Search This Blog

226-229.Mahamantra...Mahasana

226.Mahatantra
The procedure we follow from the beginning till the end of a sacred karma(puja or yagnya) is called 'Tantra'. This Tantra shastra is written by sage Aapastambha and others. Divine mother is the main deity of all these tantras. Hence she is called mahatantra

227.Mahamantra
From Divine mother came 'OM'. from 'OM' came the 50 alphabets of Sanskrit language. These are called 'beejaksharas'. Each beejakshara has a unique power in it. When these beejaksharas are arranged sequentially according to their effect, it is called 'Mantra'. Gurus teach a suitable mantra based on the need of the person practicing it. Because all the mantras came from Divine mother, she is called Mahamantra.

228.Mahayantra
Yantras are of 3 types. 1) Bhuprastaramu, 2) Meruprastaramu, 3) Kailasa prastaramu. Of all yantras, 1)Sri Chakra, 2) Rudra yantra, 3)Vana durga yantra are believed to be the greatest. Yantras are forms given to mantras. If Divine mother is the origin of all mantras, then she is the origin for all the yantras and tantras as well.

229.Mahasana
'Mahasana' means one that has very great throne. The great Srichakra is Divine mother's throne. Hence she is called 'mahasana'

226.మహాతంత్రా
ఏదైనా ఒక క్రతువు (పూజ, వ్రతం, యజ్ఞము మొ..) చేయడానికి ప్రారంభించినప్పుడు సంకల్పం నుంచి సమాప్తి వరకు జరిగే క్రియాకలాపమంతా తంత్రమే. వేదాలలో చెప్పబడిన యజ్ఞయాగాదుల నిర్వహణ కూడా తంత్రమే. ఈ శాస్త్రాన్ని ఆపస్తంభుడు మొదలైన వారు వ్రాశారు. ఈ రకంగా ఉన్న అనేకమైన తంత్రాలకు అధిష్టాత్రి మన అమ్మ. అందుకే ఆమెను మహాతంత్ర అని అన్నారు. 

227.మహామంత్రా
అమ్మ నుండే ఓంకారము వచ్చింది. దానినుండి సంస్కృత భాషలోని 50 అక్షరాలు వచ్చాయి. ఇవే బీజాక్షరాలు. ఒక్కొక్క బీజాక్షరానికి ఒక్కో రకమైన శక్తి ఉంటుంది. ఆ శక్తి ఆధారంగా బీజాక్షరాలను సంపుటీకరణ చేస్తే అవి మంత్రాలు అవుతాయి. సాధకుని అవసరాన్ని బట్టి మంత్రోపదేశం చేస్తారు గురువులు. అన్ని మంత్రాలూ ఆమెనుండే వచ్చాయి కనుక అమ్మను మహామంత్ర అన్నారు.

228.మహాయంత్రా
యంత్రాలు మూడు రకాలు. 1) భూప్రసారము, 2) మేరుప్రస్తారము, 3) కైలాస ప్రస్తారము. అయితే యంత్రాలలో శ్రీచక్రము, రుద్రయంత్రము, వనదుర్గాయంత్రము మహాయంత్రాలనబడతాయి. యంత్రాలు మంత్రాల యొక్క రూపాలు. హేతుబద్ధంగా ఆలోచిస్తే సర్వమంత్రరూపిణి అయిన అమ్మ సర్వయంత్రరూపిణి, సర్వతంత్రరూపిణి కూడా అవుతుంది.

229.మహాసనా
శ్రీచక్రాన్ని ఆశ్రయించి ఉన్నది కాబట్టి మహాసనా అని అన్నారు. అంటే ఏంతో గొప్పదైన ఆసనం కలది అని అర్ధం.

223-225.Mahabuddhih...Mahayogeshwareswari

223.Mahabhudhih
Our intellect(buddhi) is driven by karma. Those who seek self realization pray Divine mother to find out the path towards it. Then she diverts buddhi towards Atma. From then onwards, their buddhi will be driven by Atma and not karma. Because she diverts the seekers buddhi towards Atma, she is called Mahabuddhi.

224.Mahasidhih
Siddhi are of two types. 1) Kaarya Siddhi, 2) Deva Siddhis. The super set of all kaarya and deva siddhis is Maha siddhi. Divine mother gives all siddhis to those who pray her with devotion. 

    Deva siddhis - 
        
        1.Anima - To be able to reduce the size of the body to infinitesmal
        2.Mahima - To be able to increase the size of the body to infinitesmal
        3.Garima - To be able to increase the weight of the body to required level
        4.Laghima - To be able to reduce the weight of the body and become very light
        5.Praapti - To be able to possess anything
        6.Prakamyamu - To be able to navigate in the sky
        7.Eeshwatamu - To be able to show authority on everything
        8.Vashitvamu - To be able to hypnotize and control

    Kaarya siddhis - 

        1.Vidya - Having knowledge and wisdom
        2.Dhana - Having enough money
        3.Dhaanya - Having enough food
        4.Oushadha - Being healthy
        5.Rasamu - Being happy, contended.

225.Mahayogeshwareshwari
Yoga means union of soul with God. Yoga is of three types:
1. Bhakti yoga - Seeing God in everybody and not differentiating between self and others is called bhakti yoga.
2. Karma yoga - Performing yagna, yaga and pooja without any interest on the result is Karma yoga
3. Gnana yoga - Being aware that God is the only truth and rest all is Maya(illusion), having mind deserted of all wants and meditating upon God is Gnana yoga. This is very tough.

A yogeeshwara is one who mastered one of these yogas. Divine mother is the master of all the yogeeshwaras. Hence she is Maha yogeshwareshwari

223.మహాబద్ధిహ్
బుద్ధి కర్మానుసారిణి అని అంటారు. అంటే కర్మ వలన బుద్ధి ప్రేరేపింపబడుతుంది. అయితే యోగులు, మోక్ష కాముకులు అమ్మను ప్రార్ధిస్తే ఆవిడ వారి బుద్ధిని ఆత్మచే ప్రేరేపింపజేస్తుంది. అప్పుడు వారికి మోక్ష మార్గం గోచరిస్తుంది. బుద్ధిని కర్మనుండి ఆత్మ వైపు మళ్ళిస్తుంది కనుక ఆవిడ మహా బుద్ధి. 

224.మహాసిద్ధిహ్
సిద్ధులు రెండు రకాలు. 1) కార్య సిద్ధులు, 2) దైవ సిద్ధులు. ఈ కార్య సిద్ధులు, దైవ సిద్ధులు రెండు కలిస్తే మహా సిద్ధి అవుతుంది. అమ్మను భక్తితో కొలిచిన వారికి సర్వ సిద్ధులు లభిస్తాయి.

సిద్ధులు రెండు రకాలు. 1) కార్య సిద్ధులు, 2) దైవ సిద్ధులు. ఈ కార్య సిద్ధులు, దైవ సిద్ధులు రెండు కలిస్తే మహా సిద్ధి అవుతుంది. అమ్మను భక్తితో కొలిచిన వారికి సర్వ సిద్ధులు లభిస్తాయి. 

