Search This Blog

142: Nishkama

She who does not have any desire.

Let us look at a scientific explanation of desire.

Satchidanandam (Atma/everlasting happiness) is our true nature. That means we are always happy by default. Real happiness is inside us. When we have a desire, the mind makes a determination. Something like 'on this time, at this place, in order to possess this, I will do this'. Due to this determination, the mind has to move away from Atma (happiness/Satchidanandam) and focus on karma. When the desire is fulfilled, the mind comes back to Atma again.  Because the mind moves closer to Atma after the karma is done (desire fulfilled), we feel happy. In reality, the happiness is not because of karma but the proximity to Atma that the mind regained. Let us examine this with an example.

Say you desire to have a golden necklace. So, the mind makes a determination that on this date and time I resolve to possess a particular necklace. Immediately, the distance between mind and Atma (satchidanandam) increases.  You do karma to possess the necklace. When you possess the necklace, the mind goes back to its original state (close to Atma). But it does not happen like this so easily. The sum of all our past karma will form an aura around you. It causes several obstacles in your strife. This is called dhuritam. For each obstacle, the mind's determination hardens further due to influence of desire. Eventually, it goes farther and farther to Atma (Satchidanandam). This distance from Atma (happiness) is sorrow. Finally, after many trials, the desire is fulfilled. Then mind goes back to Atma (Satchidanandam). You feel happy. Due to ignorance, you think that the happiness is due to the external object we newly possessed.


మన నిజమైన స్వరూపం సచ్చిదానందం(ఆత్మ). అంటే ఎల్లప్పుడూ ఆనందముగా ఉండడం మన నిజమైన స్వభావం. ఈ ఆనందం మనలోనే ఉంటుంది. ఏదైనా సంకల్పం కలిగినపుడు మనస్సు ఈ ఆనందానికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది. కోరిక తీరగానే సంకల్పం లయమయిపోతుంది. మనస్సు మళ్ళి  ఆనందం దగ్గరుకు చేరుతుంది. అప్పుడు సంతోషంగా అనిపిస్తుంది. ఒక ఉదాహరణతో దీనిని పరీక్షిద్దం.

ఒక బంగారం గొలుసు మీద కోరిక కలిగింది అనుకోండి. మనస్సు ఒక సంకల్పం చేస్తుంది. ఫలానా సమయానికి, ఫలానా ప్రదేశంలో, నేను ఒక బంగారం గొలుసు సంపాదించుకోవడానికి ఫలానా కర్మ చేస్తాను అని ఒక సంకల్పం చేస్తుంది. ఈ సంకల్పం చేసిన తక్షణమే మనస్సుకు ఆనందానికి దూరం పెరుగుతుంది. కోరిక తీరాక, సంకల్పం లయం అయ్యాక మల్లి ఆ దూరం తొలగిపోతుంది. అయితే ఇది మనం అనుకున్నంత తేలికగా జరగదు. పూర్వ కర్మల ఫలితం మన చుట్టూ ఒక వలయంలా ఎల్లపుడు కమ్మి ఉంటుంది. దీనిని ధురితం అంటారు. దీనివల్ల ఊహించని అవాంతరాలు ఎదురవుతాయి. వాటిని దాటడానికి సంకల్పం ఇంకా గట్టిపడుతుంది. దాంతో ఆనందంతో దూరం ఇంకా ఎక్కువ అవుతుంది. ఇలా పలుమార్లు జరిగాక మనస్సు ఆనందానికి చాలా దూరంగా వెళ్ళిపోతుంది. అదే దుఃఖం. ఈ దుఃఖంలో సంకల్పం నెరవేరడం ఇంకా కష్టమైపోతుంది. నానా విధాలుగా ప్రయత్నించగా ఎట్టకేలకు కోరిక తీరుతుంది. వెంటనే సంకల్పం లయం అయిపోతుంది. మళ్ళి మనస్సు ఆనందానికి దగ్గరగా వచ్చేస్తుంది. బాధ పోయి సంతోషంగా అనిపిస్తుంది. మాయ వలన ఆ ఆనందం కొత్తగా పొందిన బంగారం గొలుసువల్ల కలిగింది అనిపిస్తుంది. 

