Search This Blog

Showing posts with label chakra. Show all posts
Showing posts with label chakra. Show all posts

70: Kirichakra ratharooda dhandanatha puraskrutha

Kiri means pig. This chariot is in the shape of a pig and is driven by pigs. Vaarahi is the devata of this chariot. She has truncheon in her hand. She is the commander of mother's armies. Her chariot is placed ahead of mother's srichakra.

Geya chakra is not easy to possess nor everybody can easily understand it. One requires steadfast mind and pure intentions to reach this state. Vaarahi's kirichakra will help us reach Geyachakra. Srichkra represents kaivalya. Geyachakra represents gnyaana yoga. Kiri chakra represents karma yoga. Nishkaama karma gives gnyaana. From gnyaana comes moksha.

In bhagavadgita, God taught us gnyaana yoga in third chapter and karma yoga in fourth chapter. If one has to attain gnyaana, he should practice karma yoga (actions without a desire).



కిరి అంటే పంది, వరాహము. ఈ రథము వరాహ రూపంలో ఉంటుంది. వరాహములతో లాగబడుతూ ఉంటుంది. దీనిని అధిష్టించిన దేవత వారాహి. ఈమె చేతిలో దండము ఉంటుంది. అందుకే ఈమె దండనాయికా అని పిలవబడుతుంది. అమ్మకి వారాహి సేనాని. ఈమె రథం అమ్మ రథానికి ముందుగా నడుస్తూఉంటుంది.

గేయచక్రం అందరికి అందదు, అర్ధమూ కాదు. ఆ భూమికలోకి ప్రవేశించాలి అంటే నిర్మలమైన వాక్కు నిశ్చలమైన మనస్సు ఉండాలి. ఈ అర్హతను సంపాదించాలంటే దండనాయిక అయిన వారాహి కిరిచక్రాన్ని ఆశ్రయించాలి. శ్రీచక్రం కైవల్యచక్రం, గేయచక్రం జ్ఞ్యానచక్రం, కిరిచక్రం కర్మ చక్రం. నిష్కామకర్మచే జ్ఞానం, జ్ఞానముచే మోక్షం లభిస్తుంది.

భగవద్గీతలోకూడా మూడవ అధ్యాయంలో జ్ఞ్యానయోగం,  నాలుగవ అధ్యాయంలో కర్మయోగం బోధించ బడింది. కైవల్య సిద్ధికి జ్ఞ్యానం అవసంరం. కానీ ఆ జ్ఞ్యానం కలగాలంటే నిష్కామకకారములు ఆచరించాలి. 

69: Geyachakraratharooda manthrini parisevitha

Mother's cabinet has 16 ministers. They are Sangeetayogini, syaama, syaamala, mantrinaayaka, mantrini, sachivesaani, pradhaanesa, kusapriya, veenaavati, vainiki, mandrini, priyakapriya, neepapriya, kadambavesya, kadambavanavaasini, sadamala. They ride on a chariot built with geyachakras.

Their music elevates the greatness of mother's srichakra. They are symbols of sweet voice and a beautiful mind. Mantrini helps in understanding the difference between truth and illusion. Hence with help of all the mantrini's music we can visualize mother's srichakra. However, one requires pure intention and steadfast mind to reach this state.

The name also explains the significance of music in spiritual world. Mind gets attached easily to good music. If it is blended with lyrics that praise God, it creates magic. It is said that those who enjoy pleasure cannot make progress in self realization. But by listening to this kind of music, one can progress in spiritual path while still enjoying sweet music.

Humble advise: Sri Bammera Potana said, "Chakrahastu prakatinchu chaduvu chaduvu". It means the real education is that which will expresses the paramatma. There are 64 fine arts in total. Music and literature are a couple of them. They are forms of Goddess Saraswathi. If you spend time listening to songs that promote material instincts, you will not progress spiritually. It is a waste of time. There are thousands of melodious songs with literature that elevates your mental status. Try listen to such songs. Here is the link to the beautiful song called Maanasabodha. It is written by Sri Vidya prakaashananda, founder of Sri Shuka brahma ashram, Kalahasthi.



Maanasabodha - Singer - Smt. Vani Jayaram garu - Enjoy the sweet music

గేయచక్రమనే రథం ఎక్కి అమ్మ మంత్రిగణం  కుడివైపు నడుస్తున్నది. అమ్మది శ్రీచక్రం అయితే వీరిది గేయచక్రం. దీనిలో 7 ఆవరణలు ఉంటాయి. అందులో 16 మంది మంత్రిణులు ఉంటారు. సంగీతయోగిని, శ్యామా, శ్యామల, మంత్రినాయక, మంత్రిణి, సచివేశాని, ప్రధానేశా, కుశప్రియ, వీణావాతి, వైణికి, మంద్రిని, ప్రియకప్రియా, నీపప్రియ, కదమ్బవేశ్యా, కదంబవనవాసిని, సదామలా అనువారు అమ్మ మాంత్రిణులు. వీరందరూ అమ్మ పరిచారికలు. గేయచక్రాలతో నిర్మితమైన రథమెక్కి వీరు అమ్మతోపాటు ప్రయాణిస్తున్నారు.

