Search This Blog

Showing posts with label vanhi. Show all posts
Showing posts with label vanhi. Show all posts

71:Jwalimalinikakshiptha vahniprakaramadhyaga

Jwaalamaalini - She is daughter of fire god. The war with Bhandasura is going on. Mother ordered Jwaalamaalini to create a fire wall with an area of 100 yogajas and height of 30 yojanas. Jwaalamaalini did the same. This firewall served as protective cover to mother's armies

Scholars described this as following. Sri chakra is in the middle of a firewall. Mother is on top of this Sri chakra. People who realized the self physically live around us. But mentally they are detached from all illusions. This fire wall is like a wall between truth and illusion for them.

Concept - Nature is the expression of God. It came out the desire of God (attributeless paramatma) to express itself. The whole universe with it's movable and immovable objects is abstracted into Srichakra. If one knows Srichakra then he/she knows paramatma. Hence those who wish to realize the supreme looks to analyze the nature with an intent to find its creator. Minister Shyamala comes in the chariot of geya chakra to help them. The chariot of geya chakra means the faculty of discretion. The power to distinguish between truth and illusion. However, practitioners require lot of wisdom to attempt this kind of discretion. Without such wisdom, they get entrapped in the illusion. Mother's commander Varaahi comes in the chariot of kiri chakra to help them. Chariot of kiri chakra means the power and knowledge to do self-less service. By doing self-less service one will attain the wisdom that can help reach Geya chakra. But doing self-less service is also not so easy. Because the mind is captured with many unfulfilled wants. After finishing one task of self-less service it brings in a bunch of unfulfilled wants and starts craving for it. It is like climbing up the slippery slope. Take one step forward and you slip 5 steps backward. That is when jwalaamaalini comes to help the practitioner with her fire curtains. These fire curtains represent various religious customs. They prescribe foods that should not be eaten. Things that should not be seen. Words that should not be heard. Actions that should not be done. The prime purpose of these religious customs is to protect the practitioner from slipping while he/she is trying to elevate their spiritual progress. 

Few practitioners practice religious customs without doing self-less service. This is not good. It would lead to indecisiveness. Their spiritual progress would become much more difficult.

Self-less service is not a complicated, rule based concept. It is very easy and approachable to everyone. Just add at least one task in your daily routine that does not have any selfish motive. It can be any small help that you can do to others. Just do it wholeheartedly. That would give you immense pleasure and wisdom.
 
జ్వాలామాలిని - ఈమె అగ్ని దేవుని కుమార్తె. భండాసురునితో పోరు భీకరంగా సాగుతున్నది. అప్పుడు అమ్మ జ్వాలామాలినిని  వంద యోజనాల వైశాల్యము ముప్పై యోజనాల ఎత్తు కల అగ్ని జ్వాలను సృష్టించామని ఆజ్ఞాపించింది. జ్వాలామాలిని అలాగే చేసింది. ఈ అగ్గ్ని వలయం అమ్మ సైన్యానికి రక్షణ కవచంలా పనిచేసింది.

శ్రీచక్రం అగ్నివలయంలో ఉంది. అమ్మ ఆ శ్రీచక్రం పైన ఉంది. పండితులు దీనిని ఈ విధంగా వివరించారు. శ్రీచక్రాన్ని ఎరిగిన జ్ఞ్యానులు సంఘంలో ఉంటూనే అజ్ఞానానికి దూరంగా ఉంటారు. భౌతికంగా అందరితో  ఉన్నా మానసికంగా ఇంద్రియ వ్యాపారాలకు భోగలాలసకు నేను నాది అనే భ్రమలకు దూరంగా ఉంటారు. ఈ జ్వాలా వలయం వారి అంతరంగంలో జ్ఞానానికి అజ్ఞానికి మధ్య ఉన్న గోడ వంటిది. 

రహస్యం - పరమాత్మ ప్రకటీకృతం అవుదామని కోరుకున్నప్పుడు ప్రకృతి వచ్చింది. ప్రకటితమయినటువంటి ప్రకృతే పరమాత్మ. ప్రకృతి అంటే చరాచర జగత్తు. అదే శ్రీచక్రం. శ్రీచక్రాన్ని తెలుసుకొన దలిచిన సాధకులు ప్రకృతిని పరీక్షించడం మొదలుపెడతారు. అప్పుడు వారికి సత్ ఏమిటి మాయ ఏమిటి అనే విషయాలు స్ఫురించడానికి మంత్రిని శ్యామల గేయచక్రం మీద వస్తుంది. మంత్రిణి వచ్చిందంటే శ్రీచక్రం తెలిసిపోయినట్లే. అంటే పరమాత్మ దర్శనం జరిగిపోయినట్లే. కానీ ఇది అంత సులువు కాదు. అప్పటికే ఘనీభవించిన జ్ఞాన ఖనిజం మెదడులో ఉన్నవారికే అది సాధ్యం అవుతుంది. జ్ఞానం లేకుండా ప్రకృతిని ఎంత పరిశీలించినా ఉపయోగం ఉండదు.  ఎందుకంటే ప్రకృతి మాయ. క్షణ భంగురం. ఇందువలన సాధకులు సాధనలో పురోగతి సాధించలేక పోతారు. అప్పుడు వారాహి కిరిచక్ర రథంపై వచ్చి సాధకులచే నిష్కామ కర్మ చేయించి వారికి శ్యామలను అందుకునే జ్ఞానం ఇస్తుంది. ఇది కూడా అనుకున్నంత సులువు కాదు. నిష్కామ కర్మ చేయాలంటే మనసును సత్వ గుణంలో నిలబెట్టాలి. కాస్త నిష్కామ కర్మ చేయగానే మనస్సు రజోగుణ తమోగుణాలతో నిండిపోతుంది. బండెడు కోరికలు పుట్టుకొచ్చేస్తాయి. ఇది జారుడు మెట్లపై పయనం వంటిది. అందుకే మడి, ఆచారం వంటివి వచ్చాయి. అదే జ్వాలామాలిని నిర్మించే అగ్ని వలయం. మడి ఆచారం అంటే చూడకోనివి చూడకుండుట. వినకూడనివి వినకుండుట. తినకూడనివి తినకుండుట. చేయకూడనివి చేయకుండుట. మనస్సును చంచలం చేసేవి వాటిని దరిచేరనీయకూడదు. అందుకని సనాతన ధర్మంలో మడి ఆచారం వచ్చాయి. వాటి వలన వచ్చే ఒకే ఒక్క ప్రయోజనం సాధకులని సాధనలో నిలబెట్టుట మాత్రమే. 

కొంతమంది సాధకులు నిష్కామ కర్మ చేయకుండా మడి ఆచారాలను పట్టుకుంటారు. అప్పడు అది చాదస్తముగా పరిణమిస్తుంది. వారిని మరిన్ని కష్టములకు గురిచేస్తుంది. అందుకే ఆధ్యాత్మిక సాధనలో నిష్కామ కర్మ చాలా ముఖ్యం. 

నిష్కామకర్మ అంటే ఎదో గొప్ప సూత్రాలతోనూ, పద్ధతులతోను ఉండే విషయమేమి కాదు. అందరూ చేయదగిన సాధారణమైన విషయమే. మీ దైనందిన జీవితంలో ఎటువంటి స్వలాభము లేకుండా చేసే పనే నిష్కామకర్మ. దానిని శక్తి వంచన లేకుండా చేయాలి. అది ఒక్కటే నియమం. అది ఎంత చిన్న పని అయినా పరవాలేదు. 

Popular