Search This Blog

323.Kadambakusumapriya


323.Kadambakusumapriya - Divine mother likes Kadamba flowers. She sits in the garden of kadamba trees and enjoys the nectar of kadamba flowers.It is said that kadamba flowers will start to blossom after they see the lightning in the sky. They blossom during the monsoon season. There are 5 types of kadamba trees:1) Dharakadamba, 2) Bhoomikadamba 3) Dhoolikadamba 4) Raajadhoolikadamba 5) Rajakadamba.Rajakadamba is the biggest of all these trees. The bark of this tree is thick. Kadamba flowers are in reddish orange color in the shape of a ball. They emit good fragrance. Their nectar is cold and sweet. It can help in neutralising poison, reducing fever and reducing imbalances in kapha,vatta and pita. It brings glow to the body and enhances vigor, strength and power.

323.కదంబకుసుమప్రియా - కదంబ కుసుమము లందు ప్రీతిగలది. కదంబ వృక్షాన్ని నీప వృక్షము, కడిమిచెట్టు అంటారు. ఈ వృక్షాలు మేఘాలు గర్జించినప్పుడు మొగ్గలు వేస్తాయి. ఎర్రని రంగులో ఉండే పూలను గుత్తులు గుత్తులుగా పూస్తాయి. కదంబ వృక్షంలో చాలా రకాలున్నాయి. 1. ధారాకదంబ, 2. భూమికదంబ 3. ధూళికదంబ 4. రాజధూళికదంబ 5. రాజకదంబ. వీటన్నింటిలోకీ రాజకదంబము పెద్దవృక్షము. కడిమిచెట్టు ఆకు జీడిమామిడి ఆకులాగా ఉంటుంది. ఈ చెట్టు బెరడు దళసరిగా ఉంటుంది. చెట్టుకు సన్నని ఊడల వంటి కాడలు కూడా ఉంటాయి. దీని పూలు గుండ్రంగా, ఎర్రనిరంగులో, చిన్నవిగా ఉంటాయి. మంచి వాసన కలిగి ఉంటాయి. వర్షాకాలంలో ఈ చెట్టు పూలు పూస్తుంది. ఈ పూల నుంచి వచ్చే రసము చల్లగా, తియ్యగా ఉంటుంది. విషాన్ని హరించి వేస్తుంది. శరీరతాపాన్ని తగ్గిస్తుంది. ఈ రసము త్రిగుణ హరి. అంటే వాత, కఫ, పిత్తములను హరిస్తుంది. వీర్యవృద్ధి శరీరానికి మంచి కాంతిని కలిగిస్తుంది. అమ్మకు కదంబ వృక్షాలన్నా, వాటి పూలు అన్నా మక్కువ ఎక్కువ. ఆమె ఎల్లవేళల యందు కదంబవనంలోనే ఉంటుంది. కదంబ పుష్పాల నుంచి వచ్చే మధువును త్రాగుతుంది.

321-322 - Kamya kamakalarupa

321.Kamya - Desires are four types:

1. Kama - To crave for momentary pleasures.
2. Artha - To wish for prosperity as long as one is alive without any suffering.
3. Dharma - To wish for prosperity and happiness in all future re-births as well.
4. Moksha - To wish for boundless everlasting joy.

Based on their karma, beings wish for one of the above and Divine Mother fulfills them. Hence she is called Kaamya.

The one who yearns for Moksha is the best of the best. This is called nirapeksha kaama. The one who yearns for dharma is the best. The one who yearns for Artha is medium and the one who yearns for kaama is the lowest. These three are Saapeksha kaama

321. కామ్యా  - కోరికలు నాలుగురకాలుగా ఉంటాయి. అవి
1. తాత్కాలికంగా ఇప్పుడున్న కష్టాలు తొలగిపోయి సుఖాలు పొందాలి అనుకోవటం. ఇది కామము.
2. జీవించి ఉన్నంతవరకు దుఃఖము లేకుండా ఉండటము, సుఖాలు పొందాలి అనుకోవటము ఇది అర్ధము.
3. తనకు రాబోయే జన్మలలో దుఃఖం లేకుండా సుఖం పొందేటట్లు కోరటం. ఇది ధర్మము. 
4. అన్ని జన్మలలోను నిత్య నిరతిశయ ఆనందాన్నే కోరటం. ఇది మోక్షము.

జీవులు వారి కర్మఫలాన్ననుసరించే ఈ కోరికలు కోరతాయి. అమ్మ ఈ కోరికలు అన్నీ తీరుస్తుంది. అందుకే కామ్యా అనబడుతుంది.

పైన చెప్పిన కోరికలలో మొదటి మూడు సాపేక్ష కామములు కాగా నాల్గవది నిరపేక్ష కామము.

