానుడు, పశుపతి, రుద్రుడు, ఉగ్రుడు, భీముడు, మహాదేవుడు.

3. భగవద్గీత:
    భూమి రాపో నలో వాయుః ఖం మనోబుద్ధి రేవ చ |
    అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతి రష్టగా "
    పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారము వీటిని అష్టమూర్తులంటారు.

4. శక్తిరహస్యంలో
    లక్ష్మీర్మేధా ధరా పుష్టి గౌరీ తుష్టిః ప్రభా ధృతిః
    ఏతాభిః పాహి తను రష్టాభి ర్మాం సరస్వతి !
    1. లక్ష్మీ 2 మేధ 3. ధర 4. పుష్టి 5. గౌరీ 6. తుష్టి 7. ప్రభ 8. ధృతి

5. యోగశాస్త్రంలో
    గుణ భేదాత్మమూర్తి : అష్టధాపరికీర్తితా
            జీవాత్మ చాంతరాత్మా చ పరమాత్మా చ నిర్మల:
            శుద్ధాత్మ జ్ఞానరూపాత్మా మహాత్మా సప్తమఃస్మృతః
            అష్టమ స్తే షు భూతాత్మే త్యష్టాత్మానః ప్రకీర్తితాః
            గుణభేదములచే ఆత్మ ఎనిమిది రకాలుగా అవుతున్నది. అవి.
    1. జీవాత్మ 2. అంతరాత్మ 3. పరమాత్మ 4. నిర్మలాత్మ 5. శుద్ధాత్మ 6. జ్ఞానరూపాత్మ 7. మహాత్మ 8. భూతాత్మ

6. విష్ణుపురాణంలో

    1. సూర్యుడు 2. జలము 3. పృథివి 4. అగ్ని 5. వాయువు 6. ఆకాశము 7. దీక్షితుడైన బ్రాహ్మణుడు 8. చంద్రుడు
    వీరి భార్యలు వరుసగా
    1. సువర్చల 2. సోమ 3. సుకేశి 4. స్వాహా 5. పరాశివ 6. దితి 7. దీక్ష 8. రోహిణి
    వీరి కుమారులు
    1.శని 2 శుక్ర 3. లోహితాంగ 4. జీవ 5. స్కంద 6. స్వర్గ 7. సంతాన. 8. బుధ

7.
    1. అనంగకుసుమ 2. అనంగమేఖల 3. అనంగమదన 4. అనంగమదనాతుర 5. అనంగరేఖ 6. అనంగవేగిని
    7. అనంగాంకుశ 8. అనంగమాలిని

8.
    1. బ్రాహ్మి 2 మహేశ్వరి 3. కౌమారి 4. వైష్ణవి 5. వారాహి 6. మాహేంద్రి 7. చాముండ 8. మహాలక్ష్మి

9.
    1.జ్ఞానేంద్రియాలు 2. కర్మేంద్రియాలు 3. అహంకార చతుష్టయం 4. ప్రాణపంచకం 5. భూతపంచకం 6. కామము
    7. కర్మ 8. అవిద్య,

ఈ రకంగా ఎనిమిదిగా ఉన్న స్వరూపమంతా ఆ పరమేశ్వరియే. అందుకే ఆమె అష్టమూర్తి అనబడుతోంది. అంతేకాకుండా
    1. కాదివిద్య 2. హాదివిద్య 3. సంఖ్యావిద్య 4. భూమావిద్య
    ఈ నాలుగు లింగభేదంతో ఎనిమిది అవుతున్నాయి. వీటి స్వరూపం కూడా పరమేశ్వరియే అందుకే ఆవిడ అష్టమూర్తి,

659: Icha shakti-Gnaana shakti-Kriya Shakti swarupini

The Cycle of Karma and the Path to Liberation

Karma is the union of desire and effort. When effort exists without desire, it is no longer karma—it becomes selfless service. However, when desire is consciously aligned with Vedic principles, it transforms into Sankalpa, a sacred intention. This is why the Vedas prescribe rituals such as yagnas, yaagas, poojas, vratas, and homas. When a wish arises from the heart and is pursued through prescribed efforts, it is often fulfilled, bringing a sense of satisfaction.

But this satisfaction is fleeting. After enjoying the fruits of one fulfilled desire, another inevitably arises. A new sankalpa is formed, followed by action, fulfillment, and temporary contentment. And so, the cycle continues—binding us in the endless loop of karma.

Every desire originates from Iccha Shakti—the power of will, which is an aspect of the Divine Mother. The knowledge of how to fulfill that desire comes through Jnana Shakti—the power of wisdom, also the Divine Mother. The effort to realize the desire is driven by Kriya Shakti—the power of action, again, the Divine Mother. As long as we continue to enjoy the fruits of our actions, we remain caught in this cycle of will, knowledge, and action.