దైవ సిద్ధులు -
1.అణిమ - శరీరమును అతి చిన్నదిగా చేయగలుగుట 
2.మహిమ - శరీరమును అతి పెద్దదిగా చేయగలుగుట
3.గరిమ - శరీరము బరువు విపరీతంగా పెంచ గలుగుట 
4.లఘిమ - శరీరమును అతి తేలికగా చేయగలుగుట
5.ప్రాప్తి - కావలిసిన వస్తువులను పొందగలుగుట
6.ప్రాకామ్యము - ఆకాశ సంచారము చేయగలుగుట
7.ఈశ్వతము - సమస్థానికి ఆధిపత్యము పొందుట 
8.వశిత్వము - సమస్త భూతములను వశపరచుకోగలుగుట 
కార్య సిద్ధిలు - 
1.విద్య - చదువు, జ్ఞానము, తెలివితేటలు కలిగి ఉండుట 
2.ధన - కావలసినంత ధనము కలిగి ఉండుట. 
3.ధాన్య - తగినంత ఆహారము సేవించ గలుగుట 
4.ఔషధ - ఆరోగ్యము కలిగి ఉండుట 
5.రసము - సంతృప్తి, సంతోషము కలిగి ఉండుట

225.మహాయోగీశ్వరేశ్వరీ
యోగము అంటే జీవాత్మ, పరమాత్మల కలయిక. యోగము 3 రకాలు.
1. భక్తి యోగము - అందరిలోనూ ఈశ్వరుడున్నాడని భవిస్తూ, తన - పర అను భేదము లేకుండా నిత్యం భగవధ్యానంలో ఉండటం భక్తి యోగము.
2. కర్మ యోగము - ఫలాపేక్ష లేకుండా యజ్ఞ యాగాది క్రతువులు జరపడం, నిత్యా నైమిత్తిక కర్మలు చేయడం కర్మ యోగము.
3. జ్ఞానం యోగము - బ్రహ్మ సత్యం జగన్మిధ్యా అని ఎరుకలో ఉంటూ కోరికలు లేనివాడై, పరమాత్మనే ధ్యానించుట జ్ఞాన యోగం. ఇది దుర్లభం.

ఈ యోగాలలో నిష్ణాతులను యోగీశ్వరులంటారు. అటువంటి యోగీశ్వరులకు ఈశ్వరి కాబట్టి మహా యోగీశ్వరీస్వరి.

219-222.Mahabhoga...Mahabala

219.Mahabhoga
'Bhoga' means a great pleasure. The bliss of self realization is the greatest of all pleasures. Hence is it called 'Maha bhoga'. A yogi who has tasted this ultimate happiness will stop yearning for material/carnal pleasures.

220.Mahaishwarya
Aishwayra means having wealth and Gods grace. Divine mother gives us both. Having servants, children, friends, relatives, vehicles, money and food are various forms of aishwarya. This is material in nature. Having devotion, respect to elders, inclination towards dharma and focus on moksha are called aamushmikamu. These lead to Moksha. That is Maha aishwarya.

221.Mahaveerya
To overcome maya (ego) means to overcome oneself. It requires great valor to overcome oneself.  We create an opinion on ourselves. Like I'm a human. A man or a woman with a particular name and status. My social reflection is like this and I have these friends and these enemies. We assign a character to ourselves and feel that it is our identify. To experience the bliss of atman, one has to raise above this. One has to shun this identity, character and ego to reach the super conscious state of Brahman. The ego has to be destroyed completely and that requires great valor, i,e MahaVeerya.

222.Mahabala
She who is very strong. She is invincible.

219.మహాభోగా
భోగము అంటే గొప్పదైన సుఖము  అర్ధం. ఆత్మానందం చాల గొప్పది. అన్ని సుఖాలకన్నా శ్రేష్టమైనది. అందుకే మహాభోగా అన్నారు. అంతగొప్ప సుఖాన్ని రుచిచూసిన యోగి ఇక ఐహికమైన సుఖాలకోసం వెంపర్లాడటం మానేస్తాడు. 
220.మహైశ్వర్యా
ఐశ్వర్యము అంటే ఈశ్వతము, సంపద. అమ్మ రెండింటిని ఇస్తుంది. అష్ట ఐశ్వర్యములతో తూగడము అంటే దాసీజనులు, సేవకులు, పుత్రులు,  మిత్రులు, బంధువులు,  వాహనములు, ధనము, ధాన్యము కలిగి ఉండుట. ఇది ఐహికాము. భగవంతునిపై  భక్తి కలిగి ఉండుట, పెద్దలపై గౌరవము కలిగి ఉండుట, ధర్మము పట్ల ఆసక్తి కలిగి ఉండుట, మోక్షముపై దృష్టి కలిగి ఉండుట ఆముష్మికము. ఇది మోక్ష సిద్ధిని కలుగజేస్తుంది. అదే మహైశ్వర్యము. 
221.మహావీర్యా
తనను తాను అధికమించాలి అంటే వీరత్వం ఉండాలి. మాయను ఛేదించడం అంటే తనను తాను అధికమించడమే. నేను ఒక మనిషిని, స్త్రీ లేక పురుషుడిని. నాకు ఫలానా పేరు, ఊరు, కులం, గోత్రం ఉన్నాయి. సంఘంలో నాకు ఒకవిధమైన గుర్తింపు ఉంది. ఫలానా వారు నావారు. ఫలానా వారు నా ప్రత్యర్దులు. ఇలా మనగురించి మనం ఒక అభిప్రాయము, అవగాహన ఏర్పరుచుకుంటాం. ఇదే మాయ, అహంకారం. దీనిని దాటి అంతాటా భగవంతుడే ఉన్నాడు. బ్రహ్మ సత్యం జగన్మిధ్య అనే స్థాయికి వెళ్ళాలి అంటే గొప్ప వీరత్వం ఉండాలి. తన అహంకారం పూర్తిగా నశించి పోయిన తరువాతే ఆత్మ దర్శనం అవుతుంది. అందుకు మనకు దోహద పడుతుంది కాబట్టి మహా వీర్య అన్నారు. 
222.మహాబలా
ఏంతో గొప్ప బలము కలిగి ఉన్నది.

215-218.Mahamaya...Maharathih

215.Mahamaya
'Maya' means thoughts of 'I' and 'Mine'. Thinking that I exist as a separate entity and there are a few entities that belong to me is illusion. There is only one entity - Om tat sat' is truth (going beyond illusion). 

All living things are bound by Maya. Of those only humans can realize the truth and go beyond Maya. But that is not so easy. Maya bounds even the greatest of the great and makes their lives a misery.

