Search This Blog

Showing posts with label Vishukra. Show all posts
Showing posts with label Vishukra. Show all posts

76: Vishukra pranaharana varahi viryanandita

Vishukra is born from Bhandasura's right shoulder. He is equally clever as shukracharya (guru of all rakshasas). 'Shukra' donotes the 'tejas', 'ojas' and 'the divine bliss' in our body. Vishukra uses all these to enjoy carnal pleasures. So as long as he is within us, we will never be able to reach mother. Vaarahi - the commander of mother's armies kills Vishukra. Mother became very happy upon hearing this news.

Take a look back. Those who realize that they are missing the unconditional, pure love of Divine Mother start spiritual practice. They start praying. Then Divine mother emerges from chidagni. She will  eliminate all the rakshasas that come in their way to reach Her(Divine mother). So ideally the practitioners are the ones that should be very happy. But as described here, mother is also very happy. It is because Her desire to reach us is hundred times greater than our desire to reach Her. She's just outside the door waiting for us to knock it. But due to ignorance, we don't realize Her eagerness. That's the beauty of our mother.

భండాసురుడు తన మాయ చేత తన కుడి భుజంనుంచి విశుక్రుడు అనే రాక్షసుడిని సృష్టిస్తాడు. వీడు తెలివితేటలలో శుక్రాచార్యుడంతటివాడు. శుక్రుడు మనిషి శరీర తేజస్సు, ఓజస్సు, పరమ ప్రకాశాల ప్రతీక. విశుక్రుడు వీటిని దుర్వినియోగపరుస్తుంటాడు. కేవలం విషయభోగాలలో తమ శుక్రమత్తతను వినియోగపరుస్తుంటాడు. వీడు మనలో ఉన్నంతకాలం మనం పారలౌకిక ప్రయోజనం పొందలేము. ఈ విశుక్రుణ్ణి అమ్మ సేనాని అయిన వారాహి వథిస్తుంది. అది విని అమ్మ చాలా సంతోషిస్తుంది.

అవలోకించండి. అజ్ఞానం వలన అవ్యాజమైన అమ్మ ప్రేమకు దూరమైపోయింది మనము. దేవతాస్ఫూర్తితో మనం మళ్ళి అమ్మను పొందాలని ప్రార్ధించాం. అప్పుడు అమ్మ చిదగ్నికుండం నుండి ఉద్భవించి.  మనలను ఆమె ప్రేమకు దూరం చేసిన రాక్షస బాలాల్ని ఒక్కొక్కటిగా నిర్మూలిస్తోంది. ఆలా చేస్తూ మనకంటే ఎక్కువగా ఆమె సొంతోషిస్తోంది. ఎందుకంటే మనకు అమ్మని చేరాలని ఎంత ఆతృత ఉందొ అంతకు వందరెట్లు ఎక్కువగా అమ్మ మనల్ని చేరాలని ఆత్రుతపడుతోంది. అందుకే ఆ సంతోషం. ఆమె అజ్ఞానం అనే తలుపు ఆవలివైపు నిలబడి ఆతృతగా ఎదురుచూస్తోంది. మనము తలుపు తడితే చాలు, అజ్ఞానం అంతా తొలిగించేస్తుంది. అదే అమ్మ ప్రేమ!

Popular