శ్రీచక్ర శోభను కీర్తించే గేయ చక్రాలు వాక్కు రెమణీయతకు మానస మధురిమకు చిహ్నాలు. శ్రీరాగిణి స్వరాన్ని ముఖరితం చేసే సంగీత చక్రాలు. సత్ అసత్ ల అంతరాన్ని మంత్రిణి మాత స్పష్టపరుస్తుంది. అందువల్ల మంత్రిణుల గేయచక్రాల సహకారంతో అమ్మ శ్రీచక్ర సాక్షాత్కారం సాధ్యమవుతుంది. అయితే ఈ భూమికలోకి ప్రవేశించాలంటే నిర్మలమైన వాక్కు నిశ్చలమైన మనస్సు ఉండాలి. అటువంటి గుణములు కలిగిన వారికే ఇది సాధ్యం అవుతుంది.

ఆధ్యాత్మిక రంగంలో సంగీతానికి ఉన్న ప్రాముఖ్యత ఇక్కడ వ్యక్తం అవుతోంది. మనోహరమైన సంగీతం మనస్సుకు త్వరగా హద్దుకుంటుంది. పలుమార్లు వినాలనిపిస్తుంది. అటువంటి సంగీతానికి బుద్దిని వికసింపచేసే సాహిత్యం తోడైతే అద్భుతం జరుగుతుంది.

యాత్రాస్తి భోగో నచ తత్ర మోక్షహ్ !
యాత్రాపి మోక్షో నచ తత్ర భోగః !!

భోగాలు అనుభవిస్తూ మోక్ష సాధన కుదరదు. కానీ పైన వివరించిన విధంగా రమణీయ సంగీతాన్ని ఆస్వాదిస్తూ మోక్ష సాధన చేయవచ్చు. అదే లలితా సహస్రనామాలలో ఉన్న గొప్పతనం 

మంచిమాట: 'చక్రహస్తు ప్రకటించు చదువు చదువు' అన్నారు పోతనగారు. మనకున్న 64 కళలలో సంగీతం, కవిత్వం కూడా ఉన్నాయి. అవికూడా సరస్వతీ రూపాలే. పరమాత్మ వైభవం తెలిపే కొన్ని లక్షల గీతాలు ఉండగా, ఎందుకూ పనికిరాని పాటలు విని సమయం వృధా చేయడం సబబేనా? మీరే ఒక్కసారి ఆలోచించండి! అవి మనకు వద్దు. 

శ్రీకాళహస్తి లోని శ్రీ శుకబ్రహ్మ ఆశ్రమ స్థాపకుడు, ఎన్నో భగవద్గీత ప్రవచనాలు చేసిన యోగి, మహా జ్ఞాని అయిన శ్రీ విద్యా ప్రకాశనందుని వారిచే రచింపబడిన మానస బోధ అనే కమ్మని పాట ఈ క్రింద లింకులో ఉంది. 

మానసబోధ - గానం: శ్రీమతి వాణి జయరాం గారు - విని తరించండి 

68: Chakraraja radharudha sarvayudha parishkruta



Chakrarajam - This is the name of mother's chariot. It houses all sorts of weaponry in it. It has a mast that is called Anandam (happiness) and it has nine stories. It is 10 yojanas high and 4 yojanas wide. Scholars say that this Chakrarajam is nothing but Sri Chakram.

Sri chakra is a symbol of this whole creation (చరాచర జగత్తు). There are 25 tatwas in this creation. To know more about them, please read the name tatwasana.

చక్ర రాజం - ఇది అమ్మవారి రథం. ఇందులో సర్వాయుధాలు ఉంటాయి. దీనికి ఆనందం అనే గొడుగు ఉంటుంది. 9 ఆవరణలు ఉంటాయి. 10 యోజనాలు ఎత్తు 4 యోజనాలు వెడల్పు ఉంటుంది. విజ్ఞులు దీన్నే శ్రీ చక్రం అని అంటారు. 

జగత్తులోని 25 తత్త్వాలు శ్రీ చక్రలోనే ఉంటాయి. వీటి గురించి తెలుసుకోవాలంటే తత్వాసన అనే నామం చదవండి. 





Popular