216.Mahasattva
Of all the three gunas, Sattva take you closest to God. It helps in reaching the state of nirguna (without any character). Mahasatva indicates that our divine mother is 'Nirguna'

217.Mahasakthih
Shakti is the one that causes stimulus. Divine mother is 'Maha shakti'. She gives stimulus to the otherwise inert Shiva. In soundarya lahari, Sri Sankara said, 'Shivah shaktyayukto yadi bhavati shaktah prabhavitum, nache devam devo na khalu kushalah spanditumapi'. That means, Divine mother is the shakti behind the stimulus caused in 'Shiva'. Without her, Shiva will be inert/motionless.

218.Maharathih
'Bha' means self-luminous light. It represents the Atman. 'rathi' means proclivity, inclination. Because we find so many people who have inclination to find and enjoy the bliss of the Atman, this land is called 'Bha'+'Rath' = Bharat. This proclivity is very strong. It does not go even after taking hundreds of thousands of rebirths. Hence it is termed as 'Maha rathi'

215.మహామాయా
నేను ఉన్నాను. నావి అని కొన్ని ఉన్నాయి అనే భావనయే మాయ. అంతటా భగవంతుడే ఉన్నాడు. నేను వేరు భగవంతుడు వేరు కాదు. ఉన్నది ఒక్కటే (ఓం తత్ సత్) అన్న భావన నిజము(మాయ లేకుండుట). 

ఈ జగత్తులోని ప్రాణులన్నీ మాయకు గురయివుంటాయి. వాటిలో కేవలం మనుషులు మాత్రమే మాయను దాటి నిజాన్ని(భగవంతుడిని) చేరుకోగలరు. కానీ అది అంత సులభం కాదు. ఎంతో గొప్ప గొప్ప వారు కూడా ఈ మహామాయకు గురయ్యి నానా బాధలు పడుతుంటారు.

216.మహాసత్వా
త్రిగుణాలలో సత్వ గుణము భగవంతునికి అతిచేరువైనది. ఇది గుణాతీతమైన స్థితికి చేరడానికి తొడ్పడుతుంది. సాధకుడు ఆ స్థితికి చేరుకున్న పిదప అది దానంతట అదే నశించిపోతుంది. మహాసత్త్వ అంటే అటువంటి గుణాతీతమైన స్థితి. అదే అమ్మ.

217.మహాశక్తిహ్
చలనం కలిగించేది శక్తి. అమ్మ మహా శక్తి స్వరూపిణి. చలనం లేకుండా స్థాణువులా ఉన్న శివుడిలో ఆవిడే స్పందన కలిగిస్తుంది. సౌందర్య లహరి లో శంకరులు ఇలా అన్నారు 'శివఃశక్త్యాయుక్తో యాదిభావతి శక్తః ప్రభవితుం నాచే దేవందేవో న ఖలుకుశలః స్పందితుమపి ' - అంటే శక్తి లేకపోతే శివుడు స్పందన కూడా కోల్పోతాడు అని అర్ధం.

218.మహారతిహ్
'రతి' అంటే ప్రీతి, కోరిక అని అర్ధం. 'భా' అంటే స్వయంప్రకాశమైన వెలుగు అని అర్ధం. 'భా' మనలోని ఆత్మను సూచిస్తుంది. అటువంటి వెలుగుని కనుగొనటంపై ప్రీతి కలిగినవారు ఎక్కువగా ఉండటం వలన ఈ భూమికి భారతి అని పేరు వచ్చింది. ఆత్మానందంపై కోరిక అత్యంత బలవత్తరమైనది. ఎన్ని జన్మలు ఎత్తిన, ఎన్ని కర్మలు చేసినా అది పోదు. అందుకే 'మహారతి' అన్నారు.

212-214.maharupa...paathakanashini

212.Maharupa
'Rupa' means form. Everything in this universe has a name and form attributed to it. There is just abstract form in the beginning. From that came the Mahat. From it came the 'Ahankar'. Then came the universe with name and form. All these are forms of divine mother. Hence, she is called 'Maharupa'

213.Mahapujya
Great people like Brahma, Indra, Upendra did pujas for divine mother. Hence, she is called Mahapujya.

214.Mahapathakanasini
'Pataka' means sin. Mahapataka means dangerous/great sin. Sins are classified into 'Pancha maha patakas', 'Upa patakas', 'Sankalikaranas', 'Apatri karanas'. The process of penance for each of these is also described. One has to do puja to several devatas as part of this penance. Alternatively, one can do puja to Divine mother as penance. Those who meditate upon Divine Mother and experience her bliss are rid of all the sins.

212.మహారూపా
అమ్మ గొప్పదైనటువంటి, శ్రేష్ఠమైనటువంటి రూపం కలది. ఈ జగత్తు అంతా నామరూపాలతో ఉంటుంది. మొట్టమొదట అవ్యక్త రూపం ఉండేది. దాని నుండి మహత్ వచ్చింది. దాని నుండి అహంకారము వచ్చింది. ఆ తరువాత నామరూపాత్మకమైన ఈ జగత్తు వచ్చింది. ఇది అంతా అమ్మ స్వరూపమే. అందుకే మహారూప అన్నారు. 

213.మహాపూజ్యా
బ్రహ్మ, ఇంద్రుడు, ఉపేంద్రుడు మొదలగు వారిచే పూజించబడింది మన అమ్మ. అందుకే మహా పూజ్యా అన్నారు. 

214.మహాపాతకనాశినీ
పాతకం అంటే పాపం. మహా పాతకమంటే ఘోరమైన పాపం. పంచ మహా పతకాలు, ఉప పాతకాలు, సంకలీకరణములు, అపాత్రీకరణములు ఇలా పాపాలు ఎన్నో రకాలు. శాస్త్రంలో వీటన్నిటికీ ప్రాయశ్చిత్తం తెలుపబడింది. వాటినే శాంతికర్మలు అంటారు. త్రికరణశుద్ధితో క్షమాపణ చెప్పి అమ్మను పూజించి, ఆమె దివ్య దర్శనం పొందినవారి పాపమంతా జ్ఞానాగ్నిలో  దగ్ధమైపోతుంది. 

207.Manonmani

A practitioner while doing Pranaayama, the faculties of mind are available only till the stage of Sumana. It is beyond the mind's reach after that. That is Unmana. Here there is no time, no dream, no logic, no devata. The notion of Dhyana, Dhaatru and Dhyeya is also dissolved. That is absolute freedom.

After awakening kundalini, it progresses upwards through Brahma, Vishnu and Rudra knots. From there it passes through 9 sookshma knots. 8th of these is 'Sumana'. After crossing Sumana, the mind dissolves. There are no thoughts. This state is called 'Unmana'. A yogi will see parameswara(only) in this state.

