Search This Blog

776. మేరునిలయా


మేరు రేవ నిలయో యస్యాః - సా

మేరు పర్వతము నివాసముగా గలది. మేరువు అనేది శ్రీచక్రం యొక్క రూపం. శ్రీచక్రంలోని తొమ్మిదవ ఆవరణలో అమ్మ ఉంటుంది. కాబట్టి ఆమె మేరునిలయా అనబడుతుంది.

మేరువు బంగారు పర్వతము. ఇది భూమి చుట్టూ మేఖలవలె ఉంటుంది. సూర్యచంద్రులు దీని చుట్టూ తిరుగుతుంటారు. ఈ పర్వతశిఖరం మీద దేవతలు ఉంటారు. దీని ఎత్తు లక్షయోజనాలు. దీనికి నాలుగువైపులా ఒక్కొక్కవైపునా రెండు రెండు చొప్పున మొత్తం ఎనిమిది పర్వతాలున్నాయి. తూర్పున - జఠర, దేవకూటములు పడమర - పవమాన, పారియాత్రములు ఉత్తరాన - త్రిశృంగము, మకరము దక్షిణాన - కైలాసము, కరవీరము. ఇక్కడ బ్రహ్మస్థానమున్నది. అదే బ్రహ్మపురి. ఈ పర్వతం చుట్టూ ఉన్న ఎనిమిది పర్వతాలు అష్టదిక్పాలకుల నివాసాలు.
విష్ణుపాదాల నుంచి వచ్చిన గంగ ఈ మేరువునందే ఉద్భవించింది. ఇక్కడి నుండి మొదటగా బ్రహ్మలోకానికి ఏకవేణిగా వెళ్ళింది. అంటే అప్పుడు గంగానది ఒకటే పాయ. అక్కడ నుండి ధృవపదము, సప్తర్షి మండలాలకు ప్రదక్షిణ చేసి, చంద్రమండలానికిపోయి, మళ్ళీ బ్రహ్మలోకం చేరి, అక్కడ నుండి నాలుగుపాయలుగా చీలి, 1.సీత 2. అలకనంద 3. చతుర 4. భద్ర అని ప్రసిద్ధి చెందింది.

పామిర్ నాట్ -



కొంత మంది విజ్ఞానవేత్తలు పామిర్ నాట్ ను మేరువుగా గుర్తించారు. హిందూ, జైను మరియు బౌద్ధులు మేరువును 5 శిఖరములు గల పర్వతములుగా చెప్పి ఉన్నారు. ఈ పామిర్ శిఖరాలనుంచే హిందూఖుష్, హిమాలయ, కారకోరం, కున్లున్, టియాంషెన్ అనే 5 పర్వత శ్రేణులు ఉద్భవించినట్లుగా కనిపిస్తాయి.

No comments:

Post a Comment

Popular