వీరిలో మోక్షాన్ని కోరేవాడు ఉత్తమోత్తముడు. ఇది నిరపేక్ష కామము.  ధర్మాన్ని కోరేవాడు ఉత్తముడు. అర్థాన్ని కోరేవాడు మధ్యముడు. కామాన్ని కోరేవాడు అధముడు. ఇవి సాపేక్ష కామములు. 

322. Kamakala rupa - Here, Śiva becomes the most desired of all, as He is the Supreme Reality or Paramārtha.  Śiva being the Supreme Ruler, He is addressed as Kāmeśvara.  By addressing Him thus, He not only becomes the object of desire (Kāma), but also becomes the Supreme Ruler (Īśvara). This  is how He becomes Kāma + Īśvara = Kāmeśvara. Kalā refers to vimarśa form of Śiva, Mahātripurasundarī. Śiva alone is Self-illuminating and Śaktī illuminates the universe with the brilliance of Śiva. Their conjoined form is Kāmakalā.

322. కలారూపా - అందరినీ ఆకర్షించేవాడు ఆ పరమాత్మ. మహా కామేశ్వరుడు. కామేశ్వరుని కలా విభూతి శక్తి కనుక కామకల అనబడుతుంది. ఆవిడ ఇచ్ఛాశక్తి స్వరూపిణి అందుచేత కామకలా రూపా అనబడుతోంది.

309-312. Ranjani....mekhala

309.Ranjani - Lord shiva is like a spatika (color less prism). And divine mother is like a red flower. When you put red flower near spatika linga, the originally colorless crystal linga will also glow in red color.

310.Ramani - Divine mother stays in the hearts of her devotees. She makes them feel happy and joyous.

311.Rasya - 'Rasa' means the juice or gist of a substance. Divine mother is the 'Rasa' in everything in this 'Jagat'. But one has to do a lot of practice to understand it. Ghee is not directly visible in milk. Similarly, parameswara is not directly visible within us. Divine mother is in all beings in the form of the 'faculty of grasping' the gist

312.Ranathkinkinimekhala - Divine mother wears the golden waist band with tinkling bells.

309.రంజనీ - స్ఫటికమువలే ప్రకాశించు పరమశివుని, దాసాని పువ్వులా ఉన్న అమ్మ రంజింపచేస్తుంది. అనగా స్వచ్ఛమైన స్ఫటికము ప్రక్కన ఎర్రని రంగు పెట్టినట్లైతే, ఆ స్ఫటికంకూడా ఎర్రగానే ప్రకాశిస్తుంది.

310.రమణీ - భక్తజనుల హృదయములందు విహరించునది. భక్తులను రమింపచేయునది. ఆనందింపచేయునది.

311.రాస్యా - పదార్థంలో ఉండే సారాన్ని రసము అంటారు. జగత్తులోని ప్రతిపదార్ధంలోనూ కూడా ఉండే రసము అమ్మ యొక్క స్వరూపమే అయి ఉన్నది. పాలలోని నెయ్యిలాగా పరమేశ్వరుడు ప్రతిజీవిలోనూ అంతర్గతంగా ఆవరించి ఉన్నాడు. ఇక్కడ పాలలోని నేయిలాగా అనే పదానికి అర్ధం - నిజంగా చూస్తే పాలలో నెయ్యి కనిపించదు. వాటిని కాచి, తోడు పెట్టి వెన్న తీసి, ఆ వెన్నను కరగపెడితేనేగాని నెయ్యి రాదు. అంటే జీవి తనలో ఉన్న ఆత్మ స్వరూపాన్ని తెలుసుకోవాలంటే ఎంతో సాధన చేయాలి. అప్పుడే ఆత్మదర్శనమవుతుంది. ఆ రకంగా ప్రతిజీవిలోని రసగ్రహణ శక్తి ఆ అమ్మ అంశయే అని తెలుసుకోవాలి.

312.రనత్కింకిణిమేఖలా - మ్రోగుచున్న చిరుగంటలు గల మొలనూలు గలది.

301-304. Hrimkari...Heyopadeyavarjitha

301.Hrimkari - It is clear from 300th name that we cannot know Divine mother from textual readings( they are mere descriptions of name and form). She can be known by meditating with the sound 'Hrim'.'Srim', 'Hrim', 'Kleem', 'aim' and 'souh' are called shakti pranavas.

Hakāraḥsthūladēhaḥsyā drākāras'sūkṣma dēhakaḥ |
īkāraḥ kāraṇātmā sau hrīmkārō haṁ turīyakam ||

hakara        - the gross body
rakaaramu  - Sookshma body
Eekara        - causal body
The entire Hrimkara - Turiyaka - Mahakarana body
Omkara - Parabrahma Swarupa
Hrimkara - An embodiment of Parameshwari

Nama stē bhuvanēśāni! Nama stē prāṇavātmikē!
Sarvavēdāntasansid'dhē! Nāma hrīmkāra mūrtayē ||

Shakti, Maya, Hrillekha are words for Hrimkara. Parabrahma is not different from its Shakti. similarly, there is no difference between Omkara and Hrimkara.

