Search This Blog

954. Shambhumohini


తన్మాత్రలను శమింపచేసినవారు ఇంద్రియాలను జయిస్తారు. ఇంద్రియ లౌల్యం క్షణికానందం. అటువంటి వాటి కొరకు వారి మనస్సు చలించదు. అటువండివాడే శంభుడు. నిశ్చలమైన మనస్సు కలవాడు. అంతటి వారిని కూడా మాయ మోహింపజేస్తుంది. దీని మర్మం ఏమిటంటే ఇంద్రియాలను జయించిన తరువాత సాధకులు పట్టు సడలించకూడదు. ఇంకా పట్టుదలతో అమ్మను ప్రార్ధించాలి. అప్పుడే మాయను ఛేదించి మోక్ష సామ్రాజ్యాన్ని గెలుస్తారు. 

అమృతం కోసం దేవదానవులు క్షీరసాగరమధనం చేస్తున్నారు. అందులోంచి కామధేనువు, కల్పవృక్షం, ఐరావతం, హాలాహలం వచ్చాయి. చివరకు అమృతం వచ్చింది. అమృతం కోసం మళ్ళీ దేవదానవులు తగువులాడుకున్నారు. అప్పుడు విష్ణుమూర్తి మోహినీ రూపంలో వచ్చి రాక్షసులను భ్రమింపచేసి, అమృతాన్ని దేవతలకు అందించాడు. ఆ సమయంలో కంఠంలో గరళాన్ని ఉంచుకున్న శంభుడు మోహినిని చూసి చాలించాడు. అప్పుడే అయ్యప్ప స్వామి జననం జరిగింది. అమ్మ మాయా మోహినీ స్వరూపం దేవతలను, రాక్షసులను మాత్రమేకాదు, శంభుడిని కూడా మోహింపచేసింది. అందుకే శంభు మోహిని అని అన్నారు. 

Those who pacify thanmathras triumph over senses. All sensory pleasures are momentary. They don't crave for such momentary pleasures. That is God Shambhu. He has a still mind. However, even he is not beyond the realm of Mother's maya. He succumbed to her power of illusion. The secret being revealed here is, after triumphing over senses, spiritual practitioners should not relax. They should continue their pursuit and rise to the level beyond maya. Only then they will reach the final state of Liberation.

Both devatas and raakshasas teamed up to stir the milky ocean to pull out amruta out of it. The kamadhenu, kalpavruksham, iraavatam, haalahalam came from it. After that came amruta. Devatas and Rakshasa started bickering for amrutha. Then Lord Vishnu came in the form of Mohini. He mesmerized everyone and served amrutha to devatas. Lord Shambhu who swallowed the haalahala and kept in his throat also got mesmerized with the beauty of Mohini. That eventually led to the birth of Lord Ayyappa. As even Lord Shambhu succumbed to mother's power of illusion, she is called Shambhu Mohini.


There is a scientific aspect to this story - Sun emits ultraviolet rays. They are harmful to us. The ozone layer above the earth absorbs all these harmful rays and pass down only those sunrays that are safe and useful to us. If the ozone layer does not exist, the heat of ultraviolet rays will kill all the life on earth. In the story of ksheera saagara madhanam, when haalahalam comes out of the milky ocean, it emitted unbearable heat. Then beings on the earth along with devatas and raakshasas pray Lord Shambhu to protect them from the heat. They pray him that you are our father, so you have to protect us from this unbearable heat or else all your children will die. Then Lord Shambhu swallows the haalahala. But he cannot push it down to his stomach as it will burn all the adho lokas inside his stomach. So, he will retain it in his throat. Then his throat will start radiating blue light. That gives the name neelakantha to Lord Shiva.

ఈ కధలో ఒక గొప్ప సాంకేతిక ప్రక్రియ దాగి ఉంది. సూర్యుని నుంచి వచ్చే అతి నీలలోహిత కిరణాల వేడిని భూమిపై ఉన్న జీవాలు భరించలేవు. భూమి ఉపరితలంలో ఉన్న ఓజోన్ పొర ఆ నీల లోహిత కిరణాలను గ్రహిస్తుంది. మనకు క్షేమమైనవి అవసరమైనవి అయిన సూర్య కిరణాలనే భూమి మీదకు పంపిస్తుంది. క్షీర సాగర మధనంలో హాలాహలం పుట్టినప్పుడు అదే జరుగుతుంది. ఆ హాలాహలంనుండి భరించలేని వేడి ఉత్పన్నమవుతుంది. అప్పుడు దేవతలు, రాక్షసులు, ఋషులు శంభుడిని కాపాడమని వేడుకుంటారు. నీవే మా అందరికీ తండ్రివి. నీ పిల్లల్ని రక్షించే భారం నీదే అని అంటారు. అప్పుడు ఆయన ఆ హాలాహలాన్ని గుటుక్కుని మింగివేస్తాడు. మింగాడుకాని దానిని కడుపులోకి పంపలేడు. ఎందుకంటే ఆయన కడుపులో అధోలోకాలు ఉన్నాయి. దాని వేడికి అవి నాశనమవుతాయి. అందుకని దానిని ఆయన కంఠంలోనే ఉంచుకుంటాడు. అది అక్కడినుంచి నీల కాంతి వెదజిమ్ముతుంది. అందుకే శివునికి నీలకంఠుడు అని పేరు వచ్చింది. 

950. Pancha sankhyopacharini

Somnath Temple

సనాతన ధర్మంలో భగవతార్చన చేసేవారు ధూప, దీప, గంధ, పుష్ప నైవేద్యాలతో అర్చిస్తారు. 

పంచభూతాలతో నిర్మించబడిన ఈ సృష్టికి పంచేంద్రియాలకు ఉన్న సంబంధం పంచతన్మాత్ర సాయకా అనే నామంలో మనం తెలుసుకున్నాం. భగవంతునికి పుష్పములు అర్చించడం ద్వారా చర్మానికి వాయువుకి ఉన్న తన్మాత్ర ఉపశమనం పొందుతుంది. నైవేద్యం ద్వారా నాలుకకి నీటికి ఉన్న తన్మాత్ర ఉపశమనం పొందుతుంది. దీప దర్శనం ద్వారా కంటికి కాంతికి(అగ్ని) ఉన్న తన్మాత్ర ఉపశమనం పొందుతుంది. ధూపమము, గంధము అర్పించడం ద్వారా ముక్కుకు పృథివికి ఉన్న తన్మాత్ర ఉపశమనం పొందుతుంది. గంట, వేదమంత్రాల శబ్దం ద్వారా చెవికి ఆకాశానికి ఉన్న తన్మాత్ర ఉపశమనం పొందుతుంది. తన్మాత్రలన్నీ శమించినపుడు మనస్సు నిశ్చలమవుతుంది. అప్పుడు సాధన బాగా సాగుతుంది. సాధారణంగా హుందువులందరూ గుడికి వెళ్లి వస్తున్నపుడు మనస్సులో ఎదో తెలియని ప్రశాంతత అనుభవిస్తుంటారు. దాని వెనుక ఉన్న రహస్యం ఇదే. 

