Search This Blog

574. Paranishta

అన్ని కర్మలు, అన్ని జగత్తులు కూడా అమ్మ యందే లయం చెందుతాయి. ఇదే విషయాన్ని భగవానుడు గీతలో చెబుతూ సర్వం కర్మాఖిలం పార్ధ జ్ఞానే పరిసమాప్యతే - అర్జునా ! అన్ని కర్మలూ జ్ఞానమందు అంతమవుతాయి.

సూతగీతలో ఇలా చెప్పారు - శాస్త్రాధ్యయనం చెయ్యాలి. గురూపదేశం పొందాలి. విషయాన్ని తెలుసుకోవాలి. ఆత్మకన్న భిన్నమైనది ఏదీ లేదు. జగత్తులోని అన్ని వస్తువులలోనూ ప్రకాశించేది పరమాత్మ ఒక్కటే అనే విషయం తెలుసుకుని ఆత్మ సాక్షాత్కారము పొందాలి. ఆత్మసాక్షాత్కారమంటే తేలిక అయినది కాదు. ఉత్కృష్టమైనది. అదే పరానిష్ఠ అనబడుతుంది. సకల ఇంద్రియాలు మనస్సులో లయం అవుతాయి. మనస్సు బుద్ధిలో లయమవుతుంది. బుద్ధి ఆత్మలో లయమవుతుంది ఈ రకంగా చేసి ఉన్మనాస్థితిలో స్వరూప జ్ఞానం పొందటమే పరానిష్ఠ అనబడుతుంది.

All actions, all heavenly bodies, all beings dissolve in Divine Mother. It is said like this in Bhagavad Gita - 'Sarwam Karmaakhilam paartha gnaane parisamaapyate - O Arjun! All actions dissolve into divine consciousness.

It is said like this in Sootha geetha - One should put conscious efforts to acquire Divine knowledge. Approach learned Gurus to know what is real. This is very important. One has to realize that everything is a form of Paramatma. This is called self-realization. It does not come easy. It requires great efforts. Hence it is called 'Paranishta'. The senses dissolve in the mind. Mind dissolves in Intellect(Buddhi). Buddhi dissolves in Atman. This is called the state of 'unmana'. Reaching this state and realizing the Atman is called Paranishta.

573.Parashaktih

శరీరం తొమ్మిది ధాతువులతో ఏర్పడింది. పదవధాతువు సాక్షాత్తూ పరమేశ్వరి,

త్వగస్బగ్ - మాంస మేధో స్థిధాతవశక్తి మూలకాః
మజ్జా శుక్ల ప్రాణ జీవ ధాతవ శ్శివమూలకాః
నవధాతు రయం దేహో నవయోని సముద్భవః
దశమీ యోని రే కైవ పరాశక్తి స్తదీశ్వరీ ||


చర్మము, రక్తము, మాంసము, మెదడు, ఎముకలు అనే ఐదూ శక్తి ధాతువులు. కాగా మజ్జ, శుక్లము, ప్రాణము, జీవము అనేవి శివధాతువులు. ఈ తొమ్మిది ధాతువులతోను ఈ దేహం ఏర్పడింది. పదవ ధాతువు సాక్షాత్తూ ఆ పరమేశ్వరి అయి
ఉన్నది. ఆమెయే పరాశక్తి.

లింగపురాణంలో

యస్య యస్య పదార్థస్య యా యా శక్తి రుదాహృతా
సా సా విశ్వేశ్వరీ దేవీ సర్వా మహేశ్వరీ
శక్తిమంతః పదార్ధా యే తే వై సర్వవిభూతయః
పదార్దే శక్తయో యా యా స్తాం తాం గౌరీం విదుర్బుధాః ||


జగత్తులో ఏ ఏ పదార్థానికి ఏ ఏ శక్తి చెప్పబడిందో, ఆ శక్తి పరమేశ్వరియే. ఆ పదార్థాలు మహేశ్వరుడు. శక్తిగల పదార్ధాలన్నీ నీ విభూతులే. పదార్ధాలలో ఉండే శక్తి అంతా గౌరియే.

Our body is made of 9 basic elements. They all came from Divine Mother

Tvagasbag - mānsa mēdhō sthidhātavaśakti mūlakāḥ
majjā śukla prāṇa jīva dhātava śśivamūlakāḥ
navadhātu rayaṁ dēhō navayōni samudbhavaḥ
daśamī yōni rē kaiva parāśakti stadīśvarī ||

Skin, Blood, Flesh, Bones and Grey matter are elements of Shakti. Bone marrow, Prana, Jeeva and Shukla are elements of Shiva. Para shakti is the 10 element. All these 9 elements came from it.
It is said like this in Linga Purana

Yasya yasya padārthasya yā yā śakti rudāhr̥tā
sā sā viśvēśvarī dēvī sarvā mahēśvarī
śaktimantaḥ padārdhā yē tē vai sarvavibhūtayaḥ
padārdē śaktayō yā yā stāṁ tāṁ gaurīṁ vidurbudhāḥ ||

In Linga Purana it is said that, "All things are forms of Shiva. The Shakti in all these things is Gowri".

571. Maithryadhivaasanaalabhya

మైత్రి మొదలగు చతుర్విధ వాసనలతో పొంద దగినది. అవి

1. మైత్రి, 2. కరుణ, 3. ముదిత, 4. ఉపేక్ష

1. స్నేహితులయందు చూపేది మైత్రి
2. దుఃఖితులయందు చూపే కరుణ
3. పుణ్యాత్ములందు చూపేది ముదిత
4. పాపాత్ములందు చూపేది ఉపేక్ష

ఈ నాలుగు రకాల వాసనలచేత పొందదగినది. భాగవతంలో వీటిని వివరించటం జరిగింది.

సహృదయులైన వారితో బేధభావం లేకుండా చాలా సఖ్యంగా ఉండాలి అదే మైత్రి, దుఃఖించేవారు, బాధపడేవారు వీరందరియందు జాలి కలిగి ఉండటమే కరుణ. పుణ్య పురుషులతో సాంగత్యం చెయ్యటమే ముదిత. పాపాత్ములందు నికృష్టమైన యేహ్యభావన లేకుండా ఉండటమే ఉపేక్ష.

ఈ నాలుగు వాసనలను నిత్యజీవితంలో ఆచరించే వారికి పరమేశ్వర సాక్షాత్కారమవుతుంది. అంటే సాధకుడు సుఖము, దుఃఖము, పుణ్యము, పాపముల విషయమై జాగ్రత్త పడాలి.

మైత్రి మొదలగు వాటిచేత పరిశుద్ధమైనటువంటి చిత్తము గలవారు కేశాలను తొలగించి యోగమార్గంలో పయనించేవారు సమాధిస్థితిని పొందుతారు. అంటే అలాంటి పరమయోగులకు ఆత్మసాక్షాత్కారమవుతుంది.

అందుకే భాగవతంలో
నీ పాద కమల సేవయు
నీ పాదార్చకుల తోడి నెయ్యమును
నితాంతాపార భూతదయయును
తాపసమందార ! నాకు దయచేయగదే ||

భావం - హే ప్రభు! ఎవరైతే హృదయంలో నిత్యం నిన్నే తలచుకుంటారో అటువంటి వారి సేవాభాగ్యం నాకు కలిగించు. నిత్యం నీ సేవ చేసే వారితో నాకు మిత్రత్వం కలిగించు. ప్రాణికోటిపై దయ నాకు ప్రసాదించు.

This name explains the four tendencies that help us in the path of liberation. They are 1.Friendship, 2.Mercy, 3.Respect, 4.Discretion
  1. One should make friendship with good people (People with plain heart and good/positive thoughts)
  2. One should have mercy on helpless and needy
  3. One should have respect towards those who does virtuous deeds
  4. One should have discretion towards those sinful intentions
Divine mother helps in the path of liberation to those with these tendencies. In the Bhagavat Purana it is explained that:

Nee paada kamala sevayu
Nee paadaarchakula thodi neyyamu
Nitaantaapara bhoota dayayu
taapasa mandaara naaku daya cheya gade!!

