Search This Blog

275.Bhanumandala Madhyastha

Bhanumandala madhye tishtati iti
Located in the middle of the Bhanumandalam. The science of mantra prescribes to meditate on this place during dusk and dawn

Ya eshontaraaditye hiranmayah purusho drushyata
You can see the Paramatma who is like Hiranmaya in the middle of Aditya mandala

You should worship the Divine Mother, who is the middle of Bhanumandala, with a bow and arrow in her hands.

The Bhanumandalam is a composite of moon and Fire. Hence it is the form of Parabrahma. Bhanumandalamu means Anaahata mandalam.

Naabhi sthamani pooraakhyaam hrudayam chaabjamanaahatam
Manipura Chakra in the navel. Anahatapadma in the heart.

Purusha sooktam - 

Padmakosha prateekaashagm hrydayam chaa pyathomukham
There is a lotus below the neck and above the navel. It is about 12 inches and facing downwards

Atho nishtyaa vitasyaante naabhyaa mupari tishtati
jwaalamaalaakulam bhaati vishvasya yatanam mahat
santatgm shilaabhi stu lamba tyaakosha sannibham
sasyaante sushiragm sookshmam tasmin sarvam pratishtitam
tasya madhye mahaa nagni rvishvaarchi rvishvatomukhah
so grabhu gvibhajam tishta nnahaara majarah kavih
tirya goordhwa madhasshyee rashmayastasya santataa

There is a delicate lotus at the apex of the heart, which radiates like a flame, supporting the heart and supporting many nerves. Everything is established into it. In the midst of it was a great fire god whose flames spread everywhere. That is Jatharaagni.

Santaapayati swamdeha maapadatalamastakah
tasmya madhye vahni shikhaa aniyordhwaa vyavasthitah

The Jatharaagni (digestive fire) divides the food and sends it to all parts of the body. The yogis meditate Divine Mother in this place.

neelatoyada madhyasthaa dvidyullekheva bhaswaraa
neevaara shookavattanvee peetaa bhaswattyanoopama

Inside the Jatharaagni, there is a small flame of the size of a grain and rising up. It shines like lightning in the middle of a blue cloud. The grain is as small as a paddy grain and has a greenish tinge

tasya sshikhaayaa madhye paramaatmaa vyavasthitah
sabrahma sashiva ssaharischendrah so ksharahparamaswaraat

In the midst of that fire lies the Paramatman. He is Brahma, he is Shiva, he is Vishnu, he is Indra. Indestructible. Self-luminous. Bhanumandalam means Anaahata. That is the place of heart. There lies the Divine Mother. Hence she is called Bhanumandala madhyastha.

275.భానుమండల మధ్యస్థా

భానుమండల మధ్యే తిష్ఠతీతి
భానుమండలము మధ్యన ఉన్నది. సంధ్యాసమయంలో అమ్మను భానుమండలం మధ్యన ధ్యానించాలి అంటోది మంత్రశాస్త్రం.

య ఏషోన్తరాదిత్యే హిరణ్మయహ్ పురుషో దృశ్యత
ఆదిత్యుని మధ్యలో హిరణ్యయుడైన పరమాత్మ చూడబడతాడు.

చేతులయందు పాశము అంకుశము ధనుర్బాణములు ధరించి సూర్యమండల మధ్యవర్తి అయిన ఆ పరమేశ్వరిని అర్చించాలి. 

సూర్యమండలం చంద్రాగ్నుల మిశ్రమరూపము. అందుచేత అది పరబ్రహ్మ స్వరూపము. భానుమండలము అంటే అనాహతమండలము. అనాహతము హృదయస్థానము. 

నాభి స్తుమణి పూరాఖ్యం హృదయం చాబ్జమానాహతం
నాభిస్థానంలో మణిపూర చక్రమున్నది. హృదయస్థానంలో అనాహతపద్మమున్నది. 

