Search This Blog

535. Yaakinyambaswaroopini

The beeja, shakti and keelaka of Goddess Yashaswini are represented by the syllable 'Ya'. So she is named as “yakini”

Muṇḍavyōmasthapadmē daśaśatadaḷakē karṇikā candra sansthāṁ
rētōniṣṭhāṁ samastāyudhakalitakarāṁ sarvatōvakṣa padmāṁ
ādikṣāntārṇaśakti prakaṭaparivr̥tāṁ sarvavarṇāṁ bhavānīṁ
sarvānnāsaktacittaṁ paraśivarasikāṁ yākinīṁ bhāvayāmaḥ ||

There is Sahasradalapadma near Brahmarandhra. In its court there is Yakini, the deity who wears all kinds of weapons, has faces on all sides, shines with all colors, is fond of all kinds of food, and is present in shukla.

Yō hamasmi brahmāhamasmi | ahamasmi brahmāhamasmi | tattvamasi | brahmāhamasmi | sōhaṁ brahmāhamasmi | ōṁ brahmā ha masmi | ātmaivēdagṁ sarvaṁ | brahme vēdaṁ sarvaṁ | sarvamētadbahma | sarvaṁ khalvidaṁ brahma | brahmavid brahmaivabhavati

According to Shatchakranirupanam, “After crossing the Ajnachakra, the Yogi experiences the Mahanada. He gets Vaksiddhi. Sahasradala shines like the full moon. Its rays are as bright as the rays of the sun and as cold as the rays of the moon. Here are all the alphabets. It is pure form of bliss. This is chandra mandala. Here is a moon without any blemishes. It never changes. In the center of this moon is the great void.

Tadantaḥ śūn'yaṁ tatsakala suragaṇaiḥ sēvitan̄cātiguptaṁ

Devatas serve this great void secretly. It is the greatest of all the secrets. One requires steadfast focus and hard work to reach there. There is the Supreme Lord. He removes ignorance and lust and grants the knowledge of self ( by raining amruth) to the practitioner. Then the seeker attains the unity of the Jivatma Paramatma and becomes Paramahamsa

Śivasthānaṁ śaivāḥ paramapuruṣaṁ vaiṣṇavagaṇāḥ
lapantītīprāyō hariharapadaṁ kēcidaparē |
padaṁ dēvyā dēvīcaraṇayugaḷāṁ bhōjarasikā
munīnā maṣyantē prakr̥ti puruṣasthāna mamalaṁ ||

This place is called Shivasthanam by Shaivas, Parampurushasthanam by Vaishnavas, Devisthanam by Sakteyas, Hariharasthanam by some and Prakriti Purushasthanam by others.

Idaṁ sthānan̄jñātvā niyata nijacittō naravarau
na bhūyat sansārē punarapi na bud'dha'ēbhuvanē
samagrāśākta: Svānniyama manasastasvakr̥tinaḥ
sadākartuṁ khagatirapi vāṇīsuvimalā ||

A seeker who knows this place is not reborn. There is no bond in this world. There are no sins. There are no strings attached. All the wants are satisfied. A yogi who reaches here gets the union with God.

In Santanopanishat

Saptamemase Jivasamyukto Bhavati |
Ashtamemase Sarvasampoorno Bhavati | Navame Jivati ||

Life is formed in the seventh month. Jiva enters into it by karma done in previous birth. In the eighth month, all the organs of the baby are fully formed. Birth occurs in the ninth month. A pregnant woman can eat all kinds of food in these months.