Meaning, Oh lord! Please give me the chance to serve those who think of you always. Please give me the proximity of those who serve you. Please give me mercy so that I help those in need.

569. Niyanthri

జగ న్నియామకత్వాన్నియంత్రీ

లోకాలను నియమించునది. సమస్తదేవతలను, దిక్పాలకులను, గ్రహాలను, నక్షత్రాలను నియమించి లోకపాలన సజావుగా జరిగేటట్లు చూస్తుంది.

మధుకైటభ సంహారం తరువాత త్రిమూర్తులతో 'బ్రహ్మ సృష్టి కార్యక్రమం చూస్తాడు. హరిహరులు ఇద్దరూ అతడికి సహాయకారిగా ఉంటారు. కాళి లక్ష్మి సరస్వతి అనే శక్తులు మీ ముగ్గురికీ సహాయంగా ఉంటాయి. మీరు వెళ్ళి, మీ స్థావరాలు ఏర్పరచుకుని, సృష్టి కార్యం చూడండి అని చెబుతుంది. అంటే త్రిమూర్తులను ఆ పనులకు నియమించిందన్నమాట.


జీవులందరికీ వారివారి కర్మఫలాన్ని బట్టి జన్మలిస్తుంది. ఆ జన్మలో కష్టసుఖాలు, సుఖదుఃఖాలు కర్మఫలితంగానే కలుగుతూయి. వీటన్నింటినీ కలుగచేసేది, నియంత్రించేది అందుకే నియంత్రీ అనబడుతుంది. 

Divine mother is the chief administrator. She assigns jobs to all the devatas, dikpalakas, grahas, nakshatras such that the administration of the whole universe goes smoothly.

After triumph over Madhu and Kaitabha, Brahma starts the job of creation. Hari and Hara play helping role in creation. Divine mother says, "Shaktis Kaali, Lakshmi and Saraswati will help you. You set up an abode for your yourself and take care of the job of creation." That means Divine mother assigned the job of creation to Trimurthis.

Divine mother gives next birth to all beings based on their past actions. When they pray her, she liberates them from the cycles of birth and death. Hence she is called the chief administrator.

566: Mithra roopini

మిత్రాణాం సూర్యాణామివ రూపం యస్యాః - సా

స్నేహితులరూపము గలది. సూర్యుల యొక్క రూపము గలది.

మిత్రుడు అంటే - సూర్యుడు, స్నేహితుడు అని అర్ధం.

ఆకాశంలో దూరంగా కనిపించేవాడు సూర్యుడు. అతడు దేవతలను తృప్తి పరచేవాడు. కాబట్టి అతడు మధువువంటివాడు. ఆ సూర్యుడివల్లనే కాంతులు ప్రసరిస్తున్నాయి. ఎండలు కాస్తున్నాయి. వెలుగులు చిమ్మబడుతున్నాయి. మంచుకరిగినదులు ప్రవహిస్తున్నాయి. నీరు ఆవిరిగా మారి వర్షం కురుస్తోంది. పంటలు పండుతున్నాయి. జన జీవనం సాఫీగా సాగుతున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే సూర్యుడు జీవనప్రదాత. అటువంటి సూర్యునిరూపము గలది.
సూర్యులు 12 మంది. వీరినే ద్వాదశాదిత్యులు అంటారు.

1. ఇంద్రుడు, 2. పూష, 3. విష్ణువు, 4. ధాత, 5. అర్యముడు, 6. అంశుమంతుడు, 7. పర్జన్యుడు, 8 భగుడు, 9. వరుణుడు, 10. వివస్వంతుడు, 11. త్వష్ట, 12. మిత్రుడు

సూర్యుని కళలు పన్నెండు అవి.

1. తపిని, 2. జ్వాలిని, 3. విశ్వకల, 4. తాపిని, 5. రుచికల, 6. బోధిని, 7 ధూమ్ర, 8. సుషుమ్న, 9. ధారిణీ, 10. మరీచి, 11. భోగద
12. క్షమా

ఈ కళలే అమ్మ స్వరూపం.

Mithra means Sun. He is friend of Devatas. He gives them strength. He gives us food. His heat evaporates water and gives us rain. His heat melts snow and gives us perineal rivers like Ganaga, Indus etc. There are 12 forms of Sun. They are called Dwaadasha Adityas. They are:

1.Indra, 2.Poosha, 3.Vishnu, 4.Dhaata, 5.Aryama, 6.Amshumanta, 7.Parjanya, 8.Bhaga, 9.varuna, 10.Vivaswantha, 11.Twashta, 12. Mithra

Each of these have their own Kalas or Tejas. They are

1.Tapini, 2.Jwaalini, 3.Vishwa kala, 4.Taapini, 5.Ruchikala, 6.Bodhini, 7.Dhoomra, 8.Sushumna, 9.Dhaarini, 10.Mareechi, 11.Bhogada, 12.Kshama

563. Mohini

Mohayateeti Mohini - Moha means to bewitch. To enchant. Cast spell. One who bewitches is Mohini. The name of the power that can bewitch the whole universe.

In Laghunaaradeeyam it is said that, "O beauty! You are bewitching the whole universe. Hence you got that name 'Mohini'. It is because of this quality that you got this name"

The clash between Devatas and Danavas is always on. Their strengths and weakness are explained in the name 'Devakarya Samudyuta'. Daanavas gain early advantage in the beginning but ultimate sucess will be of devatas.

Once in such war, Danavas get very close to victory. They even kill few devatas. Then Devatas approach Lord Vishnu and seek help. Vishnu advised that, "Those who drink Amruth(ambrosia) has no death. It is in the milky ocean. Stir it and bring it out"

Both Devatas and Daanavas teamed up to stir the milky ocean to bring out the Amruth. Several things like kaalakuta, kalpavriksha, Iraavata, Uchaisrava etc came out the milky ocean. But they didn't stop until they found Amruth. Then Amruth came out. Both Devatas and Daanavas started fighting for it. Daanavas snatched it from Devatas and started plans to distribute among themselves. Then Lord vishnu came in the Mohini avatar. She bewitched all the Daanavas. Then she took Amruth from them and distributed it to Devatas.

The spell of Mohini is so strong that even Lord Shiva is bewitched. That is how Hariharan (Lord Ayyappa), the son of Hari (Mohini) and Hara (Shiva) is born.

మెహయతీతి మోహినీ - మోహింపచేయునది కాబట్టి మోహిని అనబడుతుంది.

జగత్తులన్నింటినీ మోహింపచేయునది. మహామాయా స్వరూపము.

లఘునారదీయంలో 'ఓ సుందరీ ! ఈ లోకమంతా నీ చేత మోహింపచేయబడుచున్నది. అందుకని నీ పేరు మోహిని అవుతున్నది. ఈ పేరు నీ గుణమువల్లనే పుట్టినది.

దేవదానవులకు పూర్వకాలం నుండి పోరు జరుగుతూనే ఉన్నది. ఈ పోరు గురించి తెలుసుకోవడానికి దేవ కార్య సముద్యుత నామం చదవండి. మొదట్లో దానవులు గెలుస్తారని అనిపిస్తుంది. కానీ అంతిమ విజయం దేవతలదే.