పురుషసూక్తంలో 

పద్మకోశ ప్రతీకాశగ్o హృదయం చా ప్యథోముఖం
కంఠానికి క్రింద భాగంలో నాభికి పైన 12 అంగుళాల ప్రమాణంలో అధోముఖంగా ఒక పద్మమున్నది

అథో నిష్ట్యా వితస్యాంతే నాభ్యా ముపరి తిష్ఠతి
జ్వాలామాలాకులం భాతి విశ్వస్యా యతనం మహత్
సంతతగ్o శిలాభి స్తు లంబ త్యాకోశ సన్నిభం
తస్యాంతే సుషిరగ్o సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితమ్
తస్య మధ్యే మహా నగ్ని ర్విశ్వార్చి ర్విశ్వతోముఖః
సో గ్రభు గ్విభజం తిష్ఠ న్నాహార మజరః కవిహ్ 
తిర్య గూర్ధ్వ మాధశ్శాయీ రశ్మయస్తస్య సన్తతా

ఆ హృదయకమలాన్ని ఆశ్రయించి జ్వాలామాలాగా వెలుగొందుతూ, జీవులకు ప్రధానస్థానమై అనేక నాడీసమూహాలకు ఆలంబనమై, హృదయాగ్రభాగంలో సూక్ష్మమైన కమలం ఒకటి ఉన్నది. దానిలోనే సర్వమూ ప్రతిష్ఠితమై ఉన్నది. దాని మధ్యన అంతటాజ్వాలలు వ్యాపించు గొప్ప అగ్ని దేవుడున్నాడు. అదే జఠరాగ్ని. 

సన్తాపయతి స్వందేహా మాపాదతాలమస్తకః
తస్మ్య మధ్యే వహ్ని శిఖా ఆణియోర్ధ్వా వ్యవస్థితః

భుజించినటువంటి ఆహారాన్ని ఆ జఠరాగ్ని సమభాగాలుగా విభజించి శరీరంలోని అన్ని ప్రాంతాలకు పంపుతుంది. ఇక్కడ ధ్యానం చేసే యోగులు మహాతేజా వంతులవుతున్నారు. 

నీలతోయద మధ్యస్థా ద్విద్యుల్లేఖేవ భాస్వరా
నీవారా శూకవత్తన్వీ పీతా భాస్వత్యణూపమా

ఈ జఠరాగ్ని నడుమ సూక్ష్మమైన అగ్నిశిఖ పైకి ఎగుస్తూ ఉంటుంది. అది నీలమేఘము మధ్యన మెరుపు వలే ప్రకాశిస్తుంది. ధాన్యపుగింజ ములికివలె సూక్ష్మమై పచ్చని వన్నె కలిగిఉంటుంది. 

తస్యా శ్శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః
సబ్రహ్మా సశివ స్సహరిశ్చేంద్రహ్ సో క్షరఃపరమస్వరాట్  

ఆ అగ్నిశిఖమధ్యన పరమాత్మ ఉంటాడు. అతడే బ్రహ్మ, అతడే శివుడు, అతడే విష్ణువు, అతడే ఇంద్రుడు. నాశనము లేని వాడు. స్వయంప్రకాశము కలవాడు. భానుమండలము అంటే అనాహతము. అదే హృదయస్థానము. అక్కడ ఆ పరమేశ్వరి ఉంటుంది. కాబట్టే భానుమండల మధ్యస్థా అనబడింది. 

268-269 - Samharini rudrarupa

268.Samharini - Destruction is the job of Rudra who is majorly of Tamo guna. Divine mother gives the power of destruction to Rudra.

