Search This Blog

397. Moolaprakruthih

చరాచరజగత్తుకూ మూలమైనటువంటిది. ప్రకృతి అంటే ఈ జగత్తుకు కారణ భూతమైన జగన్మాత. జగత్తులోని ప్రతివస్తువుకు ఏదో ఒకటి మూలుమున్నది. జీవులు పుట్టాలి అంటే తల్లితండ్రులు కావాలి. అలాగే అన్ని జీవాలకు పృథివియే యోని. ఆ భూమి జలం నుంచి పుట్టింది జలం అగ్ని నుంచి పుట్టింది అగ్ని నుంచి పుట్టింది వాయువు వాయువు ఆకాశం నుంచి పుట్టింది మరి ఆకాశము పరబ్రహ్మ నుంచి పుట్టింది. ఆ పరబ్రహ్మ - బ్రహ్మపదార్ధమే. దానికి మాత్రుకలేదు. పరబ్రహ్మకు చావుపుట్టుకలు లేవు. అన్నింటికీ ఆ బ్రహ్మయే కారణము. దానికి కారణము ఏదీ లేదు. కాబట్టి బ్రహ్మయే మూలప్రకృతి. అందుకనే పంచరాత్రమందు "వేదమాత, జగన్మాత అయిన సరస్వతి పుట్టింది. ఆమెకు కారణం లేదు. ఆమె మూలప్రకృతి" అని చెప్పబడింది.

నియమితకాలంలో పరిపక్వమైన కర్మలను మాత్రమే జీవులు అనుభవిస్తాయి. మరి అపరిపక్వంగా ఉన్న కర్మను అనుభవించటానికి లేదు. కర్మ చెయ్యగానే దాని యొక్క ఫలితం రాదు. కొంతకాలం పడుతుంది. బాగా తిన్న తరువాత కడుపునొప్పి రావటానికి సమయం పట్టినట్లుగా. పరిపక్వమైన కర్మను అనుభవించగానే ప్రళయం సంభవిస్తుంది. అప్పుడు ఈ జీవరాశి అంతా మాయలో కలిసిపోతుంది. ఆ మాయ పరమేశ్వరునిలో లీనమైపోతుంది. అపరిపక్వంగా ఉన్న కర్మ పరిపక్వం అయ్యేదాకా మళ్ళీ సృష్టి జరగదు. ఈ రకంగా జీవులను ఆవిర్భవింపచేసి, వాటితో కర్మను అనుభవింపచేసేదే మూలప్రకృతి.

కొంతకాలం తరువాత అవ్యక్తము అంటే మాయ, దాని నుంచి మహతత్త్వము, దాని నుంచి తమోగుణ ప్రధానమైన అహంకారము పుట్టినాయి. ఈ రకంగా త్రిగుణాలే ప్రధానంగా సృష్టి జరిగింది. దీనిని గతంలో వివరించాము. అటువంటి సృష్టి అంతటికీ మూలమైనది మూలప్రకృతి. సృష్టి స్థితి లయ తిరోదానము అనుగ్రహము అనే పంచకృత్యాలను నడిపేదే మూలప్రకృతి.

దేవీ భాగవతంలో "చరాచరజగత్తును సృష్టించటం కోసం పరమేశ్వరి. 1. దుర్గ 2. లక్ష్మి 3. పార్వతి 4. సావిత్రి 5. రాధ
అను ఐదురూపాలు పొందింది. అవే పంచశక్తులు అని చెప్పబడింది. ఈ పంచశక్తులకు కారణమైనది మూలప్రకృతి.

The origin of the entire world. Prakriti means Jagan Mata, the cause of this world. Everything in the world has a root. Living beings are born from parents. So the earth is the birth place of all living beings. The earth is born from water, water is born from fire, fire is born from air, air is born from sky, and sky is born from Parabrahma. That Parabrahma us the ultimate. It doesn't have an origin. Parabrahma has no mortal births. Brahma is the cause of everything. So Brahma is the moolaprakruthi. That is why it is said that "Saraswati, Mother of the Vedas, was born on Pancharatra. She has no origin. She is Moolaprakriti".

Living beings experience only those karmas which are matured at the appointed time. They cannot experience karma before it matures. The fruits of a Karma do not come immediately. It will take a while. Just like how it takes sometime to feel stomach heavy after eating well. Apocalypse occurs when all mature karma is experienced. Then all this life will merge into maya. That Maya gets absorbed in the Lord. Creation does not take place again until the immature karma is matured. It is Moolaprakriti which gives rise to living beings and makes them experience karma.

After some time, Avykta or Maya, from it Mahatattva, and from it Ahamkara, which is primarily of Tamoguna, are born. The trigunas are created in this way. Moolaprakriti is the source of all such creation. Moolaprakriti is the driving force of the Panchakrityas like which is the 
Creation, Dissolution, Sustenance, Annihilation, Grace.

It is said like this in Devi Bhagavatam, "Parameshwari for creating this entire world took five forms. They are 1. Durga 2. Lakshmi 3. Parvati 4. Savitri 5. Radha. They are said to be the five powers. Moolaprakriti is the cause of these five forces.

394. Prabharoopa

ప్రభారూపములైన అణిమాది దేవతలే శరీరముగా గలది. పరమేశ్వరి మనోమయి కాంతిమయి. కోటి సూర్యుల కాంతియే రూపముగా గలది. పరమేశ్వరి రూపము తేజోమయమైన కాంతిపుంజము. దేవీ భాగవతంలో ఆ దేవి.

చతుర్దిక్షు చతుర్వేదమూర్తి మద్భి రభిప్లుతమ్
కోటి సూర్యప్రతీకాశం చంద్రకోటి సుశీతలమ్
విద్యుత్కోటి సమానాభ మరణం తత్పరం మహః ||


రూపుదాల్చిన నాలుగు వేదాలచేత స్తుతించబడుతున్నది. కోట్లకొలది సూర్యుల కాంతులతో, విరాజిల్లుతూ కోట్లకొలది చంద్రుల చల్లదనము గలిగి ఉన్నది. ఆ రూపము కొన్ని కోట్ల మెరుపులు ఒక్కసారి మెరిసినట్లుగా తళుక్కున మెరిసింది. అరుణారుణకాంతులు వెదజల్లుతున్నది. అందుచేతనే ఈశావాస్యోపవిషత్తులో సాధకుడు బ్రహ్మలోకానికి బయలుదేరాడు. బ్రహ్మలోకానికి తలవాకిలి సూర్యమండలము. ఆ మార్గమంతా తేజోమయమైన సూర్య మండలము. తేజోమయమై కాంతిపుంజముతో కప్పబడి ఉంటుంది. ఆ కాంతిలో బ్రహ్మ లోకానికిపోయే త్రోవకూడా కనపడదు. అందుచేత సాధకుడు పరమాత్మను తన కాంతిని కొంత ఉపసంహరించుకోమని కోరతాడు. ఈ రకంగా అమ్మ తేజోమయమైన కాంతిపుంజము. అందుచేతనే ఆమె ప్రభారూపా అని చెప్పబడుతుంది.

She who has the Animadi deities who are Prabharupas as her body. The Divine Mother is Manomai and Kantimayi. She has the form of the light of a million suns. Divine mother is a radiant beam of light.

