Search This Blog

Showing posts with label Grandhi. Show all posts
Showing posts with label Grandhi. Show all posts

102: Vishnugrandhivibhedini


మణిపుర అనాహిత చక్రాలపైన విష్ణు గ్రంధి ఉన్నది. దీనికి అధిపతి విష్ణువు. ఆధారచక్రం నుంచి బయలుదేరిన కుండలినీశక్తి  ముందుగా బ్రహ్మగ్రంధిని భేదిస్తుంది. పిదప మణిపుర అనాహితలను దాటి విష్ణుగ్రంధిని భేదిస్తుంది. విష్ణు గ్రంధి భేదనమంటే కర్త్రుత్వ భావనను వదిలేయడమే. సాధకుడు కర్మలో తన ప్రతాపాన్ని చూడడు. భగవత్సంకల్పాన్ని, అనంత శక్తిని చూస్తాడు. తన చుట్టూ జరిగే విషయాలన్నీ తనవల్లనే కేవలం తన వల్లనే అన్న భావన నశిస్తుంది. ఇది అమ్మ అనుగ్రహం వలనే సాధ్యమవుతుంది.

ఒక చిన్నమాట - రామాయణాన్ని ఒకసారి పరికించి చూడండి. రాముడు అజేయుడు. సర్వ శాస్త్ర పారంగతుడు. ఆయన తలచుకుంటే ఏదైనా సాధించుకో గలడు. తన భవిష్యత్తును తనకి అనుగుణంగా తీర్చిదిద్దుకోగలడు. అడవిలో అయోధ్యను తలదన్నేటంత గొప్ప రాజ్యం స్థాపించి సుఖంగా ఉండగలదు. కానీ ఆలా చేయలేదు. తన జీవితంలోని ప్రతీ సన్నివేశాన్ని భగవత్సంకల్పంగా భావించి, ప్రతీ చోటా ధర్మానికి కట్టుబడి ఉన్నాడు. కష్టమైనా సుఖమైనా భగవదానుగ్రహంగా భావించాడు. చివరకు విజయం సాధించాడు.ఇదే కర్త్రుత్వ భావన లేకపోవడం అంటే. ఈ విశ్వం అంతా ఈశ్వరునిచే నడపడుతోంది అని గుర్తించి, ఆయన తెలిపిన ధర్మ చక్రం సమస్త కర్మలకు ఆధారమని గ్రహించి, శక్తివంచన ప్రయత్నలోపం లేకుండా కర్మ చేయడమే కర్త్రుత్వ భావన లేకపోవడమంటే.  

Vishnugrandhi is situated above Manipura and Anahita chakras. Vishnu is the master of this. After arising from Adhaara chakra, the kundalini first unties Brahma grandhi. After that it rises up further and crosses Manipura and Anahita chakras. Then it unties Vishnu grandhi. At this point, the practitioner will shun the agency of  his acts. He will understand what is detachment and how to practice it. He/She will rise beyond the belief that he/she are the reason/cause and will be able to appreciate how the divine scheme of things unfurl as per Gods Dharma chakra.

Snippet - Lets discuss about Lord Rama from Ramayana as an example. He is invincible. He is a learned expert of all the shastras. He is capable of shaping his own destiny. He could have established a kingdom that is better than Ayodhya in the forest and lived there happily. But he never tried or acted that way. He respected the divine scheme of things and let them unfurl as his life progressed. Like this, being aware that the whole universe is progressing as per the will of God and acting with pure conviction and determination is the secret of practicing detachment.

100: Brhama Grandhi Vibhedini

Grandhi is synonymous to a knot. Something that obstructs the flow. Due to ignorance, man is not able to differentiate between truth and illusion. The knot of this ignorance is above mooladhara and swadhistana. It is called Brahma Grandhi. When kundalini is rising upwards, it first unties the Brahma grandhi. At that moment, the practitioner will raise beyond illusion. He will win over the worldly thoughts of myself and mine. He will realize that his true form is the Atman. That is the state of Moksha (removing the necessity of a rebirth).

చిక్కుముడిగా ఉండి విడదీయడానికి వీలు పడని స్థితిని గ్రంధి అంటారు. సత్యాసత్యాలను స్పష్టంగా వివరించటానికి వీలుకాని స్థితిని గ్రంధి అంటారు. ఆధార స్వాదిష్టానాల తరువాత ఉండేది బ్రహ్మ గ్రంధి. బ్రహ్మ అంటే సంకల్పము, సృష్టి, ప్రపంచ వ్యవహారానికి మూలమైన విషయాలు. ఇవన్నీ ఇక్కడ చిక్కుముడిగా పడి ఉంటాయి. మనిషి నేను నాది అనే మాయలో ఉంటాడు. కుండలిని శక్తిని నిద్ర లేపి ఊర్ధ్వముఖంగా నడిపిస్తే ముందుగా అది బ్రహ్మగ్రంధిని భేదిస్తుంది. అంటే సాధకుడికి నేను నాది అనే భావం పోగొట్టి స్వస్వరూప జ్ఞ్యానం కలిగిస్తుంది. భవబంధాలను భేదించి పునర్జన్మ రహితమైన ముక్తిని ప్రసాదిస్తుంది.


Popular