269.Rudrarupa - Rudam dravayateeti rudrah - Rud means Sorrow or reason for sorrow. Rudra is He who removes rud. Rudra amongst trimurthies is the one mainly with tamo guna. Divine mother dissolves the world in the form of 'Rudra'. Sage Yagnavalka while describing about Rudras said like this. The 5 gnanendriyas, 5 karmendriyas and the mind, all these 11 leave the body when the being's karma is complete. This way they remove the sorrows of the being and cause sorrow to his kith and kin(while leaving the body). Hence these are attributed by the word 'Rudra'

268.సంహారిణీ - సంహారము తమోగుణ ప్రధానుడైన రుద్రుని పని.రుద్రునికి ఆ శక్తిని ఇచ్చేది అమ్మే.

269. రుద్రరూపా - రుదంద్రావయతీతి రుద్రః. రుద్ - అనగా దుఃఖము లేక దుఃఖకారణము. దుఃఖములను పోగొట్టువాడు రుద్రుడు. త్రిమూర్తులలో తమోగుణ ప్రధానుడు రుద్రుడు. అమ్మ రుద్రుని రూపంలో జగత్తును లయం చేస్తుంది. కాబట్టి రుద్రరూపా అనబడుతోంది. రుద్రులు గురించి వివరిస్తూ యాజ్ఞవల్కుడు  ఇలా అన్నాడు. జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, మనస్సు. ప్రాణియొక్క కర్మ పరిసమాపన మైనప్పుడు వీరు శరీరం నుంచి నిష్క్రమిస్తారు. ఈ రకంగా శరీరం వదిలి బంధువులను రోదింపచేస్తాయి. కాబట్టి ఇవి రుద్రశబ్దం చేత పిలువబడతాయి.

267. Govindarupini

గోవిన్దరూపుడైన విష్ణువే ఈశ్వరుడు. అటువంటి రూపము గాలాడవటంచేత గోవిందా రూపిణీ అనబడుతుంది. గోవిందుడు అంటే - గవాధ్యక్షుడు. బృహస్పతి అని ఉంది. కాబట్టి బృహస్పతి రూపం కలది. 

జగద్రక్షణ సత్వగుణ ప్రధానము. పరమేశ్వరుని మూర్తులలో సత్వగుణప్రధానుడు గోవిందుడు. అటువంటి గోవిందుని రూపంలో జగత్తును రక్షిస్తున్నది. 

గో శబ్దానికి భూమి అని అర్ధం. హిరాణ్యాక్షుడి బారినుంచి భూమిని రక్షించిన వాడు వరాహరూపంలో ఉన్న గోవిందుడు. అది అమ్మ రూపమే కనుక గోవిన్దరూపిణీ. 

వాక్కుచేతగాని వేదాంతవాక్కులచేతగాని పొందదగినడవటంచేత అమ్మ గోవిందరూపిణీ అనబడుతుంది. 

Lord Vishnu, the form of Govinda, is called Eshwara. Govinda means the Gavaadhyaksha (lord of the gate). It's Brahaspati. So Divine mother has the form of Brahaspati. 

Protecting the creation is main job of Govinda who is mainly of sattvaguna. Govinda is one of the forms of Parameswara. Divine mother is protecting the creation in the form of such a Govinda. 

The word 'go' means earth. It was Govinda in the form of Varaha who saved the earth from the clutches of Hiranyaksha. Since it is the form of Divine Mother, she is called govindarupini. 

Divine Mother is called Govindarupini because she is attainable by faculty of speech or by the words from vedic hymns. 

266.Gopthri

Gopanam Jagatah Sthithih Gopanam means to protect the universe. That is the job of Eshwara who is mainly of Satva guna. Gopthri means she who is protecting this universe in the form of Eshwara.

