Search This Blog

Showing posts with label Shivakameswarangastha. Show all posts
Showing posts with label Shivakameswarangastha. Show all posts

52: Shivakameswarankastha


Anka means lap. In this name we will see that Mother sits on the left lap of Lord Kameshwara. In general, those who seek liberation has to go through many hardships. Those who enjoy life don't get close to liberation. But the below shloka explains that to those who seek Divine Mother, liberation will be a joyful journey. This scene explains the secret behind this.

Yatraapi bhogo na cha tatra mokshah yatraapi moksho na cha tatra bhogah |
Sri sundaree sevana tatparaanaam bhogascha mokshascha karastha eva ||

Shiva and kama are words with opposite nature. One who seeks Siva renounces kama (desire). If one is attached to kama (desire), then he cannot reach Shivam (moksha). But if you seek Divine mother, she diverts all your desires towards Shiva. So every time you satisfy a wish, you will get closer to Shiva. She makes your penance a joyful experience. So every time you do a puja or meditation, you feel contended.

A child asks his parents to buy a toy car. Parents buy and give it to him. That gets the child closer to them. He feels more love and respect for them. He likes listening to them and grows up following their advise. He becomes successful. One day the grown up says, "You suffered many hardships and supported me till now. Now I am successful in life. This success is all yours. I want to take good care of you now. That's why I bought you a car.". Then the parents feel very happy. They bless the child wholeheartedly and give all their provident fund money, house, jewelery etc to him. Whatever we do in relation with our parents, we are always the beneficiaries. It would be exactly same with Divine Mother as well. Asking a wish to Divine mother is like asking for a car toy. Buying a car is like puja, meditation etc. First we need to develop such relationship with Divine mother. This is essence of worship of God.

ఈ నామములో అమ్మవారు మహాకామేశ్వరుని ఎడమ తొడపై కూర్చుని ఉంటుంది. ఈ దర్శనానికి అర్ధం అమ్మను ఆశ్రయించిన వారికి శివ సాధన కమనీయంగాను, కామ వాసన శివాత్మకంగాను ఉంటుందని అర్ధం. 

యాత్రాపి భోగో న చ తత్ర మోక్షహ్ యాత్రాపి మోక్షో న చ తత్ర భోగః | 
శ్రీ సుందరీ సేవన తత్పరాణం భోగశ్చ మోక్షాశ్చ కారస్థ ఏవ || 

అనే శ్లోకానికి మూల రహస్యం ఇక్కడ తెలుస్తోంది. మోక్షము సాధించాలనుకున్న వారు సమస్త సుఖాలు, భోగములు వదిలి వేయాలి. ఐహిక సుఖాలనే పట్టుకున్న వారు మోక్షముపై కాంక్ష వదిలేయాలి. కానీ అమ్మను ఆరాధించే వారికి మాత్రం భోగములు అనుభవిస్తూ మోక్షము ఉంటుంది. ఎందుకంటే ఆవిడ మన కామవాసనలను శివాత్మకం చేసేస్తుంది. అప్పుడు మన కోరికలు తీర్చుకున్న ప్రతి సారి శివుడికి ఇంకా దగ్గర అవుతాము. శివ సాధనను కమనీయం చేస్తుంది. అంటే ఏదైనా పూజ, హోమం, ధ్యానం మొదలైనవి చేసాక ఎన్నో కోరికలు తీరిపోయినటువంటి తృప్తిని ఇస్తుంది. అప్పుడు భోగము మోక్షము రెండు ఎందుకు దక్కవు? 

ఒక చిన్నపిల్లవాడు అమ్మానాన్నలను ఒక కారు బొమ్మ కొనమని అడుగుతాడు. తల్లిదండ్రులు కొని ఇస్తారు. అప్పుడు వాడికి వారిపై ప్రీతి గౌరవం పెరుగుతుంది. వారికి మరింత చేరువవుతాడు. తల్లిదండ్రులు చెప్పిన మాట ఆలకించి పెరిగి పెద్ద అయ్యి ప్రయోజకుడవుతాడు. తల్లిదండ్రులతో "మీరు ఎన్నో కష్టాలు పడి నన్ను ప్రయోజకుడిని చేశారు. ఇదంతా మీ చలవే. ఇక ఈ వయసులో మీకు ఏ కష్టం కలగకుండా నేను చూసుకుంటాను. అందుకే మీకోసం ఒక కారు కొన్నాను అంటాడు". తల్లిదండ్రులు చాలా సంతోషించి పిల్లవాడిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి తమకు ఉన్న ప్రోవిడెంట్ ఫండ్ డబ్బులు, ఇల్లు, నగలు మొదలైనవన్నీ వాడికే ఇచ్చేస్తారు. అమ్మానాన్నలతో అనుబంధం పెట్టుకుని ఏది చేసిన మనకు ఎప్పుడూ మంగళమే జరుగుతుంది. జగన్మాత కూడా అంతే. కారు బొమ్మ అడగడం మనం కోరుకోవడమైతే, కారు కొని ఇవ్వడము మనం చేసే పూజ, ధ్యానం మొదలైనవి. మనం ఆవిడతో సంబంధం పెంచుకోవాలి. అదే భగవదారాధన. 

Popular