Search This Blog

601.Dakshayagna vinaasini

Daakshaayani is daughter of Daksha prajapathi. After marriage of Daakshayani with Lord Shiva, Shiva became Daksha's son in law. One day, Lord Brahma conducted a Yaga and call all the devatas and prajapathis. Daksha came a little late to that yaga. Rest all have already arrived and sat waiting for Daksha. As he arrived, others stood in respect and welcomed Daksha respectfully. But Lord Shiva did not stand up. He did not even looked at Daksha. He was in trance. 

Daksha felt insulted with Lord Shiva's behavior. He used to express this anger on Dakshaayani. She's not  aware of this incident. He used to avoid her in all family gatherings. After sometime, Daksha organized one yagna. He invited all the devatas and all the daughters. But not Dakshaayani. Dakshaayani wants to meet all her siblings and parents. So she wanted to go to the Yagna. She told the same to Lord Shiva. Shiva warned that going there without an invitation might cause insult. But she did not pay heed. Then Shiva said, "do as you like". He asked pramada ganas to accompany her.

Dakshaayani went to Dakshayagna. Daksha did not welcome her. He did not pay any attention to her. She only went to her farther and said 'Hi'. Daksha asked, "Why did you come". Dakshaayani asked, "Why? What's wrong?". He said," Your husband is an egomaniac. He doesn't know how to respect great people like me. He doesn't do any service to me". Dakshaayani couldn't bear this insult. She raised sacred fire(Yogagni) and burnt herself in it. Lord Shiva heard this news from pramada ganas. He could bear separation from Daakshaayani. He shivered in wrath. Veerabhadhra emerged out of that anger. He along with pramada ganas went and destroyed the Daksha yagna. Veerabhadhra killed Daksha.

Later all the devatas brought Daksha back to life and attached goat head to him. From then onwards, Daksha is called ajamukha. Because Divine mother is the root cause of destruction of Daksha yagna, she is called Dakshayagna vinaasini

601. దక్షయజ్ఞవినాశినీ

దక్షుని యొక్క కుమార్తె దాక్షాయని అని గతంలో వివరించటం జరిగింది. దక్షుడు తన కుమార్తె అయిన సతీదేవిని శివునికిచ్చి వివాహం చేశాడు. ఒకరోజున బ్రహ్మ ఒక యాగం చెయ్యటానికి ఉపక్రమించి, ఆ యాగానికి దేవతలనందరినీ ఆహ్వానించాడు. అనుకున్నట్లుగానే అందరూ విచ్చేశారు. దక్షప్రజాపతి కొద్ది ఆలస్యంగా వచ్చాడు. అతడు రావటంతోనే దేవతలంతా లేచి నుంచుని ఆయన్ను గౌరవించారు. శివుడు మాత్రం లేవలేదు సరికదా తలత్రిప్పి చూడను కూడా లేదు.



అది అవమానంగా భావించాడు దక్షుడు. తన ఇంటికి మిగిలిన కుమార్తెలను పిలిచేవాడు. కాని సతీదేవిని మాత్రం పిలవటం మానేశాడు. ఈ రకంగా చాలాకాలం గడిచింది. ఒకసారి దక్షుడు యజ్ఞం చెయ్యాలి అనుకున్నాడు. దేవతలందరికీ వర్తమానం పంపాడు. కుమార్తెలందరికీ కబురంపాడు. కానీ సతీదేవిని మాత్రం పిలువలేదు. పుట్టింటికి వెళ్ళి చాలాకాలమయింది. సోదరీమణులను చూసి ఎంతో కాలమయింది. తండ్రి యాగం చేస్తున్నాడు. పిలవకపోతే మాత్రం ఏమిటి? వెడదామనుకుంది. భర్తతో అదే మాట చెప్పింది. పిలవకుండా వెళ్ళటం మంచిది కాదు. వద్దు అవమానం పొందవలసి వస్తుంది అన్నాడు భర్త. సతీదేవి వినలేదు. సరే వెళ్ళమని భటులను తోడిచ్చి పంపాడు.


పుట్టింటికి చేరింది దాక్షాయణి. తండ్రి పలకరించలేదు. తనే వెళ్ళి నేను వచ్చాను అంది. ఎందుకు వచ్చావు? నిన్నెవరు పిలిచారు. అన్నాడు దక్షుడు, నేను చేసిన తప్పేమిటి? అని అడిగింది సతీదేవి. నీ భర్త ఒక అహంభావి. నా అంతటివాణ్ణి గౌరవించడు. సేవలు చెయ్యడు. అంటూ శివుణ్ణి దూషించాడు. ఈ అవమానం భరించలేక యోగాగ్ని సృష్టించుకుని అందులో దగ్ధమైపోయింది దాక్షాయణి. ఈ వార్తను భటులు ద్వారా విన్నాడు శివుడు. సతీ వియోగాన్ని భరించలేకపోయాడు. ప్రళయకాల రుద్రుడై పోయాడు. వీరభద్రుని సృష్టించి దక్షయజ్ఞం నాశనం చెయ్యమన్నాడు. శివుని ఆజ్ఞను శిరసా వహించిన ప్రమధగణాలు దక్షుని యజ్ఞాన్ని పాడుచేశాయి. వీరభద్రుడు దక్షప్రజాపతిని సంహరించాడు. ఆ తరువాత దేవతలందరి కోరికపై దక్షునికి మేకతల అంటించి బ్రతికించారు. అప్పటి నుంచే దక్షుడు అజముఖుడైనాడు. ఈ రకంగా దక్షుని యజ్ఞం నాశనం కావటానికి కారణమైంది కాబట్టి ఆవిడ దక్ష యజ్ఞ వినాశినీ అనబడింది.

600. Dhaitya hantri

భండాసురాది దైత్యులను సంహరించినది. భండాసుర, మహిషాసుర, శుంభ, నిశుంభ, మొదలగు దైత్యులను సంహరించినది. వేదాన్ని దూషించేవారు, పరబ్రహ్మ లేడనేవారు, దేవతలను నిందించేవారు, ధర్మాన్ని నాశనం చేసేవారు, తేలిక అయిన అర్ధంలో చెప్పాలి అంటే సంఘ వ్యతిరేకులు, సమాజ వ్యతిరేకులు - వీరు దైత్యులు అనబడతారు.