Samastha bhootaani paalayan rakshako jagata iti gopthaa
She is the administrator and protector of all the beings
Swamaayayaa Swamaatmaanam Samvrunoteethi gopthri
She becomes hidden in her own Maya

Srividhya is a very well protected sacred secret. It should not be revealed to everybody. One should tell it to only an able disciple. Divine mother is the heart of Srividhya. Hence, she is called Gopthri

గోపనం జగతః స్థితిహ్ గోపనము అంటే జగత్తు యొక్క రక్షణ. అది సత్వగుణ ప్రధానుడైన ఈశ్వరుని పని. ఆ పనిని చెయ్యటంచేత అమ్మ  గోప్త్రీ  అనబడుతున్నది. సత్త్వగుణ ప్రధానమై సకల జగత్తును రక్షిస్తున్నది కాబట్టి అమ్మ గోప్త్రీ  అనబడుతున్నది.

సమస్త భూతాని పాలయం రక్షకో జగత ఇతి గోప్తా
సకల భూతజాలమును పాలించి రక్షించునది

స్వమాయయా స్వమాత్మానం సంవృణోతీతి గోప్త్రీ
తన మాయచే తానె మరుగున పడుతున్నది కాబట్టి గోప్త్రీ అనబడుతుంది. 

శ్రీవిద్య చాలా గుప్తమైనది. దానిని ఎవరికీ పడితే ఆరికి చెప్పరాదు. యోగ్యుడైన శిష్యుడికే ఉపదేశించాలి. అమ్మే శ్రీవిద్యకీ హృదయం. అందుకే గోప్త్రీ అనబడుతున్నది. 

254-255 - DhyanaDhyatruDheyarupa DharmadharmaVivarjitha

254.DhyanaDhyathruDhyeyarupa - She who is personification of meditation, the one who meditates and what is being meditated upon.

Meditation plays a very important role in self-improvement. Keeping mind steadfast on God is Meditation. There is an easy technique for it. Take anything that you like the most as a support for your meditation. If you like a pudding, imagine that you are offering it to Mother in your meditation. Imagine that she tasted and offered the remaining to you. Or imagine that you are offering a saree of your favorite color to Mother. Imagine how she looks in that saree.  Anything that you like. Any poem, any scent, Gold, Silver, anything will do. Just imagine you and Mother in your mediation and try to feel her motherhood.

255.DharmadhramaVivarjitha - Dharma is one that takes you close to Moksha by reducing or destroying rebirths. Adharma is the opposite. It drags you backwards and increases the number of rebirths. Dharma/Adharma are decided based our karma. In the previous names, we learnt that Divine Mother does not do karma. So, she is beyond Dharma or Adharma.

254.ధ్యానధ్యాతృధ్యేయరూపా - ధ్యానం, ధ్యానించబడేది, ధ్యానం చేస్తున్నది అన్ని అమ్మే.

స్వీయ అభివృద్ధిలో ధ్యానం చాలా ముఖ్య భూమిక వహిస్తుంది. మనస్సును కదలకుండా భగవంతుని మీద నిలపడమే ధ్యానం. సులభంగా ధ్యానం చేయడానికి ఒక పధ్ధతి ఉంది. మీకు అన్నింటికన్నా ప్రీతిప్రదమైన విషయాన్ని మీ ధ్యానానికి ఆలంబనగా చేసుకోండి. మీకు ఏదైనా ఆహార పదార్థం ఇష్టమైతే అది వండి అమ్మకు ప్రసాదంగా ఇస్తున్నట్లు ఊహించుకోండి. ఆమె కొంత తిని మిగతాది మీకు ఇచ్చినట్లు ఊహించుకోండి. లేదా మీకు నచ్చిన రంగు పట్టుచీర అమ్మకు ఇచ్చినట్లు ఊహించుకోండి. ఆమె ఆ చీర కట్టుకుంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇలా శబ్ద, స్పర్శ, రస, రూప గంధములలో ఏ విషయం మీకు నచ్చుతుందో అదే అమ్మకు మనస్ఫూర్తిగా సమర్పిస్తున్నట్లు ఊహించుకోండి. ఏదైనా ఒక పండు, ఒక శ్లోకం, ఒక అగరత్తు ఏదైనా ఫరవాలేదు. రోజూ ఒక సమయం అని అనుకుని ఆ సమయంలో ఇలా ధ్యానం చేయండి. ఆ ఊహలో అమ్మ ప్రేమానుభూతిని ఆస్వాదించండి. 

