Search This Blog

Showing posts with label Madhya. Show all posts
Showing posts with label Madhya. Show all posts

85-87: Vaghbhava, Madhya and Shakti kutas

Names from 85 to 87 describe Mother's sookshma body.

The soul has three bodies. We all are aware of our physical body. But there are two other bodies that we are not generally aware of:


  1. Physical body - This body experiences pleasure, pain, happiness, sorrow. Health and age pertain to this body. Humans enjoy the result of their good deeds or sins with this body. This functions only when we are awake. This Sthula sharira is called bhoga ayatanam.
  2. Meta physical (Sookshma) body -  Faculty of speech, senses, 5 vital life forces, 5 thanmatras (associations between 5 sense organs and 5 elements), memory patterns, karma and desire are parts of this body. This is not made of five elements. Humans go through their karma with this body. It is also called 'Linga' body. This functions in dreams and awake states. As a crude analogy, we can say this is the software of our body. This Sukshma sharira is called bhoga sadhanam.
  3. Kaarana body - This body comprises of the three gunas - Sattva, Rajas and Tamo. This functions in awake, dream and sushupti states. In sushupti state whole body is completely relaxed. There is no movement. Even mind is dissolved. 
Now let's look at Mother's Sookshma body:

  1. Vaagbhava kutami - This span from head to neck. Eyes, nose, ears and mouth are in this area. The faculty of speech is here. From here we get the power to learn, think, talk, sing etc
  2. Madhya kutami - This span from neck to waist. This has shoulders, heart(hridayam), belly button, waist etc. Trimurthy's get their means to create, maintain and destroy from here. Tanmatras and the desire that gives rise to arishadvarga (kama, krodha, lobha, moha, mada, matsaryam) have their genesis here.
  3. Shakti kutami - This span from waist to feet. This is the powerhouse. Power generated here travel along Madhya kutami to reach Vakbhava kutami.


85 నుంచి 87 వరకు ఉన్న మూడు నామాలు అమ్మ సూక్ష్మ శరీరాన్ని వర్ణిస్తాయి.

ఆత్మకు  మూడు శరీరాలు ఉంటాయి. అవి:
  1. స్థూల కాయము - ఇది స్థూల దేహము. సుఖము, దుఃఖము, హాయి, నొప్పి, ఆరోగ్యము, అనారోగ్యము, యవ్వనము, వృద్ధాప్యము మొదలగునవి ఈ శరీరానికే వర్తిస్తాయి. మనిషి తనయొక్క పాపపుణ్యాల ఫలితాలు ఈ శరీరంతో అనుభవిస్తాడు. ఇది జాగృదావస్థలో ఉంటుంది. ఈ స్థూల శరీరమును భోగ ఆయతనం అంటారు. 
  2. సూక్ష్మ కాయము - వాక్కు, 10 ఇంద్రియాలు, పంచ ప్రాణాలు, 5 తన్మాత్రలు, అంతఃకరణ చతుష్టయం, విద్య, కర్మ, కామము మొదలగునవి సూక్ష్మ శరీరం అని చెప్పబడ్డాయి. దీన్నే లింగశరీరం అని కూడా అంటారు. మనిషి తన కర్మ ఫలం ఈ శరీరంతో అనుభవిస్తాడు. ఇది పంచభూతాలతో నిర్మించిన శరీరం కాదు. మనకు కలలో కలిగే అనుభూతులన్నీ ఈ శరీరమే అనుభవిస్తుంది. ఒక బండ గుర్తుగా చెప్పాలి అంటే మన స్థూలకాయం హార్డ్వేర్ ఐతే సూక్ష్మకాయం సాఫ్ట్వేర్ అన్నమాట. ఈ సూక్ష్మశరీరమును భోగ సాధనం అంటారు. 
  3. కారణ శరీరం - సత్త్వరజస్తమో గుణములతో కూడినదే ఆత్మాయొక్క కారణ శరీరం. ఇది సుషుప్తి అవస్థలో ఉంటుంది. సుషుప్తిలో అన్నిరకముల జ్ఞ్యానము నశిస్తుంది. బుద్ధి కేవలం బీజరూపంలో ఉంటుంది. ఆ అవస్థలో అన్ని అవయవాలు పూర్తిగా విశ్రమిస్తాయి. 
అమ్మ సూక్ష్మ శరీర వర్ణన:
  1. వాగ్భావకూటమి - ఇది శిరస్సునుండి కంఠం వరకు ఉంటుంది. ఇక్కడ కళ్ళు , చెవులు, ముక్కు నోరు ఉంటాయి.  దీనినుంచి వాక్కు వస్తుంది. ఈ శక్తినుంచే వేదాది సకలవిద్యలు, సకల భాషలు, సకల ఛందస్సులు, సప్త స్వరాలు వచ్చాయి. 
  2. మధ్య కూటమి - ఇది కంఠం నుండి నడుము వరకు ఉంటుంది. ఇక్కడ బాహుసంధులు, కటి సంధులు, నాభి, హృదయము ఉంటాయి. సృష్టి స్థితి లయాలను నిర్వహించు త్రిమూతులకు శక్తిని గోచరము చేయునది ఇదే. తన్మాత్రలు, ప్రాణుల మనస్సులో అరిషడ్వార్గాలను ఉత్పన్నము చేయు కామ బీజము ఇక్కడ ఉంటుంది. 
  3. శక్తి కూటమి -  నడుము నుండి పాదాల వరకు ఉన్నది శక్తి కూటమి. త్రిమూర్తులకు వారి వారి పనులు నిర్వహిచడానికి కావాల్సిన శక్తి ఇక్కడనుండి వస్తుంది. ఉపాసకులకు విద్య కవిత్వం సిద్ధింపజేస్తుంది. త్రిగుణముల ప్రవృత్తిని కలుగజేస్తుంది. యోగులకు సత్యాత్మకమైన బ్రహ్మము ఇదే. 