In sanaatana dharma, people offer, scent, flowers, delicious food items and light to God while worshipping. 

We learnt the link between the world built with the five elements and the five senses of the body in the name Pancha thanmathra saayaka. By offering tender flowers to God, the devotees pacify the thanmathra of skin and air. The sounds of conch, bell and mantras pacify the thanmathra of ears and sky. Light pacifies the thanmathra of eye and light(fire). Scent pacifies the thanmathra of nose and earth. Delicious food pacifies thanmathra of tongue and water. Generally, Hindus experience a strange calmness while returning from a temple. This is the secret behind it. When the thanmathras are pacified, the mind become still. A still mind has better focus. That will make penance easier.

949. Panchabhuteshi


1. Vaidhurya, 2. Neelamani, 3. Mutyam, 4. Pushyaragam, 5. Kaustubh (There are multiple colors of kaustubh stones available in market)

పృథివీ, వాయువు, అగ్ని, నీరు, ఆకాశము - ఇవి పంచభూతాలు. వీటికి ఈశ్వరి. ప్రభ్వి. 

విష్ణుపురాణంలో
విష్ణువు ధరించే వైజయంతీ మాలను పంచభూతేశీ అని అంటారు. అందులో ఉండే నీలమణి పృథివి నుంచి వచ్చింది. ముత్యము నీటినుండి వచ్చింది. కౌస్తుభము అగ్ని, వైడూర్యము వాయువు, పుష్యరాగము ఆకాశమునుండి వచ్చాయి. పంచభూతాలకు ఆయన అధిపతి అనడానికి ఈ మాల నిదర్శనం. (ఇక్కడ విష్ణువుకు లలితమ్మకు అభేద్యం)

Divine mother is the master of the five elements - Earth, Air, Fire, Water and Space.

It is said like this in Vishnu puraana
Vaijayanti maala worn by Vishnu is made of 5 gem stones. Blue sapphire (came from earth), Pearl (came from water), Koustubha (came from Fire), Vaidoorya (came from air) and Pushya raaga (came from sky). It represents Vishnu's authority over the five elements(here Vishnu and Divine mother are called inter changeably)

948. Panchami

పంచ బ్రాహ్మలలో ఐదవవాడయిన సదాశివుడు అందరికంటే ఉత్తముడు. ఎందుకంటే ఆయన వల్లే పునః సృష్టి జరుగుతుంది.  సదాశివుని భార్య/శక్తి పంచమి. సూతగీతలో ఈ విషయం చెప్పబడింది. 

బ్రహ్మాది శక్తులలో 5వది వారాహి. కాబట్టి పంచమి అంటే వారాహి అనికూడా అర్ధం వస్తుంది. 

మకార పంచకములో 5వది ఆనందరూపము కాబట్టి పంచమీ అంటే ఆనందరూపిణి. 

పంచవిధ ముక్తులలో 5వది సాయుజ్యము. అమ్మ ఎప్పుడూ తురీయాతీతంలోనే ఉంటుంది. కాబట్టి పంచమీ అనబడుతోంది. 

Panchami means the fifth. Out of the 5 gods that were discussed in the previous nama, Sadashiva is considered as the supreme as he recreates the universe after dissolution. Pamchami is His shakti. This is explained in Soothageetha

Vaaraahi devi is also known as panchami

The fifth of makaara panchakam is bliss. That is Divine mother

Kaivalya is the fifth and ultimate stage of liberation. That is Divine mother.

947. Panchapretamanchadhishayini

 



సృష్టి, స్థితి, లయ, తిరోధానము, అనుగ్రహము. ఈ 5 కార్యములు కలిపి సృష్టి. దీనికి అధిపతి లలితమ్మ. అన్నిటికన్నా ముందు పరబ్రహ్మం ఉంది. అది తనలోని కొంత భాగాన్ని శక్తిగా మార్చింది. వారే మహాకామేశ్వరుడు, లలితమ్మను. అప్పుడు ఆ శక్తి నుంచి 'ఓం' అనే ప్రణవం వచ్చింది. కాలము, పంచభూతాలు, కర్మ, గుణములు వచ్చాయి. పంచీకరణ జరిగి సృష్టి వచ్చింది. అందులో జీవములు వర్దిల్లాయి. పుడుతూ చస్తూ ఎన్నో జన్మలు ఎత్తయి. అలా కొన్నాళ్లు జరిగాక ఈ సృష్టి పరబ్రహ్మలో లయమయిపోతుంది. ఇంకా కర్మ నివృత్తి అవ్వని జీవులన్నీ కర్మ శేషం ఉండగానే మరణిస్తాయి. కాలము సంచిత కర్మ అంతా పరబ్రహ్మంలో కలిసిపోతాయి. తరువాత మళ్ళీ ప్రణవం వస్తుంది. మళ్ళీ సృష్టి జరుగుతుంది. మళ్ళీ జీవాలు వస్తాయి. మళ్ళీ చావు పుట్టుకలు వస్తాయి.  కర్మ అనుభవిస్తాయి. అనేక జన్మలు ఎత్తుతాయి. ఇది ఇలా కొనసాగుతూనే ఉంటుంది. ఎవరైతే మోక్ష మార్గాన్ని అనుసరించి పరమాత్మ దర్శనం సాధిస్తారో వారే ఈ కర్మ పాశం నుండి బయట పడతారు. జన్మ రాహిత్యం పొంది శాశ్వత శివ సాన్నిధ్యం పొందుతారు. 

ఈ సృష్టి కార్యంలోని పంచ కృత్యాల బాధ్యత బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర, సదాశివులది. ఇప్పుడు వీరిలో బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వరులు ఒక మంచానికి నాలుగు కాళ్ళయ్యారనుకోండి. ఆ మంచానికి సదాశివుడు కూర్చునే పలకగా ఉన్నదనుకోండి. అటువంటి మంచంపై అధిష్టానించి ఉంటాడు మహాకామేశ్వరుడు. ఆయన వామ భాగాన అమ్మ ఉంటుంది. అదే పంచప్రేత మంచాధిశాయినీ. 