302.Hrimathi - Divine mother is modest for her capabilities and caliber. She does not like pomp and vanity

303-304. Hrudya Heyopadeyavarjita - We learnt about divine mother's greatness previously. Now let us learn about her kindness and generosity. When a child gets hurt in play, he shouts 'Amma' from there. Immediately his mother responds to that from kitchen to that shout. Similarly, Divine mother also responds to whoever calls her. She will be responding from our heart. She never thinks whether the caller is worthy of her grace. 

301. హ్రీంకారీ - నామరూపాలతోనే మనం జ్ఞానం అలవర్చుకుంటాం. కానీ 300వ నామంలో అమ్మ నామరూపాలకి అతీతం అని చెప్పబడింది. మరి అలాంటప్పుడు ఆవిడను మనం ఎలా తెలుసుకుంటాం. అందుకనే హ్రిమ్ కారం ఉన్నది. హ్రిమ్ కార ధ్యానంతో మనం అమ్మను తెలుసుకోగలుగుతాము. శ్రీం హ్రీం క్లీం ఐం సౌః అనేవి శక్తి ప్రణవాలు. వాటిలో రెండవది హ్రీంకారము.

హకారఃస్థూలదేహఃస్యా ద్రాకారస్సూక్ష్మ దేహకః |
ఈకారః కారణాత్మా సౌ హ్రీమ్కారో హం తురీయకమ్ ||

హకారము                     - స్థూలదేహము
రకారము                      - సూక్ష్మదేహము
ఈకారము                     - కారణదేహము
మొత్తం హ్రీమ్కారము - తురీయకము మహాకారణ దేహము
ఓంకారము                   - పరబ్రహ్మ స్వరూపము
హ్రీమ్కారము               - పరమేశ్వరి స్వరూపము 

నమ స్తే భువనేశాని ! నమ స్తే ప్రాణవాత్మికే !
సర్వవేదాంతసంసిద్ధే ! నామ హ్రీమ్కార మూర్తయే ||

శక్తి మాయ హృల్లేఖా అనేవి హ్రీంకార వాచ్యాలు. పరబ్రహ్మకు దాని శక్తికి భేదం లేదు. అలాగే ఓంకారానికి హ్రీంకారానికి తేడా లేదు.

302. హ్రీమతీ - అమ్మ ఎల్లపుడు లజ్జతో ఉంటుంది. అట్టహాసాలు  నచ్చవు.

303-304. హృద్యా హేయోపాదేయవర్జితా - అమ్మ గొప్పతనం గురించి మనం ఇంతకుముందు  చెప్పుకున్నాం. ఇక్కడ ఆవిడ ప్రేమ, ఔదార్యం వర్ణించబడుతోంది. ఇంట్లో పిల్లవాడు ఆడుకుంటూ ఏదైనా దెబ్బ తగిలించుకున్నపుడు వాడు అక్కడినుంచే 'అమ్మా' అని అరుస్తాడు. ఆ పిలుపువిన్న అమ్మ వెంటనే వంట గదిలోంచి 'ఎం బాబూ! ఎం జరిగింది అంటూ స్పందిస్తుంది. పిల్లవాడి ఆర్తి తప్ప ఇంకేమి ఆవిడ పట్టించుకోదు. లలితాంబ కూడా అంతే. ఆర్తితో  పిలిచిన వెంటనే హృదయ స్థానం నుంచి ఆవిడ స్పందిస్తుంది. అర్ధించువాడికి పుణ్య బలం ఎంతవుంది, కుల గోత్రాలు ఏమిటి మొదలైనవి ఆమె చూడదు. 

298-300 - Narayani nadarupa namarupa vivarjitha

298.Narayani - The creation is made out of Ātman (the Brahman).  The five elements that emerged from it are known as nārāmu. Divine Mother is spread everywhere in panchabhutas. They are filled with her. Hence, she is called Narayani

299.Nadarupa - Varivasya Rahasya is the text that explains the panchadashi mahamantra. It explains that the sound of "Hreem" is composed of 12 syllables. They are vyoman (h), agni (r), vāmalocanā (ī), bindu (ṃ), ardhacandra, rodhinī, nāda, nādānta, śaktī, vyāpikā, samanā and unmanī.  The aggregate of the last eight is known as nāda. Out of the last eight, the subtlest is unmanī.  These 8 are placed above the bindu (dot). 