255.ధర్మాధర్మవివర్జితా - మోక్షపదంలో ముందుకు తీసుకువెళ్లేది ధర్మం. దీని వలన మనకు జన్మలు తగ్గి లేదా నశించి మోక్షము చెరువవుతుంది. అధర్మము వలన జన్మలు పెరుగుతాయి. మోక్షము ఇంకా దూరమవుతుంది. మనం చేసే కర్మలు బట్టి ధర్మాధర్మములు నిర్ణయించబడతాయి. అమ్మకు కర్మ చేయవలసిన అవసరమే లేదు అని ఇంతకు ముందు వచ్చిన నామాలలో చెప్పుకున్నాం. కర్మే లేనప్పుడు ధర్మం/అధర్మం ఆమెకు ఎలా వర్తిస్తుంది? అందుకే ధర్మాధర్మ వివర్జితా అన్నారు. 

251-253 - Chinmayi...VignanaGhanaRupini

All the knowledge is embedded into vedas in the form of Seeds. When it meets a mind with chaitanya, a sapling called Paramananda(bliss) emerges out of it (A mind with Chaitanya acts as a seed bed for vedic knowledge)

251.Chinmayi - From chit comes chaitanya. This happens only for Humans and apemans (vaanaras). Other species doesn't have chaitanya. Due to this chaitanya, humans are able to rule the world. Divine mother personifies herself as chaitnya and fills this world. Hence she is called Chinmayi. But as said earlier, only humans and apemans can connect to her chaitanya swaroopa.

252.Paramananda - Happiness is of two types. 1) Spiritual, 2) Materialistic. Spiritual happiness is much greater than material pleasures. It is always new. You never feel bored of it. It is the best experience of happiness a human being can have.

253.VignanaGhanaRupini - Knowledge of a particular thing is called 'Gnana'. Having knowledge of all the 64 studies is called 'Vignanaghana'. Divine mother is the personification of all the studies. So she is called Vignana ghana roopini.

Small story:

There were two friends, Ramadas and Somadas. Ramadas was born blind. Somadas was born lame. Ramadas used to carry Somadas on his shoulders. Somadas used to tell him how to go. Both of them lived like this for a long time. One day a saint advised them that with devotion on Lord krishna you can overcome your blindness and lameness. When they asked how, the Sadhu said, "take a bath every morning and pray Lord Krishna wholeheartedly. Your wish will be fulfilled." From then on they started praying Lord Krishna every day. Years passed by, but nothing changed.

One day, Mother Rukmini said to Sri Krishna, "Rama and Soma have been praying to us for many years. Why aren't you helping them. Then Sri Krishna said, "You have been observing them ever since they started praying. I've been watching them even before they started praying. That's why I appeared to them in the guise of a saint. I freed them from all their issues on the very first day of their prayer. But they don't know that. Rama does not try to open his eyes and see. Soma does not stand up and try to walk. I'm looking forward to see that day when they both will become conscious and start trying, and if they need any more help, I will do it again." That is consciousness. That's Chinmayi. It is consciousness that is present in all of us. Freedom is like a breath to it. Where man forgets to think freely and to live independently, there is no room consciousness. Those places will go under the control of demons like Bhandasura.


వేదంలో సమస్త విజ్ఞానము బీజ రూపంలో ఉంటుంది. చైతన్యం కలిగిన మనస్సు ఆ విజ్ఞానానికి క్షేత్రము వంటిది. ఎప్పుడైతే అవి రెండూ కలుస్తాయో (వేదము చైతన్యముతో ఉన్న మనస్సు) పరమానందము అనే అంకురం ఉద్భవిస్తుంది. 

