Search This Blog

892.Vaishnavi

 


విష్ణోరియం వైష్ణవీ విష్ణుమూర్తి యొక్క శక్తి వైష్ణవి.

దేవీ పురాణంలో శంఖ చక్రగదాన్ ధత్తే విష్ణుమాతా తథా రిహా విష్ణురూపా థవా దేవీ వైష్ణవీ తేన గీయతే శంఖము, చక్రము, గద ధరించినది, విష్ణువునకు తల్లి, శత్రువులను చంపునది, విష్ణురూపము గలది. ఈమె వైష్ణవీ అనబడుతున్నది.

ఆమె విష్ణువు యొక్క శక్తి. లక్ష్మీ స్వరూపురాలు. స్థితికారిణి, సర్వవ్యాపి, శంఖచక్రములు ధరించిన గరుడవాహనమైనది. కాబట్టి వైష్ణవీ అనబడుతోంది.

సప్తశతిలో శంఖ చక్ర గదా శార్గజ్ల గృహీత పరమాయుధే ప్రసీద వైష్ణవీరూపే నారాయణి ! నమోస్తు తే || వైష్ణవీ రూపం ధరించి శంఖము, చక్రము, గద, ధనుస్సు ఆయుధములు గలగిన ఓ నారాయణీ నీకు ప్రణామములు.

Vishnoriyam Vaishnavi
The Shakti of Vishnu is Vaishnavi

It is said like this in Devi Puraana
Shankha chakragadaan dhatte vishnumaataa tathaa rihaa
vishnuroopaa thavaa devee vaishnavee tena geeyate
She carries a conch, wheel, bludgeon. She is mother of Vishnu and Killer of enemies. She is in the form of Vishnu. She is Vaishnavi.

She is the shakti of Vishnu. She takes the form of Lakshmi. Administers the act of sustenance. She is spread everywhere. She carries conch and wheel and travels on Garuda. So, she is called Vaishnavi.

It is said like this in Sapthasathi
Shankha chakra gadhaa saargjna gruheetha paramaayudhe
praseedha vaishnaveeroope naaraayani! namostute te ||
She takes the form of Vaishnavi and carries conch, wheel, bow and a bludgeon. I salute to that Narayani.

890. Vishwagrasa


చరాచరజగత్తును మ్రింగివేసేది. అనగా చరములను, అచరములను సంహరించునది.

కారకములలో
యస్య బ్రహ్మ చ క్షత్రం చోభే భవతి ఓదనః
మృత్యు ర్యస్యోప సేచనం క వేద యత్ర సః ఆ పురుషునకు బ్రహ్మ క్షత్రియులు ఆహారము. మృత్యువు అతడికి నంచుకునే పదార్ధము. దీనిని ఎవరు తెలుసుకోగలుగుతారు ? చరాచరజగత్తునంతా ప్రళయకాలంలో గ్రహించునది. కాబట్టి పరమేశ్వరి విశ్వగ్రాసా అనబడుతున్నది. సృష్టిలో ఒక జీవిని ఇంకొక జీవి ఆహారంగా తీసుకుంటుంది. ఇది సాధారణన్యాయము. గడ్డి, ధాన్యాలు. వీటిని పశువులు, పక్షులు ఆహారంగా తీసుకుంటాయి. ఈ పశుపక్షులు మృగాలకు ఆహారం. మృగాలు మానవుడికి ఆహారం. ఈ రకంగా ఒక దానికి ఒకటి ఆహారము. అయితే ప్రళయకాలంలో సర్వజగత్తునూ ఆ మహాశక్తిలో లీనమైపోతుంది (మ్రింగివేయబడుతుంది). అందుకే విశ్వగ్రాసా అనబడుతోంది.

She who devours the whole universe

It is said like this in Kaaraka
Yasya brahma chakshatram chobhe bhavathi odanah
mrutyu ryasyopa sechanam ka veda yatra sah
The entire universe is food to the Original. Death is His side dish. Very few can grasp the real meaning of this. The whole universe is annihilated at the end. It is consumed by the Divine Mother. Hence she is called Vishwa Graasa. The biological chain indicates that one animal becomes food for the other. Herbivores live on grass. Carnivores live on Herbivores. Humans eat both. But at the end they also become food to the Ultimate. Because everything gets dissolved into that Maha Shakti. Hence she is called Vishwa Graasa.

889. Vishwabhramana karini

 


ఒకచోట మొదలయ్యి కొంత దూరం లేదా కొంత కాలం ప్రయాణించాక మళ్ళీ మొదలయిన స్థానానికే చేరుకోవడాన్ని భ్రమణం అంటారు. పరిశీలించి చూస్తే ఈ విశ్వంలో కదలికలన్నీ భ్రమణాలే. మణిద్వీపం చుట్టూ నక్షత్రాలు, సూర్యునిచుట్టూ భూమి, భూమి చుట్టూ చంద్రుడు, న్యుక్లియుస్ చుట్టూ ఎలెక్ట్రాన్లు, చావుపుట్టుకలు, కర్మ-ఫలితాలు, ఉఛ్వ్వాసా-నిశ్వాసలు, సృష్టి-స్థితి-లయ-తిరోధాన-అనుగ్రహాలు ఇలా పరబ్రహ్మము తప్ప మిగిలినవన్నీ భ్రమణంలోనే ఉన్నాయి. ఈ భ్రమణానికి శక్తి , కారణం అమ్మే. కాలికాపురాణంలో
విశ్వము అంటే విష్ణువు. అతడికి భ్రమణము కలుగచేయునది. ఒకసారి శ్రీమహావిష్ణువు గరుడునిమీద ఎక్కి ఆకాశమార్గంలో వెడుతూ కామరూప దేశంలో ఉన్న కామాఖ్యాదేవికి నమస్కరించలేదు. దానికి కోపించిన దేవి విష్ణువును సముద్రంలోకి త్రోసివేసింది. కొంతకాలం తరువాత లక్ష్మీదేవి విష్ణుమూర్తి కనపడక వెతుకుతూ కామరూపం వచ్చి కామాఖ్యాదేవిని ప్రసన్నం చేసుకుని విష్ణువును రక్షించుకున్నది. ఆ తరువాత విష్ణువు పరమేశ్వరిని పూజించి వైకుంఠం చేరాడు అని చెప్పబడింది. ఈ రకంగా విష్ణువు యొక్క భ్రమణానికి కారణమైనది కాబట్టి విశ్వభ్రమణకారిణి అనబడింది.

Bhramana means to move is cyclic motion. Almost everything in this universe (Vishwam) is a cyclical motion. Galaxies revolve around Manidweepam. Earth revolves around Sun. Moon revolves around Earth. Electrons revolve around nucleus. There are cycles of birth and death, breathe is a cycle, Karma and its fruits are a cycle, creation-sustenance-destruction is a cycle. Except Paramatma, rest all is a cycle. Divine Mother is the energy and reason of this cyclic motion.

It is said like this in Kaalika puraana
Vishwa means Lord Vishnu. One day, Lord Vishnu was travelling in the sky on Garuda. He ignored blessings of Goddess Kamaakhya while passing over the city of Kaama roopa. Goddess Kaamakhya punished Vishnu. Then he fell into the sea. Goddess Lakshmi worshipped Kaamakhya and got him out of the sea. Then Lord Vishnu prayed Goddess Kaamakhya and went back to Vaikuntha. Goddess Kaamakhya is none other than the Divine Mother herself. As she caused Lord Vishnu to move in cyclic motion like this, she is called Vishwabhramana karini.

888. Vipraroopa

విప్రుల రూపం గలది. అందుకే 'దేవతలయందు వేదవేత్తలైన బ్రాహ్మణులున్నారు.' అని వేదం చెబుతోంది.