300.Namarupavivarjitha - Divine mother is inside all living beings in this universe. However, it is not possible to assign a particular name or form to her.

The world has 5 qualities. They are
1. Asti      - has
2. Bhati    - knowledge (or that which is known).
3. Priyam - Delightful
4. Nama   - name
5. Rupa    - shape

The first three of these are forms of Brahma. The rest are Jagadrupas. All these Jagadrupas are intermediate.

298.నారాయణీ - నరుడు అంటే పరమాత్మ. అటువంటి ఆత్మవలన జన్మించిన పంచభూతాలు నారములు అనబడతాయి. ఆ పంచభూతముల యందు వ్యాపించినది. పంచభూతాలే స్థానముగా గలది - నారాయణి అనబడుతుంది.

299.నాదరూపా - వరివస్య రహస్యం అనేది పంచదశి మహామంత్రాన్ని వివరించే గ్రంథం. అందులో  "హ్రీం" శబ్దం 12 అక్షరాలతో కూడి ఉంటుందని వివరించబడింది. అవి వ్యోమన్ (హ్), అగ్ని (ర్), వామలోచన (ఇ), బిందు (మ్), అర్ధచంద్ర, రోధినీ, నాద, నాదాంత, శక్తి, వ్యాపికా, సమాన మరియు ఉన్మని. చివరి ఎనిమిది శబ్దముల సమూహాన్ని నాదము అంటారు. చివరి ఎనిమిదిలో, అతి సూక్ష్మమైనది ఉన్మని. ఈ 8 బిందువు పైన ఉంచబడ్డాయి.

300.నామరూపవివర్జితా - జగత్తులోని జీవరాశి యందు అంతటా తానే అయి ఉన్నది అమ్మ. కాని కంటికి కనిపించే రూపంలోను పేరుతోను మాత్రం కాదు. అందుచేతనే నామరూప వివర్జితా అనబడుతోంది.

జగత్తుకు 5 లక్షణాలున్నాయి. అవి 

1. అస్తి         - కలదు 
2. భాతి        - జ్ఞానము (లేక తెలియబడుతున్నది)
3. ప్రియం   - ఆనందము కలిగిస్తున్నది
4. నామము - పేరు 
5. రూపము  - ఆకారము 

వీటిలో మొదటి మూడు బ్రహ్మ రూపాలు. మిగిలినవి జగద్రూపాలు. ఈ జగద్రూపాలు అంతా మిధ్య. 

బిందువునందు ఎనిమిది వర్ణాలున్నాయి. బిందువుతో కలిపి అవి తొమ్మిది. అవి 1. బిందువు 2. అర్ధచంద్రము 3. రోదిని. 4. నాదము 5. నాదాంతము 6.శక్తి. 7. వ్యాపిక 8. సుమన 9. ఉన్మన. ఈ నామములో నాదము గురించి వర్ణన ఉంది. కనులవలె ఉండే రెండు బిందువులున్నాయి. వీటిని తిర్యక్ బిందువులు అంటారు. వాటిని కలుపుతూ మధ్యలో సన్నని రేఖ ఒకటి ఉంటుంది. అది మణి ప్రభలు కలిగి ఉంటుంది. అనగా ఎర్రని కాంతి ప్రకాశిస్తుంది.

297.Haribrahmendrasevitha

విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన వారిచే సేవించబడేది. అమ్మ మణిద్వీపంలో ఉంటుంది. దానికి 25 ప్రాకారాలుంటాయి. వాటిలోని 14వ ప్రాకారంలో ఇంద్రుడు మొదలైన దిక్పాలకులు ఉంటారు. 16వ ప్రాకారంలో మరీచి మొదలైన ప్రజాపతులతో కలిసి బ్రహ్మ ఉంటాడు. 17వ ప్రాకారంలో విష్ణువు ఉంటాడు. 18వ ప్రాకారంలో శివుడు ఉంటాడు. 

దేవీ భాగవతంలో 

బ్రహ్మవిష్ణుస్తథా శంభుర్వాసవో వరుణో యమః
వాయురగ్ని, కుబేర శ్చ త్వష్టా పూషాశ్వినౌ భగః
ఆదిత్యా వసనో రుద్రా విశ్వేదేవా మరుద్గణాః
సర్వే ధ్యాయన్తి తాం దేవీం సృష్టి స్థిత్యంతకారిణీమ్ || 


బ్రహ్మ, విష్ణువు, శంభుడు, రుద్రుడు ఇంద్రుడు, వరుణుడు, యముడు, వాయువు, అగ్ని కుబేర, త్వష్ట పురుషులు, అశ్వనీ దేవతలు, భగుడు, ఆదిత్యుడు, వసువులు, విశ్వదేవతలు, మరుద్గణాలు అందరూ సృష్టి స్థితిలయకారిణి అయిన అమ్మని ధ్యానిస్తున్నారు.

