List of all thousand names of Sri Lalitha Devi, a brief description of each name and a detailed description of selected names
Search This Blog
363.Thatpadalakshyartha
361. Tamopaha
అంధంతమః ప్రవిశంతి యే2 విద్యాఉపాసతే |
తతో భూయ ఇవ తే తమోయఉ విద్యాయాగం రతాః ||
అవిద్యను ఆరాధించేవారు గాఢాంధకారంలో ప్రవేశిస్తారు. యజ్ఞతత్త్వ విజ్ఞానాన్ని ఆనందించేవారు అంతకన్న అంధకారంలో ప్రవేశిస్తారు.
యజ్ఞాలవల్ల, కర్మకాండలవల్ల, పుణ్యఫలితాలు వస్తాయి. వాటివల్ల ఉత్తమజన్మలు కలుగుతాయి. అంతేకాని మోక్షంరాదు. అందుకే వాటిని అవిద్య అన్నారు. అందుచేతనే అవిద్య నాశ్రయించినవారు అంధకారంలో పడిపోతారు. అటువంటి అవిద్యను నాశనంచేసి భక్తులకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది ఆ పరమేశ్వరి.
360. Tanumadhya
పరమేశ్వరి నివాసస్థానం శ్రీచక్రం. శ్రీచక్రమనేది శివశక్తుల సంగమస్థానం. అందులో తొమ్మిదవ ఆవరణ అయిన బిందువునందు ఆ పరమేశ్వరి ఉంటుంది. కాబట్టి ఆ దేవి తనుమధ్యా అనబడుతుంది.
పురుషుని శరీరంలో సుషుమ్నానాడి యందు ఉండునది. కాంచీపురంలో తను మధ్యా అనే దేవత ఉన్నది. తను మధ్య అనేది ఒక రకమైన ఛందస్సు.
మాం పాతు నీవాయా సీరే నివసంతీ బిల్వేశ్వరకాంతా దేవీ తనుమధ్యా
నీవా నదీతీరంలో ఉన్న తనుమధ్య అనే పేరుగల బిల్వేశ్వరుని దేవి నన్ను రక్షించుగాక.
351. Vamakeshi
350. Vagvadini
సర్వేషాం చ స్వభక్తానాం వాదరూపేణ సర్వదా |
స్థిరత్వా ద్వాచి విఖ్యాతా లోకే వాగ్వాది నీతి సా ||
సమస్తమైన తన భక్తుల నాలుకలయందు వాగ్రూపంలో ఉండే దేవత కాబట్టి వాగ్వాదిని అనబడుచున్నది. లఘుస్తవంలో కాళిదాసు
శబ్దానాం జననీ త్వ మత్ర భువనే వాగ్వాదినీ త్యుచ్యతే
లోకంలో శబ్దాలను పుట్టించే దేవత కాబట్టి ఈమె వాగ్వాదిని అనబడుతున్నది.
వాక్కు నాలుగురూపాలుగా ఉంటుంది. అవి 1. పర 2. పశ్యంతి 3. మధ్యమ 4. వైఖరి. అంటే వాక్కు పరా రూపంలో ప్రారంభమయి వైఖరిరూపంలో బయటకు వస్తుంది. ఈ పరావాక్కుకు అధిదేవత మన అమ్మ. అందుకే ఆవిడ వాగ్వాదిని అనబడుతుంది.
ఏదైనా ఒక విషయం గురించి చెప్పాలి అంటే ముందుగా దాని గురించి ఆలోచన పరాస్థానంలో ఉద్భవిస్తుంది. పరా అంటే సహస్రారం అదే మెదడు ఉండే స్థానం. అంటే ముందుగా ఆలోచన పరాస్థానంలో వస్తుంది. దానిని పరావాక్కు అంటారు. ఈ స్థానానికి అధిదేవత మన అమ్మ. కాబట్టి ఆమె వాగ్వాదిని అనబడింది.