Breaking Free: The Power of Renunciation

The simplest and most effective way to break free from this karmic cycle is to renounce the fruits of your actions. Perform your duties with intention (sankalpa), but once the desire is fulfilled, offer the results back to the Divine. This act of surrender severs the chain of karma and liberates you from its binding effects. In doing so, you begin to realize your true nature—Satchidananda: eternal existence, consciousness, and bliss.

The Inner Mechanics of Joy and Desire

By nature, human beings are joyful. They are the finest creation of the Divine, inherently basking in the bliss of the Atma—the inner Self. However, when a desire arises in the mind, it turns outward, away from the Atma. This creates a distance between the mind and the Self, and joy diminishes.

As described earlier, we form a sankalpa and fulfill it through the powers of will, knowledge, and action. Once the desire is fulfilled, the mind begins to return to the Atma, and joy increases. But because the mind is still focused outward, it mistakenly attributes this joy to the fulfillment of the desire. Before it can fully reunite with the Self, another desire arises—this is vikalpa, distraction. The mind is diverted again, and the cycle of karma continues.

Each time a desire is fulfilled, the joy we feel is actually the result of the mind moving closer to the Atma. Yet, we misinterpret it as the pleasure of achievement. This is why the Vedas describe the mind as sankalpa-vikalpa-sangatha—a force oscillating between intention and distraction. The only way to transcend this cycle is to relinquish attachment to the outcomes of our actions.

The Vedic Way: Fulfillment with Awareness

The Vedas do not forbid the fulfillment of desires. On the contrary, they offer structured paths to achieve them. But these paths are meant to help us realize the impermanence of worldly pleasures and guide us toward the eternal joy of the Atma.

If you crave a delicious dessert, enjoy it—provided it is earned through righteous means. Once your hunger is satisfied, share the remaining food with those in need. After covering your monthly expenses, donate the surplus of your income. While giving, offer a prayer to the Divine Mother, asking for liberation from the cycle of karma.

This conscious offering, born of gratitude and detachment, becomes the gateway to nirvana—freedom from bondage and the realization of your true, blissful nature.

659: ఇచ్ఛా శక్తి-జ్ఞాన శక్తి-క్రియా శక్తి స్వరూపిణి

కోరిక మరియు ప్రయత్నం రెండు కలిస్తే 'కర్మ'. కోరిక లేకుండా ప్రయత్నిస్తే 'కర్మ ' అవ్వదు. నిస్వార్ధ సేవ అవుతుంది. కర్మను వేదవిధితో అనుసంధానం చేస్తే సంకల్పం అవుతుంది. యజ్ఞ యాగాది క్రతువులు, పూజలు, వ్రతాలు హోమాలు ఇందుకొరకే చెప్పబడ్డాయి.  మనస్ఫూర్తిగా కోరుకుని వేదంలో చెప్పనట్లు చేస్తే సంకల్ప సిద్ధి లేదా కర్మ ఫలం లభిస్తుంది. కోరిక నెరవేరుతుంది. సంతృప్తిగా ఉంటుంది. 

కర్మఫలం అనుభవించాక ఇంకో కోరిక కలుగుతుంది. మళ్లీ ప్రయతించాలి. వేద విధితో అనుసంధానం చేయాలి. మళ్లీ సంకల్పం జరుగుతుంది. కోరిక నెరవేరుతుంది. సంతృప్తి కలుగుతుంది. కర్మ ఫలాన్ని అనుభవిస్తాము. మళ్ళీ కోరిక కలుగుతుంది. ఇలా కర్మ బంధం మనల్ని తిప్పుతూనే ఉంటుంది. 

కోరిక కలిగించేది అమ్మే. అదే ఇచ్చాశక్తి. ఆ కోరిక ఎలా తీర్చుకోవాలో చెప్పేది అమ్మే. అదే జ్ఞాన శక్తి. దానికి సరిపడా శక్తినిచ్చేది అమ్మే. అదే క్రియ శక్తి. కర్మ ఫలాన్ని అనుభవించినంత కాలం మనం ఈ ఇచ్చా-జ్ఞాన-క్రియా శక్తులలోనే తిరుగుతూ ఉంటాము. 

ఇందులోంచి బయట పడటానికి అత్యంత సులభమైన మార్గం కర్మఫల త్యాగం. సంకల్పం నెరవేరిన తరువాత వచ్ఛే ఫలితాన్ని త్యాగం చేస్తే మళ్ళీ కోరిక కలగదు. అప్పుడు మనం ఈ క్షణభంగురం నుంచి బయట పడతాము. అప్పుడు మన నిజస్వరూపం ఆనందమని తేలుకుంటాము. అది ఎలాగో ఈ క్రింద వివరం చదివి తెలుసుకోండి. 