కేనోపనిషత్ లో 
ఆ జగన్మాతను దర్శించినందు వలనే అగ్ని వాయువు ఇంద్రుడు మిగిలిన వారికన్నా గొప్పవారైనారు. వారిలో మొదటివాడు ఇంద్రుడు. అందుకే అతను దేవతలకు రాజైనాడు. 

Divine Mother stays in Manidweepa and served by Vishnu, Brahma, Indra etc. It has 25 ramparts. In the 14th rampart there are dikpaalakas like Indra etc. In the 16th rampart, Brahma is present along with Prajapatis like Marichi etc. Vishnu is in the 17th rampart and Lord Shiva is in 18th.

In Devi Bhaagavatam

brahmaviṣṇustathā śambhurvāsavō varuṇō yamaḥ
vāyu ragni, kubēra śca tvaṣṭā pūṣāśvinau bhagaḥ
ādityā vasanō rudrā viśvēdēvā marudgaṇāḥ
sarvē dhyāyanti tāṁ dēvīṁ sr̥ṣṭi sthityantakāriṇīm ||

Brahma, Vishnu, Shambhu, Rudra, Indra, Varuna, Yama, Vayu, Agni, Kubera, Twashtas, Ashwini devatas, Bhaga, Aditya, Vasu, Vishwadevatas, Marudganas - All these pray Divine Mother for help when they face challenges.

In Kenopahishath
Agni Vayu Indra became superior to the others because of saw Divine Mother in meditation . The first of them was Indra. That is why he became the king of the gods.

296.Anadi nidhanaa

దేవి భాగవతంలో 

నై వ చోర్ధ్వం న తిర్యశ్చ న మధ్యే పారిజాగ్రభాత్
ఆద్యంత రహితం తత్తు సహస్తా ద్యంగ సంయుతం

పోతన భాగవతంలో 

అన్ని రూపులు నీ రూపమైనవాడ!
ఆది మధ్యాంతములు లేక అలరువాడ!

మొదలు మధ్య చివర అనేటటువంటివి లేనిది. 

ఆదిర్జన్మ నిధనం వినాశహ్ తద్వయం యస్య నవిద్యతే సః అనాదినిధనః 

జనన మరణాలు లేనటువండితి. నిత్యము అయినటువంటినది. ఏ రకమైన వికారాలు లేనటువంటిది. 

అనాది అంటే 80 సంఖ్య. ద - 8, అ అంటే - సున్న. మొత్తం 80. ఇవి అమృతవిఘాతాలు. మరణ సాధనాలు. అటువంటి సాధనాలు లేనటువంటిది. ఈ మరణ సాధనాలు రెండు రకాలు. 1.పాశము, 2.వధ. వీటిలో పాశములు 52 వధ 28 రకాలు వెరసి 80. ఈ మృతుసాధనాల నుండి మనల్ని కాపాడేది కనుక అనాది నిధానా అనబడుతుంది. 

In Devi Bhagavatam

nai va cōrdhvaṁ na tiryaśca na madhyē pārijāgrabhāt
ādyanta rahitaṁ tattu sahastā dyaṅga sanyutaṁ

In Potana Bhagavatam

anni rūpulu nī rūpamainavāḍa!
Ādi madhyāntamulu lēka alaruvāḍa!

There is no such thing as beginning, middle, and end.

Ādirjanma nidhanaṁ vināśah tadvayaṁ yasya navidyatē saḥ anādinidhanaḥ

There is no birth and death. As if eternal. As if there were no transformations or deformations of any kind.

Anadi means the number 80. Da - 8, A means - zero. A total of 80. These are Amrutavighatas. instruments of death. Divine mother does not have these. These instruments of death are of two types. 1.Pashamu, 2.Vadha. Of these, there are 52 types of Paashamu, 28 types of Vadha, total 80. Divine Mother is called Anadi Nidhana because it protects us from these deadly instruments.

294.Bhuvaneshwari

The passage of time is not the same throughout the universe. It means that if 10 minutes pass in one place, decades may pass in another. In the past, scientists used to think that time is the same throughout the universe. An incorrect concept of 'universal time constant' was also coined. But in the 20th century, Albert Einstein, a great scientist, proposed the 'Theory of Relativity' and corrected that mistake.

In fact, time and space cannot be imagined separately. That is, movement from one place to another cannot happen without a time difference, and movement from one time to another cannot happen without being somewhere. That's why when Einstein combined space and time with a mathematical process called conjunction, he got an ellipse. Based on that he "proposed that the universe is bent in the form of an ellipse". Vedic scientists also described the universe as Brahmandas (egg shaped subunits).