ఒకసారి పోరులో దేవతలంతా అసురులచేతిలో ఓడిపోవటం కొంతమంది మరణించటం జరుగుతోంది. ఆ సమయంలో దేవతలంతా విష్ణువు దగ్గరకు పోయి మరణం లేకుండా ఏదైనా ఉపాయం చెప్పమన్నారు. అమృతపానం చేసిన వారికి మరణముండదు. అమృతం పాలసముద్రంలో ఉన్నది. సాగరమధనం చేస్తే అమృతం పుడుతుంది అని చెప్పాడు విష్ణువు,

రాక్షసుల సహాయంతో సాగర మధనం చేశారు. దేవతలు. ఐరావతము, ఉచ్చైశ్వరము, కల్పవృక్షము, కామధేనువు, కాలకూటము సముద్రం నుంచి పుట్టినాయి. చివరకు అమృతం పుట్టింది. అమృతం మాదంటే మాదని పోట్లాడుకున్నారు. దేవదానవులు. ఇంతలో విష్ణుమూర్తి మోహినీరూపంలో వచ్చాడు. ఆమె రూపానికి తన్మయులైపోయారు రాక్షసులు. అమృతం నేను పంచుతానన్నది మోహిని. సరే అన్నారు. రాక్షసులు. అసురులను సమ్మోహింపచేసి అమృతాన్ని దేవతలకిచ్చింది. ఈ రకంగా సమ్మోహింపచేసినది మోహిని. బ్రహ్మాండ పురాణంలో

ఆదౌ ప్రాదు రభూ చ్ఛక్తి ర్ర్బహ్మణో ధ్యానయోగతః
ప్రకృతి ర్నామ సా ఖ్యాతా దేవానా మిష్టసిద్ధిదా |
ద్వితీయ మదభూ ద్రూపం ప్రవృత్తే మృతమంథనే
సర్వసమ్మోహజనక మవాగ్మానస గోచరం
యద్దర్శనా దభూ దీశ స్సర్వజ్ పి విమోహితః

బ్రహ్మ యొక్క తపః ఫలంగా పరమేశ్వరి మొదటగా దేవతల కోరికలు తీర్చటానికి ప్రకృతిగా అవతరించింది. ఆ సాగరమధనం చేసేటప్పుడు అందరినీ మోహింపచేస్తూ మోహిని అయింది. ఈ రూపాన్ని శివుడు మోహించాడు అని చెప్పబడింది. ఈ శివకేశవుల పుత్రుడే హరిహరసుతుడు అయ్యప్ప.

561. Dadimikusumaprabha



దాడిమీ వృక్షము - అంటే దానిమ్మ చెట్టు. ఈ చెట్టు రెండు రకాలుగా ఉంటుంది.

  1. పండు దానిమ్మ
  2. పువ్వు దానిమ్మ
పండు దానిమ్మనే కాయ దానిమ్మ అనికూడా అంటారు. ఈ చెట్టుకు పూలు పెద్దగా ఉండవు. కాయలే ఇక్కడ ప్రాముఖ్యత.
పూవ్వుదానిమ్మ అసలు కాయలు కాయదు. కేవలం పూలే పూస్తుంది. ఈ పూలు ఎరుపురంగులో ఉంటాయి. అమ్మ శరీరవర్ణం, దానిమ్మపూలరంగు రెండూ ఒకటిగానే ఉంటాయి. అందుకే ఆ దేవి దాడిమీ కుసుమప్రభలతో ప్రకాశిస్తుంది అని చెప్పబడింది.

Dadimi tree means Pomegranate tree. There are two types of Dadimi trees.

  1. Fruit bearing - This has flowers. Fruits come out those flowers.
  2. Flower bearing - This is popular for its flowers. It does not bear fruits.
The flowers of Pomegranate tree are in red color. Divine mother's radiance is in this color. So she is called Dadimi kusuma prabha - One who glows in the color of a Pomegranate flower.


556. Kalikalmashanashani

ధర్మం నాలుగు పాదాలమీద నడుస్తుంది. అవి 1.సత్యము, 2.సౌచాము, 3.దయ, 4.తపస్సు. వీటిలో ఏ ఒక్కటి దెబ్బతిన్నా ధర్మం యొక్క నడక కుంటుబడుతుంది. వీటిలో సత్యము సాక్షాత్తు భగవత్స్వరూపం. కనుక అది శాశ్వతం. మిగిలినవి మాత్రం కలియుగంలో అంత స్పష్టంగా సర్వకాల సర్వ దేశాలయందు కనబడవు. దీని వల్ల అధర్మం పెరిగిపోతుంది. కలి యొక్క ప్రభావం చాలా ఎక్కువ అవుతుంది. ప్రజలకు పాపభీతి ఉండదు. ఐహికసుఖాలమీద వాంఛ బాగా పెరుగుతుంది. తెలిసో తెలియకో జనులందరూ ఎన్నో పాపాలు చేస్తారు. ఈ పాపాలను నశింపచేయటం ఒక్క లలితమ్మ వల్ల తప్ప ఎవరి వల్లా కాదు.

కూర్మపురాణంలో “నీటివల్ల నిప్పు చల్లారుతుంది. సూర్యుని వెలుగులవల్ల చీకట్లు తొలగిపోతాయి. అలాగే కలియుగంలో అమ్మను స్మరిస్తేనే చాలు సకల పాపాలు నశిస్తాయి" అని చెప్పబడింది.

బ్రహ్మాండపురాణంలో "తెలిసిగాని, తెలియకగాని చేసిన పాపాలు అమ్మను స్మరించినంత మాత్రానే నశిస్తాయి" అని చెప్పారు. కాబట్టి కలియుగంలో పాపాలను నశింపచేసే శక్తి పరాశక్తి అయిన లలితమ్మకు తక్క అన్యులకు లేదు.

Dharma treads on four legs. They are 1.Truth, 2.Purity, 3.Generosity, 4.Meditation. Of these Truth is eternal. It stays forever. However, the rest of them become very weak in kali yuga. Due to this establishment of Dharma becomes very weak. Adharma will be widespread. People lose fear of sin. Greed spreads its fire in everyone's minds. Actions with these will accrue sin. Only Divine Mother can help us wash out these sins.

In kurma purana it is said that, "Fire can be doused with water. Sun's light will shatter darkness. In kaliyuga, those who chant the names of Divine mother will be able to wash away all their sins"

In brahmanda purana it is said that. "Sins accrued knowingly or unknowingly can be washed away by chanting names of Divine Mother.

555. Achintyaroopa

పరమాత్మ నిర్గుణస్వరూపిణి. కాబట్టి చింతించటానికి వీలులేదు. రూపంలేదు. ఈమె అవ్యక్తస్వరూపిణి. పంచభూతభావనలేనిది. ఆవాంగ్మాన గోచరమైనది. మనస్సుకు, వాక్కుకు కూడా కారణమైనది. అంటే వాటికన్న పురాతనమైనది. కాబట్టే ఇంద్రియాలతో ఆత్మను తెలుసుకోలేము.

కఠోపనిషత్తు ఇలా చెప్పింది:

నచక్షుర్గచ్ఛతి నవాగ్గచ్ఛతి నోమనః

ఆత్మ ఉన్న చోటికి వాక్కు వెళ్ళలేదు. కనులు పోలేవు. అందుకే పరదేవత రూపము చింతించరానిది. ఆలోచించలేనిది. అచింత్యరూపా అని చెప్పబడింది.

Paramaatma has no attributes. Mind, Senses and Intellect. All these faculties dwell on attributes like form, glow, character, logic, the 5 elements etc. So they cannot help to know the One that is without any attributes. Atman is beyond the reach of these faculties.

Kathopanishath says like this:

Nachakshurgachati navaagachati nomanah:

Eyes can't see Atman. Speech cannot explain Atman. Mind cannot imagine Atman


553. Sarwamrutyunivaarini

లోకంలో పుట్టిన ప్రతి ప్రాణి మరణించి తీరవలసినదే. ఈ లోకము మరము. అంటే మరణము స్వభావంగా కలిగినటువంటిది. అయితే మృత్యువు రెండు రకాలు. 1.అపమృత్యువు 2. కాలమృత్యువు


కాలమృత్యువు అంటే ఆయువు తీరగానే మృత్యువాతపడటం. ప్రతి ప్రాణికీ మరణమున్నది. ఎప్పుడో ఒకప్పుడు ప్రతివారూ మరణించాలి.

అపమృత్యువు అంటే అనుకోకుండా, ఆయువు తీరకుండానే మరణించటం, నీటి గండము, వాహనగండము. ఇలాంటి వాటివల్ల అంటే ప్రమాదాలు, యుద్ధాలు, భూకంపాలు, వరదలవల్ల మృత్యువు కలుగుతుంది.

వరమేశ్వరుణ్ణి నమ్మినవాడికి మృత్యువుండదు. వేదంలో 'మహాదేవుని తెలుసుకున్నవాడు మృత్యువును జయిస్తున్నాడు' అని చెప్పబడింది.