ఆ తరువాత ఆ ఆలోచన బలపడి ఆధారస్థానంలో చిన్న గాలిబుడగలాగా అవుతుంది. ఇది పశ్యంతి వాక్కు. ఇది వాక్కుకు తొలిదశ. పరాస్థానంలో వాక్కును గురించిన ఆలోచన వచ్చింది. ఇప్పుడు శబ్దరూపమైన వాక్కు ప్రారంభమవుతోంది. ఇది మొలకవచ్చిన ధాన్యపుగింజలా ఉంటుంది. దీన్ని చూసి అది ఏ చెట్టో మనం చెప్పలేము. అవ్యక్తమైన రూపమది.
అలా ప్రారంభమైన వాక్కు క్రమేణా పైకి వెళ్ళి అనాహతం చేరుతుంది. ఇక్కడ వాక్కుకు అక్షరసమామ్నాయంలో క నుంచి ఉన్న హల్లులు చేరతాయి. ఇది మధ్యమావాక్కు. ఇది మొలకెత్తిన ధాన్యపు గింజలా ఉంటుంది. అంటే రెండు ఆకులతోపాటు ఇంకొక ఆకు కూడా రావటానికి సిద్ధంగా ఉంటుంది. ఈ స్థితిలో వాక్కుకు అచ్చులు లేనటువంటి హల్లులు మాత్రమే ఉంటాయి. అందుచేత ఇక్కడ వాక్కేదో స్పష్టంగా తెలియదుకాని దాని రూపం మాత్రం తెలుస్తుంది. ఇది మధ్యమావాక్కు
అనాహతం నుంచి బయలుదేరిన మద్యమావాక్కు విశుద్ధి చక్రంచేరి, అక్కడ పదహారుదళాలలోను ఉన్న అచ్చులతో కలిసి స్పష్టమైన రూపాన్ని పొంది ముఖము ద్వారా బయటకు వస్తుంది. ఇది వైఖరీవాక్కు,
ఈ రకంగా వాక్కుకు అధిదేవత ఆ పరమేశ్వరి. అందుచేతనే ఆమె వాగ్వాదిని అనబడుతోంది. మంత్రశాస్త్రంలో వాగ్వాదినీ మంత్రము పదమూడు అక్షరాలతో ఉన్నది.
347. Vimala
ఏ విధమైన మలము లేనిది. కేవలము శుద్ధజ్ఞానరూపిణి. మలములు మూడు రకాలు 1. అణవమల, 2. కార్మికమల, 3. మాయీకమల. అణవమల స్థూలదేహానికి సంబంధించినది. మాయీకమల సూక్ష్మ దేహానికి సంబంధించినది. కార్మికమల కారణదేహానికి సంబంధించినది. ఈ రకమైన మలత్రయము లేనిది.
మంత్రశాస్త్రంలో ప్రతిమంత్రానికి దశసంస్కారాలు చెయ్యాలి. అలాచేస్తేనే ఆ మంత్రాలు విమలములు అవుతాయి. ఈ సంస్కారాలు వరుసగా 1. జనన 2. జీవన 3. తాడన 4. బోధన 5. అభిషేక 6. విమలీకరణము 7. ఆప్యాయన 8. తర్పణ 9. దీపన 10. గోపనములు. లలితమ్మకి అటువంటివి ఏవీ అవసరంలేదు. ఆవిడ షోడశిమంత్రస్వరూపిణి. అందుచేత విమలా అనబడింది.
346. Vijaya
పరమేశ్వరి తాను చేసే సృష్టి స్థితి లయాలలోను, యుద్ధాలలోనూ కూడా ఎప్పుడూ విజయమే పొందుతుంది. కాబట్టి విజయ అనబడుతోంది.
విజయ అనేది ఒక ముహూర్తము. ఆశ్వీయుజ శుద్ధ దశమినాడు నక్షత్రోదయకాలం విజయ ముహూర్తము అని చింతామణిలో చెప్పబడింది.
విజయదశమి రోజు సాయంత్రం నక్షత్రాలు వచ్చిన తరువాత కాలము విజయ అనబడుతుంది. అని రత్నకోశము చెబుతోంది.
