మణిపుర అనాహిత చక్రాలపైన విష్ణు గ్రంధి ఉన్నది. దీనికి అధిపతి విష్ణువు. ఆధారచక్రం నుంచి బయలుదేరిన కుండలినీశక్తి ముందుగా బ్రహ్మగ్రంధిని భేదిస్తుంది. పిదప మణిపుర అనాహితలను దాటి విష్ణుగ్రంధిని భేదిస్తుంది. విష్ణు గ్రంధి భేదనమంటే కర్త్రుత్వ భావనను వదిలేయడమే. సాధకుడు కర్మలో తన ప్రతాపాన్ని చూడడు. భగవత్సంకల్పాన్ని, అనంత శక్తిని చూస్తాడు. తన చుట్టూ జరిగే విషయాలన్నీ తనవల్లనే కేవలం తన వల్లనే అన్న భావన నశిస్తుంది. ఇది అమ్మ అనుగ్రహం వలనే సాధ్యమవుతుంది.
ఒక చిన్నమాట - రామాయణాన్ని ఒకసారి పరికించి చూడండి. రాముడు అజేయుడు. సర్వ శాస్త్ర పారంగతుడు. ఆయన తలచుకుంటే ఏదైనా సాధించుకో గలడు. తన భవిష్యత్తును తనకి అనుగుణంగా తీర్చిదిద్దుకోగలడు. అడవిలో అయోధ్యను తలదన్నేటంత గొప్ప రాజ్యం స్థాపించి సుఖంగా ఉండగలదు. కానీ ఆలా చేయలేదు. తన జీవితంలోని ప్రతీ సన్నివేశాన్ని భగవత్సంకల్పంగా భావించి, ప్రతీ చోటా ధర్మానికి కట్టుబడి ఉన్నాడు. కష్టమైనా సుఖమైనా భగవదానుగ్రహంగా భావించాడు. చివరకు విజయం సాధించాడు.ఇదే కర్త్రుత్వ భావన లేకపోవడం అంటే. ఈ విశ్వం అంతా ఈశ్వరునిచే నడపడుతోంది అని గుర్తించి, ఆయన తెలిపిన ధర్మ చక్రం సమస్త కర్మలకు ఆధారమని గ్రహించి, శక్తివంచన ప్రయత్నలోపం లేకుండా కర్మ చేయడమే కర్త్రుత్వ భావన లేకపోవడమంటే.
Vishnugrandhi is situated above Manipura and Anahita chakras. Vishnu is the master of this. After arising from Adhaara chakra, the kundalini first unties Brahma grandhi. After that it rises up further and crosses Manipura and Anahita chakras. Then it unties Vishnu grandhi. At this point, the practitioner will shun the agency of his acts. He will understand what is detachment and how to practice it. He/She will rise beyond the belief that he/she are the reason/cause and will be able to appreciate how the divine scheme of things unfurl as per Gods Dharma chakra.
Snippet - Lets discuss about Lord Rama from Ramayana as an example. He is invincible. He is a learned expert of all the shastras. He is capable of shaping his own destiny. He could have established a kingdom that is better than Ayodhya in the forest and lived there happily. But he never tried or acted that way. He respected the divine scheme of things and let them unfurl as his life progressed. Like this, being aware that the whole universe is progressing as per the will of God and acting with pure conviction and determination is the secret of practicing detachment.