లోకంలో పుట్టిన ప్రతి ప్రాణీ మరణించి తీరాలి కదా ? మరి మృత్యువును ఏ రకంగా జయిస్తాడు ? అని సందేహము కలగవచ్చు. ఇక్కడ విషయం ఏమిటంటే పుట్టిన ప్రతి ప్రాణీ తప్పనిసరిగా మరణిస్తుంది. కానీ పుట్టుకే లేని వారికి మరణం లేదు. కాబట్టి అసలు పుట్టనేలేదు అనుకోండి. అప్పుడు మరణమే ఉండదుకదా. ఈ రకంగా మరణాన్ని జయించినట్లే కదా. మరణాన్ని జయించడం అంటే మల్లి పుట్టుక లేదా జన్మ అవసరం లేని స్థాయికి చేరడం.

జన్మ లేకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి ? ముక్తి రావాలి. జీవాత్మని పరమాత్మతో ఏకం చెయ్యాలి. అంటే శరీరం విడిచిపెట్టె సమయంలో దాని పైన వ్యామోహం ఉండకూడదు. నేను వేరు శరీరం వేరు అనే భావనతో దాన్ని తృణంగా భావించి విడిచి పెట్టాలి. అప్పుడు పునర్జన్మ ఉండదు. దీనికి జ్ఞానం కావాలి. వైరాగ్యం కావాలి. సర్వవ్యాధి ప్రశమని నామంలో వివరించినట్లు అమ్మను ప్రార్ధిస్తే ఆవిడ జ్ఞాన వైరాగ్యాలు ప్రసాదిస్తుంది.

అందుకే అన్నపూర్ణాష్టకంలో శంకరాచార్యులవారు

అన్నపూర్ణే ! సదాపూర్ణే ! శంకరప్రాణవల్లభే !
జ్ఞానవైరాగ్య సిద్యర్థం భిక్షాం దేహి చ పార్వతి !


అంటూ జ్ఞానవైరాగ్యాలు ప్రసాదించమని అమ్మని వేడుకుంటున్నారు. ఈ విధంగా ఆవిడ తన పిల్లలకు జ్ఞానవైరాగ్యాలు ఇచ్చి ముక్తిని ప్రసాదిస్తుంది. అందుచేత 'సర్వమృత్యునివారిణీ' అనబడుతుంది.

In this world, one that has a birth date will have a death date. Death is of two types. 1. Natural death 2. Accidental death

Natural death - Every body has a predefined lifetime. Death happening after passing the lifetime is natural death

Accidental death - It is death caused due to accident. Before the lifetime of the body.

Those who believe in Parameswara have no death. In vedas, it is described that 'Those who know Mahadeva are overcoming over death"

If everything that has a birth date has a death date, then how can a few overcome death? The hidden meaning of overcoming death is to avoid re-birth. Because you are born, you will die. But if you don't have to take birth again, then you will never die again. That's how you overcome death.

To avoid re-birth, you need to realize that you are the Atma and not the perishable body. At your last breath, you should be able to shun all your worldly bonds (including your body) and merge with Paramatma. Then you will not take a re-birth. For that one needs superior knowledge of Paramatma. By praying Divine mother as explained in sarwa vyadhi prasamani one can attain the divine knowledge.

Sri Adi Shankara prayed Divine Mother like this in Annapura ashtaka

Annapurne! Sadapurne! Shankapranavallabhe!
Gnana vairagya sidhyardham bhiksham dehicha paravati!

"O Mother! I need the superior divine knowledge to escape this cycle of birth and death. Please give it to me"

552: Sarvavyadhiprasamani

 Divine mother destroys all diseases. Diseases are of two type

  1. Physiological
  2. Psychological

Physiological diseases are caused by changes in the body and by climates. All kinds of diseases from fever to cancer will be destroyed by Divine Mother. Those who practice Sri vidhya, Brahma vidhya, etc., gain perfect balance between Kapha, Vaata and Pitta. They will have abundance of life force. This increases their disease resistance and will improve physical health.

Psychological diseases - These are not related to the body. These are caused by loss of beloved ones or any other extreme events. There is no medicine for these. But Divine mother can cure these diseases also. These diseases are alleviated by focusing ones mind on Divine mother and meditating. It can be explained technically as below:

We store our knowledge in form of cyclic graphs. These graphs start from an originating node and go through few other nodes and circle back to the origin. For example:
  1. I --tell lies--> Dad --gets--> upset--not good--> me
  2. Me <--gives money--Job<--should do<--I
  3. I --pray--> God --fulfills-->My wishes
If you form a ring of the above sentences, it forms a circle that joins at nodes like 'I' or 'Me' or 'My'. We create crores of such cycles/patterns in our memory. These are used in decision making. Those cycles that have 'I' or 'Me' or 'My' in the origin node aggravate, greed, selfishness, impatience etc. They cause negative feelings when things don't happen the way we want.

Learned Yogis align their mental patterns with God. Their cycles will have God in their origin nodes. Example:

  1. God--Created-->Body--Needs--> Food<--given by<--God
  2. God --protects-->body-->pray-->God
  3. God--gave--> intellect --will use-->virtuous deeds--leads to -->God(Liberation)
For those with these kinds of mental patterns, there is nothing for or against them. Their patterns advise to accept everything with neutral mind.

By meditating upon God and chanting matras that mean that the whole universe is filled with God. One will transform their mental patterns. 'I' or 'Me' or 'My' in their origin nodes gets replaced by God. Hence they become mentally strong.

552. సర్వవ్యాధిప్రశమనీ

సమస్తమైన వ్యాధులను నాశనము చేయునది. అమ్మ తన పిల్లల యొక్క వ్యాధులన్నింటినీ శమింపచేస్తుంది. వ్యాధులు అనేకరకాలు వాటిలో ముఖ్యమైనవి.

1. శారీరకములు
2. మానసికములు

శారీరకములు అంటే శరీరంలో కలిగే మార్పులవల్ల, శీతోష్ణాలవల్ల వచ్చేవి. లేదా పూర్వజన్మల కర్మ ఫలితంగా వచ్చే దీర్ఘవ్యాధులు. జ్వరం దగ్గర నుంచీ అన్నిరకాల వ్యాధులు. వీటిని నాశనం చేస్తుంది. శ్రీ విద్య, బ్రహ్మ విద్య మొదలైనవి సాధన చేసే వారికి కఫ వాత పిత్తాల సమతుల్యత కలుగుతుంది. ప్రాణ శక్తి యొక్క సమృద్ధి కలుగుతుంది. తద్వారా రోగ నిరోధక శక్తి పెరిగి శారీరిక ఆరోగ్యం మెరుగు పడుతుంది.

మానసిక వ్యాధులు - ఇవి శరీరానికి సంబంధించినవి కావు. తన వారు దూరం కావటంవల్లనో, తానుకోరుకున్నది దొరకకపోవటంవల్లనో ఈ రకమైన వ్యాధికలుగుతుంది. ఇది మనసుకు సంబంధించిన వ్యధ. దీనికి వైద్యశాస్త్రంలో మందులేదు. కాని అమ్మ ఈరకమైన వ్యాధిని కూడా నాశనం చెయ్యగలదు. రోగి యొక్క మనసును అమ్మ మీదికి మళ్ళించటమువల్ల ఈ వ్యాధులు ఉపశమిస్తాయి. దీనికి సాంకేతిక పరమైన విశ్లేషణ కూడా ఉంది.