దితియొక్క సంతానం దైత్యులు. వీరంతా ధర్మదూరులు. వీరు యజ్ఞయాగాలను ద్వేషిస్తారు. బ్రహ్మను ద్వేషిస్తారు. కేవలము ఐహికవాంఛల కోసమే జీవిస్తారు. తమోగుణ ప్రధానులు. ఇటువంటి వారిని సంహరిస్తుంది కాబట్టి దైత్యహంత్రీ అనబడుతుంది.

She who killed demons like Bhandasura, Mahishasura, Shumbha, Nishumbha etc. These demons don't accept the knowledge and guidance provided by vedas. They don't accept God. They spread animosity against Devatas. They always try to destroy the establishment of Dharma.

Demons are called Daityas. They are sons of Dithi. They hate yagnas and yagas. They hate brahma. They crave only for carnal pleasures. They are mainly of thamo guna.

599. Daakshaayani

దక్ష ప్రజాపతి యొక్క కుమార్తె.

దేవీ భాగవతంలో విష్ణువు యొక్క నాభికమలం నుంచి పుట్టిన బ్రహ్మ కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి పరమేశ్వరిని మెప్పించి ఆమె అనుజ్ఞతో సృష్టి కార్యక్రమం ప్రారంభించాడు. అందులో భాగంగా మానసికంగా


1. మరీచి
2. అంగీరసుడు
3. అత్రి
4. వసిష్టుడు
5. పులస్త్యుడు
6. పులహుడు
7. క్రతువు

అనేవారిని సృష్టించాడు. వీరు బ్రహ్మ మానసపుత్రులు వీరు కాక రుద్రుడు రోషము వల్ల తొడ నుంచి నారదుడు కుడి చేతి బ్రొటన వేలు నుంచి దక్షుడు ఎడమచేతి బొటన వేలు నుంచి వీరిణి అనే కన్య పుట్టారు. దక్షుడు వీరిణిని వివాహం చేసుకున్నాడు. వీరికి యాభైమంది కుమార్తెలు, ఐదుగురు కుమారులు కలిగారు. వీరిలో పెద్దకుమార్తె సతి. ఆమె పేరే దాక్షాయణి. ఈమె పరమేశ్వరి యొక్క అంశతో పుట్టింది.

Daughter of Daksha prajapathi.

In Devi bhagavatam it is explained that the Brahma emerged from the lotus that came out of Lord Vishnu's belly button. He meditated upon Divine Mother for thousands of years. As she blessed him with powers, he started the creation. The below were born out Brahma's mind.

1. Mareechi
2. Angeerasa
3. Atri
4. Vashishta
5. Pulasthya
6. Pulaha
7. Kratuvu

Daksha, Veerini and Naradha were born out the wrath of Rudra. Naradha emerged from his thighs and Daksha emerged from his right hand thumb and Veerni from his left hand thumb. Later Daksha married Veerini and they had 50 daughters and 5 sons. Sati is the eldest of all the daughters. She is also called Dakshayani. She is born with the Shakti of Divine Mother.

593. Chandranibha

శిరోభాగంలో సహస్రారంలో చంద్రుడున్నాడు. ఇది చంద్రమండలము. ఇక్కడ ఉన్న చంద్రుడు షోడశ కళాప్రపూర్ణుడు. అతడికి వృద్ధిక్షయాలు ఉండవు. ఆజ్ఞాచక్రంలో ఉన్న కుండలిని సహస్రారానికి చేరినట్లైతే అక్కడ కోట్లకొలది సూర్యచంద్రుల కాంతులతో దివ్యమైన తేజోబింబము దర్శనమవుతుంది. అక్కడకు చేరిన కుండలిని సహస్రదళ పద్మాన్ని తననోటితో కరిచి పట్టుకుంటుంది. ఆ చంద్రమండలంలోని మధువు అంతా ఘనీభవించి ఉంటుంది. కాని కుండలిని ప్రజ్వలితమయ్యేటప్పుడు వచ్చిన స్వాధిష్టానాగ్ని యొక్క వేడివల్ల సహస్రారంలో ఘనీభవించిన అమృతము యోగియొక్క శరీరంలోని 72వేల నాడీమండలాన్ని తడుపుతుంది. ఇప్పుడు అమ్మ కోట్లకొలది సూర్యచంద్రుల కాంతులతో ఇక్కడ ప్రకాశిస్తున్నది. అందుచేతనే చంద్రనిభా - చంద్రుని కాంతులతో ప్రకాశించునది అని చెప్పబడింది.

Moon is in the head near Sahasrara. This place is called Chandra mandala. This moon glows with all the 16 kalas. He does not wax or wane. If the kundalini reaches sahasrara from the Agna chakra, a yogi experiences the brightness and glow of crores of suns and moons. After reaching sahasrara, the kundalini bites and holds it in the mouth. Amruth in the chandra mandala is in solid state. But the heat from Swadishtaana travels along with kundalini and melts the Amruth. Then the Amruth flows down the 72000 nadis of the yogis body. At this time, Divine mother is glowing with the radiance of crores of suns and moons. Hence she is called Chandra Nibha.

591. Kataaksha kinkaribhoota kamalakotisevitha

లలితమ్మ యొక్క కృపాకటాక్ష వీక్షణాలు ఎవరియందుంటాయో వారిని కోటిమంది లక్ష్మీదేవులు సేవిస్తుంటారు. మనందరం ఆవిడ బిడ్డలేమే. అందుకే ఆవిడ మనపై అవ్యాజమైన కరుణ చూపిస్తుంది. కేవలం మనం కోరుకున్నది ఇచ్చినంతటితో ఆవిడ మనసు తీరదు. అందుకే మనం కోరిన దానికన్న కొన్ని రెట్లు ఎక్కువ ఇస్తుంది.

ఆవిడ కరుణ ఉన్నంతమాత్రంచేత లక్ష్మీ అనే పేరుగల దేవతలు అనేకమంది మనకు సేవకులవుతారు. మనం చేయవలసినది పరిపూర్ణ భక్తి తో, ప్రీతితో, నమ్మకంతో అమ్మను అడగటమే. పిల్లలు అడిగింది ఇవ్వడంలోనే అమ్మకు తృప్తి కదా. మరి ఆవిడ మనం అడిగింది ఎందుకు ఇవ్వదు? ఆవిడ మాతృ స్వభావం అటువంటిది.