ఆపస్తంబస్మృతిలో
అవమానాత్తపోవృద్ధిః సన్మానా తపసః క్షయః
అర్చితః పూజితో విప్రః దుగ్గా గౌ రివ సీదతి
ఆప్యాయతే యథాహస్సు తృణై రమృత సంభవైః
ఏవం జపైశ్చ హోమైశ్చ పున రాప్యాయతే ద్విజః


అవమానంతో తపో వృద్ధి కలుగుతుంది. సన్మానంతో తపస్సు క్షీణిస్తుంది. విప్రుడు పూజించబడినట్లైతే పాలు పితికిన ఆవులాగా కృశించిపోతాడు. మృదువైన గడ్డితిని గోవు బలిసినట్లుగా మంత్రజపంతోను, హోమంతోను బ్రాహ్మణుడు పుష్టిగా ఉంటాడు. అటువంటి విప్రుని రూపంలో ఉంటుంది లలితమ్మ. 

Divine mother is in the form of Vipra. That is why Brahmins are venerated in Hindu culture

It is said like this in Apasthambasmruthi
Avamaanaattapovriddhih sanmaanaa tapasahkshayah
architah poojito viprah duggaa gou riva seedathi
Aapyaayate yadhaahassu trunai ramruta sambhavaih
evam japaischa homaischa puna raapyaayate dwijah

Facilitations and salutations actually do not do good to a Vipra. It will diminish their Tapas( status of meditation). Their Tapas will increase upon insult. The Tapas of Vipras who enjoy respect weakens like a cow that is milked every day. By doing meditation and yagna, a Vipra becomes strong. Divine mother is in the form of such Vipra.

887. Viprapriya

వేద శాస్త్రాలు బాగా తెలిసిన బ్రాహ్మణులను విప్రులు అంటారు. అమ్మకు వారంటే ప్రీతి. 

బ్రహ్మవైవర్తపురాణంలో
జన్మనా బ్రాహ్మణోజ్జీయః సంస్కారై ర్ద్విజ ఉచ్యతే
విద్యయా యాతి విప్రత్వం త్రిభి శ్రోత్రియ ఉచ్యతే


జన్మచేత బ్రాహ్మణుడవుతున్నాడు. ఉపనయనాది సంస్కారములచే ద్విజుడు అనబడుతున్నాడు. విద్యచేత విప్రుడవుతున్నాడు. ఈ మూడు లక్షణాలు గలవాడు శ్రీత్రేయుడు అని చెప్పబడింది. అటువంటి విప్రులు అభీష్టముగా గలది. వేదపఠనంచేత బ్రాహ్మణుడికి విప్రత్వం వస్తుంది. లలితమ్మ  వేదస్వరూపిణి. వేదజనని కాబట్టి వేదపండితులయిన విప్రులందు అపేక్ష కలిగి ఉంటుంది.

Brahmins who learn vedas and become subject matter experts in vedic scriptures are called 'Vipra'. Divine Mother likes them.

It is said like this in Brahma vaivartha purana
Janmanaa braahmanojjeeyah samskaarair dwija uchyate
vidyayaa yaathi vipravtwam tribhi srotriya uchyate

By birth he becomes a Brahmin. After the sacred thread ceremony, he becomes a 'Dwija (One with two births)'. After learning vedas and assimilating them he is becoming 'Vipra'.One who has all these three ranks is called 'Shreetreya'. Mother Lalitha is the embodiment of all the Vedas. Hence she is called Vipra priya.

881. Yagnapriya



Divine Mother loves yagnas.
 Yagya is a vedic ritual aimed  at ablution of  the body and surroundings by reinforcing the natural equilibrium in various components of the body and ambient environment. Yagya is directed with selective medicinal preparation of herbs that is forfeited in the holy fire inflamed by specific woods along with the chant of distinct Vedic Hymes  (mantras).  Medicinal  smoke  significantly  removes  human  pathogenic  microbes.  The  vaporization  and sublimation of  ingredients  of havan  samagri in  an inverted  pyramid shaped  yagya-kunda deliver  vast amount of therapeutic and environmental benefits. The chemical transformation (into vapor or gaseous phase/ colloidal forms) of the herbal/ plant medicinal preparations in Hawan lead to release of  medicinal phytochemicals; which affect many endogenous chemicals including hormonal axis. These fumes help in purifying the air and have anti-epileptic, anti-pyretic, anti-fungal,  antibacterial effects  amongst the numerous  other benefits.  Regular chanting of  hyms helps in purifying the mind. Improvement has been noticed with respect to digestion, hypertension, mental agitation and sleep after chanting the Mantras. 
Abstract taken from the article published by Dr. Ravi Kanth Chaube in www.researchgate.net

Satvic nature is elevated by performing yagna. Cow ghee and cow dung cake react to release tonnes of oxygen and other gases which make the atmosphere pure. Earth due to heat attracts minerals from within and so that place surrounding the yagna becomes fertile. The ash which is remaining from the Hawan kund is serves as a very good fertilizer. The small quantities of Sulphur and nitrogen oxides get rid of harmful bacteria. Inhaling those gases cause lacrimation, which relieves the eyes of all impurities. It is good to cough on inhaling these gases as it clears the nasal and respiratory passages. Vata and kapha are balanced. 

Swami Dayananda saraswathi said this in Rigveda samhita
Yagna is not a merely sacrificial ritual. It embraces all achievements in social plane to amend conditions of our worldly living against poverty, miseries, sickness and disease. At a subsequent stage it assures a better future even beyond death. It is not a ritual that will lead to a specific goal but is done for the overall good. Hard, honest and sincere devotion coupled with selfless motive to any department of knowledge like science, technology, philosophy and spirituality will assure fruits of yagna.

అమ్మకు యజ్ఞములంటే ప్రీతి. 
బాహ్యాన్తరః శుచి కొరకు యజ్ఞాలు చేస్తారు. ఇది వేదప్రోక్తంగా వచ్చిన విజ్ఞానం. యజ్ఞము వలన శరీరంలోనూ, మనసులోనూ బయట ప్రకృతి లోనూ సంతులిత నెలకొల్ప బడుతుంది. యజ్ఞం చేసేటప్పుడు కొన్ని మూలికలను హవనంలో వేసి మంత్రాలు చదువుతారు.  ఆ హవనం నుండి వెల్లువైన ధూపం హానికర క్రిములను నిర్మూలిస్తుంది. మంత్రాలయొక్క ధ్వని ప్రకంపనలు మనస్సును శాంత పరుస్తాయి. జీర్ణ శక్తి బాగుపడుతుంది. ఆరాటం నిద్రలేమి తగ్గుతాయి. 
పై వివరణ శ్రీ రవి కాంత్ చౌబే గారు www.researchgate.net లో  ప్రచురించిన వ్యాసం నుండి తీసుకొన బడింది.

యజ్ఞమువలన సత్వగుణం బలపడుతుంది. ఆవు పేడతో చేసిన పిడకలు, ఆవు నెయ్యి వాడటం వలన టన్నులకొలది ఆక్సిజన్ ఉత్పన్నమవుతుంది. భూమి వేడెక్కినపుడు అది ఆ చుట్టు ప్రక్కలనుంచి మినరల్స్ ను యజ్ఞ వాటిక వైపు లాక్కుంటుంది. హవనంలో మిగిలిన భస్మం భూమిలో కలిపేస్తారు. అప్పుడు ఆ నేల  సస్యశ్యామలం అవుతుంది. కొంత చిన్న మోతాదులో సల్ఫర్ మరియు నైట్రోజన్ డై ఆక్సైడ్ ఉత్పన్నమవుతాయి. ఇవి గాలిలోని క్రిములను సంహరిస్తాయి. ఆ పొగకు కంట్లోంచి నీళ్లు వస్తాయి. అప్పుడు కళ్ళు శుభ్రపడతాయి. దానిని  పీల్చినప్పుడు వచ్చే దగ్గు కూడా మంచిదే. ఆ దగ్గు వలన శ్వాసకోశం నాసికా రంధ్రాలు శుభ్రమవుతాయి. కఫ, వాతములలో సంతులిత ఏర్పడుతుంది. 

