Search This Blog

47-48. Marali Mandhagamana MahaLavanya Sewadhih


The names 47) Marali Mandha Gamana 48) Maha Lavanya Sewadhi have significance in all the three planes i,e physical, meta-physical and etheral. That is why Lalitha Sahasram is called 'Trayeem'.

Interpretation in physical plane: 
The names till now explained the grace and elegance of Divine mother. Just close your eyes and imagine her the way she is described so far. Her crown, her eyes, fragrance from her plait, her chin, smile etc Imagine she is walking towards you gracefully. How is her gait? Isn't it gracious? Is she not the greatest and the most valuable treasure we have?

Meta physical:
One of the popular descriptions of Divine mother is through her creation. The sky, the water bodies, atmosphere, mountains, plains, deltas, all those 84 lakhs species of living beings, the heavenly bodies, stars, comets, black holes etc. All this is Divine mother. And all of this is not stationary. It is slowly changing. Moving graciously. This is 'Marali mandhagamana'. This relates to the concept of entropy in physics. Entropy is defined as a function of change of state. It is an increasing function. The disorder in the state function is slowly increasing.

The name Maha lavanya shevadhi indicates that this nature is a valuable treasure given to us and it has to be preserved. It indicates that it is a dynamic equilibrium that has to be maintained with care. Maintaining this balance is the heart of vedic principles. It also relates to our inward nature. This body and mind are the greatest treasure given to us. Life is a dynamic equilibrium. It should be carefully protected. We should maintain the right balance in all aspects.

Etheral:
For a yogi who is meditating upon atma with a goal of self-realization, the kundalini gradually raises from mooladhara chakra to sahasrara chakra. This movement is explained here.

Shevadhi means a great treasure that has to be well protected.

మరాళీమందగమన మహాలావణ్యశేవధి ఈ నామములకు భౌతికంగానూ, సాంకేతికంగానూ మరియు ఆధ్యాత్మికంగానూ కూడా ఎంతో గొప్ప వివరణ ఉంది. అందుకే లలితా సహస్రమును త్రయీమ్ అని  అంటారు. 

భౌతిక/లౌకిక వర్ణన:
ఇప్పటి వరకు ఉన్న నామాలు అమ్మవారి రూప లావణ్యాన్ని మరియు సౌందర్యాన్ని వివరించాయి. ఒక్కసారి మీ కళ్ళు మూసుకుని, ఆమెను ఇప్పటివరకు చదివిన నామాలలో వర్ణించిన విధంగా ఊహించుకోండి. ఆమె కిరీటం, ఆమె కళ్ళు, కేశములు, వాటి నుండి వచ్చే సువాసన, ఆమె గడ్డం, చిరునవ్వు మొదలైనవి తలచుకుంటూ ఆ ముగ్ధ మనోహర రూపాన్ని భక్తితో ఆస్వాదించండి. రాజహంస లాగ ఆమె మెల్లగా మీ వైపు నడుస్తున్నట్లు ఊహించుకోండి. ఆమె నడక ఎలా ఉంది? ఒళ్ళు పులకరించిపోవడం లేదు? ఆమె దర్శనం కన్నా గొప్ప నిధి, సంపద మరొకటి ఉందా ?

సాంకేతిక/పారలౌకిక వర్ణన:
అమ్మవారిని ఆమె చేసిన సృష్టి ద్వారా వర్ణించడం ప్రసిద్ధి. ఈ ఆకాశం, జలాశయాలు, వాతావరణం, పర్వతాలు, మైదానాలు, డెల్టాలు, 84 లక్షల జీవరాశులు, స్వర్గలోకం, నక్షత్రాలు, తోకచుక్కలు, కృష్ణబిలాలు మొ.. ఇవన్నీ అమ్మే. ఇవి స్థిరంగా ఉండేవి కావు. నెమ్మదిగా కదులుతున్నాయి. మార్పు చెందుతున్నాయి. ఇదే 'మరాళీ మందగమన' అంటే. ఇది భౌతిక శాస్త్రంలో 'ఎంట్రోపీ' అనే ప్రక్రియకు సంబంధించినది. ఎంట్రోపీ అనేది స్థితిలోని మార్పును సూచిస్తుంది. ఈ విశ్వంయొక్క స్థితి మెల్లగా మారుతోంది. అందులో అలజడి మెల్లగా పెరుగుతోంది. అదే మరాళి మందగమనము.

మహా లావణ్య శేవధి అనే నామం ఈ ప్రకృతి మనకు అందించిన విలువైన సంపద అని మరియు దానిని రక్షించుకోవలసిన అవసరం ఉందని సూచిస్తుంది. ఈ ప్రక్రుతి ఒక చరాచర జగత్తు (డైనమిక్ ఈక్విలిబ్రియం). దానిని చాలా జాగ్రత్తగా నిర్వహించాలి. అందులోని సమతుల్యాన్ని నిలబెట్టుకోవాలి. ఇదే వైదిక సూత్రాల యొక్క ముఖ్య ప్రయోజనం. ఇది మన ఆంతరంగిక స్వభావానికి కూడా సంబంధించినది. ఈ శరీరం మరియు మనస్సు మనకు దక్కిన గొప్ప సంపద. జీవితం పిణ్డాన్ద బ్రహ్మాండాల సమతుల్యత. దీనిని జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి. మనము అన్ని అంశాలలో సరైన సమతుల్యతను పాటించాలి.

ఆధ్యాత్మిక వర్ణన:
ఆత్మ సాక్షాత్కార లక్ష్యంతో కూతస్థముపై దృష్టి కేంద్రీకరించి ధ్యానం చేస్తున్న యోగికి, కుండలిని క్రమంగా మూలాధార చక్రం నుండి సహస్రార చక్రం వరకు పైకి ఎగబాకుతుంది. ఈ ప్రయాణమే మరాళి మందగమనము. ఇది చాలా శ్రద్ధతో జాగరూకతతో చేయవలసిన సాధన. అదే మహా లావణ్య శేవధి. 

శేవధి అంటే మనము కాపాడుకోవలసిన ఒక గొప్ప నిధి అని అర్ధం. 

Popular