ఆవిడ సాధారణమైన స్త్రీకాదు. ఓడ్యాణ పీఠంలో బిందుమండలమందుంటుంది. ఆవిడని ప్రతి ఆవరణలోను 64 కోట్లమంది యోగినీ దేవతలు సేవిస్తుంటారు. మొత్తంమీద 64 x 9 = 576 కోట్లమంది యోగినీగణం ఆమెను నిత్యంసేవిస్తుంటారు. ఆవిడని ప్రార్ధించినవారికి ఈ యోగినీ దేవతలు కోరికలు తీరుస్తుంటారు. మన అమ్మ అంత గొప్పది అయినప్పుడు మనకు ఇంక దయనీయమైన స్థితి ఎందుకు ఉంటుంది.

Crores of Lakshmi devi's serve those who are blessed by Divine mother. She is maha rajni. She is ruling from Odyana peetha. A total of 576 crore yogini ganas are at her service always.

As children, we are always eligible of her unconditional love. She is always busy fulfilling all our wishes. Of course this is what motherhood is about. We just have to ask her with love and faith. That's all.

All devatas with names as Lakshmi are at service of those who are blessed by Divine mother.

590. Kaamakotika

Brahman is conjunction of Shiva (nirguṇa or without attributes and Shaktī (saguṇa or with attributes). This is explained in two ways. One is Shaktī sitting on the lap of Shiva and another is Ardhanaarīshvara form, where one vertical form is Shiva and another is Shaktī. This is referred to in this nāma. Kāma refers to Śiva and koṭi means vertical.

శివశక్తుల యొక్క కలయికే పరబ్రహ్మ. ఈ కలయికను రెండు విధాలుగా వర్ణించారు. ఒకచోట శక్తి శివుని వొళ్ళో కూర్చుని ఉంటుంది. ఇంకొకటి అర్ధనారీశ్వర తత్వం. శివుడు శక్తి నిటారుగా నిలుచుని ఉంటారు. శక్తిలోని ఎడమ భాగం శివుడిలోని కుడి భాగంతో కలిసి ఉంటుంది. ఈ నామం ఈ కలయికనే చెబుతోంది. కాముడు అంటే శివుడు. కోటి అంటే నిటారుగా నిలుచుని ఉన్నది. 

587. kamasevitha

కాముడు - మన్మథుడు. మనువు, చంద్రుడు, కుబేరుడు మొదలగు శ్రీవిద్యోపాసకులు పన్నెండుమందిలోనూ ఒకడు. అతనిచే సేవించబడినది. లక్ష్మీదేవి కుమారుడైన మన్మథుడు అనంగుడు అయికూడా శ్రీవిద్యను పొందగలిగాడు. వ్రేళ్ళు లేనివాడైనప్పటికీ పరమేశ్వరికి మ్రొక్కాడు. మెడ లేనివాడయి కూడా శ్రీవిద్యామణిని ధరించాడు. నాలుక లేనివాడయినప్పటికీ దాని రుచి తెలుసుకున్నాడు.

అరుణోపనిషత్తులో ఇలా చెప్పబడింది. మన్మథుడు అంగములు లేనివాడయినప్పటికీ శ్రీవిద్యను పొందగలిగాడు. అర్చనాది విధులు జ్ఞానికి అనవసరము. శివశక్తులు ఇద్దరూ ఒక్కటే. అనే విషయం తెలుసుకున్నవాడే ముక్తి పొందుతాడు. మన్మథుడు పరమేశ్వరిని ధ్యానించి, చెరకువిల్లు పూలబాణాలు ఆయుధాలుగా పొందగలిగాడు. వాటితో లోకాలన్నీ జయిస్తున్నాడు. శంకర భగవత్పాదులవారు తమ సౌందర్య లహరిలోని 6వ శ్లోకంలో ఈ విషయాన్ని వివరిస్తూ

ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచ విశిఖాః
వసంత స్సామంతో మలయమరు దాయోధన రథ:
తథా ప్యేక సర్వం హిమగిరిసుతే ! కామపి కృపాం
అపాంగా త్తే లబ్ధ్వా జగ దిద మనంగో విజయతే ||


తల్లీ ! ఆ మనిషిని చూడబోతే అనంగుడు. అతనికి అసలు శరీరమే లేదు. ఇక ధనుస్సును చూద్దామా - పూవులతో తయారయినది. పట్టుకుంటే నలిగిపోతుంది. అల్లెత్రాడును చూద్దామా - తుమ్మెదల వరుస అవి సరిగా ఉండవు. బాణాలు చూద్దామా - పూలబాణాలు. అవీ తన్మాత్రలు. సామంతుడు (చెలికాడు) చూద్దామా - వసంతుడు. అది కాలం. పలకలేదు. మాట్లాడలేదు. సలహా చెప్పలేదు. ఇక రథం చూద్దామా మలయ మారుతం. దక్షిణ కొండగాలి. అది ఎప్పుడు ఉంటుందో, ఉండదో తెలియదు. అతడికి నుంచోటానికి కాళ్ళు లేవు. ధనుస్సు పట్టుకోవటానికి చేతులు లేవు. సలహా చెప్పే సచివుడు లేడు. రథం లేదు గుర్రాలు లేవు. ఇన్ని అవలక్షణాలు ఉండి కూడా కేవలము నీ కృపాకటాక్ష వీక్షణాలవల్లనే అతడు లోకంలో ప్రసిద్ధులైన తపోధనులతో యుద్ధంచేసి గెలవగలుగుతున్నాడు.

సృష్టి ప్రారంభానికి ముందు మహాకామేశ్వరునితో సేవించబడినది. కాబట్టి కామసేవితా అనబడుతోంది.

Manmatha is one of those 12 great people like Manuvu, Chandra, Kubera etc who learnt and practiced Srividhya. He is son of Goddess Lakshmi. He was able to successfully practice srividhya sans a physical body. He saluted to divine mother though he lacks hands. Meditated upon Divine mother without having a neck. Enjoyed the taste of Srividhya mantra though he does not have a tongue.

