Search This Blog

800-801. Rasagna Rasashevadhih

800.రసజ్ఞా

నవవిధ రసాలను ఎరిగినది. శృంగారాది నవరసాలచే తెలియబడు చైతన్యస్వరూపిణి.
నవరసాలు అంటే
1. శృంగారము, 2.హాస్యము, 3. రౌద్రము, 4. అద్భుతము, 5. భయానకము, 6.వీరము, 7. కరుణ, 8. భీభత్సము, 9. శాంతము శ్రీ చక్రంలోని తొమ్మిది ఆవరణలలోనూ ఇవి ఉంటాయి.
రసేంద్రియస్వరూపమైనది. రసము అంటే - ఆనందము. ఆసందస్వరూపమైనది. బ్రహ్మానందస్వరూపిణి. కాబట్టి అమ్మ రసజ్ఞా అనబడుతోంది.

801.రసశేవధిః
రసస్య బ్రహ్మామృతస్య శేవధిః నిధిః

బ్రహ్మమృతమునకు నిధి.

బ్రహ్మాండపురాణంలో: రస ఏవ పరం బ్రహ్మ రస ఏవ పరాగతిః రసో హి కాంతిదః పుంసాం రసో రేత ఇతి స్మృతః రసోవై రససంలబ్యా హ్యానందీ భగవత్యపి
రసమే పరబ్రహ్మ. రసమే పరాగతి, రసమే వీర్యము. అతడే రసము. రసాన్ని పొందినవాడు ఆనందిస్తాడు. వేదప్రమాణమైన ఈ రసము ప్రాణముగ ఉన్నది. అట్టి ప్రాణము లేక ఎవరూ జీవించరు అని చెప్పబడింది. వేదంలో కూడా రసమంటే ప్రాణము అని చెప్పబడింది. రసము అంటే - బ్రహ్మానందం. రసశేవధి అంటే - ఆనంద ఘనస్వరూపం. ఎంత అనుభవించినా తరగని ఆనందసాగరం. ఎంతమంది ఎంతగా అనుభవించినా తరగని బ్రహ్మానంద ఘనస్వరూపము. అదే మన అమ్మ లలితమ్మ. కాబట్టి ఆమె రసశేవధిః అనబడుతోంది.

800.Rasagna

Rasa means the essence of a play. There are 9 emotions generally portrayed in Kaavyaas. They are 1. Romance 2. Comedy 3. Ferocity 4. Wonder 5. Horror 6. Heroism 7. Compassion 8. Disgust 9. Tranquility
These are present in the 9 stage of Sri chakra. Divine mother consciousness that can be reached through these rasas.

Rasa means bliss. She who is the form of the ultimate happiness.

801.Rasasevadhih
Rasasya brahmaamrutasya shevadhih nidhih
Divine mother is the treasure trove of the ultimate happiness. The blissful paramatma

It is said like this in Brahmanda puraana:
Rasa eva param brahma rasa eva paraagathih
Raso hi kaantidah pumsaam raso retha iti smrutah:
rasovai rasasamlabyaa hyaanandee bhagavatyapi

Parabrahma is the actual real essence. That essence is called Rasa. It is the ultimate one. He/She who possess it is the real hero. He/she is the happiest person. Vedas said that this rasa is the vital living force. No one is living without it. But one has to realize it. Shevadhi means a treasure trove. Divine mother is the treasure trove of this rasa. It is unlimited. She is inside you. She can give as much as every one want. And hence she is called Rasa Shevadhih

No comments:

Post a Comment

Popular