Creation, Sustenance, Dissolution, Annihilation and Recreation are the 5 acts in the overall process of creation. Divine Mother Lalitha is the administrator of this process. At the beginning only Parabrahma existed. A part of it formed as Shakti. These two are termed as Mahakaameshwara and Mother Lalitha. From them came the Pranava 'Om'. From it came Karma and the three Gunas, time, space and the four elements. All the four elements mixed with space to create beings. These beings go through the cycles of birth and death. It continues like this for some time. After that the creation dissolves into Parabrahma again. All the four elements, time, space, karma and gunas dissolve into It. After that the creation begins again. This is a cyclic process. Those who follow the path of liberation escape from it and reach the permanent abode of Paramaatma. They are free from rebirth.

The responsibilities of the 5 acts of creation are assigned to Brahma, Vishnu, Rudra, Maheshwara and Sadaashiva. Imagine Brahma, Vishnu, Rudra and Maheshwara are the four legs of a cot and Sadaashiva is the flat plank on it. Mahakaameshwara is sitting on it and Mother Lalitha is on his left side. That is Panchapreta manchadhishaayini.

946. Panchayagnapriya

 


Below are the five types of Yagnas prescribed in vedas:
1. Agnihotra, 2. Darsapoornamaasa, 3. chaaturmaasyaalu, 4. Pashuyaga, 5. Somayaaga

Below are the give types of Yagnas prescribed in Smritis:
1.Devayagna, 2. Pitruyagna, 3. Brahmayagna, 4. Manushyayagna, 5. Bhootayagna

Below are the five types of Yagnas prescribed in Paancharaatraagama
1.Abhigmana, 2. upaadaana, 3. ijya, 4. swaadhyaaya, 5. Yoga

Below are the five types of pujas in kulaagama
1.Kouvala, 2. Yaamala, 3. Milra, 4. Chakrayak, 5. Veerasangraha

Below are the five types of yagnas in mantramahoudadhi
1.Aaturee, 2. Soutukee 3. Dourbodhee 4. Traasisaadhana 5. Bhavaani

Panchagavyas
1.Cow urine, 2. Cow dung, 3. Cow milk, 4. Yogurt from cow milk, 5. Cow ghee

Five forms of fire
1.Light (Dyurupaagni), 2. Water (Parjanyarupaagni), 3. Earth (Prudhiveerupaagni), 4. Purusharupaagni, 5. Strirupaagni

Knowingly or unknowingly, we harm many beings. The above are various methods for atonement of those sins.

వేదంలో ఈ క్రింది యజ్ఞాలు చెప్పబడ్డాయి 
1.అగ్నిహోత్రము 2.దర్శపూర్ణమాసము, 3.చాతుర్మాస్యము, 4.పశుయజ్ఞము, 5.సోమయాగము 


స్మృతులలో ఈ క్రింది యజ్ఞాలు చెప్పబడ్డాయి
1.దేవాయజ్ఞము, 2.పితృయజ్ఞము, 3.బ్రహ్మయజ్ఞము, 4.మనుష్యయజ్ఞము 5.భూతయజ్ఞము 


పాంచరాత్రాగమములో ఈ క్రింది యజ్ఞాలు చెప్పబడ్డాయి
1.అభిగమన 2.ఉపాదాన, 3.ఇజ్య, 4.స్వాధ్యాయ, 5.యోగ 


కులాగమమునందు ఈ క్రింది పూజలు చెప్పబడ్డాయి 
1.కౌవల, 2.యామళ, 3.మిళ్ర, 4.చక్రయక్, 5,వీరసంగ్రహము 


మంత్రమహౌదదిలో ఈ క్రింది యజ్ఞాలు చెప్పబడ్డాయి
1.ఆతూరీ 2.సౌతుకీ, 3.దౌర్బోధీ, 4.త్రాసీసాధన, 5.భవాని 


పంచగవ్యములు 
1.గోమూత్రము, 2.గోమయము, 3.గోక్షీరము, 4.ఆవుపాలు పెరుగు, 5.ఆవు నెయ్యి 


పంచ అగ్నులు 
1.ద్యురూపాగ్ని, 2.పర్జన్యరూపాగ్ని, 3.పృథివీరూపాగ్ని, 4.పురుషరూపాగ్ని, 5.స్త్రీరూపాగ్ని 

తెలిసో తెలియకో మనం అనేక జీవాలను హింసిస్తాము. పైన చెప్పినవన్నీ ఆ పాపాలకు ప్రాయశ్చిత్త మార్గాలు. 

944. Vajrini

 

Indra with his Vajrayudha made from the spine of Saint Dadheechi is fighting with Vritrasura 

వజ్రిణీ అంటే వజ్రాయుధం గల ఇంద్రుడి భార్య. అంటే అతని శక్తి. ఈ వజ్రాయుధం ఆకాశంలోని మెరుపు వలె ఉంటుంది. రాక్షస సంహారంలో వజ్రాయుధానికి తిరుగులేదు.  అసలు ఈ వజ్రాయుధం ఎలా తయారయ్యిందో తెలుసుకుందాం. 

వృత్రాసురునితో పోరులో దేవతలు ఓటమిపాలవుతారు. అప్పుడు వారందరూ తమ తమ ఆయుధాలు రాక్షసుల పాలవకుండా చూడమని వాటిని దధీచి మహర్షికి ఇచ్చి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతారు. ఈ ఆయుధ సంరక్షణ భారం దధీచి మహర్షిపై పడుతుంది. ఆ ఆయుధాలను తస్కరిద్దామని రాక్షసులు నిత్యం ఆయన ఆశ్రమం వద్ద వేచిచూస్తూ ఉంటారు. మహర్షి ఎంతో భద్రంగా వాటిని కాపాడుతూ ఉంటారు. క్రమేపి అది ఒక లంపటంగా మారి ఆయన తపోసాధనకు అవరోధం అవుతుంది. అప్పుడు మహర్షి తన తపోశక్తితో ఆ ఆయుధాలను నీటిలో కరిగించి ఆ నీటిని తన నోటితో తాగేస్తాడు. ఆయుధాలన్నీ ఆయన శరీరంలోకి వెళ్లి జీర్ణం అయిపోతాయి. వాటి శక్తిని మహర్షి ఎముకలు గ్రహిస్తాయి. ఆయుధాలు తస్కరిద్దామని ఎదురు చూస్తున్న రాక్షసులు అది తెలుసుకుని ఇక ఆ ప్రయత్నం మాని వెనక్కు వెళ్ళిపోతారు.  కొంత కాలం తరువాత దేవతలు వారి ఆయుధాల కోసం వస్తారు. తమ తమ ఆయుధాలు తిరిగి ఇమ్మంటారు. అప్పుడు మహర్షి జరిగినది చెప్పి, తన యోగ బలంతో మృత్యువు పొందుతానని ఆ తరువాత తన శరీరంలోని యముకులతో ఆయుధములు తయారు చేసుకోమని చెపుతాడు. తరువాత ఆయన కళ్ళు మూసుకొని యోగ నిద్రలోకి వెళ్ళిపోతారు. కాసేపటికి శరీరం పడిపోతుంది. అప్పుడు దేవతలు మహర్షి చెప్పినట్లు గానే ఆయన యముకులతో ఆయుధాలు తయారుచేసుకుంటారు. ఆయన వెన్నుముక్కతో ఇంద్రుడు వజ్రాయుధం తయారుచేస్తాడు. దానితో మళ్ళీ వృత్రాసురునితో యుద్ధం చేసి, విజయం సాధిస్తాడు. 