మానవులు సహజంగానే ఆనంద స్వరూపులు. ఆత్మ సౌందర్యాన్ని ఆస్వాదించేవారు. ఎప్పుడైతే మనస్సులో ఒక కోరిక కలుగుతుందో అప్పుడు అది ఆత్మను మరచి బయట ప్రపంచంవైపు దృష్టి మళ్ళిస్తుంది. అప్పుడు ఆత్మకు మనస్సుకు మధ్య దూరం పెరుగుతుంది. ఆత్మనుండి దూరం పెరిగింది కనుక ఆనందం తగ్గిపోతుంది. పైన చెప్పిన విధంగా ఇచ్చా-జ్ఞాన-క్రియా శక్తులతో వేదవిధానాలతో సంకల్పం నెరవేరుస్తాము. అప్పుడు మనస్సు మళ్ళీ ఆత్మవైపు వెళ్లడం మొదలుపెడుతుంది. ఆత్మకు మనస్సుకు మధ్య దూరం తగ్గుతుంది. ఆనందం కలుగుతుంది. కానీ మనస్సు ఇంకా బయట ప్రపంచాన్నే చూస్తోంది కనుక అది కోరిక తీరడం వలన ఆనందం కలుగుతోంది అని భ్రమ పడుతుంది. ఆత్మకు చేరువయ్యే లోపే వెంటనే ఇంకో కోరిక బయలు దేరుతుంది. ఇది వికల్పం. మళ్ళీ ఇచ్చా-జ్ఞాన-క్రియా శక్తులతో వేదవిధానాలతో సంకల్పం నెరవేరుస్తాము. ఇలా క్షణభంగురంలో చిక్కుకు పోతాము. అందుకుకే మనస్సును సంకల్ప-వికల్ప సంఘాతం అంటారు. కర్మఫలత్యాగము దీనికి విరుగుడు. 

కోరికలు తీర్చుకోవద్దు అని వేదంలో ఎక్కడా చెప్పలేదు. కోరికలు తీర్చుకోవడం కోసమే ఇన్ని పూజలు, వ్రతాలు, యజ్ఞాలు మొదలైనవి ప్రతిపాదించారు. కానీ అవి క్షణికాలు అని తెలుసుకుని, ఈ క్షణభంగురంలోంచి బయట పడటానికి ఉపయోగించాలి. బాగా ఆకలి వేసినప్పుడు మంచి దోస తినాలి అనిపించిందనుకోండి. మీరు ధర్మబద్ధంగా ఆర్జించిన విత్తంతో కావలిసినన్ని దోశలు తినండి. కానీ కడుపునిండి తృప్తిచెందాక మిగిలిన దోశలు లేని వారికి దానం చేయండి. కష్టపడి సంపాదించిన డబ్బుతో నెల ఖర్చులు పోగా మిగిలిన డబ్బు ఏ అన్నదాన సత్రంకో లేదా వేరే ఏదైనా నిస్వార్థ సేవకో వెచ్చించండి. అలా చేస్తూ అమ్మను క్షణభంగురం నుంచి తప్పించమని అర్ధించండి. మీరు తప్పక తరిస్తారు. 


647. Satyananda Swarupini

సత్యము ఆనందము స్వరూపముగా గలది. అమ్మకు బాధలు దుఃఖాలు, కష్టాలు ఉండవు. ఆమె కేవలము ఆనంద స్వరూపిణి.

సత్యం జ్ఞాన మనంతం బ్రహ్మ! సత్యము నిత్యము అయినది, ఆనందస్వరూపమైనది, అనంతమైనది ఆ పరబ్రహ్మ.

ఆనందం రెండు రకాలు

  1. లౌకికానందం
  2. పరమానందం.
1. లౌకికానందమనేది క్షణికానందం. ఇది శాశ్వతం కాదు. ఈ ఆనందంలో దుఃఖము ఉంటుంది. త్రిపురా రహస్యంలో ఈ విషయం చాలా గొప్పగా చెప్పబడింది. పూర్వకాలంలో దశార్ణ దేశాన్ని మూకాచూడుడు అనే రాజు పాలిస్తుండేవాడు.
అతనికి ఇద్దరు కుమారులు. పెద్దవాడు హేమచూడుడు. రెండవవాడు మణిచూడుడు. వీరు మంచి రూప గుణ లావణ్యాలు గలవారు. వేదవేదాంగవిదులు. సకల శాస్త్ర విశారదులు.

ఒకరోజు వీరు వేటకు వెళ్ళారు. అక్కడ పెద్ద వడగళ్ళ వాన వచ్చింది. దాంతో హేమ చూడుని గుర్రం దారి తప్పి దగ్గరలో ఉన్న వ్యాఘ్రపాద మహర్షి ఆశ్రమం చేరింది. అక్కడ ఒక మునిబాలిక అత్యంత రూప లావణ్యవతి అతనికి స్వాగతం పలికింది. ఆమె పేరు హేమలేఖ. హేమచూడుడు తొలిచూపులోనే ఆమెను ప్రేమించాడు. వ్యాఘ్రపాదుని అనుమతితో హేమలేఖను వివాహమాడాడు హేమచూడుడు. ఆమెతో సహా రాజ్యానికి తిరిగి వచ్చాడు. సుఖంగా కాపురం చేస్తున్నాడు.