277. Bhagamalini


అనాహత పద్మం సూర్యమండలం. ఇక్కడ పన్నెండుదళాలు గల పద్మమున్నది. ఈ పన్నెండు దళాలలోనూ ద్వాదశాదిత్యులు ఉంటారు. వారు:
1. ఇంద్రుడు 2. ధాత 3. పర్జన్యుడు 4. త్వష్ట 5. పూష 6. ఆర్యముడు 7. భగుడు 8. వివస్వంతుడు 9. విష్ణువు 10. అంశుమంతుడు 11. వరుణుడు 12. మిత్రుడు

దేవి తామర దుద్దులో ఉండగా 12 దళాలలోనూ వీరు ఆమెను చుట్టి ఉంటారు. సూర్యకళలు 12. కాబట్టి సూర్యకళలను మాలగా ధరించినది. సూర్యకళలు:
1. తపిని 2. తాపిని 3. ధూమ్ర 4. మరీచి 5. జ్వాలిని 6. రుచికల 7. సుషుమ్న 8. భోగద 9. విశ్వా 10. బోధిని 11. ధారిణి 12. క్షమా

Anahata chakra is called Surya mandala. It has 12 corners. One for each Aditya. Mala means necklace. Divine mother is at the center of the chakra and the brightness of these Adityas are her necklace. 12 Adityas: 1.Indra 2.Dhaata 3.Parjanya 4.Twashta 5.Poosha 6.Aaryama 7.Bhaga 8.Vivaswanta 9.Vishnu 10.Amshumanta 11.Varuna 12.Mitra 12 Surya kalas: 1.Tapini 2.Taapini 3.Dhrooma 4.Mareechi 5.Jwalini 6.Ruchikala 7.Shushumna 8.Bhogada 9.Viswa 10.Bodhini 11.Dhaarini 12.Kshamaa

264: Srushtikartri

Divine Mother is the cause of the whole creation. Hence she is called Shrushtikartri. Creation is mainly a faculty of rajo guna Divine Mother takes the form of Moola Prakruthi and performs the job of creation. The purpose of creation is to give another chance (new birth) to those beings who could not nullify their karma in previous births.

The creation happens based on the three gunas. There are three aspects of creation. They are 1)EkaGunaShrushti, 2)DwiGunaShrushti, 3)TriGunaShrushti

1.EkaGunaShrushti - It has only one guna.
Devatas like Brahma emerge out of Satva guna
Humans, birds, animals etc emerge out of Rajo guna
Trees, Mountains etc emerge out of Tamo guna

2.DwiGunaShrushti - In this, each guna is again subdivided into three gunas
Viraatpurushaas emerge out of satva satva guna
Devarshis, Vaalakhilyas and Vaikhanasas emerge out of satva rajo guna
Yakshas, Rakshasas and Vidhyadharas emerge out of satva tamo guna

Humans emerge out of Rajassatva guna
Wild and domestic animals emerge out of Rajo Rajas guna
Aquatic animals, Oviparious animals emerge out of Rajastamo guna

Grass and grain crops emerge out of tamassatva guna
Creepers, bushes and trees emerge out of tamorajas guna
Mountains, plains and boulders emerge out of tamotamas guna

3.TrigunaShrushti - In this each guna is subdivided into three gunas and each sub guna is further sub divided into three gunas

Adisheshu, Vaasuki etc emerge out of SatvaTamotamas
Devatas, Angeerasa etc emerge out of SatvaTamoRajas
Navagrahas, karmadevatas emerge out of SatvaTamoSatva

Sidhas and Sadhakas emerge out of SatvaRajoTamas
Saptharishis, Sukavaamadevas etc emerge out of SatvaRajoRajas
Dikpaalakas and Panchabrahmas emerge out of SatvaRajoSatva

Hiranyagarbha and Viratpurusha emerge out of SatvaSatvaTamo
Siddhas of NirvikalpaSamadhi, Sutratma emerge out of SatvaSatvaRajas
Self-realization from SatvaSatvaSatva (shuddha satva)

Scorpion, ant, snake, wasp emerge out of RajoTamasTamam
Crocodile, Crabs, Snails emerge out of RajoTamasRajo
Crow, Sparrow, Parrot emerge out of RajoTamasSatva

