లలితమ్మ సమయాచారమునందు ఆసక్తి కలది.
సమయాచారం అనగానేమి:
1. దక్షిణామూర్తి ఋషిగా, కామేశ్వరీ కామేశ్వరులు అధిదేవతలుగా ఉన్న మంత్రానుష్టానమే సమయాచారము. శివ శక్తులకు పంచసామ్యమున్నది అని చెప్పటమే సమయాచారము. కుండలినీని మూలాధార చక్రం నుండి పైకి లేపి సహస్రారం చేర్చి మళ్ళీ తిరిగి మూలాధారం వద్దకు తీసుకురావడమే సమయాచారము.
2. వ్యాసం పాణిని, సూర్య, పింగళ, యావకా, మను, యాజ్ఞవల్క్య, ఆపస్తంబ, గౌతమ మొదలగు ఋషులు వ్రాసిన స్మృతులు సమయాచారాన్ని బోధించాయి.
3. హృత్పద్మంలో పరమేశ్వరిని భావన చేసి, షట్చక్రాలలోను భావనోపనిషత్తులో చెప్పిన విధంగా అర్చన చెయ్యటమే సమయాచారము.
4. గురువు వద్ద మహావేధ అనే సంస్కారము పొంది షట్చక్రబేధనము, చదుర్విదైక్య సంధానము తెలుసుకుని, వాటి ప్రకారము జగన్మాతను అర్చించటాన్ని అంతర్యాగము అంటారు. ఈ రకమైన అర్చన అమ్మకు చాల ఇష్టం. అందుచేతనే సమయాచార తత్పరా అని చెప్పబడింది.
మకారపంచకం - దేవీపూజకు మకారపంచకమును వినియోగిస్తారు. మకారపంచకం అంటే
శక్తిపూజా విధానాధ్యయ్హ్ పంచతత్వహ్ ప్రకీర్తితః
- మద్యము అంటే బెల్లపు పానకం
- మాంసము అంటే గారెలు తెలగపిండి
- మత్స్యము అంటే వెల్లుల్లి, తిత్తిడిపదార్థాలు
- ముద్ర అంటే గోధుమలు మినుములచే చేయబడిన పదార్థాలు
- భక్ష్యభోజ్యముల కలయికే మైధునము
- చంద్రబింబము నుంచి జాలువారు అమృతమే మద్యము
- కర్మాకర్మలను పశువులను జ్ఞాన ఖడ్గంతో సంహరించటమే మాంసము.
- మనస్సే మత్స్యము దాని సంకల్పవాసనాలను హరించుటయే మత్స్య సమర్పణ.
- ఇంద్రియ నిగ్రహమే భక్ష్యభోజ్యాలు. ఇది ముద్ర.
- హంసస్సోహం అనే మంత్రార్థమయిన శివశక్తుల కలయికే మైధునము.
- మొదటిపుష్పం - అహింస
- రెండవ పుష్పం - ఇంద్రియ నిగ్రహం
- మూడవ పుష్పం - దయా
- నాల్గవ పుష్పం - క్షమా
- ఐదవపుష్పం - జ్ఞానం