ఒకరోజున హేమచూడుడు తన భార్యతో "దేవీ ! నన్ను నువ్వు ఇష్టపడే వివాహమాడావు కదా! మరి ఎందుకు పరాకుగా ఉంటావు. నేను వచ్చిన సంగతి కూడా వెంటనే నీకు తెలియదు. నిన్ను ప్రేమగా దగ్గరకు తీసుకున్నా, కొద్ది సేపటి దాకా నువ్వు ఈ లోకంలోకి రావు. ఏదో ఆలోచిస్తుంటావు. ఈ సుఖాలు నీకు ఇష్టం లేదా? నిజం చెప్పు" అంటాడు. దానికి హేమలేఖ 'రాజా ! ఇవి సుఖాలు కాదు. దుఃఖహేతువులు. నిజంగా ఇదే సుఖమైతే రతిక్రీడలో పాల్గొన్న పశువు, తరువాత వళ్ళు నొప్పితో ఎందుకు బాధపడుతుంది? కాబట్టి ఇది నిజమైన సుఖం కాదు. ఇది క్షణికం. అనుభవించినంతవరకే ఉంటుంది. ఆ తరువాత ఉండదు. ఇది దుఃఖహేతువు. అంటూ భర్తకు జ్ఞానబోధ చేస్తుంది. కాబట్టి లౌకిక విషయాలవల్ల వచ్చే సుఖం శాశ్వతమైనది కాదు.

2. పరమానందం. ఇది శాశ్వతమైన ఆనందం నిత్యము సత్యము అయినది. పరబ్రహ్మ అనుభవించే ఆనందం ఇదే. శ్రీచక్రంలోని తొమ్మిదవ ఆవరణ అయిన సర్వానందమయ చక్రంలో అమ్మ ఉంటుంది. అంటే ఆమె ఆనందమయి.
సాధకుడు కుండలినీ శక్తిని సహస్రారం చేరిస్తే అక్కడ నుండి అమృతపు ధారలు కురిసి యోగి శరీరంలోని నాడీ మండలమంతా తడుస్తుంది. అప్పుడు అతడు పొందే ఆనందం అనిర్వచనీయం. అది అనుభవైక వేద్యం.
పంచకోశాలలోను ఐదవదైన ఆనందమయ కోశమందు అమ్మ ఉంటుంది. ఆమె సత్యానంద స్వరూపిణి.

The one who has truth and happiness as its form. Divine Mother does not have sorrows. She is happiness in it purest form.

Satyam Gnanam Anantam Brahma! She who is truth, everlasting, happy and infinite. That is Para brahma.

Pleasure/Joy is of two types:
  1. Loukika
  2. Para
1. Loukika represents all the pleasures that come from material attachments. Though they look like pleasures, they always carry the shadow of sorrow with them. It is explained like this in Tripura Rahasyam. 'Once upon a time there lived a great king called Mookaachoodudu. He is the king of Dashaarna. He has two sons. The elder one is Hemachoodudu and the younger one is Manichoodudu. They are handsome and wise. They graduated in many sciences.

One day, they both went to a forest for hunting. There was a big hailstorm in the forest. Hemachoodudu lost his way and got stranded in the storm. He reached saint vyaghrapada's ashram for shelter. There he fell in love with his daughter Hema lekha. It was love at first sight. With permission from Vyaghrapada, he married Hema lekha and returned to his kingdom. They both lived happily.

One day, Hemachoodudu asked his wife, "Devi! You married me with heartful of love. But why am I not able to feel your love? Most of the time, I see you lost in thoughts. It takes a lot of time for you to even engage in a conversation with me. Don't you like spending time with me? Are you not happy here? Please tell me what's going on?" Hema lekha replied, "O king! These are not pleasures. They are reasons for all your sorrows. They are all momentary. Your feel happy as long as you do it. Post that you feel sad. So you should not run after these momentary pleasures"

2. Para represents the bliss of Atma. When a Yati becomes yogi by taking kundalini to sahasrara, his entire body gets the bliss of Sahasrara's Amruta. It flows through out his body. Then he experiences Satya Ananda. It cannot be explained. It has to experienced. That is Divine Mother.

646. Sarva vedanta samvedya

వేదాంతము వేదముల చివర చెప్పబడినది. ఉపనిషత్తు. వేదం మొత్తం నాలుగు భాగాలుగా ఉంటుంది.

1. సంహితలు : ఇది మంత్రభాగం. ఇందులో స్తోత్రాలు ఆవాహనలు ఉంటాయి.

2. బ్రాహ్మణాలు : సంహితలో ఉన్న విషయాన్ని వివరించేవి బ్రాహ్మణాలు. యజ్ఞయాగాదులు ఎలా చెయ్యాలి? యజ్ఞాల విలువ ఏమిటి? అనే విషయాలు ఇందులో చెప్పబడ్డాయి.