మన మెదడులోని జ్ఞానం అంతా రంధ్రాల రూపంలో ఉంటుంది. సాధారణంగా ఈ రంధ్రాలన్నీ 'నేను', 'నాకు', 'నాది' అనే వాటిని మూలంగా చేసుకుని ఏర్పడతాయి. ఉదాహరణకి

  1. నేను -- అబద్దం ఆడితే ---> నాన్నగారు --కోపం వస్తుంది --> మంచిది కాదు --> నాకు.
  2. నాకు <-- డబ్బులు వస్తాయి <-- ఉద్యోగం చేస్తే --నేను
  3. నేను -- మొక్కుకుంటే --> దేవుడు --వరమిస్తాడు --> నాకు
పైన ఉన్న వాక్యాలను ఉంగరంలా చుడితే అవి 'నాకు', 'నేను' అనే వాటి దగ్గర కలిసి ఒక రంధ్రం ఏర్పడుతుంది. మన ఊహలతో ఇటువంటి కోట్ల రంధ్రాలను తయారు చేసుకుంటాము. ఈ రంధ్రాలే మన నిర్ణయాత్మక శక్తి . మూలపూసలో 'నేను', 'నాకు' ఉండేటటువంటి రంధ్రాలు ఎక్కువయ్యేకొద్దీ స్వార్ధం, దురాశ, అసహనం వంటి భావాలు అధికమయిపోతాయి. ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ రంధ్రాల వల్ల మనం మరింత బాధకు గురి అవుతాము.

జ్ఞానులు వారి రంధ్రాలను భగంతునితో అనుసంధానం చేస్తారు. వారి రంధ్రాలలో మూల పూసలు 'నేను', 'నాకు' తో కాకుండా 'భగవంతుడి' తో ఉంటాయి. ఉదాహరణకు

  1. భగవంతుడు --సృష్టించాడు--> శరీరాన్ని --పోషణ కొరకు --> అన్నం --ఇచ్చాడు --> భగవంతుడు
  2. భగవంతుడు --రక్షిస్తాడు --> శరీరాన్ని --శరణు వేడుతాను --> భగవంతుడిని
  3. భగవంతుడు --ఇచ్చడు --> తెలివితేటలు -- ఉపయోగిస్తాను --> ధర్మావలంబనకు <--ఇస్తాడు మోక్షం --భగవంతుడు
ఇటువంటి రంధ్రాలు ఉన్న వారికి అనుకూలం ప్రతికూలం అనే ఏమి ఉండదు. ఎందుకంటే ఈ రంధ్రాలు దేనినైనా సమానంగా స్వీకరించమని ఆదేశిస్తాయి.

జగత్తంతా పరమాత్మ స్వరూపమే. ఈ మానసిక వ్యధ నేను గతంలో చేసిన కర్మల వల్లనే. వాటిని అనుభవించటం వల్ల కర్మక్షయం అవుతుంది అనే భావముతో మనసును అమ్మ మీదికి మళ్ళించటమువల్ల మనసు తేలిక బడుతుంది. ఎందుకంటే ఆ భావన వల్ల రంధ్రాలలో మూలపూసలు కదిలి 'నేను' ఉన్నచోట భగవంతుడు చేరుతాడు. స్వల్పకాలం చేస్తే జపం. దీర్ఘ కాలం చేస్తే తపస్సు. మనం చేసే దాని బట్టి రంధ్రాల మార్పు ఉంటుంది.

551. Viyadhadhi Jagatprasuh

వియత్ అంటే ఆకాశము. ఆకాశము మొదలైన జగత్తులను ప్రసవించినది లేక సృష్టించినది. సృష్టిలో మొట్టమొదటగా ఆకాశం ఉద్భవించింది. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి - అగ్ని, అగ్ని నుంచి - నీరు, నీటి నుంచి భూమి. ఈ రకంగా పంచభూతాలు తన్మాత్రలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. గుణాలు క్రమేణా 84 లక్షల జీవరాశి ఆవిర్భవించింది. ఇదే మంత్రపుష్పం యొక్క సారాంశం కూడా.

ప్రళయం జరిగినప్పుడు కర్మ క్షయం కానటువంటి జీవరాశి అంతా, తమ కర్మ తమతోనే మూటకట్టుకుని మాయలో లీనమైపోయాయి. ఇక పంచభూతాలు క్రిందనుంచి పైకి లయమైయాయి. అంటే

భూమి - జలంలో లీనమైపోయింది
జలం - అగ్నిలో లీనమైపోయింది
అగ్ని - వాయువులో లీనమైపోయింది.
వాయువు - ఆకాశంలో కలిసిపోయింది.

వీటన్నింటినీ కలుపుకున్న ఆకాశం మాయలో కలిసిపోగా, మాయ పరమాత్మునిలో లీనమైపోతుంది. ఈ విధంగా జగత్తునంతా తన గర్భాన ధరిస్తాడు పరమేశ్వరుడు. గర్భం ధరించటమనేది స్త్రీ లక్షణం కాబట్టి పరమాత్మకు స్త్రీత్వము ఆపాదించబడుతోంది. లేకపోతే, పరమాత్మకు లింగబేధాలు లేవు. ఆ రకంగా గర్భంలో దాచుకున్న జగత్తును కొంతకాలానికి మళ్ళీ బయటకు పంపాడు పరమాత్మ. అదే జగత్సృష్టి. అందుకే శ్రీమద్భాగవతంలో

ఒక పరి జగముల వెలినిడి
ఒక పరి లోపలికి గొనుచు ఉభయము గనుచున్

ఒకసారి ఈ జగత్తులను తన గర్భం నుంచి బయటకు వదులుతాడు. అది సృష్టి, జగత్తును తన లోపల ఇముడ్చుకోవటం లయము. ఇది పరమాత్మ లక్షణం, పరమేశ్వరియే పరబ్రహ్మ, కాబట్టి ఈ లక్షణాలన్నీ ఆ దేవికి ఉన్నాయి.

దక్షిణామూర్తి స్తోత్రం ఈ విధంగా చెప్తుంది. 'బీజాస్యాన్తరివాఙ్కురో జగదిదం, ప్రాంనిర్వికల్పహ్ పునః' అంటే ఈ విధంగా అయితే ఒక చిన్న విత్తనం నుండి పెద్ద మర్రి చెట్టు వస్తుందో, అదే విధంగా ఈ సమస్త బ్రహ్మాండాలు బీజ రూపమైన పరమాత్మలో నిభిడీకృతం అవుతాయి.

Viyath means sky (space). Divine mother gave birth to this universe that has the sky, the earth, the water etc. Sky is the first one in creation. This is explained in the 'Mantra Pushpa' as well. So it starts with 'Vyopam pushpam veda Pushpavaan, prajavaan, pashumaan bhavati'. That means.. Space and time came first - 'Vyopam pushpam veda Pushpavaan, prajavaan, pashumaan bhavati'. Then came Air - 'Vayurva apamaayatanam...' Then came Fire - 'Agnirva apamaayatanam...' Then came Water - 'Parjanyasyapamaayatama' Then came earth (solid matter). This way all the five elements, five thanmatras, five senses, five limbs, 3 gunas and the 84 lakhs species came - 'Rajadi Rajayah prasahya sahine' During apocalypse, all those living beings whose karma is not yet fulfilled will carry their karmic balance along with them. At that time First Earth merges into Water Water merges into Air Air merges into Fire Fire merges into Space Space then merges into Paramatma. Then the whole universe goes into Paramatma's womb. Because in our world, Woman carry womb, we assign feminine gender to Paramatma (and call her Divine Mother). But in reality, Paramatma is neutral. Beyond gender. Then the whole creation emerges again from Paramatma's womb. All those living beings with unfulfilled karma take birth again. This way the cycle continues. The same is explained in Dakshina murthy stotra. Beejasyantari vankuro jagadidam prannirvikalpah punah punah - The way a huge banyan tree emerges from a small seed, the whole universe emerges from paramatma again and again.

550. Vidya

విద్య అంటే జ్ఞానరూపమైనది, మోక్షదాయకమైనది విద్య. దేవీ మాహాత్మ్యంలో “ఆ పరాశక్తి విద్యగా ఉన్నది" అని చెప్పబడింది. గౌడపాదులవారు కూడా పరమేశ్వరియే విద్య అని చెబుతున్నారు. మాయతో కూడినది అవిద్య. మాయలేనిది జ్ఞానము. అని శైవతంత్రంలో చెప్పారు. విద్యయే స్వరూపంగా గల దేవి. దేవి వేదస్వరూపిణి. జ్ఞానస్వరూపిణి. కంటికి కనిపించే వాటి సాయంతో కంటికి కనిపించని దాన్ని కొనుక్కొవటమే విద్య అనబడుతుంది. దేనిచేత అక్షరపరబ్రహ్మను గురించి తెలుసుకోగలమో అది విద్య.

