Search This Blog

Showing posts with label Mano. Show all posts
Showing posts with label Mano. Show all posts

10.Manorupekshu Kodanda

Mano Rupekshu Kodanda is 10th name of the 1000 names of Lalitha Devi. When read along with the 11th name pancha thanmathra sayaka, this name reveals one of the most effective secrets of self-improvement

Here, our Mind is described as a bow made of sugar cane. Like sugar cane our mind is also very sweet. It is very soft at the core but looks very hard from the outside. Like the sweet juice that comes out of sugarcane, mind also gives good feelings that make our lives sweet and happy.

Lalitha Devi's sugar cane is bent like a bow. A bow made of sweet sugar cane that is ready to strike with arrows called pancha thanmathras. The secret being revealed here is the relation between Mind and the sense organs. The bow aims at the target. The arrow follows the aim and hits the target. So the bow decides where the arrow should go. Similarly, the mind decides what the eyes should see, ears should listen, skin should touch, tongue should taste and nose should smell. It is the master of the senses. All the five sense organs follow the instructions from the mind.

Self-improvement: Under the influence of thanmatras, the senses keep drifting towards the objects they like. Like eyes would ask for a TV or a mobile phone. Skin would ask for a pleasant and cozy ambiance (AC). But when mind is steadfast and focused on a task, they would ignore the thanmatras and follow the mind. For eg: when a baby cries for milk, the sweet feeling of motherhood spurts out in the mother's mind. Feeling motherhood, she will focus on feeding her baby. There will be no regard to any thanmatras while she is focused on this task. She will not think about missing the TV serial. She will not care if the AC is running or not. She just enjoys the motherhood.

The secret of not getting distracted unnecessarily is in training the mind to focus on the task. The secret of training the mind to focus on the task is to generate the right emotion (like motherhood in the above example) that puts the mind on the right path. Motherhood, fatherhood, brotherhood, sisterhood, friendship, compassion, curiosity, diligence, determination, team spirit, love are all sweet feelings that come from mind. When at work, feel the responsibility. When at home, feel the love of your family members. Have dedication while studying. Have the right feeling and you are automatically set for success. Moreover, you will be enjoying the sweet feelings and don't feel like enduring somthing. Such a sweet and easy way to make life happier!!!

మనో రూపేక్షు కోదండ అమ్మ 10వ నామము. 11వ నామమైన పంచతన్మాత్ర సాయకా తో కలిపి చదివితే మన అభివృద్ధికి కావలిసిన ఓకే గొప్ప రహస్యం అర్ధమవుతుంది. 
మన మనస్సు తీయని చెరుకు వంటిది. చెరుకు వలే ఇది ఏంతో మధురమైనది. లోపల తీయగా ఉంటుంది కానీ బయటకు మాత్రం చాలా గరుగ్గా కనిపిస్తుంది. తీయని చేరుకురసం వలే మనస్సు కూడా ఎన్నో మధురమైన భావాలను కలిగింస్తుంది. 

అమ్మ ధనుస్సు  చెరుకుతో చేయబడిందిట. బాణాలేమో పంచతన్మాత్రలుట. దాని అర్ధం ఇలా వివరించవచ్చు. ఇక్కడ మనస్సుకు ఇంద్రియాలకు మధ్య సంబంధం వివరించబడింది. విలువిద్యలో లక్ష్యం ధనుస్సుచే నిర్ణయించబడుతుంది. బాణం ధనుస్సు నిర్ణయించిన లక్ష్యానికి వెళ్లి తగులుతుంది. అంటే బాణం ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించేది ధనుస్సు అన్నమాట. అలాగే కన్ను దేన్ని చూడాలో, స్పర్శ దేనిని తాకాలో, నాలుక దేని రుచి చూడాలో మనస్సుచే నిర్ణయింపబడతాయి. మనస్సు ఎంచెప్తే ఇంద్రియాలు అది చేస్తాయి. 