It is said like this in Arunopanishath. Manmatha who does not have a physical body acquired the knowledge of Srividhya. Archana, puja and other karmas are required for those who haven't yet possessed the supreme knowledge. Only he who realizes that Shiva and Shakti are same gets liberated. Manmatha meditated upon Divine mother and possessed a bow made of sugarcane and arrows made of flowers. He is able defeat the greatest of the great in this world with them.

Sri Adi Shankaracharya explained the same in the 6th sloka of Soundarya lahari

Dhanun paushpam maurvi madhu-kara-mayi pancha visikha
Vasantaha samanto Malaya-marud ayodhana-rathah;
Tatha'py ekah sarvam Himagiri-suthe kam api kripaam
Apangat te labdhva jagadidam Anango vijayate

Oh ,daughter of the mountain of ice, With a bow made of flowers, bow string made of honey bees,
five arrows made of only tender flowers, with spring season as his minister, and riding on the chariot of breeze from Malaya mountains, the god of love who does not have even a physical body is able to win all the world alone. 
The only reason - your mercy upon him.

Another way to explain this name is  - At the beginning of the creation, Mahakameswara prayed divine mother to start the creation. So she is called kamasevitha.

584: Atma Vidhya

If we understand about raw material thoroughly, it is easy to know about anything made of that substance. For example, if you know the soil, you will know about the pots, plates, etc. made of clay. Also, if you know the gold, then you will know the jewelry made out of gold. In the same way, you should try to know that knowing which will help you know everything else. 

Sri vidhya is same as Atma vidhya. It is being described from names 583 to 589.

Atma vidhya as explained in Aithareyopanishath:

Parameswara wished to create again the same way as he did in the previous kalpa. He created the worlds. Created the rulers. created senses. He finally created humans who resembled himself. Then he thought he should enter the human body. There are two ways to enter. 1. From the top of the head 2. From the bottom of the foot. It is characteristic of the servant to enter from the foot. So the Paramatma entered the human body from the head. That is soul (Atma). Parameswara with Hakaara Sangnya merged with nature to form a Shabala brahma and got trapped in this body with 9 holes and 10 indriyas. This is jeevaatma. If this jeevaatma manages to leave the body in the same way as it entered the into it, it is called liberation. It merges again with paramatma. 

As explained in Taittareyopanishath:

Bharugumaharshi, son of Varumanaharshi in the Tatiriyopanishath asks his father to teach the knowledge of the soul. This has been explained in the past in the name of Panchakoshandharsthita

As explained in Brihadaaranyakopanishath:

Prajapati once made a announcement about the soul. “The soul does not sin. There is no old age. The death will not consume it. Grief does not touch. The soul has no appetite. A Man must pursue the quest for truth and learn about the soul.

Hearing this, Indra, the king of the angels and Virochan the king of demons become disciples of prajapati to learn about the soul. Virochon thinks that the body is soul and leaves. But Indra goes on the quest of soul again and again. In the end, Brahma is pleased with Indra and explains him the divine knowledge of the soul. The body is ephemeral. When the last moments arrive, the death consumes the body. The ephemeral body is the habitat  of the eternal soul. As long as the body is in the soul it appears that is it enjoying or suffering. But it is not true. Organisms can only develop comforts because the soul is in contact with the body. When separated from the body, the soul does not have these bonds. The yogi rejoices in the sense of soul, liberated from material things, and discerns the soul as distinct from the mind and senses.

As explained in Kathopanishath:

The Vajasruvu makes a yaaga called 'Vishajit' and gives his son Nachiketu to the Yamadharma Raju as part of it. Yama was not at home as the Nachiketu approached. He returns after three days. Nachiketu waits for Yama until then. Having come to know about Nachiketu, Yama offers him 3 boons. Nachiketu asked Yama to teach him the divine knowledge of soul as part of the third boon. Yama explains to  Nachiket like this.

“Many people are not even entitled to hear the divine knowledge of soul. That's why they don't like it. Some people don't mean to listen to it. It is also remarkable to find a teacher who has experience the soul and is able spread the knowledge.

One cannot realize the self/soul by learning vedas, various sciences, listening to the sermons or preaching. It is only possible by the soul. The soul shows its true nature to the deserving person.

The soul is only perceived by the subtle mind. It is everywhere. But it does not show up. A person who knows that the soul has no form, ordor, taste, beginning or end has triumphed death.

As explained in Chandogya upanishath

The son of Uddaluka is Swethaketu. After completing education  he asked his father to explain the knowledge of self-realization. Uddalaka said, "although rivers flow from east to west, from west to east, they eventually merge into sea.

The sun evaporates the sea water and turns into clouds. Clouds rain down on the hills, canals, lakes and rivers. The water flow and finally meet in the sea. When the water is flowing, it may be called as the Ganges, or a Donkawagani, or a Budare. But all these, as they merge into sea, have no particular identity. The creature, in any form, loses its form after getting together in a sea of consciousness. This is the nature of the soul. That is you Swathaketu"

In the same way, Upakosala gets the phylosophy of soul from Agni.  The earth, the moon, and the sun are all forms of that parabrahma, it is what is present in the sun in the sky is in me and in you. The north-souths of the east west, the soil, the water, the sky, the stars are all high. The lightning in the sky is what is present in me. The same charisma spread throughout universe. The same spirit. The same Brahman.

All the Bhuma vidhya  taught to Narada by Sanathkumara , was the science of soul. 

In this way, the science of soul is described in all Upanishads. The knowledge of Parabrahman is self-consciousness.

584. ఆత్మవిద్యా

ముడిపదార్ధం గురించి మనకు తెలిసినట్లైతే ఆ పదార్ధంతో తయారయిన వస్తువుల గురించి తేలికగా తెలుస్తుంది. ఉదాహరణకు మట్టిని గురించి తెలిస్తే, మట్టితో తయారుచేసే కుండలు, బాబాసలు, చట్లు, మొదలైన వస్తువులగురించి తెలుస్తుంది. అలాగే బంగారం గురించి తెలిస్తే దానితో తయారుచేసే నగల పేర్లు వేరయినా, వాటన్నింటిలో ఉండేది బంగారమే అని తెలుస్తుంది. అదే విధంగా ఏ విషయం తెలుసుకోవటంవల్ల సర్వమూ తెలుస్తాయో, దాన్ని తెలుసుకోవాలి. ప్రతివిషయంలోనూ అంతర్గతంగా ఉండే తత్త్వాన్ని గనక తెలుసుకుంటే మిగిలిన విషయాలన్నీ తెలుస్తాయి.