535. యాకిన్యంబాస్వరూపిణీ

యశశ్వినీ అనబడే ఈ దేవత యొక్క బీజము, శక్తి, కీలకము అన్నీ యకార సంకేతముగానే ఉంటాయి. అందుకే ఆమెను యాకినీ అంటారు. యోగినీన్యాసంలో

ముండవ్యోమస్థపద్మే దశశతదళకే కర్ణికా చంద్ర సంస్థాం
రేతోనిష్ఠాం సమస్తాయుధకలితకరాం సర్వతోవక్ష పద్మాం
ఆదిక్షాంతార్ణశక్తి ప్రకటపరివృతాం సర్వవర్ణాం భవానీం
సర్వాన్నాసక్తచిత్తం పరశివరసికాం యాకినీం భావయామః ||


బ్రహ్మరంధ్రం దగ్గర సహస్రదళపద్మమున్నది. దాని కర్ణికలో అన్నిరకాల ఆయుధాలు ధరించి అన్నివైపులకు ముఖములు కలిగి, సర్వవర్ణములతోను ప్రకాశించునది, అన్నిరకాలైన ఆహారములందు ప్రీతి కలది, శుక్లమునందు ఉండునది అయిన యాకినీ అనే దేవత ఉన్నది.

యో హమస్మి బ్రహ్మాహమస్మి | అహమస్మి బ్రహ్మాహమస్మి |
తత్త్వమసి | బ్రహ్మాహమస్మి | సోహం బ్రహ్మాహమస్మి | ఓం
బ్రహ్మా హ మస్మి | ఆత్మైవేదగ్ం సర్వం | బ్రహ్మె వేదం
సర్వం | సర్వమేతద్బహ్మ | సర్వం ఖల్విదం బ్రహ్మ |
బ్రహ్మవిద్ బ్రహ్మైవభవతి "


షట్చక్రనిరూపణంలో “ఆజ్ఞాచక్రం దాటిన తరువాత యోగి మహానాదాన్ని దర్శిస్తాడు. అతడికి వాక్సిద్ధి కలుగుతుంది. సహస్రదళము పూర్ణచంద్రునిలాగా ప్రకాశిస్తుంటుంది. దానికిరణాలు సూర్యకిరణాలవలె కాంతివంతంగా, చంద్రకిరణాలవలె చల్లగా ఉంటాయి. ఇక్కడ అకారాది సర్వవర్ణములు ఉంటాయి. ఇది కేవలము ఆనందరూపమైనది. ఇది చంద్రమండలము. ఇక్కడ వృద్ధిక్షయాలు లేనివాడు, కళంకరహితుడు అయిన చంద్రుడుంటాడు. ఈ చంద్రమండలము మధ్యన మహాశూన్యమున్నది.

తదంతః శూన్యం తత్సకల సురగణైః సేవితంచాతిగుప్తం

ఆ మహాశూన్యాన్ని దేవతలు రహస్యంగా సేవిస్తుంటారు. ఆ శూన్యము చాలా రహస్యమైనది. అతి ప్రయత్నము మీదగాని దాన్ని పొందలేరు. అక్కడే పరమేశ్వరుడుంటాడు. ఆయన సర్వాత్మరూపి. అజ్ఞానము మోహము పోగొట్టి సాధకుడికి సుధాధారలచే ఆత్మజ్ఞానం కలిగిస్తాడు. అప్పుడు సాధకుడు జీవాత్మ పరమాత్మల సమైక్యము సాధించి పరమహంస
అవుతాడు.

శివస్థానం శైవాః పరమపురుషం వైష్ణవగణాః
లపంతీతీప్రాయో హరిహరపదం కేచిదపరే |
పదం దేవ్యా దేవీచరణయుగళాం భోజరసికా
మునీనా మష్యంతే ప్రకృతి పురుషస్థాన మమలం ||


ఈ ప్రదేశాన్ని శివస్థానమని శైవులు, పరమపురుషస్థానమని వైష్ణవులు, దేవీస్థానమని శాక్తేయులు, హరిహరస్థానమని కొందరు, ప్రకృతి పురుష స్థానమని మరికొందరు అంటారు.