250.చిన్మయి - చిత్ నుండి చైతన్యం పుడుతుంది. ఇది కేవలం నర, వానరులకు మాత్రమే ఉంటుంది. మిగతా జీవ రాశులకు చైతన్యం ఉండదు. నరులు ప్రపంచంపై ఆధిపత్యం సాధించటానికి ఈ చైతన్యమే కారణం. చైతన్యరూపంలో ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉంటుంది కనుక అమ్మను చిన్మయి అన్నారు. అయితే, కేవలం నరవానరులు మాత్రమే ఆ చైతన్య స్వరూపాన్ని కనుగొనగలరు.

251.పరమానందా - ఆనందము రెండు రకాలు. 1) ఇహము 2) పరము. పరమానందం ఐహికానందం కన్నా చాలా గొప్పది. అదే ఆత్మానందం. అదే అమ్మ స్వరూపం. అది ఎల్లప్పుడూ కొత్తగానూ, ఆహ్లాదంగానూ ఉంటుంది.

252.విజ్ఞానఘనరూపిణీ - ఏదైనా ఓక విషయం గురించి కలిగేది జ్ఞానం. మొత్తం 64 కళల పట్లా సంపూర్ణమైన జ్ఞానం సంపాదించినట్లయితే ఆ పాండిత్యాన్ని విజ్ఞానఘనమని అంటారు. అన్ని కళలు అమ్మనుండి వచ్చినవే. అందుకే ఆమెని విజ్ఞానఘనరూపిణి అన్నారు.

ఒక చిన్న కథ:
రామదాసు, సోమదాసు అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు. రామదాసు పుట్టుకతో గుడ్డివాడు. సోమదాసు పుట్టుకతో కుంటివాడు. రామదాసు సోమదాసును తన భుజాలపైన ఎక్కించుకుని తిప్పేవాడు. సోమదాసు వాడికి ఎలా వెళ్ళాలో చెప్పేవాడు. వారిద్దరూ చాలాకాలంగా ఇలా ఉంటున్నారు. ఒక రోజు ఒక సాధువు వారి దగ్గరకు వచ్చి, కృష్ణ భక్తితో మీరు మీ అవిటితనాన్ని రూపు మాపుకోవచ్చు అని చెప్తాడు. వారు అది ఎలా స్వామీ అని అడుగగా, రోజూ ఉదయం స్నానం చేసి, మీరిద్దరూ మనసులో కృష్ణుడిని తలచుకొని తండ్రీ నా అవిటితనాన్ని రూపుమాపు అని ఆర్తితో అడగండి. మీ కోరిక నెరవేరుతుంది. అని అన్నాడు. వారు అలానే చేయసాగారు. ఏళ్ళు గడిచినా వారికి ఎం మార్పు తెలియలేదు.

ఒకరోజు అమ్మ రుక్మిణీ శ్రీకృష్ణుల వారితో, "ఆ రాముడు సోముడు చాలా ఏళ్లగా మనల్ని ప్రార్థిస్తున్నారు. వారికి సాయం ఎందుకు చేయలేదు అని ప్రశ్నించింది (అమ్మ ప్రేమ కదా). అప్పుడు శ్రీకృష్ణుడు, "నువ్వు వాళ్ళు ప్రార్ధన మొదలు పెట్టినప్పటినుండి వాళ్ళని గమనిస్తున్నావు. నేను అంతకుముందునుంచే చాలా కాలంగా వారిని గమనిస్తున్నాను. అందుకే సాధువు వేషంలో వారికి కనిపించి సలహా ఇచ్చాను. వారు ప్రార్ధించిన మొదటిరోజే వారికి అవిటితనం నుండి విముక్తి కల్పించాను. కానీ వారు దానిని తెలుసుకోవడంలేదు. రాముడు కళ్ళు తెరిచి చూడడానికి ప్రయత్నించడు. సోముడు లేచి నించుని నడవడు. ఏనాటికైనా వాళ్లలో చైతన్యం కలిగి వాళ్ళు ప్రయత్నం మొదలుపెడతారేమో, అప్పుడు వాళ్లకి ఇంకా ఏమైనా సహాయం కావాలంటే మళ్ళీ చేద్దాం అని నేను ఎదురుచూస్తున్నాను అన్నాడు". అదే చైతన్యం. ఆదే చిన్మయి. అది చైతన్యం మనందరిలోనూ ఉంది. స్వతంత్రం దానికి ఊపిరివంటిది. ఎప్పుడైతే మనషి స్వతంత్రంగా ఆలోచించడం మరిచిపోతాడో, స్వతంత్రంగా బ్రతకడం మరిచిపోతాడో అక్కడ చైతన్యం ఉండదు. ఆ ప్రదేశాలు భండాసురుని వంటి రాక్షసుల ఆధీనంలోకి వెళ్లిపోతాయి.