మనలోని దేవతా శక్తులకు తపో సాధన తోడైతే సన్నని మెరుపు తీగ వంటి కుండలిని జాగృతం అవుతుంది. అప్పుడు అది పైకి ఎగబాకి సహస్రారం చేరుతుంది. ఏ రాక్షస శక్తులు దాన్ని అడ్డుకోలేవు. ఈ ఆధ్యాత్మిక ప్రక్రియకు నిదర్శనం వజ్రిణీ నామం. 

Vajrini is the shakti of Indra who carries the weapon Vajra. It looks like lightening in the sky. It is the most powerful weapon against Rakshasas. Let us learn about the story of the weapon Vajra.

When Devatas lost the war Vrutrasura, they all fled away to hide and do penance. Before fleeing, they left all their weapons with Saint Dadheechi and requested him to keep them safe. Dadheechi agreed. Having come to know about this, Rakshasas started plans to find out ways to steal them from saint Dadheechi. Saint took utmost care to protect the weapons. He waited for a long time for Devatas to return. But they didn't. Gradually protecting the weapons from Rakshasas became an unwanted responsibility to Dadheechi. To overcome it, he dissolved all the weapons in water and drank it. The power of the weapons is absorbed by his bones. Seeing the way Devatas weapons disappeared, Rakshasas gave up on stealing them and returned to their homes. After sometime, Devatas returned from penance and asked about their weapons. Saint Dadheechi explained what happened and advised that using his supernatural powers, he will invite death and leave his body. Post that they can use his bones to manufacture powerful weapons. Devatas agreed. Saint accepted death and left his body. Then Devatas manufactured various weapons with his bones. Indra created Vajrayudha from the spine of Saint Dadheechi. He fought valiantly with Vrutrasura again and defeated him.

When we add penance to the Devata Shaktis with in us, we will awaken the kundalini. It looks like a thin thread of lightening. It rises up through the spine and reaches sahasrara. Strength of Rakshasas cannot stand before Kundalini. Vajrini is the name that represents this spiritual phenomenon.

942-943. Vyomakeshi Vimaanastha

 

Vyoma means sky, ether, atmosphere, air, wind etc. Kesha means hair.  Vyomakesha is the name of the avatar of Lord Shiva who played a key role in bringing Ganga down to earth. Vyoma keshi is his shakti. There is a very detailed explanation of this name in the story of Ganga avatarna explained in Ramayana.

Story - King Bhagiratha learns that his forefathers (sagara putras) were devoid of proper last rites and hence are deprived of a peaceful after life. Learned Brahmins advised him that if he brings Ganga to earth and make it flow through their ashes, all their sins will be washed away. Ganga is in Brahma loka. So Bhagiratha does ardent penance (tapasya) to please Brahma. Pleased with his penance, Bhrama agrees to release Ganga to earth. But with a caveat. The earth cannot sustain the force of Ganga if it falls directly from the sky. So he advises Bhagiratha to please Lord Shiva as only He can catch and absorb Ganga force and carefully pass it down to earth. Bhagiratha again does penance to please Lord Shiva. Pleased with his penance, Lord Shiva agrees to bear the force of Ganga when it is falling from the sky. Lord Shiva stands up with feet wide and knees bent. He puts his palms on his hips to get additional support for his neck and calls Ganga to jump on his head. Ganga falls on Lord Shiva's head. But she thinks her force is far superior to Lord Shiva's strength. She is proud and adamant. So she did not respect and bow to him. To teach Ganga a lesson, Lord captures all the water in his hair with out releasing a single drop down to earth. Bhagiratha is again worried as his ultimate motive is still not fulfilled. So he prays Lord to calm down and forgive Ganga. He prays Ganga to realize Lord Shiva's divinity and seek his blessings. Ganga realizes her mistake and begs pardon from Lord Shiva. Pleased with both of them, Lord Shiva gradually releases Ganga(water) to earth.

Scientific theory - Water is the vital source of life on earth. Many civilizations thrived on the banks of sacred rivers. What is the source of this water? As per many scientific theories, water came to earth from outer space. Millions of icy asteroids collided inside the earth's gravitational field to bring abundant water into earth. But this water did not reach the land immediately. It stayed in the sky (atmosphere) for many years in the form of water vapor. Finally, when the atmospheric conditions favored cloud formation and condensation, it rained and this water reached land. It initially fell on mountains and flew down in the form of rivers to form oceans. The water droplets falling from sky(while raining) gain momentum continuously due to gravity. If that happens they will hit the land like a tracer bullet. Their momentum can shatter earth's surface and create havoc. Life cannot sustain. But the atmospheric pressure around us prevents this from happening. After leaving the cloud, the rain drop initially gains speed till 9.2 m/sec. But after that its gain in momentum is nullified by the air friction. So no matter how high or low the cloud is, no matter how far the rain drop travels, the atmosphere around us ensures that it's speed does not exceed 9.2 m/sec.

By looking at the resemblance of the story and scientific theory, is it not logical to say that the name 'Vyomakesha' is a scientific name representing the theory of 'Origination of water on Earth'? If that's true, is Ramayana just a mythological book of  Hindu religion? What would have been the scope and realm of the wisdom of saint Valmiki who wrote Ramayana? Though not related to this name, below is another video on how Ramayana explained the human Endocrine system


Spiritual inference - Vimaanastha means one that resides in the upper most region. Head is the uppermost region of the body. Sahasrara is the uppermost part of the head. That is Divine mother's abode. Hence she is called Vimaanastha.

Another inference is the the sky is infinite. So is Paramatma. Paramaatma is everywhere. 



942-943. వ్యోమకేశీ విమానస్థా


వ్యోమ అంటే ఆకాశం. కేశ అంటే కేశములు. వ్యోమకేశ అంటే గంగను భూమికి తీసుకురావడానికి శివుడు ఎత్తిన అవతారం. ఆయన శక్తి వ్యోమకేశీ. రామాయణంలో గంగావతరణం కధలో ఈ అవతారం గురించి వివరించారు. 