It is said like this in Devi Bhagavatam.
Caturdikṣu caturvēdamūrti madbhi rabhiplutam
kōṭi sūryapratīkāśaṁ candrakōṭi suśītalam
vidyutkōṭi samānābha maraṇaṁ tatparaṁ mahaḥ || Divine mother is praised by the four Vedas, she is glowing with the light of billions of suns, the coolness of billions of moons. She flashed with the dazzling light of a million lightning of the sky. It is said like this in Ishavasyopanishat about a seeker who left for brahmaloka. Surya Mandalam is the gateway to Brahmaloka. The path through out is a brilliant and filled with a infinite beams of light. It becomes difficult to find out the path to Brahma in that dazzling brilliance. Hence the seeker requests the Supreme to withdraw some of its brilliance. This brilliant bright beam of light is Divine mother. So she is called Prabharupa.

393.Prabhavathi

ప్రభా అనగా కాంతి అని అర్ధం. అమ్మ కొన్ని కోట్ల సూర్యచంద్రుల కాంతులు గలది.

ప్రభా అంటే అణిమాది ఆవరణ దేవతలు. అమ్మ ఆణిమాది ఆవరణ దేవతలతో ఆవరించబడినది.

మన అమ్మ కాంతినిప్రసరింపచేసే సూర్యుచంద్రులకే కాంతులనిస్తుంది. భైరవ యామళంలో చెప్పినట్లుగా

జ్యోతిరూపాపరాకారా యస్యాదే హోద్భవాశ్శివే !
కిరణా శ్చసహస్రం చ ద్విసహస్రంచ చ లక్షకమ్
కోటిరర్బుదమేతేషాం పసంఖ్యా న విద్యతే.


జ్యోతిరూపమైనటువంటి అమె దేహము నుంచి కోట్లకొలది కిరణాలు ప్రకాశిస్తున్నాయి. ఆ కిరణాలకు లెక్కలేదు. అవి అనంతమైనవి. వాటినుంచి

అష్టోత్తరశతంవహ్నేః షోడశోత్తరశతంరవేః |
షట్రింశత దుత్తరశతం చంద్రస్యకిరణా శ్శివే ! ||


108 కిరణములను అగ్ని, 116 కిరణములు సూర్యుడు, 136 కిరణములు చంద్రుడు గ్రహించారు. ఇవి మొత్తం 360 కిరణాలు. వీటివల్లనే పగలు రాత్రి కలుగుతున్నాయి. కాలచక్రం తిరుగుతోంది. అని చెప్పబడింది. కాబట్టి పరమేశ్వరి అంటే తేజోమయమైన కాంతిపుంజము.

ఆ పరమేశ్వరి అణిమాది అష్టసిద్ధులచేతను, విద్యాస్వరూపమగు వశివ్యాది వాగ్దేవతలు చేతను ఆవరించబడి ఉన్నది.
బహు ప్రభావముగల కుండలినీశక్తియే ప్రభావతి. ఆధారచక్రం నుంచి షట్చక్రాలను గ్రంథిత్రయాన్ని ఛేదించుకుని సహస్రారం చేరుతుంది. ఈ త్రోవలో ఆజ్ఞాచక్రం చేరినప్పుడు ఆ కుండలినీశక్తిని జ్యోతిష్మతీ, ప్రభావతి అని కీర్తిస్తారు.

Prabha means light. The glow of Divine mother surpasses the brilliance of several crores of sun and moon. Prabha means Animadi avarana devatas. Divine mother is surrounded by these avarana devatas.
Divine mother is the source of light for the light emitting sun and moon. As stated in Bhairava Yamalam jyōtirūpāparākārā yasyādē hōdbhavāśśivē! 
Kiraṇā ścasahasraṁ ca dvisahasran̄ca ca lakṣakam 
kōṭirarbudamētēṣāṁ pasaṅkhyā na vidyatē. Millions of rays are shining from her body which is like a star. One cannot count them. They are infinite. From them

Aṣṭōttaraśatanvahnēḥ ṣōḍaśōttaraśatanravēḥ |
ṣaṭrinśata duttaraśataṁ candrasyakiraṇā śśivē! ||

108 rays are absorbed by fire, 116 rays by sun and 136 rays by moon. In total these are 360 rays. Day and night are caused by them. The wheel of time is moves due to them. Hence Divine mother is called as Prabhavathi. 

Ashtottarasatamvahneh Shodashottarasatamraveh |
Shatrinsatha Duttarasatha Chandrasyakirana Sshive ! ||

108 rays are absorbed by fire, 116 rays by sun and 136 rays by moon. These are all 360 rays that are caused by day and night. The wheel of time is turning. It is said that So Parameshwari means radiant light.

Divine mother is surrounded by the ashtasiddhas and Vasivyadi Vagdevatas. Prabhavati is the multi-effectual Kundalini Shakti. It reaches Sahasrara by breaking through the six chakras beginning from the Aadhar Chakra. When it reaches the Ajnachakra in this path, the Kundalini Shakti is called as Jyotishmati and Prabhavati.

391. Nityashodashikaroopa

అమ్మ సృష్టిలో పదహారు నిత్యలు ఉన్నాయి. వీటినే షోడశనిత్యలు అంటారు. వామకేశ్వరతంత్రంలో వీటి గురించి చెప్పారు. అవి 1. కామేశ్వరి 2. భగమాలిని 3. నిత్యక్లిన్న 4. భేరుండ 5. వహ్నివాసిని 6. మహావజ్రేశ్వరి 7. శివదూతి 8. త్వరిత 9. కులసుందరి 10. నిత్యా 11. నీలపతాక 12. విజయ 13. సర్వమంగళ 14. జ్వాలామాలిని 15. చిత్ర 16. మహానిత్య. వశిష్ట సంహితలో మొదటి నిత్య మహాత్రిపురసుందరి అని చెప్పబడింది. మిగిలినవి కామేశ్వరి నుంచి చిత్ర వరకు పదిహేనునిత్యలు.

పదహారవ నిత్య అయిన మహానిత్యయే మహాత్రిపురసుందరి. ఈ నిత్య మిగిలిన వాటితో కలుస్తుంది. ఏవిధంగా అంటే పరమేశ్వరి అర్చనా విధానంలో దేవతను అర్చించటం ఒక పద్ధతి. అందులో ప్రతిరోజూ, ఆ రోజున ఉన్న తిథి నిత్యను పూజిస్తారు. అంటే పాడ్యమిరోజున కామేశ్వరితో మొదలుపెట్టి , వరుసగా విదియనాడు భగమాలిని, తదియనాడు నిత్యక్లిన్నా... పౌర్ణమి రోజు చిత్ర తో ముగిస్తారు. ఈ నిత్యపూజలో ప్రతిరోజూ తిథి నిత్యతోపాటుగా మహానిత్య లేదా మహాత్రిపురసుందరిని కూడా విధిగా అర్చించాలి. ఈ రకంగా పరమేశ్వరి స్వరూపమైన మహాత్రిపురసుందరి మిగిలిన అన్ని నిత్యలతో కలుస్తుంది. కాబట్టి ఆ దేవి నిత్యాషోడశికారూపా అనబడుతోంది. ఆ జగన్మాత నిత్యాయాగముతో సంతోషిస్తుంది. నిత్యమూషోడశి మంత్రరూపంలో ఉండేది. శక్తిరహస్యంలో “కోటివాజ పేయాలకన్న, షోడశియాగాల కన్న మహాషోడశి మంత్రాన్ని ఒకసారి పలికే వారి కోరికలను పరమేశ్వరి తీరుస్తుంది" అని చెప్పబడింది. అంటే షోడశి మహామంత్ర జపానికి అంత ప్రాముఖ్యత ఉన్నది అని అర్ధం.