ఇదం స్థానంజ్ఞాత్వా నియత నిజచిత్తో నరవరౌ
న భూయత్ సంసారే పునరపి న బుద్ధఏభువనే
సమగ్రాశాక్త: స్వాన్నియమ మనసస్తస్వకృతినః
సదాకర్తుం ఖగతిరపి వాణీసువిమలా ||


ఈ స్థానాన్ని తెలుసుకున్న సాధకుడికి పునర్జన్మలేదు. ఈ లోకంలో బంధం ఉండదు. పాపపుణ్యాలుండవు. సంసారబంధనాలుండవు. ఇష్టార్ధసిద్ధి కలుగుతుంది. ఇక్కడకు చేరిన యోగికి సాయుజ్యం లభిస్తుంది.

సంతానోపనిషత్తులో

సప్తమేమాసే జీవసంయుక్తో భవతి |
అష్టమేమాసే సర్వసంపూర్ణో భవతి | నవమే జీవతి ||


ఏడవమాసంలో జీవం ఏర్పడుతుంది. పూర్వజన్మలో చేసిన కర్మతో జీవుడు ఇందులో ప్రవేశిస్తాడు. ఎనిమిదవ మాసంలో శిశువుకు అన్ని అవయవాలు పూర్తిగా ఏర్పడతాయి. తొమ్మిదవ మాసంలో జన్మ కలుగుతుంది. గర్భిణీ స్త్రీ అన్నిరకాల ఆహారాలు భుజించవచ్చును. 

528.Haakineeroopadhaarinee


ఆజ్ఞాచక్రాధిష్ఠానదేవత అయిన సిద్ధమాత యొక్క మంత్రానికి శక్తి, బీజము, కీలకము అన్నీ హకార సంకేతంగా ఉంటాయి కాబట్టి ఈమెను హాకినీ అంటారు. యోగినీన్యాసంలో

భ్రూమధ్యే బిందుపద్మే దళయుగకలితే శుక్లవర్ణాం కరాబ్లైః
బిభ్రాణాం జ్ఞానముద్రాం డమరుక మక్షమాలాం కపాలం
షడ్వక్షాధారమధ్యాం త్రినయనలసితాం హంసవత్యాది యుక్తాం
హరిద్రాన్నైకరసికాం సకలశుభకరీం హాకినీం భావయామః ||


కనుబొమల మధ్య రెండు దళములు గల పద్మమున్నది. ఆ పద్మమునందు హాకినీ దేవత ఉంటుంది. ఆమె చేతులలో జ్ఞానముద్ర, డమరుకము, అక్షమాల, కపాలము ధరించి ఉంటుంది. హాకినీ దేవతకు మూడుకనులు, ఆరు తలలు ఉంటాయి. ఆమెకు హరిద్రాన్నమునందు ప్రీతి ఎక్కువ.

ఆజ్ఞాచక్రాధిష్ఠానదేవతా హాకినీ యుక్త సదాశివ
స్వరూపిణ్యంబా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః


శంకరభగవత్పాదులవారు సౌందర్య లహరిలోని 36వ శ్లోకంలో ఆజ్ఞాచక్రాన్ని వివరిస్తూ

తవాజ్ఞా చక్రస్థం తపనశశికోటిద్యుతిధరం
పరం శంభుం వందే పరమిళిత పార్శ్వం పరచితా
యమారాధ్యన్ భక్త్యా రవి శశి శుచీనామవిషయే
నిరాలోకేలోనే నివసతి హి భాలోకభువనే ||


ఆజ్ఞాచక్రంలో శివాశివులు కోట్లకొలది సూర్యచంద్రులకాంతులతో ప్రకాశిస్తూ ఉంటారు.