యజ్ఞముగురించి ఋగ్వేద సంహితలో శ్రీ దయానంద సరస్వతి ఇలా అన్నారు 
యజ్ఞమంటే కేవలం హోమం మంత్రం త్యాగం కాదు. భూమిపై ఉన్న సమస్త జీవాలకు ఉపయోగపడేలా శారీరిక, మానసిక, సాంఘిక, భౌగోళిక పరిస్థితులను మెరుగుపరచడమే యజ్ఞం యొక్క లక్ష్యం. ఎదో ఒక నిర్దిష్ట కార్యము సాధించుకోవటానికి చేసే ప్రయత్నం యజ్ఞం కాదు. నిస్వార్ధ స్పూర్తితో, అకుంఠిత దీక్షతో వైజ్ఞానిక, సాంకేతిక, తాత్విక, ఆధ్యాత్మిక రంగాలలో దేనిపైనైనా చేసే కృషి యజ్ఞ ఫలితాన్నిస్తుంది. 

880. Samsaarapanka nirmagna samuddharanapandithaa


సంసారము అనే బురదలో మునిగినవారిని ఉద్ధరించుటలో అఖండురాలు. ఇక్కడ సంసారము అంటే పుట్టడం, చావడం మళ్ళీ పుట్టడం అని అర్ధం చేసుకోవాలి. 

కూర్మపురాణంలో
యే మనా గపి శర్వాణీం స్మరంతి శరణార్థినః |
దుస్తరాపారసంసారసాగరే న పతంతి తే ||


పరమేశ్వరిని శరణుజొచ్చినవారు సంసారసాగరంలో పడరు అని చెప్పబడింది. 

సౌందర్య లహరి 
అవిద్యానా మంతస్తిమిరమిహిరద్వీపనగరీ
జడానాం చైతన్యస్తబకమకరందస్రుతిఝరీ
దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ
నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి ||


అమ్మా ! నీ పాదరేణువు అజ్ఞానమనే అంధకారాన్ని పోగొట్టే సూర్యబింబము. మందబుద్ధులకు జ్ఞానము కలిగించే దీపము. దరిద్రులకు సకల సంపదలిచ్చే చింతామణి. సంసారసాగరంలో మునిగిపోయిన వారికి, సముద్రంలో మునిగిపోయిన భూమిని బైటికి తీసుకువచ్చిన వరాహస్వామి అవుతున్నది. సంసారసాగరంలో మునిగిపోయిన వారిని అమ్మ రక్షిస్తుంది

Here Samsaara represents the phenomenon of cycles of birth and death. It is like quicksand. One who is stuck in it will drown to the bottom. They cannot help themselves to come out of it. But for those who seek help from Divine Mother, help is readily available to lift them out of this samsaara.

It is said like this in Kurma puraana
Ye manaa gapi Sharvaaneem smaranthi Sharanaardhinah |
dhustharaapaarasamsaarasaagare na pathanthi the ||

Those who seek help from Divine Mother are being rescued from the never ending cycles of birth and death

It is said like this in Soundarya Lahari
Avidyaanaam anthahsthimiramihiradweepanagari
jadaanaam chaitanyasthabakamakarandha shruthijharee
Dharidraanaam chintaamanikaa janmajaladhou
nimagnaanaam damshtraa muraripu varaahasya bhavathi ||

O Mother! A mere sight of a dust particle on your lotus feet will shatter all the ignorance in human mind. It is the lamp of light that will show the path to wisdom. A panacea that removes all the sorrows. Just like how Lord Varaaha lifted up the drowning earth from waters, you lift those who seek you from the never ending cycles of birth and death.

874. Tristha

When you represent all the knowledge stored in your brain in the form of a graph with nodes and edges, they would look like this. These graphs are very large and are organized based on relevancy. That means if each node represents a friend, then all friends from a class are placed nearby. 

మనిషి మెదడులోని జ్ఞానం త్రిభుజాకారాలలో ఉంటుంది. ఒక్కొక్క త్రిభుజం ఒక్కో రంధ్రం. ఈ త్రిభుజాలలో ఉన్న విషయాలను బట్టి మనిషి తెలివితేటలు వెల్లడవుతాయి. ఉదాహరణకు ఒక చిన్నపిల్లవాడి మిత్రుల వివరం పైన చూపించిన విధంగా ఉంటుంది. దీని అర్థం దీక్షిత్, అన్విత, అజా, అందరూ నా మిత్రులెకానీ దీక్షిత్ కి అజా కి మధ్య మిత్రత్వం లేదు. 

Many nodes in these graphs can be plotted as triplets. The relation between each triplet can imply different things. For eg: There is no arrow between Deekshit and Aja. That means they are not friends. Though they both are my friends, they both are not friends with each other.
అదే విధంగా సనాతన ధర్మంలోని విజ్ఞానం అంతా త్రిభుజాకారంలో ఉన్న రంద్రాలవలె ఉంటుంది. ఇవన్నీ అమ్మ రూపాలే. త్రిపురములు, త్రిలోకములు, త్రిమూర్తులు, త్రిగుణములు మొదలైనవి. కొన్ని ఉదాహరణలు క్రింద చూడండి. 


Concepts of vedas are also in the form of triplets. Some of them are explained in the above examples. Trigunas, Tripuras, Trimurthis, Trilokas etc. All of them are triplets. They are all forms of Divine Mother.

872.Trayee

 


వేదాలు అనగా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము. వీటిలోని విషయాన్ని త్రయీవిద్య అంటారు. దీని సారాంశమే అమ్మ లలితమ్మ. 

అకారాదిస్సామవేదో ఋగ్వేదశ్చ తదాదికః |
యజుర్వేద ఇకారాది స్తేషాం సంయోగత శ్శుచిః ||


ఋక్, స్సామవేదాలు అకారంతో ప్రారంభంకాగా యజుర్వేదం ఇకారంతో ప్రారంభ మవుతుంది. ఈ మూడింటి స్వరూపమే లలితమ్మ. కాబట్టి త్రయీ అనబడుతుంది.

వేదాలలో చెప్పిన విషయాలకి లౌకికంగానూ, సాంకేతికంగానూ, ఆధ్యాత్మికంగానూ కూడా రహస్యార్ధముంటుంది. అందుకే వాటిని త్రయి అని అంటారు. ఉదాహరణకు రామాయణం తీసుకోండి. భౌతికంగా లోకంలో రాముడు అనే నరుడు ఉన్నాడు. ఆయన ధర్మాచరణ చేసి ధనుర్విద్య నేర్చుకుని రావణసంహారం చేసాడు. ఆధ్యాత్మికంగా చూస్తే మన శరీరంలోని ఆత్మే రాముడు. అహంకారమే వాలి. కామాది అరిషడ్వార్గాలు రావణుడు. సాధకుడు ఆత్మ సాక్షాత్తాకారం పొందటానికి చేసే ప్రయత్నమే వాలి మరియు రావణ సంహారం. సాంకేతికంగా చూస్తే రామాయణంలో ఎన్నో గొప్ప సాంకేతిక విషయాలను చెప్పడం జరిగింది. అసలు భూమి మీదకి నీరు ఎలా వచ్చింది? ఆ నీరు వచ్చినపుడు ఎం జరిగింది అనే విషయం గంగావతారణంలో చెప్పారు. దీనిగురించి క్షుణ్ణంగా వ్యోమకేశీ అనే నామంలో తెలుసుకుందాం. సూర్యమండలంలోని విషయాలు ఆదిత్య హృదయంలో చెప్పారు. వీటన్నిటి సారము లలితమ్మే. అందుకే త్రయి అన్నారు. 

Vedas i,e, Rig, Yajur and Sama vedas. The essence of all these vedas is called thrayee. That is Divine mother Lalitha.