సాధకుడు ప్రాణాయామం చేసినప్పుడు సుమన చేరే వరకు మనస్సు పనిచేస్తుంది. ఆ తరువాత మనస్సుకూడా పని చేయని స్థితి వస్తుంది. అదే ఉన్మన. అక్కడ కాలములేదు కలా లేదు. తత్వము లేదు, దేవత లేదు. అక్కడ ధ్యాన, ధాత్రు, ధ్యేయ భావాలు నశిస్తాయి. అక్కడ ఉండేది పరిపూర్ణ స్వాతంత్య్రము 

కుండలిని శక్తిని జాగృతం చేసి, ఊర్ధ్వముఖంగా ప్రయాణింపజేయాలి. అప్పుడది గ్రంధి త్రయాన్ని భేదించి, అక్కడినుండి సూక్ష్మ చక్రాల ద్వారా ప్రయాణం చేస్తుంది. ఇక్కడ 9 సూక్ష్మ చక్రాలు ఉంటాయి. వీటిలో 8వది 'సుమన'. కుండలిని దీన్ని దాటిన తరువాత సాధకుడు ఉన్మన స్థితికి వెళ్తాడు. అప్పుడు మనస్సు పనిచేయదు. సంకల్ప వికల్పాలు ఉండవు. ఆ స్థితిలో పరమేశ్వర స్వరూపమొక్కటే గోచరిస్తుంది.

204-206. Sarvamantraswarupini - Sarvatantrarupa

204.Sarvamantraswarupini
There are 7 crore mantras. The are divided into 1. Purvamnaya, 2. Dakshinamnaya, 3. Paschimamnaya, 4. Uttaramnaya, 5. Oordhvamnaya, 6. Anuttaramnaya. Each mantra has a Rishi, Chandas, Devata, Beeja, Shakti and Keelakam. These are called Shadangas. On top of these each mantra can be described in 4 planes. They are 1.Tattva, 2.Artha, 3.Roopa, 4.Shabda. Divine mother is personification of all these mantras. Hence she is called Sarvamantra swaroopini.

205.Sarvayantrathmika
There are 3 types of Yantras. 1.Pooja yantras, 2.Pratishta yantras, 3.Dharana yantras. Each devata will have a yantra. But all these yantras are personified by Divine Mother. So, she is called Sarva yantratmika.

206.Sarvatantrarupa
Trantra means the sequence of actions to be done from the moment of taking Sankalpa (determination) till the end of the occasion(program). We do these to please devatas and satisfy our wants. There are total 64 tantras to help us satisfy our wants. The 65th one is Srividya tantra. This helps us to attain moksha. These tantras form the body of out Divine mother.

204.సర్వమంత్రస్వరూపిణీ
మనకు మొత్తం 7 కోట్లు మంత్రాలు ఉన్నాయి. ఇవి 6 ఆమ్నాయాలుగా ఉంటాయి. అవి 1.పూర్వామ్నాయ 2.దాక్షిణామ్నాయము , 3.పశ్చిమామ్నాయము 4.ఉత్తరామ్నాయము, 5.ఊర్ధ్వమ్నాయము 6.అనుత్తరామ్నాయముగా ఉంటాయి. ప్రతీ మంత్రానికి షడంగములు ఉంటాయి. అవి 1.ఋషి, 2.ఛందస్సు, 3.దేవత, 4.బీజము, 5.శక్తి, 6.కీలకం. ప్రతీ మంత్రానికి తత్వ భావం, అర్ధభావం, రూపభావం, శబ్దభావం ఉంటాయి. ఇవన్నీ అమ్మ స్వరూపాలే. అందుకే సర్వ మంత్రస్వరూపిణి అన్నారు. 

205.సర్వయంత్రాత్మికా
యంత్రములు మూడు రకములు. అవి పూజ యంత్రాలు, ప్రతిష్ట యంత్రాలు, ధారణా యంత్రాలు. యంత్రము దేవత ప్రతిరూపము. ఉపాసన చేయబడే ప్రతీ దేవతకి ఒక యంత్రమున్నది. అన్ని యంత్రాలు ఆ పరమేశ్వరి యొక్క ఆత్మ స్వరూపాలే. అందుకే సర్వ యంత్రాత్మిక అన్నారు. 

206.సర్వతంత్రరూపా
తంత్రం అంటే సంకల్పము చేసిన క్షణం నుండి కార్యం పరిసమాప్తమయ్యే దాకా చేయవలసిన విధివిధానము. మనయొక్క కోరికలు సాధించుకోవడానికి, దేవతలను తృప్తి పరచడానికి ఈ తంత్రాలు చెప్పబడ్డాయి. ఇలా 64 తంత్రాలు ఉన్నాయి. ఈ తంత్రాలవల్ల లోకంలో కావలిసినవన్నీ మనం సాధించుకోవచ్చు. శ్రీవిద్యా తంత్రం 65వది. అది మోక్షప్రదము. ఈ తంత్రములే శరీరముగా కలది మన అమ్మ.

203.Sarvamayi

203.Sarvamayee - There are 25 subtle forms in total. They are: The 5 Thanmatras, The five elements, The 5 Senses, The 5 karmendriyas(feet, hands, mouth, reproductive organs, excretory organs). These add up to 20. On top of these are Mind, Intellect, Chit and Maya(Ego). With these it becomes 24. 25th is the Atman. All these are subtle forms of Divine mother. So she is called 'Sarvamayi'

203.సార్వమయీ - మొత్తం తత్త్వాలు 25 అని చెప్పారు. అవి పంచతన్మాత్రలు(5), పంచభూతాలు(5), జ్ఞానేంద్రియాలు(5), కర్మేంద్రియాలు(5 - చేతులు, కాళ్ళు, నోరు, పునరుత్పత్తి అవయవాలు, విసర్జన అవయవాలు). ఇక్కడికి 20. మనస్సు, చిత్తం, బుద్ధి, మాయ(అహకారం) తో కలిపి 24. ఇక చివరిది ఆత్మ - 25. ఈ 25 తత్త్వాలలోనూ అమ్మే ఉంది. అందుకే ఆవిడ సర్వమయీ.

201-202. Sadgathiprada Sarveshwari

201.Sadgathiprada
Sadgathi are of two types. 1. Worldly 2. Beyond worldly(spiritual). If you pray divine mother with a desire in mind, she will fulfill your desire. That will lead to better worldly life. If you pray her without any desire with an eye on moksha, you will attain moksha. In general, what gives moksha can't give worldly pleasures. And that which give worldly pleasures can't give moksha. But by praying divine mother, you can achieve whatever you want.
202.Sarveshwari
Not only humans but Deva, Daanava, Yaksha, Gandharva, Kinnera and Kimpurushas also pray Divine Mother. Eshwari means one whom we should pray. 'Sarva. means all. She is the goddess of all. So she is called 'Sarveshwari'
201.సద్గతిప్రదా
సద్గతులు రెండు రకాలుగా ఉంటాయి. 1. ఇహం, 2. పరం. మనస్సులో కోరికలతో అమ్మను పూజిస్తే అవి తీరి ఐహికమైన సుఖములు కలుగుతాయి. నిర్మలమైన మనస్సుతో అమ్మను ధ్యానిస్తే మోక్షప్రాప్తి కలుగుతుంది. సాధారణంగా మోక్షము దొరికేచోట భోగము దొరకదు. భోగము దొరికేచోట మోక్షము దొరకదు. కానీ అమ్మను ధ్యానించే వారికి ఏది కావాలంటే అది దొరుకుతుంది. 
202.సర్వేశ్వరీ
ఈశ్వరి అంటే ఆరాధ్య దేవత అని అర్ధం. మన అమ్మ కేవలం నరులకే కాదు. దేవ, దానవ, యక్ష, గాంధర్వ, కిన్నెర, కింపురుషాదులకూ ఆరాధ్య దైవము. అందుకే సర్వేశ్వరి  అన్నారు.