Lions,Tigers,Bears emerge out of RajoRajoTamas
Elephants, Horses, Monkeys, Goats emerge out of RajoRajoRajas
Cows, Chamaree mruga, Deer emerge out of RajoRajoSatva

Shudras, Barbers, Washermen etc emerge out of RajoSatvaTamas
Vyshyas and kshatriyas emerge out of RajoSatvaRajo
Dashavidhabrahmins, Vedic pandits etc  emerge out of RajoSatvaSatva

Mountains, boulders, barren lands and thorny trees emerge out of TamoTamoTamas
Ariable lands, Residential lands etc emerge out of TamoTamoRajas
Pilgrim centers, sacred rivers etc emerge out of TamoTamoSatva

Palm, Neem, Naaganemudu etc emerge out of TamoRajasTamo
Lemon, Pomegranate, Sweet lemon, Banyan etc emerge out of TamoRajoRajas
Banana, Manago, Jack fruit, Lotus etc emerge out of TamoRajoSatva

Horse gram, Maize and millets emerge out of TamoSatvaTamo
Black gram, Toor dal, Sesame, Black paddy etc emerge out of TamoSatvaRajas
White paddy, Basmati, Sugarcane, Green gram emerge out of TamoSatvaSatva

Dashavidha Brahmins mean those who learn Vedas and follow sacred customs of Sanatan dharma. Andhra, Karnataka, Dravida, Ghoorjara, Maharashtra, Utkala, Maithala, Gouda, Kanyakabja, Saraswathas. 


జగన్నిర్మాణమనేది రజోగుణ ప్రధానుడైన ఈశ్వరుని పని. అటువంటి సృష్టిని చేస్తుంది. కాబట్టి ఆ పరమేశ్వరి సృష్టికర్త్రి అనబడుతోంది.

పూర్వ కల్పంలోని జీవరాసుల కర్మవాసనలే 'మాయా' అనబడుతుంది. ఇది జడము. అందుచేత పరమేశ్వరుని యందు అభివ్యక్తమవుతుంది.

సృష్టి చెయ్యటము రజోగుణధర్మము. ఆ పరమేశ్వరి మూలప్రకృతి రూపం పొంది సృష్టిని చేస్తున్నది. అంటే గతంలో కర్మక్షయం కాకుండా ఉన్న జీవులకర్మానుసారము వారికి ఉత్తరజన్మ ఇస్తున్నది. అందుచేతనే ఆమె సృష్టికర్తీ అనబడుతోంది.

సృష్టి గుణాల ఆధారంగా జరుగుతుంది. అందుకే సృష్టి మూడువిధాలు.
1. ఏకగుణసృష్టి 2. ద్విగుణసృష్టి 3. త్రిగుణసృష్టి

1. ఏకగుణసృష్టి : ఇందులో ఒకే గుణముంటుంది.
సత్వగుణము వల్ల - బ్రహ్మాది దేవతలు.
రజోగుణమువల్ల - మనుష్యులు, మృగాలు, పక్షులు, జలచరాలు.
తమోగుణం వల్ల - చెట్లు, చేమలు, పర్వతాలు ఉద్భవిస్తాయి.

2. ద్విగుణసృష్టి : ఇందులో ప్రతిగుణము మళ్ళీ మూడు భాగాలవుతుంది. దాని నుంచి ప్రాణికోటి ఆవిర్భవిస్తుంది.

సత్వసత్త్వము నుంచి . విరాట్పురుషాదులు

సత్వరజము నుంచి - దేవరుషులు, వాలఖిల్యులు, వైఖనసులు

సత్వతమస్సు నుంచి - యక్ష రాక్షస విద్యాధరులు

రజసత్త్వము నుంచి -మానవులు

రజోరజమున - పశువులు, మృగాలు

రజోతమస్సున - స్వేదజాలు, అండజాలు, జలచరాలు

తమస్సులో సత్వమువల్ల పైరులు, గడ్డిపంటలు

తమోరజమువల్ల - చెట్లు, పొదలు, తీగెలు

తమోతమమువల్ల - భూములు, కొండలు, బండలు

3. త్రిగుణసృష్టి : ఇందులో ప్రతిగుణంలోనూ మూడు భాగాలుంటాయి. మళ్ళీ అవి
ఒక్కొక్కటి మూడుభాగాలవుతాయి. ఈరకంగా మొత్తం 27 భాగాలవుతాయి.
1. సత్వంలో తమోతమము - శేషుడు, వాసుకి మొ||వారు
2. సత్వంలో తమోరజము - దేవతలు, అంగిరసుడు మొ||వారు
3. సత్వంలో తమోసత్వము - కర్మదేవతలు, నవగ్రహాలు