Akaaraadhissamavedo rigvedascha tadhadhikah |
yajurveda ikaaraadhi stheshaam samyogatassuchih ||

Rig and Sama vedas start with 'Aa'. Yajur veda starts with 'Ee'. Divine mother is represented by 'Aim' which is nothing but the essence of these three. Hence, she is called thrayee.

Concepts explained in Vedas have relevance in all the three planes of existence i,e social, scientific and spiritual. Let's take Ramayanam for example. There is a human called Rama. He practiced Dharma. Learnt techniques of archery and killed Ravana in a bloody war. In spiritual plane, Rama represents Atma. Vali represents ego. Ravana represents the six vices. Overcoming ego and union with God is like war with Vali and Ravana. In scientific plane, concepts of how water came onto the earth are explained in Gangavataranam. We will learn more details of this in the name Vyomakeshi. Things about Suryamandala are explained in Aaditya hrudayam. Divine mother is the essence of all these. Hence, she is called Thrayee.

871. Bahirmukha sudurlabha

 



Those who are still attached to material possessions cannot attain moksha( liberation) or self-realization. They have to first do self learning and practice detachment  in order to be capable of doing antah puja. The wisdom acquired through learning of puranas and other scared books and continuous practice of detachment elevates your consciousness and will open the doors for antah puja described in previous name.

Once Indra thought of acquiring knowledge of Brahma. He approached sage DaDhya who is yogi to acquire that knowledge. Indra took asked DaDhya to promise that he would help him (whatever may be the request). After DaDhya promised, he expressed his intention of learning Brahma vidhya. After listening Indra's request, DaDhya kept silent for sometime. Sensing trouble Indra asked, "Sage DaDhya, what is the issue". DaDhya did not tell anything. Indra asked, "Are you going to teach me Brahma vidhya or not". DaDhya realized that he is stuck. As there is no other option but to teach Indra about Brahma, DaDhya asked him to come to the class next morning along with all other disciples. Indra came to the class next morning.

DaDhya said, "All that you see with this eyes is not real. This wealth, this power, your beautiful angels, your kingdom all this is a mere illusion". Indra stood up and retorted, "If you don't want to teach me, then you should tell that upfront. You think I am a fool? You can't insult me like this. Next time if you preach such things in my kingdom, I will behead you". Then he left that place and returned to his palace. Such will be the situation for those who practice seek Atma without practicing detachment. Saint Sankara said like this in the 95th Shloka of Soundarya lahari.

Puraarateranthah puramasi thaatha sthwaccharanayo
Ssaparyaamaryaadaa taralakaranaanaa masulabhaa
tathaa hyethe neethaasshatha mukhamukhaassiddhi matulaam
thava dwaaropaantasthithibhi ranimaadhyaabhiramaraah

O Mother! Those who are attached to material world will not get the opportunity to service our feet. Be it Indra or any other great emperor or a demi god. 

871. బహిర్ముఖసుదుర్లభా


బాహ్యవిషయాలయందు ఆసక్తిగల వారికి లభించనిది. దుర్లభమైనది. తనలో ఉన్న ఆత్మయే పరమేశ్వరుడు అని తెలుసుకోలేనివారికి లభ్యము కానిది. ఇంద్రియాల ద్వారా ఆత్మను దర్శించాలనుకునేవారికి దుర్లభమైనది. విషయ లంపటాలలో చిక్కుకుని ఉన్నవారు స్వాధ్యాయం చేస్తూ ముందు కొంత జ్ఞానం సంపాదించాలి. తరువాత మెల్లగా దృష్టిని విషయ వ్యాపారాలనుంచి ఆత్మ వైపు మళ్లించాలి. అప్పుడు వారు అంతఃపూజ చేయ గలుగుతారు. 

పూర్వకాలంలో ఒకసారి ఇంద్రుడికి బ్రహ్మతత్త్వాన్ని గురించి తెలుసుకోవాలనిపించింది. ఆ కాలంలో దధ్యుడు అనే మహర్షి చాలా శ్రేష్ఠుడు. బ్రహ్మజ్ఞాని. అందుకని అతని దగ్గరకు వెళ్ళి "స్వామీ ! మీవల్ల నాకు ఒక సహాయం కావాలి” అన్నాడు ఇంద్రుడు. "చేస్తాను” అనే మాటను మహర్షి దగ్గర తీసుకున్న తరువాత ఇలా అన్నాడు, “నాకు పరబ్రహ్మ తత్త్వాన్ని గురించి తెలియజెయ్యండి” అని. ఆ మాటలు విన్న దధ్యుడు కొంచెంసేపు మాట్లాడలేదు. అది చూచి, మహర్షి ఏదో సంశయిస్తున్నాడని గ్రహించి “ఏమిటి మహర్షి ఆలోచిస్తున్నావు. నాకు బ్రహ్మవిద్య చెబుతావా లేదా?" అన్నాడు ఇంద్రుడు. ఆలోచించాడు మహర్షి. చెబితే అపాత్రదానం చెప్పకపోతే అసత్యపాపం.  ఏం చెయ్యాలో పాలుపోలేదు మహర్షికి. మళ్ళీ ఇంద్రుడే "ఏం మహర్షీ ! మాటిచ్చావు నిలబెట్టుకుంటావా లేదా?' అన్నాడు. చేసేందేంలేక  ఇంద్రుణ్ణి మర్నాడు ఉదయం మిగిలిన శిష్యులతో కలిసి రమ్మన్నాడు దధ్యుడు. మర్నాడు ఉదయం కౌపీనం ధరించి దర్భలు చేత్తో పట్టుకుని వచ్చాడు ఇంద్రుడు. అందరితోపాటే కూర్చున్నాడు. చెప్పటం మొదలు పెట్టాడు మహర్షి.

అంతా మిధ్య, కంటికి కనిపించేదేదీ నిజం కాదు ఈ రాజ్యాలు, సింహాసనము, అప్సరసలు, సుఖాలు ఏవీ నిజం కాదు అన్నాడు మహర్షి. ఆ మాటలు విన్న ఇంద్రుడు లేచి మహర్షీ నువ్వు అబద్దం చెబుతున్నావు. ఏది అసత్యం. నా రాజ్యామా నా సింహాసనమా, అప్సరసలా ? కేవలం నన్ను ఎగతాళి చెయ్యటానికే ఈ మాటలు చెబుతున్నావు. ఇలాంటి మాటలు ఇంకొకసారి చెప్పావంటే నీ తల నరికి పారేస్తాను జాగ్రత్త” అని హెచ్చరిస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. అతని దృష్టిలో ఇంకా రాజ్యము. అప్సరసలూ అంతా నిజమే. కాబట్టి అటువంటి వాడికి బ్రహ్మవిద్యను చెప్పరాదు. వారికి పరబ్రహ్మ సాక్షాత్కారం కాదు. అందుకే ఆ పరమేశ్వరి బహిర్ముఖ సుదుర్లభా అనబడింది. శంకరభగవత్పాదులవారు తమ సౌందర్య లహరిలోని 95వ శ్లోకంలో

పురారాతేరన్తః పురమసి తాత స్త్వచ్చరణయో
స్సపర్యామర్యాదా తరళకరణానా మసులభా
తథా హ్యేతే నీతాశ్శత మఖముఖాస్సిద్ధి మతులాం
తవ ద్వారోపాన్తస్ధితిభి రణిమాద్యాభిరమరాః.ll

తల్లీ ! నీ పాదపద్మములను పూజించు భాగ్యము చపలచిత్తులైన వారికి లభించదు. ఇంద్రాదిదేవతలకు కూడా నిను సేవించే భాగ్యము లభించక నీ ద్వారము చెంతకావలి ఉన్నారు. స్థిరచిత్తులకే కాని చంచల చిత్తులకు నిన్ను సేవించే భాగ్యము లభించదు.