199-200.Sarvashaktimayi Sarvamangala

199.Sarvashakthimayi
Devatas (Angels) got their powers from Divine Mother. The power of rain to Varuna, Speed for Vayu, Power of burning to Agni etc are given by Divine mother to respective devatas. Divine Mother is the personification of all the powers in this universe. So, she is Sarva Shaktimayi

200.Sarvamangala
Divine mother gives us all the auspicious things. She ensures that the country is always happy with plethora of food grains, enough money and good weather. She gives us all the luxuries and happiness. She ensures that wishes of those who follow the dharma of 'varna' and 'Ashrama' are fulfilled.

199.సర్వశక్తిమయీ
దేవతలందిరికి ఎదో ఒక శక్తి ఉంటుంది. అగ్నికి మండే శక్తి, వరుణుడి వర్షం కురిపించే శక్తి, గాలికి వీచే శక్తి ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కిక్క శక్తి ఉంటుంది. వారికి ఈ శక్తులన్నీ అమ్మే ప్రసాదించింది. నిజానికి ఈ శక్తులన్నీ అమ్మనుంచి వచ్చినవే. అందుకే సర్వ శక్తిమాయి అని అన్నారు. 

200.సర్వమంగళా
సర్వమంగళ అంటే అన్ని రకములైన మంగళములు కలిగించేది అని అర్ధం. దేశం ధనధాన్యాలతో, భోగభాగ్యాలతో, సుఖశాంతులతో, సకల ఐశ్వర్యాలతో విలసిల్లేలా చూసేది. వర్ణాశ్రమ ధర్మాలు పాటించేవారి మనో రధము ఈడేర్చేది కనుక సర్వ మంగళ అని అన్నారు. 

196.Sarvagnya

 భగవంతుడు అని చెప్పటానికి కొన్ని లక్షణాలున్నాయి అవి:

1.సర్వజ్ఞత              - అన్ని విషయాలు తెలిసి ఉండటము
2. అనాదిబోధ         - అనాదిగా జ్ఞానం కలిగి ఉన్నవాడు 
3. స్వతంత్రత        - ఎవరిమీదా ఆధారపడకుండా స్వతంత్రముగా ఉండటము
4. నిత్యత                - శాశ్వతంగా ఉండటం, నాశనము లేకపోవటము
5. సంపూర్ణత్వము  - అన్నింటినీ కలిగి ఉండటము 
6. అనంతత           - అంతము లేకుండా ఉండటము 

There are eight qualities that can describe God to the best. They are:

1. Sarvagnya            -To be aware of everything
2. Anaadibodha     -Known to have consciousness since beginning
3. Swatantrata       -To not depend upon anything or anybody
4. Nithyatha          -Everlasting
5. Sampoornatwa  -To have or possess everything
6. Anantata            -Having no end

197.Sandrakaruna

Sandrakaruna means full of mercy. Divine mother is mother of 84 lakh species. Her love is unconditional for any living being. Even for wild animals like Tiger, jackal etc.  So she is full of love and mercy towards her children. She is not satisfied by basic comforts to her children. Otherwise, she would created one fruit or grain or vegetable and leave us to eat it to satisfy our hunger. She created 1500 varieties of just mangoes. 50 varieties of grains. She kept sweet dates in the middle of a desert. Made oxygen freely available in air. Made D-vitamin available with exposure to sunlight so that we don't have to struggle for these basic necessities. With this love and affection, she made many many wonders in this nature. So she is called 'saandra karuna'

సాంద్ర కరుణ అంటే అపారమైన దయ కలది. ఏ జీవికైనా తన బిడ్డలమీద అంతులేని దయ ఉంటుంది. అందులోను అమ్మలకైతే ఇక చెప్పక్కర్లేదు. చివరికి క్రూర మృగాల జాతులైన పులి, నక్క, తోడేలు మొదలైనవైనా సరే. అమ్మ అమ్మే. తన బిడ్డల సంతోషమే తన జీవిత లక్ష్యంగా భవిస్తుంది. మరి ఈ సృష్టిలో ఉన్న 84 లక్షల జీవరాశులకూ అమ్మ ఆ జగన్మాతే. ఇక ఆవిడ దయ గురించి మనం చెప్ప గలమా? ఎదో ఓక రకంగా బిడ్డ ఆకలి తీరిస్తే చాలు అనే భావన ఉన్నట్లయితే ఎదో ఒక పండో, కాయో ఇచ్చి ఊరికోవచ్చు. కానీ జగన్మాత అలాగ కాదు. 1500 రకాల మావిడి పళ్ళను సృష్టిస్తుంది. 50 రకాల ధాన్యపు గింజలను సృష్టిస్తుంది. ఎడారిలో తీయని ఖర్జూర ఫలాన్ని పుట్టిస్తుంది. ఉచితంగా దొరికే గాలిలో ప్రాణ వాయువు నింపుతుంది. సూర్య రశ్మితో డి విటమిన్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది.  అపారమైన దయతో, ప్రేమతో ఆవిడ ఎన్నో అద్భుతాలు చేసింది. అందుకే సాంద్ర కరుణ అన్నారు. 

193-195 - Dushtadura Duracharashamani Doshavarjitha

193.Dushtadura
People with wicked nature think that this body is the representation of 'me'. Such people are egoistic. They cannot experience the pure love of divine mother. Those striving for self-realization should keep away from company of such people. Mingling with them can harm your spiritual growth.
194.Duracharashamani
'Aachaara' describes things one should do and things one should not do. It is a prescribed way to do karma. One has to learn aachaara from the vedas or puranas or epics like Ramayana or Mahabharata. Doing karma without following aachaara can accrue sin. If you realize your mistakes and beg pardon, Divine mother will rid you of all the sin accrued.
195.Doshavarjitha
'Dosha varjita' means defectless. Foolproof. 'Raaga' and 'Dwesha' are the seeds for defects within us. From these arise the 'Arishadvarga' due to which we are misguided, and our actions become flawed. But divine mother does not have these. Hence, she is 'Doshavarjita'