3. అరణ్యకాలు : బ్రాహ్మణాలకు ఉపనిషత్తులకు మధ్యస్థాయిలో ఉంటాయి. ఇవికూడా బ్రాహ్మణాలలాగానే కర్మవిధులను ప్రతిపాదిస్తాయి. కాని వీటిలో కర్మల భౌతిక భాగం ఉండదు. కర్మల వెనుక గల నిగూఢమైన తత్త్వం మీద ధ్యానానికి ప్రాధాన్యత ఇవ్వబడింది. ఏకాంతవాసం చేసేవారు, అరణ్యాలలో నివశించే వారికోసం ఇవి నిర్దేశించబడ్డాయి.

4. ఉపనిషత్తులు : ఇది బ్రహ్మవిద్య, జీవాత్మ, పరమాత్మ, జ్ఞానము, మోక్షముల గురించి వివరించేవి. పరమేశ్వర స్వరూపము అనేది ఉపనిషద్వాక్యాలచే తనే ఎరుగబడునది. ఉపనిషత్సారమే బ్రహ్మవిద్య. అందుచేతనే అమ్మ 'సర్వవేదాంత సంవేద్యా' అనబడుతున్నది.

Upanishads come at the end of vedas. Vedas have 4 parts.

1. Samhita: This has all the mantras and stotras

2. Braahmanas: This explains various aspects of samhitas. It explains how to perform Yagnas and Yagas and various benefits of them.

3. Aranyakas: It also explains various karmas like Braahmanaas. But it focuses more on internal meaning of these karmas than the physical interpretation. They are applicable to those who meditate in soltitude.

4. Upanishad: This is Brahma vidya. It explains about jeevatma, paramatma, gnana and moksha. They try to explain various aspects of Divine Mother. The essence of all the upanishaths is Divine Mother. Hence she is called sarwa vedanta vedya.

Maha Shiva Ratri

మాఘ మాసంలో బహుళ పక్షంలో వచ్చే చతుర్దశిని మహా శివరాత్రి అంటారు. ఇది గొప్ప శుభ దినం. ఈ రోజు హిందువులు ఉపవాస జాగరణ దీక్షలతో శివుడిని ఆరాధిస్తారు. ఈ రోజు రాత్రి 12 గంటలకు వచ్చే కాలాన్ని లింగోద్భవ కాలం అంటారు. 

శివరాత్రి యొక్క మహిమను ఋషులు ఇలా వివరించారు. భూమి తనపై ఉన్నవాటిని తన వైపు లాగుతుంది. ఈ శక్తిని గురుత్వాకర్షణ అంటారు. అలాగే దీనికి విరుద్ధంగా పని చేసే శక్తి ఒకటి ఉంది. అది వస్తువులను భూమి నుండి దూరముగా లాగడానికి ప్రయత్నిస్తుంది. దీనిని విరుద్ధ గురుత్వాకర్షణ శక్తి అంటారు. ఈ శక్తి యొక్క ప్రభావం కృష్ణ పక్ష చతుర్దశి నాడు అధికంగా ఉంటుంది. భూమి గురుత్వాకర్షణ శక్తికి విరుద్ధంగా ఉండడం వలన,  సాధకుడు తన వెన్నును నిటారుగా ఉంచినప్పుడు కుండలినిని పైకి లాగడంలో ఈ శక్తి దోహద పడుతుంది. 

శివరాత్రి అంటే ఆకలిదప్పులు మరచి రోజంతా శివదీక్ష లో మునిగి ఉన్న సాధకుడికి కుండలిని జాగృతం అయి, అది పైకి ఎగబాకి సహస్రారం చేరి ఆత్మ సాక్షాత్కారం కలగడం. యతి యోగిగా మారడం. ఆ రోజు ఉదయం నుంచి సాధన మొదలు పెడితే రాత్రి 12 గంటలకు లింగోద్భవము జరగడం. జీవాత్మ పరమాత్మ ఏకమవ్వడం. ఈ ప్రక్రియకు విరుద్ధ గురుత్వాకర్షణ శక్తి దోహద పడుతుంది. మాఘ మాసంలో వచ్చే కృష్ణ పక్ష చతుర్దశి నాడు దీని ప్రభావం అత్యధికంగా ఉంటుంది. అందుకనే ఆరోజు మహా శివరాత్రి గాను, తక్కిన మాసములలో వచ్చే కృష్ణ పక్ష చతుర్దశిని మాస శివరాత్రి గాను లెక్కిస్తారు. ఉపవాస జాగరణ దీక్షలు శివ సాయుజ్య సాధనలో  ఆకలి, అలసట మొదలైన విఘ్నాలు కలుగకుండా ఉండటానికి సూచిస్తారు. 

The 14th day in the second half of the month of Maagha is called Shivaraatri. Hindus worship Lord Shiva on this day. They fast for the whole day and stay awake the whole night while worshipping the Lord. 12 o clock in the midnight of Shivaratri is called Lingodbhava kalam.