870. Antarmukha samaaraadhya

 


Puja or worship is of two types. 1. Baahya puja - Worship externally. 2. Antah puja - Worship internally.

Internal worship is explained in Bhavanopanishath. All perceivable things have tendency to distract your focus. So you should detach yourself from those. Use those that are present inside your body for worship.

Salilamithi saahitya karanam satvam
The main item used in a puja is water. There are three gunas in the body. They are 1. Satva, 2. Rajas and 3. Tamo. You should increase the Satva guna and reduce the other two. Satva guna represents water.

kartavyam akartavyam oudaseenyamithi viveka bhaavanaayuktha upchaarah
Upachaaras (Things to do) - Brahma is the only truth. Rest all is illusion. In baahya puja, we do various things like Raajopachaaras, Dehopachaaras, Mantropachaaras. But they don't exist in Antah puja. Antah puja is about using your wisdom to identify what is real versus what is an illusion. You have to detach your mind from the unreal and make it focus on the real (Brahma). You should not become indifferent or inactive. You should follow all dharmic activities in your life. But detach from the fruits of it.

Asthi naasthi karthavyataa anupachaarah
Anupachaaras (Things not to do) - "I don't see Brahma. I can't visualize God. So it is a fiction." Thinking like this is wrong. You should not do this in Antah puja. Brahma is everywhere. If you are not able to see it that means your consciousness is not at the level to see it.

Baahyaantahkaranaanaam roopa grahana yogyataasthee tyaavaahanam
Aavaahana: There are two types of senses in the body. 1. Internal, 2. External. Atma shines/glows through them. You have do aavaahana(invitation) of the devata form of these senses.

Tasya baahyaantahkaranaanaamekaroopa vishaya grahanamaananam
Aasanam: Aasanam means God's seat. The body has various entities like the senses, limbs, mind, intellect, ego and chit. Thinking that all these are sentient and leaving them behind is with an inclination towards Brahma is Aasanam.

Raktha shukla padaikeekaranam paadyam
Paadyamu means the water that is used to wash God's feet. We learnt that the body has prakaashaamsha and Vimarshaamsha. Thinking that both of them came from Brahma and hence they are no different is paadyam in antahpuja.
Explanation
Mother is in the Dwaadashaantha of the body. Shukla bindu is formed when Brahma entered into Atma shakti. Then Vimarsha Shakti entered into Shukla bindu and created raktha bindu. The union of Shukla bindu and Raktha bindu is called Mishrama bindu.

Fire is Shukla bindu
Moon is Raktha bindu
Sun is Mishrama bindu

From Mishrama bindu came Naadam(Om). From Naadam came all the kalas. If you imagine Kaameswari as mishrama bindu, then her right leg is the prakaashaamsha (it is white in color), her left leg is vimarshaamsha (it is in blood red color). Meditating upon these two feet thinking there is no difference between prakaasha and vimarshaamsha is paadyam in Antah puja

Ujjwavala dhaamodharaanusandhaanaamarghyam
Arghyam means to offer water to God. Before the onset of puja, we offer water to God. He washes hands and drinks some water. That is Arghyam. In Antah puja, realizing that Aatma is sridevi and align everything to Brahma is Arghyam.

Swaccham swayamsiddham ityaachamaneeyam
Achamanam means taking water while chanting mantra. It is done for internal purificaion. Atma is the purest of all forms. Being aware that this purity is self attained is equal to Aachamanam in Antah puja.

Chicchandramayee sarvaangapravanam snaanam
Snaanam(bath) - In Hindu rituals, people offer bath of panchamrutas to Gods. But in Antah puja, the ambrosia dripping down from Sahasrara is the bath. When a you practice pranayaama, it awakens the kundalini in Moolaadhaara. It then rises up through the 6 chakras and reaches the Sahasrara in the top. There is a 1000 petaled lotus in Sahasrara. Kundalini bites the kernel of this lotus. Then the ambrosia(amruth) drips down the body and drenches all the 72000 nadis of the nadi mandala. This is Snaanam in Antah puja

Chidagni swaroopa paramaananda shaktispuranam vastram
Vastram means a cloth to cover the body. Devotees offer vastram to the deity in Hindu rituals. Thinking that all the glow inside the body is a form of Divine mother is vastram in Antah puja

Pratyekgam saptavimshatitha bhinnatvenacchagnaana kriyaatmaka brahma grandhi madrasatantu brahma naadee brahma sutram
Yagnopaveetam - Sacred thread worn by dwijas. Shushumna naadi is the most important of all the naadis in the body. In Antah puja, this naadhi should be thought as yagnopaveetam. 

Satyavyatiriktavastu sangarahita smaranam vibhooshanam
Ornaments - Worshippers offer decorative ornaments to the deity in Hindu rituals. Detachment is the ornament you offer to God in antah puja. Detachment from the worldly possessions. Detachment from the bonds of the body. These are the ornaments you should offer to Divine Mother in Antah puja

Satsanga paripoothaa manmaranamgandhah
Sandal power - Worshippers offer powder of sandal wood to the deity in Hindu rituals. It gives nice fragrance and also makes the ambience sacred. In antah puja, the feeling that I am the divine Atma is like offering sandal to Divine Mother.

Samasta vishayaanaam mananam chairyenaanusandhaanam kusumam, ahimsa prathamam pushpam, pushpamindriya nigraham, dayakshamagnaana pushpam tatah param
Flowers - Worshippers offer various flowers to the deity in Hindu rituals. In antah puja, focusing the mind on atma and refraining from sensory pleasures (that are momentary) is like offering flowers to Divine Mother. Ahimsa is the first flower. Control over the senses is the second flower. Having mercy, forgiveness and consciousness are the remaining flowers.

Teshaameva sarvadaasweekaranam dhoopah
Incense - Worshippers offer incense sticks to deity in Hindu rituals. Not succumbing to sensory pleasures is like offering dhoopa to Divine Mother

Pavanaavacchinnordhya jwalana vacchidulkaashadehoo deepah
Lamp - The entire sky is glowing with the brilliance of Brahma. Your body is also a beam of light coming from that brilliance. Thinking that this body is same as the brilliance of Brahma that filled the sky is like offerring deepam to Divine Mother

Samasta yaataayaata varnanam naivedyam
Naivedyam means to offer something to eat. In Hindu rituals, worshippers offering tasty foods to the deity. Triumphing over senses is like offering naivedyam to Divine Mother

Avasthaa trayaikeekaranam taamboolam
Taamboolam (Pan) - In Hindu rituals, worshippers offer pan to the deity after offering food. This pan has beetle leaf and beetle nut and lime. These three represent the three states in which we live. Jaagruth, Swapna and Shushupti. Dissolving them into the ultimate state of Tureeya(trance) is like offering pan to Divine Mother in Antah puja

Moolaadhaaraadhi brahma bila paryantam, brahmarandhraadhimoolaadhaara paryantam, gataagata roopena praadakshinyam
Pradakshinam (revolution) - In Hindu rituals, worshippers move around the deity in clockwise direction. This is called pradakshinam. The praanavayu moves around from Moolaadhaara to Sahasraara and Sahasraara to Moolaadhaara passing through the Shushumna naadi. This movement is like doing pradakshina to Divine mother who is in the form of Atma. This is what is called ajapaaroopa hamsa
Paramaatma represented by 'Ha' gets united with Nature represented by 'Sa' to form the subtle Brahma(Shabala brahma). This Shabala brahma enters into a body that has 9 holes and gets attached to senses and mind. It gets trapped in the body and revolves around not knowing how to get out of it. For that hamsa,

Agni and chandra mandala are wings (ida and pingala naadis)
Omkara is the head
Glabella is face
Ha and Sa (inhalation and exhalation) are legs

This means when you meditate, you control your breathe. That gives strength to shabala brahma's legs to start the journey.  Chanting omkara with focus on glabella inverts the movement of vayu through the ida and pingala naadis. Then it flies away(escapes from the body it is trapped in).