వేదంలో రెండురకాల విద్యలు చెప్పబడ్డాయి. 1. అపరావిద్య 2. పరావిద్య. ముండకోపనిషత్తులో వీటిని వివరించటం జరిగింది. శునకుని కుమారుడు శౌనకుడు విద్యాభ్యాసం పూర్తిచేసి గృహస్థాశ్రమం స్వీకరించటానికి విముఖుడై తన గురువైన అంగిరసుణ్ణి అడుగుతాడు. "అర్యా ! దేన్ని గురించి తెలుసుకుంటే నాకు సర్వమూ తెలుస్తుందో, దాన్ని గురించి వివరించండి” అంటాడు. దానికి అంగిరసుడు “నాయనాలోకంలో తెలుసుకోవలసిన విద్యలు రెండు ఉన్నాయి. 1. అపరావిద్య 2. పరావిద్య.

అపరావిద్య లౌకిక ప్రయోజనాలకు వర్తిస్తుంది. బుద్ధి సంపన్నులైన మహర్షులు యజ్ఞకర్మలు చేస్తారు. యజ్ఞాలవల్ల పుణ్యలోకాలు కలుగుతాయి. లోకంలో మనం చేసే కర్మలన్నింటివల్లా పుణ్యఫలం కలుగుతుంది. తద్వారా సిరిసంపదలు, భోగభాగ్యాలు, ఉన్నత పదవులు కలుగుతాయి. పరావిద్య అంటే మోక్షవిద్య, సర్వ సంఘ పరిత్యాగం చేసి విరాగి అయినవాడు మాత్రమే అనుసరించగలిగినది. సాధకుడికి మోక్షమార్గం చూపేది. ముందుగా అపరావిద్యనుపాసించి, కర్మఫలాన్నననుభవించి, ఆ తరువాత పరావిద్యను తెలుసుకోవాలి అంటాడు.

అలాగే ఛాందోగ్యోపనిషత్తులో దేవర్షి అయిన నారదుడు సనత్కుమారుని దగ్గరకుపోయి, స్వామి గతంలో నేను వేదవేదాంగాలు ఉపనిషత్తులు, చతుషష్టి కళలు, సర్వశాస్త్రాలు అభ్యసించాను. సంగీతసాధన చేశాను. కానీ నాకు మనశ్శాంతి లేదు. ఆత్మజ్ఞానం కలగలేదు. కాబట్టి నాకు ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించి, దుఃఖవిమోచన కలిగించండి అంటాడు. తరువాత సనత్కుమారుడు నారదుడికి బ్రహ్మోపదేశం చేస్తాడు.

కాబట్టి విద్య అనేది పరావిద్య. జ్ఞానస్వరూపం. అపరావిద్య పూర్తిగా తెలిసిన తరువాతనే పరావిద్య లభ్యమవుతుంది. పరమేశ్వరియే జ్ఞానస్వరూపం. కాబట్టి విద్యా అంటే ఆ పరమేశ్వరియే కాని వేరుకాదు.

She who is embodiment of true knowledge. She who helps in liberation. In Devi Mahatyam, it is said that Divine Mother is Vidya. The same is acknowledged by Sri Goudapada acharya. Shaiva Tantra said, "One with Maya(illusion) is Avidya. One without Maya is Vidya". Vidya is the process of understanding the one that is not perceivable with whatever information that can be procured with the help of senses.

In vedas, it is explained that Vidya is of two types. 1.Apara Vidya 2. Para Vidya. There is a good description of these in Mandukopanishath. After finishing his studies, Shounaka, son of Shunaka approaches his guru Sri Angeerasa and asks like this, "Hey guru! Knowledge of what will make me known of everything? I want to know about it. Please teach me". To that, Sri Angeerasa replies, "Vidya is of two types. 1.Apara, 2.Para.

Apara helps you for your mundane activities. It is required for performing virtuous deeds like Yagnas. That gives you good fame and money. It gives you luxuries and power. Para vidya means the one that helps you in attaining Moksha. Only those who left behind all the worldly bonds should pursue this. One should first learn Apara vidya and experience the karma and its result. After that one should pursue para vidya"

There is a similar discussion in Chandogya upanishath. Devarshi Narada approaches Sri Sanath Kumara and says like this. "Hey guru! Till now, I have learnt Vedas and Vedangas. I learnt Upanishaths. I also learnt about all the 64 vocational studies. I learnt music also. But nothing gave me eternal peace. I still did not achieve self-realization. So I seek your guidance to attain self-realization." Then sage Sanath Kumara teaches Brahma Vidya (Para Vidya) to Devarshi Narada.

So that means one has to learn apara vidya first. Then he/she should experience the karma and results. Then they should pursue para vidya.

547. Bandhamochini

అవిద్యాసంబంధమైన బంధాలను విడిపించేది. లౌకిక బంధాల నుండి విముక్తి కలిగించేది. అరిషడ్వర్గాలను జయింపచేసేది. రాగద్వేషాల నుండి తన భక్తులకు విడుదల కలిగించేది.

యయాతిదేవయానిల కుమారుడు తుర్వసుడు. అతని పెంపుడు కుమారుడు ఏకవీరుడు. పండితుడు, శాస్త్రవేత్త, ధర్మవిధుడు, పైగా పరాక్రమశాలి. ఏకవీరుడు రాజ్యం చేస్తున్న రోజులలో గంగానదీ తీరాన ఉన్న ఒక చిన్న రాజ్యాన్ని 'రభ్యుడు' అనే రాజు పాలిస్తున్నాడు. అతనికి పరమేశ్వరి అనుగ్రహంవల్ల ఒక కుమార్తె కలిగింది. ఆమె పేరు ఏకావళి.

ఒక రోజున రాకుమార్తె 'ఏకావళి, తన చెలికత్తె యశోవతితో కలిసి గంగాతీరానికి వెళ్ళింది. అక్కడ కాలకేతుడనే రాక్షసుడు రాకుమారిని చూసి మోహించి, వారిద్దరినీ ఎత్తుకుపోయాడు. యశోవతి పరమేశ్వరి అనుష్ఠానమున్నది. ఒకరోజు రాత్రి పరమేశ్వరి ఆమెకు కలలో కనిపించి మరునాడు ఉదయమే గంగానది ఒడ్డుకువెడితే అక్కడ ఏకవీరుడు అనే
రాజుంటాడు. అతనికి జరిగిన విషయం చెప్పు. అతడు రాక్షసుణ్ణి చంపి మిమ్మల్ని రక్షిస్తాడని చెప్పింది.

పరమేశ్వరి మాటప్రకారం మరుసటి రోజు ఏకవీరుణ్ణి కలిసింది. విషయం తెలుసుకున్న ఏకవీరుడు రాక్షసుణ్ణి సంహరించి ఏకావళిని వివాహమాడాడు. ఈ రకంగా పరమేశ్వరిని అర్చించటంచేత రాకుమార్తె చెరవీడింది. ఏకావళికే కాదు పరమేశ్వరిని అర్చించే ఎవరికైనా సరే బంధనాలు ఉండవు. కాబట్టి ఆ దేవి 'బంధమోచనీ' అనబడుతుంది.

She who removes the bonds caused due to ignorance. She who helps in our triumph over Arishadvarga. She who protects her children from Raga and Dwesha.

Turvasa is the son of Yayati and Devayani. Ekaveera is their adopted son. He is a pandit. He learnt all the vedas. A staunch follower of dharma and a great warrior. Rubhya is a feudatory king of a small province at the banks of river Ganga. He has a daughter called Ekaavali. She is born with the blessings of Divine Mother.