పరమేశ్వరి షోడశకళాస్వరూపిణి. మిగలిన పదిహేను నిత్యలు ఆమెకు అంగనిత్యలే. అంగి అయిన పరమేశ్వరి వ్యష్టిగ, సమిష్టిగా షోడశనిత్యాకలారూపిణి. అందుచేతనే నిత్యాషోడశికారూపా అనబడుతోంది. ఈ పదహారుకళలలోను మహాత్రిపురసుందరి సాదాఖ్యకళ. అదే ధృవకళ, బ్రహ్మకళ, చిత్కళ. ఇదే పరమాత్మ స్వరూపం. మిగిలిన కళలు దీని నుంచే పుట్టి లయమవుతున్నాయి.

నిత్య కాలాన్ని సూచిస్తుంది. పదిహేను నిత్యలు పదిహేను తిథులరూపాలు, తిథి అంటే ఒక పగలు ఒక రాత్రి. అదే శివశక్తి స్వరూపము. పదిహేను తిథులు ఒక పక్షము, రెండుపక్షములు ఒక మాసము, ఆరుమాసములు ఒక ఆయనము, రెండు ఆయనములు ఒక సంవత్సరము

హయనాత్మా మహాదేవః ప్రజాపతిరితిస్మృతి
కాలపురుషుడే ప్రజాపతి. కాబట్టి నిత్యాస్వరూపమైన పరమేశ్వరియే కాలము.

There are sixteen Nithyas in Mother's creation. These are called Shodasanityas. They are mentioned in Vamakeshwaratantra. They are 1. Kameswari 2. Bhagamalini 3. Nityaklinna 4. Bherunda 5. Vahnivasini 6. Mahavajreswari 7. Shivaduti 8. Quick 9. Kulasundari 10. Nitya 11. Nilapataka 12. Vijaya 13. Sarvamangala 14. Jwalamalini 15. Chitra 16. Mahanitya. In Vasishta Samhita the first Nitya is said to be Mahatripurasundari. The remaining fifteen are from Kameshwari to Chitra.

Mahanitya, the sixteenth one, is Mahatripurasundari. This Nitya merges with each one of the remaining 15 Nityas. Nitya puja is a special method of worshiping the deity. In it puja is performed every day to the Nitya of that day. That means they start with Kameshwari on Padya day, Bhagamalini on Vidiya day, Nityaklinna on the next day,... and end with Chitra on full moon day. Along with the tithi Nityas, Mahanitya or Mahatripurasundari should also be worshiped every day in this Nitya Puja. In this way Mahatripurasundari, the form of Divine Mother, joins all the other deities. So she is called Nityashodashikarupa. The Divine mother will be pleased with this Nityayagam. She is present in the form of Shodashi mantra. In Shaktirahasya it is said that the fruits of chanting shodhashi mahamantra is greater than a crore Vajapeya yagas, Shodash yagas. That explains the significance of chanting of Shodashi Mahamantra.

Divine mother is Shodashakalasvarupini(16 arts). The fifteen nityas are parts of her. The divine mother is individually and collectively (with all the 15arts) is Shodasanityakalarupini. That is why it is called Nityashodashikarupa. Out of these sixteen arts, Mahatripurasundari's art is sadakhyakala. Same as Dhruvakala, Brahmakala, Chitkala. This is the form of God. The rest of the arts are born from this.

Nitya represents passage of time. Fifteen nityas represent fifteen tithis, tithi means passage of one day and one night. That is the form of Shiva Shakti. Fifteen Tithis are a fortnight, two fortnights are a month, six months are a Aayana, and two Aayanas are a year. Hayanatma Mahadevah Prajapatiritismriti Prajapati is the man of time. So the Nityas are forms of Divine Mother.

386. Shadangadevatayukta

షడంగములు అంటే ఆరు అంగాలు అవి 1. హృదయము, 2. శిరస్సు, 3.శిఖ, 4. నేత్రము, 5. కవచము, 6. అస్త్రములు. వీటిని దేవతలతో లేదా తన శక్తులతో ఆవరించినది.

పరమేశ్వరుడికి ఆరు అంగాలున్నాయి. వాటినే ఈశ్వరుని లక్షణాలు అని అంటారు. అవి 1. సర్వజ్ఞత, 2 తృప్తి, 3. అనాదిబోధ, 4. స్వతంత్రత, 5. నిత్యత (అలుప్తత), 6. అనంతము

1. సర్వజ్ఞ -హృదయదేవి
2. నిత్యతృప్త - శిరోదేవి
3. అనాదిబోధ - శిఖాదేవి
4. స్వతంత్రత - కవచదేవి
5. అలుప్తత - నేత్రదేవి
6. అనంతత - అస్త్రదేవి

పరమేశ్వరి ఎల్లప్పుడూ ఈ ఆరుగురు అంగరక్షకులతో కలిసి ఉంటుంది. కాబట్టి షడగందేవతా యుక్తా అనబడుతుంది.
పరమేశ్వరి శృతి స్వరూపిణి. అంటే వేదమయి. కాబట్టి శిక్షాకల్పాది అంగములు గలది. అవి 1. శిక్ష, 2. ఛందస్సు, 3. జ్యోతిషము, 4. వ్యాకరణము 5. నిరుక్తము 6. కల్పసూత్రాలు

వేదానికి ఇవి షడంగాలు. కాబట్టి పరమేశ్వరి షడంగదేవతాయుక్తా అనబడుతుంది. పరమేశ్వరి ఆరురకాలయిన దేవతలచే పరివేష్టించబడి ఉంటుంది. వారు 1. అంగదేవతలు 2. ఆవరణదేవతలు 3. ఆమ్నాయదేవతలు 4. ఆయుధదేవతలు 5. నిత్యాదేవతలు 6. పరివారదేవతలు. కాబట్టి షడంగదేవతాయుక్తా అనబడుతుంది.

Shadangams means six parts namely 1. Heart, 2. Head, 3. Shikha, 4. Eye, 5. Armor, 6. Astras. These are surrounded by Divine mothers' powers or deities. Paramatma has six limbs. These are the characteristics of God. They are 1. Omniscience, 2. Satisfaction, 3. Self-taught, 4. Independence, 5. Eternity, 6. Infinity 1. Omniscient -Goddess of heart 2. Nityatripta - Goddess of Head 3. Anadibodha - Goddess of Shikha 4. Independence - Goddess of Armor 5. Aluptatta - Goddess of Eyes 6. Infinity - Goddess of Astras Parameshwari is always accompanied by these six bodyguards. So is is called Shadagandevatayukta. Parameshwari is the embodiment of Shruti. That means Vedas are her form. So, she is explained as having 6 limbs. They are 1. Shiksha, 2. Prosody, 3. Astrology, 4. Grammar 5. Nirukta 6. Kalpasutras. These are shadangas for the Vedas. So, Divine mother is called Shadangadevatayukta. Divine mother is surrounded by six types of deities. They are 1. Angadevatas 2. Avaranadevatas 3. Amnayadevatas 4. Ayudhadevatas 5. Nityadevatas 6. Parivaradevatas.

382. Rahastarpanatarpitha

శ్రీ విద్యోపాసనలో ప్రవేశించాలి అనుకునేవాడు. ఏ కాంతమును కోరే ప్రవేశించాలి. శ్రీవిద్యలో ముఖ్యమైన విషయం ఏమంటే పుణ్యపాపాలను, ధర్మాలను ప్రకాశ విమర్శలనే చేతులతో, ఉన్మని అనే సృక్కుతో జ్ఞానమనే అగ్నిలో హోమం చెయ్యాలి. ఇక్కడ హోమగుండంలోని అగ్నికి కట్టెలు అవసరం లేదు. అది జ్ఞానాగ్ని సర్వదా మండుతూనే ఉంటుంది. అటువంటి అగ్నిలో శివాది క్షితి పర్యంతము సర్వస్వాన్ని హోమం చెయ్యాలి. ఇలా చెయ్యటాన్నే రహస్తర్పణము అంటారు. దీనివల్ల దేవి తృప్తి చెందుతుంది. ఈ రకంగా సకలభూతాలను, పుణ్యపాపాలను, ధర్మాధర్మాలను, సకలకర్మలను జ్ఞానాగ్నిలో హోమంచేసి ఆ పరమేశ్వరిని తృప్తి పరచినవాడు మోక్షం పొందుతాడు. అంటే శ్రీవిద్య బ్రహ్మవిద్య. శ్రీవిద్యోపాసకుడికి ధనధాన్యాలు, సిరిసంపదలు, భోగభాగ్యాలు, పదవులు, సన్మానాలు, గౌరవము మొదలైన ఐహికమైన వాంఛలు తీరటమేకాదు. సాయుజ్యం కూడా లభిస్తుంది.