Saints explained the greatness of Shivaratri as follows. The earth's gravity pull all objects towards itself. However, there is a force that pulls objects away from earth. This is called anti gravity. The effect of this anti gravity is prominent on the 14th day of the second half of every month(29th day). If a spiritual practitioner meditates on Lord Shiva with his spine erect, this anti gravity force helps kundalini to crawl up the spinal cord to Sahasrara.

Shivaratri means to spend time meditating on Lord Shiva. Indulging in meditative calmness, a spiritual practitioner would shun even basic necessities like hunger, rest and puts his/her mind steadfast on the Lord. Kundalini will be awakened in that meditation and with help of anti gravity, it reaches the Sahasrara. By 12 in the midnight, a practitioner becomes a yogi. It means the union of jeevatma and paramatma. That is called lingodhbhavam. This process is called Shivaratri. Anti gravity helps in this process. It's effect is much more prominent on Maha Shivaratri. 14th day of the second half of each month is called maasa shivaratri (monthly shivaratri). Shivaratri that comes in the month of Maagha is called Maha Shivaraatri. Fasting is prescribed to avoid unwanted distraction during meditation and jaagarana is done to continue meditation till midnight.

644. Gynanada

అన్నింటికీ మూలమైనది ఏదో, దేనివలన ఈ జగత్తు సృష్టించబడుతోందో, ఆ విషయపరిజ్ఞానమే జ్ఞానము అనబడుతుంది. ఏ విషయాన్ని తెలుసుకున్నంత మాత్రం చేత అన్ని విషయాలు తెలుస్తాయో ఆ విషయమే జ్ఞానము. జ్ఞానమనేది పరమాత్మ స్వరూపము అందుచేతనే పరమాత్మ తేజోమయమైన కాంతిపుంజము అని చెప్పబడింది.

అదే జ్ఞానజ్యోతి సాధకుడు కుండలినీశక్తిని నిద్రలేపి సహస్రారం చేర్చగలిగితే అక్కడ తానెవరు అనే విషయం తెలుస్తుంది. అదే స్వరూపజ్ఞానం. ఆత్మజ్ఞానం.

బ్రహ్మవిద్ బ్రహ్మైవభవతి.

బ్రహ్మను గురించి తెలుసుకున్నవాడు తాను కూడా బ్రహ్మమే అవుతాడు.ఈ చరాచర జగత్తు అంతా తనలో చూడగలుగుతాడు. అదే జ్ఞానము. ఆ జ్ఞానాన్ని పొందినవాడు జ్ఞాని. ఇతని దృష్టిలో కులాలు లేవు. మతాలు లేవు. రూపభేదం, రంగు భేదం లేదు. జగత్తులోని మానవులంతా ఒకటే.

శంకర భగవత్పాదులవారికి కాశీలో ఒక ఛండాలుడు త్రోవలో అడ్డు వస్తాడు. అతణ్ణి తప్పుకోమంటారు శంకరుని శిష్యులు.
అప్పుడు ఆ ఛండాలుడు ఎవర్ని తప్పుకోమన్నారు? నన్నా ? నా ఆత్మనా ? ఆత్మనే గనక అయితే నీలో ఉన్నది, నాలో ఉన్నది ఒకే ఆత్మ. ఈ శరీరాన్ని అయితే అందరి శరీరాల్లోని రక్తమాంసాలు ఒకటే. మరి ఎవరు తప్పుకోవాలి? అని అడుగుతాడు. దీంతో శంకరులవారికి జ్ఞానోదయమవుతుంది. అప్పుడు ఆ ఛండాలుడి పాదాల మీద పడతాడు శంకరుడు. ఆ వచ్చిన వాడు సాక్షాత్తూ పరమేశ్వరుడు. ఈ రకంగా అనేకమందికి అనేకచోట్ల జ్ఞానోదయమవుతుంది. జ్ఞానికి అన్ని విషయాలు తెలుస్తాయి. సకల శాస్త్రాలు తెలుస్తాయి. వాటిని ప్రత్యేకంగా చదువవలసిన అవసరం లేదు.

జ్ఞానమనేది రెండు రకాలుగా ఉంటుంది. 1. ఇహలోక జ్ఞానము 2. పరలోక జ్ఞానము. ఐహలోక జ్ఞానము అంటే ఈ లోకంలోని వస్తువులను గురించిన పరిజ్ఞానము. లౌకికమైన అన్ని విషయాలు పూర్తిగా తెలుస్తాయి.
2. పరలోక జ్ఞానము పరదేవతను గురించి ఆత్మను గురించి క్షుణ్ణంగా తెలుసుకోవటం.

ఈ జ్ఞానమనే దాన్ని భక్తులకు ఇచ్చేది జ్ఞానదా. బంధజ్ఞానాన్ని పోగొట్టి పరమజ్ఞానాన్ని ఇచ్చేది.