'Ha' is rudra beeja and 'Sa' is Shakti beeja. Like ghee in milk, this shabala brahma is present in all beings.

Sahasraara is a 1000 petalled lotus It has 8 large petals pointing to the eight sides. Each of these petals have 125 smaller petals. Like this there are a total of 8 X 125 = 1000 petals. Below are further details of what each of these 8 petals represent
Petal pointing to east - Good intentions
Petal pointing to south east - sleep, thirst, lazyness
Petal pointing to south - cruelity
Petal pointing to south west - suffering caused by heat, inflamation etc
Petal pointing to west - Joy
Petal pointing to north west - walking, moving etc
Petal pointing to north - copulation
Petal pointing to north east - donation, generosity
Pollen of the lotus - awakened state
Kernal of the lotus - dream state
part beneath the kernel - sleep state
Deep inside the lotus - Liberation

The moment Atma leaves sahasraara, it unites with paramaatma

Tureeyaavasthaa namaskaarah
Salutations: Reaching tureeyaavastha is like saluting Divine mother

Deha shoonya pramaatrutaa nimajjanam baliharanam
Sacrifice(bali): Shunning or completely detaching from the physical body and realizing that your true form is pure consciousness is the real sacrifice 

Satyamasthi kartavyammakarthavyam oudaaseenya vityaatma vilaapangm homah
Homa: Incenerating your ego, ignorance and the feeling of 'I' in the fire of Brahma. Realizing that there is only one thing and there is no second one is like offering homa

Swayam tatpaadukaa nimajjanam paripoorna dhyaanam
Dhyaanam (Meditation) - Dissolving yourself into the brilliant light emerging from Paramaatma's feet and feeling that everything is Him and He is the only real thing is dhyanam in antah puja.

Evam muhoortha trayam Bhaavanayaa yukto bhavathi, tasya devataatmaikyasiddih
Self-Realization - Those who meditate like this for span of 3 muhoorthas will realize Atma. 1 muhoortha = 48 minutes. 3 muhoorthas = 1 hour 24 minutes.

Chintitha kaaryaanyayatnena sidhyanthi sa eva sivayogeethi kathyatha ityupanishath
Result - Those who perform antahpuja like this will fulfill all the desires. They are called Shiva yogis

870. అంతర్ముఖ సమారాధ్యా

 


పూజ రెండు విధాలు 1. బాహ్యపూజ 2. అంతఃపూజ
బాహ్యపూజ అంటే షోడశ ఉపచారాలు, చతుషష్టి ఉపచారాలతో పరమేశ్వరిని పూజించటం.
అంతఃపూజ అంటే మన శరీరంలోనే దేవతని అర్చించటం. 

అంతఃపూజ భావనోపనిషత్తులో వివరించబడింది. బాహ్యమైన వస్తువులన్నీ విషయ వాంఛలకు ప్రతీకలు. కాబట్టి వాటిని వదలి పెట్టెయ్యాలి. శరీరంలో ఉండే వస్తువులచేతనే పూజ జరగాలి. 

“సలిలమితి సౌహిత్యకరణం సత్త్వమ్”
పూజకు ముఖ్యమైనది జలము. సాధకుని శరీరంలో సత్వరజస్తమో గుణాలున్నాయి. వీటిలో మొదటి దానిని పెంపొందించి, మిగిలిన రెండింటినీ తగ్గించాలి. సత్వగుణమే జలము.

“కర్తవ్య మకర్తవ్య మౌదాసీన్యమితి వివేక భావనాయుక్త ఉపచారః”
ఉపచారాలు : బాహ్యపూజలో దేవికి రాజోపచారాలు, దేహోపచారాలు, మంత్రోపచారాలు అని వివిధరకాలైన ఉపచారాలున్నాయి. అయితే అంతఃపూజలో ఉపచారము అంటే నిత్యము కాని వాటిని వదలివేయటము. బ్రహ్మపదార్ధమే సత్యము అని తలచి మిగిలినవి వదలివేయాలి. ఉదాసీనభావము తూష్ణీంభావంగా రూపొందకూడదు. అంటే జ్ఞానముతో ఇది అసత్తు అని తెలుసుకుంటూ విషయాలను వదిలిపెట్టాలి. ఇదే అంతఃపూజలో ప్రధానమైన ఉపచారము.

“అస్తి నాస్తితి కర్తవ్యతా అనుపచారః”
అనుపచారాలు : బ్రహ్మము ఒక్కటే సత్యము, నిత్యము. అది కనిపించనంత మాత్రము చేత లేదు. అనుకోరాదు. సర్వజీవరాశులయందు పరబ్రహ్మమున్నది. అంతేకాని బ్రహ్మము లేదనుకోవటము అపచారము తెలియనితనము. అపరాధము. ఇదే అనుపచారము చేయకూడనిది. 

“బాహ్యాంతఃకరణానాం రూపగ్రహణ యోగ్యతాస్తీ త్యావాహనమ్”
ఆవాహన : దేహంలో బాహ్యేంద్రియాలు, అంతరింద్రియాలు ఉన్నాయి. ఆత్మ అనేది ఈ ఇంద్రియాల ద్వారానే ప్రకాశిస్తోంది. కాబట్టి వాటి యొక్క దేవతారూపాన్ని ఆవాహన చెయ్యటమే దేవిని ఆవాహన చెయ్యటము.

“తస్యబాహ్యాంతఃకరణానామేకరూప విషయ గ్రహణమాననమ్”
ఆసనము : శరీరంలో ఉన్న జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనే పద్నాలుగు విభిన్నమైన ధర్మాలు ఉన్నాయి. ఆ ధర్మాలను అరికట్టి సర్వము బ్రహ్మపదార్ధము అని భావించటమే ఆసన సమర్పణ.

“రక్త శుక్ల పదైకీకరణం పాద్యమ్"
పాద్యము : అంటే కాళ్ళు కడుక్కునే నీరు. 
శరీరంలో ప్రకాశాంశ మరియు విమర్శాంశ ఉంటాయి. ఈ రెండూ బ్రహ్మమునుండే వచ్చాయి కనుక వాటికి భేదం లేదు అని భావించడమే పాద్యము. 
వివరణ
అమ్మ సాధకుడి శరీరంలో ద్వాదశాంతంలో ఉన్నది. బ్రహ్మము (ప్రకాశశక్తి) ఆత్మశక్తిలో ప్రవేశించి శుక్లబిందువయింది. విమర్శశక్తి శుక్లబిందువులో ప్రవేశించి రక్తబిందువయింది. ఈ రెండింటి కలయిక వలన మిశ్రమ బిందువు ఏర్పడింది. 

