దేవతలలో ఒక విభాగానికి చెందినవారు గుహ్యకులు. వారు బ్రహ్మ మొదలైనవారు. నవనిధులను కాపాడే మణిభద్రుడు మొదలైనవారు. వీరిచే ఆరాధింపబడుతుంది. కాబట్టి గుహ్యకారాధ్యా అనబడుతుంది.
గుహ్యము అంటే - రహస్యము. రహస్య ప్రదేశాలయందు ఆరాధించబడుతుంది కాబట్టి గుహ్యకారాధ్యా అనబడుతుంది.
అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు గురించి మనం పంచకోశాధరస్థితా అనే నామంలో తెలుసుకున్నాం. ఇవి గుహ్యకాలు. సహస్రారము, ద్వాదశాంతము గుహ్యకాలు. వీటియందు ఆరాధించబడుతుంది కాబట్టి గుహ్యకారాధ్యా అనబడుతుంది.
అంతర్యాగంలో (మనస్సుని లోపలికి తిప్పడం) శరీరంలో ఉండే షట్చక్రాలలోను ఆరాధించబడుతుంది కాబట్టి గుహ్యకారాధ్యా అనబడుతుంది.
Guhyakas are a section of devatas. Brahma, Mani bhadra (commander of nava nidhis) etc are Guhyakas. Divine mother is worshipped by them.
Guhya means secret, Unrevealed. Divine mother is worshipped in secret places.
We discussed about Annamaya, Pranamaya, Manomaya, Vignanamaya, Anandamaya koshas in the nama Panchakoshandharastitha. These are Guhyakas. Divine mother is worshipped in these koshas(cells)
Antaryaga represents a phenomenon in which a yogi turns his mind inwards and concentrates on the six chakras of the body. This is process internal to the body. Hence she is called Guhyakaaraadhya.