ఐహికమైన కోరికలు తీరాలి అంటే పూజలు, అర్చనలు, వ్రతాలు చెయ్యాలి. కాని సాయుజ్యం కావాలంటే అంతర్యాగం చెయ్యాలి. దానివల్ల జగన్మాత తృప్తి చెందుతుంది. అంతర్యాగము అంటే పరమేశ్వరుడనేవాడు ఎక్కడో లేడు. చరాచరజగత్తంతా ఆవరించి ఉన్నాడు. విశాలమైన విశ్వంలోని ప్రతి అణువు పరబ్రహ్మస్వరూపమే. సాధకుడు కూడా పరబ్రహ్మయే. అయమాత్మా బ్రహ్మ. నాలోనే ఈ పరమేశ్వరుడున్నాడు. నేనే పరబ్రహ్మను అని భావించి, ఐహికమైన, సంసారబంధనాలు అన్నీ వదిలించుకోవాలి. అంటే కర్మలనుంచి విముక్తుడు కావాలి. ఈ జన్మలో కర్మలు చేయడు సరే. మరి గతంలో చేసిన కర్మలతాలూకు ఫలితం ఏమవుతుంది ? సాధారణంగా అయితే కర్మల యొక్క ఫలితాన్ని అనుభవించటం చేతనే క్షయం చెయ్యాలి. ఈ రకంగా కల్పాంతము అనుభవించినప్పటికీ కర్మఫలం క్షయంకాదు. ఇక రెండో మార్గం పరమేశ్వరోపాసన. మనోవాక్కాయ కర్మలచే ఆ భగవంతుణ్ణి ప్రార్ధించటం. ఆ ప్రార్ధనలో తాదాత్మ్యముండాలి. అప్పుడు అతని కర్మక్షయం అవుతుంది. అంటే జ్ఞానాగ్నిలో అతడు చేసిన పాపపుణ్యాలన్నీ హోమం చెయ్యబడతాయి. కర్మలన్నీ క్షయం అయిపోతాయి. ఇదే రహస్తర్పణము. గజేంద్రమోక్షంలో మొసలి కర్మను అనుభవించ లేక గజేంద్రుడు ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్ధించాడు. రహస్తర్పణవల్ల పరమేశ్వరి ఆనందిస్తుంది. అప్పుడు సాధకుడికి ముక్తి లభిస్తుంది. అయితే అంతర్యాగప్రక్రియలో షట్చక్రభేదనము, చతుర్విధైక్యసంధానము వంటివి గురువు దగ్గర మాత్రమే నేర్చుకోవాలి. ఇది యోగప్రక్రియ. చతుర్విధైక్యసంధానము అంటే

పిండ బ్రహ్మాండయో రైక్యం లింగసూత్రాత్మనో రపి
స్వాపా వ్యాకృతయో రైక్యం క్షేత్రజ్ఞ పరమాత్మనోః ||

1. పిండ బ్రహ్మాండాలకు ఐక్యము
2. సూక్ష్మ శరీరానికి సూత్రాత్మకు ఐక్యము
3. స్వాపావ్యాకృతులకు ఐక్యము
4. క్షేత్రజ్ఞ పరమాత్మలకు ఐక్యము

ఇవన్నీ గురుముఖైకవేద్యము

He who wants to practice SriVidya should live in solitude. The important thing in Srividya is that sins and virtues should be burnt in the fire of consciousness with the two hands of Prakasa & Vimarsa and the srukku of Unmani. Here the fire of homagunda does not come from firewood. It comes from the fire of consciousness that is always burning. One should offer everything that one possess into that fire. Doing this is called Rahastarpana. This pleases Divine mother. Such person attains salvation. Srividya is Brahmavidya. A practitioner of SriVidya does not desire for worldly riches, pleasures, positions, honours, respect etc.

One has to do Pujas, Archanas and Vratas to satisfy worldly desires. But if you want a salvation, you have to do internal worship. Jaganmata gets satisfied with that. Antaryagam means that feeling that the Supreme Lord pervades the entire material world. Every atom in the vast universe is his form. The seeker is also Parabrahma. Ayamatma Brahma. I have this Supreme Lord within me. Thinking that I am Parabrahman, I should get rid of all worldly and material attachments. That means one should be freed from the cycle of karma. One will not do karma in this life. But what happens to the karmas done in the past? In general, one does karma while enjoying the fruits of past karma. Then does new karma again to enjoy fruits of this karma. Caught in this cycle one would take birth and rebirth till the end of the kalpa. The only way to escape from karmic cycle is to worship the Lord. Praying to that Lord through thoughts, speech and actions. There should be empathy in that prayer. Then his karma will be nullified. That means all the sins committed by him will be burned in the fire of enlightenment. All karmas perish. This is Rahastarpana. Gajendra prayed to the Supreme Lord that he would not suffer the karma with the crocodile in Gajendramoksha. Parameshwari is pleased by Rahastharpana. Then the seeker gets liberation. But Shatchakrabhedana and Chaturvidhaikyasandhana in Antaryagaprakriya should be learned only from Guru. This is a yogic process. Chaturvidhayakyasandhana means

Piṇḍa brahmāṇḍayō raikyaṁ liṅgasūtrātmanō rapi
svāpā vyākr̥tayō raikyaṁ kṣētrajña paramātmanōḥ ||

1. Unity of the body and the universe
2. Unity of the Subtle Body to the sutraatma
3. Unity of Swapavyakrits
4. Unity of Ksetrajna and the Supreme Souls

This has to learnt from a Guru!

381. Rahoyagakramaradhya

సహస్రారమున తన భర్తతో రహస్యముగ విహరించునది. రహోయాగము అంటే అంతర్యాగము. పరమేశ్వరి పూజ రెండువిధాలు అని గతంలో వివరించాం. కాని సందర్భానుసారం మళ్ళీ ఒక్కసారి గుర్తుచేసుకుందాం.
బాహ్యపూజ, అంతఃపూజ అని పూజ రెండు రకాలు. బాహ్యపూజ అంటే ఎదురుగా దేవి విగ్రహాన్ని కాని, శ్రీచక్రాన్ని కాని ఉంచి చేసేటటువంటిది. ఇది ద్వైతభావనతో కూడిన పూజ. ఇక అంతః పూజ అంటే అద్వైతభావనతో పూజ ఇందులో భగవంతుడు భక్తుడు ఇద్దరూ ఒకటే. తేడాలేదు. సాధకుడే సాక్షాత్తూ పరబ్రహ్మ. 'అయమాత్మాబ్రహ్మ' అనే మహావాక్యము ఇక్కడ అన్వయించబడుతుంది. పరమేశ్వరుణ్ణి తన శరీరంలోనే ఊహించి, తానే పరమేశ్వర స్వరూపము అని నమ్మి భావనోపనిషత్తులో చెప్పిన ప్రకారం అర్చన చెయ్యటం. ఇది ముఖ్యవ్రణోపాసన.