193.దుష్ఠదూరా
శరీరమే నేను అనే భావనలో ఉండేవారు దుష్టులు. వారు అహంకారులు. అటువంటి వారు అమ్మయొక్క అవ్యాజమైన ప్రేమకు పాత్రులుకాలేరు. కావున వారితో మైత్రి వద్దు. అటువంటి వారితో స్నేహం మీ సాధనకి ప్రమాదకరం. వారిని దూరంగా ఉంచడమే ఉత్తమం. 
194.దురాచారశమనీ
ఆచారంలో విహితకర్మ (చేయవలసిన పనులు) నిషిద్ధకర్మ (చేయకూడని పనులు) అని రెండు ఉంటాయి. ఇవి సుఖంగా సునాయాసంగా కర్మలు చేయడానికి సూచించిన మార్గాలు. వేదశాస్త్రాలలోను పురాణాలలోను రామాయణం వంటి కావ్యాలలోను వీటిని విపులంగా వర్ణించారు. వీటికి విరుద్ధంగా ప్రవర్తించడమే దురాచారం. దురాచారం వలన పాపం కలుగుతుంది. తన తప్పు తెలుసుకుని క్షమాపణ కోరిన బిడ్డల పాప భారాన్ని అమ్మ తొలగించేస్తుంది. 
195.దోషవర్జితా
దోషవర్జితా అంటే దోషములు లేనిది అని అర్ధం. మనలోని దోషాలకు రాగ ద్వేషాలే మూలకారణం. వీటి నుండి అరిషడ్వార్గములు పుట్టుకొస్తాయి. వాటి వలన మనలో దోషములు పుట్టుకొస్తాయి. కానీ అమ్మ రాగ ద్వేషాలకి అతీతం. అందుకే దోష వర్జితా అన్నారు.

191-192. Dhukhahanthri sukhaprada

191.Dhukhahanthri
'Dhukha hantri' means she who removes sorrows
192.Sukhaprada
Pleasure is of two types. 1. Physical/Meta physical, 2. Spiritual. The pleasure we derive from money, power, human relations etc are of the first type. These are neither best nor permanent. Spiritual happiness is the most pleasant one. It is a permanent state of mind. To those who pray divine mother, she initially bequeaths all physical and meta physical pleasures. Then gradually, she takes them to the supreme state of spiritual happiness.

191.దుఃఖహంత్రీ
దుఃఖ హంత్రి అంటే దుఃఖములను హరించేది అని అర్ధం. 
192.సుఖప్రదా
సుఖములు రెండు రకములు. 1. ఐహికాము. 2. ఆధ్యాత్మికం. ఐహిక సుఖములు అంటే ధనం, అధికారం, బంధుత్వం మొదలైన వాటి వలన కలిగేది. ఇవి అంత గొప్పవి కావు, శాశ్వతమూ  కావు. ఆత్మానందమే నిజమైన శాశ్వతమైన సుఖం. ఐహిక సుఖహ్ములకన్నా కొన్ని కోట్ల రెట్లు గొప్పది ఆధ్యాత్మిక సుఖం. అమ్మను ప్రార్ధించే వారికి మొదట అన్ని రకముల ఐహిక సుఖములు కలుగుతాయి. ఆ తరువాత ఆవిడ మెల్లగా వారికి ఆధ్యాత్మిక సుఖాన్ని (అంటే ఆత్మానందం) కూడా కలుగజేస్తుంది.

188-190 - Durlabha Durgama Durga

188. Durlabha
'Durlabha' means not easily obtainable. Divine mother is an ocean of mercy. But unfortunately, we still can't reach her easily. Ego is the reason for this. Thoughts of I and mine have created a negative bias in our mind. These folds go into much deeper cores of our mind. By meditating upon mother's mantra, the vibrations of it's beejaksharas remove unwanted folds from the grey matter. But only those with steadfast devotion and unfettered determination can do this.
189.Durgama
'Durgama' means not easily reachable. As explained in previous name, it is not easy to reach DivineMother's state of consciousness. One has to approach learned gurus who already possessed it and willing to teach. One can't do it on his own.
190.Durga
She is called as Durga because she killed a demon called Durgama. Durga is the nine year old girl we pray during Navaratri.

188.దుర్లభా
దుర్లభ అంటే చాల సులభముగా లభించదు అని అర్ధం. అమ్మ అవ్యాజమైన కరుణా మూర్తి.  అయినా మనకు ఆవిడ సాన్నిధ్యం సులభముగా లభించకపోవడం మన దురదృష్టం. మనలోని అహంభావమే దీనికి కారణం. నేను, నాకు, నాది అనే భావన మన మెదడు ముడతలలో లోలోతుల్లోకి చొచ్చుకుపోయి ఉన్నది. దానిని పూర్తిగా రూపుమాపాలి. అంటే అమ్మ మంత్రం నిరంతరం ధ్యానం చేయాలి. ఆ మంత్రంలోని బీజాక్షర ధ్వని ప్రకంపనలు మెదడులోని అనవసరమైన ముడతలను తొలగించేస్తాయి. కానీ దీనికి సుదీర్ఘమైన సాధన అవసరం. భక్తి, శ్రద్ధ, దీక్ష, పట్టుదల ఉన్నవాళ్లే దీనిని సాధించగలుగుతారు. 
189.దుర్గమా
దుర్గమ అంటే సులువుగా పొంద సఖ్యము కానిది. అమ్మ సాయుజ్యమును పొందిన జ్ఞానులను, గురువులను ఆశ్రయించి వారి శిక్షణతో ఆ స్థితిని చేరుకో గలుగుతాము. 
190.దుర్గా
దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించింది కనుక దుర్గ అని పిలవబడుతోంది. దేవినవరాత్రులలో 9 సంవత్సరాల బాలిక కొలిచేది దుర్గానే.

186-187. Nirapaya Nirathyaya

186.Nirapaya
'Apaya' means danger or trouble. It comes mainly due to 4 reasons. They are 1) lack of knowledge, 2) lack of money 3) Health problems (disease) 4) Death. These occur to the physical body. Not for atma. Divine mother is always busy protecting her children from these dangers/troubles. She never fell in any danger because she is Paramatma. Hence, she is called 'Nirapaya'.
187.Nirathyaya
There is no scope of crossing limits of divine mother. She is omnipresent. Here crossing limits means disobedience. She embraces us with boundless love. We obey her with devotion. We can never outsmart the laws set by divine mother

186.నిరపాయా
అపాయము లేదా ఆపద పలు రకాలుగా కలుగుతుంది. అవి విద్యాపాయము, ధనాపాయము, ఆరోగ్యాపాయము, ప్రాణాపాయము. ఇవి భౌతిక శరీరానికే వర్తిస్తాయి. ఆత్మకు కాదు. తన బిడ్డలకు కలిగే ఆపదలను తొలగించే ఆత్మ స్వరూపం మన అమ్మ. ఇక ఆవిడకి ఆపద ఎలా వస్తుంది? అందుకే ఆవిడ నిరపాయ. 
187.నిరత్యయా
నిరత్యయ అంటే అతిక్రమించుటకు వీలు కానిది. అంతటా వ్యాపించి ఉన్న అమ్మను మనం ఎలా అతిక్రమించగలం. అవధులులేని ప్రేమతో అమ్మ మనల్ని చేరదీసుకుంటుంది. మనం భక్తితో ఆమెకు లొంగిపోతాం తప్ప ధిక్కరించి అతిక్రమించలేము. 