One day, princess Ekavali went to the banks of river Ganga along with her friend Yashovathi. Demon Kaalaketha kidnapped both of them from there. His intention was to possess Ekaavali. Yashovathi does puja of Divine Mother every day. So she had Divine Mother's blessings. One day, Divine Mother appeared in Yashovati's dreams and told her to go to the banks of river Ganga the next morning and meet Ekaveera. She told her to explain what happened to Ekaveera and seek his help.

Yashovathi did as advised by Divine Mother. Ekaveera killed the demon and rescued both of them. He also married Ekaavali. Like this Ekaavali got freed from bondage by praying Divine Mother.

546. Pulomajaarchita

పులోముని కుమార్తె అయిన శచీదేవిచే పూజించబడినది. ఈమె ఇంద్రుని భార్య.

పురూరవుడు రాజ్యం చేస్తున్న రోజులలో ఒకనాడు వనంలో ఊర్వశిని మోహించాడు. వారిద్దరూ కలిసి కొంత కాలం కాపురం చేశారు. వారికి పదిమంది సంతానం కలిగారు. అందులో ఆరవవాడి పేరు 'ఆయువు' ఇతని కుమారుడు నహుషుడు.
వేదవేదాంగవిదుడు. తత్త్వవేత్త, పండితుడు. అనేక యజ్ఞాలు, యాగాలు నిర్వహించాడు. వంద అశ్వమేధాలు చేశాడు.

త్వష్ట ప్రజాపతి కుమారుడు వృత్రుడు రాక్షసనైజం కలవాడు. యుద్ధంలో ఇంద్రుణ్ణి ఓడించాడు. వృత్రాసురునితో గెలవలేక ఇంద్రుడు అతనితో స్నేహంచేసి, వృత్రుడు ఏమరుపాటుగా ఉన్నప్పుడు అతణ్ణి సంహరించాడు. ఆ కారణంగా ఇంద్రుడికి బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంది. అతడి ముఖం కళావిహీనమైపోయింది. దాంతో ఇంద్రుడు అమరావతిని వదిలి మానససరోవరానికి పారిపోయి అక్కడ ఒక పద్మంలో దాక్కున్నాడు.

రాజు లేకుండా రాజ్యం సాగదు కాబట్టి ఇంద్రపదవికి అర్హుడైన వ్యక్తికోసం వెదికారు దేవతలు నూరు అశ్వమేధాలు చేసినవాడు ఇంద్రపదవికి అర్హుడు. భూలోకంలో నహుషుడు చక్రవర్తి ఆ పనిచేశాడు. కాబట్టి అతడికి ఇంద్రపదవిని కట్టబెట్టారు దేవతలు. ధర్మపరుడైన నహుషుడు, ఇంద్రపదవి వచ్చేసరికి భోగలాలసుడైనాడు. సర్వకాల సర్వావస్థలయందుభోగాలలో తేలియాడుతూ చివరకు ఇంద్రుని భార్య శచీదేవి కావాలి అన్నడు. దేవతలు పరిపరివిధాల నచ్చచెప్పటానికి ప్రయత్నించారు. వినలేదు నహుషుడు.

చివరకు దేవగురువైన బృహస్పతి శచీదేవికి భువనేశ్వరీ మంత్రాన్ని ఉపదేశించి 'అమ్మా ! ఈ మంత్రాన్ని జపించు ఆమెయే నీ కష్టాలు తీరుస్తుంది' అన్నాడు. బృహస్పతి మాట ప్రకారం శచీదేవి పరమేశ్వరిని ఆరాధించింది. ఆమె ప్రసన్నమైంది. ఇంద్రుడు అశ్వమేధం చేశాడు. అతని పాపం పోయింది. నహుషుడికి పెద్దపామై పొమ్మని అగస్త్యుడు శాపమిచ్చాడు. ఈ రకంగా పరమేశ్వరి దయవల్ల శచీదేవికి నహుషుని పీడ వదిలింది. ఈ విధంగా పులోముని కుమార్తెతో అర్చించబడింది కాబట్టి ఆ దేవి పులోమజార్చితా అనబడింది.

She who is worshipped by Sachi devi. Wife of Indra, daughter of Puloma.

Once upon a time, Puroorava used to be the emperor of a big empire. He fell in love with Oorvasi and they got married. They had 10 children. The 6th one of those is called 'Ayuvu'. Their son is 'Nahushudu'. Nahusha learnt all the vedas and vedangas. He is a great philosopher. He performed may Yagnas and Yagas. He did 100 Ashwamedha yagas.

Vruthra is the son of Thwashta prajapati. He is a rakshasa. He defeated Indra in a bloody war. Indra lost is kingdom of Amaravati. After sometime, incapable of confronting Vruthrasura in a direct war, Indra killed Vruthrasura by deceit. Due to this, is accrued Brahma hathya pataka(Sin of killing a Brahmin). He lost all his powers. So Indra left Amaravati and went to Manasarovar. He hid there. 

Bereft of a ruler Amaravati became lifeless. So devatas started quest for a new ruler. Only those who did 100 Ashwamedha yagas are elgible to rule Amaravati. So they chose Nahusha to rule Amaravati. After becoming the king of Amaravati, Nahusha got consumed by its beauty and glory. He indulged in its luxuries and lost his discretion of dharma. He intended to force marriage Sachi devi claiming that he is Indra now and so she rightfully belongs to him. Other Devatas tried to explain to Nahusha. They even warned that it would lead to his destruction. But he paid no heed.

Sachi devi approached Guru of Devatas, Bruhaspati for help. He taught her the Bhuvaneswari mantra. He advised her to chant this mantra and then Divine Mother will help her. Sachi devi followed Bruhaspati's advise. Then with help of Divine mother Indra performed an Ashwamedha yaga. With that his sin washed away. Sage Agastya cursed Nahusha to become a serpent. This way, Divine mother helped Sachi devi to overcome all her problems.


537. Swadha

పితృదేవతలకు తర్పణలు అర్పించేటప్పుడు కుడిచేతి బ్రొటనవేలు కిందికి ఉంచి నువ్వులు నీళ్ళు వదులుతూ స్వధాంతర్పయామి,స్వధాంతర్పయామి, స్వధాంతర్పయామి అంటారు. ఆ వదిలిన తర్పణ స్వధాదేవి ద్వారా పితృదేవతలకు చేరుతుంది. దేవీ భాగవతంలో 'పితృదేవతలకు సిద్ధకర్మలలో తర్పణద్వారా ఆహారం లభించేటట్లు చేశాడు బ్రహ్మ. కాని వారికి అది సక్రమంగా అందటం లేదు. పితృదేవతలు వారి బాధలు బ్రహ్మకు చెప్పుకున్నారు. వారి కష్టాలు తీర్చటానికి బ్రహ్మ 'స్వధా అనే కన్యను సృష్టించాడు. ఆమె అపురూప సౌందర్యరాశి. ఈమెను పితృదేవతలకు సమర్పించాడు. శ్రాద్ధకర్మలలో పితృదేవతలకు సమర్పించిన తర్పణలను సవ్యంగా వారికి అందించటమే ఈమె పని.

దేవీవామే స్వధాంతథా - అగ్నిదేవుడికి స్వాహాదేవి కుడి ప్రక్కన ఉంటే స్వధాదేవి ఎడమ ప్రక్కన ఉంటుంది.

Tarpana - During Shraardha, we offer tarpana to Pitru devatas (elders who passed away). Black sesame seeds are dripped down the thumb finger along with water. This serves as food for pitru devatas. This is as per the laws of creation of Prajapati. However, pitru devatas complained that they are not receiving their entitled food. So Brahma created 'Swadha' and assigned her the job of carrying tarpanas to pitru devatas. So we chant the mantra 'Swadham tarpayaami' while offering tarpanas.

Swadha is on the left of Agni and Swaha on the right side.

536. Swaha

At the beginning of creation, all angels(devatas) were suffering from hunger. They sought help from Prajapati(Brahma). Prajapati said, 'My job is to create. Lord Vishnu is the master of sustaining the creation. So I suggest you approach him in this regard'.