శంకరభగవత్పాదులవారు తమ సౌందర్యలహరిలోని తొమ్మిదవశ్లోకంలో ఈ విషయం చెబుతూ
మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం
స్థితం స్వాధిష్ఠానే హృది మరుత మాకాశ ముపరి
మనో2పి భ్రూమధ్యే సకల మపి భిత్త్వాకులపడం
సహస్రారే పద్మే నవ రహసి పత్యా విహరసే ||


ఓ తల్లీ ! పృథివీతత్త్వమైన ఆధారచక్రము, అగ్నితత్త్వమైన స్వాధిష్ఠానము, జలతత్త్వమైన మణిపూరము, వాయుతత్త్వమైన అనాహతము, ఆకాశతత్త్వమైన విశుద్ధిచక్రము, మనస్తత్త్వమైన ఆజ్ఞాచక్రము దాటి సుషుమ్న ద్వారా సహస్రారంచేరి నీ భర్త అయిన సదాశివునితో కలిసి రహస్యముగ క్రీడించుచున్నావు.

గౌడపాదులవారు తమ సుభగోదయస్తుతిలో కుండలినీ ప్రభోదాన్ని వివరిస్తూ నాల్గవశ్లోకంలో
యదా తౌ చంద్రార్కౌ నిజసదన సంరోధ నవశా
దశక్తా పీయూష స్రవణహరణే సా చ భుజగీ
ప్రబుద్ధా క్షుత్కృద్ధాదశతి శశినం బైందవగతం
సుధాధారాసారైః స్నపయతి తనుం బైందవకళే ||


ఆధారచక్రంలో నిద్రావస్థలో ఉన్న కుండలినీశక్తిని అంతర్యాగం చేసి నిద్రలేపినట్లైతే అది షట్చక్రాలను దాటి సహస్రారం చేరి సుధాదారలు కురిపిస్తుంది. ఇదే విషయాన్ని వామకేశ్వరతంత్రం, తంత్రసారంలో కూడా వివరించారు. రహస్యముగా కుండలినీ శక్తిని జాగృతం చేసి దానితో పుణ్యపాపాలను చిదగ్నిలో హోమం చెయ్యటమే రహోయాగము. జ్ఞానంవల్ల కర్మలన్నీ నశిస్తాయి. కాబట్టి కుండలినీ యాగమే రహోయాగము. ఆపస్తంభ సూత్రాలలో “శాస్త్రాల మీద ఆసక్తి గలవాడికి మోక్షంరాదు. మంచి ఇళ్ళలో నివసించటంవల్ల, భోజనాదులవల్ల, లోకులు మనలను గుర్తించటంవల్ల మోక్షంరాదు. ధృడమైన సంకల్పంగలవాడికి, ఏకాంతజీవనం చేసేవాడికి, ఐహిక బంధనాలు వదిలించుకున్నవాడికి, ఆత్మయోగికి, అహింసాపరుడికి మాత్రమే ముక్తి లభిస్తుంది" అని చెప్పబడింది. కాబట్టి పుణ్యపాపాలన్నీ జ్ఞానాగ్నిలో దగ్ధంచేసి, సహస్రారంలో పరమేశ్వరిని అర్చించిన వారికి ముక్తి లభిస్తుంది. శ్రీ చక్రాన్ని అర్చన చేసే వారంతా కూడా అంతర్యాగంలో అదే అర్చనచేస్తారు. శ్రీచక్రంలో ఉన్న ఆవరణలన్నీ మన శరీరంలోనే ఉన్నాయి. శరీరమే శ్రీ చక్రం. అదే చరాచరజగత్తు. నవావరణలు శరీరంలోని భాగాలే అని గతంలో చెప్పాం. కాని అది ముఖ్యమైన విషయం కాబట్టి మళ్ళీ చెబుతున్నాం.

బైందవం బ్రహ్మరంధ్రం చ మస్తకం చ త్రికోణకమ్
లలాటేస్థారకం పత్రం భృవో ర్మధ్యే దశారకం
బహిర్ధశారం కంఠేతు మన్వత్రం హృదయం భవేత్
నాభౌ చ వసుపత్రం చ కట్యాం షోడశపత్రకం
వృత్తత్రయం చ ఊరుభ్యాం పద్భ్యాం భూపురత్రయమ్ ||


ఈ రకంగా శ్రీ చక్రాన్ని శరీరంలోనే భావించి, సహస్రారంలో ఆ పరమేశ్వరిని అర్చించిన జ్ఞానికి మోక్షం లభిస్తుంది.

She who wanders with her husband secretly in Sahasrara. Rahoyagam means inner yoga. We have previously explained that Gods worship is of two types. But let's recall once again according to the context.

There are two types of worship namely Bahyapuja and Antahpuja. Bahyapuja means keeping the idol of Devi or Srichakra in front of you during worship. It is a dualistic worship. And Antah Puja means worship with Advaita Bhavana in which both the devotee and the Lord are one and the same. No difference. The worshiper is the real Parabrahma. The adage 'Ayamatmabrahma' is applied here. Imagining the Supreme Lord in his/her own body and believing that he/she is the embodiment of the Supreme Lord, worshiping as per Bhavanopanishad. This is the mukhyapranopasana. Sri Shankarabhagavata says this in the ninth verse of his Soundaryalahari.
Mahīṁ mūlādhārē kamapi maṇipūrē hutavahaṁ
sthitaṁ svādhiṣṭhānē hr̥di maruta mākāśa mupari
manō2pi bhrūmadhyē sakala mapi bhittvākulapaḍaṁ
sahasrārē padmē nava rahasi patyā viharasē ||

O mother! Beyond the Aadhar Chakra which is Earth, Swadhishthana which is Fire, Manipura which is Water, Anahata which is Air, Visuddhi Chakra which is Sky, Ajna Chakra which is Mind, you enter the Sahasrara through Sushumna and dance with your husband Sadashiva in secret. 

Sri Gaudapada in the Subhagodayastuti described the Kundalini Prabhoda in the fourth stanza.
Yadā tau candrārkau nijasadana sanrōdha navaśā
daśaktā pīyūṣa sravaṇaharaṇē sā ca bhujagī
prabud'dhā kṣutkr̥d'dhādaśati śaśinaṁ baindavagataṁ
sudhādhārāsāraiḥ snapayati tanuṁ baindavakaḷē ||

If the dormant Kundalini Shakti is awakened in the Aadhar Chakra, it crosses the Shatchakras and reaches the Sahasrara and rains Sudhadaras. The same thing is also explained in Vamakesvaratantram and Tantrasara. Rahoyaga is to secretly awaken the Kundalini energy and use it to burn sins in Chidagni. The fire of consciousness destroys all karmas. So the Kundalini Yaga is the Raho Yaga. In the Apastamba Sutras, “He who is interested in the sciences does not attain moksha. Living in good houses, eating delicious food, being famous in the world does not bring salvation. It is said that only the strong-willed, the solitary, the one who has freed himself from worldly bonds, the spiritual yogi and the non-violent person can attain liberation. Therefore, those who have burnt all their sins in the fire of consciousness and worshiped Divine mother in the sahasrara will attain liberation. Shri Chakra - That is embodiment of the whole universe.

Baindavaṁ brahmarandhraṁ ca mastakaṁ ca trikōṇakam
lalāṭēsthārakaṁ patraṁ bhr̥vō rmadhyē daśārakaṁ
bahirdhaśāraṁ kaṇṭhētu manvatraṁ hr̥dayaṁ bhavēt
nābhau ca vasupatraṁ ca kaṭyāṁ ṣōḍaśapatrakaṁ
vr̥ttatrayaṁ ca ūrubhyāṁ padbhyāṁ

Like this, one has to worship divine mother inside the body. Imagine her in the Sahasrara.