182-183.Nishkriya Nishparigraha

182.Nishkriya
'Kriya' means effort we put to possess something that we want or dispossess something that we don't want. To align these efforts to dharma, vihita karmacharana (things that you should do) and nishiddha karmacharana (things you should not do) are prescribed. But these pertain to those who have to do karma. Divine mother is beyond karma. So she does not need any of this. She is 'Nishkriya'
183.Nishparigraha
'Parigraha' means to accept. Divine mother does not/need not accept anything from others.

182.నిష్క్రియా
మనకు  లేని దాన్ని పొందడానికి గాని, అక్కర్లేనిదాన్ని వదిలించుకోవడానికి గాని చేసే ప్రయత్నమే క్రియ. ఈ క్రియలను ధర్మబద్ధం చేయడానికి విహిత కర్మాచరణ (చేయవలసినవి), నిషిద్ద కర్మాచరణ (చేయకూడనివి) ప్రతిపాదించారు. కానీ ఇవన్నీ కర్మలు చేసే అవసరము ఉన్నవారికి. అమ్మకు ఇవేవి అవసరం లేదు. ఆమె నిష్క్రియ.
183.నిష్పరిగ్రహ
'పరిగ్రహము' అంటే పుచ్చుకొనుట, స్వీకరించుట అని అర్ధం. అమ్మకు ఇవ్వడమే కానీ తీసుకోవలసిన అవసరంలేదు. ఆవిడ నిష్పరిగ్రహ. 

180-181. Nirnasha Mrityumadhani

180.Nirnasha
'Nasha' means destruction. The soul cannot be destroyed. Divine mother is the soul. so, she is 'Nirnasha'
 
181.Mrityumadhani
Death is fearful only for the ignorant. Knowledgeable saints think of death as a boon to get rid of the aged body.
In darkness, we see a rope and think it is a snake. Then we fear about it. But when there is light, we realize its true nature (that it is a rope and not snake). Then the fear goes away. In the same way, when we pray divine mother, she sheds the light(consciousness) with which we will overcome the fear of death.

180.నిర్నాశా
ఆత్మ నాశనము లేనిది. అమ్మది ఆత్మ స్వరూపం.  అందుకే నిర్నాశా అన్నారు.

181.మృత్యుమథనీ 
మృత్యువు కేవలం అజ్ఞానులకే భయంకరంగా ఉంటుంది. తత్త్వం ఎరిగిన జ్ఞానులు మృత్యువుని జీర్ణమైయిపోయిన శరీరాన్ని వదిలించుకునే వరంలాగ భావిస్తారు.

చీకటిలో చూపు సరిగ్గా పని చేయదు. అప్పడు మనం తాడుని చూసి పాము అనుకుంటాము. ఆ భ్రమ వలన చాలా భయానికి గురౌతాము. వెలుగులో చుస్తే దాని నిజస్వరూపం(పాము కాదు తాడు అని) తెలిసిపోతుంది. అప్పుడు భయం పోతుంది. అలాగే మృత్యు భయం పోగొట్టే వెలుగు(జ్ఞానం) అమ్మ మనకు ప్రసాదిస్తుంది. 

177-179.Nirabadha..bheda nashini

177.Nirabadha
Baadha means sorrow. The root cause of all the sorrows is Raga and Dwesha. From them arise the Arishadvarga, sankalpa, vikalpa, dhuritam etc. But divine mother is beyond Raga Dwesha. So she does not have any sorrows. So she is Nirabadha.

178.Nirbhedha 
Bheda' means difference. Sanatana dharma is based on advaita. 'Advaita' means not two. General belief is that there are two things. 1. People and 2. God. People are different from God and when people pray, God will help them. But that is wrong. The difference between people and God is illusional. As there is no bheda(difference) it is 'Nirbheda'

179.Bhedhanashini
By praying divine mother, we can realize the oneness (advaita). When you strongly believe that there is only one thing, the reason to differentiate is automatically lost. When the reason to differentiate is lost, there is not scope for Raaga or Dwesha. When there is no Raaga Dwesha, there is only one thing that is 'Bliss'.

177.నిరాబాధా
అసలు బాధలన్నింటికీ మూలము రాగ ద్వేషములు. వాటి నుండే అరిషడ్వార్గములు, సంకల్ప వికల్పములు, దురితం, మొదలైనవన్నీ వస్తాయి. అసలు రాగద్వేషాలే లేని అమ్మకు బాధలేందుకు ఉంటాయి? ఆమె నిరాబాధ. 

178.నిర్భేదా
ఇక్కడ భేదము అంటే ద్వైత భావన. అంతటా దేవుడే ఉన్నాడు అని చెబుతోంది అద్వైతం. అద్వైతం అంటే రెండు కాదు అని అర్ధం. సనాతన ధర్మానికి అద్వైతమే ఆధారం. రెండవదంటూ లేనపుడు ఇంక భేద భావనకి చోటేది. తాను వేరు దేవుడు వేరు అన్న భావన తప్పు. అసలు భేదమే లేదు కనుక నిర్భేద. 

179.భేదనాశినీ 
అమ్మను ప్రార్ధిస్తే భగవంతునితో ఏకత్వాన్ని సాధించగలుగుతాము. అంతా ఒకటే అని భావించేవానికి తన పర అనే భేదమే ఉండదు. అసలు భేదమే లేని చోట రాగ ద్వేషాలకు చోటే ఉండదు. రాగ ద్వేషాలు లేని చోట కేవలం ఆనందం ఉంటుంది. 

176. Nirvikalpa

 'Vikalpa' means wavering. Circling around a number of choices or options. The mind is described as union of 'sankalpa' and 'vikalpa'. Meaning it either determines to do something(sankalpa) or keeps circling around alternatives(vikalpa). But is never clam. But divine mother has no 'Raaga' or 'Dwesha'. So her mind does not waver. If there is need, she will make a determination (sankalpa) to do something. After that she will go back to meditation. She does not have a wavering mind. She is 'Nirvikalpa'

వికల్పమంటే ఊగిసలాట. మనస్సును సంకల్ప వికల్ప సంఘాతం అని అంటారు. ఏదైనా అవసరం ఉంటె తత్కార్యం కోసం సంకల్పిస్తుంది. లేకపోతే ఏవేవో తలచుకుంటూ భ్రమిస్తూ ఉంటుంది. కానీ కుదురుగా ప్రశాంతంగా ఉండలేదు. కానీ అమ్మకి రాగద్వేషాలు లేవుకదా. అందుకని ఆమె మనస్సు ఊగిసలాడదు. సంకల్పించిన కార్యం పూర్తి అవగానే ఆవిడ హాయిగా ధ్యానంలోకి వెళ్ళిపోతుంది. అందుకే నిర్వికల్ప అని అన్నారు.