249-250. Panchaprethasanasina Panchabrahmaswarupini

249.Panchaprethasanasina - Divine mother's throne is supported by lifeless bodies of Brahma, Vishnu, Rudra, Eesa and Sadasiva. This means without Shakthi, there is no stimulus to these great devatas. To understand easily we can draw an analogy of Shiva and Shakti with word and the meaning. Without meaning, the word is pointless, without word, meaning cannot exist. Such is the relation between Shiva and Shakti.

In software engineering, we have OOPS concept. We have classes and objects in it. A class is like Shiva and an object is like Shakti.

249.పంచప్రేతాసనాసీనా - బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, మహేశ్వరుడు, సదాశివుడు అమ్మ సింహాసనానికి కోళ్ళుగా నిర్జీవంగా ఉన్నారు అని ఈ నామానికి అర్ధం. అంటే శక్తి లేకపోతే ఎంతవారైనా చలనంలేక స్థాణువులులా పడివుంటారు అని అర్థం. తేలికగా ఒక  ఉదాహరణతో చెప్పాలి అంటే శివ శక్తుల సంబంధం పదం - భావం మధ్య సంబంధంలాంటిది. భావం లేకపోతే పాదమున్నా దాని ఉనికి మనకి తెలియదు. అలాగే పదం లేనిచో భావనయొక్క ప్రస్తావనే రాదు. అసలు పదాన్ని దాని భావాన్ని విడివిడిగా ఊహించుకోవడమే కుదరదు. అలాగే శివశక్తులు కూడా.

software engineering లో OOPS అని ఒక పధ్ధతి ఉంటుంది. అందులో class - object అని రెండు ఉంటాయి. class శివం అయితే object శక్తి. 

250.Panchabrahmaswarupini - 'Para Brahman' is the truth and knowledge. He is pure and eternal. But still, with his Shakti, he personified as Brahma, Vishnu, Rudra, Eswara, Sadasiva. Divine mother is the shakti behind these five. Hence, she is called Pancha Brahma Swaroopini

250.పంచబ్రహ్మస్వరూపిణీ - సత్యము, జ్ఞానము అయినవాడు, వికార రహితుడు, పరిశుద్ధుడు అయిన వాడు ఆ పరబ్రహ్మ ఒక్కడే. అయినప్పటికీ ఆయన తన శక్తితో 5 స్వరూపాలుగా ఉన్నాడు అని చెప్పబడింది. వారే బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు, సదాశివుడు. వీరి స్వరూపమే మన అమ్మ. అందుకే పంచ బ్రహ్మ స్వరూపిణీ అని అన్నారు.

244-245.CharacharaJagannatha CharkraRajaNiketana

244.CharacharaJagannatha - 'Jaayate gachate iti jagat' - Jagat is the one that comes and goes. Chara indicates elements that have movement. Achara indicates elements that are stationary. This jagat is filled with Chara and Achara. Examples of Chara are - animals, birds, humans, rivers, oceans etc. Examples of achara are mountains, trees, deserts etc. 'Natha' means master. So she is called Charachara Jagannatha.