Similarly, they suggested that creation is divided into 14 lokas based on differences in these spacetime movements. Divine mother is the ruler of these 14 lokas.  Divine Mother is the ruler of all of these. There are 7 lokas inside or under. They are called Adholokas. They are: 1. Atala, 2.Vitala, 3. Sutala, 4.Talaatala, 5. Rasaatala, 6. Mahaatala, and 7. Pataala.

There are 7 lokas outside. These are called Oordhvalokas. They are: 1. Bhoo, 2. Bhuva, 3.Suva, 4.Maha, 5.Jana, 6.Tapo and 7.Satya.  

కాలగమనం విశ్వమంతటా ఒకేలా ఉండదు. అంటే ఒక చోట 10 నిమిషాలు గడిస్తే మరొకచోట కొన్ని దశాబ్దాలు గడిచిపోవచ్చు. పూర్వం శాస్త్రవేత్తలు ఇది తెలియక విశ్వమంతటా సమయం ఒకటే ఉంటుంది అని తలచి కొన్నాళ్ళు తప్పుడు ఆలోచనలు చేశారు. 'యూనివర్సల్ టైం కాన్స్టాంట్' అనే ఒక తప్పుడు ప్రక్రియను కూడా రూపొందించారు. కానీ 20వ శతాబ్దంలో ఆల్బర్ట్ ఐంస్టీన్ అనే గొప్ప శాస్త్రవేత్త 'థియరీ అఫ్ రిలేటివిటీని' ప్రతిపాదించి ఆ తప్పును సరిదిద్దారు. 

నిజానికి సమయాన్ని ప్రదేశాన్ని విడివిడిగా ఊహించడం కుదరదు. అంటే ఒక ప్రదేశమునుండి మరొక ప్రదేశానికి కదలడం సమయ వ్యత్యాసం లేకుండా జరగనేరదు మరియు ఎదో ఒక ప్రదేశంలో లేకుండా ఒక సమయం నుండి మరొక సమయానికి జరగడం కుదరదు. అందుకే ఐంస్టీన్ ఒక గణిత ప్రక్రియతో ప్రదేశాన్ని సమయాన్ని కలిపినప్పుడు అండాకారంలో ఉన్న దీర్ఘవృత్తాకారం ఏర్పడింది. దాని అనుసంధానంగానే ఆయన "ఈ విశ్వం అండాకారంలో ఉంది అని ప్రతిపాదించారు" వైదిక శాస్త్రవేత్తలు కూడా అందుకే విశ్వాన్ని బ్రహ్మాండాలుగా వర్ణించారు. 

అలాగే వారు ఈ దేశకలాగమనాలలో వ్యత్యాసాల ఆధారంగా ఈ సృష్టి 14 లోకాలుగా విభజించబడింది అని సూచించారు. ఈ చతుర్దశ భువనాలకూ అధిపతి మన అమ్మ. అవి 7 అధోలోకాలు: 1. అతల, 2 వితల, 3. సుతల, 4. తలాతల, 5. రసాతల, 6. మహాతల, 7. పాతాళములు.

ఏడు ఊర్ధ్వలోకాలు . అవి 1. భూలోక, 2 భువర్లోక, 3. సువర్లోక, 4. మహాలోక, 5 జనలోక, 6. తపోలోక, 7.సత్యలోకాలు

వీటన్నింటికీ ఈశ్వరి అమ్మ లలితమ్మ. అందుకే భువనేశ్వరి అనబడింది.

291.Purasharthaprada

Purusharthaprada means one who gives the purusharthams. Purushartham means the purpose of the human life. If Purusharthas are not achieved, then the human birth is wasted. You have to take another birth again.
Dharma, Artha. Kaama and Moksha are called purusharthas. Divine mother gives all the four purusharthas to those who pray her with devotion.
Dharma - To gain capabilities/tools required to quench longstanding desires and nullify past sins.
Artha - To continue the practice of Dharma throughout the life
Kaama - To enjoy momentary pleasures and realizing that they are not everlasting joy
Moksha - To submerge in the everlasting joy of Brahman.