380. Bindumandalavasini

బిందుమండలము అంటే శ్రీ చక్రంలో సర్వానందమయమైన బిందువే. ఆ బిందువునందుండునది. బిందువు యొక్క మండలం బ్రహ్మరంధ్రం. కాబట్టి బ్రహ్మరంధ్రంలో ఉండేది. బ్రహ్మరంధ్రం పై భాగాన అంటే చంద్రమండలంలో ఉంటుంది.

ఓం హ్రీం అని చెప్పబడే శబళ బ్రహ్మరూపమే బిందువు. శబళ బ్రహ్మ అంటే వేరుగా విభజించబడిన బ్రహ్మస్వరూపము. హకార సంజ్ఞగల పరమేశ్వరుడు సకారసంజ్ఞగల ప్రకృతితో కలసి శబళ బ్రహ్మమయి మానవ దేహంలో ప్రవేశించాడు. అంటే ఆ పరమాత్మ తనను తాను విభజించుకున్నవాడై జీవాత్మరూవంలో మానవదేహంలో ప్రవేశించాడు.

కల్యాణాయుత పూర్ణచంద్రవదనాం ప్రాణేశ్వరానందినీం
పూర్ణాం పూర్ణతరాం పరేశమహిషీం పూర్ణామృతా స్వాదినీం
సంపూర్ణాం పరమోత్తమాః మృతకళాం విద్యావతీంభారతీం
శ్రీచక్రప్రియబిందుతర్పణపరాం శ్రీరాజరాజేశ్వరీం


బిందువు పరమేశ్వరి స్వరూపం. శ్రీచక్రంలోని అన్ని కోణాలకు, అన్నిదళాలకు, అన్నిచక్రాలకు, వాగ్స్వరూపాలకు, మాతృకలకు కారణము ఆబిందువే. ఆ బిందువునందు నివసిస్తుంది కాబట్టే పరమేశ్వరి బిందుమండలవాసిని అనబడుతోంది. ఈరకంగా నాలుగు పీఠాలను వివరించటం జరిగింది. బిందువునందుండే పరమేశ్వరియే బిందుమండలవాసిని.

Bindumandalam means the most blissful point in Sri Chakra. It is the abode of Divine Mother. The mandala of Bindu is Brahmarandhra. So logically she is in Brahmarandhra. Brahmarandhra is in the upper part of Chandramandalam.

The Bindu is the form of Sabala Brahma called Om Hrim. Shabala Brahma means a divided form of Brahma. Parameshvara of reresented by 'Ha' entered into the human body as Sabala Brahma along with Prakriti represented by 'Sa'. That means that the supreme soul divided itself and entered the human body in the form of Jivatma.

Kalyāṇāyuta pūrṇacandravadanāṁ prāṇēśvarānandinīṁ
pūrṇāṁ pūrṇatarāṁ parēśamahiṣīṁ pūrṇāmr̥tā svādinīṁ
sampūrṇāṁ paramōttamāḥ mr̥takaḷāṁ vidyāvatīmbhāratīṁ
śrīcakrapriyabindutarpaṇaparāṁ śrīrājarājēśvarīṁ

Bindu is the embodiment of Divine mother. It is the cause of all angles, all forces, all chakras, vagsvarupas and matrukas in Srichakra. Parameshwari is called Bindumandalavasi because she resides in that point. In this way four Peethas have been explained.

379.odyanapeethanilayaa

ఓడ్యాణపీఠమునందు ఉండునది. ఓడ్యాణపీఠము పై అభిప్రాయం భేదం ఉన్నది.

సౌభాగ్యభాస్కరం - భాస్కరరాయలవారు
ఆజ్ఞా కమలే ఓడ్యాణపీఠము - అక్కడ ఉండునది

శ్రీ సహస్రిక - ఇలపావులూరి పాండురంగారావు గారు
ఓడ్యాణపీఠం ప్రాణాల కూటం, రెండు కాళ్ళకూపైన కనుబొమ్మల మధ్య లలాటం వైపు ఫాలభాగం మీద ఉంటుంది. ఇదే ఆజ్ఞా చక్రం. దీని మీదే రుద్ర గ్రంధి ఉంది.

manblunder.com - వి. రవి గారు
ఓడ్యాణ పీఠం నాలుగవ పీఠం. ఇది విశుద్ధి చక్రం. పూర్తిగా తయారయిన వైఖరీ వాక్కు ఇక్కడినుంచే బయటకు వస్తుంది.

శ్రీ లలితా సహస్రనామ భాష్యం - కే. పార్థసారథి గారు -
ఓడ్యాణము అనే పీఠమే నివాసస్థానముగా గలది. పరమేశ్వరి ఓడ్యాణ పీఠమందు నివసిస్తుంది. కాబట్టి ఓడ్యాణ పీఠనిలయా అనబడుతుంది. ఇది బ్రహ్మరంధ్రం

She who is in Odyana Peetha. There is a difference of opinion on Odyana Peetha.

Saubhagyabhaskaram - Bhaskararayalavaru Ajna Kamale Odyana Peetha - She is there

Sri Sahasrika - Ilapavuluri Panduranga Rao garu Odyana Peetha is the center of all Pranas, a place between the eyebrows slightly upwards on the forehead. This is the Ajna Chakra. Rudra Grandhi is located on here.

manblunder.com - V. Ravi garu Odyana Peetha is the fourth Peetha. This is Vishuddhi Chakra. Fully formed Vykhari speech emerges from here. Sri Lalita Sahasranama Bhashyam - K. Parthasarathy garu Odyana is the residence. Parameshwari resides in Odyana Peetha. So she is called OdyanaPeethanilaya. This is Brahmarandhra

376. Shrungararasasampurna

శృంగారము అను రసముచే పూర్తిగా నిండినది. ఈ నామము పూర్ణగిరి పీఠాన్ని తెలియచేస్తోంది. శృంగ అంటే రెండు, అర అనగా ఆరు అని గ్రహించాలి అంటున్నారు భాస్కరాచార్యులు. ఈ రకంగా చెబితే ఆరు రెళ్ళు పన్నెండుదళాలు గల పద్మము. అనాహతము కాబట్టి శృంగారరసము అంటే అనాహత పద్మము. అక్కడ సం - తరచుగా, పూర్ణ - ఉండునది. అనాహత పద్మమునందు ఉండేది పరమేశ్వరి. మొత్తం పీఠాలు నాలుగు. 1. కామగిరి. 2. పూర్ణగిరి 3. జాలంధర 4. ఓడ్యాణ పీఠాలు. ఇందులో రెండవదయిన పూర్ణగిరి పీఠము అనాహతమునందున్నది అని తంత్రశాస్త్రం చెబుతోంది. కాబట్టి శరీరంలోని అనాహతచక్రమే పూర్ణగిరి పీఠము.

పరమేశ్వరి బ్రహ్మాంనదస్వరూపిణి. ఆనందఘనస్వరూపిణి. శ్రీచక్రమే పరమేశ్వరి స్వరూపం. శృంగ - కోణములచేత, అర - దళములచేత, రస - తొమ్మిది రసములు లేక భావములచేత, సంపూర్ణా - నిండి ఉన్నది. శ్రీ చక్రంలోని తొమ్మిది ఆవరణలలోనూ చతుర్దశారము, దశారయుగ్మము, అష్టకోణము, త్రికోణము. అనేవి కోణచక్రాలు వీటిలో మొత్తం కలిపి 45 కోణాలుంటాయి. అలాగే షోడశదళము, అష్టదళము. ఈ రెండింటియందు కలిపి 24 దళాలుంటాయి. అలాగే శ్రీచక్రంలోని తొమ్మిది ఆవరణల యందు తొమ్మిది రకాల రసాలుంటాయి. వీటినే నవరసాలు అంటారు.