జీవులకు వచ్చే ఆలోచనలలో చెడు ఓడిపోయి మంచే విజయం సాధిస్తుంది. కాబట్టి ఆ పరమేశ్వరి విజయా అని పిలవబడుతోంది.
345. Kshetrapalasamarchita
ప్రతిక్షేత్రంలోనూ క్షేత్రపాలకుడు ఒకడుంటాడు. అతనిచే అర్చించబడేది కాబట్టి ఆ దేవి క్షేత్రపాల సమర్చితా అనబడుతోంది.
344.క్షయవృద్ధివినిర్ముక్తా
ఆ జగన్మాత ఏ రకమైన వికారాలు లేనిది. నిర్వికారమైనది. ఆ దేవికి గుణాలు లేవు. రూపం లేదు. ఆకారం లేదు. వృద్ధిక్షయాలు లేవు. ఈ వికారాలన్నీ ఆత్మకు ఉన్నట్టు కనిపిస్తాయి. ఇందుకు కారణం ఆత్మశరీరంతో కలిసి ఉండటమే. నిజానికి క్షేత్రజ్ఞుడైన ఆత్మకు వీటితో ఏ సంబంధమూ లేదు. అటువంటి ఆత్మస్వరూపిణి మన అమ్మ. అందుచేతనే ఆమె క్షయవృద్ది వినిర్ముక్తా అనబడుతోంది.
343.Kshetrakshetragnapalini
343. క్షేత్రక్షేత్రజ్ఞపాలినీ
ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞ మేవ చ |
ఏత ద్వేదితు మిచ్ఛామి జ్ఞానం జేయం చ కేశవ ||
ఇదం శరీరం కౌంతేయ ! క్షేత్ర మి త్యభిధీయతే |
ఏత ద్యో వేత్తి తం ప్రాహః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః ||
కౌంతేయా! ఈ శరీరమే క్షేత్రము. దీనిని తెలుసుకున్నవాడే క్షేత్రజ్ఞుడు. అని ఈ రెండు విషయాలు తెలిసినవాళ్ళు చెబుతున్నారు.
క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత ! |
క్షేత్ర క్షేత్రజ్ఞయోర్జనం యత్తద్ జ్ఞానం మతం మమః ||
మహాభూతా స్యహంకారో బుద్ధి రవ్యక్త మేవ చ |
ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియ గోచరాః ||
ఇచ్చాద్వేష స్సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతిః |
ఏతత్ క్షేత్రం సమాసేన సవికార ముదాహృతమ్ ||
పంచభూతాలు, అహంకారము, బుద్ధి, మూలప్రకృతి దశేంద్రియాలు, మనస్సు, ఇంద్రియాల విషయాలు. సుఖం, దుఃఖం, కోరిక, ద్వేషం, తెలివి, ధైర్యం ఈ వికారాలతో పాటు వీటి సముదాయాన్ని కలిపి క్షేత్రం అంటారు. అని చెబుతాడు.
చతుర్వింశతితత్త్వాని క్షేత్రశబేన సూరయః |
ఆహుః క్షేత్రజ్ఞ శబేన భోక్తారం పురుషం తథా ||
ఇరవై నాలుగు తత్వాలను పండితులు క్షేత్రము అంటున్నారు. వాటిని అనుభవించే వాడు క్షేత్రజ్ఞుడు అన్నారు.
అవ్యక్తం క్షేత్రముద్దిష్టం బ్రహ్మాక్షేత్రజ్ఞ ఉచ్యతే
అవ్యక్తము క్షేత్రము. బ్రహ్మ క్షేత్రజ్ఞుడు అని చెప్పబడింది.
చేరిన జీవుడే క్షేత్రజ్ఞుడు అని చెప్పారు.