4. సత్వంలో రజోతమము సిద్ధులు, సాధ్యులు
5. సత్వంలో రజోరజము - సప్తరుషులు, శుకవామదేవాదులు
6. సత్వంలో రజోసత్త్వము - దిక్పాలకులు, పంచబ్రహ్మలు

7. సత్వంలో సత్వతమస్సు - విరాట్టు, హిరణ్యగర్భుడు
8. సత్వంలో సత్వరజస్సు సూత్రాత్మ, నిర్వికల్ప సమాధి నిష్ఠులు
9. సత్వంలో సత్వసత్వము - సర్వజ్ఞత్వము, సర్వేశ్వరత్వము, సర్వాంతర్యామిత్వము

10. రజంలో తమోతమము - కందిరీగలు, తేళ్ళు, చీమలు, పాములు
11. రజంలో తమోరజము మొసళ్ళు, పీతలు, నత్తలు
12. రజంలో తమోసత్వము - కాకులు, పిచ్చుకలు, చిలకలు, గోరువంకలు

13. రజంలో రజోతమము సింహాలు, పులులు, ఎలుగుబంట్లు
14. రజంలో రజోరజము ఏనుగులు, గుర్రాలు, కోతులు, మేకలు
15. రజంలో రజోసత్త్వము కర్రిఆవులు, చమరీమృగాలు, జింక, దుప్పి

16. రజంలో సత్వతమము శూద్రులు, మంగలి, మాల, చాకలి
17. రజంలో సత్వరజము | పుణ్యకర్మలు చెయ్యటం, దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేసే పాలకులు
18. రజంలో సత్వసత్వము బ్రహ్మవాదులు, వేదవిదులు. దశవిధ బ్రాహ్మణులు

19. తమంలో తమోతమం - కొండలు, బండలు, ముళ్ళచెట్లు, నిర్జన ప్రదేశాలు, చవిటి నేలలు.
20. తమంలో తమోరజస్సు - మంచి పంటపండే నేలలు, తపస్సు, యజ్ఞము చేసే ప్రాంతాలు. దేవ బ్రాహ్మణ నివాసాలు.
21. తమంలో తమోసత్త్వము - పుణ్యక్షేత్రాలు, పుణ్యనదులు

22. తమంలో రజోతమము - ముష్టి, వేము, బలురక్కసి, నాగజెముడు, తాడి, ఈతచెట్లు.
23. తమంలో రజోరజము నిమ్మ, దానిమ్మ, బత్తాయి, మర్రి, జమ్మి
24. తమంలో రజోసత్త్వము - అరటి, పనస, మామిడి, వెలగ, పద్మ, కలువ పారిజాతాదులు.

25. తమంలో సత్వతమము - ఉలవ, జొన్న, ఆరిగ, ధాన్యాలు
26. తమంలో సత్వరజము - కంది, నువ్వు, మినుము, నల్లవరి
27. తమంలో సత్వసత్త్వము - తెల్లవరి, సన్నవరి, పెసలు, చెరకు

దశవిధ బ్రాహ్మణులు అంటే - వేద విద్యా సంపన్నులు, ఆచారవంతులు అయిన ఆంధ్ర, కర్ణాటక, ద్రావిడ, ఘూర్జర, మహారాష్ట్రులు. వీరు పంచద్రావిడులు. ఉత్కల, మైథిల, గౌడ, కన్యాకబ్జ, సారస్వతులు. వీరు పంచగౌడులు. వీరు మొత్తం కలిపి దశవిధ బ్రాహ్మణులు

ఈ రకంగా సృష్టి జరుగుతుంది. ఆ సృష్టికి కర్త పరమేశ్వరి కాబట్టి  సృష్టికర్త్రి అనబడుతుంది.

Popular