174-175.Nirbhava Bhavanashini

174.Nirbhava - 'Bhava' represents samsara. Affinity towards body and passion on worldly possessions will lead to many problems in this 'samsara'. Following dharma is the best way to navigate in this. But that is not easy. Adharma might look easy but is much more dangerous. It makes life a hell. But divine mother does not have 'raaga/dwesha'. So samasara is not problematic for her. She is 'Nirbhava'

175.Bhavanashini - When we pray mother, she will help us mature to the state where we will see this body as a mere protective cover and this world as a stage for performing karma. She will remove our raga/dwesha and hence navigating through the samsara will become a breeze.

174.నిర్భవ - భవము అంటే సంసారము. దేహాభిమానము, రాగద్వేషాలు కలిగిన వారికి ఇది చాలా పెద్ద భారముగా అనిపిస్తుంది. ఈ సంసార సాగరము ఈదడానికి ధర్మావలంబన ఒక్కటే మార్గము. కానీ అది సులభము కాదు. అధర్మము వైపు వెళ్ళితే సులభమనిపిస్తుంది కానీ అది ఇంకా భయంకరమైంది. ఆ దారిలో వెళితే రౌరవాది నరక బాధలు అనుభవించవలసి వస్తుంది. అమ్మకు రాగద్వేషాలు ఉండవు. అందుకే ఆవిడకి భవబాధలు ఉండవు. 

175.భావనాశిని - అమ్మను భక్తితో ప్రార్ధిస్తే ఆవిడ మన దేహతాదాప్యతను, రాగద్వేషాలను తొలగించి వేస్తుంది. అప్పుడు మనకు సంసారము భారమనిపించదు. 

170-171.Nirlobha Lobhanashini

170.Nirlobha - We learnt about 'Lobha' in 156th name. It is the third one in arishadvarga. A lobhi never gets satisfied. He/she is always far away from inner peace/calm. Due to this he/she faces lot of miseries. But divine mother is beyond 'raga' or 'dwesha'. So she has no 'lobha'. She is very merciful.

171.Lobha Nashini - When we pray divine mother, she give us the inner calmness. The Lobha (greed) dissolves in this inner calmness.

170.నిర్లోభా - లోభ గుణం గురించి మనం 156 వ నామం లో తెలుసుకున్నాం. ఇది అరిషడ్వార్గాలలో మూడవది. లోభికి తృప్తి ఉండదు. అందువల్ల అతను అశాంతికి గురౌతాడు. రాగద్వేషాలకు అతీతమైన అమ్మకు లోభముండదు. ఆవిడది అపారమైన దయ.

171.లోభ నాశినీ - అమ్మను ప్రార్ధించిన సాధకుడికి శాంతి లభిస్తుంది. ఆ శాంతిభావనలో లోభం దగ్ధం అయిపోతుంది.

168-169.Nishkrodha Krodhashamani

168.Nishkrodha - Krodha is the second one in arishadvarga. It comes due to unfulfilled desire. Every living being that is bound by raaga/dwesha will suffer from arishadvarga. But divine mother has no raaga/dwesha. Her's is pure love for her children. Hence, she is called 'Nishkrodha'

169.Krodhashamani - 'shama' means to douse. When we pray divine mother with love and devotion, she will douse the 'krodha' within us as well.

168.నిష్క్రోధా - అరిషడ్వార్గాలలో రెండవది క్రోధం. కోరిక తీరకపోతే వచ్చేది క్రోధం. రాగ ద్వేషాలకు లోనైనా ప్రతీ జీవికి కోరిక తీరానప్పుడు క్రోధం వస్తుంది. కానీ అమ్మకు రాగ ద్వేషాలు ఉండవు. ఆవిడది పరిశుద్ధమైన ప్రేమ. కాబట్టి ఆమెకు క్రోధం కూడా ఉండదు. అందుకే నిష్క్రోధ. 

169.క్రోధశమని - ప్రేమ-భక్తిలతో అమ్మను ఆరాధిస్తే ఆవిడ మనలోని క్రోధాన్ని కూడా శమింపచేస్తుంది. 

166-167.Nishpapa Papanashini

166.Nishpapa - 'Papa' means sin. Common people like us perform karma (actions fueled by desire) every day. Due this we accrue either 'punya' or 'papa'. If one is influenced by 'Arishadvarga' as described in 156th name, then there is high probability that he/she accrues sin due to adharma. But divine mother's actions are not fueled by desire. So, she is 'Nishpapa'.

167.Papanashini - By praying divine mother, she enlightens our minds such that we realize the difference between truth and illusion. With this power of discretion, we overcome arishadvarga and destroy all the sins.

166.నిష్పాప - శరీరం ఉన్నంత వరకు మనుషులు కర్మలు చేస్తూనే ఉంటారు. పాపము చెడ్డ కర్మలు ద్వారా కలుగుతుంది. అరిషడ్వార్గాల ప్రభావం వలన మనం ధర్మాధర్మ విచక్షణ కోల్పోతాము. అప్పుడు చేసే అధర్మం వలన పాపం కలుగుతుంది. కానీ అమ్మకు ఇటువంటి పాపం ఉండదు. ఎందుకంటే ఆవిడ కర్మలు చేయదు.

167.పాపనాశినీ - అమ్మను ప్రార్ధిస్తే మనకు ధర్మాధర్మ విచక్షణ కలుగుతుంది. దానితో అరిషడ్వార్గాన్ని తెగనరికి మనం పాపాన్ని తుడిచివేయ గలుగుతాము. 

164-165.Nirmama Mamatahanthri

164.Nirmama - 'Mama' means mine. My house, my job, my money like this, we attribute 'my' to many things. But in true sense, such attribution is not possible for atma. These are illusions of the mind. That is why divine mother is called 'Nirmama'

165.Mamathahanthri - The feeling of mine causes obstacles in the path of liberation. One has to overcome it. When you pray divine mother, she will give you the strength required for this. The story of Madhukaitabha samharam explains this very clearly.

164.నిర్మమ - మమ అంటే నాది అనే భావన. ఇల్లు నాది, డబ్బు నాది, వాహనం నాది, పదవి నాది, ఇలా ఎన్నింటికో మనం నాది అనే పదాన్ని ఆపాదిస్తూ ఉంటాం. ఇది మనసుకి సంబంధించిన వ్యవహారం. ఆత్మకు తన పర అనే భేదం వర్తించదు. అమ్మ ఆత్మ స్వరూపం. అందుకే నిర్మమ అని అన్నారు.  
165.మమతాహంత్రీ - నాది అనే భావన దైవసాధనకు అడ్డం పడుతుంది. దానిని జయించాలి. అప్పుడే మోక్షం సిద్ధిస్తుంది. మధు కైటభ సంహారంలో ఈ విషయాన్నే వివరించారు. అమ్మను ప్రార్ధిస్తే మనం ఈ అడ్డంకు తొలగించగలుగుతాము.

Popular