పురుషార్ధప్రదా అంటే పురుషార్థములను ఇచ్చునది అని అర్థం. పురుషార్థములు అంటే ప్రతీ మనిషికి (జన్మ ఎత్తినందుకుగాను) సిద్ధిఞ్చవలసినవి. పురుషార్థ సిద్ధి జరగకపోతే మనిషి జన్మ వ్యర్థం. మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాలి. 
ఎవరైతే ఆ అమ్మని అర్చిస్తారో వారి పురుషార్ధాలను తీరుస్తుంది. ధర్మము, అర్థము, కామము మరియు మోక్షము. వీటిని పురుషార్థములు అంటారు. 
1. ధర్మము అంటే - జన్మజన్మలకు ఇష్టప్రాప్తిని అనిష్ట పరిహారాన్ని పొందటానికి సాధనాలను గ్రహించటం. అంటే తన యొక్క గుణము మరియు కర్మను అనుసరించి ఎదో ఒక వర్ణమును ఆశ్రమమును ఎంచుకోవడం.
2. అర్ధము అంటే - ఎంచుకున్న ధర్మాన్ని జీవితాంతము చిత్తశుద్ధితో శ్రద్ధతో అనుష్టించడం.
3. కామము అంటే - తాత్కాలిక సుఖాలను పొందటానికి అవసరమైన ఉపాయాలు ఉపయోగించటం
4. మోక్షము అంటే - పునర్జన్మ లేకుండా జీవాత్మని పరమాత్మలో ఏకం కావటానికి చేసే సాధన.

289.Shruthiseemanthasindhurikrithapadabjadhulika

Shruti means Vedas. Seemanta sindhuram means the red dot at the end of the parting of hair in Divine mother's forehead. The vedas tried to explain Divine mother. From the beginning till the end, after a lot of hard work, all they were able to describe is equal to a small red dot in Divine mother's hair.

Kriti means all the maha kaavyas. They also tried to describe. After all the hard work, all they were able to explain is equal to the dust under Divine mother's feet. Imagine how great our Divine mother is. It our good fortune to be her children.

శ్రుతులు అంటే చతుర్వేదాలు. సీమంత సింధూరము అంటే అమ్మ పాపటలో ఉండే తిలకం బొట్టు. వేదాలు అమ్మని వర్ణిద్దాం అనుకున్నాయిట. కానీ ఆద్యంతం అవి వర్ణించినది అమ్మ పాపట బొట్టుతో సమానం. 

కృతులు అంటే మహావాక్యాలు. అవి అమ్మను వర్ణిద్దాం అనుకున్నాయిట. వాటి వర్ణన అమ్మ పాదాలకింద ధూళి కణంతో సమానం. అటువంటి అమ్మ మన అమ్మ. ఎంత గొప్పో కదా. 

286.Varnashramavidhayini

It is said in Bhagavad Gita

Chaaturvarnam mayaa shrushtam gunakarma vibhaagashah

All human beings have the same goal in life. That is self-realization. But the way to achieve it is different. There are many ways to achieve self-realization. People can choose whichever path they like according to their qualities and karma. That is why freedom is a important aspect of my creation. Know your goal, choose your own path. I will support you no matter what difficulties you encounter while walking that path.

Brahmano sya mukhamasit bahu rajnyah kritah
Urutadasya Yadvaisya Padabhago Shudro Ajayata

Divine Mother created four varnas for us. They are 1. Brahmin, 2. Kshatriya, 3. Vaishya, 4. Shudra. All of us are Shudras by birth. Because none of us know what is dharma and what is adharma at birth. At the age of eight, the varna of a child changes after the upanayanam. He/she begins vedic education from the gurus depending on his karma. Then he transforms into a Brahmin or a Vaisya or a Kshatriya.

The Shudras who do not know the Vedic knowledge use their physical strength and endurance to work hard and feed the rest of the castes. That is why it is said Padabhago Shudro Ajayata

A Brahmin who is well versed in Vedic knowledge uses his energy and brilliance to perform rituals such as Yajna and spreads vedic knowledge through his mouth, that is why Brahmano Sya Mukhamasit .

A kshatriya who has good craftsmanship and Vedic knowledge practices many martial arts and even sacrifices his life to protect the people. That's why it is said bahu rajnyah kritah

A Vaishya who has good worldly knowledge and knowledge of various sciences, takes up entrepreneurship and provides suitable jobs to the people. He learns trade secrets from his ancestors and gurus and passes them on safely to posterity. That is why it is said Urutadasya Yadvaisya. Read this post for more details.

Divine Mother has appointed 5 ashrams for all of us. They are 1.Childhood, 2.Brahmacharyam, 3.Grihasthashram, 4.Vanaprastham, 5.Sanyasam.

Childhood is about developing immunity from various diseases and learning common sense from parents. Brahmacharya is to study with gurus and acquire the knowledge needed for long life and self-realization. Grihasthashram is to get married, establish a household, lead a righteous life, take care of elders, bear children, raise them and ensure they become successful. Vaanaprastha is to practice moksha by staying away from worldly bonds. Sanyasam is to surrender oneself to Paramatma.