1. భూపురం -త్రైలోకమోహనచక్రం- శృంగారరసం

2. షోడశదళం -సర్వాశాపరిపూరక చక్రం -వీరరసం

3. అష్టదళం- సర్వసంక్షోభణచక్రం - కరుణరసం

4. చతుర్దశారం - సర్వసౌభాగ్యదాయకచక్రం - భయానకరసం

5. బహిర్దశారం - సర్వరక్షాకరచక్రం - రౌద్రరసం

6. అంతర్దశారం - సర్వార్ధసాధకచక్రం - భీభత్సరసం

7. అష్టకోణం - సర్వరోగహరచక్రం - హాస్యరసం

8. త్రికోణం - సర్వసిద్ధిప్రదచక్రం - అద్భుతరసం

9. బిందువు - సర్వానందమయచక్రం - శాంతరసం

ఈరకంగా శృంగారరసంతో పాటుగా మిగిలినరసాలు అన్నీ అంటే నవరసాలు కలిగినటువంటిది.

Full of romance. This name refers to Poornagiri Peetha. Shringa means two, Ara means six. said Bhaskaracharya . In this way, it is a poem of six and twelve stanzas. Thatmeans Anahata Padma. Here is sam - often, purna - present. Divine mother is in Anahata Padma. There are four peethas in total. 1. Kamagiri. 2. Purnagiri 3. Jalandhara 4. Odyana Peethas. Tantrashastra says that the second seat of Purnagiri is in Anahata. So the Anahata Chakra in the body is the Purnagiri Peetha.

Parameshwari is Brahmanandaswarupini. Anandaghanasvarupini. Sri Chakra is the embodiment of Parameshwari. sringa - by the angles, ara - by the forces, rasa - by the nine rasas or senses, sampurna - filled. Chaturdashara, Dasarayugma, Ashtakona and Trikonam are in the nine enclosures of Sri Chakra. They have angular wheels which have a total of 45 angles. Also there is Shodasadala and Ashtadala. Together these two have 24 angles. Similarly, there are nine types of rasas in the nine enclosures of Srichakra. These are called Navrasas.

1. Bhupuram -Trilokamohanachakram- Romance 2. Shodasadalam -Sarvashaparipuraka chakra -Valor 3. Ashtadalam- Sarvasankshobhanachakram - Mercy 4. Chaturdasharam - Sarvasaubhagyadayakachakram - Horror 5. Bahirdasharam - Sarvarakshakarachakram - Anger 6. Antardasharam - Sarvardhasadhakachakram - Destruction 7. Ashtakonam - Sarvarogaharachakram - Comedy 8. Trikonam - Sarvasiddhipradhachakram - Wonder 9. Bindu - Sarvanandamaya Chakra - Peace

In this way all the 9 rasas along with the romantic rasa are forms of Divine Mother.

374. Krutagjna

ప్రాణుల యొక్క పుణ్యపాపాలను ఎరుగునది.

సూర్య స్సోమో యమః కాలో మహాభూతాని పంచ చ |
ఏతే శుభా శ్శుభ స్నేహ కర్మణో నవ సాక్షిణః ||


సూర్యుడు, చంద్రుడు, యముడు, కాలము, పంచభూతాలు ఈ తొమ్మిది పుణ్యపాపాలకు, శుభాశుభకర్మలకు సాక్షులు. ఆ పరమేశ్వరి వీరికన్న వేరైనదికాదు. ఉపకారులకు ప్రత్యుపకారము చేసేది. కృతయుగములో ధర్మమువలె జ్ఞానము గలది.
అనగా కృతయుగంలో పరిపూర్ణజ్ఞానం ఏరకంగా ఉండేదో, ఆ రకమైన జ్ఞానము గలది. ఆ పరమేశ్వరి సూర్య చంద్ర కాలమయము, పంచభూతాల రూపంలో ఉండి ప్రపంచంలోని జీవులు ఏ క్షణంలో ఏ పనిచేస్తున్నారో గమనిస్తుంటుంది. శారీరకంగాగాని మానసికంగా గాని ఎవరు మంచి చెడు పనులు చేస్తున్నారో, వాటన్నింటిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటుంది. అందుచేతనే ఆమె కృతజ్ఞా అనబడుతుంది. ఆమె సర్వజ్ఞ,

పత్రపుష్పాద్యల్పమపి ప్రయచ్ఛతాంమోక్షం దదాతీతి

పత్రము పుష్పము మొదలగు అల్పవస్తువులతో అర్చించే వారికి కూడా, వారు అర్పించే వస్తువులను కాకుండా వారి భక్తికి తగినట్లుగా మోక్షము కూడా ప్రసాదిస్తుంది. సర్వజగత్తును తెలుసుకున్నది. ఆత్మరూపమైనట్టిది. కాబట్టి ఆ పరమేశ్వరి కృతజ్ఞ అనబడుతోంది. ఈరకంగా వాగీశ్వరీ రూపం వివరించబడింది.

Divine mother knows the merits and demerits of living beings. Sūrya s'sōmō yamaḥ kālō mahābhūtāni pan̄ca ca | ētē śubhā śśubha snēha karmaṇō nava sākṣiṇaḥ || Surya, Moon, Yama, Kalam and the five elements are the witnesses of all sins and virtues, auspicious and inauspicious deeds. So is Divine Mother. She reciprocates all the favors. She is embodiment of complete knowledge and pure consciousness. She is in the form of Sun, Moon and Panchabhutas and observes what the creatures of the universe are doing at any given moment. She is always aware of who is doing good and bad things, either physically or mentally. That is why she is called Krutagjna. She is omniscient, Patrapuṣpādyalpamapi prayacchatāmmōkṣaṁ dadātīti Those who worship Divine mother with offerings such as leaves and flowers, are blessed with salvation according to their devotion. Divine mother is the knower of the whole universe. She is like the soul of the body. So she is called Krutagjna.
That concludes the description of Divine mother's Vageshwari form.

372. Bhaktamanasahamsika

భక్తజనుల హృదయాలలో హంసవలె నుండునది. హంసలు మానససరోవరంలో నివసిస్తాయి. ఇక్కడ భక్తుల మనస్సు అనబడే మానససరోవర మందు నివసించు ఆడుహంస (హంసి), నాదస్వరూపిణి అయినటువంటి వాగీశ్వరీ దేవి భక్తుల హృదయములందు మంత్రరూపంలో విహరిస్తుంటుంది.

భక్తులు అంటే ఎల్లవేళలయందు హృదయమున ఎడతెగని తైలధారవలె భగవంతుని స్మరించేవారు. ధ్యానించేవారు. అమ్మ అటువంటి వారి హృదయములందు విహరిస్తుంది. అందుకే భక్తమానన హంసికా అనబడుతోంది.

Divine mother is like a swan in the hearts of devotees. Swans live in Manasasarovaram. Here, Aduhansa (Hansi) resides in the mind of the devotees called Manasasarovara, Goddess Vagiswari who is in the form of Nada lives in the form of mantra in the hearts of the devotees.

Devotees are those who always think and meditate about God. Divine mother lives in the hearts of such people. That is why she is called Bhaktamaanasahamsika.