ఆత్మవిద్యయే శ్రీవిద్య. అదే మహాషోడశి అని చెప్పి 583 నుంచి 589వ నామం వరకు ఆత్మవిద్యను వివరిస్తున్నారు.

ఆత్మజ్ఞానరూపత్వాత్ ఆత్మవిద్యా 
ఆత్మ జ్ఞాన రూపము గలది కావటంచేత ఇది ఆత్మవిద్య అనబడుతుంది. అసలు ఆత్మ అంటే ఏమిటి?

ఐతరేయోపనిషత్తులో పరమేశ్వరుడు పూర్వకల్పంలో
ఏ విధంగా అయితే సృష్టి ఉన్నదో, అదే విధంగా మళ్ళీ సృష్టి చెయ్యాలి అని సంకల్పించాడు. లోకాలను సృష్టించాడు. లోక పాలకులను సృష్టించా    డు. ఇంద్రియాలకు అధిష్టాన దేవతలను
సృష్టించాడు. చివరకు విరాడ్రూపాన్ని పోలిన మానవుణ్ణి సృష్టించాడు. ఇప్పుడు పరమేశ్వరుడు మానవదేహంలో ప్రవేశించాలి అనుకున్నాడు. అలా ప్రవేశించటానికి రెండు మార్గాలున్నాయి. 1. పై నుంచి (శిరస్సు నుంచి) 2. క్రింద నుంచి (పాదాల దగ్గర నుంచి) పాదాల దగ్గర నుంచి ప్రవేశించటమనేది సేవకా లక్షణం. అందుచేత పరమాత్మ శిరస్సునుంచే మానవదేహంలో ప్రవేశించాడు. అదే ఆత్మ. అని చెప్పబడింది. హకార సంజ్ఞగల పరమేశ్వరుడు సకార సంజ్ఞ కలిగిన ప్రకృతితో కలిసి శబళ బ్రహ్మమై నవరంధ్రాలతోనూ, దశేంద్రియాలతోనూ కూడినటువంటి మానవదేహంలో
ప్రవేశించి, బయటకు వెళ్ళే మార్గం తెలియక పంజరంలో బంధించబడిన పక్షిలాగా కొట్టుమిట్టాడుతున్నాడు. ఇదే జీవాత్మ. ఈ జీవాత్మ గనక వచ్చిన దారిగుండానే బయటకు వెళ్ళగలిగినట్లైతే పరమాత్మలో లీనమవుతుంది. అంటే ఆత్మను బ్రహ్మరంధ్రంగుండా గనక బయటకు పంపగలిగినట్లైతే అది పరమాత్మలో లీనమవుతుంది. 

తైత్తిరీయోపనిషత్తులో వరుణమహర్షి కుమారుడు భృగుమహర్షి. విద్యాభాసం పూర్తిచేసి ఆత్మవిద్యను బోధించమని తండ్రిని అడుగుతాడు. ఈ విషయమంతా గతంలో పంచకోశాంతర స్థితా అనే నామంలో వివరించటం జరిగింది. 

బృహదారణ్యకోపనిషత్తులో ప్రజాపతి ఒకసారి ఆత్మను గురించి ఒక ప్రకటన చేశాడు. “ఆత్మకు పాపం అంటదు. ముసలితనం రాదు. మృత్యువు దాన్ని కబళించదు. శోకం తాకదు. ఆత్మకు ఆకలిదప్పికలు లేవు. మానవుడు సత్యకాముడు సత్యసంకల్పుడు అయి ఆత్మజిజ్ఞాసను అలవరచుకోవాలి. ఆత్మకోసం అన్వేషించినవాడు, ఆత్మను
అనుభవించిన వాడు ఆత్మ స్వరూపాన్ని పొందుతాడు.

ఈ మాట విని దేవతల రాజైన ఇంద్రుడు, రాక్షసరాజైన విరోచనుడు బ్రహ్మదగ్గరకు వచ్చి ఆత్మవిద్యను పొందేటందుకుగాను, ఆయనకు శిష్యరికం చేస్తారు. విరోచనుడు దేహమే ఆత్మ అనుకుని వెళ్ళిపోతాడు. కాని ఇంద్రుడు మళ్ళీ, మళ్ళీ బ్రహ్మచర్యమవలంబిస్తాడు. చివరకు ఇంద్రునిపట్టుదలకు మెచ్చి బ్రహ్మ ఆత్మతత్త్వాన్ని పూర్తిగా వరించాడు. శరీరం అశాశ్వతమైనది. ఆఖరు క్షణాలు రాగానే మృత్యువు శరీరాన్ని కబళిస్తుంది. శాశ్వతమైన ఆత్మకు అశాశ్వతమైన శరీరమే ఆవాసం. శరీరంలో ఉన్నంతకాలమూ ఆత్మకు సుఖదు:ఖాలు, గుణదోషాలు అంటినట్లు, వాటితో శతమతమవుతున్నట్లు కనిపిస్తుంది. ఆత్మ శరీరంతో సంబంధం ఏర్పరచుకోవటంవల్లనే జీవులకు సుఖదుఃఖాలు ఏర్పడతాయి. శరీరం నుంచి విడిపోగానే ఆత్మకు ఈ బంధనాలతో సంబంధముండదు. భౌతిక విషయాలనుండి విముక్తి పొంది, ఆత్మను మనస్సుకు, ఇంద్రియాలకు విలక్షణమైనదిగా గ్రహించి ఆత్మ తేజోమయము అని భావించి అనుభవజ్ఞుడు ఆనందిస్తాడు. ఆత్మజ్ఞానం పొందినవాడు ముక్తి సామ్రాజ్యంలో విహరిస్తాడు. అని చెప్పబడింది. 