కధ - తన పూర్వీకులైన సగరపుత్రులు సరైన అంత్యక్రియలు జరుగక సత్గతులు పొందలేక అవస్థలు పడుతున్నారని తెలుసుకున్న భగీరథుడు ఆవేదనచెంది తరుణోపాయం చెప్పమని మునులను ప్రాధేయపడతాడు. అప్పుడు వారు బ్రహ్మలోకంలో ఉన్న గంగను సగరపుత్రుల బూడిద కుప్పల మీదుగా ప్రవహింపజేస్తే వారి దాహం తీరుతుంది అని చెప్పి బ్రహ్మానుగ్రహం కొరకు తపస్సు చేయమని సలహా ఇస్తారు. అప్పుడు భగీరథుడు బ్రహ్మకోసం కఠోరమైన తపస్సు చేస్తాడు. అతని తపస్సుకి మెచ్చి బ్రహ్మ గంగను భూలోకానికి పంపడానికి అనుగ్రహిస్తాడు. అయితే ఆకాశం నుండి గంగ భూమిపై పడితే భూమి చెల్లాచెదురైపోతుందని, అందువల్ల ఆమె వేగాన్ని ఒడిసి పట్టి మెల్లగా నీటిని భూమికి చేరవేయుటకై ఈశ్వరుని వేడుకోవమని సెలవిస్తాడు. భగీరథుడు మళ్ళీ ఈశ్వరానుగ్రహం కొరకు కఠోర తపస్సు చేస్తాడు. అతని తపస్సుకు మెచ్చి శివుడు గంగను ఒడిసి పట్టుకోవడానికి అంగీకరిస్తాడు. అప్పుడు శివుడు తన రెండు పాదములను దూరంగా పెట్టి మోకాళ్ళు వంచి నిలుచుంటాడు. చేతి మడమలు తిప్పి మొలపై ఉంచుకుని, తన కేశములను ఆకాశమంతా విస్తరిస్తాడు. ఇదే వ్యోమకేశుని అవతారం.  ఆకాశంలోని గంగకు రా! నా నుదిటిపై దూకు అని సైగ చేస్తాడు. అప్పుడు అమాంతం గంగ వ్యోమకేశునిపై దూకుతుంది. ఆమెకు ఆయని నిజస్వరూపం, శక్తి సామర్ధ్యాలు తెలియవు. తన వేగంతో ఆయనని పడదోయగలననే పొగరుతో ఉంటుంది. ఆమె పొగరు అణచివేయడానికి వ్యోమకేశుడు ఆకాశమునుండి దూకిన గంగను తన కేశములలో బంధించి ఉంచుతాడు. ఆయన కేశములలో ఇరుక్కుని ఒక్క నీటి బొట్టు కూడా నేలపై పడదు. అప్పుడు భగీరథుడు మళ్ళీ వ్యోమకేశుని ప్రార్ధిస్తాడు. గంగకు ఆయన శక్తి గురించి వివరించి తను చేసిన తప్పుకు క్షమాపణ కోరమంటాడు. తన తప్పు తెలుసుకుని గంగ ఆయనను క్షమించమని అర్ధిస్తుంది. అప్పుడు ఆయన తన కేశములనుండి గంగను మెల్లగా భూమిపైకి వదులుతాడు. 

కధలోని సాంకేతిక పరిజ్ఞానం - నీరే ఈ భూమిపై సమస్త జీవాల మనుగడకు ఆధారం. ఎన్నో గొప్ప గొప్ప నాగరికతలన్నీ పుణ్యనదుల ఆధారంగానే వెలిశాయి. భూమి పైభాగం 70 శాతం నీటితో నిండి ఉంది. అసలు ఇంత నీరు భూమిపైకి ఎలా వచ్చింది? దీనికి శాస్త్రవేత్తల సమాధానం ఇలా ఉంది. కోట్లకొద్దీ మంచుతో కప్పబడ్డ గ్రహ శకలాలు భూమి గృత్వాకర్షణ శక్తి పరిధిలోకి వచ్చి ఒకదానితో ఒకటి ఢీకొన్నాయిట. ఆ మంచు కరిగి భూమిపై నీరుగా వచ్చిందిట. అయితే ఈ ప్రక్రియ జరగడానికి చాలా ఏళ్ళు పట్టిందిట. గ్రహ శకలాలనుండి వచ్చిన నీరు ఆవిరై భూమి ఉపరితలమునందే ఉండిపోయిందిట. అలా ఎన్నో సంవత్యరాలు గడిచిన తరువాత మబ్బులు తయారయ్యి వర్షం కురిసిందిట. అప్పుడు ఆ నీరు నేల చేరిందిట. నిజానికి ఆలా వర్షించే చినుకు భూమి గురుత్వాకర్షణ వల్ల బుల్లెట్ కన్నా వేగంగా వచ్చి భూమిలో చొచ్చుకు పోతుందిట. ఆ వేగానికి జీవాలన్నీ చనిపోతాయిట. కానీ ఆలా జరగలేదు. ఎందుకంటే మబ్బుని వీడిన చినుకు క్రిందకు పయనిస్తున్నపుడు గాలితో ఘర్షణ పొందుతుందిట. ఆ ఘర్షణలో తన గతిని కోల్పోతూ ఉంటుందిట. ఈ ఘర్షణ చినుకు వేగాన్ని 9.2 మీ/సెకండ్ కన్నా ఎక్కువ అవ్వకుండా చూస్తుందిట. 

రహస్యం - ఆకాశం నిండా గాలి ఉంటుంది. వాన చినుకు ఆ గాలితో ఘర్షణ పొందుతూ మెల్లగా భూమి చేరుతుంది. వ్యోమకేశుని కేశములనుండి గంగ మెల్లగా పారినట్లు. వ్యోమ అంటే ఆకాశం. ఆకాశము నిండా తన కేశములు విస్తరించాడు కనుక ఆయన వ్యోమకేశుడు అని పిలవబడ్డాడు. రహస్యం ఏమిటంటే కేశములే గాలి. వ్యోమకేశుడు కేవలం మనం ఆరాధించే శివుని అవతారం కాదు. భూమిపై నీరు రావడానికి జరిగిన ఒక గొప్ప సాంకేతిక ప్రక్రియకి నిదర్శనం. రామాయణం కేవలం హిందువులు చదువుకునే ఆధ్యాత్మిక గ్రంథం కాదు. ఇటువంటి అద్భుత గాధల సమాహారం. వ్యోమకేశుని గురించినది కాకపోయినా ఇక్కడ సందర్భం వచ్చింది కనుక ఇలాంటి విషయం ఇంకొకటి కూడా ప్రస్తావించుకుందాం. మానవ శరీరంలోని ఎండోక్రైన్ సిస్టం గురించి రామాయణంలో విస్తారంగా వివరించారట. ఈ విషయం ప్రఖ్యాత శాస్త్రవేత్త డా. టోనీ నాడర్ గారు ఈ క్రింది వీడియోలో వివరించారు. 