33-36.Kameshwara...... patta bhandha valithraya

This name signifies the opulence of our divine mother while feeding her children(us). Mother is 'abrahmakeeta janani' - Mother to all the 84 lakh species in the world. In her eagerness to keep all of us well nourished, she created a plethora of foods. There are over 2000 types of fruits, over a 1000 types of veggies and hundreds of grains for us to eat. There are over 1500 varieties of Mangoes alone and over 7500 varieties of apples in this world. Like this, there are many many many varieties of food items.  Some of them are available through out the year where as some are seasonal and provide the necessary nourishment required in that particular season. For example, watermelon comes in Summer and bitter gourd comes in autumn. So she not only gave us abundant choices but also ensured that we get them when we need them the most. Such is her love. Such is her concern towards our hunger and nutrition.

Another important point to observe is that the taste of each food item is unique to itself. If feeding is  Mother's only motive, why did She give a unique taste to each of these food items? She could have just focused on the availability of food. Why create so many unique tastes? Just think about it! Because she wants us to enjoy the taste. She wants us to love what we are eating and feel her love upon us through that. That is the beauty of Divine Mother. But again, is that her only motive? If yes, then why will she create such countless unique tastes but not give us enough life time and appetite to taste them all? Just think about it. Is it even possible for all of us to experience all the tasty food items on this earth? The answer is a clear 'No'. Then why did she do that? After all, what kind of a mother cooks so many dishes for her children but would not give them a chance to taste all of them? The secret here is that she expects us to realize the truth. After devouring various tastes and wandering for a considerable life time. She wants us to take a step back and look at the larger picture. She wants us to realize that her creation is infinite. That her true nature is infinite. That senses cannot perceive her love towards us completely. 
Her purpose of creating infinite unique tastes is not to make us indulge and crave for them throughout the live. She wants us to ignite the chaitanya and realize that the truth is infinite.

The best expression of Motherhood is when a mother feeds her child. Heavy breasts and contracted waist are marks of a mother who is taking care of a lot of children. That is why they are used to explain Divine mother's eagerness to feed all of us. She is the mother of 84,00,000 species of beings. That is why it is explained that her breasts are heavy and her waist is narrow. It is so narrow that it looks like heavy fruits hanging on to a thin creeper. The desire to create emerged from Lord Kameshwara. Mother is his Shakti. Mother created all of us and takes such good care that she gained all the Love of the Lord Kameshwara. The names from 33-36 are symbolic representation of God's motherly feeling. It should not be misconstrued as feminine beauty. All the names in Lalitha sahasranam starting from 13: Champakasoka punnaga saugandhika lasatkacha to 51: Sarvabharana bhooshita explain one of the aspects of our divine Mother. They are not mere descriptions of her physical beauty.

ఈ నామం మనకు పోషణ అందిండంలో అమ్మ యొక్క ఆతృతను సూచిస్తుంది. ఆవిడ  'అబ్రహ్మకీటజనని' - విశ్వంలోని 84 లక్షల జీవరాశులకు ఆవిడే తల్లి. మనందరినీ చక్కగా పోషించుకోవాలన్న ఆత్రుతలో, ఆమె ఆహార పదార్థాల సమృద్ధిని సృష్టించింది. ఈ భూమిపై లభించే పండ్ల రకములు సుమారు 2000 పైన ఉన్నాయి. 1000 కి పైన కాయగూరలు, వందలకొద్దీ ధాన్యపు గింజలు ఉన్నాయి. ఒక్క మామిడి పండే 1500 పైన రకాలుగా దొరుకుతుంది. ఆపిల్స్ లో 7500 పైన రకాలు ఉన్నాయి. ఇలా, అనేక రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి. పండ్లు, కూరగాయలు, ఆహార ధాన్యాలు మొదలైనవి. వాటిలో కొన్ని అన్ని కాలాలలోనూ అందుబాటులో ఉంటాయి. కొన్ని కాలం యొక్క అవసరం బట్టి ఉత్పత్తి అవుతాయి. మండు వేసవిలో పుచ్చకాయ లాగ. అంటే అమ్మ అనేకమైన ఆహార పదార్ధాలు సృష్టించడమే కాక ఏ కాలములో ఎటువంటి పోషణ అవసరమో ఆ కాలానుగుణంగా వాటిని మనకు అందిస్తుంది కూడా. ఆమె ప్రేమ అలాంటిది. మన ఆకలి పట్ల ఆమె ఆందోళన అలాంటిది. 84 లక్షల జీవ రాశులను పోషించాలంటే మాటలా? ఏమో ఎక్కడ ఏ చిన్న జీవి ఆకలితో ఉండిపోతుందో? తల్లి ప్రాణం ఊరికే ఉండగలదా? అందుకే అన్ని రకాల ఆహార పదార్ధాలు సృష్టిచేసింది. 