లక్ష్మీధరుడు తన కర్ణావతంస స్తుతిలో

అజ్ఞాత్మక ద్విదళ పద్మగతే తదానీం
విద్యున్నిభై రవిశశి ప్రయుతోత్కటాభే
గండస్థల ప్రతిఫల త్కరదీప జ్వాల
కర్ణావతంసకలికే కమలాయతాక్షి ! ||


ఆజ్ఞా చక్రమనబడే రెండుదళములు గల పద్మమందున్న ఓ దేవీ ! మెరుపుతీగవలె కోట్లకొలది సూర్యచంద్రులకాంతులతో ప్రకాశిస్తున్నావు. షట్చక్రనిరూపణంలో “ఆజ్ఞాచక్రము అనేది గురువు యొక్క ఆజ్ఞలు లభించే స్థానము. ఇక్కడ నుంచే శరీరంలోని వివిధ భాగాలకు ఆజ్ఞలు జారీచేయబడతాయి. ఇక్కడ ఓంకారాన్ని ధ్యానించేవాడు జ్ఞాని అవుతాడు. సర్వజ్ఞుడై
సర్వదర్శి అయిన మునీంద్రుడవుతాడు. ఈ చక్రము కర్ణికలో త్రికోణమున్నది. ఈ త్రికోణంలో ప్రణవానికి ఆధారమైన అకార ఉకారాలుంటాయి. దాని మీద బిందురూపంలో మకారముంటుంది.

సంతానోపనిషత్తులో షషేమాసి నాసాక్షిత్రోత్రాణి భవంతి

ఆరవనెలలో గర్భస్థ శిశువుకు ముక్కు, చెవులు, కనులు మొదలైన అవయవ సౌష్టవం ఏర్పడుతుంది. ఈ నెలలోనే మనస్సుకూడా ఏర్పడుతుంది. అదే ఆరవ అవయవము. అందుచేతనే సిద్ధమాతకు ఆరు తలలుంటాయి. ఈ సమయంలో గర్భిణీ స్త్రీకి హరిద్రాన్నము మంచి ఆహారము.

The presiding deity of Agna chakra is called Haakini because her Shakti, Root (Beeja) and Vitality (Keelaka) all begin with symbols of 'ha'.

In yogininyasam

Bhrūmadhyē bindupadmē daḷayugakalitē śuklavarṇāṁ karāblaiḥ
bibhrāṇāṁ jñānamudrāṁ ḍamaruka makṣamālāṁ kapālaṁ
ṣaḍvakṣādhāramadhyāṁ trinayanalasitāṁ hansavatyādi yuktāṁ
haridrānnaikarasikāṁ sakalaśubhakarīṁ hākinīṁ bhāvayāmaḥ ||

Between the eyebrows is a two-tiered lotus. In that lotus is the deity Haakini. She holds jnanamudra, damaruka, akshamala and a skull in her hands. Goddess Hakini has three eyes and six heads. She likes rice mixed with turmeric (Haridranna - plihora).

Ājñācakrādhiṣṭhānadēvatā hākinī yukta sadāśiva
svarūpiṇyambā śrīpādukāṁ pūjayāmi tarpayāmi namaḥ

Saint Shankara described Agna chakra in the 36th verse of his Soundarya lahari

Tavājñā cakrasthaṁ tapanaśaśikōṭidyutidharaṁ
paraṁ śambhuṁ vandē paramiḷita pārśvaṁ paracitā
yamārādhyan bhaktyā ravi śaśi śucīnāmaviṣayē
nirālōkēlōnē nivasati hi bhālōkabhuvanē ||

Shiva, and Shivaa are in Agna chakra and shining with the light that tantamount to crores of Suns and moons

Lakshmidhara said like this in his karnaavatamsa stuthi

Ajñātmaka dvidaḷa padmagatē tadānīṁ
vidyunnibhai raviśaśi prayutōtkaṭābhē
gaṇḍasthala pratiphala tkaradīpa jvāla
karṇāvatansakalikē kamalāyatākṣi! ||

O! goddess who is in the two-petalled lotus called Ajna Chakra! You are shining with the light of millions of suns and moons. According to the Shatchakranirupana “Ajnachakra is the place where the commands of the Guru are received. From here commands are issued to different parts of the body. One who meditates by reciting Omkara and putting focus here becomes omniscient. He becomes the greatest of all saints. There is a traingle in the atrium of this chakra. The base syllables of pranava are "A" and "U". They lie in this triangle. There is a bindu on top of this triangle. The syllable 'M' is in that bindu.