రక్తబిందువు - చంద్రుడు
శుక్లబిందువు - అగ్ని
మిశ్రమబిందువు - సూర్యుడు

మిశ్రమ బిందువు నుంచి నాదము, దాని నుంచి కళలు ఆవిర్భవించాయి. ఇప్పుడు మిశ్రమ బిందుస్వరూపమైన కామేశ్వరీద్వంద్వము యొక్క కుడికాలు - శుక్లవర్ణమైన ప్రకాశాంశము
ఎడమకాలు - రక్తవర్ణమైన విమర్శాంశము. ఈ రెండు పాదాలనూ ధ్యానిస్తూ, వాటికి భేదము లేదు అనుకోవటమే పాద్యము

“ఉజ్జ్వల దామోదానుసంధానమర్ఘ్యమ్”
ఆర్ఘ్యము అంటే చేతులు కడుక్కునే నీరు. పూజకు ఉపక్రమించే ముందు దేవుడికి నీరు సమర్పిస్తారు. వాటితో ఆయన చేతులు కడుక్కుని తరువాత తాగుతారు. అంటే శ్రమ తీరటానికి ఇచ్చే అల్పాహారం అంటే త్రాగేందుకు ఇచ్చే నీరు. అంతఃపూజలో ఆత్మయే శ్రీదేవి అని గ్రహించి బ్రహ్మానందానుసంధానము చెయ్యటమే ఆర్ఘ్యప్రదానము

“స్వచ్ఛం స్వతస్సిద్ధ మిత్యాచమనీయమ్”
ఆచమనము : ఆచమనము అంటే మంత్రపూర్వకంగా నోటిలోకి తీసుకునే నీరు. అంతః శుద్ధి కోసం ఆచమనం చేస్తారు. ఆత్మ స్వరూపమైన అమ్మ స్వచ్ఛమైనది. ఆ స్వచ్ఛత స్వయంసిద్ధమైనది అని గ్రహించుట అంతఃపుజలో ఆచమనము

“చిచ్ఛంద్రమయీ సర్వాంగప్రవణంస్నానమ్”
స్నానము : బాహ్యపూజలో దేవతకు పంచామృత స్నానము చేయిస్తారు. కాని అంతః పూజలో అది లేదు. కుండలినీశక్తి ఆధారచక్రంలో నిద్రిస్తూ ఉంటుంది. సాధకుడు ప్రాణాయామంచేసి కుండలినీ శక్తిని గనక నిద్రలేపినట్లైతే, అది షట్చక్రాలగుండా ప్రయాణించి గ్రంథిత్రయాన్ని భేదించి సహస్రారంచేరి తననోటితో సహస్రదళ పద్మాన్ని కరిచి పట్టుకుంటుంది. అప్పుడు సహస్రారము అనే చంద్రమండలం నుండి అమృతధారలు స్రవించి శరీరంలోని డెభై రెండువేల నాడీమండలాన్నీ తడుపుతాయి. ఈ రకంగా అమృతవర్షము కురిపించటమే ఆత్మదేవత (పరదేవత)కు స్నానము. ఈ అమృతవర్షము వలన శరీరము సమశీతోష్ణమవుతుంది.

“చిదగ్ని స్వరూప పరమానందశక్తిస్ఫురణం వస్త్రం”
వస్త్రము అంటే శరీరాచ్ఛాదనకు ఉపయోగించేది. సాధకుని శరీరంలోని కాంతి అంతా ఆ పరాశక్తి యొక్క తేజస్సే. ఈ విషయం తెలిసి బ్రహ్మానందము పొందుటమే వస్త్ర ప్రదానము

“ప్రత్యేకగ్ం సప్తవింశతిథా భిన్నత్వేనేచ్ఛాజ్ఞాన క్రియాత్మక బ్రహ్మ గ్రంథి మద్రసతంతు బ్రహ్మనాడీ బ్రహ్మసూత్రమ్”
యజ్ఞోపవీతము : దీన్నే బ్రహ్మసూత్రము అంటారు.
జగత్తు అంతా బ్రహ్మమయమని సూత్రము కాబట్టి ఇది బ్రహ్మసూత్రము. దేహంలో ఉండేనాడులలో సుషుమ్నానాడి ముఖ్యమైనది దీన్నే బ్రహ్మనాడి అంటారు. అంతఃపూజలో ఈ సుషుమ్నానాడినే
బ్రహ్మసూత్రము అని భావించాలి. గాయత్రీ మంత్రానికి ప్రతీక యజ్ఞోపవీతము. తొంభై ఆరు బెత్తలు ప్రమాణంకల సూత్రము (దారము) తయారుచేసి దాన్ని మూడుచుట్లు చుట్టాలి. ఇప్పుడు రెండు చివరలుకలిపి ముడివెయ్యాలి. ఇందులోని సూత్రములో మూడు పోగులుంటాయి. అంటే మొత్తం ఇరవై ఏడు పోగులు ఉంటాయి.
తొంభై ఆరు బెత్తలు ప్రమాణము తత్త్వములు. మూడు ఆవృతులు - త్రిగుణములు మూడు ముడులు - మూడుగ్రంథులు మూడు గ్రంథులు - బ్రహ్మముడి ఇరవైఏడు పోగులు - ఇరవై ఏడు భేదములు కల జగత్తు

బ్రాహ్మణులు యజ్ఞోపవీతాన్ని ధరించి కర్మలుచేస్తారు. యజ్ఞోపవీతాన్ని తీసివేయట మంటే సన్యాసం స్వీకరించటము. అట్టి సన్యాసి బ్రహ్మకాండను చేసేవాడు. సర్వకర్మ విముక్తుడు జీవన్ముక్తుడు. సుషుమ్నానాడిలో సూక్ష్మనాడులు కలిసే చోటును గ్రంథి అంటారు. అది ఇరవై ఏడు సూక్ష్మనాడుల సమూహము. అందుకనే సుషుమ్నానాడి యజోపవీతము కంటె సత్యమైనది. సహజమైనది. ఇదే కంఠసూత్రము.

“స్వవ్యతిరిక్తవస్తు సంగరహిత స్మరణం విభూషణమ్” ఆభరణాలు : దేవతకు కంఠసూత్రంతో పాటుగా వివిధ ఆభరణాలు సమర్పించాలి. సాధకుడు తానుకూడా పరబ్రహ్మస్వరూపమే అని,మాయా మోహంచేత తాను మనిషిగా ఉన్నానని గ్రహించి మాయాది వస్తువులతో తనకు సంబంధము లేదు అని వాటిని పరిత్యజించటమే దేవికి ఆభరణాలు అర్పించటము. “సత్సంగపరిపూతా మన్మరణంగంధః" గంధము : దేహానికి గంధము రాసుకోవటంచేత సువాసన రావటమే కాకుండా పవిత్రత కూడా వస్తుంది. సాధకుడి సహస్రారంలో ఆ పరాశక్తి ఉన్నది, దాని కాంతిచేతనే అతని శరీరము తేజస్సుతో ప్రకాశిస్తుందని ముందే చెప్పటం జరిగింది. ఈ రకంగా జరగటంచేత సాధకుడు తాను ఎప్పుడూ పవిత్రుడనే అనే భావం కలిగి ఉంటాడు. ఇదే దేవికి శ్రీచందనం సమర్పణ. “సమస్త విషయాణాం మననం ఛైర్యేణానుసంధానం కుసుమమ్ అహింసా ప్రథమం పుష్పం, పుష్ప మింద్రియ నిగ్రహః, దయాక్షమాజ్ఞానపుష్పం పంచపుష్పం తతఃపరం” పూజ: భగవంతుణ్ణి భక్తుడు నానావిధ పుష్పాలతో పూజిస్తాడు. ఇంద్రియవాంఛలకు లోనుగాకుండా, మనసును పరబ్రహ్మమందు లయం చేసి, సర్వము బ్రహ్మమయమని తెలుసుకోవటమే పుష్పపూజ. అహింస, ఇంద్రియనిగ్రహము, దయ, క్షమ, జ్ఞానము అనేవి పంచపుష్పాలు. సాధకుడు అరిషడ్వర్గాలు జయించి, అహంకారమనే పుష్పంతో దేవిని పూజించాలి. అంటే ఈ స్థితిలో నేను, అనే అహంకారాన్ని, నాది అనే భ్రాంతిని వదలివెయ్యాలి. “తేషా మేవ సర్వదాస్వీకరణం ధూపః” ధూపం : సాధకుడు ఇంద్రియచాపల్యానికి లోనుగాకుండా, ఇంద్రియాలను తన స్వాధీనంలో ఉంచుకోవటమే ధూపము. “పవనావచ్చిన్నోర్ధ్య జ్వలన వచ్చిదుల్కాకాశదేహో దీపః” దీపం : బ్రహ్మతేజస్సు వాయువుతో కలసి జ్వాలగా ప్రకాశిస్తుంది. అది విశ్వమంతా వ్యాపించి ఉంది. సాధకుడి శరీరము పరబ్రహ్మము యొక్క కాంతి పుంజములతో ప్రకాశిస్తోంది. ఇప్పుడు సాధకుడు ఆకాశాన్నే తన శరీరంగా భావించి, తన శరీరంలో ఉన్న ఆ పరాశక్తిని చిత్కలను దీపముగా భావించటమే దేవికి దీపసమర్పణ. “సమస్తయాతాయాత వర్ణనం నైవేద్యమ్” నైవేద్యము : పూజానంతరము నైవేద్యము చెయ్యాలి. ఇంద్రియ చాంచల్యము లేకుండా అంటే ఇంద్రియాలను జయించి బ్రహ్మాకార వృత్తితో ఉండటమే నైవేద్యము. ఇది బ్రహ్మానందానుభవము. “అవస్థాత్రయైకీకరణం తాంబూలమ్” ” తాంబూలము : ఆకు వక్క సున్నము కలిస్తే తాంబూలము అవుతుంది. అవే జాగ్ర స్వప్న సుషుప్తి అనే మూడు అవస్థలు. ఆ మూడు అవస్థలను తురీయావస్థలో విలీనం చెయ్యటమే తాంబూల సమర్పణ.
"మూలాధారాది బ్రహ్మబిల పర్యంతం, బ్రహ్మరంధ్రాదిమూలాధార పర్యంతం గతాగత రూపేణ ప్రాదక్షిణ్యమ్” ప్రదక్షిణము : శరీరంలో ప్రాణవాయువు ఆధారచక్రం నుండి సహస్రారము వరకు, సహస్రారం నుంచి ఆధారచక్రం వరకుసుషుమ్నా మార్గంగుండా తిరుగుతూ ఉంటుంది. ఈ రకంగా ప్రాణవాయువు సంచారము చెయ్యటమే ఆత్మరూపంలో ఉన్న దేవతకు ప్రదక్షణము. దీనికే అజపారూప హంస అని పేరు. హకారసంజ్ఞ గల పరమాత్మ సకార సంజ్ఞగల ప్రకృతితో కలసి హంసరూపమైన శబల బ్రహ్మము అవుతాడు. ఈ శబలబ్రహ్మము తొమ్మిది ద్వారాలు గల మానవశరీరము అనే పట్టణంలో ప్రవేశించి ఇంద్రియములు, ప్రాణములు, మనస్సుతో కూడిన వాడై పంజరంలో బంధించబడిన పక్షిలాగా బయటకు వచ్చే ఉపాయం తెలియక ప్రాపంచిక బంధనాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. అటువంటి హంస అనబడే జీవుడికి, అగ్ని, చంద్రమండలాలు - రెక్కలు ఓంకారము - శిరస్సు జ్ఞాననేత్రము - ముఖము హకారసకారములు - పాదాలు