తత్త్వం - విమానం అంటే పైన ఉండేది. విమానస్థా అంటే పైభాగంలో ఉండేది. అమ్మ సహస్రార చక్రంలో ఉంటుంది. అది శిరస్సులో ఉంటుంది. శిరస్సు శరీరానికి పైభాగంలో ఉంటుంది. అందుకే విమానస్థా అన్నారు. 

పైన కనిపించే ఆకాశం అంతులేనిది. పరమాత్మ ఆ ఆకాశమంతా నిండి నిభిడీకృతమైనాడు. అక్కడనుండి మనలను రక్షిస్తున్నాడు(వ్యోమకేశుని లాగ).  అందుకే విమానస్థా అన్నారు. 

941. Manomayi

ఎటువంటి ద్వైతభావము లేకుండా వృత్తశూన్యమైన మనస్సు పరమాత్మ యొక్క నివాస స్థానము. మనస్సు అనేది సంకల్ప వికల్ప సంఘాతం. అదే మాయ. ఆ మాయ కనుక పటాపంచలైతే పరమాత్మ దర్శనం అవుతుంది. 

ప్రతీ జీవిలోనూ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఉంటాయి. వీటన్నింటినీ సక్రమంగా నడిపించేది మనస్సు.  నివృత్తి ధర్మం గల బుద్ధి ప్రకాశాత్మకము (పర బ్రహ్మ స్వరూపం). ప్రవ్రుత్తి ధర్మం గల మనస్సు విమర్శాత్మకం (శక్తి స్వరూపం). అవ్యక్తోపాసన నివృత్తి. విగ్రహారాధన ప్రవృత్తి. బుద్ధి వికసిస్తే మనస్సు లయం అవుతుంది. మనస్సు వికసిస్తే బుద్ధి లయం అవుతుంది. ప్రాపంచిక విధానమంతా ప్రవృత్తిరూపం. మనస్సుచే నడిపించబడేది. అందుకే అమ్మను మనోమయీ అని పిలుస్తున్నారు. 

భగవద్గీత 12వ అధ్యాయం

క్లేశొధికతరః తేషామ్ అవ్యక్తాసక్తచేతసామ్
ఆవ్యాక్తాహి గతిర్దుఖం దేహవద్భిరవాప్యతే 

ప్రవృత్తి మార్గం గొప్పదా నివృత్తి మార్గము గొప్పదా అన్న ప్రశ్నకి కృష్ణ భగవానుడు ఇలా సమాధానం ఇచ్చారు. "ప్రవృత్తి నివృత్తి మార్గాలు రెండూ గొప్పవే. సాధకుని స్థితిని బట్టి మార్గము సూచించాలి. దేహము పట్ల తాదాప్యత కలిగిన వారికి, తద్వారా వచ్చే బంధుమిత్రాదుల పట్ల మమకారం తీరని వారికి నివృత్తి మార్గము చాలా క్లేశబూయిష్టమైనది. వారు ప్రవృత్తి మార్గమునే అనుసరించాలి. బుద్ధి వికసించి మనస్సు లయం అయిన జ్ఞానికి నివృత్తి మార్గము సరి అయినది". 

A mind that is devoid of any worldly interest is abode to Paramaatma. The mind swings between decision-execution of various activities. But if you devoid it from these and keep it still, you will see the attributeless paramaatma in it.

All beings have limbs and sense organs. The mind is the administrator of these organs. It is the administers various activities one performs while worshipping God. This is the path of Pravrutti (Outer worship). In the path of nivrutti, the intellect analyses and determines 'not this' making you shun all worldly interests. There are no mindful actions to perform here. If Nivrutti is 'Shivam', then Pravrutti is 'Shakti'. All worldly matters (Pravrutti) are administered by the mind (Manah). Hence Divine Mother is called 'Manomayi'

Bhagavadgita 12th Chapter

Kleshodhikatarah teshaam avyaktaasaktachetasaam
avyaktaahi gatirdhukham dehavadbhiravaapyate

Lord Krishna answered the question "which path of these two is superior, Pravrutti or Nivrutti?" in Bhagavadgita. Lord said, "Both Pravrutti and Nivrutti are good in their own respect. It depends on the person who is seeking me. Those who are still attached to their physical body and still love their kith and kin should not indulge in Nivrutti. A learned person whose mind is dissolved in the intellect and who shuns all worldly affairs saying 'not this' should choose the path of Nivrutti." 

935. jagadhatri

సర్వ జగత్తునూ ధరించునది. జగత్తుకు ఆధారమైనది. 

వామకేశ్వరతంత్రంలో

శింశుమారాత్మనావిష్ణుహ్ భూరాదీనూర్థ్వతః స్థితాన్ 
దధ్రే శేషతయాలోకాన్ సప్తలోకాన్ అధస్థితాన్ 

పరమాత్మ మొసలి రూపంలో ఊర్ధ్వలోకాలను, ఆదిశేషుని రూపంలో అధోలోకాలను మోస్తున్నాడు. అమ్మే పరమాత్మ అందుకే జగద్ధాత్రీ అని అన్నారు. 

ఊర్ధ్వలోకాలు - భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము.  

అధోలోకాలు - అతలము, విరాళము, సుతలము, తలాతలము, మహాతలము, రసాతలము పాతాళము. 

Divine mother is the support for the whole universe.

It is said like this in vamakeshwara tantra

Shimshumaaraarmanaavishnuh bhooraadeenoordhvatah sthithaan
dadhre sheshatayaalokaan saptalokaan adhasthitaan

The Paramaatma is supporting the Orrdhvalokas in the form of a crocodile and Adholokas in the form of a serpent (aadhisheshu)

Orrdhvalokas - Bhuloka, Bhuvarloka, Suvarloka, Maharloka, Janaloka, Tapoloka and Satyaloka

Adholokas - Atalamu, Vitalamu, Sutalamu, Talaatalamu, Mahaatalamu, Rasaatalamu, Paatalamu

930. Manasvini


నిలకడ గల మనస్సు అమ్మ పైనే స్వతంత్రంగా అధివసించి ఉంటుంది.