369. Paradevataa

పరా ఉత్కృష్టా చాసౌ దేవతా చ -

ఆ బిందువు నుంచి బయటకు వచ్చిన పశ్యంతి పరదేవతా అనబడుతోంది. ఈ పశ్యంతీ స్థానంలో ఉండే దేవతను ఇంద్రియాల ద్వారా తెలుసుకోలేము. దీన్ని మనసుతో తెలుసుకోవచ్చును. అందుచేతనే ఈమె ధ్యేయమాత్రస్వరూపిణి. వేదశాస్త్రమయీ వాణీ యస్యా: సా పరదేవతా ఎవరి వాక్కులు శ్రుతి స్మృతులో ఆమె పరదేవత.

Parā utkr̥ṣṭā cāsau dēvatā ca Pashyanti, which came out from bindu, is called Paradevata. The deity in this Pashyanti cannot be known through the senses. It can be known with by mind. That is why she is called dhyeyamaatraswaroopini. Vēdaśāstramayī vāṇī yasyā: Sā paradēvatā She whose words are in Shruti & Smriti is Paradevata.

368. Pashyanthi

పశ్యంతీవాక్కు మొలకవచ్చిన ధాన్యపుగింజవంటిది. అది ఏ వృక్షమో స్పష్టంగా తెలియదు. అదే ఏదో మొక్క అని మాత్రమే తెలుస్తుంది. పాంశంతీ వాక్కు చంటి పిల్ల ఏడుపులా ఉంటుంది. ఏదో ఆర్తి ఉందని తెలుస్తుంది కానీ భావమేంటో స్పష్టంగా తెలియదు. ఈ రకంగా పశ్యంతీవాక్కు అస్పష్టంగా ఉంటుంది.

పరాస్థానంలో ఆలోచనారూపంలో ఉన్న వాక్కు వాయురూపంలో సుషుమ్న గుండా ఆధారచక్రంలోకి చేరుతుంది. అక్కడ అది ఒక గాలి బుడగలా రూపు దిద్దుకుంటుంది. మూలాధారమనేది పరమేశ్వరికి ప్రతిబింబము. మాయాస్వరూపము. సహస్రారంలో బిందువున్నది. అదే పరాశక్తి, పరావాక్కు కాగా ఆధారచక్రం త్రికోణం. అవ్యక్తము. ఇక్కడ పశ్యంతీ వాక్కుంటుంది. ఇదే మూలప్రకృతి. చరాచరజగత్తుకు సృష్టి స్థానము. త్రికోణము నుంచే ఈ జగత్తంతా ఆవిర్భవించింది అని గతంలోనే చెప్పాము.

పశ్యత్ - చూచుచున్న. పశ్యంతీ - చూచునది అని అర్ధం. దీనికే ఉత్తీర్ణ అనే పేరు కూడా ఉన్నది. సౌభాగ్యసుభోదయంలో

పశ్యతి సర్వం స్వాత్మని కరణానాం సరణి మపి |
య దుత్తీర్ణా తే నేయం పశ్యంతీ త్యుతీర్ణేశ్యప్యుదీర్యతే |


అన్నింటిని తన ఆత్మనందు చూచునది. అన్ని పనులకు మార్గమును దాటినది కాబట్టి పశ్యంతీ అని, ఉత్తీర్ణ అని అనబడుచున్నది.

పరావాక్కు యొక్క విస్తరణమే పశ్యంతి. పరా అంటే శ్రీచక్రంలోని బిందువు. పశ్యంతీ అంటే బిందువు నుంచి వచ్చిన త్రికోణము. మూలాధారం దగ్గరనుంచి ఆజ్ఞాచక్రం వరకు షట్చక్రాలలోని దళాలలో ఉన్న అక్షరాలు మాతృకావర్ణాలు అనబడతాయి. ఈ మాతృకావర్ణాలన్నీ పశ్యంతీ రూపాలు. వాక్కు యొక్క ధ్వని వాయురూపంలో ఉంటుంది. ఏదైనా ఒక శబ్దం అయింది అంటే ఆ శబ్దాన్ని ధ్వని తరంగాలు దూరతీరాలకు మోసుకుపోతాయి. అందుచేతనే ఆ శబ్దం చాలా దూరం వరకు వినబడుతుంది. ఇక్కడ పరావాక్కుకు, మధ్యమావాక్కుకు మధ్యలో ఉండేది పశ్యంతీవాక్కు. పరాస్థానంలో నుంచి బయలుదేరిన వాక్కుకు రెండవరూపము పశ్యంతి. ఇది వాక్కు యొక్క మొదటి విశ్రాంతి స్థానము అని కూడా అనవచ్చు. ఈ వాక్కును ఇంద్రియాల ద్వారా వినలేము. గతంలో చెప్పినట్లుగా పరావాక్కు సహస్రారంలో ప్రారంభమవుతుంది. ఇది వాక్కుకు మొదటి దశ. అక్కడ నుంచి మూలాధారం చేరి గాలిబుడగ రూపం ధరిస్తుంది. అది పశ్యంతి.

వాక్కు నిర్మాణమే వాగీశ్వరీ స్వరూపం. దీనిపై కౌళాచారులకు సమయాచారులకూ అభిప్రాయం భేదం ఉంది. ఇప్పటి దాకా వర్ణించింది సమయాచారం. కౌళాచారులకు సహస్రారంతో పని లేదు. అందుకని వారి దృష్టిలో వాక్కు యొక్క జన్మస్థానం మూలాధార చక్రమే. అదే పారావాక్కు. పశ్యంతీ వాక్కు యొక్క స్థానం మణిపూరం. 

The speech in Pashyanti stage is like a sprouted grain. It is not possible to tell about the tree just by looking at the sprout. The speech at Pashyanti is like he crying sound of an infant. It is not possible to understand the intention behind the sound just by listening to it. 

The speech which is in the form of a thought in Parasthana(Sahasrara) reaches the base chakra(Moolaadhaara) through sushumna naadi. There it forms like an air bubble. Moolaadhara is the reflection of Parameshwari. It is the root of illusion. The bindu is in the Sahasraram. That is abode of the speech in the form of Para. It is called Paravakku. There is a triangle in the base chakra (Moolaadhaara). Inexpressible. Here is the speech in the form of Pashyanti. This is the root of nature. It is the birth place of all creation. It is discussed in the past that the triangle in Srichakra is the birth place of the entire creation.

Pashyat - seeing. Pashyanti - One that which sees. It is also called Utteerna. It is said like this in saubhagyasubhodaya

Paśyati sarvaṁ svātmani karaṇānāṁ saraṇi mapi | 
ya duttīrṇā tē nēyaṁ paśyantī tyutīrṇēśyapyudīryatē |

She sees everything in her soul. It is called Pasyanti and Uttirna because it has crossed the path of everything.

Pasyanti is the expansion of Paravakku. Para means Bindu in Srichakra. Pasyanti means a triangle that emerged from bindu. The letters in the forces of the six chakras from the root to the Ajnachakra are called Matrukavarnas. All these matrikavarnas are forms of Pashyanthi. The sound thrives in the air. Air is the medium that carries sound to far off places. Here, Pasyantivakku, in the middle of Paravakku and Madhyamavakku. It can also be said to be the first resting place of speech. This speech cannot be heard through the senses. As mentioned earlier Paravakku begins in Sahasrara. This is the first stage of speech. From there, it reaches the root (Moolaadhaara) reaches and takes the form of a balloon. 

The faculties of speech are the form of Vageeshwari. On this there is a difference of opinion between Kaulacharas and Samayacharas. So far what has been described is Samayacharam. Kaulacharas have no reference with Sahasrara. Hence, in their view, the birthplace of speech is the Mooladhara Chakra. That's the paravaakku. Manipura is the place of Pasyanthi Vakku.

Popular