తన్మాత్రల ప్రభావం వలన ఇంద్రియాలు విషయ సుఖాలపై మొగ్గు చూపుతుంటాయి. నిర్ణయం వాటికి వదిలేస్తే కన్ను టీవి చూస్తానంటుంది. చర్మం ఏసీ కావాలంటుంది. నాలుక మంచి రుచికరమైన పదార్ధం తింటానంటుంది. కానీ మనస్సు ఏదైనా ఆజ్ఞవేస్తే అవి తన్మాత్రలను వదిలేసి మనస్సు చెప్పిన పనిలో నిమగ్నమయిపోతాయి. 

ఉదాహరణకి - ఒక బాలెంతరాలు తనకు నచ్చిన టీవీ సీరియల్ చూస్తోందనుకోండి. ఆమె కళ్ళు ఏంతో  సంతోషిస్తుంటాయి. ఇంతలో తన బిడ్డ పాలకోసం ఏడ్చిందనుకోండి. ఆ ఏడుపు వినగానే ఆమె మనసులో మాతృత్వం పొంగి పొర్లుతుంది. అది వెంటనే ఇంద్రియాలకి 'బిడ్డకు పాలు ఇవ్వడానికి కావలిసిన పనులు చేయండి అని ఆదేశిస్తుంది. వెంటనే ఇంద్రియాలన్నీ ఆ కార్యంలో నిమగ్నమయిపోతాయి. కళ్ళు టీవీ వదిలేసి బిడ్డ ఎక్కడుందో వెతుకుతాయి. చెవులు ఏడుపు విని కళ్ళకు దారి కనుగొనడానికి సహాయపడతాయి. చర్మం ఫ్యాన్ ఉందా ఏసీ ఉందా అన్న ప్రశ్న వదిలేస్తుంది. బిడ్డను అక్కున చేర్చుకుని ఆ బాలెంతరాలు దానికి పాలు ఇస్తుంది. పాలిస్తూ మాతృత్వపు మమకారంతో మునిగిపోతుంది. మాతృత్వం ఒకటే కాదు. భ్రాతృత్వం, పితృత్వం, స్నేహం, దయ, కుతూహలం, పట్టుదల, శ్రద్ధ, సంఘీభావం ఇలా ఎన్నో మధురమైన భావనలు మనసులో ఉంటాయి. సందర్భానుసారం అవి బయటకు వస్తుంటాయి. ఇష్టంతో పని చేస్తే కష్టం అనిపించదు. పైగా గొప్ప సంతృప్తిని ఇస్తుంది. మరి ఆ ఇష్టం కలగాలంటే చేరుకువిల్లు వంటి మనస్సు ఉండాలి. 

మన దృష్టి భ్రమించడానికి కారణం తన్మాత్రలే. అయితే మనస్సులో సరైన భావం బలంగా ఉంటె అవి మనల్ని ఏమి చేయలేవు. శ్రద్ధ కలిగిన విద్యార్థి ఎదో పిచ్చి పాట వినిపించగానే తన దృష్టిని చదువునుంచి పక్కకు మళ్ళించడు. తన మనస్సులో ఉన్న శ్రద్ధ అనే భావన తన చెవిని ఆ శబ్దం నుండి విడదీసి దృష్టిని చదువుపై కేంద్రీకరించేలా చేస్తుంది. అంటే సందర్భానుసారం మన మనస్సులో అవసరమైన మంచి భావాలు కలిగితే చాలు. మనం  ఏంతో అభ్యున్నతిని పొందుతాము. పైగా ఈ భావాలు కఠినమైనవి కావు. చేరుకులాగ ఎంతో మధురమైన అనుభూతులు. మనకు నచ్చిన  ఏంతో మధురమయిన భావనలను అనుభవిస్తూ మనం అభ్యున్నతి చెందవచ్చు. అదే 10, 11వ నామాల తాత్పర్యం. 

Popular