కఠోపనిషత్తులో వాజశ్రవుడు 'విశ్వజిత్' అనే యాగం చేస్తూ, దానిలో భాగంగా తనకుమారుడైన నచికేతుణ్ణి యమధర్మరాజుకు దానమిస్తాడు. నచికేతుడు యముడి దగ్గరకు వెళ్ళేసరికి అతడు ఇంట్లో లేడు. అందుచేత మూడు రోజులపాటు యముడు తిరిగి వచ్చేదాకా అతని ఇంటనే నిరాహరియై ఎదురుచూస్తూ కూర్చున్నాడు. యముడు తిరిగి వచ్చి, విషయం తెలుసుకుని, నచికేతుడికి మూడు వరాలిస్తాను కోరుకోమంటాడు. అందులో మూడవ వరంగా ఆత్మజ్ఞానం ఉపదేశించమని అడుగుతాడు నచికేతుడు. చివరకు యముడు నచికేతుడికి ఆత్మజ్ఞానాన్ని వివరిస్తాడు.

“ఆత్మజ్ఞానం అనే పదం వినటానికి కూడా చాలామందికి అర్హత ఉండదు. అందుకే వాళ్ళు దానికి ఇష్టపడరు. కొందరికి ఇది విన్నా అర్ధం కాదు. దీన్ని గురించి చెప్పే గురువు దొరకటం కూడా చాలా విశేషం. బ్రహ్మజ్ఞానం పొందిన గురువుద్వారా ఈ విషయాన్ని
తెలుసుకోవటం పూర్వజన్మ సుకృతం. అంటూ ప్రారంభించి...
ఆత్మసాక్షాత్కారమనేది వేదాలు వల్లించటం వల్ల, శాస్త్రాలు చదవటంవల్ల, ధారణశక్తివల్ల, ఉపన్యాసాలు వినటంవల్ల, ఉపదేశించటంవల్ల లభించదు. అది ఆత్మవల్ల మాత్రమే సాధ్యపడుతుంది. అర్హుడైన వ్యక్తికి ఆత్మ తన నిజస్వరూపం చూపుతుంది.

ఆత్మ అనేది సూక్ష్మమైన బుద్ధిచేత మాత్రమే గ్రహించబడుతుంది. ఆత్మసర్వవస్తువులందు ఉన్నది. కాని పైకి కనపడదు. శబ్దము, రూపము, రసము, వాసన లేనిది, ఆద్యంతాలు లేనిది, అయినటువంటి ఆత్మతత్త్వాన్ని తెలుసుకున్నవాడు మృత్యువాత పడదు. అని చెబుతాడు.

ఛాందోగ్యోపనిషత్తులో ఉద్దాలకుని కుమారుడు శ్వేతకేతువు. విద్యాభ్యాసం పూర్తి చేశాడు. ఆత్మవిద్యను తెలుసుకోవాలనీ, దాన్ని వివరించమని తండ్రిని అడిగాడు. చెప్పటం మొదలుపట్టాడు.ె ఉద్దాలకుడు.నదులు తూర్పునుంచి పడమరకు ప్రవహించినా, పడమర నుంచి తూర్పుకు ప్రవహించినా చివరకు అవి సముద్రంలోనే కలుస్తాయి. సూర్యరశ్మికి నీరు ఆవిరి అయి మేఘాలుగా మారి కొండలమీద వర్షం కురిసి, వాగులుగా, ఏరులుగా, నదులుగా
ప్రవహించి చివరకు సముద్రంలో కలుస్తుంది. నీరు ప్రవహించేటప్పుడు ఇది గంగానది, ఇది డొంకవాగనీ, ఇది బుడమేరు అని రకరకాల పేర్లతో పిలువబడుతుంది. కాని సముద్రంలో చేరగానే నదులకు, వాగులకు అన్నింటికీ వాటికి ప్రత్యేకమైన గుర్తింపు ఇంక ఉండదు. అలానే జీవి అనేది ఏ రూపంలో ఉన్నప్పటికీ, చైతన్య సముద్రంలో కలిసిపోయాక తన రూపాన్ని పోగొట్టుకుంటుంది. ఈ రకంగా జీవులన్నీ ఏ తత్త్వంలో కలిసిపోతాయో, అదే ఆత్మ తత్త్వం. అది అద్వితీయమైనది, సూక్ష్మమైనది, సర్వవ్యాపకమైనది. అదే నీవు తత్త్వమసి శ్వేతకేతూ అదే నీవు. 

అదే విధంగా ఉపకోశలుడికి అగ్నులు ఆత్మ తత్త్వాన్ని వివరిస్తాయి. భూమి, చంద్రుడు, సూర్యుడు అన్నీ ఆ పరబ్రహ్మ యొక్క రూపాలే, ఆకాశంలోని సూర్యునిలో ఏ తత్త్వమైతే ఉన్నదో అదే నాలోనూ, నీలోనూ కూడా ఉన్నది. తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు, నేల, నీరు, నింగి, ఆకాశము, నక్షత్రాలు వీటన్నింటిలో ఉన్నతత్త్వం ఒక్కటే. ఆకాశంలోని మెరుపులో ఏ తత్త్వమైతే ఉన్నదో, అదే నాలోనూ ఉన్నది. అదే చరాచర జగత్తంతా వ్యాపించి ఉన్నది. అదే ఆత్మతత్త్వం. అదే బ్రహ్మతత్త్వం.

సనత్కుమారుడు నారదుడికి ఉపదేశించిన భూమా విద్య అంతా ఆత్మవిద్యే. ఈ రకంగా ఆత్మ విద్యను గురించి ఉపనిషత్తులన్నింటిలోనూ వివరించబడింది. పరబ్రహ్మను గురించిన జ్ఞానమే ఆత్మజ్ఞానము. ఆత్మవిద్యయే బ్రహ్మవిద్య, ఆత్మవిద్య కలది కాబట్టి పరమేశ్వరి ఆత్మవిద్యా అనబడుతోంది.

578. మాతృకావర్ణరూపిణీ

మాతృకలు అంటే అకారాది క్ష కారాంతము ఉండే అక్షరాలు. క్షరము కానిది నాశనము లేనిది అక్షరము. ఆ అక్షరముల రూపం కలది. మాతృకల యొక్క వర్ణము అంటే రంగును తెలియచేసేది అని అర్ధం. ప్రతి అక్షరానికి ఒక దేవత ఉన్నది. ఆ దేవత యొక్క చేతులయందు ఆయుధాలు, ఆ దేవత పరిధి, రంగు వివరించబడ్డాయి.