క్షేత్రము అంటే సర్వప్రాణుల శరీరములు అని ఇంకొకసారి చెబుతున్నాం. కేవలము మానవులే కాదు. క్రిమికీటకాలు, జంతువులు, పశుపక్ష్యాదుల శరీరాలు కూడా క్షేత్రాలే. ఆ క్షేత్రాలకు అధిపతి వాటిలోనే ఉన్న జీవాత్మ లేదా అంతరాత్మ. అదే క్షేత్రజ్ఞుడు. ఈ రెండింటినీ అంటే క్షేత్రము క్షేత్రజ్ఞులను పాలించేది ఆ పరమాత్మ. నిజానికి జీవాత్మ పరమాత్మ వేరు కాదు. కానీ అజ్ఞానం వలన జీవాత్మ పరమాత్మకు దూరమై శరీరమే తాను అనే భ్రమలో ఉంటున్నాడు. ఈ భ్రమ తొలగిపోయి మళ్ళీ జీవాత్మ పరమాత్మలో ఐక్యమవ్వడమే యోగం, ఆత్మసాక్షాత్కారం, మానవ శరీరం యొక్క అంతిమ లక్ష్యం.
342. Kshetreshi
1. మనోబుద్ధి చిత్త అహంకారాలు
2. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన వాయువులు
3. సత్త్వ రజ స్తమోగుణాలు
4. పంచభూతాలు
5. పుణ్యపాపాలు
ఈ రకంగా పంచవర్గ ధర్మముగల దేహాత్మయందు ప్రతిఫలించే జీవసంజ్ఞగల ఆత్మచైతన్యమే క్షేత్రేసి అనబడుతుంది. అదే మన అమ్మ.
దేశంలో అనేక పుణ్యక్షేత్రాలున్నాయి. వాటిలో ఉండే దేవత క్షేత్రే శ్రీ - క్షేత్రానికి అధిపతి అంటారు. అవి అష్టాదశ శక్తిపీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు శ్రీకూర్మము, శ్రీరంగము, పద్మనాభము, సింహాచలము, అంతర్వేది, రామతీర్ధము, ఉప్మాక, తిరుపతి, మంగళగిరి, అహోబిలం, భద్రాచలం, విష్ణుకంచి, ద్వారక, అయోధ్య మొదలైనవి.
ఈ క్షేత్రాలలో ఉన్న దేవతలు అశేషభక్త సమూహాలతో పూజింపబడుతున్నారు. ఆ దేవతా మూర్తులే క్షేత్రేశీ అనబడుతున్నారు.
341. Kshetraswarupa
Kshetra is the place where the seed germinates. The earth is the kshetra for a paddy seed. Similarly the body and sacred temples are kshetra for the seeds of knowledge. That is why shrines like Kashi, Rameswaram, Prayag, etc., are called kshetras. The bodies of all living beings also kshetras.
The deities in the shrines are a combination of all integral philosophies. It is the collective form of all living beings in the world. The same as the Virat form.
All perceivable nature is a kshetra for the seed of knowledge. It is an aspect of the Supreme Lord. That is why it is called kshetra swaroopa.
బీజం అంకురించే ప్రదేశమే క్షేత్రం. వడ్ల గింజకు భూమి క్షేత్రం అయితే జ్ఞాన బీజానికి దేహము దేవాలయాలు క్షేత్రాలు. అందుకే కాశీ, రామేశ్వరం, ప్రయాగ మొదలైన పుణ్యతీర్ధాలు అన్నీ క్షేత్రాలనబడతాయి. అన్ని జీవుల శరీరాలు క్షేత్రాలే.
పుణ్యక్షేత్రాలలో ఉండే దేవతామూర్తుల మూలవిరాట్లు సమగ్ర తత్త్వాల సమ్మేళనాలు. జగత్తులోని సర్వజీవులయొక్క సమిష్టి రూపము. అదే విరాడ్రూపము. అదే క్షేత్రస్వరూపం.
నామరూపాత్మకమైన ప్రక్రుతి అంతా క్షేత్ర స్వరూపమే. ఈ ప్రకృతికూడా పరమేశ్వరుని అంశమే. అందుచేతనే క్షేత్రస్వరూపా అనబడుతుంది.