Devatas approached Lord Vishnu as per Prajapati's advise. Vishnu said, 'O! Devatas, here onwards, the havis (Oblation) offered by Brahmins and Kshatriyas while performing yagna will be your food. This havis is added to the fire inside the yagna kunda. It will satisfy all your hunger and gives you the required strength. There is a shakti called 'Swaha' who can help to carry these havis from the fire to you. Pray Divine mother(master of all Shaktis). She will send 'Swaha' for your help'.

Devata's prayed divine mother with devotion. Divine mother was pleased by their prayer and sent 'swaha'. Prajapati said this to Swaha,' O! Mother, you please serve as the burning power of the fire god and help us in transferring the havis offered in the yagna to all the devatas'. Then Swaha said,' I belong to Lord Vishnu. I cannot get bonded with fire god. I am sorry'. Saying this, she went away and started praying for Lord Vishnu.  After some time, Lord Vishnu appeared in front of  Swaha and said, 'My dear Shakti, I understand your wish. In your next birth, you will be born as 'Nagnajiti', daughter of 'Nagnajit'. I will come as 'Sri Krishna'. Then you will marry me. For now please join fire god and become his burning power'. From then onwards, swaha joined fire god. They had 3 childeren. They are: 1. Aahavaneeyagni 2.Gaarha patyam, 3.Dakshinaagni.

Like this, by grace of shakti, 'Swaha', the hunger of all the devatas is satisfied. So whenever a havis is added into the fire of the yagna, we call the name of the devata and swaha together. Like..

Indraayah swaha!
Indraaya idam na mama!

Varunaayah swaha!
Varunaaya idam na mama!

Then swaha sends the havis to that respective devata.

536. స్వాహా

దేవతలకు యజ్ఞంలో హవిస్సు అందచేసేటప్పుడు 'స్వాహా' అనే శబ్దాన్ని ఉచ్చరిస్తారు.

ఇంద్రాయస్వాహా
ఇంద్రాయ ఇదం న మమ
అగ్నయే స్వాహా
అగ్నయే ఇదం న మమ

ఈ రకంగా స్వాహా శబ్దంతో దేవతలకు ఆహుతులు అర్పిస్తారు. అంటే అగ్నిలో వేసిన ఆ హవిస్సు స్వాహాదేవి ద్వారా దేవతలకు చేరుతుంది. దేవీ భాగవతంలో బ్రహ్మదేవుడు లోకాలన్నీ సృష్టించిన తరువాత దేవతలంతా బ్రహ్మవద్దకు వచ్చి, విధాతా ! ఆకలి బాధకు తట్టుకోలేకుండా ఉన్నాము. దీనికి ఏదైనా ఒక ఉపాయం చెప్పు అని అడిగారు. దానికి బ్రహ్మ “ఇలాంటి విషయాలు చెప్పటానికి స్థితికారకుడైన నారాయణుడున్నాడు. మీరు వెళ్ళి అతన్ని వేడుకోండి. తరుణోపాయం చూపిస్తాడు' అన్నాడు

ప్రజాపతి సలహా మీద దేవతలందరూ వైకుంఠానికి వెళ్ళి శ్రీహరిని ప్రార్థించారు. అప్పుడు ఆ హరి 'దేవతలారా ! భూలోకంలో బ్రాహ్మణులు, క్షత్రియులు చేసే యజ్ఞ యాగాలకు సంబంధించిన హవ్యము మీ ఆకలిని పోగొడుతుంది. ఆ హవ్యము మీ పేరుచెప్పి అగ్నిలో వేస్తారు. కాబట్టి దాన్ని అగ్నిమూలంగా మీకు అందించే శక్తివేరే ఉన్నది. ఆ శక్తి కోసం మీరంతా ఆ పరదేవతను ప్రార్ధించండి. ఆవిడ ప్రసన్నురాలైతే ఆ శక్తిని పంపుతుంది' అన్నాడు. దేవతలంతా అత్యంత శ్రద్ధాభక్తులతో పరమేశ్వరిని ఆరాధించారు. దేవి వారి దీక్షకు మెచ్చి ఆ శక్తిని పంపించింది. బ్రహ్మ ఆ శక్తికి నమస్కరించి "తల్లీ ! నువ్వు అగ్నిదేవునికి దాహకశక్తివై, అతని యందు హోమం చేసిన హవ్యాన్ని దేవతలకు అందించు” అన్నాడు. దానికి ఆ శక్తి "నేను శ్రీహరికి తప్ప ఇతరులకు చెందను. అగ్నికి దాహకశక్తిగా ఉండను' అని చెప్పి వెళ్ళి విష్ణుమూర్తిని గురించి తపస్సు చెయ్యటం ప్రారంభించింది. కొంతకాలానికి హరి ప్రత్యక్షమై "దేవీ ! నీ మనసు నాకర్ధమయింది. మరుజన్మలో నగ్నజిత్తు అనే రాజుకు నాగ్నజితిగా పుట్టి, నా అంశతో పుట్టిన శ్రీకృష్ణుని వివాహమాడు కాని ఇప్పుడు మాత్రం స్వాహ అనే పేరుతో అగ్నిదేవునికి ఇల్లాలివై, అతనికి దాహకశక్తివై ఉండు" అన్నాడు. స్వాహాదేవి విష్ణుమూర్తి మాటలకు ఒప్పుకుంది. అగ్నికి స్వాహాదేవికి వివాహమయింది. వారికి ముగ్గురు పిల్లలు కలిగారు. వారే 1. ఆహవనీయాగ్ని 2. గార్హ పత్యము 3. దక్షిణాగ్ని.

ఈ రకంగా స్వాహాదేవి అనుగ్రహంవల్ల దేవతల ఆకలిబాధ తీరింది. అని చెప్పబడింది. కాబట్టి స్వాహాదేవి అగ్నిదేవుని దాహకశక్తి. యజ్ఞంలో దేవతలకర్పించిన హవిస్సులను దేవతలకు చేరుస్తుంది.

మార్కండేయ పురాణంలో “ఓ దేవీ ! నీ నామాన్ని ఉచ్చరించటం వల్ల దేవతలందరూ తృప్తి చెందుతున్నారు. యాగాలు అన్నింటిలోనూ స్వాహా అనే నామాన్ని ఉచ్చరిస్తే చాలు దేవతలు ప్రీతి చెందుతారు” అని చెప్పబడింది. అగ్నిదేవుణ్ణి ప్రార్ధించేటప్పుడు స్వాహాంతు దక్షిణే పార్శ్వే అంటాము. అంటే అగ్నిదేవుని దక్షిణ భాగంలో స్వాహాదేవి ఉంటుంది.

529. Sahasradalapadmastha


షట్చక్రాలకు పైన బ్రహ్మరంధ్రం దగ్గర సహస్రదళపద్మమున్నది. ఇందులో ఎనిమిది దిక్కులకు ఎనిమిది దళాలుంటాయి. ఒక్కొక్క దళంలోనూ 125 చిన్నచిన్న దళాలుంటాయి. ఈ రకంగా మొత్తం వేయిదళాలుంటాయి. అందుకే దీన్ని సహస్రదళపద్మము అంటారు. ఇక్కడ ఉండేవాడు పరమేశ్వరుడు. ఈ చక్రానికి అధిదేవత యశస్విని. ఇక్కడ సహస్రదళాలలోను అన్ని రంగులు, అన్ని అక్షరాలు ఉంటాయి. ఇది పరమాత్మస్థానము. సహస్రదళంలో వేలకొలది సూర్యకాంతులు ప్రసరిస్తూ ఉంటాయి. యోగీశ్వరులకు ఇక్కడే ఆత్మదర్శనమవుతుంది. అంటే స్వస్వరూపజ్ఞానం కలుగుతుంది. ఇది జీవాత్మ పరమాత్మల సంగమస్థానం.

There is a 1000 petalled lotus near the topmost part of our head. It has 8 large petals in each of the 8 directions. In each of these there are 125 small petals. hence it is called 1000 petalled lotus. Lord Parameswara is here. Yashaswini is the adidevata of this chakra. It glows in all colors. It has all letters in it. This is the place where yogi/yoginis witness the Atman. This is the point of self-realization. This is the yoga(union) of Jeevatma and Paramatma.


Popular