మాతృకా వశినీ యుక్తాం యోగినీభి సమన్వితాం
గంధద్వారాదిసహితాం సంస్మరేత్ త్రిపురాంబికాం ||

వశిన్యాది శక్తులతోను, యోగినీ గణములతోను, గంధాకర్షిణి మొదలైన ఆకర్షణ దేవతలతోను కూడిన మాతృకా రూపమయిన త్రిపురాంబికను పూజిస్తున్నాను.

సనత్కుమార సంహితలో అక్షర దేవతల గూర్చి చెప్పబడింది. అందులో అక్షరాలను. ఐదు భాగాలుగా చేశారు.

1. స్వరాత్మిక శక్తులు: ఇవి అకారాది శక్తులు వీటికి ఎనిమిది చేతులుంటాయి. ఆ చేతులలో పాశము, అంకుశము, అభయ, వరదముద్రలు, పుస్తకము, అక్షమాల, కమండలము, వ్యాఖ్యా ముద్రలను కలిగి ఉంటాయి.

ఆకారాది శక్తులు ధూమ్రవర్ణాలు. తెల్లని పొగ ఛాయలో ఉంటాయి.

ఈ శక్తులకు పరిధులు కూడా చెప్పబడ్డాయి
అ కార శక్తిమండల విస్తీర్ణము 80 లక్షల యోజనాలు
ఆ కార శక్తిమండల విస్తీర్ణము 160 లక్షల యోజనాలు
ఇ కార శక్తిమండల విస్తీర్ణము - 90 లక్షల యోజనాలు
ఈ కార శక్తి మండల విస్తీర్ణము 180 లక్షల యోజనాలు
ఉ కార శక్తిమండల విస్తీర్ణము కోటియోజనాలు
ఊ కార శక్తిమండల విస్తీర్ణము రెండు కోట్ల యోజనాలు
ఋ కార శక్తిమండల విస్తీర్ణము - 50 లక్షల యోజనాలు
ఋ కార శక్తిమండల విస్తీర్ణము కోటి యోజనాలు
ఎ కారశక్తి మండల విస్తీర్ణము అనంతము
ఏ ఐ శక్తిమండల విస్తీర్ణము - 150 లక్షల యోజనాలు
ఓ ఔ శక్తిమండల విస్తీర్ణము - 150 లక్షల యోజనాలు
అం అః శక్తిమండల విస్తీర్ణము 320 లక్షల యోజనాలు

2 వ్యంజన శక్తులు: క నుండి క్ష వరకు ఉన్న అక్షరాలు. వీటికి నాలుగు చేతులుంటాయి. 'క' నుండి 'మ' వరకు ఉన్న శక్తుల చేతిలో పాశము, అంకుశము, అక్షమాల, కమండలము ఉంటాయి.

3. యరలవ శక్తుల చేతులలో పాశము, అంకుశము, అభయ, వరద ముద్రలు ఉంటాయి.

4. శ ష స హ శక్తుల చేతులలో పాశము, అంకుశము, అభయ, వరదముద్రలుంటాయి.

5. ళ, క్ష శక్తులకు కూడా నాలుగు చేతులే ఉంటాయి. ఆ చేతులలో పాశము, అంకుశము, చెరకుగడ, పుష్పబాణము ఉంటాయి.

క నుంచి ఠ వరకు శక్తులు సింధూర వర్ణాలు
డ నుంచి ఫ వరకు శక్తులు గౌరవర్ణాలు. గౌరీ దేవి వర్చస్సు.
బ నుంచి ల వరకు శక్తులు అరుణ వర్ణాలు. ఉదయించే సూర్యుని తేజస్సు.
వ నుంచి సవరకు శక్తులు కనక వర్ణాలు. బంగారు రంగు మెరుపు.
హకార క్ష కారముల శక్తులు విద్యుత్ వర్ణాలు. ఆకాశంలో మెరిసే మెరుపు తీగ.

వ్యంజన శక్తులమండల విస్తీర్ణము 40 లక్షల యోజనాలు

యోగి అయినవాడు నిష్టగా ఈ బీజాలను ధ్యానం చేసినట్లైతే, వాటి శక్తులు ఇంత మేర విస్తరిస్తాయన్న మాట.

వశిన్యాదిశక్తులు, అక్షరాలు తమ తమ ఆయుధాలతో ఉన్నట్లుగా భావన చెయ్యటం వల్లనే శ్రీచక్రానికి మూడు ప్రస్తారాలు వచ్చినాయి. ఈ రకంగా అక్షర స్వరూపం గలది కాబట్టే పరమేశ్వరి మాతృకా వర్ణరూపిణి అనబడుతోంది.

యజ్ఞవైభవ ఖండంలో

యథా పరతర శ్శంభు: ద్విధాశక్తి: శివాత్మనా
తథైవ మాతృకా దేవీ ద్విధా భూతా సతీ స్వయమ్
ఏకా కారేణ శక్తి స్తు వాచికా చేతరేణ తు
శివస్య వాచికా సాక్షా ద్విద్యేయం పదగామినీ ||

పరమేశ్వరుడు శివుడు, శక్తి అని రెండుగా ఉన్నట్లుగానే మాతృకాదేవి కూడా అచ్చులు హల్లులు అని రెండు విధాలుగా ఉన్నది. దానిలో అచ్చులు శక్తి రూపము హల్లులు శివరూపము.

578. Matrukavarnaroopini

Matruka means letters from 'Aa' to 'Ksha'. 'Kshara' means perishable. 'Akshara' means imperishable. In Indian languages, Letters are as 'Akshar' or 'Akshara'. Each letter denotes the shakti and color of Divine mother. Each letter has a goddess. Each goddess has shakti, color and weapons.

Maatrukaa vashinee yuktaam yogineebhi samanvitaam
Gandhadwaaraadhi sahitaam samsmareth tripuraambikaam

Means - I pray to the Tripurambika who is the form of Vashinya shaktis, Yoginis, and Maatrukas.

All akshara devatas are explained in Sanathkumara samhita. In it, Aksharas are divided into 5 parts. 