337-340.Vidhatri..vilasini
337.విధాత్రీ - అనంతమైన జీవులయొక్క కర్మలను బట్టి ఫలితము నిచ్చేవాడు విధాత. అనంతుడు, ఆది కూర్మము మొదలైన రూపములలో జగత్తులను ధరించువాడు విధాత. అమ్మే సృష్టి స్థితి లయ కారకురాలు. ఆవిడే అన్ని జగములను పోషించునది. ధాత్రి అంటే ధరించునది. అష్టదిగ్గజములు, కులపర్వతములతో ఈ భూమిని ధరిస్తున్నది కాబట్టి ధాత్రి అనబడుతున్నది.
అష్టదిగ్గజములు - 1.ఐరావతము, 2.పుండరీకము, 3.వామనము, 4.కుముదము, 5.అంజనము, 6.పుష్పదంతము, 7.సార్వభౌమము, 8.సుప్రతీకము.
కులపర్వతములు - 1.మహేంద్రగిరి, 2.మలయగిరి, 3.సహ్యాగిరి, 4.హిమవద్గిరి, 5.గంధమాధానగిరి, 6.వింధ్యగిరి, 7.పరియాత్రగిరి
335. Vedavedhya
జ్ఞాన ఘన స్వరూపమే వేదం. లోకంలోని సమస్త విషయాలూ అంటే ప్రాణికోటికి తెలిసినవి తెలియని అన్నీ వేదంలో ఉన్నాయి. అన్ని విషయాలను తెలిపేదాన్నే వేదం అంటారు. ప్రపంచంలోని అన్ని రకాల విజ్ఞానాన్ని బోధించేది వేదం. అటువంటి వేదరూపంలో ఉండేది మన అమ్మ.
పరమాత్మ గురించి తెలుసుకోవాలంటే ఉన్న మార్గం ఒక్కటే అదే వేద మార్గం. శ్రీచక్రము యొక్క నాలుగు ద్వారాలు నాలుగు వేద రూపాలు.
చింతామణి గృహానికి నాలుగు వేదాలు నాలుగు ద్వారాలు పూర్వ ద్వారం ఋగ్వేదం దక్షిణ ద్వారం యజుర్వేదం పశ్చిమ ద్వారం అధర్వణ వేదం ఉత్తర ద్వారము సామవేదం ద్వారాలలో గనుక ప్రవేశించి నట్లైతే పరమాత్మ సాక్షాత్కారం జరుగుతుంది
Vedas are the condensed form of all the knowledge. All the things in the world i.e. everything that is known and unknown is in the Vedas. That which tells all things is called Veda. Veda teaches all kinds of knowledge in the world. Divine mother is in such a form.
Vedic way is the only way to know the Supreme. The four gates of the Sri Chakra are the four Vedic forms.
Popular
-
Dhyana means meditation. A Dhyana sloka explains the form on which one has to fix his/her mind during dhyanam(meditation) Shloka1 Sindh...
-
Chit is a part of our brain that seeks pleasure . It causes chaitanya. It is self-motivated and always at work. First it records our experie...
-
Karma is the conjunction of desire and effort. If there is no desire but only effort then it is not karma. It will be selfless service. When...
-
Mano Rupekshu Kodanda is 10th name of the 1000 names of Lalitha Devi. When read along with the 11th name pancha thanmathra sayaka , this na...
-
దాడిమీ వృక్షము - అంటే దానిమ్మ చెట్టు. ఈ చెట్టు రెండు రకాలుగా ఉంటుంది. పండు దానిమ్మ పువ్వు దానిమ్మ పండు దానిమ్మనే కాయ దానిమ్మ అనికూడా అంటారు....
-
Matruka means letters from 'Aa' to 'Ksha'. 'Kshara' means perishable. 'Akshara' means imperishable. In India...
-
Vyoma means sky, ether, atmosphere, air, wind etc. Kesha means hair. Vyomakesha is the name of the avatar of Lord Shiva who played a key ...
-
Pancha thanmathra sayaka is 11th name of the 1000 names of Lalitha Devi. This explains a very important concept behind self-improvement. ...
-
Vishukra is born from Bhandasura's right shoulder. He is equally clever as shukracharya (guru of all rakshasas). 'Shukra' donot...