Search This Blog

803. పురాతనా


సర్వేషాం ఆదిభూతత్వాత్ పురాతనా

అన్నింటికీ మొదలుగా ఉన్నది. ఈ సృష్టికి ముందు నుంచి ఉన్నది. సృష్టి ప్రారంభానికి ముందు నిరాకారుడు నిర్గుణస్వరూపుడు అయిన పరబ్రహ్మ ఒక్కడే ఉన్నాడు. లోకాలను లోకపాలకులను కూడా సృష్టించింది ఆయనే. సృష్టికి ముందు నుంచీ ఉన్నది కాబట్టి పురాతనా అనబడుతోంది. హయనాత్మా మహాదేవః ప్రజాపతి రితి స్మృతః. కాలస్వరూపుడు ప్రజాపతి అని తంత్రాలు చెబుతున్నాయి. కాలంతో మార్పు చెందనిది పరబ్రహ్మ ఒక్కటే. ఎటువంటి దేశకాలమానాలూ లేని కాలస్వరూపమే అమ్మ. సృష్టిమొదట్లో పంచభూతాలతో పాటు కాలం కూడా అమ్మ నుండి ఉద్భవించింది. సృష్టి చివరలో కాలం కూడా ఆవిడలో కలిసిపోతుంది. కాలహంత్రీ అనే నామంలో మన ఇది చర్చించుకున్నాం. ఆద్యంతములు లేనిది. శాశ్వతమైనది. నిత్యమైనది. కాబట్టి ఎల్లప్పుడూ ఉంటుంది. అందుచేతనే ఆమె పురాతన అనబడుతోంది.

విష్ణు సహస్రనామం మొదటి శ్లోకం:
విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభుః
భూతకృధ్ భూతభృధ్ భావో భూతాత్మా భూతభావనః

విష్ణు అంటే సర్వ వ్యాపకత్వం. ఎక్కడ వ్యాపించాడయ్యా అంటే విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు. వ్యాపించి ఎం చేస్తున్నాడు? వషట్కారః - అంటే ఉద్ధరిస్తున్నాడు.ఎప్పటి నుంచి ఉద్ధరిస్తున్నాడు? భూత భవ్య భవత్ప్రభుః - కాలాతీతుడై అనాదినుండీ ఉద్ధరిస్తున్నాడు. ఎలా ఉద్ధరిస్తున్నాడు? భూతకృధ్ - ప్రాణులను పుట్టించి, భూతభృధ్ - ప్రాణులను పోషించి, భూతాత్మా - ప్రాణులందరిలోనూ తానే ఆత్మయై ఉద్ధరిస్తున్నాడు. దేనికోసం ఉద్ధరిస్తున్నాడు - మోక్ష పధంలో నిలబెట్టడానికి . మోక్షం కలుగజేయడానికి


No comments:

Post a Comment

Popular