286.వర్ణాశ్రమవిధాయినీ

 భగవద్గీతలో ఇలా చెప్పారు

చాతుర్వర్ణం మయా సృష్టం గుణ కర్మ విభాగశహ్

మనుషులందరికీ జీవిత లక్ష్యం ఒక్కటే. అదే మోక్షం. కానీ దానిని చేరుకునే దారి పద్దతి వేరు. మోక్షాన్ని పొందటానికి అనేక మార్గాలు ఉన్నాయి. మనుషులు తమ తమ గుణములు మరియు కర్మలను బట్టి ఎవరికి నచ్చిన మార్గం వారు ఎంచుకోవచ్చు. అందుకే నేను సృష్టిలో స్వేచ్ఛను పెట్టాను. మీ లక్ష్యాన్ని తెలుసుకోండి, మీకు నచ్చిన మార్గమును మీరే ఎంచుకోండి. ఆ మార్గంలో పయనిస్తున్నపుడు ఏ కష్టం వచ్చినా నేను మిమ్ములను ఆదుకుంటాను. 

బ్రాహ్మణో స్య ముఖమాసీత్ బాహూ రాజన్యహ్ కృతః
ఉరూతదస్య యద్వైస్య పదభాగ్o శూద్రో అజాయత

అమ్మ మనకొరకు నాలుగు వర్ణాలను సృష్టించింది. అవి 1.బ్రాహ్మణ, 2.క్షత్రియ, 3.వైశ్య, 4.శూద్ర. పుట్టుకచే అందరూ శూద్రులే. ఎందుకంటే పుట్టగానే ఏది ధర్మమో, ఏది అధర్మమో ఎవరికీ తెలియదు. ఎనిమిదవ ఏట ఉపనయనం చేసుకుని గురుకుల విద్యాభ్యాసం మొదలుపెట్టాక పిల్లవాడి వర్ణం మారుతుంది. అతని కర్మను బట్టి బ్రాహ్మణుడిగానో, వైస్యునిగానో, క్షత్రియుని గానో మారుతాడు. 

వేద విజ్ఞానం తెలియని శూద్రులు తమ శరీరంలోని ఓజస్సు, సహస్సును వాడుకుని కాయకష్టం చేసి, మిగిలిన వర్ణాల వారిని పోషిస్తారు. అందుకే పదభాగ్o శూద్రో అజాయత అన్నారు

వేదవిద్యను బాగా అభ్యసించిన బ్రాహ్మణుడు తన ఓజస్సు తేజస్సు ఉపయోగించి నోటి ద్వారా యజ్ఞ యాగాది క్రతువులు, విద్యాబోధన మొదలైన కర్మలు చేస్తాడు అందుకే బ్రాహ్మణో స్య ముఖమాసీత్ అన్నారు

మంచి హస్తకౌశల్యం, వైదిక జ్ఞానం కలిగిన క్షత్రియుడు అనేక యుద్ధ విద్యలను అభ్యసించి, జనుల రక్షణకు తన ప్రాణాలను సైతం అర్పిస్తాడు. అందుకే బాహూ రాజన్యహ్ కృతః అన్నారు

మంచి లౌకిక జ్ఞానం శాస్త్ర పరిజ్ఞానం కలిగిన వైశ్యుడు తన తెలివితేటలతో వ్యాపారం చేసిజనులకు తగిన కొలువులు ఇస్తాడు. తన పూర్వీకులవద్దనుండి, గురువుల వద్దనుండి వ్యాపార రహస్యాలను తెలుసుకుని వాటిని భద్రంగా భావితరాలవారికి అందజేస్తాడు. అందుకే ఉరూతదస్య యద్వైస్య అన్నారు. మరిన్ని వివరములకొరకు ఈ పోస్టు చదవగలరు. 

మనందరికొరకు అమ్మ 5 ఆశ్రమాలను నియమించింది. అవి 1.బాల్యం, 2.బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, 4.వానప్రస్థం, 5.సన్యాసం 

అనేక విధమైన బాలారిష్టాలు ఎదుర్కొని, తల్లిదండ్రులవద్ద ఇంగితజ్ఞానం నేర్చుకోవడమే బాల్యం. గురువుల వద్ద విద్యాభ్యాసము చేసి, పూర్ణాయుద్ధాయము మరియు మోక్షమునకు కావలిసిన జ్ఞానం సంపాదించుకోవడమే బ్రహ్మచర్యం. వివాహము చేసుకొని, ఒక గృహము ఏర్పరిచి, ధర్మబద్ధముగా జీవితము సాగిస్తూ పెద్దలను కడతేర్చి, బిడ్డలను కని, పెంచి పోషించి, వారిని ప్రయోజకులను చేయడమే గృహస్థాశ్రమం. ఐహిక బంధాలకు దూరంగా ఉంటూ మోక్ష సాధన చేయడమే వానప్రస్థం. పరమాత్మకు తనను తానూ అర్పించుకోవడమే సన్యాసం. 

Popular