521. Saakinyamba swaroopini


మూలాధార చక్రాధిదేవత అయిన సిద్ధవిద్యాదేవి యొక్క బీజము, శక్తి, కీలకము అన్నీ సకార సంకేతంగా ఉంటాయి. కాబట్టి ఈమెను సాకిని అంటారు.

యోగినీన్యాసంలో ఆధారచక్రాన్ని వివరిస్తూ

మూలాధారపద్మే శ్రుతిదళలసితే పంచవక్రాం త్రినేత్రాం
ధూమ్రాభాం అస్థిసంస్థాం సృణి మపి కమలం పుస్తకం జ్ఞానముద్రాం
భిభ్రాణాం బాహుదండై స్సులలిత వరదాపూర్వశక్త్యావృతాం తాం
ముద్దాన్నాసక్త చిత్తాం మధుమద ముదితాం సాకినీం భావయామః ||


ఆధారచక్రంలో ఐదుముఖాలు మూడుకనులు కలిగి ధూమ్రవర్ణముతో నున్నది, ఎముకలు యందుండునది. అంకుశము, కమలము, పుస్తకము, జ్ఞానముద్ర చేతులయందు ధరించినది, ముద్గన్నాము నందు ఆసక్తి కలది అయిన సాకినీదేవికి నమస్కరిస్తున్నాను.

సంతానోపనిషత్తులో "ఇక్కడ సిద్ధవిద్యాదేవి 5 ముఖాలతో ఉంటుంది. గర్భస్థశిశువుకు ఈ నెలలో చర్మము ఏర్పడుతుంది. పంచమేమాసే పృష్ఠవంశోభవతి - 5 నెలల బిడ్డకు వెన్నెముక ఏర్పడుతుంది. పంచేంద్రియ స్పూర్తి కలుగుతుంది. గర్భిణీ స్త్రీకి ఈ సమయంలో ముద్గాన్నము మంచి ఆహారము

The Seed, Shakti and Vitality of Siddhavidyadevi, the presiding deity of the moolaadhaar (root) chakra, start with 'sa' symbol. So, she is called Sakini. It is said like this in Yogininyasam mūlādhārapadmē śrutidaḷalasitē pan̄cavakrāṁ trinētrāṁ
dhūmrābhāṁ asthisansthāṁ sr̥ṇi mapi kamalaṁ pustakaṁ jñānamudrāṁ
bhibhrāṇāṁ bāhudaṇḍai s'sulalita varadāpūrvaśaktyāvr̥tāṁ tāṁ
muddānnāsakta cittāṁ madhumada muditāṁ sākinīṁ bhāvayāmaḥ || Siddha vidya devi is in Aadharchakra with five faces and three eyes and is brown in color. She is present in bones. My slutations to Goddess Sakini who likes in Mudgannam, who holds the Ankusa, the lotus, the book, the Gnanamudra in her hands.

Santhanopanishad says "Here Siddhavidya Devi has 5 faces. Skin is formed in this month for fetus. Panchmemase pristhavamsobhavati - Spine is formed for 5 months baby. The fetus becomes aware of the 5 senses. Mudganna is good food for pregnant woman during this time.

520.Mudgoudannasaktachitta

ముద్గౌదన్నాము అంటే - పెసరపప్పు కలిపి వండిన అన్నము. దీని తయారీ విధానము

సుశాలితండుల ప్రస్థం తదర్ధ ముద్గభిన్నకం
చతుఃఫలం గుడం ప్రోక్తం తన్మానం నారికేళకం
ముష్టిమాత్రం మరీచం స్యా త్తదర్ధం సైంధవం రజః
తదర్ధం జీరకం విద్యా తుడవం గోఘృతంవిదు!