మనస్సుకు 11 వికృతాలు అవి:

1.కామ 2.సంకల్ప 3.విచికిత్స 4.శ్రద్ధ 5. సత్యము 6.ధృతి 7.అధృతి 8.శ్రీహ్ 9.హ్రీహ్ 10.భీహ్ 11.ధీహ్ 

ఈ వికృతాలు మానవుని పూర్వ కర్మను బట్టి మారుతుంటాయి. అంటే పండితుడి యందు ఒక రకంగానూ పామరుడి యందు ఒక రకంగానూ ఉంటాయి. బ్రహ్మచారి యందు ఒక రకంగానూ సంసారి యందు ఒక రకంగానూ ఉంటాయి. పూర్వ కర్మలను బట్టి మనస్సులో వికారములు కలుగుతాయి. వీటి వలన భవిష్యత్ వర్తమానాలలో కర్మలు జరుగుతుంటాయి. ఇలా సంకల్ప వికల్పాలతో మనస్సు తిరుగాడుతూనే ఉంటుంది. ఎప్పుడైతే మనిషి కర్మ ఫలమందు ఆసక్తి వదిలేస్తాడో అప్పుడు మనస్సు నిలకడ అవుతుంది. అమ్మవైపు తిరిగిపోతుంది. 

జీవులన్నింటికీ జన్మించినపుడు మూడు శరీరాలు ఉంటాయి. స్థూలదేహం ఈ జన్మలో కల్పించబడింది. కానీ సూక్ష్మ కారణ దేహాలు పూర్వ జన్మ సుకృతాలు. గత జన్మలో ఉన్న బలమైన కోరికలు పూర్తిగా తీరకపోతే అవి ఈ జన్మలో కొనసాగుతాయి. వాటి ఆధారంగానే కొత్త కోరికలు కూడా పుడతాయి. ఈ రెండూ కలిసి మనసులో పనిచేస్తాయి. తదనుగుణంగా మానవుడి ఆలోచనలు సాగుతాయి. ప్రతిజన్మలోనూ జీవి మనస్సుకు, కర్మలకు సాక్షి లలితమ్మే. కాబట్టి ఆమె మనస్వినీ అనబడుతుంది. 

By nature, human mind is inclined towards Divine Mother. But it cannot focus on Her due to internal turbulence in it. When you rid the mind of all worldly thoughts, the turbulence will go away. Then it seeks Mother's abode.

The mind has 11 types of orientations. They are:

1.Kaama 2.sankalpa, 3.Vichikitsa, 4.Shraddha, 5.Satyamu, 6.Dhrithi, 7.Adhrithi, 8.Sreeh, 9.Hreeh, 10.Bheeh, 11.Dheeh 

These orientations are dependent upon ones past actions. That means they are specific to each individual. The orientation of a learned scholar will be different from that of an uneducated person. The orientation of a bachelor is different from that of a family man. These orientations influence the actions in present and future. That means what one does in the past has strong influence on his/her present and future actions. But when you shun the fruits of your actions, then the mind becomes free of these orientations. It will turn towards Divine Mother.

All beings get three bodies by birth. A physical body is given in this life. But its metaphysical and ethereal bodies continue from past life. Any strong unfulfilled wishes from past lives become part of these metaphysical and ethereal bodies. These combined with the new physical body in this life gives rise to new wishes. These wishes direct how one would think and act. Divine Mother is the witness to all the wishes and actions of all the past and current lives. Hence, she is called Manasvini.

927-928 - Stotrapriya Stutimati

The Lalitha Sahasranama Sthothra takes us closer to Divine mother. Hence, she is called Stotra Priya. It should not be interpreted as Mother likes few things and dislikes others. She is beyond like and dislike. This nama is very significant to all those who chant Lalitha Sahasranama. Let us understand the science behind chanting and how it benefits us. 

God gave extra ordinary intelligence to humans. With this they analyze situations and take decisions. This analytical process goes like this. Human brain first creates entities in the grey matter. These entities represent stuff that was perceived through senses. Stuff like the objects seen, statements heard etc. These entities are stored as chains connected to each other with links based on similarity/relevance. This can be imagined as various nodes (carrying information) being connected to each other with links (implying similarity). When there is a question, the mind searches through these connected chains for similarity. When similarity is found, it will create a link between the question node and the answer node and creates a ring. That's a pattern. Nodes connect to each other forming patterns and a bunch of similar patterns fold into a node. Let us try to understand this with an example!

Say a person wore new clothes on a day. His friend complimented him like, "You are looking like Chiranjeevi in these new clothes". Now the question is, "Do I look good in my new clothes?" If he is a Telugu speaking person and had watched movies before, he will have lot information in his memory about Mr. Chiranjeevi. Like how Mr. Chiranjeevi looks, what is his style, how is his dance, etc. All this information is organized into a chain of nodes inter-connected based on similarity. His mind will first create a node with the question in it. This question node will have images of the person in the new clothes. Then it will search through the various nodes with relevant information. It will locate the node that has images of Mr. Chiranjeevi in similar attire. Based on the compliment given, it will create a link between the question node and this final node. That completes the analysis. A pattern is formed. The answer is found. He feels very happy. If a thousand people say this, there are thousand patterns of the same type. Then his mind folds all these patterns into a new node that says, "I look same as Mr. Chiranjeevi". But if he is a Bengali or a Korean, his mind probably would not have any information about Mr. Chiranjeevi. In that case, he will ask several questions like, "Who is Mr. Chiranjeevi?", "How does he look like? Do you have his photo? etc. With these questions, he will first form chains of information in his grey matter and then searches through it to find an answer.

By repeating names of Lalitha Sahasranama, you will create nodes in your memory. But these nodes lie disconnected and are not much useful all alone. You need supplement them with information of detailed descriptions. Then long chains of logical patterns are be formed. Such patterns help you in all your endeavors. When you read a name, you should ask what it is? What does it represent? Why should it be like that? Do we have such examples? etc Then you will acquire abundant wealth of knowledge that is logically connected and readily available for you to take critical decisions. Stuti means chanting. Stotram is one that give benefits with chanting. 

927-928 - స్తోత్ర ప్రియా, స్తుతి మతి

లలితా సహస్రనామ స్తోత్రం మనల్ని అమ్మకు చెరువుగా తీసుకెళ్తుంది. అందుకని ఆవిడని స్తోత్రప్రియా అన్నారు. అంతే కానీ అమ్మకి ఇష్టమైనవీ ఇష్టంకానివీ అని ఏమి ఉండదు. 