Gnana means knowledge of that which is utmost superior. That which can explain everything else. Knowledge of that which has knowledge of everything else embedded in it. It is the form of Paramatma. That is why Paramatma is explained as a brilliant self-luminous light.

When a practitioner meditates upon Divine Mother and awakens kundalini, it crawls up and reaches Sahasrara. Then he acquires Gnana. That is called self-realization. Knowledge of Paramatma.

'Brahmavid brahmaiva bhavati'

One who learns about Brahman (Paramatma) becomes Brahman. He see the whole creation inside him. That is Gnana. Those who have Gnana are called Gnani. A Gnani does not see any difference between a priest and a chandala. A dog and a royal elephant. He sees Divine Mother in all.

Once sri Adi Shankara is going in a procession along with his disciples in the city of Kasi. A chandala (person from lower caste) comes and stands in front of the procession. Then Shankara's disciples ask him to move away. To that, the chandala asks, "Whom are you asking to move away? This body, or this Atma? If it is this Atma, then it is same in you and me. This dog and that king. If it is this body, then all these bodies have the same elements like skin, flesh, blood, bones, etc. So first clarify what is different here. Then we can move that out". That is the moment when Sri Adi Shankara realizes Gnana. A Gnani will know about everything. He knows all sciences by default.

Gnana is of two types: 1.Ihaloka 2.Paraloka. Ihaloka means knowledge about all perceivable things. A Gnani will know about all perceivable things. Paraloka means knowledge about Atma.

Gnanadha means one who gives this Gnana. That is Divine Mother.

643. Aparichedya

పరిచ్ఛేదము - ఇటువంటిది, ఇంతటిది అని చెప్పతగినది. అపరిచ్ఛేదము - ఇటువంటిది అని చెప్పటానికి వీలులేనిది. లోకంలోని ప్రతివస్తువూ కంటికి కనిపిస్తుంది. కాబట్టి దాన్ని గురించి చెప్పవచ్చు. అందుకే అది పరిచ్ఛేదము. అయితే అమ్మ కంటికి కనపడదు. ఆమె ఇటువంటిది అనిగాని, ఆమెను గురించి ఇంకేమైనాగాని చెప్పలేము. అందుకే ఆమె అపరిచ్ఛేద్యమైనది. సత్యము జ్ఞానము అనంతమయమైనది పరబ్రహ్మ. జ్ఞానము ఎంత ? అంటే అపరిచ్ఛేద్యము. అనంతమైనది.

ఆవిడ రూపము లేనిది. జగత్తంతా వ్యాపించి ఉన్నది. జగత్తులోని ప్రతి వస్తువూ ఆమె రూపమే. కళ్ళు ఆమె స్వరూపం. కాని కళ్ళే ఆమె రూపం కాదు. చెవులు ఆమె స్వరూపం. అలా అని చెవులే ఆమెరూపం కాదు. ఈ రకంగా జగత్తులోని ప్రతి వస్తువూ ఆమె స్వరూపమే. అందుచేత ఆమె రూపాన్ని నిర్ణయించటంకాని, వర్ణించటంకాని చేయలేము. అందుకే ఆమె అపరిచ్ఛేద్యా అనబడుతోంది.

Paricheda - That which can be confined to 'This' or 'This much'. Aparicheda is the one that cannot be confined. All perceivable things in this world can be described as 'like this'. But Divine Mother cannot be perceived. So she cannot be explained completely.

We can say that Eyes, Mind, Five elements etc are forms of Divine Mother. But it is not possible to confine her to anyone of these or even all of these. Because she is beyond everything that can be perceived.

642.Dhyanagamya

Divine mother can be known by meditation. Vedas proclaimed that the Self can be realized through meditation. Offering Pujas or Archanas cannot take one to self-realization. Only those who meditate upon Divine mother with steadfast mind can reach there. Hence she is called Dhyana gamya. 

Below is the comparison between Jeevatma and Paramatma

Jeevatma -            Paramatma

Illusion -               Truth
Ephemeral -          Everlasting
Confined -             Boundless
Ignorant -              Knowledgeable
Momentary pleasures - Joyful always

So jeevatma and paramatma are opposite poles. However, when Jeevatma shuns ignorance and realizes the truth, it becomes Paramatma. This can happens only through knowledge. Brahman can be realized only through Brahman. Not possible by other means. So to bridge the gap between the ignorant Jeevatma and attribute less Paramatma, Divine Mother creates several avatars of Brahman. 

These avatars have 6 qualities
  1. Power of knowing everything
  2. Having knowledge by default
  3. Can be present everywhere
  4. Always satisfied
  5. Always free
  6. Detached
Even Jeevatma has these qualities, but due to ignorance, they don't show up. When the Jeevatma breaks the cycle of Iccha shakti, Gnana Shakti and Kriya shakti and becomes knowledge of these qualities within, he realizes Paramatma.