ఇక్కడ గమనించవలసిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రతి ఆహార పదార్ధానికి ఒక్కో ప్రత్యేకమైనద రుచి ఉంటుంది. మనకు ఆహారం ఇవ్వడం మాత్రమే అమ్మ యొక్క ఉద్దేశ్యము అయితే, ఈ ఆహార పదార్థాలలో ప్రతిదానికి ఒక ప్రత్యేకమైన రుచిని ఎందుకు  పట్టింది? మామిడి పండు రుచి మామిడిపండుదే, గుత్తి వంకాయ రుచి గుత్తి వంకాయిదే. అలాగ లెక్కలేనన్ని రుచులు. కడుపు నింపుకోవడానికి ఇన్ని రుచులు అవసరమా? ఒక పదో పాతికో రుచులు సరిపోవా? దీని వెనుక రహస్యం ఏమిటి? అమ్మ మనం తినేదాన్ని ప్రేమించాలని, ఆ  రుచిని ఆస్వాదించాలని, తద్వారా ఆమె ప్రేమను తెలుసుకోవాలని కోరుకుంటుంది. అది మన అమ్మ మనస్సు. అయితే అవన్నీ రుచి చూసేంత ఆయుషు, ఆకలి ఎందుకుఇవ్వలేదు? నిజంగా ఎవరికైనా ఈ భూమిపై ఉన్న రుచులన్నీ అనుభవించడం సాధ్యమేనా? మరి అమ్మ ఎందుకు అలా చేసింది? ఏ తల్లి అయినా పిల్లలు తను వండిన పదార్థాలన్నీ తనివి తీరా తినాలనే కోరుకుంటుంది. మరి జగన్మాత ఎందుకలా చేయలేదు? ఇక్కడ రహస్యం ఏమిటంటే, ఆవిడ ఉద్దేశ్యము మనము వివిధ రకాలైన రుచుల కోసం ఆరాటపడుతూ వాటి వెనుకే కాలయాపన చేస్తూ జీవితమంతా వృధా చేయాలని కాదు. కొంత కాలం వివిధ రుచులను అనుభవించాక చైతన్యము కలిగి ఎదో ఒక క్షణంలో ఇవన్నీ క్షణికాలు అని తెలుసుకుంటామని. ఇక వాటికోసం వెంపర్లాడక నిజమైన ఆనందంకోసం వెతకడం ప్రారంభిస్తామని. అప్పుడు అమ్మ సృష్టి అనంతం, ఆమె ప్రేమ అనంతం అని తెలుసుకుంటామని. 

బిడ్డ ఆకలి తీర్చడంలోనే మాతృత్వం వ్యక్తమవుతుంది. 33-36 వరకు ఉన్న నామములతో అమ్మ కుచముల బరువుగ ఉన్నాయని నడుము ఉందా లేదా అనిపించే అంత సన్నగా ఉన్నదని వర్ణిస్తారు. అమ్మను చుస్తే ఒక సన్నటి తీగకు రెండు బరువైన పండ్లు కాశాయా అనిపిస్తుందిట. నిజానికి ఇవి గంపెడు పిల్లలను కని వారి ఆలనా పాలనా పోషణలో క్షణం తీరిక లేకుండా గడిపే తల్లి యొక్క లక్షణాలు.  అందుకే లలితమ్మను ఆలా వర్ణించారు. ఇంతచక్కటి సృష్టి చేసి పిల్లలందరినీ ఇంత బాగా పోషిస్తున్నపుడు మహా కామేశ్వరుడు అమ్మను ప్రేమించకుండా ఎలా ఉండగలడు. ఈ నామాలను స్త్రీ సౌందర్యంగా భావించకూడదు. లలితా  సహస్రానంలోని పేర్లు (13: చంపకసోక పున్నగా సౌగంధిక లాసత్కాచ నుండి 51: సర్వభరణ భూషిత వరకు ) మన అమ్మ రూపాన్ని వర్ణిస్తాయి. అవి కేవలం ఆమె శారీరక సౌందర్యం యొక్క వర్ణనలు కాదు. వాటి వెనుక ఎన్నో గొప్ప రహస్యాలు ఉన్నాయి. 

Popular