ఇక్కడ ఒక రహస్యం ఉంది. లలితా సహస్రనామ స్తోత్రం చేసేవారు అందరూ ఈ రహస్యం తప్పక తెలుసుకోవాలి. మనిషులకి అపారమైన మేధా శక్తి ఉంది. ఆ శక్తితో వారు నిత్యం మేధో మధనం (రంధ్రాన్వేషణ అని కూడా చెప్పవచ్చు) చేస్తుంటారు. ఈ మేధో మధనం జరిగే ప్రక్రియలోనే అసలు రహస్యం ఉంది. అది ఏమిటంటే, ముందు ఒక విషయం మెదడులోకి చేరుతుంది. ఆ విషయానికి  ఇంకొక విషయంతో లంకి పడుతుంది. ఈ రెండు కలిసి మూడవ విషయంతో లంకి పడతాయి. ఇలా విషయాలన్నీ పూసలున్న తాడులాగా ఒకదానికి ఇకటి లంకి పడి గొలుసు లాగ ఏర్పడతాయి. ఇలా ఏర్పడిన గొలుసులే తెలివితేటలు. ఏదైనా ప్రశ్న వచ్చినప్పుడు మనం ఈ గొలుసుయొక్క మొదటి కొసకు ప్రశ్నను తగిలించి, చేవారికొసకు సమాధానం తగిలించి, చివరగా ప్రశ్ననూ సమాధానాన్ని జత చేర్చి ఒక రంధ్రం ఏర్పరుస్తాము, అదే జ్ఞానం. 

ఉదాహరణ: ఒక వ్యక్తి కొత్త బట్టలు వేసుకుని బయటకు వెళ్ళాడు. తన మిత్రుడు అతన్ని చూసి నువ్వు ఇవాళ చిరంజీవిలా ఉన్నావు అని అన్నాడు. ఇప్పుడు ప్రశ్న 'కొత్త బట్టలు బావున్నాయా లెవా?'  దీనికి తన మేధస్సులో ఉన్న విషయాల ద్వారా జవాబు వెతకాలి. ఆ వ్యక్తి తెలుగువాడైతే, సినిమాలు చూసేవాడైతే చిరంజీవిగారి పట్ల చాలా విషయాలు అతని మేధస్సులో ఉంటాయి. ఆయన ఎలా ఉంటారు, ఆయన స్టైల్ ఎలా ఉంటుంది, ఆయన నాట్యం ఎలా ఉంటుంది. ఏయే సందర్భాలలో ఎవరెవరు చిరంజీవి గారిని ఎలా కొనియాడారు మొదలైన విషయాలన్నీ అతని మేధస్సులో ఉంటాయి. అతను వెంటనే ఇలాంటి దుస్తులు చిరంజీవిగారు ఎప్పుడు వేసుకున్నారో గుర్తు తెచ్చుకుంటాడు. ఆ దుస్తులలో ఆయన అప్పుడు ఎంత హుందాగా ఉన్నారో గుర్తు తెచ్చుకుంటాడు. ఈ విషయాలన్ని అతని మెదడులో ఒక గొలుసులా ఏర్పడి ఉంటాయి. అందుకే క్షణంలో వీటన్నిటినీ ఊహించగలుగుతాడు. ఆ గొలుసు మొదట్లో 'ఈ దుస్తులలో నేను ఎలా ఉన్నాను అనే ప్రశ్నను తగిలిస్తాడు.' గొలుసు చివరిలో అటువంటి దుస్తులలో ఉన్న చిరంజీవిగారి ఫోటో ఉంటుంది. ఇప్పుడు తన మిత్రుడు చెప్పిన దానిని ఆలంబనగా చేసి ఈ ప్రశ్నను ఆ గొలుసు చివరిలో ఉన్న ఫొటోతో తగిలిస్తాడు. అప్పుడు ఒక రంధ్రం ఏర్పడుతుంది. అంటే సమాధానం దొరికిందన్నమాట. వెంటనే అతని మోహంలో చిరునవ్వు వస్తుంది (సంతోషకరమైన సమాధానం కనుక). ఇదే మాట వెయ్యి మంది చెప్పారనుకోండి, అతని మెదడులో ఇలాంటి రంధ్రాలు వెయ్యి ఏర్పడతాయి. అప్పుడు మెదడు వీటన్నింటి మడిచి  'నేనే చిరంజీవి' అనే కొత్త  విషయంగా మార్చుకుంటుంది. ఇలా అనేక విషయాలు కలిసి రంధ్రాలవుతాయి, అనేక రంధ్రాలు ముడుచుకుని విషయాలవుతాయి. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. అదే మేధో మధనం/రంధ్రాన్వేషణ. అదే ఆ వ్యక్తి ఏ బెంగాలీయో, కొరియా వాడో అనుకోండి. చిరంజీవి గురించి అతని మేధస్సులో ఏమీ ఉండకపోవచ్చు. అప్పుడు అతనికి జవాబు దొరకదు. అప్పుడు అతను 'చిరంజీవా? ఆయన ఎవరు అని ప్రశ్నిస్తాడు' ఇలా అనేక ప్రశ్నల ద్వారా విషయాలు సేకరించి, వాటితో గొలుసులు ఏర్పరిచి, వాటితో రంధ్రాలు ఏర్పరుచుకుని అప్పుడు సమాధానం తెలుసుకుంటాడు. 

పదే పదే ఒకే మాటను వల్లే వేయడమే స్తుతి. దేన్నీ స్తుతిస్తే అత్యంత గొప్ప ఫలితం దక్కుతుందో అది స్తోత్రం. లలితా సహస్రనామాలను స్తుతిస్తే అవి విషయాలుగా మెదడులోకి చేరతాయి. అక్కడితో ఆగిపోకూడదు. వాటిపై రంధ్రాన్వేషణ చేయాలి. ఆలా జరగాలి అంటే ఒక్కొక్క నామము యొక్క పూర్తి వివరణ మెదడులో ఉండాలి. 'పంచకృత్య పారాయణ' అంటే ఏమిటి, 'చైతన్య కుసుమ' ప్రియ అంటే ఏమిటి, 'చిదగ్నికుండ సంభూత' అంటే ఏమిటి, ఇలా ఒక్కొక్క నామానికి ఒక ప్రశ్న వేసుకుని, నామాల వివరణ తెలుసుకుని వాటి విషయాలను మెదడులో  గొలుసులుగా ఏర్పరుచుకుని వాటితో రంధ్రాలు ఏర్పరుచుకోవాలి. అప్పుడు ఆ జ్ఞానం సాధనకు ఉపయోగపడుతుంది. అప్పడు స్తోత్రం యొక్క పూర్తి ఫలితం దక్కుతుంది. 

Popular