మీరు ధ్యానము చేసేటప్పుడు శ్వాసను నియమిస్తారు. తద్వారా శబళ బ్రహ్మకు శక్తి వచ్చి నడక మొదలు పెడతాడు. భృకుటిపై దృష్టి సారించి ఓంకార జపం చేసినప్పుడు వాయువు కదలిక మారుతుంది. అప్పుడు అతనికి ఎగరడానికి రెక్కలు వస్తాయి. అప్పుడు తానూ చెక్కుకుపియిన శరీరం నుంచి బయటకు ఎగిరిపోతాడు. (హకారము రుద్రబీజము సకారము శక్తి బీజము) ఈ రకంగా ఉన్న హంస అనే జీవుడు పాలలో ఉన్న నెయ్యిలాగా సమస్త ప్రాణికోటినీ ఆశ్రయించి ఉన్నాడు. సహస్రారము అనేది ఎనిమిది దళాలు కలిగిన పద్మము. ఇందులోని ఒక్కొక్క దళంలోనూ చిన్నచిన్న రేకులు నూటఇరవై అయిదు చొప్పున ఉంటాయి. ఈ రకంగా మొత్తం వెయ్యి దళాలుంటాయి. అందుకే దాన్ని సహస్రదళ కమలం అంటారు. ఎనిమిది దళాలు ఎనిమిది దిక్కులకు తిరిగి ఉంటాయి. ఈ ఎనిమిది దళాల వివరాలు ఈ విధంగా ఉంటాయి. తూర్పు దిక్కు - సద్భుద్ధి ఆగ్నేయం - నిద్ర, దప్పిక, ఆలస్యము దక్షిణము - క్రూరబుద్ధి నైరుతి - తాపబుద్ధి పడమర - విలాసము వాయువ్యము - నడచుట మొ || విషయములందు బుద్ధి ఉత్తరము - సురతము నందు ఆసక్తి ఈశాన్యము - ద్రవ్యము దానంచేసే తలంపు పద్మాంతరాళంలో - ఇహపరలోక విముక్తి కింజల్కము (తామరపువ్వులోని కేసరములు) -మెలకువ తామర దుద్దు - కల దుంప - నిద్ర ఆత్మ ఏ క్షణానైతే సహస్రారాన్ని వదులుతుందో ఆక్షణంలోనే పరబ్రహ్మలో ఐక్యమవుతుంది. “తురీయావస్థా నమస్కారః” నమస్కారము : దేవికి నమస్కారము చెయ్యటమంటే సాధకుడు తురీయావస్థ చేరటమే.

“దేహశూన్య ప్రమాతృతా నిమజ్జనం బలిహరణమ్” బలిహరణము : సాధకుడి స్థూలశరీరము మాయతో కూడుకున్నది. సూక్ష్మశరీరము జ్ఞాన స్వరూపము తాను జ్ఞానస్వరూపుడు కాబట్టి జీవాత్మను పరమాత్మయందు విలీనం చేసినట్లు భావించటమే బలిసమర్పణ. “సత్యమస్తికర్తవ్య మకర్తవ్య మౌదాసీన్య విత్యాత్మ విలాపనగ్ం హోమః" హోమము : పూజ, జపము అయిన తరువాత హోమము చేయటం విధి. సాధకుడి అహంభావము, జీవభావము, పరబ్రహ్మ స్వరూపం ఉంది, లేదు అనే ద్వైదీభావము మొదలైనవన్నీ పరబ్రహ్మమనే అగ్నిలో విలీనము అనే ఆహుతి చేయటమే హోమము. “స్వయం తత్పాదుకా నిమజ్జనం పరిపూర్ణధ్యానమ్” ధ్యానము : సాధకుడు తాను ఆ దేవి యొక్క పాదముల నుండి వచ్చే తేజస్సులో లీనమయినట్లుగా తలచి, తానుకూడా ఆ తేజస్సులో ఒక భాగమేనని, సర్వము పరబ్రహ్మమమయని భావించటమే పరిపూర్ణ ధ్యానము. “ఏవం ముహూర్తత్రయం భావనయా యుక్తో భవతి, తస్య దేవతాత్మైక్యసిద్ధిః" బ్రహ్మత్వసిద్ధి : ఈ విధంగా తనను తాను పరబ్రహ్మ స్వరూపంగా భావించి మూడు ముహూర్తముల కాలము దేవియందు మనసును లగ్నం చేసినవాడు ఆ దేవితో ఐక్యత పొందుతాడు. దీనినే బ్రహ్మత్వం సిద్ధించటం అంటారు. 1 ముహూర్తం అంటే 48 నిమిషాలు. 3 ముహుర్తాలు అంటే 1 గంటా 20 నిముషాలు. “చించితకార్యాణ్యయత్నేన సిధ్యంతి స ఏవ శివయోగీతి కథ్యత ఇత్యుపనిషత్” ఫలము : ఈ విధంగా అంతఃపూజ చేసి సిద్ధుడైన సాధకుడికి కోరిన కోరికలు అప్రయత్నంగా నెరవేరతాయి. అతడినే శివయోగి అంటారు అని ఈ ఉపనిషత్తులో చెప్పబడింది.

Popular