గోక్షీరేణ స్వమాత్రేణ సంయోజ్యకమలాననే
మందాగ్నిపచనా దేవ సిద్ధాన్న మిదముత్తమమ్ ||


మంచి బియ్యం ఒక శేరు
పెసరపప్పు అర్ధశేరు
బెల్లం పావుశేరు
కొబ్బరి పావుశేరు
మిరియాల పొడి గుప్పెడు
సైంధవలవణం అరగుప్పెడు
జీలకర్ర ఉప్పులో సగము
పాలు సరిపోయినంత
నెయ్యి కొద్దిగా

వీటిని సన్నని మంటమీద ఉడికిస్తే వచ్చేదే ముద్గౌదన్నాము
ఈ రకంగా తయారుచేసిన ముద్గన్నాము లేక సిద్ధాన్నము నందు ఈ దేవికి మక్కువ ఎక్కువ.

Mudgoudaanna means rice mixed with green gram dal.

Suśālitaṇḍula prasthaṁ tadardha mudgabhinnakaṁ
catuḥphalaṁ guḍaṁ prōktaṁ tanmānaṁ nārikēḷakaṁ
muṣṭimātraṁ marīcaṁ syā ttadardhaṁ saindhavaṁ rajaḥ
tadardhaṁ jīrakaṁ vidyā tuḍavaṁ gōghr̥tanvidu!

Gōkṣīrēṇa svamātrēṇa sanyōjyakamalānanē
mandāgnipacanā dēva sid'dhānna midamuttamam ||

Take Rice (1 portion), Green gram(1/2 portion), Jaggery(1/4 portion), coconut (1/4 portion). Add some pepper powder, Saindhava lavanam, Jeera, cow milk and Ghee to it. Boil these in a low flame till the rice is cooked. This is called Mudgoudaannam.

513. Kaakiniroopadhaarini



స్వాధిష్ఠాన చక్రానికి అధిదేవత అయిన సిద్ధేశ్వరీదేవి యొక్క బీజము, శక్తి, కీలకము అన్నీ కకార సంకేతంగానే ఉంటాయి అందుచేత ఆమె కాకిన అనబడుతుంది. యోగినీన్యాసంలో స్వాధిష్ఠానాన్ని వివరిస్తూ

స్వాధిష్టానాఖ్యపద్మే రసదళలసితే వేదవం త్రినేత్రాం
హస్తాభ్యాం ధారయంతీం త్రిశిఖగుణకపాలాభయాం ఉన్మత్త గర్వాం
మేదోధాతు ప్రతిష్టాం అళిమదముదితాం బందినీ ముఖ్యయుక్తాం
పీతాం దధ్యోదనష్టాం అభిమతఫలదాం కాకినీం భావయామః ||


ఆరు దళాలు గల స్వాధిష్ఠానచక్రంలో నాలుగు శిరస్సులు, మూడుకనులు గలిగి, చేతులయందు త్రిశూలము, పాశము, కపాలము, అభయముద్ర కలిగి, అతిశయించిన గర్వముకలదై మద్యము త్రాగి సంతసించుచున్నది. మేదస్సు అను ధాతువునందుండునది, బందిన్యాది శక్తులతో పరివేష్టితమైన కాకినీ దేవిని ధ్యానించుచున్నాను.

స్వాధిష్టాన దేవతా కాకినీ యుక్త బ్రహ్మస్వరూపిణ్యంబా
శ్రీ పాదుకాంపూజయామి తర్పయామి నమః


శంకరభగవత్పాదులవారు తమ సౌందర్య లహరిలోని 39వ శ్లోకంలో స్వాధిష్ఠాన చక్రాన్ని వివరిస్తూ

తవ స్వాధిష్టానే హుతవహ మధిష్ఠాయ నిరతం
తమీడే సంవర్తం జనని మహతీం తాంచ సమయాంl
యదాలోకే లోకాన్ దహతి మహతి క్రోధకలితే
దయార్ద్రా యాద్దృష్టిః శిశిరముపచారం రచయతిll