1. Swaraatmika Shaktis - These are represented by letters from 'Aa' to 'Aha'. These shakti's have 8 hands. They hold 1.Paashamu, 2.Ankushamu, 3.Abhaya mudra, 4.Varada mudra, 5.Pustakamu(book), 6.Aksha maala, 7.kamandala, 8.Vyaakhyaa mudra.

These are in Dhoomra varna - Smoky hue color

Below is the range of each matruka (1 yojana = 12 km)

Aa - 80 lakh yojanas
Aaa - 160 Lakhs yojanas
Ee - 90 Lakhs yojanas
Eee - 180 lakhs yojanas
Uh - 1 crore yojanas
OOh - 2 crore yojanas
RRu - 50 lakhs yojanas
RRuu - 1 crore yojanas
A - Infinite
Ae and Ai - 150 lakhs yojanas
O and Ou - 150 lakhs yojanas
Am and Aha - 320 lakhs yojanas

2. Vyanjana Shaktis - These are represented by letters 'Ka' to 'Ksha'. These shaktis have 4 hands. These are sub divided into 4 parts. Shaktis from 'Ka to 'Ma' hold 1.Pasha, 2.Ankusha, 3.Akshamaala and 4.Kamandala
3. 'Ya', 'Ra', 'la','Va' shaktis hold Pasha, Ankusha, Abhaya and Varada mudras
4. 'Sa','Sha','sa','Ha' shaktis hold Pasha, Ankusha, Abhaya and Varada mudras
5. 'La', 'ksha' shaktis hold Pasha, Ankusha, Sugarcane and arrow of flowers

'Ka' to 'Tha' are Sindhoora varnas. Reddish orange color.
'Da' to 'Pha' are Goura varnas. White or fair complexion
'Ba' to 'la' are Aruna varnas. The color of early morning sun.
'Va' to 'sa' are kanaka varnas. Golden color
'Ha' to 'Ksha' are Vidyuth varnas. Color of a lightening.

The range of vyanjana shaktis are 40 lakh yojanas

It is said that, if a yogi meditates on these beejas with full concentration, their power spreads in this range.

It is said like this in Yagna Vaibhava khandam:

Yatha parata Shambhuh Dwidha shakthih Shivatmana
Tathaiva matrukaadevi Dwidha bhootam sati swayam
Ekaa kaarena shaktistu vaachikaa chetarenatu
Shivasya vaachikaa saaksha dwdeyam padagaamini

Just like how Paramatma is learnt as Shiva and Shakti, Matrukas are also learnt as vowels and consonants. Vowels are forms of Shakti and consonants are forms of Shiva.

576. Madhvipaanalasa

నిరంతరము బ్రహ్మానందానుభవము పొందుతూ విశ్రాంతిగా నిర్వికారస్థితిలో ఉండేటటువంటిది. అదే ప్రజ్ఞాన ఘనరూపము. ఆ స్థితిలో బాహ్యేంద్రియాలు పని చెయ్యవు. ద్వైతభావన ఉండదు. అంతా బ్రహ్మమయమే.

సాధకుడు యోగస్థితిలో కుండలిని జాగృతం చేసి, గ్రంథిత్రయాన్ని ఛేదించి, కుండలినిని సహస్రారం చేర్చినప్పుడు అక్కడినుండి సుధాదారలు వర్షిస్తాయి. వాటితో యోగి శరీరంలోని 72వేల నాడీమండలము తడుస్తుంది. ఆ స్థితిలో సాధకుడు అవ్యాజమైన, అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందుతాడు. అతని శరీరం కంపిస్తుంది. ఆనందంలో తేలియాడుతాడు. ఆ స్థితిలో సాధకుడు నృత్యం చేస్తాడు. ఆ ఆనందము వర్ణనాతీతము అనుభవైక వేద్యము. అదే బ్రహ్మానందము. ఈ రకంగా బాహ్యేంద్రియ జ్ఞానము, ద్వైత భావము నశించి బ్రహ్మానందంతో నిండినది కాబట్టే మాధ్వీపానాలసా అనబడుతోంది.

She who is imbued in the bliss of Atman. That is Pragnana Ghanaroopa. In this state, the mind and the senses lose consciousness. There is no sense or notion of I or Me. Everything is God and he is the only one. 

When a yoga practitioner awakens the kundalini. It crawls upwards and overcomes the three knots(grandhis) and reaches the sahasrara. There it bites the kernel of the 1000 petaled lotus. Then the amruth flows down the 72000 nadis in his body. At that moment, he/she experiences an unexplainable, unprecedented and unending pleasure. His/her body shivers in happiness. He/she will dance in trance. That bliss cannot be explained. One has to know it through experience. That is the bliss of Atman. Divine mother is always in this state after drinking Amruth.

575. Pragnanaghanaroopini

నిత్యము జ్ఞానమయమైనది. అవిద్యా లేక అజ్ఞానముచేత ఏ మాత్రమూ తాకబడనిది. కొంచెముకూడా అవిద్యా సంబంధము లేనటువంటిది. మహోన్నతమైన నిత్యజ్ఞాన స్వరూపము గలది. పరానిష్టా అనే నామంలోని స్వరూపస్థితియే ప్రజ్ఞాన ఘనరూపము. అంటే పరమేశ్వరి జ్ఞానముకన్న వేరైన స్థితి లేనటువంటిది. ఉప్పుగడ్డ పైన క్రింద, లోపల, ప్రక్కల వివిధ రుచులతో ఉండదు. ఎక్కడైనా అది ఒకే రుచిలో ఉప్పగానే ఉంటుంది. అలాగే ఈ ఆత్మ లోపల, బయట అంతటా జ్ఞానమయమైనది. అందుచేతనే ఆమె ప్రజ్ఞాన ఘనరూపిణి అనబడుతున్నది.

She who is the personification of knowledge and consciousness. Very far and totally unrelated to ignorance. In the name Paranishta, we learnt that self realization is the ultimate state of consciousness. It is the state of union with Divine Mother. That means Divine mother is none other than the purest form of consciousness. She is always such. For example: Take a small brick of salt. It is salty irrespective of which side you taste, whether you take a sample from inside or the surface. Irrespective of time of the day or week or month. It always tastes salty.


Popular