244.చరాచరజగన్నాథ - 'జాయతే గచ్ఛతే ఇతి జగత్'. వస్తూ పోతూ ఉంటుంది ఈ జగత్తు. ఇది చరాచరములతో నిండి ఉన్నది. చరములు అంటే కదిలేవి. అనగా పశువులు, నదులు, సముద్రాలు మొదలైనవి. అచరములు అంటే కదలనివి. అనగా చెట్లు, కొండలు మొదలైనవి. వీటన్నింటికీ అధీశ్వరీ మన అమ్మ. అందుకే చరాచరజగన్నాథ అని అన్నారు. 

245.ChakraRajaNikethana - Sri chakra has 9 stages. The 9th stage of Sri chakra is called 'Bindu'(Dot). Shiva and Shakti are in this bindu. Hence Divine mother is called 'Chakra raja niketana'. Srichakra is the king of all yantras. It is the Yantric form of the whole creation. Hence Shiva and Shakti are in the its Bindu(center dot).

245.చక్రరాజనికేతనా - శ్రీచక్రంలో 9 ఆవరణలు ఉంటాయి. అందులో 9వ ఆవరణ బిందు స్థానం. అందులో శివశక్తుల ఉంటారు. అందుకే ఆమ్మను చక్రరాజనికేతన అన్నారు. యంత్రములన్నిటిలోనూ రాజైనటువంటిది శ్రీచక్రం. అందుకే దీనిని చక్రరాజం అన్నారు. శ్రీచక్రమంటే ఈ చరాచర జగత్తు యొక్క యాంత్రిక రూపం. అందుకే శివశక్తుల దాని బిందు స్థానంలో ఉంటారు. 

241-243. Charurupa...charuchandrakaladhara

241.Charurupa - She who is very beautiful

242.Charuhasa - She who has a beautiful smile. In the names 241 and 242, we have to understand that Divine Mother attracts all her children towards her. Humans, birds, animals etc are all being attracted towards her.

243.Charuchandrakaladhara - The moons glow is said to be of 15 varieties. He exhibits one each day from paadyami to full moon/new moon. Of all these, the glow on ashtami or 8th day is a bit special. It is same in both waxing and waning phases. All these glows came from Divine mothers Nityakala (Eternal glow). This is the 16th. To denote her eternal glow, Divine mother wears a crescent moon on her crown. This moon never changes.

241.చారురూపా - అందమైన రూప లావణ్యము కలది

242.చారుహాసా - మనోహరమైన మందహాసము కలది. 241, 242 నామాలలో మనం గమనించ వలసినదేమిటంటే అమ్మ తన బిడ్డలనందరిని తనవైపు ఆకర్షిస్తూ ఉంటుంది. మనుషులు, పక్షులు, జంతువులూ మొదలైనవన్నీ ఆమెచే ఆకర్షించ బడతాయి.

243.చారుచంద్రకలాధరా - చంద్రునికి 15 కళలు ఉంటాయి. పాడ్యమి నుంచి పౌర్ణమి/అమావాస్య దాకా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కళ ప్రదర్శిస్తాడు చంద్రుడు. ఇందులో అష్టమి నాటి కళకు ఒక ప్రత్యేకత ఉంది. అది శుక్ల పక్షంలోను కృష్ణ పక్షంలోను కూడా ఒకేలాగా ఉంటుంది. ఈ చంద్రకళలు చూడటానికి ఏంతో ఆహ్లాదకరంగా ఉంటాయి. ఇవన్నీ అమ్మనుండే వచ్చ్చాయి. ఆవిడది నిత్యకళ. అది 16వ కళ. దానిని సూచించడానికి అమ్మ తన కిరీటానికి వృద్ధిక్షయాలు లేని నెలవంకను  తగిలించుకుంటుంది.

Popular