Search This Blog

88: Mulamantratmika

మననాత్ త్రాయతే ఇతి మంత్రః - దేనిని మననం చేయడం వలన రక్షణ కలుగుతుందో అదే మంత్రం. అమ్మవారి పంచదశాక్షరి మంత్రం చతుర్విద పురుషార్ధాలను సిద్ధింపజేసేది కనుక దానిని మూలమంత్రం అని అంటారు. శ్రీవిద్యోపాసన చేసేవారికి ఈ మంత్రం గాయత్రి వంటిది

మంత్రశాస్త్రం చాలా గొప్ప సాంకేతిక ప్రకియలతోను వివిధ రకాల వైజ్ఞానిక సూత్రాలతోను నిర్మించబడింది. సమస్త ఆసురీ గణములు, దేవతా గణములు మన మనస్సులోనే ఉంటాయి. ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క మంత్రం ఉంటుంది. మంత్రములు మననం చేయడం ద్వారా మనం ఆ మంత్రాధిష్టాన దేవతకు శక్తినిచ్చి తద్వారా సత్ఫలితాలను పొందవచ్చు. 

మంత్రాలలో బీజాక్షరాలు ఉంటాయి. ఈ అక్షరాలను పలికినపుడు వచ్చే ధ్వని ప్రకంపనలు మెదడులోని న్యూరో సెల్స్ను ప్రభావితం చేస్తాయి. తద్వారా ఆ న్యూరో సెల్స్ స్పందించి వాటి అమరికలో మార్పు కలుగుతుంది. మన ఆలోచనలు, స్వభావం, గుణం, తెలివితేటలు మొదలైనవన్నీ ఈ న్యూరాన్ల అమరిక వల్ల నిర్దేశించబడుతుంది. ఒకరు గొప్ప సంగీతకారుడు కావడానికైనా, లేక గొప్ప రాజకీయవేత్త కావాలన్న, లేక వ్యాపారవేత్త అవ్వాలన్నా, లేక వైజ్ఞానిక నిపుణుడు అవ్వాలన్నా అది ఈ న్యూరోన్ల యొక్క అమరికల వలెనే సాధ్యమవుతుంది. మనం అభ్యాసంతో, సాధనతో, ధ్యానం మొదలైన వాటితో మన మేధస్సులోని న్యూరోన్ అమరికలను మార్చుకుంటూ ఉంటాం. కొత్త అమరికలను ఏర్పరుచుకుంటూ ఉంటాం. తద్వారా ప్రగతిని సాధిస్తాము. 

మోక్ష మార్గము కూడా అంతే. అయితే మన ఋషులు పరమ దయాళులై మనకు అతి శీఘ్రముగా మోక్షము సాధించే మార్గము చూపించారు. అదే మంత్రజపం. మంత్రమును పూర్తి శ్రద్ధతో జపిస్తే అది సాధకుల మెదడులోని ముడతలను సరిదిద్ది వారి మోక్ష మార్గము సుగమము అయ్యేలా చేస్తుంది. 

Mananaat traayate iti mantrah - That which protects us by repeating multiple times (mananam) is called a Mantra. By chanting Mother's panchadasi mantra is we can achieve all the four purushardas. That is why it is called the root mantra or moola mantra. To those who follow Srividya, this mantra is like the Gayatri mantra.

There are deep concepts of applied science and technology behind mantras. They are built on scientific principles. All the rakshasa ganas and devata ganas reside in our mind in the form of neural arrangements (neural schema). Each devata has a specific mantra. By chanting that mantra repeatedly, we stimulate that devata and benefit from the positive energy it returns.

Mantras have beejaksharas. With the sound vibrations of these beejaksharas, we can stimulate our brain cells. By constantly repeating or chanting them we can change/update our neuro patterns. Our thinking, character, IQ etc are decided by these neuro patterns. These patterns are the reason for one to become a great musician or a scientist or a business man etc. We are constantly changing our neural patterns when we are actively studying and practicing things. By continuous study and practice, we form the required neural patterns and progress in life.

The study of Self realization is also same. Our saints gave us a great treasure for fast tracking the progress in self realization. That is meditation upon a mantra. By continuous meditation on a mantra, its vibrations upgrade the practitioners neural patterns such that his/her path to moksha becomes less stressful and easy. 

Popular