Merely talking about religion does not give anything spiritually. To progress spiritually, one must do Saadhana (Practice). Both Vedas and Tantras prescribe guidelines to attain liberation. Following guidelines prescribed in Vedas is called Savya. Following the guidelines prescribed in Tantras is called Apasavya. Divine mother is worshipped in both ways. So she is called Savya Apasavya Margastha. No matter what path you choose, faith is the most important aspect in spirituality. Rituals are prescribed to develop ones faith. But one should not get too much busy with faith and ignore quest of the Brahman. Spirituality says one must act to know the Brahman. The action starts with rituals and culminates with meditation. Meditation is the most effective saadhana in Self-realization.
There are 3 paths to reach the Solar Disc. 1.North, 2.South, 3.Centre. Each of these 3 paths have 3 roads making it a total of 3 X 3 = 9 paths. Each of these paths have 3 nakshatras (star constellations). That makes a total of 27 nakshatras from Ashwini to Revathi. Divine mother is said to be in these 3 major paths to control the universe
కేవలం మత ప్రవచనాల వలన ఆధ్యాత్మికత ముందుకు సాగదు. ఆధ్యాత్మికత కోసం సాధన అవసరం. ముక్తి సాధన మార్గాలు వేదాలలోనూ తంత్రాలలోనూ కూడా వివరించబడ్డాయి. వేదాలను అనుసరిస్తే అది సవ్య మార్గం. తంత్రాలను అనుసరిస్తే అపసవ్య మార్గం. ఈ రెండింటిలోనూ ఉన్నది అమ్మే. అందుకే సవ్యాపసవ్య మార్గస్థా అని పిలవబడుతోంది. మార్గమేదైనా సరే సాధన ముందుకు సాగాలంటే నమ్మకం ఉండాలి. ఈ నమ్మకం కలగడానికి పూజలు హోమాలు మొదలైనవి సూచించారు (సవ్య మార్గంలో). అయితే కేవలం వీటితోనే సమయమంతా గడిపేయకూడదు. ఆత్మ శోధనకు కొంత సమయం కేటాయించాలి. ఆధ్యాత్మికతను కర్మతో మొదలుపెట్టి ధ్యానంతో ముగించాలి. ధ్యానమే ఆత్మ సాక్షాత్కారానికి అత్యంత శ్రేష్ఠమైనది.
సోలార్ డిస్క్ ను చేరుకోవడానికి 3 మార్గాలు ఉన్నాయి. 1.ఉత్తరం, 2.దక్షిణం, 3.మాధ్యమం. ఈ మూడు మార్గాలలోనూ మూడు రహదారులున్నాయి. ఒక్కొక్క రహదారిలోనూ 3 నక్షత్రాలు ఉన్నాయి. ఇవే అశ్విని నుండి రేవతి వరకూ మొత్తం 27 నక్షత్రాలు. అమ్మ ఈ మార్గాలలో ఉంటూ యావత్సృష్టినీ నడుపుతూ ఉంటుంది.
No comments:
Post a Comment