Dhyana(Meditate) means to focus steadily on the point where knowledge can be retained. It is of two types:
  1. Saguna
  2. Nirguna
You become that on which you meditate. This is the most important aspect in meditation. In Saguna form, you attain the attributes of the Devata upon which you are meditating. This will not lead to the Absolute. Do keep in mind, Brahman with attributes is to help us reach the attribute less. But the Absolute (Pramatma) does not have any attributes. To reach the attribute less Absolute, you need Nirguna meditation. 

642. ధ్యానగమ్యా

ధ్యానముచేత ఎరుగబడినది. వేదంలో ధ్యానయోగము చేత దేవతా శక్తిని పొందవచ్చును అని చెప్పబడింది. పరమేశ్వరిని పూజించటము, స్తోత్రం చెయ్యటమువల్ల కాకుండా నిశ్చలమైన మనస్సుతో ధ్యానించటంచేత మాత్రమే పొందదగినది ఆ పరమేశ్వరి. అందుచేతనే ధ్యానగమ్యా అనబడుతుంది. భగవంతుడు సత్యజ్ఞానస్వరూపుడు. అనంతుడు, అవ్యయుడు. వీటికి భిన్నమైనవాడు జీవి. పరమాత్మ - జీవాత్మల మధ్య భేదాలు

పరమాత్మ -    జీవాత్మ
సత్యము -      అసత్యము
శాశ్వతము -   అశాశ్వతము
అనంతము - అంతముగలది
జ్ఞాని -             అజ్ఞాని
శాశ్వతమైన ఆనందము - క్షణికానందము

ఈ రకంగా జీవాత్మ పరమాత్మలు భిన్న ధృవాలు. అయితే జీవుడు అవిద్యను వదిలి, తానే పరబ్రహ్మ అని తెలుసుకున్నప్పుడు అతడే పరబ్రహ్మ అవుతాడు. అజ్ఞాని అయిన జీవి ధ్యానము ద్వారా గాని, ఇంకొక మార్గం ద్వారా కాని పరమాత్మ దర్శనం చేసుకోలేదు. ఇది కేవలము జ్ఞానంద్వారానే జరగాలి. బ్రహ్మను గురించి తెలుసుకోవటం బ్రహ్మద్వారానే జరుగుతుంది. ధ్యానం చెయ్యాలంటే ఇద్దరికీ ఒకే లక్షణాలుండాలి. ధ్యానం కాని ఇంకొకటిగాని చేసి పరమాత్మను చేరలేడు. జ్ఞాని మాత్రమే ఆ పని చెయ్యగలడు. అందుచేతనే పరమేశ్వరి భక్తులను కనికరించాలనే ఉద్దేశ్యంతో సగుణ బ్రహ్మను ఏర్పరచింది. ఆ సగుణ బ్రహ్మయే భగవంతుడు. సాధకుని యొక్క కోరిక మేరకు భగవంతుడికి రూపం కల్పించబడింది.

సాధకానాం హితార్థాయ బ్రహ్మణో రూపకల్పనా

భంగవంతుడికి ఆరు లక్షణాలుంటాయి. అవి
1. సర్వజ్ఞత
2. అనాదిబోధ
3. అనంతత
4 నిత్యతృప్త
5. స్వతంత్రత
6. అలుప్తత

వీటిని గతంలో వివరించటం జరిగింది. ఈ లక్షణాలు జీవిలో కూడా ఉంటాయి. కాని అవి అతని అజ్ఞానం వల్ల బయటకు కనపడవు. ఈ అజ్ఞానం గనక వదలినట్లైతే, జీవికి భగవత్సాక్షాత్కారము జరుగుతుంది. ఇచ్ఛాజ్ఞానక్రియాశక్తుల బలం తగ్గి విజ్ఞానం పెరిగితే, జీవి తానే భగవత్స్వరూపుడనని తెలుసుకుంటాడు. దీనికి సగుణోపాసనే సాధనము.

ధ్యానము అంటే - విషయాన్ని ధారణచేసే స్థలంలో బుద్ధిని స్థిరంగా ఉంచటము. మళ్ళీ ధ్యానము రెండు రకాలు 1. సగుణ ధ్యానము 2. నిర్గుణ ధ్యానము. ధ్యానంలో ఒక ముఖ్యసూత్రం గుర్తుంచుకోవాలి. ఏ దేవతనైతే అర్చిస్తామో, అదే రూపాన్ని మనం కూడా పొందుతాము. అంటే ఆ రూపం పూర్తిగా మనకు రాకపోయినా, దాని లక్షణాలు తప్పనిసరిగా వస్తాయి. అందుచేతనే సగుణ బ్రహ్మను ఆరాధించేవారికి ఆ దేవత లక్షణాలే వస్తాయి. మరి నిర్గుణ బ్రహ్మోపాసన చేసేవారికి నిర్గుణత్వం, నిరాకారత్వం వస్తుంది. అదే సాయుజ్యం. అంటే నిరాకార అయిన పరమేశ్వరిని ధ్యానం చేస్తే మోక్షం కలుగుతుంది.

Popular