స్వాధిష్ఠానము అగ్నిస్థానము. ఇక్కడ ఉండే అగ్నిని సంవర్తగ్ని అంటారు. ఇక్కడ శివుడు సంవర్తగ్ని రూపంలో లోకాలను దహించివేస్తుంటే, దేవి తన కరుణా దృక్కులతో ఆ లోకాలను శమింపచేస్తూ ఉంటుంది. షట్చక్రనిరూపణంలో “స్వాధిష్ఠానము లింగస్థానంలో సింధూరపు రంగులో ఉంటుంది. దీని ఆరుదళాలలోను బంధిని మొదలైన శక్తులు విద్యుల్లతలలాగా ప్రకాశిస్తుంటాయి. దీనికి అధిదేవత బ్రహ్మ. బీజం అర్ధచంద్రాకారంలో ఉంటుంది.

సంతానోపనిషత్తులో “ఈ చక్రంలో సిద్ధేశ్వరీ దేవికి నాలుగు ముఖాలుంటాయి. వీటినే నాలుగుశిరస్సులు అంటారు. గర్భస్థ శిశువుకు ఈ నెలలో చెవులు ఏర్పడతాయి. ఇప్పుడు నోరు, ముక్కు కన్ను, చెవి. ఈ నాలుగే ఆ దేవతముఖాలు.

అధచతుర్ధమాసే జఠరకటి ప్రదేశ్ భవతి
ఈ సమయంలో పిండానికి ఉదరము, కటి ప్రదేశము ఏర్పడతాయి. ఈ మాసంలో గర్భిణీ స్త్రీకి మధువు మంచి ఆహారము. అది తల్లికి బిడ్డకి కూడా క్షేమము.

Siddeshwari Devi, the presiding deity of Swadhishthana Chakra. The seed (beeja), energy(shakti) and vitality(keelakam) of the swadhishtana are with 'Ka' symbol, hence she is called Kakina. Swadhisthana is explained in Yogininyasam like this

Svādhiṣṭānākhyapadmē rasadaḷalasitē vēdavaṁ trinētrāṁ
hastābhyāṁ dhārayantīṁ triśikhaguṇakapālābhayāṁ unmatta garvāṁ
mēdōdhātu pratiṣṭāṁ aḷimadamuditāṁ bandinī mukhyayuktāṁ
pītāṁ dadhyōdanaṣṭāṁ abhimataphaladāṁ kākinīṁ bhāvayāmaḥ

In the the six-petalled Swadhisthana Chakra, there is goddess Kaakina with four heads, three eyes, trisula, pasha, skull, and abhaya mudra in hands, intoxicated with sura(divine liquor) and with pride. She is in the grey matter of the mind and is surrounded by shaktis like Bandini.

Svādhiṣṭāna dēvatā kākinī yukta brahmasvarūpiṇyambā
śrī pādukāmpūjayāmi tarpayāmi namaḥ

Saint Shankaracharya explained Swadishtana in the 39th verse of Soundarya lahari

Tava svādhiṣṭānē hutavaha madhiṣṭhāya nirataṁ
tamīḍē sanvartaṁ janani mahatīṁ tān̄ca samayāṁ |
yadālōkē lōkān dahati mahati krōdhakalitē
dayārdrā yāddr̥ṣṭiḥ śiśiramupacāraṁ racayati ||

Swadhisthana is the place of fire. The fire present here is called Samvartagni. Here Lord Shiva is burning the worlds in the form of Samvarthagni, while Divine mother is soothing the worlds with her compassionate gaze. In Shatchakranirupana, it is said, “Svadhisthana is vermilion in color and is present near the male organ. Shaktis like Bandhini shine like lightning in its six petals. Its presiding deity is Brahma. The seed is crescent shaped. In Santanopanishat it is said that “Siddheshwari Devi has four faces in this chakra. These are called four heads. The ears of the baby in the womb are formed in this month. Now mouth it has, nose eye, ear. These are the four faces of the goddess. Adhachaturdhamase Jhatrakati Pradesh Bhavati During this time, the abdomen and pelvic area of the fetus are formed. Honey is a good food for a pregnant woman in this month. It is good for both mother and child.

Popular